Sunday 12 March 2017

ఎంట్ర ప్రెన్యూర్ కలలు నిజం చేసుకోడానికి 3 సూత్రాలు [3 Principles to realize your entrepreneur dream]


  1. Clarity on what you want to work on - your passionate venture? or market demanded?
  2. Preview your business as if it is being implemented
  3. Who is influenced and what is the risk involved? Take feedback.
రోజువారీ జీవితాన్ని, ఉద్యోగాన్ని వదిలి ఎంట్ర ప్రెన్యూర్ గా మీ కలలను నిజం చేసుకోవాలంటే అందుకు మీ ఆలోచన , ఆచరణ ఎలా ఉండాలి? సక్సెస్ ఫుల్ గా బిజినెస్ చేస్తున్న వారు దేనిని ఆశించి చేస్తారు? జీతానికి పనిచేయాలా, మనమే ఉద్యోగాలు ఇవ్వాలా? అల చేయాలంటే అంత ఈజీ నా? అసలు ఎంట్ర ప్రెన్యూర్ గా ఎదగాలంటే సామాన్యులకి సాధ్యమా? అందుకు తీసుకోవలసిన స్టెప్స్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ ఆర్టికల్.    
***    ***    ***    ***    ***    ***

1. స్పష్టమైన లక్ష్యం – ప్రేమించే పనా? మార్కెట్ అవసరమా?
ఇష్టమైన దైతే కష్టమవదు అంటారు పెద్దలు.
నీ పనుల వలన మార్కెట్ ప్లేస్ లో ఏం విలువైన పనులు చేస్తావో ఆలోచించుకో మంటారు ఎంట్ర ప్రెన్యూర్ మెంటార్స్. 
మరి ఈ రెండు సూత్రాలలో ఏది పాటిస్తారు? మీరు ఇష్టమైన పని చేస్తూ అనుకున్న సక్సెస్ సాధించేవరకూ ప్రయత్నిస్తారా? మార్కెట్ లో డబ్బులు వచ్చే ప్రోడక్ట్, సేవలు ఇవ్వడానికి రెడీ ఐపోతారా? లేదా మార్కెట్ కి మీరు ఎంచుకున్న రంగంలో ఎలా భిన్నంగా ప్రజల అవసరాలు తీర్చే సేవలు. వస్తువులు అందించాలని ఆలోచిస్తారా? కేవలం డబ్బు వస్తుంది అని మాత్రమే పని చేస్తే డబ్బు రావడం కష్టమే , మీరు అందించే సేవలు , ప్రొడక్ట్స్ సృష్టించడం మీకు ఒక “నమ్మకంతో కూడిన అభిరుచి” (Passion with faith) అయితే సక్సెస్ మీదే అంటారు సీనియర్  ఎంట్ర ప్రన్యూర్స్.   
మీరు జీవన విధాన వ్యాపారం (లైఫ్ స్టైల్ బిజినెస్) చేయాలనుకుంటున్నారా? విస్తరింపజేసే వ్యాపారం (గ్రోత్ బిజినెస్) చేయాలనుకుంటున్నారా? లైఫ్ స్టైల్ బిజినెస్ లో మీకు ప్రతి నేలా ఒక నిర్దుష్టమైన ఆదాయం వస్తుంది, కాలావంటే కొందరికి ఉద్యోగం ఇచ్చి చేయించుకుంటారు. వ్యాపారాని అనేక ప్రదేశాలకు, అనేక ప్రొడక్ట్స్ గా విస్తరింప జేయాలన్న ఆలోచన ఉండదు. విస్తరణ చేయాలన్న వ్యాపారంలో ఉండాలంటే దీనికి భిన్నంగా మీ ఆలోచనలు అనేక ప్రదేశాలలో, అనేక ప్రొడక్ట్స్ తో, వీలైన భిన్న విధానాలలో మీ వ్యాపారం  వేగంగా విస్తరింపజేయలన్న ఆలోచన ఉంటుంది. మీకు ఎలాంటి వ్యాపారం కావాలి? సక్సెస్ అంటే మీ దృష్టిలో ఏమిటి? ఈ ప్రశ్నలకు జవాబులు ఎంత స్పష్టంగా ఉంటే అంత ఉన్నతంగా మీ భవిష్యత్తును నిర్మించుకోవచ్చు.
2. మీ బిజినెస్ ప్రీ వ్యూ చూడండి

అవును. మీ బిజినెస్ ఏమిటి? అందులో భాగంగా మీరు ఏమేమి చేస్తుంటారు? మీ రోజు ఎలా మొదలౌతుంది, ఎవరిని కలుస్తారు, ఎవరితో ఫోన్ కాల్స్ మాట్లాడతారు, మీ కస్టమర్స్ ఎవరు, వారి అవసరాలు ఏమిటి, అందుకు వారు ప్రస్తుతం ఎవరి దగ్గరకు వెళుతున్నారు? ఇలా మీ రోజు వారి బిజినెస్ జీవితం ముందుగానే ఎలా ఉండబోతోంది మైండ్ థియేటర్ లో చూడండి అనుభవించండి. ఇది అంత ఈజీ కాదు. కస్టమర్స్ అవసరాలను మనం ఊహించుకున్నవే లేకపోయి ఉండొచ్చు అవసరం ఉన్నా అందుకు డబ్బు పెట్టి మరి సర్వీస్ పొందే అలవాటు ఉండకపోవచ్చు. ఉదాహరణకు 2001 లో ఇంటర్, డిగ్రీ కళాశాలలో ఒక ఫ్రీ డెమో, ఆ తర్వాత మూడు రోజుల పాటు స్టూడెంట్ కి కేవలం రూ30 ఫీజు తో వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించే వాళ్ళం. ఆ రోజుల్లో చాలా బాగా సక్సెస్ అయ్యాయి. ఆ తర్వాత పదేళ్లకు హైదరాబాద్ లో పెద్ద స్కూల్స్ లో ఫుల్ డే ప్రోగ్రాం పెడితే మాకు ఎంత ఇస్తారు అని అడగటం విచిత్రంగా అనిపించింది. పాత శాలలు , కళాశాలలు ప్రొఫెషనల్ ట్రైనింగ్ అవసరంగుర్తించి వారి టీచర్స్ కు, స్టూడెంట్స్ శిక్షణ ఇప్పిస్తారు అనేది డబ్బుకు కూడా ముడి పది ఉంది. అందరూ కాకపోవచ్చు కాని కొందరు. అలాంటి సమయంలో ఇప్పుడు అటు పిల్లలకు, ఇటు ఇన్స్టిట్యూట్ వారికి, మరియు శిక్షణా సంస్థగా మాకు ఉపయోగ పడేలా సబ్జెక్టు లో రాజీ లేకుండా ఏమి చేయోచ్చు అని అలోచించి ప్రోగ్రామ్స్ తయారు చేసాము. ఈ పని చేయడానికి మూడేళ్ళు పట్టింది. అంటే ఆ పరిస్థితిని ముందుగానే అంచనా వేసి ఉంటే ఇంకా ఉన్నత ప్రణాళికతో మొదలెట్టే వాళ్ళం. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు అనుకుంటున్నా వ్యాపారం మార్కెట్ రీసెర్చ్ పక్కాగా చేయండి. ఇదేదో MBA కోర్స్ పదం కాదు, సింపుల్ మీరు చేయాలనుకునే వ్యాపారం ఏమిటి? ఏం ప్రాబ్లం కి సోలుషన్స్ ఇస్తుంది? ఆ ప్రాబ్లం ఉన్న వారు ఎవరు? అవసరం ఎవరికిఉంది? వారు మీరిచ్చే ప్రోడక్ట్, సేవలకు ఎంత డబ్బు ఇస్తారు? మీరు భిన్నంగా అద్భుతంగా సర్వీస్ ఎలా ఇవ్వగలరు? ఇలా కీలక ప్రశ్నలకు సమాధానాలు వెతకండి?  ఇలా క్లారిటీ లేకపోతే CEO అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని మీరు బిజినెస్ మొదలు పెడతారు , చివరకు చీఫ్ ఎవిరీ థింగ్ ఆఫీసర్ అయ్యనేంటి అని ఆశ్చర్య పోతారు. ఎందుకంటే సొంత బిజినెస్ లో పరిస్థితిని బట్టి టేబుల్ క్లీనింగ్ నుంచి, కాఫీ పెట్టుకోటం వరకు, క్లైంట్ మీటింగ్ నుంచి అకౌంట్స్ వరకు అన్నీ చూసుకోవాలి సొంతంగా, ఒంటరిగా.       
3. ఎవరు ప్రభావితం ఔతున్నారు, రిస్క్ ఏమిటి? 

మీరు ఉద్యోగం వదిలి, లేదా చేస్తున్న పని కాదనుకుని కొత్త వ్యాపారంలోకి వెళుతుంటే పై రెండు స్టెప్స్ తప్పక పాటించడం మంచిది. వ్యాపారానికి రిస్క్ తీసుకునే, దూకుడు మనస్తత్వం అవసరమే కాని వ్యాపారంలోకి గుడ్డిగా దూకేయకూడదు. అర్థం కాకపోతే మళ్ళీ చదవండి. రిస్క్ తీసుకునే లక్షణం ఉండాలి. నిజానికి వ్యాపారం = రిస్క్. మీరు ఎంత రిస్క్ కి రెడీ గా ఉంటారో, రిస్క్ ని తట్టుకునే శక్తి మీలో ఎంత ఉంటుందో అందుకు తగ్గట్టుగానే బిజినెస్ నడుస్తుంది. ఏ రిస్క్ లేకపోతే అందరూ వ్యాపారాలే చేస్తుండే వారు. అందుకే మీ బిజినెస్ నిర్ణయం గురించి అందువలన ప్రభావితం అయ్యేవారికి స్పష్టంగా చెప్పండి. మీ లైఫ్ పార్టనర్, మీ తల్లిదండ్రులు, పిల్లలు వీరికి మీ వర్క్ గురించి చెప్తే మీకు వాళ్ళు ఉపయోగపడే , మీ క్షేమం కోరే సలహాలు ఇస్తారు. ఇంకా చెప్పాలంటే ఆడవారు , మగవారు ఒక అంశం మీద భిన్న మైన దృక్కోణాలు మాట్లాడుకోవచ్చ్చు . ఒక నిర్దిష్టమైన ఐడియా కి  రూపం ఇచ్చేముందు ఇద్దరి వైపు నుండి ఫీడ్ బ్యాక్ తీసుకోండి. ఈ మూడు స్టెప్స్ చేయండి, మీ బిజినెస్ లో మీరేం చేయాలో ఒక స్పష్టత వస్తుంది, ఆ స్పష్టత లోంచి ఆ ఒక అడుగు ముందుకేయండి మీ ఎంట్ర ప్రెన్యూర్ జర్నీ స్టార్ట్ చేయండి J

***  ***  ***  సైకాలజీ టుడే, నవంబర్  2016 లో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  ***

No comments:

Post a Comment