Thursday 28 June 2018

ఈ 6 రకాల ఎంట్ర ప్రెన్యూర్ షిప్ లలో మీది ఏది? 6 Types of Entrepreneurial Ventures - What's your preference?



6 Types of Entrepreneurial Ventures - What's your preference?
1. Investor Backup Ventures
2. Life style Businesses
3. Traditional Businesses
4. Buying an existing company
5. Social Ventures / Impact Ventures
6. Corporate Intrapreneurship 

తీవ్రమైన అనిశ్చితి పరిస్థితులు ఉన్నా ప్రజలకు ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ అందించే  వ్యక్తులే ఎంట్ర ప్రెన్యూర్స్. అలాంటి  వారు ప్రారంభించినవే అంకుర సంస్థలు (స్టార్ట్ – అప్స్). అయితే ఎంట్రప్రెన్యూర్షిప్ అంటే సింగల్ నిర్వచనం ఇవ్వటం కష్టమే, అది ఎంట్ర ప్రెన్యూర్ వ్యక్తిగతంగా ఇచ్చుకునే నిర్వచనంపై ఆధారపడి ఉంటుంది. అయితే సాధారణంగా అసలు ఎన్ని రకాల ఎంటర్ ప్రైజ్ లు ఉంటాయి అందులో మీకు ఏ విధానం సరిపడుతుంది అనే అంశాలు తెలపడానికే ఈ ఆర్టికల్.
***    ***    ***    ***    ***    ***
మీకు మంచి ఐడియా వచ్చింది, స్టార్ట్-అప్ మొదలు పెట్టారు, ఇన్వెస్టర్ కూడా దొరికారు, టీమ్ ని రిక్రూట్ చేసుకున్నారు ప్రోడక్ట్ లాంచ్ చేసారు. వినడానికి చాలా సింపుల్ గా ఉంది కదా. కానీ వెంచర్  స్టార్ట్ చేయకముందే అసలు ఎంటర్ ప్రైజ్ లు ఎన్ని రకాలు ఉన్నాయి, మొదలెట్టే వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అందులో మీకు బాగా సరిపోయే కేటగిరి ఏమిటి అని తెలుసుకుంటే మంచిది. ఎంటర్ ప్రైజెస్ ను  ఎన్నో కేటగిరీలుగా చెప్పినా ఈ క్రింది ఆరు రకాలు సింపుల్ గా మీకు అనేక రకాల వెంచర్స్ ను అర్థం చేసుకోడానికి ఉపయోగపడుతాయి.   
1.   ఇన్వెస్టర్స్  బ్యాకప్ తో వెంచర్   

ఈ కంపెనీ పెట్టే ముందే వారి ఐడియా మీద గట్టినమ్మకంతో మొదలు పెడతారు , ఇది ప్రపంచంలో ఒక బెస్ట్ అవకాశం గా ఉంటుంది అని. ఇవి ఫౌండర్స్ , ఇన్వెస్టర్స్ కి బాగా సంపదను సృష్టించే  హై గ్రోత్ ఎంటర్ ప్రైజెస్. సాధారణంగా మొదలుపెట్టినప్పుడు చిన్నగా ఉండి వేగంగా, ఎక్కువ విస్తరణ చేయగలిగేలా (స్కేల్ అప్), అధునాతన టెక్నాలజీ తో ముందుకు తీసుకెళతారు. వేగంగా ఎదిగే అవకాశం ఉన్న ఇటువంటి స్టార్ట్-అప్స్ న్యూ యార్క్, షాంఘై, సిలికాన్ వ్యాలీ, బెంగళూర్ నుంచి మన తెలుగురాష్ట్రాల్లో టీ-హబ్ వంటి చోట కూడా మొదలయ్యాయి. ఇది సుభ శూచకం. వీటికి ఏంజెల్ ఇన్వెస్టర్స్, వెంచర్ కాపిటలిస్ట్స్ సపోర్ట్ ఉంటుంది, రాపిడ్ గ్రోత్ ను  ఆశిస్తారు. ఇన్వెస్టర్స్ డబ్బు పెడతారు కాబట్టి వారికి తిరిగి చెల్లించడానికి ఒక ఎగ్జిట్ స్ట్రాటజీ కూడా ముందే పెట్టుకుంటారు.
ఈ వెంచర్స్ లో వ్యక్తిగత జీవితం సెకండరీ అవుతుంది. “ఖచ్చితంగా ఎదగాలి” అనే లక్షణం డామినేట్ చేయడంతో పర్సనల్ టైం ఉండకపోవచ్చు, పని ఒత్తిడి, ఫ్యామిలీతో సమయం కేటాయించలేకపోవడం వంటి పరిస్థితులు ఉంటాయి. వెంచర్ మొత్తం గ్రోత్ చూసుకోవడం, సిస్టం ఆటోమేట్, నిరంతరం ఎదగడానికి ఒక మోడల్ చేయడం ఛాలెంజ్ అవుతుంది. ఊబర్, ఫేస్ బుక్, ట్విట్టర్, అమెజాన్, ఈబే సంస్థలు ఈ కేటగిరి కిందికే వస్తాయి.
2.      లైఫ్ స్టైల్ బిజినెస్

మీకు కావలసిన జీవన విధానం (లైఫ్ స్టైల్) మీ బిజినెస్ ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది.  దానిని బేస్ చేసుకునే మీరు ఎలాంటి వెంచర్ చేయాలో నిర్ణయించుకుంటారు.ఈ తరహా వెంచర్ మొదలుపెట్టేముందు ఫౌండర్స్ కి వారు ఎంత సంపాదన ఆశిస్తున్నారు, కొన్నాళ్ళ తర్వాత ఏమి చేయాలి అనేది ముందుగానే ఒక ఆలోచన ఉంటుంది. వెంచర్ కాపిటలిస్ట్ ల వంటి వారినుంచి దాదాపు ఫండింగ్ ఆశించరు , సొంత డబ్బు , ఫ్రెండ్స్ , లోన్స్ మీద ఆధారపడే వెంచర్ మొదలు పెడతారు. ఈవెంట్ మేనేజ్ మెంట్, కస్టమర్ అవసరాలకు తగిన సైకిల్స్ తయారు చేయడం, మెడికల్ అవసరాలకు తగిన షూస్ చేయడం, యాన్టిక్ ఆర్ట్ పీస్ అమ్మటం మొదలైనవి ఈ కేటగిరి లోకే వస్తాయి. పెట్టుబడి, రోజు వారీ ఖర్చులు, అనుకున్న లైఫ్ స్టైల్ కావలసిన డబ్బు, భవిష్యత్తు అవసరాలకు డబ్బు వచ్చే వరకు కంపెనీ ఎదుగుదల కోసం  ప్రయత్నిస్తారు. బాగా వేగంగా  విస్తరణా మార్గాల ప్రయత్నం జరగదు. ఫార్మల్ గా  ఎగ్జిట్ ప్రణాళికలు ఏమి ఉండవు. బిజినెస్ లో కోరుకున్న ఫలితాలు, డబ్బు,  లైఫ్ స్టైల్ అలాగే కొనసాగించడానికి వెంచర్ కొనసాగిస్తారు.  తాము కోరుకున్న లైఫ్ స్టైల్ ప్రాధాన్యంగా ఎంచుకున్న మార్గం కాబట్టి వ్యక్తిగత, కుటుంబ జీవితానికి సమయం కేటాయిస్తారు.

3.      సాంప్రదాయ విధానంలో ఉండే నిలకడ వ్యాపారం


ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కువ ఎంట్ర ప్రెన్యూర్శిప్ లో ఎక్కవ భాగం ఈ కేతగిరిలోదే. ఒక షాప్ , వ్యాపారం ద్వారా ప్రతినెల నిలకడగా కొంత డబ్బు వచ్చేలా ఒక వెంచర్ మొదలు పెడతారు. నడిపినంతకాలం రోజువారీ అదే బిజినెస్ , అదే కాష్ ఫ్లో , నిరంతరం వారే కస్టమర్స్ ఉండే వెంచర్. ఆర్గానిక్ ఎదుగుదల ఉంటుంది. ఒక షొప్ పెట్టి దానిలో లాభాలు వచ్చేలా ఎదిగేందుకు ఫౌండర్స్ ప్రయత్నిస్తారు. కిరాణా షాప్స్, స్ట్రీట్ ఫుడ్ అందించే వెంచర్స్, ట్రావెల్ ఏజెంట్, సెలూన్ ఇలా రోజు వారీ అవసరాలను తీర్చే చిన్న వ్యాపారాలు ఈ కేటగిరి లోకే వస్తాయి.   ఇందులో కుడా సొంత డబ్బు లేదా ఫ్రెండ్స్, బ్యాంకు వద్ద లోన్ తీసుకుంటారు కానీ ఫార్మల్ ఇన్వెస్టర్స్ ఉండరు. నెలకి కుటుంబ అవసరాలకు, లైఫ్ స్టైల్ కు కొంత డబ్బు నిలకడగా రావడానికే ప్రాధాన్యత ఉంటుంది. ఈ కేటగిరిలో సంపద సృష్టి, బిజినెస్ స్కేల్ అప్ చేయడానికి కొన్ని పరిధులుంటాయి.  కుటుంబానికి కావలసినంత సమయం ఉంటుంది కానీ షాప్, బిజినెస్ ఏ రకం అనే దానిని బట్టి కాస్త ఒత్తిడి, సమయం లేకపోవటం కూడా ఆశించవచ్చు. ఎక్కువ సమయం పనిచేయాల్సిన అవసరం ఉండొచ్చు , కొద్ది మంది లేదా ఇతర ఎంప్లాయిస్ ఉండకపోవచ్చు.
4.      ఒక కంపెనీ ని కొనడం 

ఎంట్రప్రెన్యూర్ షిప్ బై  యాక్విజిషన్ అని కూడా అంటారు. ఈ కేటగిరిలో ఫౌండర్స్ ఆల్రెడీ ఉన్న ఒక కంపెనీ కొంటారు. లాస్ లో ఉన్న, షట్ డౌన్ అయిన కంపెనీని కొని కొత్త టెక్నాలజీ, ప్రాసెస్, సిస్టం, డిఫరెంట్ మార్కెటింగ్ ద్వారా కొత్తగా మొదలు పెడతారు. సొంత డబ్బు , ఫ్రెండ్స్ , బ్యాంకు లోన్స్, ప్రైవేటు ఈక్విటీ ఫండింగ్ ద్వారా మొదలు పెట్టే అవకాశం ఉంది. ఎదుగుదల (గ్రోత్) అనేది ఫౌండర్స్ ఆశయాలు, ఇన్వెస్టర్స్ అవసరాలపై ఆధారంగా ప్లాన్ చేస్తారు. ఉన్న కాష్ ఫ్లో రన్ చేయడానికి, లాభాల బాటలో నడిపించడానికి ప్రాధాన్యత ఇస్తారు. వీలైతే తర్వాతి కాలంలో ఎక్కువ డబ్బుకి అమ్ముతారు. డబ్బు కోసమా? మళ్ళీ లాభానికి అమ్మటం కోసమా? అనేదానిపై ఎగ్జిట్ ప్లాన్ ఆధారపడి ఉంటుంది. దానిమీద ఫౌండర్స్ లైఫ్ స్టైల్ ఆధారపడి ఉంటుంది. మొదలు పెట్టిన కొత్తలో ఒత్తిడి ఉంటుంది. అనేక బిజినెస్ అవసరాలు బట్టి వాటిపై ఫౌండర్స్ ఎంత త్వరగా విషయాలు నేర్చుకుని భవిష్యత్తు అంచనా వేస్తారనే దానిపై లైఫ్ స్టైల్ పై ప్రభావం ఉంటుంది.

5.      సోషల్ వెంచర్స్ 

ప్రపంచం ఒక మంచి ప్రదేశంగా ఉండాలని, సమాజం ఆరోగ్యంగా ఉండాలని ఆశించే వెంచర్స్ ఈ కేటగిరిలోకి వస్తాయి. సొంత డబ్బు, బ్యాంకు లోన్స్ మాత్రమే కాకుండా వెంచర్ లక్ష్యాలతో అనుసంధానంగా నడిచే అంతర్జాతీయ సంస్థలు, ట్రస్ట్ లు, వెంచర్ కాపిటలిస్టులు ఫండ్ అందిస్తారు. మార్కెట్ షేర్ , ఫౌండర్స్ కోసం డబ్బు కంటే సమాజంపై సానుకూల ముద్ర వేయడానికి ప్రాధాన్యత ఉన్న వెంచర్స్. నిరంతరం సామాజిక కార్యక్రమాలు కొనసాగించడానికి అవసరం కాబట్టి  కొన్ని లాభాలు కూడా ఆశిస్తాయి. వెంచర్ ఎదుగుదల అనేది వారు “ఎంత మంది జీవితాలకు ఉపయోగపడుతున్నాం” అనే కీలక అంశం పై ఉంటుంది, వీలైనంత వరకు స్కేల్ అప్ చేస్తారు. ఒక సామాజిక అవసరంతీరడమే లక్ష్యంగా పని చేస్తారు , ఫార్మల్ ఎగ్జిట్ ప్లాన్ ఏమి ఉండదు. ప్రాజెక్ట్ అవసరాలను బట్టి, దానికి ఫండ్ ఇచ్చే సంస్థల ఆశయాలను బట్టి వ్యక్తిగత జీవితం, కుటుంబ సమయం, ఒత్తిడి ఉంటాయి. నాంది ఫౌండేషన్ , రూమ్ to రీడ్, saathii.org, Plan International, Dabbawala, Jayashree Industries (ప్యాడ్ మాన్ చిత్రాన్ని నిర్మించిన అరుణాచలం మురుగదాస్ సంస్థ) వంటివి కొన్ని ఉదాహరణలు.  
  
6.      కార్పోరేట్ ఇంట్రాప్రెన్యూర్షిప్ 

విపరీతంగా  కస్టమర్ల అవసరాలు, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, పెరుగుతున్న కాంపిటీషన్ వలన విచ్చిన్న ఆవిష్కరణ (డిస్రప్టివ్ ఇన్నోవేషన్) కోరుకుంటున్న ఈ తరుణంలో. కంపెనీలు కూడా కార్పొరేట్ ఎంట్ర ప్రెన్యూర్శిప్ తప్పనిసరి. బాగా ఎదిగిన ఒక కార్పొరేట్ కంపనీలో కొత్త ఐడియాతో, కొత్త బిజినెస్ తో ముందుకు రావడమే కార్పోరేట్ ఇంట్రాప్రెన్యూర్షిప్. దాని ద్వారా కొత్త లాభాలు, కంపెనీ పేరు, కస్టమర్స్ ను మరో ప్రోడక్ట్ ను  కూడా కొనేలా చేయటం లక్ష్యం. దాదాపు పై స్థాయి అధికారులైన వారితో ఒక పేరెంట్ సంస్థ సీక్రెట్ ప్రాజెక్ట్ లా మొదలుపెట్టే అవకాశం ఉంది. ఎక్కువ ఆ మాతృ సంస్థ ఫండింగ్ చేస్తుంది, లేదా ఫండింగ్ ఇప్పించే ప్రయత్నం చేస్తుంది. కొత్త మార్కెట్ సొంతం చేసుకోడానికి వేగంగా ఎదుగుదల ప్లాన్ ఉంటుంది, పేరెంట్ కంపెనీకి ఎదుగుదల ఇవ్వడానికి, అసెట్స్ ఇవ్వడానికి తోడ్పడుతుంది. ఇందులో పనిచేసే వ్యక్తులు జాబు హోల్డర్స్ అయినా, కన్సల్టెంట్ అయినా ఆశ్చర్యం ఏమి లేదు.   
ప్రతి కేటగిరీలోనూ ప్లస్, మైనస్ రిస్క్ రెండూ ఉంటాయి. ఈ ఆరు విధానాలను స్పష్టంగా అర్థం చేసుకుంటే కూడా మీరు ఎంత సమయం, డబ్బు, ఏ స్థాయి ప్రభావం చూపాలనుకుంటున్నారు, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలనుకుంటున్నారు అనేదానిపై వెంచర్ కేటగిరి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి ముందుగా తెలియాల్సిన అంశాలు , ఎందుకంటే తీరా సగం దూరం వెళ్ళాక నేను అనుకున్నది ఒకటి కానీ జరుగుతుంది ఒకటి అనుకునే సమయం ఉండడు కదా. ఈ అవగాహనతో మీ వెంచర్ కేటగిరి నిర్ణయించుకోండి,   బెస్ట్ విషెస్ ఫర్ యువర్ ఎంట్రప్రెన్యూర్శిప్ జర్నీ.
***  ***  సైకాలజీ టుడే తెలుగు పత్రికలో ఏప్రిల్ 2018 సంచికలో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***

No comments:

Post a Comment