Thursday 8 February 2018

5 Ways to Enhance Entrepreneurial Skills ఎంట్ర ప్రెన్యూర్ నైపుణ్యాలు పెంచుకోడానికి పంచ సూత్రాలు






To be an entrepreneur it helps to introspect oneself through simple questions like
  • Who am I?
  • What can I contribute to this world?
  • What life style do I want? Am I ready to learn skills and keep efforts to achieve my desired lifestyle?
  • What kind of person I should be to manifest the results I intended? What are the personality traits and though-patterns, habits should I follow?
After getting some clarity about these basic questions that help you understand your interests, skills and future aspirations, following are the five steps you need to take to enhance your entrepreneurial skills.
  1. Act differently. Not just thinking and appearing.
  2. Start venture . Reading, learning , understanding, observing ....will not give you real time experience. So start venture.
  3. Expect failures and keep moving irrespective of challenges. Challenge is not end of the life.
  4. Get your hands dirty with accounts and numbers
  5. Learn leadership communication. To be an entrepreneur , you have to deal with many people and it's important to understand the communication that influence more and practice it as best as you can to get the results you want.
                                    ***    ***    ***    ***    ***    ***

ఈ 21 వ శతాబ్దంలో ఎవరికీ వారే బాస్ అవడమనేది అందరూ కోరుకునే కెరీర్ ఆప్షన్. ఉన్న ఉద్యోగాలలో తృప్తి లేక కావచ్చు, జీతం సరిపోక కావచ్చు, టాలెంట్ కి ఉద్యోగానికి సంబంధం లేదన్న ఫీలింగ్ కావొచ్చు, కలలను నిజం చేసుకోడానికి కావచ్చు... కారణమేదైనా ఈనాటి యువత కేవలం బ్రతకడం ఎలా అని కాకుండా అందమైన, ఒక ఉద్దేశ్యం తో కూడిన జీవితాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలా అని ఆలోచిస్తుంది. తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ, పది మందికి ఉపయోగపడుతూ తమ జీతం, జీవితం తామే నిర్ణయించుకోవాలనుకుంటున్నారు. ఎంట్ర ప్రెన్యూర్ షిప్ ద్వారా కొత్త జీవన విధానాలను ఆవిష్కరించాలని కలలు కంటున్నారు. మరి ఆలాంటి వారికి ఎంట్ర ప్రెన్యూర్ కావాలను కునే యువత లక్షణాలు ఎలా ఉండాలి? నేర్చుకోవాలనుకునే కీలక అంశాలేమిటి ? ఈ విషయాలు
తెలియజేయడానికే ఈ ప్రత్యేక శీర్షిక.


ఎంట్ర ప్రెన్యూర్స్ అవ్వాలని బిజినెస్ మాగజైన్స్ లో అందమైన ఫొటోస్ చూసి వాళ్ళు మాత్రమే గొప్ప బిజినెస్ పీపుల్ అని అలోచించి మనం వారిలా అవ్వాలని అనుకోవడం సహజం. కొందరు మేము బిజినెస్ చేయడానికే పుట్టాము అని చెప్పుకోవచ్చు. కానీ ఎంట్ర ప్రెన్యూర్స్, బిజినెస్ పర్సన్ కావడం చెప్పినంత ఈజీ కాదు, అలా అని అసాధ్యం అనేంత క్లిష్టమైనది కాదు. ఒక వ్యక్తి తన గతం, తను అలవాటు పడిన ఆలోచనా రీతులు, తనపై సమాజం యొక్క ముద్రలు, తన రెస్పాన్స్ మెకానిజం పై పట్టు పట్టి ఎంట్ర ప్రెన్యూర్ మైండ్ సెట్ గురించి మెళకువలను ఇతరులను చూసి, నిశితంగా పరిశీలించి నేర్చుకోవచ్చు. ఎంట్ర ప్రెన్యూరల్  జర్నీ అనేది ఛాలెంజ్ లతో (భయస్తుల భాషలో రిస్క్ లతో?) కూడినది, చేస్తున్న పనిలో ఆనందం , వచ్చే ఛాలెంజ్ లకు సిద్దంగా తనను తాను మార్చుకోగల వారికి ఆహ్వానం పలికే కెరీర్. మనిషి తన జీవితానికి సంబంధించిన కీలక ప్రశ్నలు వేసుకునే సమాధానం రాబట్టుకునేలా ప్రోత్సహిస్తుంది ఈ కెరీర్.
ఎంట్ర ప్రెన్యూర్ కావాలంటే జవాబు చెప్పుకోవాల్సిన కొన్ని ప్రశ్నలు :
Ø  నేను ఎవరు?
Ø  నీను ఈ ప్రపంచానికి ఎలా ఆపయోగపడగలను?
Ø  నా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నాను? అందుకు ఎలాంటి కృషి చేయడానికి, నైపుణ్యాలు నేర్చుకోడానికి నేను రెడీ గా ఉన్నాను?
Ø  కోరుకున్న ఫలితాలు చేరుకోడానికి నేను ఎలాంటి వ్యక్తిగా మారడానికి సిద్దంగా ఉన్నాను? ఆ వ్యక్తిత్వ , ఆలోచనా రీతులు ఏమిటి?
ఎంట్ర ప్రెన్యూర్ నైపుణ్యాలు నేర్చుకోడానికి మార్గాలు



1.     భిన్న మైన దారిని ఎంచుకోండి

సృజనాత్మకత ఎంట్ర ప్రెన్యూర్ షిప్ కి వేరు (రూట్) వంటిది . మార్కెట్ ప్లేస్ లో ప్రజల అవసరాలను తీర్చడంలో , జీవన శైలిని ఉన్నతంగా మార్చడంలో సృజనాత్మకంగా ఆలోచించడం ఎంట్ర ప్రెన్యూర్ లక్షణం.  సృజనాత్మకత అంటే విషయాలను భినంగా చూడటం, అవసరాలను తీర్చేందుకు కొత్త మార్గాలను ఎంచుకోవడం. మీ క్రియేటివిటీ పెంచుకోడానికి ఉద్దేశ్యపూర్వకంగా కొత్త పనులు చేయండి, కొత్త భాష నేర్చుకోండి, కొత్త వ్యక్తులతో వర్క్ అవసరాలను తీరేలా పరిచయం పెంచుకోండి, ఇతరులు చేయని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి, అలవాటు లేని బుక్స్ చదవండి, కొత్త భాషలో సినిమా చూడండి, కొత్త ఆట నేర్చుకుని ఆడండి. మీ కంఫర్ట్ జోన్ లో లేని వ్యక్తులతో ప్రశాంతంగా మాట్లాడండి. 2008 లో ఆర్ధిక ఇబ్బందులు వచ్చినపుడు ఈ క్రియేటివిటీ ఉన్నవారే గొప్ప వ్యాపారాలు చేసారు. క్రియేటివిటీ అంటే ఎదుటి వారి బలహీనతని వాడుకుని బిజినెస్ చేయటం కాదు, ఎవరూ చూడని ఒక సొల్యూషన్ చూపించి నిజాయితీగా ఆలోచనలు, పనుల ద్వారా డబ్బు సంపాదించడం.

2.     వ్యాపారం మొదలుపెట్టండి
రూల్స్ ఫాలో అవడం నడవడం నేర్చుకోరు, నడిచే ప్రయత్నం చేయడం, కిందపడటం వలన నేర్చుకుంటారు అంటారు  ఎంట్ర ప్రెన్యూర్షిప్ మేధావులు. నిజ జీవితానికి, పనిచేస్తూ ప్రపంచం నుంచి నేర్చుకున్నదానికి మించిన జ్ఞానం మరొకటి ఉండదు. మీరు బిజినెస్ పార్ట్ టైం చేసినా, ఫుల్ టైం చేసినా ఎలా ఒప్పించాలి, ఎలా అకౌంటింగ్ చేయాలి, ఎలాంటి ప్లాన్ చేయాలి, ఎలా ప్రమోట్ చేయాలి, సేల్స్ టెక్నిక్స్, మార్కెటింగ్ విధానాలు ...ఇలా అనేక స్కిల్స్ నేర్చుకుంటారు.

3.     ఛాలెంజ్ లను ఎదుర్కోండి
నేను స్మార్ట్ కాదు , కేవలం ఎక్కువకాలం సమస్యలతో ఉన్నాను అంటారు ఐన్ స్టీన్ మహాశయుడు. సమస్యలు, ఛాలెంజ్ లు ఎదురైనపుడు కాస్త మార్పులు చేసుకోవాలేమో కాని మీ నమ్మకాన్ని , పట్టుదలను రెట్టింపు చేసుకోగలగాలి. విజయం ఆ ఛాలెంజ్ లకు కేవలం ఒక్క అడుగు దూరంలో నే ఉంటుందని ఆ పరిస్థితుల్లోనే మనిషి ప్రయత్నం వదిలేయకూడదంటారు బిజినెస్ సక్సెస్ సాధించిన పెద్దలు. ప్రపంచం ఎంత అనుమానించినా, హేళన చేసినా, నీ మనసులో పవిత్ర భావంతో, చేసే ప్రాజెక్ట్ లో నమ్మకం, మీ సర్వీస్/ ప్రోడక్ట్ కి మార్కేటబిలిటీ ఉంటే ముందుకు సాగడం చాలా అవసరం. మీ రిస్క్ టేకింగ్ సత్తా = మీ బిజినెస్ సక్సెస్ . ఈ సూత్రం గుర్తుంచుకోండి.

4.     లెక్కలు బాగా నేర్చుకోండి 
సొంత కంపెనీ రన్ చేయాలంటే కనీస లెక్కలు తెలియాలి. కాష్ ఫ్లో , మంత్లీ బాలన్స్ షీట్, ప్రొజెక్షన్స్ చాలా అవసరం. లాభ నష్టాలు బేరీజు వేసుకోలేని స్థితిలో బిజినెస్ చేస్తే అసలుకే మోసం వస్తుంది. మీ బడ్జెట్, టాక్స్ వర్క్ మీరే చేసుకోవడం తో కొన్ని అంశాలు నేర్చుకోడానికి పునాది వేయండి. 

5.     లీడర్షిప్ కమ్యూనికేషన్ అలవాటు చేసుకోండి

ఎంట్ర ప్రెన్యూర్ అవ్వాలంటే నేర్చుకోవాల్సిన మౌలిక నైపుణ్యాలు:  నిబద్దతతో మీ బృందాన్ని (Team) లీడ్ చేయటం, ప్లాన్నింగ్ తో  పనిచేయటం, విజన్, ప్రాజెక్ట్ ని ఉన్నతంగా కమ్యూనికేట్ చేయటం, సేల్స్. ఇందుకోసం మీ ప్రాజెక్ట్ పనే కాదు లోకల్ NGO లేదా టోస్ట్ మాస్టర్ క్లబ్ లో, సోషల్ ప్రాజెక్ట్ లో పనిచేయోచ్చు. ఇంట్లో పెద్దవారి జన్మదిన వేడుకలు మీరే బాధ్యత తీసుకుని  చేయొచ్చు.  ఆఫీస్ పని అయినా, సోషల్ ప్రాజెక్ట్ అయినా , ఫ్యామిలీ వర్క్ అయినా ఒక పెద్ద ప్రాజెక్ట్ కి బాధ్యత తీసుకోవడం ద్వారా ప్లానింగ్, నెగోషియేషన్, సేల్స్, లీడర్షిప్, టీం వర్క్  స్కిల్ల్స్  పెంపొదించుకోవచ్చు. ఆన్లైన్ లో  సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉండటం ద్వారా కూడా కమ్యూనికేషన్ , కరెంటు ట్రెండ్ అవసరాలు అర్థం చేసుకోవచ్చు.  
          ***  ***  ***  సైకాలజీ టుడే, సెప్టెంబర్  2017 లో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  ***