Monday 26 October 2015

6 Characteristics of Winning Entrepreneur (ఆ ఆరు ఎంట్రప్రెన్యూ ర్ లక్షణాలు మీలో ఉన్నాయా?)


Do you have the  sic characteristics of a winning entrepreneur? Here is the list.

1. Ability to focus irrespective of ambiguity and uncertain conditions
2. Personal discipline
3. Physical health
4. Doing the activities that you love
5. People skills 
6. Be different, think different, act different

కూటికోసం కోటి మార్గాలు అన్నట్లు బ్రతకడానికి బోలెడు మార్గాలు. ఉద్యోగం, తల్లిదండ్రుల ద్వారా వచ్చిన కుల వృత్తి, వ్యాపారం ఇవి ఒకప్పటి మార్గాలు. మరి ఇప్పుడు స్పీడ్ యుగంలో యువతలో, వ్యాపారాలలో ఒకటేమిటి ప్రపంచం మొత్తంలో ఆలోచన విధానాలు, పదాలు మారిపోయాయి. “నేను ఈ ఉద్యోగంలో ఇలా ఎన్నాళ్ళు?”, “ఈ వ్యాపారం నాకు ఎన్నాళ్ళు?”, “అసలు నాకు వచ్చినన్ని బిజినెస్ ఆలోచనలలో ఒక్కటి క్లిక్ అయినా చాలు లైఫ్ సెటిల్”.... ఇలా ఏ ఆలోచన వచ్చినా అది మీ ఎంట్రప్రన్యూర్ లక్షణాన్ని తెలియజేస్తుంది. మరి మీలో నిజమైన ఎంట్రప్రన్యూర్ ని ఎలా తెలుసుకోవాలి, ఆ లక్షణాలు శాస్త్రీయంగా మీతో చర్చించడానికే ఈ  ఆర్టికల్.
* * * * * * * * * * * * * * * * * *
1: సందిగ్ధంలో ఫోకస్ గా పనిచే లక్షణం: ఎంట్రప్రన్యూర్/ బిజినెస్ మాన్  కావాలని కలలు కనే వారికీ, అసలైన ఎంట్రప్రన్యూర్ కి  మధ్య ఉన్న ముఖ్యమైన తేడా ఏంటంటే ఉన్న జాబు,పని  చేసుకుంటూ గడపడం, రిస్క్ తీసుకొని ఆశించిన జీవితం / బిజినెస్ వైపు అడుగులు ముందుకు వేయడం. అంటే స్పష్టత లేకపోయినా మీ ప్రోడక్ట్ లేదా సర్వీసెస్ ద్వారా ప్రజలకి అవసరాలను తీరుస్తూ మీ మార్గంలో ముందుకు వెళ్ళగలను అనే నమ్మకం తో కూడిన అడుగు వేయగల దృక్పథం చాలా ముఖ్యం. ఏ ఇబ్బంది లేని బిజినెస్ బెటర్ అనుకునే వారు అసలు బిజినెస్ లో ఉండకపోవటం మంచిది. కాస్త చేదుగా ఉన్నా ఇది నిజం. అందుకే స్పష్టత లేకపోవడం, పూర్తి సమాచారం ఎదుగుదల, గైడెన్స్ లేకపోవటం, ఎండ్ ప్రోడక్ట్ ఏమౌతుందో , కస్టమర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే సందిగ్దం లో కూడా అడుగులు ముందుకు వేయగలిగే స్థిత ప్రజ్ఞత అవసరం. ఒక షెడ్యుల్ పెట్టుకుని నేను ఈ టైం లో నే పని చేస్తాను, ఈ పద్దతిలో ఉన్న వాళ్ళే కావాలి అని చట్రాలు పెట్టుకుని కూర్చుంటే స్టార్ట్-అప్ , బిజినెస్ లు స్థాపించడం కష్టం. సందిగ్థంలో కూడా అనుకున్నది సాధించగలను అనే నమ్మకంతో పనిచేసే లక్షణం మీలో ఉందా?

2:  వ్యక్తి గత క్రమశిక్షణ: ఎంట్రప్రన్యూర్ అంటే సొంత వ్యాపారం, సంస్థ సృష్టించడం. ఇది సెల్ఫ్ – మేనేజ్ మెంట్ తో మాత్రమే వీలౌతుంది. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా ఈ స్థితికి మీరే కారణం. ఎంట్రప్రన్యూర్ గా ఎదగాలంటే మీ జీవితానికి 100% బాధ్యత మీరు తీసుకోగలగాలి. వినియోగదారులు నువ్వు ఒక్కడివే ఎన్నో రకాల పనులు చేస్తున్నావని, సరిగా తినకుండా రాత్రి కుడా పని చేసావని చూడరు. మీరు ప్రామిస్ చేసిన సర్వీస్ / ప్రోడక్ట్ అనుకున్నట్లు అందిందా లేదా అని చేస్తారు. వ్యాపార కమ్యూనికేషన్ కుడా ఉన్నతంగా ఉండాలి. ఎదుటి వాళ్ళది తప్పు అయినంత మాత్రాన మన ఇష్టం వచ్చినట్టు రెస్పాండ్  అయ్యే రోజులు పోయాయి. కాబట్టి  మీ తప్పులకు ఇంకొంత నేర్చుకుని మరో సారి పునరావృతం కాకుండా నిత్య విద్యార్ది గా ఉండడం ఎంట్రప్రన్యూర్ లక్షణం. ఇది వ్యక్తి గత బాధ్యత , క్రమశిక్షణ నుంచి వస్తుంది, అది మేలో ఉందా?
3:  శారీరక ఆరోగ్యం:  అవును. మీరు చదువుతున్నది కర్రెక్టే. శారీరక ఆరోగ్యం ఎంట్రప్రన్యూర్ జీవితాన్ని ఇంకా ఎక్కువ ప్రభావితం చేస్తుంది. మీ ప్రొడక్టివిటీ మీ ఆరోగ్యం పై ఆధారపడి ఉంటుంది. ఉద్యోగంలో లాగా సొంత వ్యాపారంలో సిక్ లీవులు పెట్టుకోడానికి వీలవదు. తేడావస్తే సమయానికి పనులు పూర్తి చేయలేకపోతే  కస్టమర్ నొచ్చుకుని  ఇక రెండో సారి మనకు వర్క్ / సర్వీస్ రిక్వెస్ట్ ఇవ్వకపోవచ్చు. అందుకే సరైన ఆహారం, రెస్ట్, ఎక్సర్ సైజ్ తో మిమ్మల్ని మీరు శారీరకంగా, పుస్తకాలు, ట్రైనింగ్ లతో మానసికంగా ఆరోగ్యంగా ఉంచుకోగాలగాలి. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఎన్ని గంటలు ఆక్టివ్ గా పనిచేస్తున్నారు? మీ వర్క్, ఇల్లు , ఫ్యామిలీ టైం అన్ని బాలన్స్ చేయగలుగు తున్నారా?

4:  ప్రేమించే పనిని చేయటం:  ఎంట్రప్రన్యూర్ గా చేసే పని మీకు చాలా ఆనందాన్ని , సంతృప్తిని, ఉత్సాహాన్ని ఇచ్చేది అయ్యి ఉండాలి. వేరే వాళ్ళు లాగా డబ్బులు సంపాదిన్చాలనో, సోషల్ స్టేటస్ కోసమో స్టార్ట్-అప్ లు, బిజినెస్ లు పెట్టి అనవసరంగా ఇందులోకి దిగి ఉన్న డబ్బు వేస్ట్ చేసాను అనే వాళ్ళు, ఎవారినో నమ్మి నేను ఈ ఫ్రాన్చిసీ తీసుకున్నాను అనో, డిస్ట్రిబ్యూటర్ ని నమ్మి ప్రోడక్ట్ తయారి చేసాను ఇప్పుడు వాళ్ళు చేతులెత్తేశారు సరుకు ఎలా అమ్మాలి అని ...ఇలా ఎన్నో రకాలుగా నా వద్దకు క్లైంట్స్ వచ్చారు. మనం ప్రేమించే పని అయితే ఇలాంటి సమస్యలను చాలా వరకు నిరోధించోచ్చు. మీ మొదటి వంద కష్టమర్లను మీరే తెచ్చుకునే వరకు బిజినెస్ చేసే ఓపిక మీకు ఉండాలి. ఎక్కువ పని గంటలు సాధారణం అయిపోతుంది అందుకు రెడీ అయి ఉండాలి. ప్రేమించే పని అయితే కావలసిన ఇతర నైపుణ్యాలు, అర్హతలు సాధించుకోడానికి ఇంకా కష్ట పడగలరు , లేదా ఆ స్కిల్ల్స్ ఉన్న వాళ్ళను కో- ఫౌండర్ గా, పార్టనర్ గా పెట్టుకుని ముందుకి వెళ్ళగలరు. మీరు మీ ఐడియా / బిజినెస్ ని ప్రేమతోనే చేస్తున్నరా?  ఎలా ఉంటుందో చూద్దామని రాయి విసురుతున్నారా? ఎంట్రప్రన్యూర్ గా ఎదగాలంటే ప్లాన్-B (ప్రత్యామ్నాయం) పెట్టుకోవటం అనవసరం. రాళ్ళు వేయటం ఆపి పని మొదలు పెట్టటం అవసరం. మీ బిజినెస్ ఎన్ని ఒత్తిళ్లకు లోనైనా కస్టమర్ అవసరాలకు తీర్చేలా మిమ్మల్ని మీ ప్రోడక్ట్ / సర్వీస్ తీర్చి దిద్దుకుంటూ పనిచేయగలరా?  
5:  మనుషులతో కలిసి మెలిసి పనిచేయగాలిగే నైపుణ్యం :  ఎంట్రప్రన్యూర్ గా ఉండటం అంటే బిజినెస్ మాన్ సినిమా లో హీరో లా వన్ ఆర్మీ లా ఉండటం కాదు. మీ ఐడియా దశ నుంచి లాభాల్లో వ్యాపారాన్ని నిర్మెంచేవరకు అనేక రకాల వ్యక్తులతో ముందుకు వెళ్ళగలగటం, మీ ఆలోచనలకు , విజన్ కు తగిన వారిని, మీకు లేని స్కిల్ల్స్ ఉన్న వారిని కో- ఫౌండర్/ పార్టనర్ వెతకటం స్టార్ట్-అప్/ బిజినెస్  క్లైంట్ లతో మాట్లాడటం, మెంటార్ , ట్రైనర్ లను కలిసి మీ అవసరాలను చర్చించడం, మీ సర్వీస్ / ప్రోడక్ట్ గురించి ఫండ్ ఇచ్చే వారికి, మార్కెటింగ్ వారికి, కస్టమర్స్ కి చెప్పటం....ఇలా ప్రతి స్టెప్ లోను మనుషులతో కలిసిపోగలగాలి, మాట్లాడటమే కాదు, మనసులను అర్ధం చేసుకుని బిహేవ్ చేయగలగాలి, మిమ్మల్ని చూస్తే ఆ ప్రోడక్ట్ గుర్తొచ్చేలా ఒక బ్రాండ్ / గుర్తింపు ఉండేలా మీ కమ్యూనికేషన్ ఉండాలి. ఆ లక్షణాలు మీలో ఉన్నాయా? ఎందుకంటే ఎంట్రప్రన్యూర్ గా ఉండటం అంటే ఎదో ఒక రోజు ఇతర వ్యక్తుల ఆలోచనలు, విజ్ఞానం, సమర్ధత, అనుభవం మీదా ఆధారపడాల్సి రావచ్చు. అందుకు మంచి పీపుల్ స్కిల్ల్స్ ఉంటె ఉనంతంగా కంపెనీ నిర్మించుకోవచ్చు.

6:  మీరు కాస్త భిన్నంగా ఉంటారు:  అందరూ ఇబ్బందులు చుసే వద్ద మీరు అవకాశాలు చూస్తున్నారా? ఎవరు మొదలు పెట్టని వద్ద మీరే అంతా ఐ ముందుకు నడిపించాలను కుంటున్నారా? ఏదైనా సరే చేస్తా అని గట్టిగా చెప్తున్నప్పటికీ ఏమి ఔతుందో లేదో అని ఆలోచిస్తున్నారా? అది లేదు, ఇది లేదు అని కారణాలు చెప్పకుండా ఉన్నదానితో ది బెస్ట్ గా ఏమి చేయగలమని అలోచిస్తున్న్నారా? అందరు చేసిన పనే అని కాకుండా రిస్క్ లని లెక్క చేయకుండా భిన్నంగా అలోచించి , భిన్నంగా పని చేయాలనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం వెళ్ళే దారి అని కాకుండా వారి ఆలోచనలనే ఛాలెంజ్ చేయాలనుకుంటున్నారా? ....వీటిలో ఒక్క ప్రశ్నకు మీరు “ఎస్” అని చెప్పినా ఇంచుమించు మీలో ఒక ఎంట్రప్రన్యూర్/ ఫౌండర్/ బిజినెస్ మాన్ ఉన్నట్లే . మీరు భయపడరు, ఒక చోట తిన్నగా ఉండరు, ఎదో చేయాలన్న ఆలోచన మిమ్మల్ని తొలిచివేస్తుంది, ఎదో సృష్టించాలన్న కసి మిమ్మల్ని అనుక్షణం దహించి వేస్తుంది , ఆ ఫైర్ కి కావలసిన గైడెన్స్ / మెంటార్ దొరికితే మీరే ఓ స్టీవ్ జాబ్స్ , ఓ నారాయణ మూర్తి, ఓ అజీం ప్రేమ్ జీ ...____________(మీ పేరు రాసుకోండి) కావచ్చు.

ఈ ఆరు లక్షణాలు మీలో ఎంట్రప్రన్యూర్  ఇప్పటికే అప్పుడప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటాడు - ఎప్పుడు నీ ఆశయాల వైపు వేగంగా , ఖచ్చితంగా అడుగులు వేసేదని?. ఈ అంశాలు సామాన్యులని బిజినెస్ మాస్టర్స్ గా మర్చేవి, ఎందరినో గొప్ప వ్యాపార సామ్రాజ్యాలను సృష్టించేలా చేసిన అంశాలు. ఇవి మీలో ఎంత మేరకు ఉన్నాయో స్వయం విశ్లేషణ చేసుకుని బిజినెస్ దిశలో అడుగులు వేయండి.

8 Characteristics That Fail the Entrepreneur in You (మీలోని ఎంట్రప్రెన్యూ ర్ ని ఓడించే ఆ ఎనిమిది లక్షణాలు)


This articles deals with the eight characteristics that kill the entrepreneur in you.
1. Only dreaming without taking action
2. Inability to learn skills required 
3. Fear of failure
4. Fear of managing and sustaining success
5. Too much focus on perfection
6. Inability to focus on priorities
7. Complaining instead of being accountable and perseverance
8. Lack of taking initiative

మీ ఐడియా ను లాభదాయాక బిజినెస్ లా మార్చుకునే మార్గంలో ఉన్న కొన్ని ప్రాధమికాంశాలను గత నెలలోనేర్చుకున్నాము. అయితే మీకు వచ్చిన ఒక బ్రహ్మాండమైన ఐడియాని బిజినెస్ లా మార్చే సమయంలో మీలోనే ఉండే కొన్ని లక్షణాలు మీ ముందలి కాళ్ళకు బంధాలు వేస్తుంటాయి, మీ ఆశలను ఆవిరి చేస్తుంటాయి మీతో సైకలాజికల్ గేమ్ ఆడే ఆ లక్షణాలను గుర్తించి వాటికి చెక్ పెడితే బిజినెస్ లో విజయం మీదే. అదెలాగో తెలుసుకుందాం రండి.
* * * * * * * * * * * * * * * * * *
1: కలలు కంటూ ఆనందించడం , పనులు చేయక పోవడం ? గొప్ప విజన్ ఉన్న వాళ్ళే, అంత కంటే గొప్ప ఐడియా మీ వద్ద ఉంది. కాని ఆ ఐడియాని నిజం చేసే మార్గంలో చేయాల్సిని కృషి చాల ముఖ్యం కదా ఆట ఆడకుండా ఫలితం ఆశించటం అవివేకం.  ఇలా కేవలం గొప్ప ఐడియాలను సృష్టిస్తూ వాటి గురించి మేధావిగా ముచ్చట్లు పెడితే అవి కేవలం చుట్టుపక్కల వారికి తలనొప్పి ఇస్తుంది కాని ఎవరికీ ఉపయోగం లేదు. ఆ మాటలతో మన గొప్పతనం గురించి డబ్బా కొట్టుకుంటున్నాం అనుకుంటుంది ప్రపంచం. ఎందుకంటే ప్రపంచం మన అర్థవంతమైన ఫలితాలు రూపంలో చూడాలనుకుంటుంది. అందుకే ఐడియా మనిషి కాదు, యాక్షన్ మనిషిగా గుర్తింపు పొందండి. అదేనండి... పనులు నెరవేర్చే మనిషిగా తయారవండి.
2:  బిజినెస్ కి అవసరమైన నైపుణ్యాలు నేర్చుకోలేకపోవడం: కొందరు ఐడియాతో ముందుకొచ్చినంత వేగంగా నిజమైన పనిలోకి ఇష్టపడరు, లేదా చేయరు, బద్ధకం వారిని ఎంజాయ్ చేస్తుంది (వీరు బద్దకాన్ని ఎంజాయ్ చేస్తుంటారు మరి !), ఉత్సాహం కొనసాగించారు. వారిలో శక్తి, ఆసక్తి మెల్లగా తగ్గిపోవటం గమనిస్తాము. అందుకే ఏ ఐడియా, ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నామో  దానిని ముందే ప్రివ్యూ చేసి, అది చేసే వారి వద్ద పరిశీలించడమో, నేరుగా వారితో కొంత కాలం గడిపి “ ఆ పని నేను చేస్తే....  ఈ విధమైన ఛాలెంజ్ / ప్రాజెక్ట్  నాకు వస్తే...” అనే కోణంలో అలోచించుకోగలగాలి. అందుకు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకోవాలి. మారుతున్న ట్రెండ్ ని బట్టి టెక్నాలజీ , స్కిల్ల్స్ నేర్చుకోకపోతే మొద్దుబారిన గొడ్డలితో చెట్టు కొడుతూ నేను చాలా కష్టపడుతున్నా చెట్టే అలా ఉంది అని భ్రమలో బతికే వారిలా తయారవుతాము.  
3:  ఫెయిల్ అవుతామేమో అనే వివేకము లేని భయం:  తెలియని విషయాలమీద, కొత్త విషయాలమీద, ప్రయత్నించే మొదటిసారి/ కొత్తలో సాధారణంగా ఎవరికైనా కాస్త భయం ఉంటుంది. మనిషి బ్రతకడానికి ఇది కొంత కీలకమే. అయితే విజయవంతమైన వ్యాపారులు కొన్ని భయాలను , మానసిక చట్రాల నుంచి ధైర్యంతో ముందుకు వస్తారు. వారు  భయాన్ని, బలహీనతను వదిలి రిస్క్ తీసుకోవటం నేర్చుకోవటంలో ఒక భాగంగా చూస్తారు. కొందరు భయంతో ఉంటారు, ఆలోచనలలోనే ఆగిపోతారు, పనులు మొదలు పెట్టరు.
4:  సక్సెస్ ని మేనేజ్ చేయలేనేమో వంటి అవివేకంతో భయం:  కొందరు తమని తామే తక్కువగా చూసుకుంటారు, కావాలనే సక్సెస్ స్థితిలో కూడా తక్కువ చేసుకుంటూ మళ్ళీ ఈ స్థితి ఎక్కువ కాలం మేనేజ్ చేయలేనేమో అనుకుంటూ ఒక అవివేకంతో భయంలో తమ గురించి తాము చెప్పుకోరు, ఇది కేవలం రేపటి పరిస్థితి నాకు డౌటే అనుకునే మైండ్ సెట్ స్థితి. ఒక బిజినెస్ మాన్ గా సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అనేవి చాలా సాధారణమైన అంశాలు. ఫార్చ్యూన్ 500 సంస్థలే అనేక ఒడిదుడుకులకి లోనైనపుడు స్టార్ట్ అప్, చిన్న సంస్థలు,చిన్న వ్యాపారాలు అనేవి ఎత్తు పల్లాలను చూడడం చాలా సహజం అని నేర్చుకోవాలి. ఒక్కసారి ఒక స్థితికి చేరితే వ్యాపారంలో అలాగే స్థిరమవ్వాలి అనుకోవద్దు, మార్పులను ఆశించిన విధంగా నిర్మాణాత్మకంగా స్వీకరించే విధానాలు, ఆలోచనలు నేర్చుకోవాలి. 
5:  పర్ఫెక్షన్ మీద మాత్రమే దృష్టి పెట్టటం?: మొదటినుంచి మంచి క్వాలిటీ వర్క్ చేయాలి అనే తపన ఉండటం వలన, మిస్టేక్స్ వీలైనంత వరకు చేయకూడదు అనే దృక్పథం వలన చాలా మంది పర్ఫెక్షన్ మీద ఫోకస్ చేస్తారు. బ్రోచర్ డిజైన్  నుంచి టాయిలెట్ పేపర్ కంపెనీ వరకు అన్నీ ఇలానే ఉండాలి అని అతిగా పర్ఫెక్షన్ గురించి ఆలోచిస్తే, అసలు పని అనుకున్న  టైం లో జరగకపోవచ్చు. అందుకే ఉన్నంత లో బెస్ట్ గా ఒక టైం లైన్ లో చేసి, కస్టమర్/ భాగస్వామి వంటి వారి ఫీడ్ బ్యాక్ తీసుకుని ఇంకొంచం బాగా మరో ప్రయత్నంలో చేయగాలిగితే చాలు. బిజినెస్ లో మీ సేవలు లేదా ప్రయత్నాలు రియాలిటీ కి దగ్గరగా ప్రజల అవసరాలను తీర్చగలిగేలా ఉండాలి, మనకి నచ్చింది లేదా మనకి వచ్చింది మాత్రమే కాదు.   
6: ముఖ్యమైన అంశాల మీద దృష్టి సారించాలేకపోవటం: ఒక బిజినెస్ పెట్టిన కొత్తలో లేదా మంచి అనుభవం ఉన్న బిజినెస్ అయినా అనేక కార్యక్రమాలలో రెగ్యులర్ గా చేస్తూ ఒకోసారి ఏది సంస్థకు చాలా ముఖ్యం, అర్జెంటు గా చేయవలసిన వాటిలో ఏది చాలా ముఖ్యం (ఇంపార్టెంట్ ) తెలుసుకుని చేయగలగటం అవసరం. ఈ పని చేయనపుడు ఎదిగే అవకాశం ఉంది కూడా పావురాన్ని తాడుతో చెట్టుకు కట్టేసినట్టు అయిపోతుంది బిజినెస్.  మన వద్ద ఉంది ఎంత మంచి సర్వీస్ లేదా ప్రోడక్ట్ ఐనప్పటికీ చాంతాడంత లిస్టు బిజినెస్ ప్రెజెంటేషన్ లో  పెడితే మీరు ఏది ఎవరికీ ఎప్పుడు ఇవ్వాలో అది ఇవ్వలేరు. నాతో బిజినెస్ డెవలప్మెంట్ సపోర్ట్ తీసుకున్న  ఒక సంస్థ వారి బ్రోచర్(పాంఫ్లెట్) లో 35 కి పైగా ప్రొడక్ట్స్ పెట్టటం మొదటి మీటింగ్ లోనే గమనించాను. వీటిలో ఏది ప్రజల చేత బాగా మంచి పేరు తెచ్చుకుంది అది మాత్రమే ఫోకస్ చేయమని చెప్పినప్పుడు వారికి లోపం అర్థమైంది. ఒక అవసరం ఉన్నప్పుడు కస్టమర్ కి మీరే గుర్తు రావాలంటే మీ బ్రాండ్ దేనిమీద ఫోకస్ చేయాలో, మీ బిజినెస్ దేని మీద దృష్టి పెట్టాలో తెలుసుకోగలగాలి.
7: జవాబుదారీతనం, నిబద్దత బదులు సాకులు చెప్తూ ఉండటం : ఈ ప్రపంచంలో ఒక సాధారణ మనిషికి నుంచి ఎంట్రప్రెన్యూర్ లేదా బిజినెస్ మాన్ వరకు ఉండకూడని అత్యంత భయంకరమైన అవలక్షణం అంటే జవాబుదారీతనం లేకపోవటం. కొందరు వారి తల్లి దండ్రులకి, స్నేహితులకి, వారు పనిచేసే సంస్థలకు, వారు చేసే వ్యాపారంలో భాగాస్వామ్యులకు, చివరికి వారికి వారే జవాబుదారుడిగా ఉండరు. వారి ఏ స్థితిలో ఉన్నా ప్రజలు ప్రస్తుతం వారిని ఎంత అంగీకరించినా, దీర్ఘకాలంలో వారి పేరు, ముద్ర పేకమేడల్లాగా కూలి పోతుంది. అందుకే అన్నారు ఒక మంచి బంధాన్ని నిర్మించుకోడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది, అదే బంధం 30 క్షణాల్లో కూలిపోయే అవకాశం ఉంది అని. ఫోన్ చేసి ఎన్ని గంటలకు వస్తారు అని అడిగితే మనం ఇచ్చే టైం నిజంగా వెళ్ళగలిగే టైం అయితేనే  చెప్పండి. కొందరు ప్రభుద్దులు జీవిత కాలం కూడా ఈ చిన్న విషయం నేర్చుకోరు. ఒక పని కాకపోడానికి, వాస్తవానికి సంబంధం లేని, నిజమైన కారణాలుగా మాస్క్ వేసుకున్న కుంటిసాకులు చాలా చెప్పొచ్చు. మనం ఏది పదే పదే జపిస్తామో దానిలో మాస్టర్  అవుతాము. కుంటిసాకులు ఎక్కువ చెబితే అవి చెప్పటంలో మాస్టర్ అవుతాము. ప్రజలు మిమ్మల్ని , కల్ల బొల్లి మాటల్ని నమ్మారని అనుకుంటారు. కానీ అల చెప్పే వాళ్ళని సిల్లీ గా చూస్తారు. బిజినెస్ లో ఈ లక్షణం అసలు పనికిరాదు. బిజినెస్ లో ఫైయిల్ ఐన వారిలో బాగా కనిపించే లక్షణం ఇదే.
8:  స్వతంత్రంగా మొదలు పెట్టలేకపోవటం : కొందరికి గొప్ప ఆలోచనలు ఉంటాయి కాని, వారు సొంతంగా పని మొదలు పెట్టరు. పక్కన ఎవరో ఒకరు తోడు అవసరం. వీలైనంత త్వరగా టీం జాయిన్ చేసుకుని పని మొదలెట్టాలి లేదా మొదటి అడుగు ఎప్పుడు ఒంటరిదే కదా....మొదలెట్టాలి. బిజినెస్ లో ఉన్న వాళ్ళు ఒకరెవరో వచ్చి చెప్పినదాకా వెయిట్ చేయకూడదు, సొంతంగా మొదలు పెట్టాలి, అర్థం చేసుకోవాలి, రిజల్ట్ గమనించాలి, ఇంకా బాగా ఎలా చేయాలి అని ఆలోచించుకోవాలి, మరింత ఉన్నతంగా తనను తాను లీడ్ చేసుకోవాలి. ఒకో సారి ఫలానా పని ఐనదాకా నా వర్క్ ఆపేస్తాను అని వెయిట్ చేస్తుంటాము. అది కూడా ఒక నెల లేదా రెండు నెలలు వెయిట్ చేసినా జీవితాంతం వేస్ట్ అయ్యేంత చుసుకోవద్దు. ఎందుకంటే సమయం అంటే జీవితం, సమయం వేస్ట్ అయితే జీవితం వేస్ట్ ఐనట్టే. లైఫ్ కైనా, బిజినెస్ కైనా ఇది చాలా ముఖ్య సూత్రం.

ఈ ఎనిమిది సూత్రాలు పాటించండి మీలో ఉన్న ఏ లక్షణాలు మీ బిజినెస్ కి  ఉపయోగపడవో నిశితంగా పరిశీలించుకుని మీ బిజినెస్ సక్సెస్ దారిలో ఆటంకాలను అధిగమించి, ప్రజలకు మీ సర్వీసులు అందించండం ద్వారా బిజినెస్ ఎక్స లెన్స్ సాధించండి.