Sunday 27 December 2015

సమస్యలు ఎదురైనా మిమ్మల్ని విజేతగా నిలిపే 3 స్టెప్ ల సక్సెస్ ఫార్ములా (3-Step Success Formula)


జీవితంలో ఇప్పటివరకు జరిగిన సంఘటనలు, ప్రయత్నాలకి వచ్చిన ఫలితాల ఆధారంగా సక్సెస్ అవ్వాలంటే ఏమి చేయాలి అని ఆలోచిస్తూ కూర్చున్నారా? అసలు ఏ అంశాల మీద, ఏ ఆలోచనలు మీద, ఏ పరిస్థితులు మీద సక్సెస్ ఆధారపడి ఉంది అని అన్వేషిస్తున్నారా? నాలో లేనిది ఏంటి గెలిచే వాళ్ళలో ఉన్నది ఏంటి అని సందిగ్దంలో ఉన్నారా? అయితే మిమ్మల్ని విజేతగా నిలిపే సక్సెస్ ఫార్ములా అందుకోండి.

స్టెప్  1:   మీతో మీరు మాట్లాడుకునే విధానం మార్చండి (సెల్ఫ్ టాక్): చాలామంది ఉన్నదానికి త్రుప్తితో ఆనందంతో లైఫ్ ఎంజాయ్ చేయకుండా, కృతజ్ఞతా భావంతో ఆస్వాదించకుండా లేనిదాన్ని తలుచుకుని,  గతాన్ని తలుచుకుని, భవిష్యత్తు ని ఊహించుకుని వాటి పరిస్థితులు ఎలా ఉంటాయో, ప్రభావం ఎలా ఉంటుందో  అని ఆలోచిస్తూ ఉంటారు. అలా లేని సమస్యని ముందే ఊహించుకుని వర్తమానాన్ని ఇంకొంత  జటిలం చేసుకునే బదులు ఆనందంగా గడపొచ్చు అన్న చిన్న జీవన విధానం తెలియకనే ఈ పరిస్థితి. ఇంకోటి ఈ ప్రపంచంలో ఆనండం ఎక్కడ ఉంది అంటే “పరిస్థితి” ని బట్టి కాదు , మనో స్థితి ని బట్టి అని చెప్పుతుంది భారతీయ జ్ఞాన సంపద.  అందుకే మీతో మీరు ఉన్నతంగా, ప్రయోజనాత్మకంగా, జడ్జిమెంట్ ఇవ్వకుండా, సానుకూలంగా మాట్లాడుకోండి. మీకు ఎవైనా అనుమానాలు ఉంటె నివృత్తి చేసుకోండి కాని “ఈ పరిస్థితిలో మీరు ఉంటె తెలుస్తుంది...” అని ఒక అంతు చిక్కని రామ బాణాన్ని సంధించకండి. అది కేవలం ఇగో ని త్రుప్తి పరుస్తుంది. ఎప్పుడైతే మీతో మీరు ఉత్తేజితంగా, మాట్లాడారో అప్పుడు మీలో పూర్తి శక్తుల్ని ఉపయోగించుకోగలరు అని ప్రయోగాలలో కూడా తెలిసిన అంశం.  మూడో వ్యక్తితో మాట్లాడినట్లు మాట్లాడటం వలన కూడా మీ ఎమోషనల్ లెవెల్ లో ఉండే కొంత భయాలు పోతాయని రీసెర్చ్ లో చెప్పబడింది. “ నేను ఈ రోజు గొప్ప మీటింగ్ చేయలేను” అనే బదులు , “రమేష్ ...ఈరోజు నువ్వు చేయగలవు, గతంలో చేసావు, ఇది కేవలం నీకు మరో అవకాశం , కొత్త ప్లేస్ అంతే” అని మాట్లాడుకుంటే చక్కటి ప్రభావం ఉంటుంది. సెల్ఫ్ టాక్ లో కాస్త పవర్, పేషన్స్, “ఇలా అయితే ఇంకా హాయిగా ఉంటుందేమో”  అనే కొత్త సెన్స్ ఉండేలా చూసుకోండి, మీ లైఫ్ మీ చేతిలోకి వచ్చేలాంటి సింపుల్ , పవర్ ఫుల్ టెక్నిక్ ఇది.

స్టెప్ 2:   మిమల్ని భౌతికంగా ఉన్నతంగా మార్చుకోండి (ఫిజియాలజీ):
కేవలం మీతో మీరు మాట్లాడే మాటలే కాదు, మీ శరీరాన్ని, ముఖ కవలికాలని, మీ బాడీ మోత్తన్న్ని ఎలా ఉపయోగిస్తారు అనేది మీతో మీరు వేర్వేరు అంశాల మీద ఎలా ఫీల్ అవుతున్నారు అనేది నిర్నైస్తుంది. మీ ఆత్మ విశ్వాసాన్ని స్పష్టం చేస్తుంది. సోషల్ సైకాలజిస్ట్ అమీ కెడ్డి  మనిషి బాడీ లాంగ్వేజ్ కి ఎమోషన్స్ కి మద్య సంబంధాన్ని గురించి చేసిన అధ్యయనాల్లో అనేక ముఖ్యమైన విషయాలు చెప్పారు. మీరు మీ బుజాలు వంచి చిన్నగా వంగిపోయి నడుస్తూ, అల కూర్చుంటూ , స్లో గా మాట్లాడితే తక్కువ కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతారు, అదే పవర్ఫుల్ మాన్ గా (హి మాన్, వీర హనుమాన్) లాగా పోసే పెడితే ఆటో మాటిక్ గా పవర్ఫుల్ గా ఫీల్ అవుతారు. ఈ బాడీ లాంగ్వేజ్ అండ్ ఎమోషన్ రేలషన్ అర్ధం చేసుకుంటే మీరు గొప్ప ఒత్తిడి అనుకున్న క్షణంలో కూడా నెమ్మదిగా నవ్వుతు బాడీ లాంగ్వేజ్, ముఖ కవళికలు, సున్నిత మైన ముఖ కవళికలు అలవాటు చేసుకుని ఉంటె స్థిత ప్రజ్ఞత మీ లైఫ్ లో భాగ మైపోతుంది. మూడ్స్ ఎలాగో ఉంది అనుకున్నప్పుడు నిల్చొని చప్పట్లు కొట్టండి, వాల్కిగ్న్ చేయండి, ఆకాశం వైపు చూస్తూ గట్టిగా గాలి పీల్చుకోండి ...మీకు ఈ భౌతిక శరీరానికి – మనసుకు ఉన్న లింక్ బాగా అర్ధం అవుతుంది. దీని మీద పట్టు సాధించారంటే మీ ఎమోషన్స్ పూర్తిగా మీ కంట్రోల్ లోకి వచ్చి నట్టే. అందుకే పవర్ ఫుల్ బాడీ లాంగ్వేజ్ లో ఉండండి , అద్భుతాలు మీ సొంతం చేసుకోండి. 

స్టెప్ 3:   మీ స్వయం నిర్వచనం  మార్చుకోండి (సెల్ఫ్ డిస్క్రిప్షణ్):
మీ గురించి మీరు ఏమి అనుకుంటున్నారు అనే  మీ స్వయం నిర్వచనం, ఇది మీ శక్తి యుక్తుల్ని మీ చర్యల్ని ప్రభావితం చేస్తుంది.  నిర్ణయిస్తుంది. మీ జీవన నాణ్యతని నిర్ణయిస్తుంది. మీరు ఏ స్థాయిలో వ్యాపారం/ ఉద్యోగం చేయాలనుకుంటున్నారు? ఏ విధానాలు , ఎంత పెద్ద కారణం కోసం చేయాలనుకుంటున్నారు? ఏ కంపెనీ కార్ కొనాలనుకుంటున్నారు? ఎటువంటి ఇల్లు/ విల్లా  సొంతం చేసుకోవాలనుకుంటున్నారు?  ఎంత సంపద /డబ్బు సంపాదించాలనుకుంటున్నారు? మీ పిల్లలని ఎంత పెద్ద స్కూల్ లో చదివించాలనుకుంటున్నారు? మీ ఫ్యామిలీ తో ఏ ప్రదేశాలకు వెళ్లాలనుకుంటున్నారు? ఏ దేశాలు, ప్రదేశాలు చూడాలనుకుంటున్నారు? ఇవన్నీ మిమ్మల్ని మీరు ఏమని వర్ణిస్తారు, మీకు మీరు ఏమని నిర్వచిన్చుకుంటారో దానిపైనే ఆధార పడి ఉంది. ఏమి చేస్తునారు అంటే “ఎదో నెల కి ఒక ప్లాట్ అమ్ముతున్నాను “ అన్న దానికి “పెట్టుబడికి ఖచ్చితంగా రాబడి ఇచ్చే నమ్మక మైన వెంచర్ లో ప్రజలకి కావలసిన ప్లాట్ లు అందిస్తున్నాను”  అన్నదానికి చాలా తేడా ఉంటుంది. మన పరిచయ వాక్యానికే ఇంత గొప్ప అర్థాన్ని ఇవ్వగాలిగినపుడు జీవితానికి ఎంత గొప్ప అర్థాన్ని ఇచ్చుకోవచ్చు. అందుకే మిమ్మల్ని మీరు విజేతలుగా నిర్వచించుకోండి.

ఈ మూడు సోపానాల సక్సెస్ ఫార్ములా  60 రోజులు పాటిస్తే విజేతలుగా మానసికంగా సంసిద్దులౌతారు. వీటిలో పవర్ చదివినప్పుడు  కంటే పాటించే సమయంలో మీకు స్పష్టంగా తెలుస్తుంది. మీ విజయాలు మాతో పంచుకోండి.

*****************   సైకాలజీ టుడే , నవంబర్ 2015 లో ప్రచురించిన  నా ఆర్టికల్ *******************

No comments:

Post a Comment