Sunday 12 March 2017

మిమ్మల్ని ఎంట్ర ప్రెన్యూర్స్ గా మార్చే నాలుగు ఆలోచనలు

ఒక మనిషి ఎంట్రప్రెన్యూర్ కావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఉద్యోగి కావాలా? ఉద్యోగం ఇచ్చే ఎంట్రప్రెన్యూర్ కావాలా? ఒకవేళ ఎంట్రప్రెన్యూర్ కావాలనుకునే వారు ఎందుకు దానిని ఎంచుకుంటారు? డబ్బు, పేరు, స్వేచ్చ, గుర్తింపు, ఆశయం, అభిరుచి...వీటి కోసమే ఎంట్రప్రెన్యూర్ గా తయారయ్యాం అనేవారు కొందరు ఉన్నారు. ఇవేనా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? మనిషిని ఎంట్రప్రెన్యూర్ చేసే అసలు చోదక శక్తులు ఏమిటి?  ఎంట్రప్రెన్యూర్ ఆలోచనలకు అద్దంపట్టే అసలు రహస్యాలు ఏమిటి? ఈ ముఖ్యాంశాలు చర్చించడానికే ఈ నెల మన ప్రత్యేక వ్యాసం.    
***    ***    ***    ***    ***    ***
మన భారత దేశంలో వారానికి ఆరు రోజులు పనిచేసే సంస్థలలో వారానికి 48 గంటలు పనిలోనే ఉంటాం. ఆ సమయాన్ని మనం ప్రేమించే పనిలో గడపొచ్చు లేదా అర్థవంతమైనది కాకపోయినా (ఇష్టం లేకపోయినా) టైం కి డబ్బులు ఇచ్చే పనిలో గడిపేయొచ్చు. కాకపోతే డబ్బు మాత్రమే వస్తే, అది ఇష్టం లేని పని అయితే జీవితంలో కెరీర్ మాత్రమే కాకుండా ఆరోగ్యం, ఆలోచనలు, అన్ని అంశాలపై నెగటివ్ ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి కష్టాలు లేకుండా ఉండాలంటే ప్రేమించే పనిలో మునిగిపోయి సక్సెస్, ఫెయిల్యూర్ స్థాయిలు దాటి జీవితాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఎంట్ర ప్రెన్యూర్ అవ్వాలి. అసలు ఎంట్ర ప్రెన్యూర్ అవ్వాలంటే ఎలాంటి ఉద్దేశ్యాలతో ఆలోచిస్తారు, ఏ కారణాలవలన ఎంట్రప్రెన్యూర్ అవతారం ఎత్తుతారో తెలుసుకుందాం.
1.     ఉద్యోగంలో సృజనాత్మకత వినియోగపడక పోవడం

వీరికి రోజువారి ఉద్యోగంలో అసంతృప్తి ఉంటుంది. వీరు తమ సృజనాత్మకత, టాలెంట్ ఉపయోగపడక పోవటం. వారికి జాబు లో తాను ఫిట్ అవ్వలేదు  అనే ఫీలింగ్ రోజురోజుకి పెరిగిపోతుంది. ఉద్యోగంలో , చేసే పనిలో నిరాశ నిస్పృహలు పెరిగిపోతాయి. ఇలాంటి స్తితిలో మీకు సొంతంగా మీ నైపుణ్యాలు బాగా వినియోగించుకునే ఒక కొత్త వెంచర్ లో అడుగులేయాలని తరచూ ఆలోచన రావటం సహజం. దీనినే ఆపిల్ కంపెనీ సృష్టికర్త  స్టీవ్ జాబ్స్ చాలా బాగా చెప్పారు. ఆయన ఏమన్నారు అంటే  “మీరు ఎదుగుతున్నప్పుడు ప్రపంచం ఇలానే ఉంటుందని చెప్తారు...కానీ ఒక సారి ప్రపంచం అంటే కొందరు మనుషులు మాత్రమే, ఒక్క సారి ప్రపంచాన్ని సృజనాత్మకతతో  మార్చొచ్చు, ప్రభావితం చేయొచ్చు, ఒకసారి మీకు ఈ విషయం అర్థం అయితే  మళ్ళీ మీరు అదే మనిషిగా ఉండరు”.     
2.     ఒక చట్రం వంటి జీవితమంటే ఇష్టం లేకపోవడం  

వీరికి రోజువారి ఉII 9 నుంచి సాII 5 వరకు ఉద్యోగంలో అసంతృప్తి ఉంటుంది.కాబట్టి ఉద్యోగం వదిలేసి ఎంట్రప్రెన్యూర్ అయితే సమయం మన చేతిలో ఉంటుంది అని అంటారు. ఫ్లెక్సిబిలిటీ మనకి అనుకూలంగా ఉంటుంది అని అందరూ అంటారు. వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటాయి. తమ వెంచర్ లో బాగా సక్సెస్ అయినవారు, కావలసినంత మంది సిబ్బంది/ టీం ఉన్నవారు తప్ప కొత్తగా ఒక ఎంట్రప్రెన్యూర్ గా ఎదగాలనుకునే వారు నిరంతరం ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తుంది. కావలసినంత ఖాళీ టైం దొరుకుతుందని,  షార్ట్ కట్ లో డబ్బులు సంపాదించాలని, షార్ట్ కట్ లో జీవించాలని సూడో మెచ్యురిటీతో, భ్రాంతిలో సొంత వ్యాపారం/ స్టార్ట్ అప్ లోకి అడుగులు వేయాలనుకోవడం అవివేకం. అది ఫలితాలను ఇవ్వదు. విత్తనాలు నాటి సేద్యం చేస్తేనే పంట వస్తుంది. అలాగే వ్యాపారం కూడా ఇది ఒక అవసరాలను తీర్చే సేద్యమే.
3.     నిరంతరం కొత్త విధానాలు ప్రయత్నించడం

ఎంట్రప్రెన్యూర్ రొటీన్ ఆలోచనలకూ భిన్నంగా నిరంతరం కొత్త ఉత్పత్తులు, సేవలు, విధానాలు ద్వారా సమాజానికి, వినియోగదారులకి చేరుకోవాలనే ఆలోచనలు (ఐడియా) చేస్తుంటారు. సంప్రదాయాలకు భిన్నంగా ఆలోచిస్తారు. ఒకోసారి వారి ఆలోచనలను ప్రపంచం పిచ్చి అనికూడా అనుకుంటుంది. కొందరు మోఖాన్నే వారిని చూసి  జాలి పడతారు, కొందరు ఎందుకొచ్చిన బాదలు హాయిగా ఉద్యోగం చేసుకోక అని ఉచిత సలహాలు ఇస్తారు. కానీ కొత్త విధానాలను ప్రయత్నించడం ద్వారా వారి సృజనాత్మకతకు, సాహస విధానాలకు, సంప్రదాయాన్ని ప్రశ్నించే వారి ఆలోచనలను వారే టెస్ట్ చేసుకుంటూ మంచి ఫలితాలు వచ్చే వాటిని వినియోగంలోకే వేగంగా తీసుకు రాగలిగే వారే ఎంట్ర ప్రెన్యూర్ గా నిలవగలరు. ఆ ఓపిక మీలో ఉంటే మీరు ఎంట్రప్రెన్యూర్ గా స్టార్ట్ అప్ / బిజినెస్ /  వెంచర్ మొదలు పెట్టొచ్చు. ఎంట్ర ప్రెన్యూర్ షిప్ అంటే జీవితం లో కొన్ని సంవత్సరాలు ఎవ్వరూ బ్రతకని విధంగా పనిచేస్తూ బ్రతకటం, కాబట్టి మిగతా జీవితమంతా అందరూ జీవించలేని ఉన్నత స్థాయిలో జీవించడం.

4.     ప్రపంచాన్ని భిన్నంగా చూడటం  
అందరికీ కడుపులో ఆకలి అవుతుంటే ఏదైనా తినడానికి దొరికితే బాగుండు అని అనుకుంటాం, ఎంట్రప్రెన్యూర్స్ అయితే  ఇక్కడ టిఫిన్ సెంటర్, హోటల్/ రెస్టారెంట్ నడపొచ్చు అని ఆలోచిస్తారు. అందరూ కష్టాలు చూస్తే ఆ కష్టాలు తీరాలంటే మనం ఒక వెంచర్ ఏమి స్టార్ట్ చేయొచ్చు? ఎలా స్టార్ట్ చేయాలి? అని ప్లానింగ్ చేస్తారు ఎంట్ర ప్రెన్యూర్స్. ఐన్ స్టీన్ మహాశయుడు అన్నట్లు “లాజిక్ మిమ్మల్ని A నుంచి B కి తీసుకెళ్తుంది, కానీ ఇమాజినేషన్ ఎక్కడికైనా తీసుకెళుతుంది” అలాగే  ఎంట్ర ప్రెన్యూర్స్ ప్రపంచాన్ని ఎలా ఉందొ అలా మాత్రమే కాకుండా తమ  ఇమాజినేషన్ లోంచి చూస్తారు, అర్థవంతమైన మార్పులు ద్వారా ఉన్నత ప్రపంచం నిర్మించే పని చేస్తారు. వారు కేవలం వారి జీవితాన్నే మార్చుకోవడం కోసం కాదు అంత కంటే పెద్ద ఉద్దేశంతో, ప్రపంచానికి మంచి చేయాలనే భావనలతో పనులు చేస్తారు.  


మీకు కూడా ఈ లక్షణాలు ఉంటే మీలో కూడా ఒక ఎంట్ర ప్రెన్యూర్ ఉన్నారని అర్థం. అయితే ఎంట్ర ప్రెన్యూర్ అవ్వడం, స్టార్ట్అప్ మొదలుపెట్టటం అంటే జీవితంతో ఒక ప్రయోగం చేయటం వంటిది అందుకు మీరు రెడీ అయితే, మీరు ఏదైనా ఒక సమస్యకు ఉన్నత సమాధానం ఇవ్వగలిగితే, మీ వస్తువులు లేదా సేవల ద్వారా ప్రపంచానికి విలువని ఇవ్వగలిగితే ఇంకెందుకు ఆలస్యం మీ ఐడియాతో చెలరేగిపోండి. ఆన్లైన్ , ఇంటర్నెట్ వచ్చిన తర్వాత చాలా విషయాలు ఆన్లైన్ లో నేర్చుకుంటున్నారు. మీరు అడుగులు ముందుకు వేయండి. రిస్క్ తీసుకోవాలని లేదనుకుంటే హాయిగా మీ జాబు మీరు ఎంజాయ్ చేయండి. నిజానికి ఉద్యోగం చేసినా, ఉద్యోగం ఇచ్చే పని చేసినా, ఎంట్ర ప్రెన్యూర్ అయినా , అంతర్గత విలువలకు అనుగుణంగా, తనకు ఉన్న టాలెంట్, ఆలోచనా విధానాలు ఉన్నతంగా వ్యక్తపరిచే పని వాతావరణం సృష్టించుకోగలిగితే యువర్  లైఫ్ ఈజ్  బ్యూటిఫుల్. బెస్ట్ విషెస్ ఫర్ సూపర్ సక్సెస్.
***  ***  ***  సైకాలజీ టుడే, ఫిబ్రవరి 2017 లో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  *** 

మీ బలహీనతలను బలాలుగా మార్చుకునేందుకు సూత్రాలు


మనందరిలో అనేక బలహీనతలు ఉంటాయి. ఒకసారి మనం వాటిని గుర్తిస్తే బయటదడడానికి ప్రయత్నిస్తాం. ఉన్నతంగా మారడానికి ప్రయత్నిస్తాము. కోపం, నిర్మొహమాటం గా మాట్లాడడం నుంచి ‘నో’ చెప్పలేకపోవడం, ఇతరులకు చెప్పిన సమయానికి చేరుకోకపోవడం వరకు అనేక బలహీనతలు మనలో ఉండొచ్చు. అయితే వాటిని ఎలా మార్చుకోవాలి అందుకు పాటించగల సూత్రాలేమిటో చర్చిద్దాం. “తర్వాత చదువుదాం అనుకుంటున్నారా?”.... పనులు వాయిదా వేయటం అనేది ఒక పెద్ద బలహీనత ....అందుకే ఈ క్షణమే చదవండి, బలహీనతలు జయించడానికి కొత్త సంవత్సరం మీ జీవితంలో “ది బెస్ట్ ఇయర్” మలుచుకోడానికి ప్రయత్నాలు మొదలు పెట్టండి. అదెలాగో తెలుసుకుందాం రండి.    
***    ***    ***    ***    ***    ***
మీ జీవితంలో ఉన్న ఏ లక్షణాలకు,  ఏ  గుణాలకు  మీరు సంతోషంగా లేరు? ఈ క్రింద ఇచ్చిన 16 సాధారణ బలహీనతల లిస్టు లో మీలో ఉన్నాయని గట్టిగా భావించే ఎవైనా మూడు లక్షణాలను ఎంపిక చేసుకోండి.
  1. అపసవ్యంగా (Disorganized) – ఒక ప్రణాళికతో, పద్దతిలో సవ్యంగా పనులు చేయకపోవడం   
  2. అననుకూలంగా (Inflexible) – పరిస్థితులకు తగినట్లుగా ఆలోచనలను, నిర్ణయాలను, అలవాట్లను, జీవితాన్ని చూసే/ పనులు చేసే విధానాలను మార్చుకోలేకపోవటం  
  3. మొండిగా ఉండటం (Stubborn) – నేను ఇలానే ఉంటాను; నాకు, ఇతరులకు ఇలా ఉండటం ఉపయోగంగా లేకపోయినా, ఇబ్బందులు ఎదురైనా ఇలాగే ఉంటాను 
  4. అస్థిరంగా ఉండటం/ స్థిరంగా లేకపోవడం (Inconsistent) – స్థిరమైన ఆలోచన, స్థిరమైన నిర్ణయాలు, పనిచేయటం అందుకు జవాబుదారీగా ఉండటం
  5. చెడ్డగా ఉండటం,  ఉండటం (Obnoxious) – ఇతరులకు, తనకు, తన కుటుంబానికి మంచిది కాదు అని తెలిసి కూడా చెడ్డ బుద్దితో కూడిన ఆలోచనలు , నేను ఏమైనా పర్లేదు పక్కవాడు మాత్రం బాగుపడకూడదు వంటి ఆలోచనలు
  6. భావోద్వేగాలు లేనట్లు ఉండటం (Emotionless)
  7. సిగ్గు పడటం, బిడియంగా ఫీల్ అవడం (Shy)
  8. భాద్యతా రాహిత్యం, ఒక వ్యక్తిగా తీసుకోవాల్సిన బాధ్యత తీసుకోకపోవడం Irresponsible
  9. విసుగుతో ఉండటం (Boring)
  10. అవాస్తవ / వాస్తవానికి దూరంగా ఉండటం (Unrealistic)
  11. ప్రతికూల ఆలోచనలు, విధానాలతో ఉండటం(Negative)
  12. భయం వలన ముందుకు వెళ్ళలేకపోవడం (Intimidating)
  13. బలహీనమైన ఆలోచనలు, పనులు, ఫలితాలతో గడపడం (Weak)
  14. దురహంకారం (Arrogant) – ఉన్న పేరునో, వృత్తినో, పదవినో లేదా ఒక స్థితినో చూసుకుని  
  15. నిర్ణయం తీసుకోలేకపోవడం, ద్రుధసంకల్పం లేకపోవడం, అనిశ్చితితో కూడిన విధానాలు (Indecisive)
  16. ఓపిక, ఓర్పు లేకపోవటం, సహనం లేకపోవడం (Impatient)

మీలో మీరు గుర్తించిన ఏవైనా మూడు అంశాలను ఎంచుకున్నారా? అమ్మో....అని గాబరా పడకండి ఈ పెద్ద లిస్టు చూసి, మీకు మూడు కంటే ఎక్కువ అంశాలు బలహీనతలుగా ఉన్నా అప్పుడే కంగారు పడాల్సిన పని ఏమి లేదు. ఈ ఎక్సర్ సైజ్ తర్వాతి స్టెప్స్ లో మీ బలహీనతలు ప్రారదోలదానికి ప్రయత్నిస్తూనే ప్రాసెస్ అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు.
ఇప్పుడు ఈ క్రింది లిస్టు చూడండి, మళ్ళీ మీరు ఎంపికచేసుకున్న  మూడు లక్షణాల దగ్గర ఉన్న విశిష్ట లక్షణాలు (traits) గమనించండి.  

  1. అపసవ్యంగా (Disorganized) –
సృజనాత్మకంగా (క్రియేటివ్)
  1. అననుకూలంగా (Inflexible) –
సవ్యంగా (Organized)
  1. మొండిగా ఉండటం (Stubborn) –
అంకిత భావం (dedicated)
  1. అస్థిరంగా ఉండటం/ స్థిరంగా లేకపోవడం (Inconsistent) –
అనుకూలంగా మరే తత్వం (Flexible)
  1. చెడ్డ తనం (Obnoxious) –
ఉత్సాహభారితమైన (Enthusiastic)
  1. ావోద్వేగాలు లేనట్లు ఉండటం (Emotionless)
నిర్మలమైన (Calm)
  1. సిగ్గు పడటం (Shy)
ప్రతిబింబించే , ప్రతిస్పందించే (Reflective)
  1. భాద్యతా రాహిత్యం(Irresponsible)
సాహసోపేతమైన (Adventurous)
  1. విసుగుతో ఉండటం (Boring)
భాద్యతాయుతమైన (Responsible)
  1. అవాస్తవ ఉండటం (Unrealistic)
అనుకూల వైఖరి (పాజిటివ్)
  1. ప్రతికూల ఆలోచనలు(Negative)
వాస్తవంగా ఆలోచించే తత్వం (Realistic)
  1. భయం వలన ఆగిపోవడం (Intimidating)
దృఢమైన, మొహమాటం లేని (assertive)
  1. బలహీనమైన ఆలోచన (Weak)
వినయతతో కూడిన (Humble)
  1. దురహంకారం (Arrogant) –
ఆత్మ విశ్వాసం (self confidence)
  1. నిర్ణయం తీసుకోలేకపోవడం (Indecisive)
ఓపికతో కూడిన (Patient)
  1. ఓపిక, ఓర్పు లేకపోవటం, (Impatient)
గట్టి అభిరుచి, మక్కువ (passionate)

పై టేబుల్ లో వివరించినట్లు మీరు బలహీనత అనుకున్న మూడు అంశాలకు కుడి వైపు ఉన్నవే మీ బలాలు. ఒకోసారి పరిస్థితిని బట్టి బలాలా బలహీనతలా అనేది సమీకరణాలు మారిపోతాయి. అందుకే ఇవన్నీ ఏ ఫ్రేమ్ వర్క్ , ఏ స్థితిలో , ఏ కాంటెక్స్ట్ లో ఉన్నామన్న దానిపై, ఎంత మోతాదులో మీరు ఆశించిన ఫలితాలు లేదా ఎంత ఆనందంగా ఉన్నారు అన్నదానిపై ఆధారిపడి ఉంటుంది.
మీ పనిలో, వ్యక్తి గత జీవితంలో, సమాజంలో వేర్వేరు పరిస్థితిలలో మీ గుణాలు, లక్షణాలు మీకు బలహీనతలుగా , మీ ఎదుగుదలకు అడ్డంకులుగా ఉంటే ....ఆ అంశాలే చూపిస్తున్న మీ బలాలు ఏమిటో గుర్తించారు. ఈ బలాలను దృష్టిలో ఉంచుకుని మీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళే ఒక నిర్మాణాత్మక అవగాహన , ఆచరణ ఈ కొత్త సంవత్సరంలో ప్లాన్ చేసుకోండి. బలహీనతలు ఉండటం తప్పు కాదు, వాటిలో నర్మగర్భంగా ఉన్న అసలు పాజిటివ్ ఎక్స్ ప్రెషన్ గుర్తించి వాటిని ప్రాదాన్యాలుగా కార్యక్రమాలు చేయలేక పోవటమే ఫెయిల్యూర్ కి కారణం.
బలహీనతలను  జీవితాన్ని నేర్పే గురువులు మార్చుకోండి: అవును . మీరు ఎక్కడ ఆగిపోతారు అంటే కెరీర్ లో అయితే మీ నైపుణ్యాలు ఆగిన దగ్గర అయిపోతారు. మరి డబ్బు, ఆరోగ్యం, పెద్ద కలలు నిజం చేసుకోవడం ...ఇలా ఏ అంశం గమనించినా మనిషి కేవలం తను సృష్టించుకున్న బలహీనత దగ్గర అది అందిస్తున్న పాజిటివ్ హింట్  అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవడం వద్ద ఆగిపోతాడు. ఆ స్థితి మీకు రాకూడదంటే ఒక పని మీకు అవసరం ఉన్నా చేయలేకపోతున్నమంటే, ఒక విధానం జీవితాన్ని ఉన్నతంగా మార్చుతుందని తెలిసినా అమలు చేయలేక పోతున్నామంటే అది బలహీనత  అని. అది మీ కంఫర్ట్ జోన్ ని సవాల్ చేస్తుందని , దానిని చేయటం ద్వారా మీరు గొప్ప పాఠాలు నేర్చుకోగాలరని నమాలి. 
ఇలా చేసి చూడండి:

  1. మీ బలహీనతలను అంగీకరించండి. మనస్పూర్తిగా. అవి ఇస్తున్న పాజిటివ్ హింట్ గమనించండి
  2. మీ బలాలను ఒక లిస్టు గా రాయండి, మీ బలాలతో మీరు చేయగల పనులు రాయండి.
  3. మీ గొప్ప నైపుణ్యాలు రాయండి , వాటి ద్వారా చేయగల కార్యక్రమాలు రాయండి
  4. మీ బలాల ద్వారా మీ బలహీనతల ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవచ్చు ఆలోచించండి
  5. నమ్మకమైన  కోచ్, ట్రైనర్, స్నేహితులు మీ బలహీనతల నుంచి బయటపడటం కోసం మీరు జవాబుదారీగా (accountable) గా ఉండమని అడగండి
  6. ప్రణాళికతో ఉండటం ద్వారా మీ లక్ష్యాలు, ప్రాధాన్యాలు పై ధ్యాస ఉంచి, ఆ ఫలితాల కోసం ఏమి చేయాలో అదే చేయగలరు, అందుకు కావాల్సినవి నేర్చుకోగలరు, అప్పుడు బలహీనత గురించి ఆలోచించే సమయం లేనంతగా బిజీ అవుతారు
  7. మీకు లేని నైపుణ్యాలు నేర్చుకునేందుకు సమయం కేటాయించండి, ఉన్న స్థితి నుంచి మరో స్థితికి వెళ్ళాలంటే విజన్, స్కిల్ రెండూ ఉండాలి వాటిపై దృష్టిపెట్టండి.
  8. అదే బలహీనత ఉన్న ఇతరులకు కూడా అందులోంచి బయటపడడానికి సహాయం చేయండి  
  9. సిగ్గు పడాల్సిన పని లేకుండా నిర్మొహమాటంగా ఫీడ్ బ్యాక్ తీసుకోండి , మీరు ఏం ఫ్రేమ్ వర్క్స్ ఉచ్చులో పడుతున్నారో తెలుసుకోండి.
  10. ఇతరులు మీలో కొన్ని విషయాల గురించి జోక్స్ వేస్తున్నారంటే వారు అలా సరదాగా మాట్లాడుతూ మీ నుంచి ఆశిస్తున్న మార్పు  కోరుతున్నారేమో గమనించండి.
  11. ప్రతిఒక్క విషయాన్ని మార్చాలని చూడకండి, ప్రయత్నం మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, ఉన్నత ఫలితం అవ్వాలి. ఒక మొండి ప్రయత్నం , తలనొప్పి కాకూడదు.
అల్లావుద్దీన్ అద్భుత దీపం లో మొదట వచ్చేది రాక్షసి అయినా మన కోరికలను నిజం చేసే రాక్షసి మంచిదే కదా అలాగే మీ బలహీనత ఒక బలంగా మారి జీవితాన్ని ఉన్నతంగా రూపొందించుకునేందుకు ఒక మెట్టుగా ఉపయోగపడాలని ఆశించండి. 
***  ***  ***  సైకాలజీ టుడే, జనవరి 2017 లో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  ***

ఈ 3 అంశాలు తెలిస్తే ఎంట్ర ప్రెన్యూర్ గానే కాదు ఫ్యామిలీ లో కూడా మీదే సక్సెస్ [ 3 Things for Success in Entrepreneurship and Life ]

డబ్బు సంపాదించడానికి,  తన కాళ్ళ మీద తాను నిలవడానికి, స్వేచ్చగా పనిచేసుకోడానికి, ఆశించిన కలలు నిజం చేసుకోడానికి, చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి సొంత వెంచర్ ప్రారంభించడానికి ఇలా ఏ కారణం చేత ఎంట్రప్రెన్యూర్ గా మారినా ఒక విజయవంత మైన ఎంట్రప్రెన్యూర్ వ్యక్తిగత జీవితం కూడా ఉన్నతంగా ఉండాలంటే స్టార్ట్ అప్ , బిజినెస్ సక్సెస్ చేసే వ్యక్తి ఫ్యామిలీ లో సక్సెస్ అవ్వాలంటే ఎలా ఉండాలి? ఏమి చేయాలి? ఈ ముఖ్యాంశాలు చర్చించడానికే ఈ ఆర్టికల్.    
***    ***    ***    ***    ***    ***
ఎంట్రప్రెన్యూర్ గా సక్సెస్ అవ్వడానికి మాత్రమే కాదు వ్యక్తిగత జీవితంలోనూ ఒక మంచి భర్తగా, స్నేహితులుగా, కొడుకుగా, సమాజంలో ఉన్నత వ్యక్తిగా మనిషి తనను తాను నిర్మించుకోవాలంటే మనకు ఈ లక్షణాలు ఎంతగానో ఉపయోగపడతాయి.  ఎంట్రప్రెన్యూర్  గా విజయానికి, కుటుంబ విజయానికి  అవే లక్షణాలు ఎలా ఉపయోగపతాయో గమనించండి.  
1. అంతర్ముఖంగా నడిపించుకోండి:

విజయవంతమైన వ్యాపారులు అధికంగా అంతర్ముఖంగా, సెల్ఫ్ డ్రైవ్ తో, తనని తాను ముందుకు నడిపించుకునే ఒక లక్షణం కలిగి ఉంటారు. తెలియని విషయాలు అడిగి , చదివి నేర్చుకునే లక్షణం, చేయలేని అంశాలను ప్రయత్నించి నేర్చుకునే తత్వం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోడానికి సమయం కేటాయించే లక్షణం ఉంటుంది. ఇవి మీరు ఎంచుకున్న వ్యాపారానికే కాదు మీరు ఉద్యోగులైనా కానీ జీవితానికి ఎప్పుడూ ఒకే విధమైన మూస పద్దతిలో కాకుండా కొత్తదనంతో ముందుకు తీసుకెళ్ళాలి అనే తపనను రేకెత్తిస్తుంది. ఎదో సాధించాలన్న తపన నిరంతరం మెదులుతూ మీలోనే ఒక అగ్నిలా రగులుతుంటే కొన్ని ప్రయత్నాలు మొదలెడతారు. ఆ సమయంలో పర్సనల్/ లైఫ్ కోచింగ్, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, శిక్షణా కార్యక్రమాలు, విజయం సాధించిన వారితో సంభాషణలు ఉన్నత దిశా నిర్దేశం చేసుకునే సహాయం ఇస్తాయి. మన బండిలో పెట్రోల్ రెడీగా ఉంటే, గమ్యం ఏటో తెలిస్తే బండిని అటు దిశగా పంపించటం ఈజీ, మిమ్మల్ని మీరు నడిపించుకునే లక్షణం అలాంటిదే. మీలో ఉండే ఎదో చేయాలి, ఎదో సాధించాలి అనే “అంతర్గత దిశానిర్దేశం” వలన, తపన వలన మీకు ఒక ఉన్నత మార్పు కావాలన్న ఆలోచన వస్తుంది. ఆ బర్నింగ్ మీలో ఉంటే, త్వరగా ఆ ఎనర్జీ కి ఒక లక్ష్యం ఇవ్వండి, ఆ దిశలో అడుగులు వేయండి. కుటుంబాలలో పెద్దలకి ఈ లక్షణం ఉంటే కుటుంబ సభ్యులు అందరూ ఎదో సాధించాలి అనే తపన పెంచుకుంటారు.    

2. భావోద్వేగాల నియంత్రణ ఎలానో పాటించి చూపండి   

బిజినెస్, ఇల్లు, సమాజం....ఎక్కడైనా మనిషికి భావోద్వేగాలపై ఉన్నత భావంతో కూడిన నియంత్రణ అవసరం. ‘కర్మరా బాబు కస్టమర్ తో ఏమి వాదించలేము’ అనుకోవటం వేరు. ‘కస్టమర్ గా తన అనుమానాలు తను అడుగుతున్నారు, నేను స్పష్టంగా అర్థం చేసుకుని నివృత్తి చేయాలి’ అనుకోవటం వేరు. సూపర్ సక్సెస్ అయిన వ్యాపార నిర్మాతలను చూడండి వాళ్ళు చాలా కూల్ గా, ప్రసన్న వదనంతో ఉంటారు. మనం ఒకోసారి చిన్న చిన్న వ్యాపారాలు, ఉద్యోగాలు చేసే వారిని  కూడా కంగారుగా, నిర్లిప్తంగా, ఆపుకోలేనంత చిరాకు పరాకులతో చిన్న విషయాలకే వర్రీ అవ్వటం వారి చిరాకు ఇతరుల మీద చూపించటం చూస్తుంటాము. గొప్ప వ్యాపారం నిర్మించాలన్నా గొప్ప కుటుంబం నిర్మించాలాన్నా ఓపిక అవసరం, కళ్ళ ముందు జరుగుతున్నది, మనకి వినిపించే ఇతరుల మాటలు మాత్రమే కాకుండా వాటి స్థాయిని దాటి పరిస్థితులను అర్థం చేసుకోవటం, నెగటివ్ గా అపార్థం చేసుకోకుండా ముందుకు వెళ్ళటం అవసరం. విజేతలైన  ఎంట్రప్రెన్యూర్స్ కి అనుభవం, మెచ్యురిటీ వలన ఓపిక ఉంటుంది, ఎక్కడ ఎమోషన్స్ ఎంత స్థాయిలో వాడాలో బాగా తెలిసి ఉంటారు , సరైన సమయంలో స్థిమితంగా నిర్ణయాలు తీసుకోగలరు.  గెలుపుకోసం వ్యాపారం అయినా , ఇల్లు అయినా ఒకోసారి ఏమి చేయకుండా పనులను విజయవంతంగా ముందుకు నడిపించాలో తెలుసుకోవాలి. కోపం, ఆవేశం, అనుమానం స్థానం లో అర్థం చేసుకోవటం, ఇవ్వటం, ప్రేమపూర్వక వాతావరణం సృష్టించడం ద్వారా ఎక్కువ సాధించవచ్చు. 
3. స్థిత ప్రజ్ఞత , ఫ్లెక్సిబిలిటీ ఆయుధాలైతే మీరే విజేతలు  

ఆయుధాలంటే  బాహుబలి సినిమాలో కట్టప్ప చేతిలో కత్తులు కాదు కానీ మనల్ని ఒక వ్యాపారిగానే కాకుండా వ్యక్తిగా బలవంతులను చేసే కీలక అంశాలు. పరిస్థితులకు తగినట్లు , ఫ్లెక్సిబుల్ గా ఉండటం. ‘నేను ఇలానే ఉంటాను’, ‘నేను అనుకున్నట్లే నాకు వ్యాపారం రావాలి’, ‘ఇలా ఉంటేనే కస్టమర్స్ తో డీల్ చేస్తాను’ వంటి ఆలోచనా విధానాలతో మీరు ఒక ఫ్రేమ్ (మూస) తయారు చేసుకుని ఇతరులను ఆ చట్రంలో , ఆ పరిధిలో ఆలోచించు, పనిచెయ్యి అని స్థితిని వదిలేసి పనిచేయగాలగాలి. స్వేచ్చగా ఆలోచించాలి, ఓపెన్ మైండ్ తో ముందుకెళ్లాలి, ఇతరులను వినాలి, వారు చెప్పే అంశాలు, చెప్పని అంశాలు / ఫీలింగ్స్ అర్థం చేసుకోగలగాలి. మీరు ఆశించిన ఫలితం రాకపోతే, అది ఉన్నత మైన దైతే ఎలా చేస్తే వస్తుంది అని ఆలోచిస్తూ నిన్నటికంటే ఉన్నతంగా ప్రయత్నించడం అవసరం, అదే ఫ్లెక్సిబిలిటీ. ఈ లక్షణాలు వ్యాపారంలో కస్టమర్స్ తో, ఇతర పోటీదారులతో ఎంత అవసరమో మీ కుటుంబ సభ్యులతో కూడా అంతే అవసరం. అప్పుడే తరచూ మన వెర్షన్ మాత్రమే వినిపిస్తూ మార్పు ఆశించడం కాకుండా కుటుంబ సభ్యుల అవసరాలను కూడా అర్థం చేసుకోగలం, చెప్పకపోయినా. ఈ మూడు స్టెప్స్ అర్థం చేసుకుంటే బిజినెస్ లో అయినా, ఫ్యామిలీ లో అయినా మీరెలా ఉండాలో తెలుస్తుంది, ఇంకా అనుమానాలు ఉంటే ఈ బ్లాగ్ లో ఇతర ఆర్టికల్స్ కూడా చదవండి.  మీ ఎంట్ర ప్రెన్యూర్ జర్నీ లో ఫ్యామిలీ లైఫ్ మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేయండి J

***  ***  ***  సైకాలజీ టుడే, డిసెంబర్ 2016 లో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  ***

ఎంట్ర ప్రెన్యూర్ కలలు నిజం చేసుకోడానికి 3 సూత్రాలు [3 Principles to realize your entrepreneur dream]


  1. Clarity on what you want to work on - your passionate venture? or market demanded?
  2. Preview your business as if it is being implemented
  3. Who is influenced and what is the risk involved? Take feedback.
రోజువారీ జీవితాన్ని, ఉద్యోగాన్ని వదిలి ఎంట్ర ప్రెన్యూర్ గా మీ కలలను నిజం చేసుకోవాలంటే అందుకు మీ ఆలోచన , ఆచరణ ఎలా ఉండాలి? సక్సెస్ ఫుల్ గా బిజినెస్ చేస్తున్న వారు దేనిని ఆశించి చేస్తారు? జీతానికి పనిచేయాలా, మనమే ఉద్యోగాలు ఇవ్వాలా? అల చేయాలంటే అంత ఈజీ నా? అసలు ఎంట్ర ప్రెన్యూర్ గా ఎదగాలంటే సామాన్యులకి సాధ్యమా? అందుకు తీసుకోవలసిన స్టెప్స్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ ఆర్టికల్.    
***    ***    ***    ***    ***    ***

1. స్పష్టమైన లక్ష్యం – ప్రేమించే పనా? మార్కెట్ అవసరమా?
ఇష్టమైన దైతే కష్టమవదు అంటారు పెద్దలు.
నీ పనుల వలన మార్కెట్ ప్లేస్ లో ఏం విలువైన పనులు చేస్తావో ఆలోచించుకో మంటారు ఎంట్ర ప్రెన్యూర్ మెంటార్స్. 
మరి ఈ రెండు సూత్రాలలో ఏది పాటిస్తారు? మీరు ఇష్టమైన పని చేస్తూ అనుకున్న సక్సెస్ సాధించేవరకూ ప్రయత్నిస్తారా? మార్కెట్ లో డబ్బులు వచ్చే ప్రోడక్ట్, సేవలు ఇవ్వడానికి రెడీ ఐపోతారా? లేదా మార్కెట్ కి మీరు ఎంచుకున్న రంగంలో ఎలా భిన్నంగా ప్రజల అవసరాలు తీర్చే సేవలు. వస్తువులు అందించాలని ఆలోచిస్తారా? కేవలం డబ్బు వస్తుంది అని మాత్రమే పని చేస్తే డబ్బు రావడం కష్టమే , మీరు అందించే సేవలు , ప్రొడక్ట్స్ సృష్టించడం మీకు ఒక “నమ్మకంతో కూడిన అభిరుచి” (Passion with faith) అయితే సక్సెస్ మీదే అంటారు సీనియర్  ఎంట్ర ప్రన్యూర్స్.   
మీరు జీవన విధాన వ్యాపారం (లైఫ్ స్టైల్ బిజినెస్) చేయాలనుకుంటున్నారా? విస్తరింపజేసే వ్యాపారం (గ్రోత్ బిజినెస్) చేయాలనుకుంటున్నారా? లైఫ్ స్టైల్ బిజినెస్ లో మీకు ప్రతి నేలా ఒక నిర్దుష్టమైన ఆదాయం వస్తుంది, కాలావంటే కొందరికి ఉద్యోగం ఇచ్చి చేయించుకుంటారు. వ్యాపారాని అనేక ప్రదేశాలకు, అనేక ప్రొడక్ట్స్ గా విస్తరింప జేయాలన్న ఆలోచన ఉండదు. విస్తరణ చేయాలన్న వ్యాపారంలో ఉండాలంటే దీనికి భిన్నంగా మీ ఆలోచనలు అనేక ప్రదేశాలలో, అనేక ప్రొడక్ట్స్ తో, వీలైన భిన్న విధానాలలో మీ వ్యాపారం  వేగంగా విస్తరింపజేయలన్న ఆలోచన ఉంటుంది. మీకు ఎలాంటి వ్యాపారం కావాలి? సక్సెస్ అంటే మీ దృష్టిలో ఏమిటి? ఈ ప్రశ్నలకు జవాబులు ఎంత స్పష్టంగా ఉంటే అంత ఉన్నతంగా మీ భవిష్యత్తును నిర్మించుకోవచ్చు.
2. మీ బిజినెస్ ప్రీ వ్యూ చూడండి

అవును. మీ బిజినెస్ ఏమిటి? అందులో భాగంగా మీరు ఏమేమి చేస్తుంటారు? మీ రోజు ఎలా మొదలౌతుంది, ఎవరిని కలుస్తారు, ఎవరితో ఫోన్ కాల్స్ మాట్లాడతారు, మీ కస్టమర్స్ ఎవరు, వారి అవసరాలు ఏమిటి, అందుకు వారు ప్రస్తుతం ఎవరి దగ్గరకు వెళుతున్నారు? ఇలా మీ రోజు వారి బిజినెస్ జీవితం ముందుగానే ఎలా ఉండబోతోంది మైండ్ థియేటర్ లో చూడండి అనుభవించండి. ఇది అంత ఈజీ కాదు. కస్టమర్స్ అవసరాలను మనం ఊహించుకున్నవే లేకపోయి ఉండొచ్చు అవసరం ఉన్నా అందుకు డబ్బు పెట్టి మరి సర్వీస్ పొందే అలవాటు ఉండకపోవచ్చు. ఉదాహరణకు 2001 లో ఇంటర్, డిగ్రీ కళాశాలలో ఒక ఫ్రీ డెమో, ఆ తర్వాత మూడు రోజుల పాటు స్టూడెంట్ కి కేవలం రూ30 ఫీజు తో వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించే వాళ్ళం. ఆ రోజుల్లో చాలా బాగా సక్సెస్ అయ్యాయి. ఆ తర్వాత పదేళ్లకు హైదరాబాద్ లో పెద్ద స్కూల్స్ లో ఫుల్ డే ప్రోగ్రాం పెడితే మాకు ఎంత ఇస్తారు అని అడగటం విచిత్రంగా అనిపించింది. పాత శాలలు , కళాశాలలు ప్రొఫెషనల్ ట్రైనింగ్ అవసరంగుర్తించి వారి టీచర్స్ కు, స్టూడెంట్స్ శిక్షణ ఇప్పిస్తారు అనేది డబ్బుకు కూడా ముడి పది ఉంది. అందరూ కాకపోవచ్చు కాని కొందరు. అలాంటి సమయంలో ఇప్పుడు అటు పిల్లలకు, ఇటు ఇన్స్టిట్యూట్ వారికి, మరియు శిక్షణా సంస్థగా మాకు ఉపయోగ పడేలా సబ్జెక్టు లో రాజీ లేకుండా ఏమి చేయోచ్చు అని అలోచించి ప్రోగ్రామ్స్ తయారు చేసాము. ఈ పని చేయడానికి మూడేళ్ళు పట్టింది. అంటే ఆ పరిస్థితిని ముందుగానే అంచనా వేసి ఉంటే ఇంకా ఉన్నత ప్రణాళికతో మొదలెట్టే వాళ్ళం. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు అనుకుంటున్నా వ్యాపారం మార్కెట్ రీసెర్చ్ పక్కాగా చేయండి. ఇదేదో MBA కోర్స్ పదం కాదు, సింపుల్ మీరు చేయాలనుకునే వ్యాపారం ఏమిటి? ఏం ప్రాబ్లం కి సోలుషన్స్ ఇస్తుంది? ఆ ప్రాబ్లం ఉన్న వారు ఎవరు? అవసరం ఎవరికిఉంది? వారు మీరిచ్చే ప్రోడక్ట్, సేవలకు ఎంత డబ్బు ఇస్తారు? మీరు భిన్నంగా అద్భుతంగా సర్వీస్ ఎలా ఇవ్వగలరు? ఇలా కీలక ప్రశ్నలకు సమాధానాలు వెతకండి?  ఇలా క్లారిటీ లేకపోతే CEO అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని మీరు బిజినెస్ మొదలు పెడతారు , చివరకు చీఫ్ ఎవిరీ థింగ్ ఆఫీసర్ అయ్యనేంటి అని ఆశ్చర్య పోతారు. ఎందుకంటే సొంత బిజినెస్ లో పరిస్థితిని బట్టి టేబుల్ క్లీనింగ్ నుంచి, కాఫీ పెట్టుకోటం వరకు, క్లైంట్ మీటింగ్ నుంచి అకౌంట్స్ వరకు అన్నీ చూసుకోవాలి సొంతంగా, ఒంటరిగా.       
3. ఎవరు ప్రభావితం ఔతున్నారు, రిస్క్ ఏమిటి? 

మీరు ఉద్యోగం వదిలి, లేదా చేస్తున్న పని కాదనుకుని కొత్త వ్యాపారంలోకి వెళుతుంటే పై రెండు స్టెప్స్ తప్పక పాటించడం మంచిది. వ్యాపారానికి రిస్క్ తీసుకునే, దూకుడు మనస్తత్వం అవసరమే కాని వ్యాపారంలోకి గుడ్డిగా దూకేయకూడదు. అర్థం కాకపోతే మళ్ళీ చదవండి. రిస్క్ తీసుకునే లక్షణం ఉండాలి. నిజానికి వ్యాపారం = రిస్క్. మీరు ఎంత రిస్క్ కి రెడీ గా ఉంటారో, రిస్క్ ని తట్టుకునే శక్తి మీలో ఎంత ఉంటుందో అందుకు తగ్గట్టుగానే బిజినెస్ నడుస్తుంది. ఏ రిస్క్ లేకపోతే అందరూ వ్యాపారాలే చేస్తుండే వారు. అందుకే మీ బిజినెస్ నిర్ణయం గురించి అందువలన ప్రభావితం అయ్యేవారికి స్పష్టంగా చెప్పండి. మీ లైఫ్ పార్టనర్, మీ తల్లిదండ్రులు, పిల్లలు వీరికి మీ వర్క్ గురించి చెప్తే మీకు వాళ్ళు ఉపయోగపడే , మీ క్షేమం కోరే సలహాలు ఇస్తారు. ఇంకా చెప్పాలంటే ఆడవారు , మగవారు ఒక అంశం మీద భిన్న మైన దృక్కోణాలు మాట్లాడుకోవచ్చ్చు . ఒక నిర్దిష్టమైన ఐడియా కి  రూపం ఇచ్చేముందు ఇద్దరి వైపు నుండి ఫీడ్ బ్యాక్ తీసుకోండి. ఈ మూడు స్టెప్స్ చేయండి, మీ బిజినెస్ లో మీరేం చేయాలో ఒక స్పష్టత వస్తుంది, ఆ స్పష్టత లోంచి ఆ ఒక అడుగు ముందుకేయండి మీ ఎంట్ర ప్రెన్యూర్ జర్నీ స్టార్ట్ చేయండి J

***  ***  ***  సైకాలజీ టుడే, నవంబర్  2016 లో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  ***