Wednesday 15 April 2015

Three Formulas for Success in Life or Exams (జీవితమైనా, పరీక్షలైనా విజయానికి మూడు సూత్రాలు)



పరీక్ష అంటే ఒక అవకాశం. జీవితంలో అయినా చదువులో అయినా పరీక్ష మీరు ఏంటో నిరూపించుకునే అవకాశం. మీ బలాలు బలహీనతలు అర్థం చేసుకుని, మీ సత్తా చూపించేందుకు ఒక అద్భుత అవకాశం.  జీవితంలో అయినా చదువులో అయినా మీలో పవర్ ని పరీక్షల ద్వారా నిరూపించుకోవాలంటే నేర్చుకోవలసిన మూడు సూత్రాలు  ఏంటో తెలుసుకుందాం.


సూత్రం  1. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక: ఎంత వీలైతే అంత ఎక్కువ చదువుతాం, వీలైనంత ఎక్కువసేపు చదువుతాము, అన్ని లెసన్స్  చదువుతాము ...ఇలా ఫోస్ లేకుండా అనుకునే కంటే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉండడం వలన తుది ఫలితాలు బాగుంటాయి. ప్రణాళిక వేసుకోవటలో ఫెయిల్ అయితే , ఫెయిల్యూర్ కోసం ప్రణాళిక వేసుకున్నట్టే. అందుకే నిర్దిష్ట  ప్రణాళిక  వేసుకోడానికి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మీకు మీరు అన్వేషించాలి?
  • ఒక విద్యార్థిగా / వ్యక్తిగా నా ధర్మం ఏమిటి? నా జీవిత ధ్యేయం ఎఅమిటి?
  • నా కుటుంబం ఏమిటి? నా పరిస్థితులు ఏమిటి?
  • ఇప్పుడున్న పరిస్థితులు/ ఫలితాలు తో నేను ఎలా ఉన్నాను? నేను ఇంకా మెరుగైన జీవితం /పరిస్థితులు ఆశిస్తున్నట్లితే  నా చదువు/ నా ప్రస్తుత జీవన విధానాలు ఎలా ఉపయోగపడతాయి?
  • నాకు ఏమి ఫలితాలు కావాలి? ఎప్పటికి కావాలి?
  • ఆశించిన ఫలితాలు సాధించాలంటే నేను ఏమి చేయాలి?
  • ఆ ఫలితాల దిశలో నేను ఎంత సేపు చదువుతాను? ఏ సమయంలో చదువుతాను?
  • పరీక్షల ఫార్మటు ఎలా ఉంటుంది? ఏ అంశాలపై ఎక్కువ ఫోకస్ చేస్తారు? ఎంత సమయం లో రాయాలి?
  • ఇప్పటికే పట్టు ఉన్న అంశాలు ఏమిటి? ఇంకా క్లారిటీ అవసరమున్న టాపిక్స్ ఏమిటి?
  • ఎన్ని సార్లు రివ్యూ చేసుకోవాలి ?
  • ఎన్ని ప్రాక్టీసు / ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ / మోడల్ ఎగ్జామ్స్ రాయాలి?
  • నా ప్రేపరషన్ ప్రాసెస్ లో ఎదురయ్యే అవకాశమున్న ఆటంకాలు ఏమిటి,  వాటిని ఎలా అధిరోహించాలి?
ఈ ప్రశ్నలు అర్థం చేసుకుంటే జీవితాన్ని ఉన్నతంగా మెరుగు పరుచుకోడానికి కూడా ఉపయోగ పడతాయి. అయితే ఈ ప్రశ్నలు సెల్ఫ్ రెఫ్లెక్షన్ కి ఉపయోదపతాయి. ఉన్నత ప్రణాళిక తయారు చేసుకోడానికి సహకరిష్టాయి. ఇపుడు మీ ముందున్న సమయాన్ని , మీరు చేరుకోవాల్సిన లక్ష్యానికి తగ్గట్లు విభజించుకుని ప్రణాళిక సిద్దం చేసుకోవాలి.
సూత్రం  2. అర్ధవంతమైన అలవాట్లు  : మీ ఆహారం, నిద్ర, మీరు ఎంత సమయం పనిచేస్తారు/ చదువుతారు అనేది అర్ధం చేసుకోండి. ఉదయం పరీక్ష ఉంటే అర్ధ రాత్రి వరకు చదివి పొద్దున్నే లేచి పరీక్ష రాయాలనుకుంటే కష్టం. ఒకో సారి పరీక్ష హాల్ లో కుడా ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. అలాంటప్పుడు ప్రేపరషన్ టైం టేబుల్ ప్రకారం చదువుకి, విశ్రాంతి/ నిద్రకి సరైన సమయాన్ని కనీసం రెండు వారాల ముందే మొదలు పెట్టటం మంచిది, మొదటి నుంచి ఈ టైం టేబుల్ బాగుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. “నచ్చిన సినిమా చూసి, క్రికెట్ చూసి తర్వాత ఇంకా ఆనందంగా చదువుతాను” , “లేట్ నైట్ మాత్రమే బాగా చదువుతాను”...అనిఅంటారు కొందరు. ఇవన్ని మిమ్మల్ని మీరు కండిషన్ చేసుకున్న అంశాలు. ఆ అలవాట్లు మీకు గతంలో గొప్ప ఫలితాలను ఇచ్చాయా ? ఆలోచించండి. మంచి పోషకాహారం తీసుకోండి, హాస్టల్ లేదా బాచిలర్ రూమ్స్ లో ఉండే వాళ్ళు సైతం ఆహారం ఎదో ఒకటి టైం కి కాస్త లోపల పడేస్తే ఆత్మారాముడు శాంతిస్తాడు అన్నట్లు చేయటం శ్రేయస్కరం కాదు. మీ ఆహారం మీ బ్రెయిన్ పనిచేసే సామర్ధ్యాన్ని ప్రభావితం చేస్తుంది.  ఫిజికల్ ఎక్సర్ సైజ్ చేయండి. వాకింగ్, మెడిటేషన్ వంటివి చేయటం వలన బాడీ అండ్ బ్రెయిన్ ఆక్టివేట్ అవుతాయి. పెర్ఫార్మన్స్ మెరుగుపరుస్తాయి. 

సూత్రం 3:  ఉన్నత ప్రయత్నం: ఆఖరి నిమిషంలో కొత్త అంశాలతో మెదడు కి ఎక్కువ పని చెప్పి స్ట్రెస్ చేయకండి. లాస్ట్ మినిట్ లో కొత్త విషయాలు చదివితే అవి మీ కంగారుని పెంచి కాన్ఫిడెన్స్ ని దెబ్బ తీస్తాయి.  చాలా సంవత్సరాలకు కలిసిన ఒక 28 ఏళ్ళ యువకుడు  “ఏం చేస్తున్నావ్” అంటే, “ యూనివర్సిటీ లో పీ.హెచ్.డి . చేస్తున్న” అన్నాడు. సంతోషంగా ఏం సబ్జెక్టు అని అడిగాను. “ ఫ్రీ రూమ్, ఫుడ్ కోసం అప్లై చేసాను అంత ఇంపార్టెంట్ ఏం కాదు” అన్నాడు. తన జీవిత సమయాన్ని వృధా చేసుకుంటున్నా అన్న ఫీలింగ్ అతని ముఖంలో  కనిపించలేదు. మనం ఒక పని చేయడానికి ఉన్నత కారణాలు లేకుండా పోతే , జీవితంలో ఎదుగుదల అభివృద్ధి ఎలా సాధ్యం. అందుకే ఉన్నత ప్రయత్నం ఉండాలి. మీ వంతు మీ కృషి చేయండి, ప్రాసెస్ మీద ఫోకస్ ఉంచండి. చివరి ఫలితం మీద కాదు. వచ్చిన ఫలితాలు ఎలా ఉన్నా అంగీకరించే స్థాయి ఆలోచన విధానాన్ని డెవలప్ చేసుకోండి. ఆశించిన ఫలితాలు రావాలంటే, అందుకు తగ్గ  ప్రయత్నాలు చేయాలనే వాస్తవాన్ని అర్థం చేసుకోండి.  

No comments:

Post a Comment