Wednesday 15 April 2015

Five Different Thoughts That Make You Successful [మిమ్మల్ని విజేతలుగా నిలిపే ఐదు భిన్న ఆలోచనలు]


ప్రపంచంలో ఏ విజేతైనా , ఏ రంగంలో అయినా మొదట తన అంతర్గత ఉన్నతి నుంచే ప్రయాణాన్ని మొదలు పెట్టి ఉంటాడు. అది ఉన్నత ఆలోచన నుంచి మొదలౌతుంది. వారిపై వారికి ఉండే క్లారిటీ వలన గతాన్ని దృష్టిలో పెట్టుకుని, ఉన్నత భవిష్యత్తు ఆశిస్తూ, వర్తమానాన్ని సెలెబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే వారు కాస్త భిన్నంగా ఆలోచిస్తారు. వాళ్ళ భిన్న ఆలోచనా సరళి ఏమిటో తెలుసుకునే ప్రయత్నమే ఈ ఆర్టికల్.


ఆలోచన 1: అంతర్గత శక్తి విలువ: అంతర్గత విశ్లేషణ అనేది  ఒక వ్యక్తి తామెంటో, తాము ఏమి చేయగలమో అనే అంశాలపై సూచనలను, అంతర్గత ఉన్నతిని , తనతో తనకు గల కమ్యూనికేషన్ ను ప్రభావం చేస్తుంది. విజేతలని ఈ అంతర్గత శక్తి తాము చేసే పనిలో ఇంకా ఉన్నతంగా చేసేలా మోటివేట్ చేస్తుంది.  గొప్ప విజేతలందరూ అంతర్గతంగా తమని తాము నడిపించుకునే, తమ కార్యక్రమాలు తాము  నిర్దేశించుకునే లక్షణం కలిగి ఉంటారు. అంతర్గత శక్తి అంటే కేవలం గెలిచినా వాళ్ళకే ఉంటుందని కాదు, అందరిలో ఉంటుంది. ఈ విశ్వంలో మనమంతా “మళ్ళీ మళ్ళీ సృష్టించబడే ప్రాసెస్” లో భాగంగా వచ్చిన వాళ్ళం కాదు. అందుకే మన మనుగడ ఒక ప్రత్యేక మైన అద్భుతం. అంటే మీరు ప్రత్యేక మైన వ్యక్తి, మీరు మాత్రమే అద్భుతంగా చేయగలిగిన ఒక ప్రత్యేకత మీలోనే ఉంది. ఆ అంతర్గత శక్తిని గుర్తించండి, ఫోకస్ తో మీ గోల్ పై ఛానల్ చేయండి. విజేతలని ఈ అంతర్గత శక్తి తామెంటో చెప్పేందుకు పరుగులు పెట్టిస్తుంది. మీ అంతర్గత శక్తి దేనిపై ఫోకస్ చేస్తారో నిర్ణయించుకోండి.
ఆలోచన 2 : నిజంగా నేర్చుకుంటారు: ఒక సాధారణ వ్యక్తి ఒక కొత్త పని చేసే ముందు ఎంతో ఉత్సాహం, ఇష్టం, ప్రేమ చూపిస్తాడు, రోజులు గడిచేకొలది, బోర్ కొట్టడం, భయం, కన్ఫ్యూజన్ లేదా ఆ పని వలన తనకు జరిగే ప్రయోజనాల స్థాయిని బట్టి  ఆమె/అతని అంతర్గత ఉత్సాహం నీరుకారిపోయే అవకాశం ఉంది. కేవలం ఆర్ధిక అంశం మాత్రమే కాదు అనేక అంశాలు ఈ ఉత్సాహాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే విజేతలు చేస్తున్న పనిలో ప్రాథమిక, కీలక అంశాలు, నియమాలు వేగంగా నేర్చుకుంటారు, తమని తాము అప్ డేట్ చేసుకుంటారు, పరిస్థితుల్ని అర్థం చేసుకుంటారు, ఏమి చేస్తే ఎలా జరుగుతుంది, నాకు ఇంకా ఉన్నత ఫలితం కావాలంటే ఏమి చేయాలి అని ఆలోచిస్తూ నేర్చుకుంటూ  ఆత్మ విశ్వాసాన్ని , పనిలో మెళకువలను, ఆ రంగంపై పట్టు సాధిస్తారు. ఈ ప్రక్రియ వలన విజేతలు మొదట ఫాలోవార్ స్థాయి నుంచి లీడర్ లా ఎదుగుతారు. మరి మీరు ఎటువంటి అంశాలు నేర్చుకుంటే మీ దీర్ఘ కాలిక లక్ష్యాలు చేరుకుంటారో ఆలోచించండి.
ఆలోచన 3: రిస్క్ తీసుకునేందుకు రెడీ!: చేస్తున్న పని/ప్రాజెక్ట్/ వ్యాపారం  గురించి అవగాహన, స్వీయ అవగాహన  అనేక కోణాల్లో ఇన్ఫర్మేషన్ ఉండటం అనేవి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోడానికి కీలకం అని విజేతలు బలంగా నమ్ముతారు. అందుకే వేగంగా ఖచ్చితంగా రిస్క్ తో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు. కష్టకాలంలో “గేమ్ చేంజింగ్” నిర్ణయాలు తీసుకోవటం కుడా టైపు రైటింగ్, కుకింగ్, సైక్లింగ్ లా ఒక నైపుణ్యం. ఒక సారి చాలెంజింగ్ సమయంలో ఉన్నత నిర్ణయాన్ని తీసుకుంటే , మళ్ళీ అటువంటి సందర్భం వచ్చినప్పుడు అలాగే పనిచేయాలని మైండ్ అండ్ బాడీ ఆటోమేటిక్ గా పని చేస్తాయి. ఇది విజేతలకు ఒక అలవాటుగా మారిపోతుంది. సాధారణ వ్యక్తి బెంబేలెత్తి , కంగారు పడే సందర్భాలను విజేతలు తమ శక్తికి, క్రియేటివిటీకి ఒక పరీక్షలా, తమను తాము నిరూపించుకునే అవకాశంలా భావిస్తారు.

ఆలోచన 4: కుతూహలంతో పనిచేస్తారు : విజేతలు తాము చేస్తున్న పనిమీద, ప్రాజెక్ట్ మీద, తమ కంపెనీలో ఇతర డిపార్టుమెంటు ల మీద, కనీస కుతూహలాన్ని ప్రదర్శిస్తారు. క్యురియసిటీ కి అనవసరంగా ఇతరుల విషయాల్లో వేళ్ళు పెట్టె లక్షణాలకు సన్నని గీతను స్పష్టంగా చూడగలరు.  తాము ఒక లక్ష్యంతో పనిచేసి దానిని సాధించిన తర్వాత, ఇంకొంచం ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాలని ప్రయత్నిస్తారు. విజేతలు ఆ రంగంలో ఆసక్తి గల ఇతరులను ప్రోత్సహించి ఎదిగేందుకు సహాయం చేస్తారు. ఎందుకంటే నిజమైన విజేతలకి లీడర్స్ అంటే ఫాలోవర్స్ ని తయారు చేయటం కాదు మరింతమంది లీడర్స్ ను చేయటమని తెలుసు. విజేతలలోని క్యురియసిటీ తమకు అప్పజెప్పిన ప్రాజెక్ట్ /పని సృజనాత్మకంగా, ఉన్నత ప్రమాణాలతో పూర్తి చేసే శక్తి ఇస్తుంది.

ఆలోచన 5: భావోద్వేగ ప్రజ్ఞ : ఉన్నత స్థాయిని చేరుకున్న ఏ విజతలైనా గమనించండి వారందరూ భావోద్వేగాలను ఉన్నతంగా ఉపయోగించుకుంటారు. వారికి ఒక దానిని సాధించడానికి ఎప్పుడు తమ ఎమోషన్స్ వాడాలి, ఎప్పుడు ఎమోషన్స్ కంట్రోల్ లో పెట్టుకోవాలి అనేది స్పష్టంగా తెలుసు. వారి నిర్ణయం తీసుకునే శక్తిని  కోపం , భయం వంటి  ఎమోషన్స్ ప్రభావితం చేయకుండా ఖచ్చితత్వాన్ని , వాస్తవాన్ని , అవసరాన్ని దృష్టిలో పెట్టుకుంటారు. ఈ రకమైన  స్వీయ నియంత్రణ  విజేతల లక్షణం.  గొప్ప ఓర్పుని ప్రదర్శిస్తారు. వారికి బద్దకానికి (laziness) , ఓర్పుకి (patience) మధ్య తేడా ఖచ్చితంగా తెలుసు. మీ భావోద్వేగాలు ఎలా ఉపయోగించుకుంటున్నారో ఆలోచించండి? వాటిని ఉన్నతంగా వాడండి.

No comments:

Post a Comment