Sunday, 25 September 2016

మీలోని ఎంట్ర ప్రెన్యూర్ ని అడ్డుకునే సెల్ఫ్ డౌట్ కి చెక్ పెట్టే 8 అంశాలు


చాలామందికి బిజినెస్ చేయాలని, స్టార్టప్ స్థాపించాలని కోరిక ఉంటుంది కానీ నేను చేయగలనా అని సందేహం. ఇలా  ఔతుందేమో అలా ఔతుందేమో అని మీమాంస. కాబోయే పరిణామాలన్నీ ఫెయిల్యూర్స్ అవుతాయేమో అని భయం. ఇలాంటి సందేహం, మీమాంస, భయం ఉన్నవారు బిజినెస్ లో అడుగుపెట్టరు. కొందరు వీరికి భిన్నంగా “ఎలాగైనా సరే సొంత వ్యాపారం పెట్టాలి, పేరు, కీర్తి, డబ్బు సంపాదించాలి, పది మందికి ఉద్యోగం ఇవ్వాలి, కొన్ని తరాలకు మార్గదర్శకం కావాలి...” అని బిజినెస్ ప్రయాణంలో కొన్ని అడుగులు వేస్తారు. అప్పుడు మొదలౌతుంది అసలు కథ. ఊహించని మలుపులు, ఎంతకీ తెమలని  ఖర్చులు, భిన్న ఆలోచనలున్న పార్టనర్స్, మారుతున్న మార్కెట్ సమీకరణలు, ముప్పుతిప్పలు పెట్టే కస్టమర్స్, సమాచార విప్లవం, షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు, హ్యాండ్ ఇచ్చే వాళ్ళు,....ఇంకా ఎన్నో ఒడిదుడుకులు, రోజురోజుకీ పెరుగుతున్న సవాళ్ళు....మరి ఈ సమయంలో ఎంట్రప్రెన్యూర్స్ తమ మీద, తమ పని మీద, భవిష్యత్తు మీద ఆలోచనలు ఎలా ఉంటాయి? ఆశయం నడిపిస్తుందా? సంశయం నడిసంద్రంలో ముంచేస్తుందా?  అప్పుడు ఒక వ్యాపారస్తుడి (ఎంట్ర ప్రెన్యూర్) కి తన మీద తనకే అనుమానం కలిగితే ఏమి చేయాలి? సెల్ఫ్ డౌట్ నుంచి సెల్ఫ్ స్టార్ట్ ఎలా చేయాలి?  ఈ కీలక అంశాలు  తెలిపే  ఈ వ్యాసం మీకోసం ప్రత్యేకం.
***    ***    ***    ***    ***    ***
చాలా మంది విజేతలకు, ఆత్మ విశ్వాసం ప్రదర్శించే వారికి, గొప్ప బిజినెస్ మగ్నెట్స్ కు తమ శక్తి సామర్ధ్యాల మీద అనుమానం (సెల్ఫ్ డౌట్) ఉండదు అని అనుకుంటారు. అది నిజం కాదు. జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్ళతో సెల్ఫ్ డౌట్ (స్వీయ అనుమానం) అనేది సాధారణంగా వచ్చే ఆలోచన.  ఇది మానవ సహజం. కాకపోతే అది మీ అభివృద్ధికి ఆటంకపరిచే స్థితిలో ఉండకూడదు.
1: మీరు ఒంటరిగా లేరని తెలుసుకోండి:

మీ ఒక్కరికే కాదు ప్రపంచంలో ఎవరికైనా తమ మీద తమకి కొన్ని సందర్భాలలో అనుమానం వస్తుంది. ఎంత గొప్ప విజేతలకైనా కొన్ని సందర్భాలలో సెల్ఫ్ డౌట్ సహజం. మీరు మాత్రమే ఆత్మ విశ్వాసంలేక ఇబ్బంది పడుతున్నారు అనుకోకండి. ఒక పనిని మొదలుపెట్టకముందు, నేర్చుకునే దశలో, కొత్తగా చేసేటప్పుడు కాన్ఫిడెన్సు లేకపోవటం సహజం. నా ఒక్కడికే ఇలా అవుతుందేమో అనే ఆలోచన మనిషిని చాలా ఇబ్బందికి గురిచేస్తుంది. అలా అనుకోవలసిన అవసరం లేదు. కాబట్టి ఎంట్ర ప్రెన్యూర్ తమకు మాత్రమే సెల్ఫ్ వస్తుందనే భ్రమలోంచి బయటికిరావాలి. 
2: ఇతరులు ఏమి అనుకుంటారో అని ఆలోచించండి:
మీ సమయాన్ని . శక్తిని ఇతరులు మీ గురించి ఏమి అనుకుంటున్నారో అని ఆలోచిస్తూ ,  వారి ఎక్స్ పెక్టేషన్స్ తగ్గట్టు మిమ్మల్ని మీరు మార్చుకోడానికి ప్రయత్నించడం మిమ్మల్ని అసంతృప్తులుగా మిగులుస్తుంది. ఈ ప్రపంచంలో మనకంటే బాగా చేసే వారు, ఎక్కువ చేయగల వారు,  శక్తివంతులు ఉంటారు. అందుకే ఇతరుల నుంచి ప్రేరణ పొందడం వరకూ ఒకే కానీ వారిని ఒక స్థాయిని , పోసిషన్ ను ఒక కొలమానం (బెంచ్ మార్క్) లా ఊహించుకుని లైఫ్ లో నిజమైన జీవత్వాన్ని కోల్పోకండి.
3:  ప్రధాన లక్ష్యాలు నిర్ణయించుకోండి:    
మీ వ్యాపారంలో దీర్ఘకాలిక, ఫైర్ ఛార్జింగ్ ఇచ్చే గొప్ప గోల్స్ తో పాటు ఈ సంవత్సరం , మరో ఆరు నెలలలో చేరుకోగలిగిన షార్ట్ టర్మ్ గోల్స్ ఉండాలని నిర్ణయించుకోండి. మీ గోల్స్ ప్రతీ వారం/ ప్రతి నెల రివ్యూ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి ఎందుకంటే పెద్ద గోల్స్ సాధించడం లేట్ అయితే మన మీద మనకి డౌట్ రావటం సహజం. అదే చిన్న గోల్స్ ను ప్రతీ నేలా సాధిస్తూ వెళితే మనం చిన్న చిన్న విజయాల ద్వారా కాన్ఫిడెన్సు ఫీల్ అవుతాం, ఈ పని రెగ్యులర్ గా ఇంకొంచం ప్రోత్సాహం ఇస్తుంది.  
4:  గతంలోని విజయాలు గుర్తుకుతెచ్చుకోండి : అనుకోని పరిణామాలు , రిజల్ట్స్ తో మీకు మీ శక్తి యుక్తుల మీద డౌట్ వచినప్పుడు గతంలోని విజయాలను, రీసెంట్ గా వచ్చిన విజయాలను, గుర్తింపులను, ఇతరులు మీ మీద నమ్మకాన్ని ఇస్తూ మాట్లాడిన సందర్భాలు గుర్తుతెచ్చుకోండి. మీ విజయాలకు మీరు గుర్తింపు, ప్రేమ ఫీల్ అయినపుడు ఇప్పుడు చేతిలో ఉన్న ప్రాజెక్ట్ మీద ప్రేమ వస్తుంది.
5:  జాగ్రత్తగా ఎంచుకోండి:  ప్రపంచాన్ని, జీవితాన్ని, మనుషులను ఉన్నతంగా చూడటం, పాజిటివ్ గా, సంవృద్దితో నిండినట్లు రిసీవ్ చేసుకోవటం అలవాటు చేసుకోండి. ఇది ఒక జాగ్రత్తతో , కాన్షియస్ గా చేయవలసిన ప్రక్రియ. ప్రతీక్షణం అది లేదు , ఇది లేదు అని ఆలోచించే బదులు ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప సంపద, ఉన్నత మనుషులు, గొప్ప అంశాలు  ఉన్నాయి, మనం ప్రయత్నాలు  ద్వారా మన ప్రత్యేక ఎంపికల ద్వారా మనకు ఏమి కావాలో ఎన్నుకోవాలి అని అర్ధం నమ్మండి. 
6:  ప్రపంచాన్ని గుర్తుంచుకోండి:  అనుకూని వ్యతిరేక అనుభవాలు రావడం చాలా సహజం. మనం ఎవ్వరం వీటికి అతీతులం కాదు. చేసిన ప్రతీ పనిలో 100 % జరగాలని రూల్ లేదు. మీరు గొప్పగా, సరైన దిశలో  ప్రయత్నించి ఉండొచ్చు. అలా అని చెప్పి మీకు పాజిటివ్ రిజల్ట్ మాత్రమే రావాలని రూల్ లేదు. మీ ప్రయత్నానికి అనేక కారణాలు ప్రభావం లోబడి ఏమి రావాలో అదే వస్తుంది. అయితే గుర్తుంచుకోండి ఈ విశ్వంలో మధ్యలో మీరు ఒక్కరే లేరు, కోట్ల మంది ఉన్నారు, వారికి కూడా మీలా అనేక లక్ష్యాలు, విజయాలు, భావాలు ఉన్నాయి. అందుకే మీరు వెళ్ళే దారిలో ఇతరులు కలిసినపుడు వారి జర్నీ కి కూడా సహాయం చేస్తూ ముందుకు వెళ్ళే మంచిమనసుతో ముందుకెళ్ళండి. ప్రపంచాన్ని మనం గుర్తుంచుకుంటే , ప్రపంచం మనల్ని గుర్తుంచుకుంటుంది. మిమ్మల్ని ప్రేమించే, మీకు ఉన్నత ఫీడ్ బ్యాక్ ఇచ్చే వ్యక్తుల మధ్యలో ఉండండి.
7:  మీ ప్రయత్నాల విత్తనాలను నాటండి:  

చాలా మంది తమకి తాము ఒక సెల్ఫ్ ఇమేజ్ ఏర్పరుచుకుంటారు. అందులో తప్పేమీ లేదు. కాకపోతే ఏర్పరుచుకున్న ఇమేజ్ స్థాయిలో జీవితం, రోజులు నడవటంలేదంటే ఒక ఒత్తిడి , సెల్ఫ్ డౌట్ మొదలౌతుంది. ఒక సామెత గుర్తుంచుకోండి “మనం పాతి పెట్ట బడ్దాం అనుకోకండి, మనం విత్త బడ్దాం”. ప్రతి విత్తుకు ఒక మొక్కగా ఎదిగి, మానుగా ఫలాలను అందించేందుకు సమయం పడుతుంది. ఆ సమయం లో ఉన్నాం అనుకుని , ప్రయత్నాలు అనే విత్తనాలు నాటండి, ఓర్పుతో కొంచెం కొంచెం మెరుగుపరుచుకుంటూ వాటిని పోషించండి. అందుకే మీతో మీరు ఎందుకు నేను చేయలేకపోతున్నాను అనుకుంటూ నిందించుకోకండి. అది టైం వేస్ట్ పని. మిమ్మల్ని మీరు క్షమించుకుంటూ (Forgive), ప్రేమించుకుంటూ  ప్రయత్నాలనే విత్తనాలు నాటుతూ ముందుకు వెళ్ళండి.   
8:  భయాలను ఎదుర్కోండి :   గుర్తుంచుకోండి ఫ్రెండ్స్... మీ ఫలితాల మీద ఉన్న భయం, మీ ఆశయం మీద ఉన్న ప్రేమకంటే గొప్పది కాకూడదు. భయం, సెల్ఫ్ డౌట్ మిమ్మల్ని నిరోధించేలా , డిక్టేట్  చేసే అవకాశం ఇవ్వకండి. మిమ్మల్ని భయపెట్టే అంశాలే ముందు చేయండి. ఓడిపోతామేమో అని భయపడే వారు ఎప్పటికీ గెలవలేరు. మిమ్మల్ని మీరు కంఫర్ట్ జోన్ బయటికి వెళ్లి పుష్ చేస్తూ ముందుకు నడిపిస్తే, మీ అసలు కెపాసిటీ మీకు తెలుస్తుంది. మీరు ఎంత చేయగలరో నేర్చుకుంటారు.
***  ***  ***  సైకాలజీ టుడే, సెప్టెంబర్ 2016 లో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  ***


No comments:

Post a Comment