Tuesday 20 September 2016

ఆలోచనలను ఆచరణ వైపు నడిపే 3 మౌలికాంశాలు [3 Essentials to Move You From Thoughts To Actions]

నిద్ర లేచినపుడు ఈరోజు ఏమి చేయాలి అనే ఆలోచన నుంచి, పడుకునేముందు రేపటి పనులు ఏంటి అని ఆలోచించే వరకు, గతం కంటే బాగా భవిష్యత్తు నిర్మించుకోవాలని మనిషి అన్వేషిస్తూనే ఉంటాడు. కొత్త భాష నేర్చుకోవాలి, ఆరోగ్యమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి, బరువు తగ్గాలి, మన పిల్లలకు ఉన్నతమైన పేరెంట్స్ గా ఉండాలి, ఉద్యోగం సంపాదించాలి, ఇంక్రిమెంట్ కి అర్హత సంపాదించాలి, వ్యాపారం పెట్టాలి, ఇల్లు కట్టాలి.....ఇలా మనందరికీ అనేక లక్ష్యాలు ఉంటాయి. ఏదైనా సాధించాలంటే ఆలోచన బాగుండాలి, నిజానికి ఏది సాధించాలో నిర్ణయించుకున్నాక తర్వాత మనిషి తన శక్తినంతా ఆచరణపై మళ్ళించాలి. ఇది నిరంతర ప్రయత్నం అవ్వాలి. అందుకు మీ మాటలు కాదు మీ పనులు మాట్లాడాలి. ఎలాగో  తెలుసుకుందాం రండి.
***    ***    ***    ***    ***    ***
1. Not only knowing, you must develop skills including managing thought patterns and ability to take action required
2. See the real value and impact than the risk involved in the process
3. Habits should be in alignment with expected results
సోపానం 1: విషయం తెలుసుకోవటమే కాదు నైపుణ్యం రావాలి   

మనం ఉన్న స్థితికి, కోరుకుంటున్న స్థితికి (మన గోల్ కి) మధ్య ఖాళీ మనకి నాలెడ్జ్ లేకపోవడం వలన వచ్చింది అనుకోవడం చాలా సహజం. అందుకే 30 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా?, బరువు తగ్గడం ఎలా?, డబ్బు సంపాదించడానికి 100 మార్గాలు, మార్కెటింగ్ ఎలా చేయాలి? ...వంటి “ఎలా చేయాలి” అనే పుస్తకాలు, కోర్స్ లు కొంటాము. ఎందుకంటే ఆశించిన కొత్త ఫలితాలు సాధించాలంటే ఉన్నత  విధానాలు (స్ట్రా టెజీస్) నేర్చుకోవాలని, ఆ నాలెడ్జ్ ఉండాలనుకుంటాము. నిజానికి కేవలం కొత్త విషయాలు నేర్చుకున్నంత మాత్రాన అవి మీ లక్ష్యాల దిశలో మార్పులు చేయలేనంత కాలం ఎందుకు పనికి రాదు. అది టైం వేస్ట్ పనే. కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త విషయాలు పాటించడం రెండూ ఒకేలా అనిపిస్తాయి. నిజానికి చాలా తేడా ఉంది. మనం గమనించాలి. మీ గోల్ చాలా బలంగా తయారవడం, ఫిట్ నెస్ పెంచుకోవడం అనుకోండి. బెంచ్ ప్రెస్ టెక్నిక్స్ లో మంచి ట్రైనర్ ని కలవొచ్చు కానీ వెయిట్ లిఫ్టింగ్ ద్వారానే మీరు ఫిట్ నెస్ పెంచుకోగలరు.  మీ గోల్ ఒక పుస్తకం రాయడం అనుకోండి. బాగా పేరున్న రచయితతో మాట్లాడొచ్చు, కానీ రెగ్యులర్ గా మీరు మంచి కంటెంట్ రాయటం, పబ్లిష్ చేయడం ద్వారానే మంచి రచయితగా మారగలరు. కేవలం నేర్చుకుంటే విషయాలు తెలుస్తాయి, ప్రాక్టీసు చేస్తే నైపుణ్యం మీ జీవితం లో భాగం అయిపోతుంది.

ఒకోసారి నేర్చుకోవడం అనేది సంకలో పెట్టుకుని నడవడానికి వాడే కర్రలాగా సపోర్ట్ ఇస్తుంది, కానీ నిజమైన పనిని చేయనివ్వకుండా ఆపేస్తుంది. మా నాన్న గారికి ఇంగ్లీష్ లో ఉన్న అంశాలు చదువుకుని అర్థం చేసుకోవాలని, ఇంగ్లీష్ మాట్లాడాలని చాలా కోరిక. నాన్న నిజానికి నాకంటే ఎక్కువ అనేక అంశాలు, బుక్స్ కొన్నారు, చదివారు, ఎక్కువ స్కిల్ల్స్ నేర్చుకున్నారు. అదేవిధంగా ఇంగ్లీష్ నేర్చుకోడానికి నాన్న నాకంటే ఎక్కువ పుస్తకాలు చదివారు. అవన్నీ 55 సంవత్సరాలు దాటిన తర్వాత కొని చదివినవే, ఆ వయస్సులో తన వృత్తి కాకుండా తన లక్ష్యం కోసం నాన్న చాలా నేర్చుకున్నారు. కానీ ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడడం తన గోల్, “ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి” వంటిబుక్స్ చాలా చదవటం ద్వారా నాన్న నేర్చుకోగలిగింది ఇంగ్లీష్ బుక్స్ చదవటం. ఆ తేడా గమనించాలి. అందుకే విషయాలు నేర్చుకోవడమే కాదు, మనం కోరుకుంటున్న స్థితికి మనల్ని తీసుకెళ్ళే అసలైన అంశాలు ప్రాక్టీసు చేయడం చాలా అవసరం. గొప్ప వ్యాపారాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతో బిజినెస్ మీద ఆన్ లైన్ కోర్స్ వీడియో లు చూస్తే మీకు బిజినెస్ చేయడం ఎలా అనే అంశం తెలుస్తుంది. కానీ బిజినెస్ మాన్ కావాలంటే సొంత వ్యాపారం మొదలుపెట్టాలి.    

సోపానం 2: రిస్క్ ని మించిన విలువని చూడగలగాలి   

వ్యాపారం అయినా, జీవితం అయినా కోరుకున్న ఫలితాలు సాధించాలంటే లక్ష్యం దిశలో అడుగులు వేసే ప్రయత్నాలు మొదలైనప్పుడు తెలియనితనం (uncertainty) వలన కంగారు పడతారు, ఆందోళన ఉండొచ్చు. ఈ రిస్క్ (భయాలు) స్థాయిని మించిన విలువ మీరు కోరుకున్న ఫలితాల ద్వారా ద్వారా ప్రపంచానికి అందిస్తున్నారన్న స్పష్టత ఉన్నప్పుడు భయాలు అడ్డంకులు కావు. నేర్చుకుంటూ ఎదుగుతున్నా అన్న ఫీలింగ్ నుంచి పనిచేస్తారు. దానికి ముఖ్యంగా కావలసింది నేర్చుకుంటూ మున్డుకేలుతూ ఉంటే మీ సర్వీస్ లు, ప్రోడక్ట్ , మీ పనులు ఇతరుల లేదా మీ అవసరాలను తీర్చడం; ఒక వేల వ్యాపారం / ట్రైనింగ్ అయితే దాని ఆధారంగా కెరీర్ లో ఒక గొప్ప మలుపు రావడం, ఆర్ధిక విషయాలలో కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడం. అందుకే ఆలోచన నుంచి ఆచరణ మీద శక్తిని కేంద్రీకరించడం అనేది ఫ్రీలాన్సు సర్వీస్ ఇచ్చేవారికి /వ్యాపారస్తులకి చాలా ముఖ్యం.

సోపానం 3: ఫలితాల దిశలో అలవాట్లు మార్పు    


నా వ్యాపారం గురించి నాకు బాగా తెలుసు అంటూ చాల మంది ఇంత కంటే ఎక్కువ విస్తరించాలంటే భయపడతారు, కొందరు విస్తరించినా పనులను ఇతరులకు డెలిగేట్ చేస్తే అవి సరిగా నడవవని తన కంట్రోల్ లో ఉండాలని అనుకుంటారు. ఇది ప్రకృతి నియమాలకు విరుద్దం. అందుకే మీ వ్యక్తిగత ఆలోచనా రీతులు, పనులు చేసే విధానాలు, వ్యక్తిగత అభిప్రాయాలతో సంస్థలు, వ్యాపారాలు లేదా ఉనత స్థాయి జీవితాలు (కుటుంబాలు కూడా) నిర్మించలేము. ఇలాగే చేస్తా , నాకు తెలుసు, నేను చాలా మందిని చూసా.....ఇలాంటి పదాలు పదే పదే వాడుతున్నారా? అవి మీరు ఆశించిన ఫలితాల దిశలో ఉన్నాయా? ఆ అభిప్రాయాలు తిరునాళ్ళలో పచ్చ కాళ్ళ జోడు వంటివేమో గమనించుకోవాలి. ఈ ప్రపంచంలో మనిషి ఎంత గొప్పగా అంతర్గతంగా ఎదుగుతాడో, అందుకు తగినట్లు బహిర్గతంగా ఎదగగలడు. మనం ఒక వ్యక్తిగా ఎంత ఉన్నతంగా సాధించాగాలమో కుటుంబాలలోను, వ్యాపారాల లోను అంతే ఎదగగలం.  ఒక లక్ష్యం నిర్ణయం అయ్యాక ఆలోచించడం కంటే ఆచరణే ముఖ్యం. ఆచరించడానికి ఈ మూడు అంశాలు కీలకం. వీటిని పాటించి మీ సక్సెస్ స్టొరీ మాతో పంచుకోండి.
***  ***  ***  సైకాలజీ టుడే, జూన్ 2016 లో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  ***

No comments:

Post a Comment