Sunday 26 April 2015

7 Day Meditation Challenge for World Peace : Humanity Beyond Nepal and Other War Tragedies

Why this challenge:
Science and technology is taking it's speed in innovating new ways of making life more comfortable. At the same time we are facing many challenges as we experiment with nature, mother earth and it's laws. We human beings are paying for this in the form of natural disasters. We can not do with what has happened, we have choice to adopt environment friendly life styles in harmony with life.

Whatever happened in Nepal, whatever anti-social/human activity happening around the world, whether man made or natural disaster, this is time for calling the natural action as humans. This is high time for self-introspection for humanity. These days majority of people are more conscious about "updating their life" rather than "live in it in actual sense"; spending more time with electronic gadgets not realizing basic human blessings of life. 

This is the time we need humanity in action. Let us restore life, make it more simple through conscious living in natural manner, let us pray for sufferings of fellow human beings, let us generate the vibration of love and peace into the field of possibility (Unified Field) through our meditations and prayers, any form that you can comfortably do. Every thought, every act that we generate in harmony with nature and life ripples out the more of it.

How can I do this challenge:
Join me for a meditation to restore the normal life at Nepal and other conflict areas of the world. I will start my meditation by 06.30 am everyday starting 28th April, 2015  and you are invited to join me.
1. Sit in comfortable position on chair or sofa. Close your eyes. Focus on your breathing. Let go of all thoughts.
2. Focus on the sentence below when you are meditating : "I choose love and peace. May the world live in peace and harmony". Tell this meditation centering thought to yourself silently. You need not to move your tongue, lips or visualize. Just focus on this centering thought and repeat silently.
3. Whenever you are distracted by thoughts or noises around you or sense of your body, just focus on the meditation statement. Keep this meditation for minimum of 14 minutes. Then keep your eyes closed, release the centering thought. Then relax your body for a while and slowly come back. Open your eyes gently and slowly. 
4. Just share your experience after meditation in the comments section. 

Please practice , call me for any support you may need. Let's together build a loving and peaceful society :)

Wednesday 15 April 2015

Five Different Thoughts That Make You Successful [మిమ్మల్ని విజేతలుగా నిలిపే ఐదు భిన్న ఆలోచనలు]


ప్రపంచంలో ఏ విజేతైనా , ఏ రంగంలో అయినా మొదట తన అంతర్గత ఉన్నతి నుంచే ప్రయాణాన్ని మొదలు పెట్టి ఉంటాడు. అది ఉన్నత ఆలోచన నుంచి మొదలౌతుంది. వారిపై వారికి ఉండే క్లారిటీ వలన గతాన్ని దృష్టిలో పెట్టుకుని, ఉన్నత భవిష్యత్తు ఆశిస్తూ, వర్తమానాన్ని సెలెబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే వారు కాస్త భిన్నంగా ఆలోచిస్తారు. వాళ్ళ భిన్న ఆలోచనా సరళి ఏమిటో తెలుసుకునే ప్రయత్నమే ఈ ఆర్టికల్.


ఆలోచన 1: అంతర్గత శక్తి విలువ: అంతర్గత విశ్లేషణ అనేది  ఒక వ్యక్తి తామెంటో, తాము ఏమి చేయగలమో అనే అంశాలపై సూచనలను, అంతర్గత ఉన్నతిని , తనతో తనకు గల కమ్యూనికేషన్ ను ప్రభావం చేస్తుంది. విజేతలని ఈ అంతర్గత శక్తి తాము చేసే పనిలో ఇంకా ఉన్నతంగా చేసేలా మోటివేట్ చేస్తుంది.  గొప్ప విజేతలందరూ అంతర్గతంగా తమని తాము నడిపించుకునే, తమ కార్యక్రమాలు తాము  నిర్దేశించుకునే లక్షణం కలిగి ఉంటారు. అంతర్గత శక్తి అంటే కేవలం గెలిచినా వాళ్ళకే ఉంటుందని కాదు, అందరిలో ఉంటుంది. ఈ విశ్వంలో మనమంతా “మళ్ళీ మళ్ళీ సృష్టించబడే ప్రాసెస్” లో భాగంగా వచ్చిన వాళ్ళం కాదు. అందుకే మన మనుగడ ఒక ప్రత్యేక మైన అద్భుతం. అంటే మీరు ప్రత్యేక మైన వ్యక్తి, మీరు మాత్రమే అద్భుతంగా చేయగలిగిన ఒక ప్రత్యేకత మీలోనే ఉంది. ఆ అంతర్గత శక్తిని గుర్తించండి, ఫోకస్ తో మీ గోల్ పై ఛానల్ చేయండి. విజేతలని ఈ అంతర్గత శక్తి తామెంటో చెప్పేందుకు పరుగులు పెట్టిస్తుంది. మీ అంతర్గత శక్తి దేనిపై ఫోకస్ చేస్తారో నిర్ణయించుకోండి.
ఆలోచన 2 : నిజంగా నేర్చుకుంటారు: ఒక సాధారణ వ్యక్తి ఒక కొత్త పని చేసే ముందు ఎంతో ఉత్సాహం, ఇష్టం, ప్రేమ చూపిస్తాడు, రోజులు గడిచేకొలది, బోర్ కొట్టడం, భయం, కన్ఫ్యూజన్ లేదా ఆ పని వలన తనకు జరిగే ప్రయోజనాల స్థాయిని బట్టి  ఆమె/అతని అంతర్గత ఉత్సాహం నీరుకారిపోయే అవకాశం ఉంది. కేవలం ఆర్ధిక అంశం మాత్రమే కాదు అనేక అంశాలు ఈ ఉత్సాహాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే విజేతలు చేస్తున్న పనిలో ప్రాథమిక, కీలక అంశాలు, నియమాలు వేగంగా నేర్చుకుంటారు, తమని తాము అప్ డేట్ చేసుకుంటారు, పరిస్థితుల్ని అర్థం చేసుకుంటారు, ఏమి చేస్తే ఎలా జరుగుతుంది, నాకు ఇంకా ఉన్నత ఫలితం కావాలంటే ఏమి చేయాలి అని ఆలోచిస్తూ నేర్చుకుంటూ  ఆత్మ విశ్వాసాన్ని , పనిలో మెళకువలను, ఆ రంగంపై పట్టు సాధిస్తారు. ఈ ప్రక్రియ వలన విజేతలు మొదట ఫాలోవార్ స్థాయి నుంచి లీడర్ లా ఎదుగుతారు. మరి మీరు ఎటువంటి అంశాలు నేర్చుకుంటే మీ దీర్ఘ కాలిక లక్ష్యాలు చేరుకుంటారో ఆలోచించండి.
ఆలోచన 3: రిస్క్ తీసుకునేందుకు రెడీ!: చేస్తున్న పని/ప్రాజెక్ట్/ వ్యాపారం  గురించి అవగాహన, స్వీయ అవగాహన  అనేక కోణాల్లో ఇన్ఫర్మేషన్ ఉండటం అనేవి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోడానికి కీలకం అని విజేతలు బలంగా నమ్ముతారు. అందుకే వేగంగా ఖచ్చితంగా రిస్క్ తో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు. కష్టకాలంలో “గేమ్ చేంజింగ్” నిర్ణయాలు తీసుకోవటం కుడా టైపు రైటింగ్, కుకింగ్, సైక్లింగ్ లా ఒక నైపుణ్యం. ఒక సారి చాలెంజింగ్ సమయంలో ఉన్నత నిర్ణయాన్ని తీసుకుంటే , మళ్ళీ అటువంటి సందర్భం వచ్చినప్పుడు అలాగే పనిచేయాలని మైండ్ అండ్ బాడీ ఆటోమేటిక్ గా పని చేస్తాయి. ఇది విజేతలకు ఒక అలవాటుగా మారిపోతుంది. సాధారణ వ్యక్తి బెంబేలెత్తి , కంగారు పడే సందర్భాలను విజేతలు తమ శక్తికి, క్రియేటివిటీకి ఒక పరీక్షలా, తమను తాము నిరూపించుకునే అవకాశంలా భావిస్తారు.

ఆలోచన 4: కుతూహలంతో పనిచేస్తారు : విజేతలు తాము చేస్తున్న పనిమీద, ప్రాజెక్ట్ మీద, తమ కంపెనీలో ఇతర డిపార్టుమెంటు ల మీద, కనీస కుతూహలాన్ని ప్రదర్శిస్తారు. క్యురియసిటీ కి అనవసరంగా ఇతరుల విషయాల్లో వేళ్ళు పెట్టె లక్షణాలకు సన్నని గీతను స్పష్టంగా చూడగలరు.  తాము ఒక లక్ష్యంతో పనిచేసి దానిని సాధించిన తర్వాత, ఇంకొంచం ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాలని ప్రయత్నిస్తారు. విజేతలు ఆ రంగంలో ఆసక్తి గల ఇతరులను ప్రోత్సహించి ఎదిగేందుకు సహాయం చేస్తారు. ఎందుకంటే నిజమైన విజేతలకి లీడర్స్ అంటే ఫాలోవర్స్ ని తయారు చేయటం కాదు మరింతమంది లీడర్స్ ను చేయటమని తెలుసు. విజేతలలోని క్యురియసిటీ తమకు అప్పజెప్పిన ప్రాజెక్ట్ /పని సృజనాత్మకంగా, ఉన్నత ప్రమాణాలతో పూర్తి చేసే శక్తి ఇస్తుంది.

ఆలోచన 5: భావోద్వేగ ప్రజ్ఞ : ఉన్నత స్థాయిని చేరుకున్న ఏ విజతలైనా గమనించండి వారందరూ భావోద్వేగాలను ఉన్నతంగా ఉపయోగించుకుంటారు. వారికి ఒక దానిని సాధించడానికి ఎప్పుడు తమ ఎమోషన్స్ వాడాలి, ఎప్పుడు ఎమోషన్స్ కంట్రోల్ లో పెట్టుకోవాలి అనేది స్పష్టంగా తెలుసు. వారి నిర్ణయం తీసుకునే శక్తిని  కోపం , భయం వంటి  ఎమోషన్స్ ప్రభావితం చేయకుండా ఖచ్చితత్వాన్ని , వాస్తవాన్ని , అవసరాన్ని దృష్టిలో పెట్టుకుంటారు. ఈ రకమైన  స్వీయ నియంత్రణ  విజేతల లక్షణం.  గొప్ప ఓర్పుని ప్రదర్శిస్తారు. వారికి బద్దకానికి (laziness) , ఓర్పుకి (patience) మధ్య తేడా ఖచ్చితంగా తెలుసు. మీ భావోద్వేగాలు ఎలా ఉపయోగించుకుంటున్నారో ఆలోచించండి? వాటిని ఉన్నతంగా వాడండి.

Three Formulas for Success in Life or Exams (జీవితమైనా, పరీక్షలైనా విజయానికి మూడు సూత్రాలు)



పరీక్ష అంటే ఒక అవకాశం. జీవితంలో అయినా చదువులో అయినా పరీక్ష మీరు ఏంటో నిరూపించుకునే అవకాశం. మీ బలాలు బలహీనతలు అర్థం చేసుకుని, మీ సత్తా చూపించేందుకు ఒక అద్భుత అవకాశం.  జీవితంలో అయినా చదువులో అయినా మీలో పవర్ ని పరీక్షల ద్వారా నిరూపించుకోవాలంటే నేర్చుకోవలసిన మూడు సూత్రాలు  ఏంటో తెలుసుకుందాం.


సూత్రం  1. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక: ఎంత వీలైతే అంత ఎక్కువ చదువుతాం, వీలైనంత ఎక్కువసేపు చదువుతాము, అన్ని లెసన్స్  చదువుతాము ...ఇలా ఫోస్ లేకుండా అనుకునే కంటే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉండడం వలన తుది ఫలితాలు బాగుంటాయి. ప్రణాళిక వేసుకోవటలో ఫెయిల్ అయితే , ఫెయిల్యూర్ కోసం ప్రణాళిక వేసుకున్నట్టే. అందుకే నిర్దిష్ట  ప్రణాళిక  వేసుకోడానికి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మీకు మీరు అన్వేషించాలి?
  • ఒక విద్యార్థిగా / వ్యక్తిగా నా ధర్మం ఏమిటి? నా జీవిత ధ్యేయం ఎఅమిటి?
  • నా కుటుంబం ఏమిటి? నా పరిస్థితులు ఏమిటి?
  • ఇప్పుడున్న పరిస్థితులు/ ఫలితాలు తో నేను ఎలా ఉన్నాను? నేను ఇంకా మెరుగైన జీవితం /పరిస్థితులు ఆశిస్తున్నట్లితే  నా చదువు/ నా ప్రస్తుత జీవన విధానాలు ఎలా ఉపయోగపడతాయి?
  • నాకు ఏమి ఫలితాలు కావాలి? ఎప్పటికి కావాలి?
  • ఆశించిన ఫలితాలు సాధించాలంటే నేను ఏమి చేయాలి?
  • ఆ ఫలితాల దిశలో నేను ఎంత సేపు చదువుతాను? ఏ సమయంలో చదువుతాను?
  • పరీక్షల ఫార్మటు ఎలా ఉంటుంది? ఏ అంశాలపై ఎక్కువ ఫోకస్ చేస్తారు? ఎంత సమయం లో రాయాలి?
  • ఇప్పటికే పట్టు ఉన్న అంశాలు ఏమిటి? ఇంకా క్లారిటీ అవసరమున్న టాపిక్స్ ఏమిటి?
  • ఎన్ని సార్లు రివ్యూ చేసుకోవాలి ?
  • ఎన్ని ప్రాక్టీసు / ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ / మోడల్ ఎగ్జామ్స్ రాయాలి?
  • నా ప్రేపరషన్ ప్రాసెస్ లో ఎదురయ్యే అవకాశమున్న ఆటంకాలు ఏమిటి,  వాటిని ఎలా అధిరోహించాలి?
ఈ ప్రశ్నలు అర్థం చేసుకుంటే జీవితాన్ని ఉన్నతంగా మెరుగు పరుచుకోడానికి కూడా ఉపయోగ పడతాయి. అయితే ఈ ప్రశ్నలు సెల్ఫ్ రెఫ్లెక్షన్ కి ఉపయోదపతాయి. ఉన్నత ప్రణాళిక తయారు చేసుకోడానికి సహకరిష్టాయి. ఇపుడు మీ ముందున్న సమయాన్ని , మీరు చేరుకోవాల్సిన లక్ష్యానికి తగ్గట్లు విభజించుకుని ప్రణాళిక సిద్దం చేసుకోవాలి.
సూత్రం  2. అర్ధవంతమైన అలవాట్లు  : మీ ఆహారం, నిద్ర, మీరు ఎంత సమయం పనిచేస్తారు/ చదువుతారు అనేది అర్ధం చేసుకోండి. ఉదయం పరీక్ష ఉంటే అర్ధ రాత్రి వరకు చదివి పొద్దున్నే లేచి పరీక్ష రాయాలనుకుంటే కష్టం. ఒకో సారి పరీక్ష హాల్ లో కుడా ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. అలాంటప్పుడు ప్రేపరషన్ టైం టేబుల్ ప్రకారం చదువుకి, విశ్రాంతి/ నిద్రకి సరైన సమయాన్ని కనీసం రెండు వారాల ముందే మొదలు పెట్టటం మంచిది, మొదటి నుంచి ఈ టైం టేబుల్ బాగుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. “నచ్చిన సినిమా చూసి, క్రికెట్ చూసి తర్వాత ఇంకా ఆనందంగా చదువుతాను” , “లేట్ నైట్ మాత్రమే బాగా చదువుతాను”...అనిఅంటారు కొందరు. ఇవన్ని మిమ్మల్ని మీరు కండిషన్ చేసుకున్న అంశాలు. ఆ అలవాట్లు మీకు గతంలో గొప్ప ఫలితాలను ఇచ్చాయా ? ఆలోచించండి. మంచి పోషకాహారం తీసుకోండి, హాస్టల్ లేదా బాచిలర్ రూమ్స్ లో ఉండే వాళ్ళు సైతం ఆహారం ఎదో ఒకటి టైం కి కాస్త లోపల పడేస్తే ఆత్మారాముడు శాంతిస్తాడు అన్నట్లు చేయటం శ్రేయస్కరం కాదు. మీ ఆహారం మీ బ్రెయిన్ పనిచేసే సామర్ధ్యాన్ని ప్రభావితం చేస్తుంది.  ఫిజికల్ ఎక్సర్ సైజ్ చేయండి. వాకింగ్, మెడిటేషన్ వంటివి చేయటం వలన బాడీ అండ్ బ్రెయిన్ ఆక్టివేట్ అవుతాయి. పెర్ఫార్మన్స్ మెరుగుపరుస్తాయి. 

సూత్రం 3:  ఉన్నత ప్రయత్నం: ఆఖరి నిమిషంలో కొత్త అంశాలతో మెదడు కి ఎక్కువ పని చెప్పి స్ట్రెస్ చేయకండి. లాస్ట్ మినిట్ లో కొత్త విషయాలు చదివితే అవి మీ కంగారుని పెంచి కాన్ఫిడెన్స్ ని దెబ్బ తీస్తాయి.  చాలా సంవత్సరాలకు కలిసిన ఒక 28 ఏళ్ళ యువకుడు  “ఏం చేస్తున్నావ్” అంటే, “ యూనివర్సిటీ లో పీ.హెచ్.డి . చేస్తున్న” అన్నాడు. సంతోషంగా ఏం సబ్జెక్టు అని అడిగాను. “ ఫ్రీ రూమ్, ఫుడ్ కోసం అప్లై చేసాను అంత ఇంపార్టెంట్ ఏం కాదు” అన్నాడు. తన జీవిత సమయాన్ని వృధా చేసుకుంటున్నా అన్న ఫీలింగ్ అతని ముఖంలో  కనిపించలేదు. మనం ఒక పని చేయడానికి ఉన్నత కారణాలు లేకుండా పోతే , జీవితంలో ఎదుగుదల అభివృద్ధి ఎలా సాధ్యం. అందుకే ఉన్నత ప్రయత్నం ఉండాలి. మీ వంతు మీ కృషి చేయండి, ప్రాసెస్ మీద ఫోకస్ ఉంచండి. చివరి ఫలితం మీద కాదు. వచ్చిన ఫలితాలు ఎలా ఉన్నా అంగీకరించే స్థాయి ఆలోచన విధానాన్ని డెవలప్ చేసుకోండి. ఆశించిన ఫలితాలు రావాలంటే, అందుకు తగ్గ  ప్రయత్నాలు చేయాలనే వాస్తవాన్ని అర్థం చేసుకోండి.  

Tuesday 14 April 2015

Four Love Mantras That Can Make Your Dreams A Reality (మీ కలలను నిజం చేసే నాలుగు ప్రేమ మంత్రాలు)


మీ జీవితాన్ని ఉన్నతంగా నడిపించేందుకు ఉపయోగపడే నిర్ణయం, అలవాటు, బాధ్యత , ప్రణాళికల  గురించి చర్చించాము. అయితే మీరు తీసుకున్న నిర్ణయాలు దిశలో ఫలితాలు సాధించడానికి, మీ కలలను నిజం చేసుకోవడానికి మీరు నేర్చుకోవలసిన నాలుగు ప్రేమ మంత్రాలు ఏమిటో, అవి ఎలా మీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాయో వంటి ఆసక్తికర తెలుసుకుందాం.
* * * * * * * * * * * * * * * * * *

మంత్రం 1. ప్రేమతో విహారాన్ని నిర్ణయించుకోండి: చాలా మంది చేసేపని ఏమిటంటే ఆఫీస్ పనులు, బిజినెస్ పనులు, వృత్తి పరమైన అంశాలకు సమయం కేటాయించిన తరువాత కుటుంబానికి, తనకు తాను , తన విహారానికి, రిక్రియేషన్ కి టైం కేటాయిస్తారు. ఎఫెక్టివ్ రిసోర్స్ మేనేజ్ మెంట్ కన్సల్టెంట్ లు ఏమంటారంటే ముందు మీరు ఆనందంగా గడపవలసిన తేదీలు నిర్ణయించుకోండి, ఆనందంగా, కుటుంబంతో , స్నేహితులతో, తోటివారితో రిక్రియేషన్ టైం నిర్ణయించుకోండి ఆ తర్వాత మిగతా టైం ఆటోమాటిక్ గా ఎక్కువ ప్రొడక్టివిటీ సాధించే విధంగా ప్లాన్ చేస్తారు, అలాగే ఫలితాలు సాధిస్తారు. ఎందుకంటే మీరు ఎంత రిలాక్స్ గా , రెఫ్రెషింగ్ గా ఉంటే అంత క్రియేటివ్ గా ఆలోచిస్తారు అని. మెడిటేషన్ తరువాత పనులలో ఫోకస్ పెరగడానికి కూడా కారణం ఇదే.

మంత్రం 2. ప్రేమతో ప్రాసెస్ విజువలైజేషన్ : నిర్ణయించుకున్న లక్ష్యాల దిశలో పనిచేసే రియల్ సీన్ కి ప్రివ్యూ సీన్ మీ మైండ్ థియేటర్ లో విజువలైజేషన్ చేయండి. చాలామంది ఆఖరికి ఏమి సాధిస్తారో ఆ రిజల్ట్ మాత్రమే విజువలైజ్ చేస్తారు. కాని రీసెర్చ్ లో తేలిన అంశం ఏమిటంటే ఫలితాన్ని మాత్రమే కాకుండా ఆ ఫలితాన్ని సాధించేందుకు చేస్తున్న కృషిని, ఆ మార్గంలో ఎదురయ్యే సవాళ్ళను, అవి అధిరోహించడానికి తీసుకునే చర్యలను కుడా  ప్రేమతో విజువలైజ్ చేస్తే అత్యధిక పాజిటివ్ ఫలితాలు సాధించవచ్చు.

మంత్రం 3. ప్రేమతో “నో” చెప్పండి : అవును. ప్రేమతో “నో” చెప్పాలి- మీలో ఉండే మీ ఆలోచనలకూ, మీ బయట ఉండే నెగటివ్ బంధాలకు. గతంలో మీకు ఆశించిన ఫలితాలు ఇవ్వని మీ ఆలోచనా విధానాలకు, మీ కంక్లుజన్స్ కు, మీ రిపీటెడ్ ఆలోచనా సరళికి, నెగటివిటీ కి, నెగటివ్ ఎనర్జీ నింపే మనుషులకు, మీ శక్తిని హరించేలా మిమ్మల్ని ఎమోషన్స్ కు గురిచేసే అంశాలకు ప్రేమగా నో చెప్పండి. ఈ నెగటివ్ ఎనర్జీ మిమ్మల్ని ఆవహించినపుడు మీలో మీరు  “డార్లింగ్ నువ్వు నన్ను , నా గోల్స్ ను డిస్టర్బ్ చేయొద్దు. నీ మత్తులో పడి నేను చిత్తు కాదలచుకోలేదు” అని  చెప్పండి. మీ గతం, మిమ్మల్ని మోసం చేసిన అంశాలు, మీ బలహీనతలు , మీ చాలెంజ్ లు గుర్తుకి వస్తే  “నన్ను అలర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు, నేను నీ నుండి నేర్చుకుంటున్నాను. పాజిటివ్ గా జీవిస్తున్నాను” అని చెప్పుకోండి.

మంత్రం 4. ప్రేమతో “ఒక పదం- టెక్నిక్” పాటించండి  :మీరు ప్రస్తుతం నిర్ణయించుకున్న లక్ష్యాలను నిత్యం మీకు గుర్తుచేసేలా మీ వెసులుబాటుకోసం, మీ ఫోకస్ క్షణాల్లో మీ గోల్స్ / డ్రీమ్స్ పై తీసుకురావటం కోసం, అనవసర అంశాలనుంచి మిమ్మల్ని మీరు సులభంగా బయటపదేసే అద్భుత మంత్రం ఒకటి ఉంది . అదే “ఒక్క పదం – టెక్నిక్” . ఇది చాలా సులభం , కాని పాటిస్తే ఇదో నిజ జీవిత అద్భుతమని మీరే చెప్పగలరు. ఇందుకు మీరు చేయవలసింది ఏమిటంటే మీ లక్ష్యాలు గుర్తుంచుకునేలా ఇంగ్లీష్ లో కాని, తెలుగు లో కానీ ఒక అందమైన చిన్న పదాన్ని చేసుకోవటం. ఆ పదం చదవగానే మీ లక్ష్యాలు గుర్తుచేసుకోవడం. నేను నా లక్ష్యాలు గుర్తుండడానికి BOWL (బౌల్ ) అనే పదం చేసుకున్నాను. ఎందుకంటే బుక్ రాయటం, ఆఫీస్ స్టార్ట్ చేయటం, వెబ్ సైట్ చేయించటం, బిజినెస్ ఎలా చేయాలి అనే అంశం మీద కోర్స్ చేయటం నా లక్ష్యాలు. అందుకే ఈ అంశాల ఇంగ్లీష్ రూపానికి ఈ విధంగా BOWL (Book, Office, Website, Learning entrepreneurship course) అనే ఒక్క పదం  టెక్నిక్ వాడాను. నేను ఏ పని చేసినా ఇది నాలో నేను అనుకుంటూ ఉంటాను. ఆ పని ఈ అంశాలకు అనుసంధానంగా ఉండేలా ప్రయత్నిస్తాను. ఎందుకంటే ప్రయారిటీ ముఖ్యం కదా. ఫోకస్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఈ టెక్నిక్ 66 రోజులు పాటించండి. ఎవరితో అయినా మాట్లాడడానికి సెల్ ఫోన్ ఉన్నట్లుగా, స్విచ్ వేస్తే బల్బ్ వెలిగినట్లుగా, మీరు పదం చదివితే మీ లక్ష్యాల పై మీ మనసు లగ్నం అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు ప్రేమతో “ఒక పదం –టెక్నిక్” తయారుచేసుకోండి, అద్భుతాలు  సాధించండి.

4 Things That Can Influence Your Success in 2015 (2015 లో మీ విజయాన్ని ప్రభావితం చేసే 4 అంశాలు)



కోటి ఆశలతో ప్రపంచం మొత్తం ఒక కొత్త సంవత్సరం లోకి అడుగుపెడుతున్నది. అనేక సంస్థలు కొత్త లక్ష్యాలను నిర్దేషించుకుంటున్నాయి. లీడర్లు, విజేతలు అవ్వాలనుకునేవారు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. మరి మీరు ఈ నూతన సంవత్సరం 2015 లో సాధించాల్సిన ముఖ్య లక్ష్యాలు ఏమిటి? గత సంవత్సరం 2014 జనవరిలో లేదా సంవత్సరం మద్యలో ఏమైనా లక్ష్యాలు నిర్ణయించుకున్నారా? అయితే వాటి విషయంలో మీరు ఎటువంటి ప్రగతిని సాధించారు?  
ఎంత గొప్ప లక్ష్యాలు నిర్ణయించుకున్నా, ఎంత ఉన్నత పద్దతులలో నిర్ణయించుకున్నా ఆ లక్ష్యాలు చేరే మార్గం సుగమం కావాలంటే కొన్ని మానసిక మరియు నిర్వహణా ప్రక్రియలు జరగాలి. కొత్త సంవత్సరంలో మిమ్మల్ని ముందుకు నడిపించే ఆ అద్భుత ప్రక్రియలో ముఖ్యమైన నాలుగు కీలక అంశాలేమిటో ఏమిటో చర్చిద్దాం

1. ఒక నిర్ణయం: మీ లైఫ్ పర్పస్ దిశలో మరో 12 నెలలలో మీకు ఏమి కావాలి? 
మరో పన్నెండు నెలలలో మీ జీవిత దఎయాలకు మీరు చేరుకోవాల్సిన లక్ష్యాలు ఏమిటి ?  వీలైతే గత సంవత్సరంలో జనవరి లో మీరు లక్ష్యాలు రాసుకున్న మీ డైరీ/నోట్ బుక్  ఒకసారి చెక్ చేసుకుని ఈ ఆర్టికల్ చదవటం ప్రారంభించండి. గతంలో లక్ష్యాలు నిర్దేషించుకోకపోతే మీ ఒక సంవత్సరం లక్ష్యాలు టైం లైన్ తో స్పష్టంగా వ్రాసుకోండి. ఎందుకంటే కేవలం అది కావాలి, ఇది కావాలి అని ఆశిస్తే కేవలం ఆశించాతంలోనే ఎక్స్ పర్ట్ అవుతారు. ఆశించింది సాధించాలంటే  మీ ఆశలను లక్ష్యాలుగా మార్చుకోవాలి. ఈ ప్రపంచంలో లక్ష్యాలు రాతపూర్వకంగా నిర్దేశించుకునే కొద్దిమంది గొప్ప వారిలో మీరు భాగం కావాలి. అందుకే లక్ష్యాలు స్పష్టంగా రాసుకోమని వివరించాము. లక్ష్య నిర్దేశం (గోల్ సెట్టింగ్) మీరు ఆశించిన ఫలితాలను స్పష్టంగా వివరిస్తుంది. మీ మైండ్ లో ఒకటి సాధించాలంటే ఆలోచనల్లో స్పష్టత ఉండాలి. కాబట్టి మీ శరీరం, మనసు, మీ కెరీర్, మీ కుటుంబం, మీ ఆర్ధిక వ్యవహారాలూ, మీ సోషల్ లైఫ్, మీ ఆథ్యాత్మిక జీవితానికి, మీ లెర్నింగ్ గోల్స్, మీ రిక్రియేషన్ గోల్స్ అన్నింటిని దృష్టిలో ఉంచుకొని లక్ష్యాలు నిర్ణయించుకోండి. మీకు ఏమి కావాలో, ఎందుకు కావాలో తెలిస్తే  ఎలా సాధిస్తారు అనేది ఈ ప్రపంచం అదే చూసుకుంటుంది. అయితే అందుకు మీరు చేయవలసింది మీ జ్వలించే కోరిక దిశలో ప్రాధాన్యాలు (priorities) దృష్టిలో ఉంచుకొని పనిచేయడం.
2. ఒక అలవాటు: మీ లక్ష్యాల దిశలో మరో 12 నెలలు మీ అలవాట్లు నిర్మించుకోండి: 
ఒక లక్ష్యం నిర్ణయించుకున్న తర్వాత మీ శక్తిని, సమయాన్ని దానికి అనుసంధానమైన అంశాలలోనే ఉపయోగించుకోగలగాలి. ఇది ఒక ఉన్నత అలవాటు. ఇది మీ జీవితంలో భాగమై పోవాలి. అందుకు మీ లక్ష్యాల దిశలో తక్షణం అడుగు వేయాలి. మీరు కోరుకున్న లక్ష్యాలు సాధించిన వారి గురించి తెలుసుకోండి, వారు ఎలా ప్రయత్నించారో చర్చించండి, ఆ రంగానికి చెందిన పుస్తకం చదవండి, ఒక నిష్ణాతుడికి కాల్ చేయండి. ఒక కోర్స్ జాయిన్ అవటం, ఆరోగ్యం కోసం జిం లో జాయిన్ అవటం, ఆర్థిక అంశాలపై అవగాహన కార్యక్రమాలకి వెళ్ళటం, వర్క్ లో ప్రొడక్టివిటి పెంచుకోడానికి కోచింగ్ తీసుకోవటం, ప్రేమ ఆప్యాయతలను తెలిపేందుకు మీ బంధువులు కుటుంబ సభ్యులను కలవటం ఇలా అది ఎంత చిన్నపని అయినా  సరే ఆ దిశలో మొదటి అడుగు వేయడం ముఖ్యం. ఈ చిన్నపని లక్ష్యం నిర్దేశించుకున్నప్పుడు మీలో జ్వలించిన ఉత్సాహాన్ని సాధించే వరకూ కొనసాగించేలా ఉపయోగపడుతుంది. ఎంత పెద్ద కొండ అయినా చెట్టు అయినా సరే గొడ్డలితో రోజుకు కొంత సమయం నరికేస్తూ పోతే  ఒక రోజుకి కూలిపోతుంది. అలాగే మీరు మీ శక్తిని, ఫోకస్ ని, సమయాన్ని మీ లక్ష్యం వైపు నడిపించేలా మీ అలవాట్లు నిర్మించుకోండి. మీ ప్రగతిని నిరోధించే అనవసర అలవాట్లు వదిలేసి ఉన్నత అలవాట్లు ఈ 12 నెలలో మీ జీవితంలో భాగం చేసుకోండి.
౩. ఒక బాధ్యత: 12 నెలలు మీ ఫలితాలకు మీరు బాధ్యత వహించండి:
“కొంతమంది గత సంవత్సరం  లక్ష్యాలు పెట్టుకున్నాం కానీ జనవరి , ఫిబ్రవరి తర్వాత వాటి మీద పనిచేయలేదు” అని చెబుతుంటారు. ఎందుకు చేయలేదు అంటే వారు చెప్పే సమాధానాలు ఇలా ఉంటాయి.
  • మా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవటంలేదు
  • నాకు మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కుడా లేదు
  • నాకు కావలసినంత టైం లేదు
  • ఈ పని చేయాలంటే డబ్బు బాగా పెట్టాలి
  • నేను లంచాలు ఇవ్వలేను కాబట్టి నాకు పనులు కావు
  • నాకు ఇంగ్లీష్ రాదు
  • మా కుటుంబంలో , మా ఊరిలో ఎవరు అటువంటి ప్రయత్నం చేసి విజయం సాధించిన వారు లేరు
  • ఆడ పిల్లలకి అంత పెద్ద ఉద్యోగాలు ఎంత ప్రయత్నించినా రావు
  • నాకు లోన్ రాలేదు
  • నా పార్టనర్ మంచోడు కాదు
  • నా మంచితనం నాకు పనికి రాదు
  • సరైన ప్రభుత్వాలు లేవు, వ్యవస్థ లేదు
  • డబ్బు సంపాదించటం అంత ఈజీ కాదు
ఇలా చెప్తూ పోతే ఈ లిస్టు ఇలా పెరుగుతూనే పోతుంది. నా పనులు ఎందుకు కాలేదంటే అంటూ కారణాలు చెప్తూ పోతే ఆ కారణాలు చెప్పటంలో ఎక్స్ పర్ట్ అవుతాము. కాని పనులు కావు. ఎన్ని అడ్డంకులున్నా ఇంకా ఉన్నతంగా ఎదగాలంటే ఏమి చేయాలనీ ప్రశ్నించుకోవాలి.  మనుషులు ఫలితాలు సృష్టించడానికి మార్గాలను వెతుక్కోవటం కంటే , ఫలితాలు ఎందుకు సృష్టించాలేకపోయరో చెప్పే కుంటిసాకులు వెతుక్కోవటంలో ఎక్కువ అలిసిపోతున్నారు. దాని వలన మనల్ని మనం (కాస్త మన ఇగో కూడా) మభ్య పెట్టుకోవటమే అవుతుంది. కాని ప్రపంచం మన అపజయాలకి కారణాలను చూడదు, జీవితంలో కారణాల లిస్టుకి అంతం ఉండదు. నిజానికి విజేతలందరూ ఇటువంటి అడ్డంకులను, ఆటంకాలను దాటి వచ్చిన వారే. కాబట్టి భిన్నంగా ఆలోచించాలి. మీ జీవితానికి, మీ అలవాట్లుకు  100% బాధ్యత తీసుకోవాలి. మీ అలవాట్లకు, మీ ఫలితాలకు బాధ్యత మీరే తీసుకోండి, ఆ విధానంలో మిమ్మల్ని మీరు మెరుగు పరుచుకోగలరు.

4. ఒక ప్రణాళిక : ప్రతినెల ప్రణాళికతో ప్రగతిని పరిశీలించుకోండి :
మీ ప్రతి లక్ష్యం సాధించడానికి మీరు చేయవలసిన పనులు ఒక నెలల వారిగా రాసుకొని ఒక సంవత్సర ప్రణాళిక ఈ క్రంద ఇవ్వబడిన చార్ట్ లో మాదిరిగా చేసుకోండి. మీరు నిర్దేశించుకున్న ముఖ్యమైన అన్ని లక్ష్యాలు ఎడమ వైపు రాసుకోండి. ఈ క్రింద వివరించిన చార్ట్ లో స్థలాభావం వలన మేము కేవలం ఉదాహరణలు అందించాము. మీరు మీ నోట్ బుక్ / డైరీ లో అన్ని అంశాల లక్ష్యాలు స్పష్టంగా రాసుకోండి. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే చేయాల్సిన పనులు విడిగా రాసుకోవచ్చు. ఆ లక్ష్యాలు చేరుకోడానికి సమయాన్ని నెలలు రంగు తో నింపండి. ఈ సంవత్సర ప్రణాళికను దగ్గర పెట్టుకుని ప్రతి నెల మీరు ఆ నెలలో ఏమి చేస్తే మీ ఇయర్ గోల్ సాధిస్తారో దాని ప్రకారం నెలలో నిర్వహించాల్సిన కార్యక్రమాలు రాసుకోండి. అంటే ఏ నెలలో ఏం పనులు చేయాలో రంగు ఉన్న ప్రదేశాన్ని చూసి, మీ ఇయర్ గోల్స్ చదవటం ద్వారా అర్థవంతంగా నెలవారీ లక్ష్యాలు నిర్ణయించుకోవచ్చు.
సంవత్సర ప్రణాళిక చార్ట్:


S.No
లక్ష్యాలు
జనవరి  2015
ఫిబ్రవరి  2015
మార్చ్ 2015
ఏప్రిల్  2015
మే  2015
జూన్2015
జూలై 2015
ఆగష్టు 2015
సెప్టెంబర్ 2015
అక్టోబర్ 2015
నవంబర్ 2015
డిసెంబర్ 2015
A
శారీరక ఆరోగ్యం











1
శారీరక వ్యాయామం ద్వారా నా ఆరోగ్యాన్ని ఉన్నతంగా, నా శరీరాన్ని శక్తివంతంగా చేసుకుంటాను









2
జూలై 2015 నాటికి నేను 60 కిలోల శరీర బరువు కలిగి ఉంటాను 












3
జనవరి 2015 నాటికి నేను హెల్త్ ఇన్సూరెన్సు తీసుకుంటాను












B
మానసిక ఆరోగ్యం












1
యోగ, మెడిటేషన్ ప్రతి రోజు ప్రాక్టీసు చేస్తాను.












2
జనవరి, ఫిబ్రవరి, మార్చ్ లో  లైఫ్ కోచింగ్ క్లాసు కి వెళతాను












C
కుటుంబ జీవితం












1
నా కుటుంబంతో, స్నేహితులతో నా సంబంధాలు ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటాను. ఉదా: ప్రతి వారం ఇద్దరు పాత స్నేహితులతో మాట్లాడతాను












3
ఆగష్టు 2015 నాటికి నేను పెళ్లి చేసుకుంటాను












D
చదువు / వృత్తి/ ఉద్యోగమ/ వ్యాపారము












1
జూన్ 2015 నాటికి నా కొత్త వ్యాపారము మొదలు పెడతాను












2
సెప్టెంబర్ 2015 నాటికి నేను PhD లో / కొత్త కోర్స్ లో చేరతాను  












E
ఆర్ధిక జీవితం 












1
డిసెంబర్ 2015 నాటికి నేను రూ. 25 లక్ష లు సంపాదిస్తాను












F
ఫన్ , లెర్నింగ్ , రిక్రియేషన్












1
ఆగష్టు 2015 నాటికి నేను ఇండియాలో  4 పర్యాటక కేంద్రాలకు వెళతాను












2
ఈ సంవతరం జనవరి , సెప్టెంబర్ లలో కార్టూన్స్ గీయడం, స్విమ్మింగ్ నేర్చుకుంటాను  












G
సమాజ సేవ, వాలంటరీ సర్వీస్












1
నేను జూలై  2015 నాటికి 5000 రూ|| పేద అనాధ విద్యార్ధులకు అందిస్తాను, నెలకి ఒక రోజు సంక్షేమ కార్యక్రమంలో పాల్గొంటాను













ఈ విదంగా ఏ నెలలో ఏం పనులు చేయాలో నిర్ణయించుకున్నాక, నెల వారి లక్ష్యాలు చేరుకోడానికి ఏమి చేయాలో వారానికి ఏమి చేరుకోవాలో మైల్ స్టోన్స్ గుర్తిస్తూ నెలవారీ ప్రణాళిక చేసుకోవాలి. ఇది మీ శక్తిని, మీ సమయాన్ని ఉన్నతంగా , ఫోకస్ తో ఉపయోగించుకోడానికి ఒక చక్కటి మేజిక్ టూల్ వంటిది. ప్రతినెలా మొదటి రెండు రోజులలో మీ ఇయర్లీ ప్లాన్ నుంచి మంత్లీ ప్లాన్ సిద్దం చేసుకోండి. ఈ క్రింద ఉదాహరణలో ఆరు రోజులకు మంత్లీ ప్లాన్  ఇవ్వబడింది. మీరు జనవరి నెల కు ప్రణాళిక 31 రోజులకు చేసుకోండి.  ఆ పనులు చేస్తున్నపుడు పరిస్థుతులకు తగినట్లు మార్పులు చేసుకున్న పర్లేదు కాని మార్పులు మీ ఫోకస్ ని, మీ ప్రాధాన్యాలను మార్చకుండా జాగ్రత్త పడండి. ప్రతి నెల గత నెలలో ఏమి చేసాము, ఎలా చేసాము, ఏమి చేయలేక పోయాము, ఇంకా బాగా చేయాలంటే ఎలా, అడ్డంకులు ఎలా అధిగమించవచ్చు అని పునర్విమర్శ చేసుకోండి.
జనవరి – మంత్లీ ప్లాన్:
జనవరి  2015 - నెల ప్రణాళిక  
తేది
వారం
చేయవలసిన కార్యక్రమాలు
పూర్తి చేసిన కార్యక్రమాలు
1
గురువారం
ఎక్సర్ సైజ్ , బుక్ రీడింగ్, ప్రొఫెసర్ సుబ్బారావు ని కలవాలి, కోర్స్ వివరాలు తెలుసుకోవాలి,

2
శుక్రవారం
ఎక్సర్ సైజ్ , బుక్ రీడింగ్ ౩౦ నిమిషాలు, కోర్స్ లో జాయిన్ అవ్వాలి

3
శనివారం
ఎక్సర్ సైజ్ , ఓల్డ్ ఫ్రెండ్స్ తో మాట్లాడాలి, జిం లో జాయిన్ అవ్వాలి ,

4
ఆదివారం
ఎక్సర్ సైజ్ , వారాంతపు పునర్విమర్శ (వీక్లీ రివ్యూ), బంధువులతో ముచ్చట్లు, నచ్చిన పుస్తకం కంప్లీట్ చేయాలి

5
సోమవారం
8 గంటలు చదువుకోవాలి, , తల్లి దండ్రులకు వర్క్ లో హెల్ప్ చేయాలి

6
మంగళ వారం
ఎక్సర్ సైజ్ , బిజినెస్ మీటింగ్ 



ఈ కొత్త సంవత్సరం అద్భుతం అవ్వాలంటే మీ జీవితాన్ని నడిపించే మీ లైఫ్ పర్పస్ దిశలో లక్ష్యాలు, లక్ష్యాల దిశలో బాధ్యత, ఆ బాధ్యతను నిర్వర్తించేందుకు ఉపయోగపడే ఉన్నత అలవాట్లు, మిమ్మల్ని ఫోకస్ తో నడిపించే ప్రణాళిక ఉండాలి. ఇవన్నీ ఆయుధాల వంటివి ఈ ఆయుధాలు పనిచేయాలంటే మీరు వాటిని వాడాలి. రెగ్యులర్ గా వాడాలి. జనవరి లో ఉత్సాహంతో మొదలుపెట్టి మార్చిలో అటకెక్కించే అంశాలు రాసుకున్నట్లైతే వాటిని మళ్ళీ చెక్ చేసుకోండి. పాత అలవాట్లను అటక ఎక్కించండి. ఒక జీవితం ఒక అద్భుతం అవ్వాలంటే గతానికి బాధ్యత వహిస్తూ, రేపటిపై నమ్మకంతో, ప్రతిక్షణం అర్ధవంతంగా, ఆనందంగా ముందుకు వెళ్ళే లక్షణం ఉండాలి.