Showing posts with label Personal Development. Show all posts
Showing posts with label Personal Development. Show all posts

Friday, 23 June 2017

ఎంట్ర ప్రెన్యూర్ గా సక్సెస్, పర్సనల్ లైఫ్ కి పవర్ ఇచ్చే 4 నాలుగు అంశాలు


ఎంట్రప్రెన్యూర్ గా  జీవితం మొదలుపెడితే అనేక అవకాశాలు, సవాళ్లు ఉంటాయి. బిజినెస్ చేసేవారికి, ఉద్యోగులకి ఆలోచనా విధానాలలో  కాస్త భేదం స్పష్టంగా కనిపిస్తుంది. ఎంట్ర ప్రెన్యూర్ మౌలిక ఆలోచనలు, ఆచరణా విధానాలు జీవితంలోనే ఇతర పాత్రలు ఉన్నతంగా పోషించడానికి కూడా ఉపయోగపడతాయి. ఎంట్ర ప్రెన్యూర్ వ్యక్తిగత జీవితంలో కూడా ఉపయోగపడే నాలుగు కీలక అంశాలు  చర్చించడానికే  ఈ ఆర్టికల్.  
***    ***    ***    ***    ***    ***
1.     సమయ పాలన – ప్రాధాన్యత క్రమం
ఎంట్ర ప్రెన్యూర్స్ మారిన మరుక్షణమే మనం ఎక్కువ సమయం ఆ ప్రాజెక్ట్ / వెంచర్ అవసరాలకు తగినట్లు సమయం కేటాయించాల్సి వస్తుంది. మరో పార్టనర్ తో లేదా కాపిటల్ ఎక్కువ ఉండి కొందరిని మీ సంస్థలో సభ్యులుగా తీసుకుంటే తప్ప స్టార్ట్ అప్ లా మొదలైన వారికి అనేక అంశాలు ఒకే సారి చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఎక్కువ సమయం ఫోకస్ గా వర్క్ చేయటం, ఎక్కువ అంశాలను ఒక దానితో ఒకటి ముడి పది ఉన్న అంశాలను , వాటి ప్రాధాన్యతా క్రమంలో పనిచేయటం, అనుకున్న టైం లైన్ ప్రకారం పని చేయటం అలవాటు అవుతుంది. వనరులు తక్కువ ఉన్నప్పటికీ క్లైంట్ అడిగిన సమయానికి ప్రోడక్ట్ , సర్వీస్ అందించాలి కాబట్టి వనరులను , సమయాన్ని ఉన్నతంగా వెచ్చించే లక్షణం వస్తుంది. వారు తమ వ్యక్తి గత జీవితంలో కూడా తక్కువ సమయంలో చేయాల్సిన అనేక పనులను, విభిన్న పనులను ఉన్నతంగా ముందుకు తీసుకెళతారు.    
2.     ఆర్ధిక క్రమశిక్షణ
ఒక సంస్థ , బిజినెస్ పెట్టినప్పుడు కాపిటల్ ఎంత, ఒకే సారి పెట్టే ఖర్చులు ఎంత, నెల వారీ ఖర్చులు ఎంత అని ఆలోచించినపుడు ప్రాజెక్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లాగానే వ్యక్తిగత ఆర్ధిక ఆలోచనలు మొదలౌతాయి. డబ్బుని ఎలా ఖర్చు చేయాలి?, ఏ అంశాలకు ఎంత ఖర్చు చేయాలి?, లిక్విడిటీ ఎంత ఉంచాలి?, భవిష్యత్తులో రాబోయే ఖర్చులు ఎంత?, నా వ్యాపారం కొంత తక్కువ లాభాలను ఇచ్చినా ఇల్లు, పిల్లల అవసరాలకు ఎలాంటి ప్రణాళిక అవసరం అని ఆలోచించటం మొదలెడతారు. అయితే వాటిని రాసుకుని , నెలవారీ ఖర్చులను మానిటర్ చేసుకుంటే అటు బిజినెస్ లో ఇటు వ్యక్తిగత జీవితంలో ఆర్థిక అంశాలు ఆరోగ్యంగా మలచుకోగలం.
3.     గెలుపు- గెలుపు సంధాన ఆలోచనలు
ఉద్యోగిగా ఉన్నపుడు షాపింగ్ కి వెళ్లి ఏదైనా వస్తువు కొంటే ఆశించిన రేటులో రాకపోతే వెంటనే బయటికి రావచ్చు  లేదా కొన్నప్పుడు సైకలాజికల్ గా అడ్జస్ట్ కావచ్చు. కానీ ఎంట్ర ప్రెన్యూర్ గా మారినపుడు వారు అందించే వస్తువులు , సేవలు నాకు ఎలా ఉపయోగ పడుతున్నాయి?, అందుకు వారు ఎంత రిస్క్ తీసుకుంటున్నారు?, ఎంత మంది శ్రమిస్తే ఎండ్ ప్రోడక్ట్ మన చేతికి వచ్చింది?..... ఇలా ఆలోచించే లక్షణం వస్తుంది. ఉన్నతంగా వస్తు, సేవలు అవసరాలను అర్థం చేసుకుంటారు. కస్టమర్లతో, వ్యాపార భాగస్వాములతో మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులతో, ఇతరులతో “నేనే గెలవాలి” అనే స్వల్ప ఆలోచన కాకుండా “ఇద్దరం గెలుద్దాం”  అనే సంధాన ఆలోచనలు ఆలోచిస్తారు. ఇదే మేనేజ్ మెంట్ లో  విన్ – విన్ నెగోషియేషన్ అంటారు.
4.     అవసరమైన వ్యక్తిగా మారటం  
“నేను ఇలానే ఉంటాను మారను- నా ఆరోగ్యం మారాలి, నేను ఉలానే ఉంటాను మారను- నా కుటుంబ సభ్యుల ప్రవర్తన / ఆఫీస్ లో పనిచేసే వారి ప్రవర్తన మారాలి”. ఇలా అనుకుంటే చివరకు మనమే మారాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎంట్రప్రెన్యూర్ వ్యక్తి గత జీవితం క్రమశిక్షణలు ఆ వ్యాపారంపై చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందుకే బిజినెస్ అవసరాలకు తగినట్లు మనిషి తనను తాను మార్చుకుంటాడు. అదే ఫ్లెక్సిబిలిటీ. ఈ ప్రక్రియలో తన అస్తిత్వాన్ని కోల్పోకుండా మార్పు జరిగితే అది వ్యాపార అవసరానికి తగిన ఆరోగ్యకరమైన మార్పు. ఒక మార్పు కంటే ముందు, వ్యక్తిగా మారతాం. అలాగే వ్యక్తి గత జీవితంలో కూడా ఉన్నత భర్త / భార్య గా, తల్లి / తండ్రిగా , పిల్లలకి ఆదర్శ వ్యక్తిగా మారాలంటే ఎలా అనే ఆలోచన ఎంట్రప్రెన్యూర్ కి వస్తుంది. ఆ ఫలితం పొందాలంటే దానికి తగిన వ్యక్తిగా మారగలిగే శక్తి, ఫ్లెక్సిబిలిటీ ఎంట్ర ప్రెన్యూర్ కి ఉంటుంది.  

ఈ నాలుగు అంశాలు ఎంట్ర ప్రెన్యూర్స్ వ్యక్తిగత జీవితంలో కూడా కీలక ఫలితాలను సాధించగలవు. మనిషి ఒక నైపుణ్యం (స్కిల్) నేర్చుకుంటే మెదడు ఆ స్కిల్ అవసరం వచ్చిన ప్రతీసారి ప్రదర్శింప చేస్తుంది. అది వ్యాపారం కావచ్చు, వ్యక్తిగత జీవితం కావచ్చు. ఇది అమ్మాయిలు వంట అమ్మ వారి ఇంటిలో నేర్చుకున్నా, అత్త వారి ఇంట్లో కూడా చేయగలగటం లాంటిది. ఇంకెందుకు ఆలస్యం ఎంట్ర ప్రెన్యూర్  అవ్వాలనే స్పష్టత మీలో ఉంటే అడుగులు ముందుకు వేయండి, ఆల్రెడీ మీరు బిజినెస్ లో ఉంటే ఆ ఆలోచనా రీతులు వ్యక్తిగత జీవితంలో ఎంత వరకు ఉపయోగిస్తునారో ఆలోచించుకోండి. బెస్ట్ విషెస్ ఫర్ గ్రేట్  బిజినెస్ అండ్ పర్సనల్ సక్సెస్. 
***  ***  ***  సైకాలజీ టుడే, ఏప్రిల్  2017 లో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  *** 

Sunday, 12 March 2017

మీ బలహీనతలను బలాలుగా మార్చుకునేందుకు సూత్రాలు


మనందరిలో అనేక బలహీనతలు ఉంటాయి. ఒకసారి మనం వాటిని గుర్తిస్తే బయటదడడానికి ప్రయత్నిస్తాం. ఉన్నతంగా మారడానికి ప్రయత్నిస్తాము. కోపం, నిర్మొహమాటం గా మాట్లాడడం నుంచి ‘నో’ చెప్పలేకపోవడం, ఇతరులకు చెప్పిన సమయానికి చేరుకోకపోవడం వరకు అనేక బలహీనతలు మనలో ఉండొచ్చు. అయితే వాటిని ఎలా మార్చుకోవాలి అందుకు పాటించగల సూత్రాలేమిటో చర్చిద్దాం. “తర్వాత చదువుదాం అనుకుంటున్నారా?”.... పనులు వాయిదా వేయటం అనేది ఒక పెద్ద బలహీనత ....అందుకే ఈ క్షణమే చదవండి, బలహీనతలు జయించడానికి కొత్త సంవత్సరం మీ జీవితంలో “ది బెస్ట్ ఇయర్” మలుచుకోడానికి ప్రయత్నాలు మొదలు పెట్టండి. అదెలాగో తెలుసుకుందాం రండి.    
***    ***    ***    ***    ***    ***
మీ జీవితంలో ఉన్న ఏ లక్షణాలకు,  ఏ  గుణాలకు  మీరు సంతోషంగా లేరు? ఈ క్రింద ఇచ్చిన 16 సాధారణ బలహీనతల లిస్టు లో మీలో ఉన్నాయని గట్టిగా భావించే ఎవైనా మూడు లక్షణాలను ఎంపిక చేసుకోండి.
  1. అపసవ్యంగా (Disorganized) – ఒక ప్రణాళికతో, పద్దతిలో సవ్యంగా పనులు చేయకపోవడం   
  2. అననుకూలంగా (Inflexible) – పరిస్థితులకు తగినట్లుగా ఆలోచనలను, నిర్ణయాలను, అలవాట్లను, జీవితాన్ని చూసే/ పనులు చేసే విధానాలను మార్చుకోలేకపోవటం  
  3. మొండిగా ఉండటం (Stubborn) – నేను ఇలానే ఉంటాను; నాకు, ఇతరులకు ఇలా ఉండటం ఉపయోగంగా లేకపోయినా, ఇబ్బందులు ఎదురైనా ఇలాగే ఉంటాను 
  4. అస్థిరంగా ఉండటం/ స్థిరంగా లేకపోవడం (Inconsistent) – స్థిరమైన ఆలోచన, స్థిరమైన నిర్ణయాలు, పనిచేయటం అందుకు జవాబుదారీగా ఉండటం
  5. చెడ్డగా ఉండటం,  ఉండటం (Obnoxious) – ఇతరులకు, తనకు, తన కుటుంబానికి మంచిది కాదు అని తెలిసి కూడా చెడ్డ బుద్దితో కూడిన ఆలోచనలు , నేను ఏమైనా పర్లేదు పక్కవాడు మాత్రం బాగుపడకూడదు వంటి ఆలోచనలు
  6. భావోద్వేగాలు లేనట్లు ఉండటం (Emotionless)
  7. సిగ్గు పడటం, బిడియంగా ఫీల్ అవడం (Shy)
  8. భాద్యతా రాహిత్యం, ఒక వ్యక్తిగా తీసుకోవాల్సిన బాధ్యత తీసుకోకపోవడం Irresponsible
  9. విసుగుతో ఉండటం (Boring)
  10. అవాస్తవ / వాస్తవానికి దూరంగా ఉండటం (Unrealistic)
  11. ప్రతికూల ఆలోచనలు, విధానాలతో ఉండటం(Negative)
  12. భయం వలన ముందుకు వెళ్ళలేకపోవడం (Intimidating)
  13. బలహీనమైన ఆలోచనలు, పనులు, ఫలితాలతో గడపడం (Weak)
  14. దురహంకారం (Arrogant) – ఉన్న పేరునో, వృత్తినో, పదవినో లేదా ఒక స్థితినో చూసుకుని  
  15. నిర్ణయం తీసుకోలేకపోవడం, ద్రుధసంకల్పం లేకపోవడం, అనిశ్చితితో కూడిన విధానాలు (Indecisive)
  16. ఓపిక, ఓర్పు లేకపోవటం, సహనం లేకపోవడం (Impatient)

మీలో మీరు గుర్తించిన ఏవైనా మూడు అంశాలను ఎంచుకున్నారా? అమ్మో....అని గాబరా పడకండి ఈ పెద్ద లిస్టు చూసి, మీకు మూడు కంటే ఎక్కువ అంశాలు బలహీనతలుగా ఉన్నా అప్పుడే కంగారు పడాల్సిన పని ఏమి లేదు. ఈ ఎక్సర్ సైజ్ తర్వాతి స్టెప్స్ లో మీ బలహీనతలు ప్రారదోలదానికి ప్రయత్నిస్తూనే ప్రాసెస్ అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు.
ఇప్పుడు ఈ క్రింది లిస్టు చూడండి, మళ్ళీ మీరు ఎంపికచేసుకున్న  మూడు లక్షణాల దగ్గర ఉన్న విశిష్ట లక్షణాలు (traits) గమనించండి.  

  1. అపసవ్యంగా (Disorganized) –
సృజనాత్మకంగా (క్రియేటివ్)
  1. అననుకూలంగా (Inflexible) –
సవ్యంగా (Organized)
  1. మొండిగా ఉండటం (Stubborn) –
అంకిత భావం (dedicated)
  1. అస్థిరంగా ఉండటం/ స్థిరంగా లేకపోవడం (Inconsistent) –
అనుకూలంగా మరే తత్వం (Flexible)
  1. చెడ్డ తనం (Obnoxious) –
ఉత్సాహభారితమైన (Enthusiastic)
  1. ావోద్వేగాలు లేనట్లు ఉండటం (Emotionless)
నిర్మలమైన (Calm)
  1. సిగ్గు పడటం (Shy)
ప్రతిబింబించే , ప్రతిస్పందించే (Reflective)
  1. భాద్యతా రాహిత్యం(Irresponsible)
సాహసోపేతమైన (Adventurous)
  1. విసుగుతో ఉండటం (Boring)
భాద్యతాయుతమైన (Responsible)
  1. అవాస్తవ ఉండటం (Unrealistic)
అనుకూల వైఖరి (పాజిటివ్)
  1. ప్రతికూల ఆలోచనలు(Negative)
వాస్తవంగా ఆలోచించే తత్వం (Realistic)
  1. భయం వలన ఆగిపోవడం (Intimidating)
దృఢమైన, మొహమాటం లేని (assertive)
  1. బలహీనమైన ఆలోచన (Weak)
వినయతతో కూడిన (Humble)
  1. దురహంకారం (Arrogant) –
ఆత్మ విశ్వాసం (self confidence)
  1. నిర్ణయం తీసుకోలేకపోవడం (Indecisive)
ఓపికతో కూడిన (Patient)
  1. ఓపిక, ఓర్పు లేకపోవటం, (Impatient)
గట్టి అభిరుచి, మక్కువ (passionate)

పై టేబుల్ లో వివరించినట్లు మీరు బలహీనత అనుకున్న మూడు అంశాలకు కుడి వైపు ఉన్నవే మీ బలాలు. ఒకోసారి పరిస్థితిని బట్టి బలాలా బలహీనతలా అనేది సమీకరణాలు మారిపోతాయి. అందుకే ఇవన్నీ ఏ ఫ్రేమ్ వర్క్ , ఏ స్థితిలో , ఏ కాంటెక్స్ట్ లో ఉన్నామన్న దానిపై, ఎంత మోతాదులో మీరు ఆశించిన ఫలితాలు లేదా ఎంత ఆనందంగా ఉన్నారు అన్నదానిపై ఆధారిపడి ఉంటుంది.
మీ పనిలో, వ్యక్తి గత జీవితంలో, సమాజంలో వేర్వేరు పరిస్థితిలలో మీ గుణాలు, లక్షణాలు మీకు బలహీనతలుగా , మీ ఎదుగుదలకు అడ్డంకులుగా ఉంటే ....ఆ అంశాలే చూపిస్తున్న మీ బలాలు ఏమిటో గుర్తించారు. ఈ బలాలను దృష్టిలో ఉంచుకుని మీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళే ఒక నిర్మాణాత్మక అవగాహన , ఆచరణ ఈ కొత్త సంవత్సరంలో ప్లాన్ చేసుకోండి. బలహీనతలు ఉండటం తప్పు కాదు, వాటిలో నర్మగర్భంగా ఉన్న అసలు పాజిటివ్ ఎక్స్ ప్రెషన్ గుర్తించి వాటిని ప్రాదాన్యాలుగా కార్యక్రమాలు చేయలేక పోవటమే ఫెయిల్యూర్ కి కారణం.
బలహీనతలను  జీవితాన్ని నేర్పే గురువులు మార్చుకోండి: అవును . మీరు ఎక్కడ ఆగిపోతారు అంటే కెరీర్ లో అయితే మీ నైపుణ్యాలు ఆగిన దగ్గర అయిపోతారు. మరి డబ్బు, ఆరోగ్యం, పెద్ద కలలు నిజం చేసుకోవడం ...ఇలా ఏ అంశం గమనించినా మనిషి కేవలం తను సృష్టించుకున్న బలహీనత దగ్గర అది అందిస్తున్న పాజిటివ్ హింట్  అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవడం వద్ద ఆగిపోతాడు. ఆ స్థితి మీకు రాకూడదంటే ఒక పని మీకు అవసరం ఉన్నా చేయలేకపోతున్నమంటే, ఒక విధానం జీవితాన్ని ఉన్నతంగా మార్చుతుందని తెలిసినా అమలు చేయలేక పోతున్నామంటే అది బలహీనత  అని. అది మీ కంఫర్ట్ జోన్ ని సవాల్ చేస్తుందని , దానిని చేయటం ద్వారా మీరు గొప్ప పాఠాలు నేర్చుకోగాలరని నమాలి. 
ఇలా చేసి చూడండి:

  1. మీ బలహీనతలను అంగీకరించండి. మనస్పూర్తిగా. అవి ఇస్తున్న పాజిటివ్ హింట్ గమనించండి
  2. మీ బలాలను ఒక లిస్టు గా రాయండి, మీ బలాలతో మీరు చేయగల పనులు రాయండి.
  3. మీ గొప్ప నైపుణ్యాలు రాయండి , వాటి ద్వారా చేయగల కార్యక్రమాలు రాయండి
  4. మీ బలాల ద్వారా మీ బలహీనతల ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవచ్చు ఆలోచించండి
  5. నమ్మకమైన  కోచ్, ట్రైనర్, స్నేహితులు మీ బలహీనతల నుంచి బయటపడటం కోసం మీరు జవాబుదారీగా (accountable) గా ఉండమని అడగండి
  6. ప్రణాళికతో ఉండటం ద్వారా మీ లక్ష్యాలు, ప్రాధాన్యాలు పై ధ్యాస ఉంచి, ఆ ఫలితాల కోసం ఏమి చేయాలో అదే చేయగలరు, అందుకు కావాల్సినవి నేర్చుకోగలరు, అప్పుడు బలహీనత గురించి ఆలోచించే సమయం లేనంతగా బిజీ అవుతారు
  7. మీకు లేని నైపుణ్యాలు నేర్చుకునేందుకు సమయం కేటాయించండి, ఉన్న స్థితి నుంచి మరో స్థితికి వెళ్ళాలంటే విజన్, స్కిల్ రెండూ ఉండాలి వాటిపై దృష్టిపెట్టండి.
  8. అదే బలహీనత ఉన్న ఇతరులకు కూడా అందులోంచి బయటపడడానికి సహాయం చేయండి  
  9. సిగ్గు పడాల్సిన పని లేకుండా నిర్మొహమాటంగా ఫీడ్ బ్యాక్ తీసుకోండి , మీరు ఏం ఫ్రేమ్ వర్క్స్ ఉచ్చులో పడుతున్నారో తెలుసుకోండి.
  10. ఇతరులు మీలో కొన్ని విషయాల గురించి జోక్స్ వేస్తున్నారంటే వారు అలా సరదాగా మాట్లాడుతూ మీ నుంచి ఆశిస్తున్న మార్పు  కోరుతున్నారేమో గమనించండి.
  11. ప్రతిఒక్క విషయాన్ని మార్చాలని చూడకండి, ప్రయత్నం మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, ఉన్నత ఫలితం అవ్వాలి. ఒక మొండి ప్రయత్నం , తలనొప్పి కాకూడదు.
అల్లావుద్దీన్ అద్భుత దీపం లో మొదట వచ్చేది రాక్షసి అయినా మన కోరికలను నిజం చేసే రాక్షసి మంచిదే కదా అలాగే మీ బలహీనత ఒక బలంగా మారి జీవితాన్ని ఉన్నతంగా రూపొందించుకునేందుకు ఒక మెట్టుగా ఉపయోగపడాలని ఆశించండి. 
***  ***  ***  సైకాలజీ టుడే, జనవరి 2017 లో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  ***

Sunday, 25 September 2016

మీలోని ఎంట్ర ప్రెన్యూర్ ని అడ్డుకునే సెల్ఫ్ డౌట్ కి చెక్ పెట్టే 8 అంశాలు


చాలామందికి బిజినెస్ చేయాలని, స్టార్టప్ స్థాపించాలని కోరిక ఉంటుంది కానీ నేను చేయగలనా అని సందేహం. ఇలా  ఔతుందేమో అలా ఔతుందేమో అని మీమాంస. కాబోయే పరిణామాలన్నీ ఫెయిల్యూర్స్ అవుతాయేమో అని భయం. ఇలాంటి సందేహం, మీమాంస, భయం ఉన్నవారు బిజినెస్ లో అడుగుపెట్టరు. కొందరు వీరికి భిన్నంగా “ఎలాగైనా సరే సొంత వ్యాపారం పెట్టాలి, పేరు, కీర్తి, డబ్బు సంపాదించాలి, పది మందికి ఉద్యోగం ఇవ్వాలి, కొన్ని తరాలకు మార్గదర్శకం కావాలి...” అని బిజినెస్ ప్రయాణంలో కొన్ని అడుగులు వేస్తారు. అప్పుడు మొదలౌతుంది అసలు కథ. ఊహించని మలుపులు, ఎంతకీ తెమలని  ఖర్చులు, భిన్న ఆలోచనలున్న పార్టనర్స్, మారుతున్న మార్కెట్ సమీకరణలు, ముప్పుతిప్పలు పెట్టే కస్టమర్స్, సమాచార విప్లవం, షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు, హ్యాండ్ ఇచ్చే వాళ్ళు,....ఇంకా ఎన్నో ఒడిదుడుకులు, రోజురోజుకీ పెరుగుతున్న సవాళ్ళు....మరి ఈ సమయంలో ఎంట్రప్రెన్యూర్స్ తమ మీద, తమ పని మీద, భవిష్యత్తు మీద ఆలోచనలు ఎలా ఉంటాయి? ఆశయం నడిపిస్తుందా? సంశయం నడిసంద్రంలో ముంచేస్తుందా?  అప్పుడు ఒక వ్యాపారస్తుడి (ఎంట్ర ప్రెన్యూర్) కి తన మీద తనకే అనుమానం కలిగితే ఏమి చేయాలి? సెల్ఫ్ డౌట్ నుంచి సెల్ఫ్ స్టార్ట్ ఎలా చేయాలి?  ఈ కీలక అంశాలు  తెలిపే  ఈ వ్యాసం మీకోసం ప్రత్యేకం.
***    ***    ***    ***    ***    ***
చాలా మంది విజేతలకు, ఆత్మ విశ్వాసం ప్రదర్శించే వారికి, గొప్ప బిజినెస్ మగ్నెట్స్ కు తమ శక్తి సామర్ధ్యాల మీద అనుమానం (సెల్ఫ్ డౌట్) ఉండదు అని అనుకుంటారు. అది నిజం కాదు. జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్ళతో సెల్ఫ్ డౌట్ (స్వీయ అనుమానం) అనేది సాధారణంగా వచ్చే ఆలోచన.  ఇది మానవ సహజం. కాకపోతే అది మీ అభివృద్ధికి ఆటంకపరిచే స్థితిలో ఉండకూడదు.
1: మీరు ఒంటరిగా లేరని తెలుసుకోండి:

మీ ఒక్కరికే కాదు ప్రపంచంలో ఎవరికైనా తమ మీద తమకి కొన్ని సందర్భాలలో అనుమానం వస్తుంది. ఎంత గొప్ప విజేతలకైనా కొన్ని సందర్భాలలో సెల్ఫ్ డౌట్ సహజం. మీరు మాత్రమే ఆత్మ విశ్వాసంలేక ఇబ్బంది పడుతున్నారు అనుకోకండి. ఒక పనిని మొదలుపెట్టకముందు, నేర్చుకునే దశలో, కొత్తగా చేసేటప్పుడు కాన్ఫిడెన్సు లేకపోవటం సహజం. నా ఒక్కడికే ఇలా అవుతుందేమో అనే ఆలోచన మనిషిని చాలా ఇబ్బందికి గురిచేస్తుంది. అలా అనుకోవలసిన అవసరం లేదు. కాబట్టి ఎంట్ర ప్రెన్యూర్ తమకు మాత్రమే సెల్ఫ్ వస్తుందనే భ్రమలోంచి బయటికిరావాలి. 
2: ఇతరులు ఏమి అనుకుంటారో అని ఆలోచించండి:
మీ సమయాన్ని . శక్తిని ఇతరులు మీ గురించి ఏమి అనుకుంటున్నారో అని ఆలోచిస్తూ ,  వారి ఎక్స్ పెక్టేషన్స్ తగ్గట్టు మిమ్మల్ని మీరు మార్చుకోడానికి ప్రయత్నించడం మిమ్మల్ని అసంతృప్తులుగా మిగులుస్తుంది. ఈ ప్రపంచంలో మనకంటే బాగా చేసే వారు, ఎక్కువ చేయగల వారు,  శక్తివంతులు ఉంటారు. అందుకే ఇతరుల నుంచి ప్రేరణ పొందడం వరకూ ఒకే కానీ వారిని ఒక స్థాయిని , పోసిషన్ ను ఒక కొలమానం (బెంచ్ మార్క్) లా ఊహించుకుని లైఫ్ లో నిజమైన జీవత్వాన్ని కోల్పోకండి.
3:  ప్రధాన లక్ష్యాలు నిర్ణయించుకోండి:    
మీ వ్యాపారంలో దీర్ఘకాలిక, ఫైర్ ఛార్జింగ్ ఇచ్చే గొప్ప గోల్స్ తో పాటు ఈ సంవత్సరం , మరో ఆరు నెలలలో చేరుకోగలిగిన షార్ట్ టర్మ్ గోల్స్ ఉండాలని నిర్ణయించుకోండి. మీ గోల్స్ ప్రతీ వారం/ ప్రతి నెల రివ్యూ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి ఎందుకంటే పెద్ద గోల్స్ సాధించడం లేట్ అయితే మన మీద మనకి డౌట్ రావటం సహజం. అదే చిన్న గోల్స్ ను ప్రతీ నేలా సాధిస్తూ వెళితే మనం చిన్న చిన్న విజయాల ద్వారా కాన్ఫిడెన్సు ఫీల్ అవుతాం, ఈ పని రెగ్యులర్ గా ఇంకొంచం ప్రోత్సాహం ఇస్తుంది.  
4:  గతంలోని విజయాలు గుర్తుకుతెచ్చుకోండి : అనుకోని పరిణామాలు , రిజల్ట్స్ తో మీకు మీ శక్తి యుక్తుల మీద డౌట్ వచినప్పుడు గతంలోని విజయాలను, రీసెంట్ గా వచ్చిన విజయాలను, గుర్తింపులను, ఇతరులు మీ మీద నమ్మకాన్ని ఇస్తూ మాట్లాడిన సందర్భాలు గుర్తుతెచ్చుకోండి. మీ విజయాలకు మీరు గుర్తింపు, ప్రేమ ఫీల్ అయినపుడు ఇప్పుడు చేతిలో ఉన్న ప్రాజెక్ట్ మీద ప్రేమ వస్తుంది.
5:  జాగ్రత్తగా ఎంచుకోండి:  ప్రపంచాన్ని, జీవితాన్ని, మనుషులను ఉన్నతంగా చూడటం, పాజిటివ్ గా, సంవృద్దితో నిండినట్లు రిసీవ్ చేసుకోవటం అలవాటు చేసుకోండి. ఇది ఒక జాగ్రత్తతో , కాన్షియస్ గా చేయవలసిన ప్రక్రియ. ప్రతీక్షణం అది లేదు , ఇది లేదు అని ఆలోచించే బదులు ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప సంపద, ఉన్నత మనుషులు, గొప్ప అంశాలు  ఉన్నాయి, మనం ప్రయత్నాలు  ద్వారా మన ప్రత్యేక ఎంపికల ద్వారా మనకు ఏమి కావాలో ఎన్నుకోవాలి అని అర్ధం నమ్మండి. 
6:  ప్రపంచాన్ని గుర్తుంచుకోండి:  అనుకూని వ్యతిరేక అనుభవాలు రావడం చాలా సహజం. మనం ఎవ్వరం వీటికి అతీతులం కాదు. చేసిన ప్రతీ పనిలో 100 % జరగాలని రూల్ లేదు. మీరు గొప్పగా, సరైన దిశలో  ప్రయత్నించి ఉండొచ్చు. అలా అని చెప్పి మీకు పాజిటివ్ రిజల్ట్ మాత్రమే రావాలని రూల్ లేదు. మీ ప్రయత్నానికి అనేక కారణాలు ప్రభావం లోబడి ఏమి రావాలో అదే వస్తుంది. అయితే గుర్తుంచుకోండి ఈ విశ్వంలో మధ్యలో మీరు ఒక్కరే లేరు, కోట్ల మంది ఉన్నారు, వారికి కూడా మీలా అనేక లక్ష్యాలు, విజయాలు, భావాలు ఉన్నాయి. అందుకే మీరు వెళ్ళే దారిలో ఇతరులు కలిసినపుడు వారి జర్నీ కి కూడా సహాయం చేస్తూ ముందుకు వెళ్ళే మంచిమనసుతో ముందుకెళ్ళండి. ప్రపంచాన్ని మనం గుర్తుంచుకుంటే , ప్రపంచం మనల్ని గుర్తుంచుకుంటుంది. మిమ్మల్ని ప్రేమించే, మీకు ఉన్నత ఫీడ్ బ్యాక్ ఇచ్చే వ్యక్తుల మధ్యలో ఉండండి.
7:  మీ ప్రయత్నాల విత్తనాలను నాటండి:  

చాలా మంది తమకి తాము ఒక సెల్ఫ్ ఇమేజ్ ఏర్పరుచుకుంటారు. అందులో తప్పేమీ లేదు. కాకపోతే ఏర్పరుచుకున్న ఇమేజ్ స్థాయిలో జీవితం, రోజులు నడవటంలేదంటే ఒక ఒత్తిడి , సెల్ఫ్ డౌట్ మొదలౌతుంది. ఒక సామెత గుర్తుంచుకోండి “మనం పాతి పెట్ట బడ్దాం అనుకోకండి, మనం విత్త బడ్దాం”. ప్రతి విత్తుకు ఒక మొక్కగా ఎదిగి, మానుగా ఫలాలను అందించేందుకు సమయం పడుతుంది. ఆ సమయం లో ఉన్నాం అనుకుని , ప్రయత్నాలు అనే విత్తనాలు నాటండి, ఓర్పుతో కొంచెం కొంచెం మెరుగుపరుచుకుంటూ వాటిని పోషించండి. అందుకే మీతో మీరు ఎందుకు నేను చేయలేకపోతున్నాను అనుకుంటూ నిందించుకోకండి. అది టైం వేస్ట్ పని. మిమ్మల్ని మీరు క్షమించుకుంటూ (Forgive), ప్రేమించుకుంటూ  ప్రయత్నాలనే విత్తనాలు నాటుతూ ముందుకు వెళ్ళండి.   
8:  భయాలను ఎదుర్కోండి :   గుర్తుంచుకోండి ఫ్రెండ్స్... మీ ఫలితాల మీద ఉన్న భయం, మీ ఆశయం మీద ఉన్న ప్రేమకంటే గొప్పది కాకూడదు. భయం, సెల్ఫ్ డౌట్ మిమ్మల్ని నిరోధించేలా , డిక్టేట్  చేసే అవకాశం ఇవ్వకండి. మిమ్మల్ని భయపెట్టే అంశాలే ముందు చేయండి. ఓడిపోతామేమో అని భయపడే వారు ఎప్పటికీ గెలవలేరు. మిమ్మల్ని మీరు కంఫర్ట్ జోన్ బయటికి వెళ్లి పుష్ చేస్తూ ముందుకు నడిపిస్తే, మీ అసలు కెపాసిటీ మీకు తెలుస్తుంది. మీరు ఎంత చేయగలరో నేర్చుకుంటారు.
***  ***  ***  సైకాలజీ టుడే, సెప్టెంబర్ 2016 లో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  ***


Friday, 23 September 2016

మిమ్మల్ని గుర్తుండిపోయేలా చేసే పర్సనల్ బ్రాండింగ్ కు పంచ సూత్రాలు [ Five Principles to Personal Branding ]

మీరు మీ ఇంట్లో, ఆఫీస్ లో, వ్యాపారంలో, ఊరిలో, బంధుమిత్రులలో ఎలా గుర్తింపబడుతున్నారు? ఇతరుల దృష్టిలో మీరు ఎలాంటి వారిగా గుర్తొస్తున్నారు. మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలని మీరు కోరుకుంటున్నారు? వీటిని  తెలుసుకోవాలంటే పర్సనల్ బ్రాండింగ్ అర్థం చేసుకోవాలి. వేగంగా మారుతున్న E-యుగంలో మీరేంటి అంటే మీ ఆన్ లైన్ ఉనికి గురించి కూడా అనేది E-తరం అర్థం చేసుకోవాలి. అందుకే మీ ఫేస్ ఏంటో ఫేస్ బుక్ చెప్తుందా, మీ ఫేస్ ఒక  బుక్ లా, మీరే ఒక గొప్ప గ్రంధంలా గుర్తించబడాలా? ఈ కీలక అంశాలు  తెలిపే “పర్సనల్ బ్రాండింగ్ కు  పంచ సూత్రాలు” మీకోసం ప్రత్యేకం.
***    ***    ***    ***    ***    ***
ప్రపంచానికి మీరు ఎలా కనిపిస్తున్నారు అనేది మీ పర్సనల్ బ్రాండింగ్. మీరు ఎవరు, మీ ప్రత్యేకత ఏమిటి, మీరు ఏమి సేవలు అందిస్తుంటారు తెలిసిన తర్వాత ప్రజలు మీరు ఎంచుకున్న రంగంలో మిమ్మల్ని ఆ సర్వీస్ అవసరం ఉన్నప్పుడు గుర్తుకు తెచ్చుకోగలరు. అయితే ప్రశ్న ఏమిటంటే మిమ్మల్ని మీ రంగంలో ఏ వ్యక్తిగా గుర్తుంచుకోవాలనుకుంటున్నారు?  ఏ సర్వీస్ కోసం మిమ్మల్ని ఎటువంటి ప్రత్యేక కారణం చేత సంప్రదించగలరనుకుంటున్నారు? ఏ విధంగా ప్రజలు మిమ్మల్ని ఎక్కువగా గుర్తుంచుకోవాలనుకుంటున్నారు? ప్రజలకు ఉన్నతంగా ఉపయోగపడే వ్యక్తిగా మీరు గుర్తుండిపోవాలంటే ఈ క్రింది పర్సనల్ బ్రాండింగ్  పంచ సూత్రాలు పాటించండి 
1: మీ అసలైన వ్యక్తిత్వం ప్రదర్శించండి:

 ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి మీరు కాని మరో వ్యక్తిలా గొప్ప వారిలా, సరదా మనిషిలా, అప్పటికప్పుడు మరోలా ఉండాలని ప్రయత్నిస్తే అది తాత్కాలిక విజయమే. ప్రజలు ఊసరవెల్లి మనస్తత్వాలను, డాంబికాలను గుర్తిస్తారు. గొప్ప గొప్ప సంస్థలు, ప్రభుత్వాలు, ప్రముఖులు లేని విలువలు తమ నిజమైన భావాలని చెప్పుకుని ఆచరణ లో నిరూపించుకోలేక కుప్పకూలిన దాఖలాలు చాలా ఉన్నాయి. అందుకే మీరు మీలా ఉండండి. అంటే ఒక నమ్మకైన మీదైనా స్వభావాన్ని తెలిపే విధానాలు ఎంచుకోండి. బయటి రూపం, స్వరూపం మార్చే అనేక ప్రక్రియలు నేర్చుకుని లోపల అంతా ఖాళీగా ఉంటే కోటు, బూటు చూసి ప్రజలు రెస్పెక్ట్ ఇస్తారేమో  కానీ నోరు విప్పాక వారికి మనదగ్గర సత్తా లేకపోతే తెలిసి పోతుంది. మనుషులు ఇతర మనుషులతో బంధాలు ఏర్పరచుకుంటారు. మీరు మరో వ్యక్తిలా (మాస్క్ వేసుకుని) ఉంటే వారి బంధాన్ని మీరు దృడంగా  ఉంచుకోలేరు. ఇది ప్రకృతి నియమం.  
2: అవకాశాలు ఉన్నచోట మాట్లాడండి:
మీ పర్సనల్ బ్రాండింగ్ ఉన్నతంగా ముందుకు వెళ్ళాలి, ప్రజలు గుర్తించాలంటే వీలైనచోట మాట్లాడండి. అవును దీని ద్వారా అనేక వ్యక్తులతో కలిసిపోతారు. అందరిలాగే మీరు మాట్లాడితే గుంపులో గోవిందయ్య అన్నట్లు అయిపోతుంది. మీ ప్రత్యేకత చాటేలా ఉండాలి. ఆ టాపిక్ మీద పట్టు, మీ కాన్ఫిడెన్సు, మీరు ప్రజలతో కనెక్ట్ అయ్యే విధానం, మీరు అనేక ఇతర వనరులు గురించి చెప్పే విధానం ద్వారా  రాగానే మీరు వారికి ఎప్పటికీ గుర్తుండి పోవాలి. మీరు మొదటి రోజే గొప్ప వక్త అవ్వక పోవచ్చు, కొందరు మిమ్మల్ని విమర్శించవచ్చు, కొందరు ప్రోత్సహించవచ్చు. ఎటువంటి ఫీడ్ బ్యాక్ అయినా రిసీవ్ చేసుకోడానికి రెడీ గా ఉండండి. వాటినుంచి నేర్చుకోండి. మీ పర్సనల్ బ్రాండింగ్ పెంచుకోవాలంటే చిన్న చిన్న మీటింగ్స్ , కస్టమర్ అవేర్నెస్ కార్యక్రమాలు , మీ ఆఫీస్ లో మీటింగ్స్, బాస్ కి అభిప్రయాలు చెప్పడం, ఆ రంగం లోని ఇతరులు ప్రాబ్లం లో ఉంటే వాలంటీర్ గా సహాయం చేయడం బాగా ఉపయోగపడతాయి.       
3:  ఆర్టికల్స్ రాయండి:    

మీ రంగంలో కస్టమర్ లను ఆకర్షించడానికి ముందు వారు చదివే ఆర్టికల్స్ రాయండి. మంచి కంటెంట్ అందించండి. అందరిలా మీరు రాయకండి. మరో పది మంది రచయితలు రాసినా, పేజి డిజైన్ సరిగా చేయకపోయినా మీ ఆర్టికల్ మీదకు దృష్టి వెళ్ళేలా, చదివే వారి నిజ జీవితంలో ఉపయోగపడేలా, ఒక సారి మీ ఆర్టికల్ చదివితే మళ్ళీ ఇంకో ఎడిషన్ కోసం వెయిట్ చేసేలా రాయండి. ఒక మంచి ఆర్టికల్ రాయాలంటే ఒక మంచి థింకర్ అవ్వాలి అని అంటారు పెద్దలు. అది నిజం ఇది సమయంతో కూడుకున్న పని. మీరు చదువుతున్న మన సైకాలజీ టుడే పత్రిక కోసం గత ఆరు సంవత్సరాలుగా నేను ఆర్టికల్స్ రాస్తున్నాను. ఒకోసారి ఆర్టికల్ రాయడానికి ఒక రోజు సమయం కూడా పడుతుంది. కానీ గతం కంటే బాగా రాయాలన్న తపనతో, అవసరమైన కంటెంట్ అందించాలన్న ప్రేమతో ఆర్టికల్స్ రాస్తుంటాను. మనం ప్రతీసారి బెటర్ గా క్లైంట్ కి సర్వీస్ అందించగలిగితే ఉన్నతంగా గుర్తుంది పోతాము. మీరు ఎంచుకున్న రంగంలో రాయడానికి ఆన్ లైన్ వెబ్ సైట్స్, బ్లాగ్స్, మీ ఫేస్ బుక్, ఇతరుల సైట్ కోసం గెస్ట్ పోస్ట్ లు, న్యూస్ పేపర్స్, మ్యాగ జైన్లు ఇలా ఏవైనా ఎంచుకోవచ్చు.

4:  ఆన్ లైన్ లో మిమ్మల్ని మీరు ప్రెజెంట్ చేసుకోండి:
ఎవరైనా ఎక్కడా దొరకకపోతే ఆన్-లైన్ లో ఉన్నాడేమో వెతకండి అని ఆలోచించే రోజులు వచ్చేసాయి. ఒక సెకనుకి 2.3 మిలియన్స్ గూగుల్ సెర్చ్ లు జరుగుతున్నాయట. మీ రంగంలో కస్టమర్ లు సర్వీస్ కోసం వెతికితే మీరు కనిపించాలి. ఆన్ లైన్ లో ప్రముఖ సోషల్ మీడియా సైట్ లలో (ఉదా: ఫేస్ బుక్, ట్విట్టర్, పింటరెస్ట్, ఇన్ స్టాగ్రామ్) మీ ప్రొఫైల్, ప్రెజెన్స్ ఉండేలా చూసుకోండి. అయితే ఆన్- లైన్ లో మీ బ్రాండ్ విలువ మీరే  ఎప్పటికప్పుడు గమనించు కోవాలి, మానిటర్ చేసుకోవాలి. సొంతంగా వెబ్ సైట్ ఉంటే మంచిది, ఖర్చు, కాస్త టెక్నికల్ అంశాల పైన పట్టు ఉండాలి. వెబ్సైటు ఖర్చు పెట్టె బదులు వర్డ్ ప్రెస్ , బ్లాగ్ స్పాట్. కాం వంటివి వాడుకుని మీరే సైట్ నిర్మించుకోవచ్చు. ఇది కాస్త సమయం, కొత్త అంశాలు నేర్చుకునే లక్షణం, టెక్నికల్ అంశాలు పాటించడం ద్వారానే సాధ్యం. ఒకవేళ ఈ జాగ్రత్తలు తీసుకోలేకపోతే, నేర్చుకోలేకపోతే మీ అభివృద్ధిని, మీ పర్సనల్  బ్రాండింగ్ ని మీరే అడ్డుకున్న వారౌతారు.  

5:  మీ రంగంలో కొత్త అంశాలు నేర్చుకోండి:  రాకెట్ స్పీడ్ తో కొత్త అంశాలు వచ్చి చేరుతున్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మీ రంగంలో కొత్త అంశాలను నేర్చుకోండి. చాలా సంవత్సరాలుగా మీరు కొంత స్థాయి మించి వెళ్ళలేకపోతున్నారు అంటే మీ నైపుణ్యాలు పరిధి అని అర్థం. నైపుణ్యాలు నేర్చుకోండి, కొత్త అంశాలతో మిమ్మల్ని ఇండస్ట్రీ లో అప్డేటెడ్ పర్సన్ గా గుర్తింపు తెచ్చుకోండి. ఈ అంశాలతో మీ పర్సనల్, కంపెనీ  బ్రాండింగ్ ఉన్నతంగా మలుచుకోండి, మీ సక్సెస్ స్టొరీ మాతో పంచుకోండి.
Five principles for Personal Branding:
1. Show your real you
2. Speak wherever possible
3. Write articles
4. Create online presence
5. Update and learn constantly

***  ***  ***  సైకాలజీ టుడే, ఆగష్టు 2016 లో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  ***

Sunday, 7 February 2016

లేటు వయస్సులో గ్రేటు విజయం - వయస్సుతో సంబంధం లేకుండా విజేతగా నిలవడం ఎలా?


“నా జీవితం ఇంతే సరైన టైం కి పెళ్లి చేసుకుంటే….”, “25 సంవత్సరాలకే ఉద్యోగం వచ్చి ఉన్నట్లయితే ఎంత బాగుండేదో”, “ఈ  లైఫ్ , ఈ వయసులో నా చేతిలో ఏం ఉంది”, “ఈ వయసులో ఏమి చేస్తాను లెండి, శరీరమే సహకరించక పోతే ఇంకా ఇప్పుడు నేను ఎదో కొత్త ప్రయత్నాలు చేయడం దేనికి” ఇలా వయసుకి వారి జీవితానికి లింక్ పెట్టి మాట్లాడుతుంటారు కొందరు. మరి ఈ అంశాలలో వాస్తవం ఎంత? శరీరం, మనస్సు, వాటిమీద వయస్సు ప్రభావం ఎంత? మలి వయస్సులో సక్సెస్ మంత్రం జపించడం ఎలా ? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని నిరూపించిన వారెవరన్నా ఉన్నారా? ఉంటే వారు ఏం చేసారు? ఏ వయస్సు వారైనా ఆశించిన జీవితాన్ని సాధించుకోవటం ఎలాగో కాలం నేర్పిన పాఠాలు, కారణ జన్ములుగా పాటించిన విజేతల జీవితాలలో సక్సెస్ నియమాలు మీకోసం.
వయస్సు అనేది మనిషి తన ఉనికిని (existence) చెప్పడానికి వాడుకున్న అంశం. నాకు  ఇన్ని సంవత్సరాలు, మీకు ఆ పనికి ఎంత కాలం పట్టింది? వంటి కనీస వ్యవహారానికి ఉపయోగపడేది సమయం. మరి ఈ సమయం అనేది ఎక్కడ మొదలైంది ఎక్కడ అంతమౌతుంది పక్కకిపెడితే, మనం జన్మించాక వయసుని సంవత్సరాలలో కొలవడం తెలుసుకుంటాం, ఏ వయసుకి ఏం  పనులు చేస్తాము అనేది ప్రపంచం ద్వారా నేర్చుకుంటాం. అయితే మరి వయసుకి, శరీరానికి, మనసుకి లింక్ ఎక్కడ ఉంది?
శరీరానికి వయస్సు ఉందా?
ఇప్పడు మీకు ఉన్న శరీరం వయస్సు ఎంత? వయస్సు అనేది మనిషి శరీరానికి ఉందా? మనిషి మెమరీ లో మాత్రమే ఉందా? క్లినికల్ గా మాట్లాడితే మన శరీరం లోని కణజాలం మొత్తం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఒక సారి మనిషి గాలి పీల్చుకుని వదిలేసే సమయానికి కొన్ని కోట్ల కణాలు (ఇంచుమించుగా అవి 10 22)  మన శరీరం నుంచి ఈ సృష్టిలోకి వదులుతాము, అంతే సంఖ్యలో సృష్టిలోని కణాలు మన శరీరం లోకి తీసుకుంటాము. ఇది ఒక  మన సైంటిఫిక్ అంచనా. ఇంతేకాదు సైన్సు చెప్పేది ఏమిటంటే ఒక్క  సంవత్సరంలో మనిషిలో  98 % శరీరం పూర్తిగా మారిపోయి  కొత్త కణాలు నిర్మించుకుంటారని.  అలాగే 5 రోజులలో స్టమక్ లైనింగ్ 10 రోజులలో నాలుక రుచి మొగ్గలు, ఐదు నెలలకు లివర్, 3 వారాలలో ఊపిరి తిత్తులు, చర్మం, 4 వారాలకు రక్తకణాలు ఇలా ప్రతి అవయవం, వ్యవస్థ లోను  కణాలు మారిపోతుంటాయి. అంటే నాకు  ఇన్ని సంవత్సరాలు అని మీరు అన్నప్పుడు ఏ బాడీ (ఏ కణాల సమూహం) గురించి మాట్లాడుతున్నారో రిఫరెన్స్ తీసుకోవటం వీలుకాని ఒక వింతైన పరిస్థితి. వినటానికి కొత్తగా ఉన్నా ఇది సైంటిఫిక్ గా నిర్ధారించబడింది. అందుకే మనిషి ఒక మెమరీ మెషిన్ లా తనను తాను నిర్మించుకుంటాడు అంటారు.  మన శరీరం (బాడీ) అనేది నిరంతరం ఏర్పడుతూ ఉండే ఒక ప్రాసెస్, ఒక నిశ్చలమైన స్తబ్దమైన వస్తువు కాదు. అలా కనిపిస్తుంది అంతే.  అంటే మనం మన బాడీని ఎప్పటికప్పుడు కొత్తగా సృష్టించుకుంటూ ఉంటామన్న మాట. గతం నుంచి ఇప్పటివరకు మెమరీ లో విషయాలు మోస్తూ , కొత్త కణాలకు అందించే ఒక ఇంటలిజెన్స్ మనలో ఉంది.

మీ మనసులో వయసు ఏమంటోంది?:

అవును. ఇంతకీ మీ మనసులో వయసు మీతో ఎప్పుడూ ఏమి చెప్తుంది? మీ వయసు ఎంత అని చెప్తుంది? “అది  ఏంటి అలా అంటారు నేను పుట్టింది ఏం సంవత్సరమో నాకు తెలుసు, అప్పటి నుంచి ఈ 2016 ఫిబ్రవరి నాటికి ఇన్ని సంవత్సరాలు”  ఇది వాస్తవం అంటారా? అవును అది వాస్తవమే. అలా ప్రతి రోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం మీతో మీరు నాకు ఇన్ని సంవత్సరాలు, నా వయస్సు ఇది అని చెప్తున్నారు కాబట్టి. మీ మైండ్ తో మీ బాడీ కి ఒక సిగ్నల్ ఇస్తునారు, మీ వయసు గురించి, ఈ వయసులో చేయగల పనులు ఇవే అని, ఈ వయసులో చేయలేని పనులు ఇవి అనీ, ఈ వయసులో ఈ జాబు చేయోచ్చు అని, చెయ్యకూడదు అని ఇలా ఇంకా ఎన్నో. అందులో తప్పేముంది  అంటారా? అదే వాస్తవం అంటారా? డియర్ ఫ్రెండ్స్ మీరు ఏది రిపీట్ చేసి చెప్తారో అదే నిజమని నమ్ముతారు, వయస్సు , జీవితం, చేయగలిగే పనులు...మరి ఏదైనా.
          ఒక పెద్దాయన నల్గొండ జిల్లా నుంచి కొడుకుని చూడడానికి హైదరాబాద్ వచ్చాడు. కొడుకు అమీర్ పేట్ లో ఆఫీస్ కి వెళుతూ నేను వెళ్లి వస్తాను, మనం రేపు ఆర్ట్  ఎగ్జిబిషన్ కి వెళదాం అన్నాడు. సాయంత్రం ఐదు గంటలకి ఇంటికి వచ్చే సమయానికి “నేను పేపర్ చదువుతుంటే జూబిలీ హిల్స్ లో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉందని తెలిసింది, అడ్రస్ కనుక్కొని వెళ్లి వచ్చా”  అన్నాడు తండ్రి. ఆశ్చర్య పోవటం కొడుకు వంతైంది. ఎందుకంటే తనతో ద్విచక్ర వాహనం మీద ఆయన్ని కాలుష్యంలో తిప్పటం కంటే మరునాడు కార్ లో కావలసిన ప్రదేశాలకు తీసుకు వెళ్ళాలని, రద్దీ బస్ లో వెళ్ళటం తండ్రికి ఇబ్బంది అని కొడుకు ఉద్దేశ్యం. కానీ తనకు నచ్చిన సబ్జెక్టు తను తెలుసుకోవాలని అడ్రస్ తెలుసుకొని కలిసి వచ్చాడు ఆయన. చిత్రమేమిటంటే అమీర్ పేట్ దూరం అని కొడుకు అనుకున్నాడు, సిటీ తెలియకపోయినా దానిని  దాటి జూబిలీ హిల్స్ వెలి వచ్చాడు పెద్దాయన. ఈ ముచ్చట్లలో కొడుకి స్నేహితుడు వచ్చాడు. అతనికి తను రీసెంట్ గా వేసిన పెన్సిల్ ఆర్ట్ అంటూ చూపించాడు పెద్దాయన. “ఈ వయసులో మీరు బొమ్మలు వేశారంటే రిటైర్మెంట్ వయసులో మీరు ఆర్టిస్ట్ అయ్యారు సార్ అన్నాడు 43 ఏళ్ళ కొడుకి స్నేహితుడు. “నా వయసు ఎంత అనుకుంటున్నారు చెప్పండి” అన్నాడు పెద్దాయన. “64 ఏళ్ళు” బదులిచ్చాడతను. “ కాదు నాకు ముప్పై ఏళ్లే, మీరు అంతా నాకు అరవై అని అనుకుంటున్నారు , నాతో నేను మనసులో, బయటా ఉత్సాహంగా, హాయిగా ముప్పై వాళ్ళ లాగానే ఉంటాను అలాగే అనుకుంటాను, అంతే, వయస్సు శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది.” అన్నాడు పెద్దాయన. మరుసటి రోజు ఐదు గంటలు కష్టపడి వాటర్ కలర్ తో లైఫ్ మొదటిసారి ఒక బొమ్మ గీసి చూపించాడు పెద్దాయన. పక్క చిత్రంలో గమనించగలరు. ఆ పెద్దాయన నా తండ్రి, ఆయన వయసుకి తెలియని ప్రదేశాలలో తిరగటం ఇబ్బంది అని నమ్మకాన్ని మార్హ్సుకుంది నేనే. ఇప్పటికీ హైదరాబాద్ వస్తే నాన్న తను చూడాలనుకున ప్రదేశాలకు హాయిగా బస్ లోనే వెళ్లి వస్తున్నారు.ఆయన వయసు 64 (మన కాలమానం ప్రకారం), ఆయన మనస్సు ఆయనతో మాట్లాడే లెక్కల ప్రకారం నాకంటే నాన్న ఐదేళ్ళు చిన్న.           

వయసుతో సంబంధం లేకుండా సాధించండి: వయసుతో సంబంధం లేకుండా మీరు బాగా ప్రేమించే పనిని చేయండి. మీ వృత్తిలో ఇతరులకు శిక్షణ ఇవ్వడం ద్వారా మరింతమందికి సహాయం చేయండి , మీరు బాగా ప్రేమించే పని, హాబీస్, చూడాలనుకున్న ప్రదేశాలు, కలవాలనుకున్న వ్యక్తులు ప్రయత్నం చేయండి. జీవితం అనేది ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది , మనం చుసేదానిని బట్టి మారుతుంది. బయటి ప్రపంచం ఎలా ఉంటుందంటే అంతర్ ప్రపంచం ఎంత ఉన్నతంగా ఉంది అన్నదానిపై ఆధార పడి ఉంటుంది. కొంత మంది కుర్ర వాళ్ళు పుట్టుకతో వృద్ధులు అన్నారు మహాకవి శ్రీ శ్రీ . అలాగే కొందరు పెద్దవాళ్ళు ఇప్పటికే యువకులే. వారిలో ఉత్సాహం, ఆలోచనా విధానం ఇతరులను ఇన్ స్పైర్ చేయగలదు. ఉదాహరణకి చూడండి.

§ 55 ఏళ్ళ కి పాబ్లో పికాసో తన మాస్టర్ పీస్ గ చెప్పుకునే గేర్నికా బొమ్మ వేశాడు
§ 58 ఏళ్ళ వయసులో సోనీ కంపెనీ చైర్మన్ అకియో మొరిటా అప్పట్లో ఎవ్వరు ఊహించని సోనీ వాక్ మాన్ తయారీ చేసాడు
§ 60 ఏళ్ళ కు జార్జ్ బెర్నార్డ్ షా “హార్ట్ బ్రేక్ హౌస్”  అనే మాస్టర్ పీస్ రాసారు
§ 62 ఏళ్ళకు  JRR టోకీన్స్ లార్డ్ అఫ్ ది రింగ్స్ అనే ఫాంటసీ సిరీస్ లో మొదటి పుస్తకం పబ్లిష్ చేసాడు
§ 70 ఏళ్ళ సంవత్సరాలు వయసుగల భార్య రూబీ చనిపోతే ఆ బాధని 3 సంవత్సరాలు భరించి తన 96 సంత్సరాల వయసులో హరీ బెర్న్ స్టీన్ “ది ఇన్విజుబుల్ వాల్” అనే తన మొదరి పుస్తకం రాసాడు.
§ 99 సంవత్సరాల టీచి ఇరగాషి  మౌంట్ ఫుజి అధిరోహించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసారు. 

వీళ్ళంతా వయస్సు తో వచ్చిన అనుభవాన్ని తమని విజేతలుగా నిలబెట్టేలా ఉపయోగించుకునారు అద్భుతాలు చేసారు. ఎదో సినిమాలో చెప్పిన మాటలలో చెప్పాలంటే “ఎప్పుడు వచ్చామన్నది కాదు విజేతగా నిలిచామా లేదా అన్నది ప్రశ్న”. ప్రయత్నానికి ఎప్పుడూ ఓటమి లేదు. అందుకే వయసుతో సంబంధం లేదు ప్రయత్నించండి.

***  ***  ***  సైకాలజీ టుడే, ఫిబ్రవరి 2016 లో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  ***