Showing posts with label Productivity. Show all posts
Showing posts with label Productivity. Show all posts

Monday, 21 May 2018

ఎంట్ర ప్రెన్యూర్ జీవితంలో సింగల్ గా వెళ్ళాలా? బృందంతో నడవాలా? Solo or Team Work? How to be effective in Entrepreneurship?



ఎంట్రప్రెన్యూర్షిప్ ప్రపంచంలో అడుగుపెట్టే చాలామంది సహజంగా ఓ చక్కని ఉదయం తెల్లవారగానే నిద్రలేచి అద్భుతం జరిగినట్లుగా తన ఐడియాతో ఒంటరిగానే ప్రపంచాన్నే మార్చేద్దాం అనుకుంటారు. అయితే ఒక సత్యం ఏమిటంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఏ ఒక్క గొప్ప వ్యాపారాన్ని ఒంటరిగా సాధించలేదు వారి మార్గంలో వేర్వేరు వ్యక్తుల, సంస్థల ప్రయాణం ఖచ్చితంగా ఉంటుంది. మరి వ్యాపార ఆలోచన వచ్చిన కొత్తలో పెద్దగా ప్రోత్సహించని మన సమాజంలో ఒంటరిగా వెళ్ళాలా? బృందంతో భాగస్వామ్యం చేయాలా? ఈ అంశాలను శాస్త్రీయంగా చర్చించడానికే ఈ ప్రత్యేక వ్యాసం.
***    ***    ***    ***    ***    ***
1.   బృందంగా వెళితే డబుల్ సక్సెస్:

సినిమా డైరెక్టర్, అథ్లెట్, పొలిటీషియన్ ....సక్సెస్ ఐన వారి ఇంటర్వ్యూస్ లో “మీ సక్సెస్ కి కారణం ఎవరు?” అనే ప్రశ్నకు సమాధానం గమనించండి. వారందరి సమాధానాలలో స్పష్టంగా తెలిసే ఒక్క  అంశం -  కలిసి పనిచేయడం. ఎంట్రప్రెన్యూర్షిప్ లోనూ అంతే. అవును. మీ ఎంట్రప్రెన్యూర్ ప్రయాణం మీరే చేయండి, కానీ ఒంటరిగా కాదు అని అర్థం. ఎంట్రప్రెన్యూర్షిప్ అనగానే అదేదో ఒంటరిగా చేసే వీరోచిత పోరాటం, సాహసం అనుకుంటారు. ఒక చిన్న ఐడియా తో ప్రపంచం ముందు భిన్నమైన దారి ఎంచుకున్న గర్వంతో తలెత్తుకు తిరగాలన్న ఆలోచనతో ఉంటారు. కానీ రియల్ లైఫ్ లో సీన్ కొంచెం వేరు. ఎంట్ర ప్రెన్యూర్ లైఫ్ లో రిస్క్ తీసుకోడానికి రెడీ అవ్వాలి, అందరికంటే భిన్న సవాళ్లు ఎదుర్కోవాలి కానీ ఒంటరిగా కాదు. ప్రయాణం మీదే, కానీ ఒంటరిగా చేయరని గమనించాలి.   
ఒక ఎంట్రప్రెన్యూర్ కి తాను ఆధారపడగల, నమ్మకమైన, వాస్తవాన్ని, చేదునిజాన్ని స్పష్టంగా చెప్పగల నెట్ వర్క్ ఉండటం చాలా కీలకం. అది పెద్ద బృందం కాకపోవచ్చు మీకు బాగా నమ్మకంగా, రోజు వారీ సంప్రదించగల కొద్ది మంది అయినా పరాలేదు. మీ శక్తి సామర్ధ్యాలను అర్థం చేసుకుని, మీ బిజినెస్ పరిస్థితులు ఆలోచనా రీతులు దృష్టిలో ఉంచుకుని వాస్తవ రూపంలో మీ నిర్ణయాలు ఉన్నతంగా తీసుకునేలా సహాయపడతారు.  

యాపిల్, ఐ ఫోన్ సృష్టి కర్త స్టీవ్ జాబ్స్ చెప్పినట్లు సృజనాత్మకత అనేది మీ బృందంతో అనుకోకుండా జరిగే మీటింగ్స్ లోనూ, చిన్న సంభాషణలలోనూ రావొచ్చు. అందుకే ఎంట్ర ప్రెన్యూర్స్ కమ్యునిటీస్ ఉండే కాలిఫోర్నియా లోని సిలికాన్ వాలీలో, లండన్ లోని బాక్స్ పార్క్ ప్రాంతాలే కాకుండా మన హైదరాబాద్ (టీ హబ్), విశాఖపట్నం నగరాలలో కూడా ఇతర స్టార్ట్అప్ (అంకురసంస్థ)లతో, ఎంట్రప్రెన్యూర్స్ తో ఆలోచనలు పంచుకుంటున్నారు. హైదరాబాద్ లోని కోలాబ్ హౌస్ (http://collab.house/), టీ-హబ్  (https://www.t-hub.co/), హెడ్ స్టార్ట్ (http://headstart.in/) వంటి సంస్థలు, ఎంట్ర ప్రెన్యూర్స్ కోసం అనేక చర్చలు, మీటింగ్స్ నిర్వహిస్తున్నాయి. నేను పల్లెటూరి నుండి వచ్చాను, నాది తెలుగు మీడియం, నాకు ఐడియా ఉంది కానీ అందరిముందు చెప్పను వంటి ఆలోచనల నుంచి బయటపడి ప్రశాంతంగా మీ ఆలోచనలు ఆసక్తి గల మనుషులతో పంచుకోవచ్చు. ఏమో ...మీ స్టార్ట్- అప్ కి మంచి పార్టనర్ ఈ మీటింగ్స్ లో కూడా దొరకొచ్చు.
2.   నమ్మకమే కీలకం:

ఎంట్రప్రెన్యూర్ తన బృందాన్ని తయారుచేసుకునే సమయంలో నమ్మకం కీలక పాత్ర వహిస్తుంది. మీ బలాలు, బలహీనతలు, వెంచర్ పై వాటి ప్రభావం, మీ కాబోయే బృంద సభ్యులకు ఉన్న అనుభవం, నైపుణ్యాలు వంటి అంశాలపై అవగాహనతో వెంచర్ కి ప్రయోజనాత్మకంగా మలుచుకోవచ్చు? బిజినెస్ కి ఏ నైపుణ్యాలు, ఎలాంటి నిర్వహణా రీతులు మంచిది అనే అంశాలు అర్థం చేసుకుంటూ చేదోడువాదోడుగా ఉండే నమ్మకమైన  బృంద సభ్యులను ఏర్పరుచుకోగాలగాలి. స్టార్ట్-అప్ దశలో మీతో బాగా కలిసిపోయే బృందం (ఉదా: క్లాసు మేట్స్, ప్రాజెక్ట్ వర్క్ కొలీగ్స్) ఉంటే వారితో కలిసి ప్రయాణం చేయటమే మంచిది కొత్త బృందాన్ని తయారు చేయడానికి సమయం పట్టొచ్చు. అందుకే మీ ఫోన్ లో కాంటాక్ట్ లిస్టు లో ఉన్న వారిని కొత్త అర్థవంతమైన దిశలో ప్రయాణం చేయడానికి ఒక మాట అడిగిచూడండి.
3.   బృంద సభ్యులు అనేక రకాలు

మీ బిజినెస్/ ప్రాజెక్ట్ లో  సాధారణంగా మీకు మూడు రకాల బృంద సభ్యులు ఉంటారు.
  1. ఫౌండర్స్ / బిజినెస్ పార్టనర్స్: నమ్మకమైన , దీర్ఘ కాలం ఉండగల వ్యక్తులతో కలిసే ప్రయత్నం చేయాలి. అందుకు వాళ్ళ గత చరిత్ర మీకు ఇస్తున సలహాలు సూచనలు గమనించాలి. కొందరు నాతో ఈ వ్యాపారం లో కలిస్తే మీకు మరో వ్యాపారం అవసరమే లేదు అంత డబ్బు సంపాదించవచ్చు అని మీరిప్పుడు చేస్తున్న  వ్యాపారం  వదిలివేయమని చెప్పే పరిస్థితి ఉంటుంది. అయితే మీ అనుభవం, వారి మాటల లోని అసలు అర్థం, మీ బలాలు, బలహీనతలు దృష్టిలో ఉంచుకుని ఎంత సమయాన్ని ఏ అంశాలకు కేతాయిన్చాలను కుంటున్నారో స్పష్టంగా మాట్లాడుకోవడం మంచిది. మీరు  ఎంట్ర ప్రెన్యూర్ అయితే మీ ఆలోచనా తీరులో అనేక బిజినెస్ లలో ఉండాలని అనుకుంటే ఆ అంశాలు స్పష్టంగా చెప్పాలి. వారికి, మీకు ఎలాంటి సంబంధాలు ఉండాలో స్పష్టంగా నిర్ణయించుకుంటే భవిష్యత్తులో లీగల్ ప్రాసెస్, ఖర్చులు తగ్గించుకోవచ్చు. 
  2. సలహాదారులు (advisros), పార్ట్ టైం పనిచేసే వారు, కాంట్రాక్టు కన్సల్టెంట్స్:
ఏ స్టార్ట్ అప్ అయినా ఈ కోవలో ఐదుగురు అవసరం అవుతుంటారు.
·         మార్కెట్ నిపుణుడు - డొమైన్ నైపుణ్యం ఉన్నవారు, మీరు ఆశించిన రంగంలో మంచి అనుభవం , సక్సెస్ ఐన వ్యక్తులు
·         సంధాన కర్త - మిమ్మల్ని ఇండస్ట్రీ కి ఇతర స్టేక్ హోల్డర్స్ కి పరిచయంచేసే ఇష్టత చూపే వ్యక్తులు
·         ఇండస్ట్రీ సెలబ్రిటీ – తన పేరు ఉపయోగించే అవకాశం ఇస్తూ ఆ రంగంలో అనుభవం ఉన్న వ్యక్తి , వ్యక్తిగతంగా మీ బిజినెస్ కార్యక్రమాలలో పాలుపంచుకోకపోవచ్చు
·         టెక్నికల్ కోచ్ – మీ వ్యక్తిగత పరిస్థితులను ఆలోచనా రీతులను మీ ఇతర జీవిత పార్శ్వాలను దృష్టిలో ఉంచుకుని మీ జీవన విలువ ను ఉన్నతంగా నడిపేందుకు సహాయపడే పర్సనల్ కోచ్
·         వ్యక్తిగత కోచ్ – మీ వ్యక్తిగత పరిస్థితులను ఆలోచనా రీతులను మీ ఇతర జీవిత పార్శ్వాలను దృష్టిలో ఉంచుకుని మీ జీవన విలువ ను ఉన్నతంగా నడిపేందుకు సహాయపడే పర్సనల్ కోచ్
  1. ఫుల్ టైం స్టాఫ్: సాధారణంగా ఫుల్ టైం పనివాళ్ళను (ఎంప్లాయిస్) ఎప్పుడు తీసుకోవాలనేది పని అవసరం మరియు బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది. బూట్ స్ట్రాప్పింగ్, వెంచర్ కాపిటల్, బ్యాంకు లోన్ వంటి మార్గాల ద్వారా సరిపోను పెట్టు బడి ఉన్నప్పుడు ఫుల్ టైం ఎంప్లాయిస్ ని నియమించుకుని బిజినెస్ స్పీడ్ పెంచుకోవచ్చు.
4.     బృందం ఉంటే వేగం ఉన్నట్లే :

ఎంట్రప్రెన్యూర్ తనకు లేని నైపుణ్యం, అనుభవం ఉన మరో ఎంట్రప్రెన్యూర్ ని కో-ఫౌండర్ లేదా బృంద సభ్యులను చేసుకోవటం ద్వారా వ్యాపారానికి వేగం వస్తుంది. అలా వీలు కాని పక్షంలో మీరే అన్ని అంశాలలోను నిష్ణాతులు కావాలి అందుకు సమయం పడుతుంది. అలాగే మీరే అన్ని పనులు చేయాలంటే మీ ఎదుగుదలకు ఒక పరిమితి మీరే విధించుకున్నట్లే. మీ ఐడియాని వివరంగా చెప్పి నమ్మకమైన వారిని బృందంలో చేర్చుకోవడం ద్వారా పని సమయం, నైపుణ్యాలు మాత్రమే కాకుండా మొదటిదశలో అవసరమైన కాపిటల్ కూడా కలిసివస్తుంది.

చిన్నగా ఒక స్టార్ట్ అప్ నాకు , నా కుటుంబానికే అనుకుంటే ఒంటరిగా చేసుకోవచ్చు. అల కాకుండా మీ వ్యాపారాన్ని ఎక్కువమంది కస్టమర్స్ కి చేరాలనుకుంటే బృందంతో పని చేయటం అనేక రకాలుగా ఉపయోగం. అయితే ఎందుకు ఎవరితో ఎలా కలిసి పనిచేస్తున్నామో మనకు , మనతో కలిసే సభ్యులకు స్పష్టత ఉండాలి. అలాంటి స్పష్టతతో మీ ఎంట్రప్రెన్యూర్ ప్రయాణాన్ని మొదలెట్టండి, మీ సక్సెస్ స్టొరీ ఈ శీర్షిక లో ప్రస్తావించాలని సైకాలజీ టుడే ఆకాక్షిస్తుంది.
  ***  ***  ***  సైకాలజీ టుడే, నవంబర్  2017 లో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  *** 
     

Thursday, 8 February 2018

5 Ways to Enhance Entrepreneurial Skills ఎంట్ర ప్రెన్యూర్ నైపుణ్యాలు పెంచుకోడానికి పంచ సూత్రాలు






To be an entrepreneur it helps to introspect oneself through simple questions like
  • Who am I?
  • What can I contribute to this world?
  • What life style do I want? Am I ready to learn skills and keep efforts to achieve my desired lifestyle?
  • What kind of person I should be to manifest the results I intended? What are the personality traits and though-patterns, habits should I follow?
After getting some clarity about these basic questions that help you understand your interests, skills and future aspirations, following are the five steps you need to take to enhance your entrepreneurial skills.
  1. Act differently. Not just thinking and appearing.
  2. Start venture . Reading, learning , understanding, observing ....will not give you real time experience. So start venture.
  3. Expect failures and keep moving irrespective of challenges. Challenge is not end of the life.
  4. Get your hands dirty with accounts and numbers
  5. Learn leadership communication. To be an entrepreneur , you have to deal with many people and it's important to understand the communication that influence more and practice it as best as you can to get the results you want.
                                    ***    ***    ***    ***    ***    ***

ఈ 21 వ శతాబ్దంలో ఎవరికీ వారే బాస్ అవడమనేది అందరూ కోరుకునే కెరీర్ ఆప్షన్. ఉన్న ఉద్యోగాలలో తృప్తి లేక కావచ్చు, జీతం సరిపోక కావచ్చు, టాలెంట్ కి ఉద్యోగానికి సంబంధం లేదన్న ఫీలింగ్ కావొచ్చు, కలలను నిజం చేసుకోడానికి కావచ్చు... కారణమేదైనా ఈనాటి యువత కేవలం బ్రతకడం ఎలా అని కాకుండా అందమైన, ఒక ఉద్దేశ్యం తో కూడిన జీవితాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలా అని ఆలోచిస్తుంది. తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ, పది మందికి ఉపయోగపడుతూ తమ జీతం, జీవితం తామే నిర్ణయించుకోవాలనుకుంటున్నారు. ఎంట్ర ప్రెన్యూర్ షిప్ ద్వారా కొత్త జీవన విధానాలను ఆవిష్కరించాలని కలలు కంటున్నారు. మరి ఆలాంటి వారికి ఎంట్ర ప్రెన్యూర్ కావాలను కునే యువత లక్షణాలు ఎలా ఉండాలి? నేర్చుకోవాలనుకునే కీలక అంశాలేమిటి ? ఈ విషయాలు
తెలియజేయడానికే ఈ ప్రత్యేక శీర్షిక.


ఎంట్ర ప్రెన్యూర్స్ అవ్వాలని బిజినెస్ మాగజైన్స్ లో అందమైన ఫొటోస్ చూసి వాళ్ళు మాత్రమే గొప్ప బిజినెస్ పీపుల్ అని అలోచించి మనం వారిలా అవ్వాలని అనుకోవడం సహజం. కొందరు మేము బిజినెస్ చేయడానికే పుట్టాము అని చెప్పుకోవచ్చు. కానీ ఎంట్ర ప్రెన్యూర్స్, బిజినెస్ పర్సన్ కావడం చెప్పినంత ఈజీ కాదు, అలా అని అసాధ్యం అనేంత క్లిష్టమైనది కాదు. ఒక వ్యక్తి తన గతం, తను అలవాటు పడిన ఆలోచనా రీతులు, తనపై సమాజం యొక్క ముద్రలు, తన రెస్పాన్స్ మెకానిజం పై పట్టు పట్టి ఎంట్ర ప్రెన్యూర్ మైండ్ సెట్ గురించి మెళకువలను ఇతరులను చూసి, నిశితంగా పరిశీలించి నేర్చుకోవచ్చు. ఎంట్ర ప్రెన్యూరల్  జర్నీ అనేది ఛాలెంజ్ లతో (భయస్తుల భాషలో రిస్క్ లతో?) కూడినది, చేస్తున్న పనిలో ఆనందం , వచ్చే ఛాలెంజ్ లకు సిద్దంగా తనను తాను మార్చుకోగల వారికి ఆహ్వానం పలికే కెరీర్. మనిషి తన జీవితానికి సంబంధించిన కీలక ప్రశ్నలు వేసుకునే సమాధానం రాబట్టుకునేలా ప్రోత్సహిస్తుంది ఈ కెరీర్.
ఎంట్ర ప్రెన్యూర్ కావాలంటే జవాబు చెప్పుకోవాల్సిన కొన్ని ప్రశ్నలు :
Ø  నేను ఎవరు?
Ø  నీను ఈ ప్రపంచానికి ఎలా ఆపయోగపడగలను?
Ø  నా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నాను? అందుకు ఎలాంటి కృషి చేయడానికి, నైపుణ్యాలు నేర్చుకోడానికి నేను రెడీ గా ఉన్నాను?
Ø  కోరుకున్న ఫలితాలు చేరుకోడానికి నేను ఎలాంటి వ్యక్తిగా మారడానికి సిద్దంగా ఉన్నాను? ఆ వ్యక్తిత్వ , ఆలోచనా రీతులు ఏమిటి?
ఎంట్ర ప్రెన్యూర్ నైపుణ్యాలు నేర్చుకోడానికి మార్గాలు



1.     భిన్న మైన దారిని ఎంచుకోండి

సృజనాత్మకత ఎంట్ర ప్రెన్యూర్ షిప్ కి వేరు (రూట్) వంటిది . మార్కెట్ ప్లేస్ లో ప్రజల అవసరాలను తీర్చడంలో , జీవన శైలిని ఉన్నతంగా మార్చడంలో సృజనాత్మకంగా ఆలోచించడం ఎంట్ర ప్రెన్యూర్ లక్షణం.  సృజనాత్మకత అంటే విషయాలను భినంగా చూడటం, అవసరాలను తీర్చేందుకు కొత్త మార్గాలను ఎంచుకోవడం. మీ క్రియేటివిటీ పెంచుకోడానికి ఉద్దేశ్యపూర్వకంగా కొత్త పనులు చేయండి, కొత్త భాష నేర్చుకోండి, కొత్త వ్యక్తులతో వర్క్ అవసరాలను తీరేలా పరిచయం పెంచుకోండి, ఇతరులు చేయని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి, అలవాటు లేని బుక్స్ చదవండి, కొత్త భాషలో సినిమా చూడండి, కొత్త ఆట నేర్చుకుని ఆడండి. మీ కంఫర్ట్ జోన్ లో లేని వ్యక్తులతో ప్రశాంతంగా మాట్లాడండి. 2008 లో ఆర్ధిక ఇబ్బందులు వచ్చినపుడు ఈ క్రియేటివిటీ ఉన్నవారే గొప్ప వ్యాపారాలు చేసారు. క్రియేటివిటీ అంటే ఎదుటి వారి బలహీనతని వాడుకుని బిజినెస్ చేయటం కాదు, ఎవరూ చూడని ఒక సొల్యూషన్ చూపించి నిజాయితీగా ఆలోచనలు, పనుల ద్వారా డబ్బు సంపాదించడం.

2.     వ్యాపారం మొదలుపెట్టండి
రూల్స్ ఫాలో అవడం నడవడం నేర్చుకోరు, నడిచే ప్రయత్నం చేయడం, కిందపడటం వలన నేర్చుకుంటారు అంటారు  ఎంట్ర ప్రెన్యూర్షిప్ మేధావులు. నిజ జీవితానికి, పనిచేస్తూ ప్రపంచం నుంచి నేర్చుకున్నదానికి మించిన జ్ఞానం మరొకటి ఉండదు. మీరు బిజినెస్ పార్ట్ టైం చేసినా, ఫుల్ టైం చేసినా ఎలా ఒప్పించాలి, ఎలా అకౌంటింగ్ చేయాలి, ఎలాంటి ప్లాన్ చేయాలి, ఎలా ప్రమోట్ చేయాలి, సేల్స్ టెక్నిక్స్, మార్కెటింగ్ విధానాలు ...ఇలా అనేక స్కిల్స్ నేర్చుకుంటారు.

3.     ఛాలెంజ్ లను ఎదుర్కోండి
నేను స్మార్ట్ కాదు , కేవలం ఎక్కువకాలం సమస్యలతో ఉన్నాను అంటారు ఐన్ స్టీన్ మహాశయుడు. సమస్యలు, ఛాలెంజ్ లు ఎదురైనపుడు కాస్త మార్పులు చేసుకోవాలేమో కాని మీ నమ్మకాన్ని , పట్టుదలను రెట్టింపు చేసుకోగలగాలి. విజయం ఆ ఛాలెంజ్ లకు కేవలం ఒక్క అడుగు దూరంలో నే ఉంటుందని ఆ పరిస్థితుల్లోనే మనిషి ప్రయత్నం వదిలేయకూడదంటారు బిజినెస్ సక్సెస్ సాధించిన పెద్దలు. ప్రపంచం ఎంత అనుమానించినా, హేళన చేసినా, నీ మనసులో పవిత్ర భావంతో, చేసే ప్రాజెక్ట్ లో నమ్మకం, మీ సర్వీస్/ ప్రోడక్ట్ కి మార్కేటబిలిటీ ఉంటే ముందుకు సాగడం చాలా అవసరం. మీ రిస్క్ టేకింగ్ సత్తా = మీ బిజినెస్ సక్సెస్ . ఈ సూత్రం గుర్తుంచుకోండి.

4.     లెక్కలు బాగా నేర్చుకోండి 
సొంత కంపెనీ రన్ చేయాలంటే కనీస లెక్కలు తెలియాలి. కాష్ ఫ్లో , మంత్లీ బాలన్స్ షీట్, ప్రొజెక్షన్స్ చాలా అవసరం. లాభ నష్టాలు బేరీజు వేసుకోలేని స్థితిలో బిజినెస్ చేస్తే అసలుకే మోసం వస్తుంది. మీ బడ్జెట్, టాక్స్ వర్క్ మీరే చేసుకోవడం తో కొన్ని అంశాలు నేర్చుకోడానికి పునాది వేయండి. 

5.     లీడర్షిప్ కమ్యూనికేషన్ అలవాటు చేసుకోండి

ఎంట్ర ప్రెన్యూర్ అవ్వాలంటే నేర్చుకోవాల్సిన మౌలిక నైపుణ్యాలు:  నిబద్దతతో మీ బృందాన్ని (Team) లీడ్ చేయటం, ప్లాన్నింగ్ తో  పనిచేయటం, విజన్, ప్రాజెక్ట్ ని ఉన్నతంగా కమ్యూనికేట్ చేయటం, సేల్స్. ఇందుకోసం మీ ప్రాజెక్ట్ పనే కాదు లోకల్ NGO లేదా టోస్ట్ మాస్టర్ క్లబ్ లో, సోషల్ ప్రాజెక్ట్ లో పనిచేయోచ్చు. ఇంట్లో పెద్దవారి జన్మదిన వేడుకలు మీరే బాధ్యత తీసుకుని  చేయొచ్చు.  ఆఫీస్ పని అయినా, సోషల్ ప్రాజెక్ట్ అయినా , ఫ్యామిలీ వర్క్ అయినా ఒక పెద్ద ప్రాజెక్ట్ కి బాధ్యత తీసుకోవడం ద్వారా ప్లానింగ్, నెగోషియేషన్, సేల్స్, లీడర్షిప్, టీం వర్క్  స్కిల్ల్స్  పెంపొదించుకోవచ్చు. ఆన్లైన్ లో  సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉండటం ద్వారా కూడా కమ్యూనికేషన్ , కరెంటు ట్రెండ్ అవసరాలు అర్థం చేసుకోవచ్చు.  
          ***  ***  ***  సైకాలజీ టుడే, సెప్టెంబర్  2017 లో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  ***   

Monday, 24 July 2017

5 Ways to Increase Your Business Sales [ బిజినెస్ సేల్స్ పెంచుకోడానికి ఐదు ముఖ్య మార్గాలు ]

1. Remember that you are in the business with people 
2. Focus on results , make changes in product, strategy or marketing to get results 
3. Get comfortable with discomfort while making sales
4. Develop and practice a compelling and WOW Sales story and how it helps your prospect
5. ASK for sales. Feel so easy? A study reveals 70 % of the sales people don't ask for sale.

ఒక బిజినెస్ విజయవంతంగా నడవాలంటే ఆ బిజినెస్ ద్వారా అందించే ప్రోడక్ట్స్, సేవలు అందుకునే కస్టమర్లు ఉండాలి. వారిని ఎలా చేరుకోవాలో తెలియాలి. కాబోయే కస్టమర్లను (ప్రాస్పెక్ట్స్) ఎలా గుర్తించి వారి అవసరాలను తీరిస్తే మీ బ్రాండ్ నేమ్, మీ సర్వీసు నాణ్యత అర్థం చేసుకుని వారే మీకు కొత్త కస్టమర్లను కూడా రికంమెండ్ చేస్తారు. మరి ఇదంతా జరగాలి అంటే ముందు ప్రాస్పెక్ట్స్ ఎలా సేవలు అందించాలి?  తక్కువ సమయంలో ఎక్కువ సేల్స్ ఎలా చేయాలి? ఈ కీలక అంశాలు  చర్చించడానికే ఈ వ్యాసం. మరో నెల రోజులలో మీరు ఎందరు కొత్త కస్టమర్లను చేరుకోగలరో అందుకు ఏం చేయగలరో తెలుసుకుందాం రండి.   
***    ***    ***    ***    ***    ***
ఈ కొత్త ఎకానమీ లో సేల్స్ చేయడమే రాజరికం. అమ్మకమే రాజు. సేల్స్ ఈజ్ ది కింగ్. మార్కెటింగ్ సత్తా ఉంటే  మీరే కింగ్ మేకర్. అందుకు ఈ క్రింది అంశాలు అర్థం చేసుకోవాలి. మీ సక్సెస్ అనేది మీరు ఎంత మంది కొత్త ప్రాస్పెక్ట్స్ చేరుకోగలరు అందులో ఎంత మంది కొత్త వినియోగదారులను నిలబెట్టుకోగలరు అనేదానిపై ఆధారపడి ఉంది. అందుకోసం మీరు మిమ్మల్ని, ఆ తర్వాత మీ ప్రోడక్ట్ ని, ఆ తర్వాత మీ కంపెనీని విలువలతో అమ్ముకోగలగాలి. మీ సేల్స్ లో విజయవంతంగా  వెళ్ళడానికి, కొత్త ప్రాస్పెక్ట్స్ కస్టమర్స్ ని చేరుకోడానికి , సూపర్ సేల్స్ సాధించడానికి ఈ ఐదు మార్గాలు ఉపయోగపడతాయి. అవేంటో చర్చిద్దాం రండి.      

1.     మీరు ప్రజలతో బిజినెస్ లో ఉన్నారని గుర్తుంచుకోండి
చాలా మంది సేల్స్ చేసేటప్పుడు వాళ్ళు మనుషులతో బిజినెస్ చేస్తున్నాం అనేది మర్చిపోయి ప్రోడక్ట్, ఉపయోగాలు, రేటు, ఆఫర్, స్పెషల్ ఆఫర్ ....ఇలా ఒక ఆటోమేటెడ్ మిషన్ లాగా చెప్పుకుంటూ వెళ్తారు. కస్టమర్ తనకు వ్యక్తిగతంగా గౌరవం ఇవ్వాలని, తాను “ముఖ్యం” అని ఫీల్ అవ్వాలి అనుకుంటాడు. మీరు చెప్పే బ్రేకులు లేని స్టొరీ వినాలన్న కుతూహలం వారికి ఉండదు. ఒక క్షణం చిన్న ఎక్సర్ సైజు చేయండి. కళ్ళు మూసుకొని మీకు గుర్తుంచుకోండి. అరిగిపోయిన రికార్డు లాగా, ఏమి కావాలో తెలుసుకోకుండా, మీరు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోకుండా ఒక ప్రోడక్ట్, సర్వీస్ గురించి చెప్పిన వ్యక్తుల్ని గుర్తుకు తెచ్చుకోండి. వారి మాటలు మళ్ళీ ఇప్పుడు మీ మైండ్ ధియేటర్ లో వినండి, ఆ వ్యక్తుల్ని చూడండి. కళ్ళు తెరవండి. మళ్ళీ మన ఆర్టికల్ లోకి రండి ....ఇప్పుడు చెప్పండి. మీకు గతంలో సేల్స్ చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు గుర్తొచ్చి ఉంటారు. సిం కార్డ్, పోస్ట్ పెయిడ్ సర్వీస్, లోన్స్, క్రెడిట్ కార్డు, డైరెక్ట్ సేల్స్ చేసే డోర్ నాకింగ్ సేల్స్ టీం...ఎవరైనా అయి ఉండొచ్చు.  వారి పై మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంది. వారితో బిజినెస్ చేసారా? ఇకముందు చేస్తారా? ఈ చిన్న ఎక్సర్ సైజు వలన సేల్స్ అనేది మనుషులను మనుషులుగా చూస్తూ, వాళ్ళ మానసిక స్థితి కి, ఫీలింగ్స్ విలువను ఇస్తూ, వాళ్ళకు  ఉన్నత బంధంతో అవసరాలను తీరుస్తూ ముందుకు సాగే ఒక సాధన కూడిన ప్రక్రియ అని అర్థం అవుతుంది. అందుకే ప్రేమతో నవ్వాలి, నీట్ గా డ్రెస్ చేసుకుని కనిపించాలి, ఉత్సాహంగా షేక్ హ్యాండ్ ఇవ్వాలి, రెండు చేతులతో నిజమైన వినయంతో కూడిన నమస్కారం చేయాలి, మాట్లాడే సమయంలో వారి పేరుని వాడాలి, వారికి చెప్పిన సమయానికి 5 నిమిషాలు ముందుగానే వెళ్ళగలగాలి. ఇవి చూడడానికి చిన్న అంశాలుగానే ఉంటాయి కానీ పెద్ద మార్పును, బిజినెస్ ని అందించే సూత్రాలు. మనుషులతో పని, మనుషుల అవసరాలు తీర్చే పని, వారి ఫీలింగ్స్ అర్థం చేసుకుని చేసే పని. అందుకే ఈ విషయం అర్థం చేసుకుంటే మీకు సూపర్  సేల్స్ గ్యారెంటీ.    

2.     ఫలితాలు మీద దృష్టి పెట్టండి

సేల్స్ అంటే మేనేజ్మెంట్ (నిర్వహణ), ప్లానింగ్ వేయటం, ఈవెంట్ చేయటం వంటిది కాదు, “ఫలితాలు సాధించటం” . సేల్స్ చేసేవారు అనేక రిపోర్ట్ చేస్తూ, ఓల్డ్ కస్టమర్స్ సర్వీస్ చూస్తూ, మీటింగ్ లకు వెళ్తూ బిజీ గా ఉన్నాం అంటారు, అసలు మీ ప్రోడక్ట్, సర్వీస్ తీసుకునే కొత్త కస్టమర్ ని కలిసే ప్రయత్నం చేస్తున్నారా? సేల్స్ లో మీ సక్సెస్ అంటే ఫలితాలు సాధించడం. అంటే ఎక్కువ కస్టమర్స్ చేతిలో మీ ప్రోడక్ట్ ఉండడం. సూపర్ సేల్స్ పర్సన్ అంటే వారి కస్టమర్స్ ని చేరుకోవడం, ప్రోడక్ట్ గురించి వివరించడం, వారు డబ్బు పెట్టి ఆ ప్రోడక్ట్ , సర్వీస్ తీసుకునేలా చేయటం వస్తుంది. మీరు పెట్టే ప్రయత్నాలకి (ఎఫర్ట్స్)కి, మీ ఫలితాలకి(రిజల్ట్స్) పోల్చుకుని ప్రయత్నం చేసాను కదా అనుకుని మిమ్మల్ని మీరు తృప్తి (....ఎవరి కోసం?) పరుచుకుంటే సరిపోదు. అప్పాయింట్మెంట్  తీసుకోడానికి, అమ్మడానికి ప్రయత్నించడం కాదు ....అప్పాయింట్మెంట్ తీసుకున్నావా? లేదా? అమ్మకం చేసావా? లేదా? .....ఇలా నిశితంగా ఆలోచించుకోవాలి. అందుకు ఏం చేస్తే పనులు అవుతాయో? ఏమి చేస్తే ఫలితం వస్తుందో ? ఏమి  చేస్తే సేల్ చేయొచ్చో ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి.  చేసిన ప్రయత్నాలు మాత్రమే చెప్తుంటే ప్రపంచం వినదు, మన ఫలితాలే మాట్లాడాలి.    

3.     ఇబ్బంది అనిపించినా చేయాలి
సేల్స్ లో సూపర్ సక్సెస్ అయిన వారిని చూడండి వారు వారి ప్రోడక్ట్, సర్వీస్ ని పూర్తిగా నమ్ముతారు, కస్టమర్ల అవసరాలను తీర్చేందుకు ఆ ప్రోడక్ట్ వారి చేతిలో ఉన్నందుకు సంతోషంగా ఉంటారు, ఆ ప్రోడక్ట్ గురించి ఉత్సాహంగా మాట్లాడతారు, కష్టమైన ప్రశ్నలు వేసే కస్టమర్ ని ఎదుర్కోడానికి రెడీ గా ఉంటారు. ఏ కంపెనీ లో అయినా సేల్స్ చేసే ప్రాసెస్ లో  ఇబ్బందిని కూడా ఎంజాయ్ చేస్తూ, నేర్చుకుంటూ పని చేసే వారే సేల్స్ లో టాప్ పెర్ఫార్మన్స్ లిస్టు లో ఉంటారు. కొన్ని కంపనీలు పోటీదారులు విసిగిపోయినా సరే టఫ్ కస్టమర్లను లిస్టు చేసుకుని వారితో ఫాలో అప్ చేస్తూ వాళ్ళ లైఫ్ టైం లోనే చేయనన్ని సేల్స్ చేస్తారు.     
4.     కస్టమర్ తో వావ్ అనిపించాలి 
 
గ్రేట్ సేల్స్ పర్సన్ అంటే కస్టమర్ తన ప్రోడక్ట్ /సర్వీస్ గురించి వావ్ అని ఆనందంగా ఫీల్ అయ్యేలా చేయాలి.  అప్పుడు కస్టమర్స్ ఎమోషనల్ గా ఇన్వాల్వ్ అవుతారు, త్వరగా ఆ ప్రోడక్ట్ కొనటం కోసం బాధ్యత తీసుకుంటారు. ఆ విధంగా వావ్ అనిపించే విధానాలు పాటించగలిగితే కస్టమర్ మీతో ఒక సమన్వయంలో ఉంటారు. అందుకు మీరు మీ ప్రిపరేషన్ పర్ఫెక్ట్ గా ఉండాలి, ప్రెజెంటేషన్ ప్రాక్టీసు చేయాలి, కొందరికి చెప్పిన తర్వాత కొన్ని కస్టమర్ ఫీలింగ్స్ అర్థం చేసుకుని ఆ ఫీలింగ్స్ మీ భాషలో వచ్చేలా ప్రయత్నించాలి. ఒక బోరింగ్ ప్రొడక్ట్ కూడా వావ్ అనిపించి సేల్స్ చేసేవారిని గమనించండి. చాలా నేర్చుకోగలం. ఏంటి సందేహిస్తున్నారు? కొన్ని  ప్రకటనలు చూడండి ... మీ పక్కింటిలో ఉంది, ఎదురింటిలో ఉంది మరెండుకు ఆలస్యం ఈ రోజే ఆర్డర్ చేయండి. ఇలాంటి ప్రొడక్ట్స్ ని గమనిస్తే మీకు తెలిసిన అంశమే అయినా వావ్ అనిపించే ప్రయత్నం చేస్తారు. అందుకే మంచి ప్రోడక్ట్, ప్రమోట్ చేసే టెక్నికల్ సత్తా తో పాటు అందుకు తగిన సేల్స్ వావ్ స్టొరీ అవసరం.  నాలుగు సంవత్సరాల క్రితం ఒక సంస్థకు నేను రాసిన బ్రోచర్ లో కేవలం ఫీచర్స్ మాత్రమే కాకుండా సేల్స్ స్టొరీ ని చొప్పించి కాన్సెప్ట్ సెల్లింగ్ చేసే విధంగా కంటెంట్ అందించాను. అది వారి బిజినెస్ కి ఉన్నతంగా ఉపయోగపడింది. అంతే కాదు అదే బిజినెస్ లో ఉన్న ఇతర రెండు కంపెనీ ఒక సంవత్సరంలో ఆ బ్రోచర్ ని  కాపీ కొట్టాయి. కేవలం లోగో, ప్రాజెక్ట్ పేరు మాత్రమే మార్చారు. అంటే అర్థం మన సేల్స్ స్టొరీ మన పోటీదారుడుకి కూడా నచ్చింది.  ఇంకొంత మంచి వావ్ స్టొరీని, నిజాయితీతో, ఉన్నదాన్ని ఉన్నట్లుగా , ఉత్సాహంగా చెప్పటం మన బాద్యత.

5.     సేల్స్ కోసం అడగండి
ఇది చూడడానికి సింపుల్ గా ఉంటుంది . కానీ చాలా మంది సేల్స్ పర్సన్స్ సేల్ కోసం అడగరు. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం.    ఒక సంస్థ 500 కంపెనీస్ కి వెళ్లి సేల్స్ వాళ్ళు ఎలా పనులు చేస్తున్నారో తెలుసుకునే రీసెర్చ్ లో భాగంగా మిస్టరీ షాపింగ్ చేసింది. విచిత్రంగా 70% పైగా సేల్స్ వాళ్ళు రీసెర్చ్ టీం ని “కొనండి” అని అడిగి సేల్స్ చేసే ప్రయత్నం చేయలేదు. ప్రోడక్ట్, సర్వీస్, రేటు ఎలా ఐనా ఉండనివ్వండి “మీరు కొనండి” అని అడగకపోతే కేవలం అడిగినా అడగకపోయినా కోనేవారికే అమ్ముతారు. మీరు కలిసిన ప్రతి వ్యక్తిని సేల్స్ ప్రెజెంటేషన్ లో భాగంగా ఈ ప్రోడక్ట్ మీరు తీసుకోండి అని అడగటం చేస్తున్నారా లేదా చెక్ చేసుకోండి. సక్సెస్ అవ్వాలంటే అడగాలి ....మన ప్రోడక్ట్ మంచిదని నమ్మకంతో, అది వారికి అవసరాలను తీరుస్తుందని విశ్వాసంతో అడగాలి.  అడగనిది అమ్మ అన్నం పెడుతుందేమో, భార్య బిర్యానీ పెడుతుందేమో,  స్నేహితుడు సహాయం చేస్తాడేమో...అయినా సరే కస్టమర్ ని సేల్స్ అడగండి . ఈ సూత్రాలు పాటించి మీ బిజినెస్ లో సూపర్  సేల్స్ సక్సెస్ మాతో పంచుకోండి. 
***  ***  ***  సైకాలజీ టుడే, జూలై  2017 లో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  *** 

Thursday, 6 July 2017

కస్టమర్లను అర్థం చేసుకోడానికి ఐదు ముఖ్య మార్గాలు - 5 Ways to Understand Customers

To understand your customer better you can enhance your knowledge on:
1. Customer position and needs
2. Customer feelings
3. Customer specific back ground
4. Learning from customers 
5. Customers' future needs

బిజినెస్ మొదలు పెట్టిన దశలో లేదా సేల్స్ తగ్గుముఖం పట్టినప్పుడు ఒక బిజినెస్ మాన్,  ఎంట్రప్రెన్యూర్, ఒక కంపెనీ మార్కెటింగ్ టీం ఎవరిని కలిసినా సాధారణంగా అడిగే కీలక ప్రశ్న “మా కస్టమర్ ని ఎలా అర్థం చేసుకోవాలి?” అని.   ఈ ప్రశ్నే వారిని బాగా తొలచివేస్తుంది. మరి మారుతున్న కాలంలో, మౌస్ క్లిక్ దూరంలో మీ కంపెనీ గురించి, ప్రోడక్ట్ గురించి, మీ పోటీదారుల గురించి కస్టమర్ తెలుసుకోగలరు. మరి ఎలాంటి పరిస్థితుల్లో అసలు మీ కస్టమర్ ని ఎలా అర్థం చేసుకోవాలి  ఈ కీలక అంశాలు చర్చించడానికే ఈ వ్యాసం. రండి కస్టమర్లను అర్థం చేసుకుందాం వారి అసలు అవసరాలను తీరుద్దాం.    
***    ***    ***    ***    ***    ***
హోటల్ కస్టమర్ నుంచి మొబైల్ ఫోన్ యాప్ తయారీ కోరుకునే వారి వరకు, బ్యాంకింగ్, ఫార్మాస్యూటికల్స్, ఎనర్జీ, ఎయిర్ లైన్స్, మీడియా ఇలా ఏ సెక్టార్ తీసుకున్నా వారి సేవలను వస్తువులను ఉపయోగించుకునే ప్రస్తుత కస్టమర్లు గతం కంటే భిన్నంగా ఉన్నారన్నది వాస్తవం.   గతంలో కంటే ఇప్పుడు వినియోగదారుడికి ఎక్కువ శక్తి ఉంది. సోషల్ మీడియా, ఆన్ లైన్ మార్కెటింగ్, ఆన్ లైన్ ప్రోడక్ట్ కంపారిజన్, ఎక్కువ వెరైటీలతో, వ్యక్తిగత అవసరాలకు తగినట్లు ప్రోడక్ట్ , సర్వీస్ ఇచ్చే సంస్థలు పెరిగాయి. ఇటువంటి పరిస్థితులు ఇంకా మార్పులు రావటం గ్యారెంటీ. అంటే కస్టమర్ సెగ్మెంట్ పై సరైన అవగాహన, ప్రోడక్ట్ /సర్వీస్ గురించి నిజమైన విషయ పరిజ్ఞానం (ఇన్ సైట్ ) ఈ రెండు అంశాలను అర్థం చేసుకుని డీల్ చేయగలిగే నేర్పు (స్కిల్), ఓర్పు (పేషన్స్ ) ఉన్న వారు మార్కెటింగ్, బిజినెస్ లో ఉండగలరు. అంటే ఈ రోజుల్లో కస్టమర్స్  డిమాండింగ్ పొజిషన్ లో ఉన్నారు, ఎక్కువ ఆప్షన్స్ కస్టమర్ వద్ద ఉన్నాయి.  అమ్మకందారుడా జాగ్రత్త !!! – ఇది నిజమైన వ్యాపార పరిస్థితి. ఇటువంటి డిమాండింగ్ కస్టమర్స్ తో పాటు , కాంపిటీషన్ బాగా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కస్టమర్ పరిస్థితుల్లోకి వెళ్లి మీ ప్రోడక్ట్ / సర్వీస్ ఏంటి అని చూడగలగాలి. అందుకు ఈ క్రింది అంశాలు అర్థం చేసుకోవాలి.     


1.     కస్టమర్ పొజిషన్
మీ కోర్ బిజినెస్ మించి ప్రపంచాన్ని చూడండి. కస్టమర్ కి ఉన్న అన్ని ఛాయస్ లు , ఆప్షన్స్, అతని రోజువారీ అవసరాలు, ఇతర సప్లయర్స్  ఎవరో గమనించండి. వారిలో మీరు భాగం కావచ్చేమో గమనించండి. ఈ పని వలన మీ కస్టమర్ గురించి, మీ కస్టమర్ ప్రస్తుతం మంచి వ్యాపార సంబంధం కొనసాగించే విధానాల గురించి, మీ కాంపిటీటర్ గురించి తెలుస్తుంది. వారి కదలికలు , బిజినెస్ విధానాలపై మీకు పట్టు వస్తుంది.

2.     కస్టమర్ భావాలు , అనుభూతులు

మీ కంపెనీ, మీ స్టోర్, మీ సేవ/ ప్రోడక్ట్ వినియోగంలో భాగంగా కస్టమర్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారో మీ కస్టమర్స్ ని గమనిస్తూ అర్థం చేసుకోండి. ఒక హాస్పిటల్ లో జూనియర్స్, ఇంటర్న్స్ ని పేషంట్స్ రిసీవ్ చేసుకునే రిసెప్షన్ లో ఉండమని చెప్తారు; సోషల్ వర్క్,  హోం సైన్సు చదివే వారిని ఫీల్డ్ వర్క్ కి;  ఇంజనీర్స్ ని ఇండస్ట్రియల్ విజిట్స్  కి  పంపించడానికి కారణం ఆయా కస్టమర్స్ ఎలా ఫీల్ అవుతున్నారో అని కూడా తెలుసుకోడానికే. అయితే చాలామంది వచ్చిన వారికి సేవలు, ప్రోడక్ట్ ఎలా ఇస్తున్నారో మాత్రమే చూస్తారు. కానీ బిజినెస్ పెరగాలి అంటే , కొత్తవారు రావాలి అంటే, ఆల్రెడీ ఉన్న కస్టమర్ మళ్ళీ రావాలంటే వారు మనవద్దకు వచ్చినప్పుడు ఏం ఫీల్ అవుతున్నారో అర్థం చేసుకోవాలి. అందుకోసం రోల్ ప్లే టెక్నిక్స్ కూడా చేయొచ్చు.  

3.     ఒక్కొక్కరికి వేర్వేరు బ్యాక్ గ్రౌండ్
ఒక్కొక్క కస్టమర్ ఒక్కో బ్యాక్ గ్రౌండ్ నుంచి వస్తారు, వారి భిన్న మైన విధానాలలో చూస్తారు. AC కొందామని షాప్ కి వెళ్ళిన కస్టమర్ కి రూమ్ సైజు ఎంత, అందుకు కనీసం ఎన్ని టన్నుల ఏ. సి. అవసరం, ఎనర్జీ సేవింగ్ చేయాలంటే ఎన్ని స్టార్ లుండాలి, సాధారణoగా నిర్వహణలో భాగంగా ఏం చేయాలి, గ్యాస్ లీక్ అయితే ఎంత ఖర్చవుతుంది ఇవన్నీ చెప్పగానే అతను కొనాలని రూల్ ఏమి లేదు. ఎందుకు?  పై వన్నీ ఇంపార్టెంట్ పాయింట్సే.  కానీ ఆ కస్టమర్ కి AC సౌండ్ (నోయిస్) స్థాయి బాగా తక్కువ ఉండేది కావాలేమో. ఆ వ్యక్తి అవసరం, దృష్టి దాని మీద మాత్రమే ఉన్నప్పుడు ముందు ఆ అంశం తెలుసుకోవాలని ఉంటుంది. అందుకే బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి. ఖచ్చితంగా చెప్పాలంటే తన అవసరాలను తీర్చుకోడానికి తనకు ఏమి కావాలో (రియల్ అవసరాలు) అర్థం చేసుకుని చెప్పగలిగేలా మీరు ప్రయత్నించాలి. ఆ తర్వాత మీ ప్రోడక్ట్, సేవల గురించి చెప్పాలి. అవి ఎలా తన అవసరాలను తీరుస్తాయో వివరించాలి.    
4.     కస్టమర్ తో కలిసి నేర్చుకోండి 
GE కంపెనీ ఒక లీడర్షిప్ అండ్ ఇన్నోవేషన్ సెమినార్ కి తమ సంస్థ లోని లోకల్ ఎగ్జిక్యూటివ్ లు, ఎకౌంటు మేనేజర్స్ తో పాటు చైనా లోని టాప్ కస్టమర్స్ ని కూడా పిలిచింది. దాని వలన GE కంపెనీ చైనా దేశస్థుల అవసరాలు వారి ఆలోచనే కాకుండా,  తాము ఉన్నతంగా బిజినెస్ ప్లాన్ ఎలా చేసుకోవాలో కూడా నేర్చుకున్నారు. మనందరి బిజినెస్ లలో మీటింగ్ కి కస్టమర్ ని పిలిచే అవకాశం రాకపోచ్చు , నిధుల కొరత ఉండొచ్చు , కానీ మారుతున్న కస్టమర్ ఇష్టాలను తెలుసుకుని ఒక మంచి బంధం ఏర్పడాలి అంటే వినియోగ దారులను, వారి  అవసరాలను ఉన్నతంగా అర్థం చేసుకోగలగాలి.     
5.     కస్టమర్ రేపటి అవసరాలు  
స్టీవ్ జాబ్స్ (ఆపిల్ సృష్టి కర్త)  , రిచర్డ్ బ్రాన్సన్ (వర్జిన్ సంస్థల యజమాని) ప్రజల అవసరాలు అందుకు తగ్గ సేవలు/ వస్తువులు సృష్టించారు. వారు ఏ వ్యాపారం లో ఉన్నా మారుతున్న అవసరాలకు ప్రజలకు ఏమి కావాలో అది అందించారు. ప్రజల ఫ్యూచర్ అవసరాలను ముందుగా చూడగలిగారు. అందుకే సెనారియో ప్లానింగ్ అవసరం.    

గుర్తుంచుకోండి ఒకోసారి మీ కస్టమర్ ని అర్థం చేసుకోడానికి నిజంగా మీరు రోజు వారి ఆలోచన నుంచి బయటికి రావాలి. సైకాలజిస్ట్ దగ్గరకు కౌన్సిలింగ్ కి వెళ్ళారనుకోండి. మీరు అడిగిన సమస్యకు సమాధానం మీకు నచ్చినదైతేనే ఇష్ట పడతారని వారికి తెలుసు.  కానీ అనేక విధానాలలో , డైమెన్శన్స్ లో విషయాలు చూడమని చెప్తారు. ఎందుకంటే గుడ్డిగా నిర్ణయం తీసుకోవటం ద్వారా నష్టం చేకూరడం మీకు కరెక్ట్ కాదు. అందుకే మూడో కన్ను తో చూసి నేర్చుకోగలగాలి. ఈ పాయింట్ బిజినెస్ లోను వర్తిస్తుంది. బిజినెస్ మీద నిజమైన దృష్టితో , కాలంతో పాటు మారుతున్న కస్టమర్ అవసరాలను అర్థం చేసుకోండి, స్పష్టంగా వినండి,  అప్పుడు కస్టమర్స్ వారికి ఏమి కావాలో హింట్ ఇస్తారు. మీకు ఏమి చేయాలో తెలుస్తుంది.  
***  ***  ***  సైకాలజీ టుడే, జూన్  2017 లో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  *** 

Thursday, 22 June 2017

ఎంట్ర ప్రెన్యూర్ ను నిరంతరం నడిపించే సెల్ఫ్ మోటివేషన్ - మీకు ఉందా?


ఉద్యోగం వదిలి వ్యాపారం ప్రారంభించాలన్నా, అసలు ఉద్యోగమమే  సంపాదించకుండా స్టార్ట్ అప్ మొదలుపెట్టాలన్నా మనిషికి గుండెల నిండా ఆత్మ విశ్వాసం, సాధించాలన్న బలమైన కోరిక ఉండాలి. మరి మొదటి  అడుగు ముందుకు వేసిన ఎంట్ర ప్రెన్యూర్ నిజంగా ఆ ఉత్సాహాన్ని, ప్రేరణను తన బిజినెస్ జర్నీ అంతా కొనసాగించగలడా?  ఈ పోటీ ప్రపంచంలో రోజువారీ సవాళ్లు, అధికమౌతున్న డిమాండ్స్ మధ్య ఎంట్ర ప్రెన్యూర్ జర్నీ సజావుగా సాగాలంటే తనని తాను ఎలా మోటివేట్ చేసుకోవాలి? అందుకు అవలంభించాల్సిన స్వయం ప్రేరణ (సెల్ఫ్ మోటివేషన్ ) మార్గాలు ఏమిటి?   ఈ కీలక అంశాలు చర్చించడానికే ఈ నెల మన ప్రత్యేక వ్యాసం.

1.     స్పష్టమైన్ విజన్ – గోల్
ఎందుకు కొందరు ఎంట్ర ప్రెన్యూర్స్ ఆటంకాలను జయిస్తారు, ఒత్తిడి తట్టుకుంటారు, తీక్షణ ఏకాగ్రతతో పని చేస్తారు? వారికి ఆ స్థాయిలో మోటివేషన్ ఎలా ఉంటుంది? ఎక్కడి నుంచి ఆ మోటివేషన్ వస్తుంది? వాళ్ళు ఎక్కువ గంటలు ఓపికతో ఎలా పని చేయగలరు? ఎందుకంటే వాళ్ళు ఎందుకు పనిచేస్తున్నారో, తమ విజన్ ఎంటో, అందుకు చేరుకోవాల్సిన లక్ష్యాలు ఏమిటో స్పష్టంగా తెలుసు. వ్యక్తిత్వ వికాస నిపుణులు చెప్పినట్లు ఈ ప్రపంచంలో అసలు సోమరిపోతులు లేరు కేవలం “ఏమి చేయాలి?” అనే స్పష్టత, పరిగెత్తించే పెద్ద లక్ష్యాలు లేని వారు మాత్రమే ఉంటారట.   అందుకే స్పష్టమైన వ్యక్తిగత “మిషన్  స్టేట్ మెంట్” ఉండాలి. అనుక్షణం నా జీవితం ఈ అంశం మీద పనిచేయాలి, ఈ విధానాలలో, ఈ విలువలతో ముందుకు వెళ్ళాలి అనే స్పష్టత కళ్ళ ముందు కనిపిస్తుంటే వ్యక్తి తన సంపూర్ణ శక్తిని (లైఫ్ ఎనర్జీ) ముఖ్యాంశాలపై కేంద్రీకరించగలడు.  అప్పుడు న్యూస్ పేపర్ లో వార్తలు, వాళ్ళతో వీళ్ళతో పోల్చుకునే అలవాటు, అనవసర ఆటంకాలు, ప్రలోభాలు, పనులను నిర్వీర్యం చేసే ఉచ్చులలో పడకుండా తన ఫోకస్ కీలక అంశాల పై పెట్టగలడు.
సెల్ఫ్ టెస్ట్ :
ü  మీ మిషన్/ విజన్/ జీవిత ధ్యేయం ఏమిటి?
ü  మీ దీర్ఘకాలిక, ఈ సంవత్సర  లక్ష్యం ఏమిటి?
ü  వాటిని సాధించే క్రమంలో ఏర్పరచుకున్న ఈ ఒక సంవత్సరం లక్ష్యం ఏమిటి?
ü  మీ లక్ష్యాన్ని స్పష్టంగా రాసుకున్నార?
ü  ఎంత తరచుగా మీ లక్ష్యం మీ మనసులో మెదులుతుంది? మీరు రివ్యూ చేసుకుంటున్నారా?

2.     టుడే ఈజ్ మై డే
విజయవంతంగా ఎంట్ర ప్రెన్యూర్ జర్నీ చేసిన ఏ వ్యక్తినైనా గమనించండి. వాళ్లకు లక్ష్యమే కాదు లక్ష్యం తాలూకు ప్రణాళిక ఉంటుంది. ఏ సమయానికి ఏమి కావాలి అనే ఒక క్లారిటీ ఉంటుంది. అందుకు అనేక విధానాలలో ప్రయత్నిస్తారు. ఒక రోజు పనులు చేయలేక ఫెయిల్ అయితే దాని ప్రభావం భావిష్యత్తు పై ఉంటుందని తెలుసు. ప్రతిరోజూ కొంత ఎదుగుదల (ప్రోగ్రెస్) అయితే తమ లక్ష్యాల వైపు ముందుకు వెళ్ళగలను అనే భావంతో సమయాన్ని ఉన్నతంగా వాడుకుంటారు. ఈ రోజు నారోజు (టుడే ఈజ్ మై డే ) అన్నట్లు గడుపుతారు.
సెల్ఫ్ టెస్ట్ :
ü  ఈ రోజు మీ లక్ష్యం గుర్తుకు తెచ్చుకున్నారా?
ü  మీ లక్ష్యం చేరుకునే దిశలో ఈరోజు పనులు చేసారా? వాటిని చేయటం ద్వారా నేర్చుకున్న కొత్త అంశాలు ఏమైనా ఉన్నాయా?
ü  మీ లక్ష్యాన్ని ఇతరులు ఎవరైనా సాధిస్తే వారి ద్వారా నేర్చుకోవాలన్న ఆలోచన మీకు ఉందా?
ü  నిన్నటి కంటే ఈ రోజు బాగా చేసిన , కొత్త ఆలోచనలతో చేసిన , భిన్నంగా చేసిన అంశాలు ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా?


3.     ఫలితాల దిశలో రోజు వారీ కార్యక్రమాలు (డైలీ రొటీన్ )
సెల్ఫ్ మోటివేషన్ ఉన్న ఎంట్రప్రెన్యూర్ రోజువారీ కార్యక్రమాలు (డైలీ రొటీన్) శక్తివంతంగా నిర్మించుకుంటారు. ఈ ప్రపంచంలో మనం కలిసే మనుషులు వారి ప్రభావాన్ని  చూపిస్తారు. ఈ ప్రభావం మన లక్ష్యాలు, మనం జీవితాన్ని చూసే విధానం, మనం పనులు నిర్వహించే విధానం పై పడుతుంది.  కానీ సెల్ఫ్ మోటివేషన్ ఉన్న వారు బయటి ఒత్తిడులు ప్రభావాలకు ప్రతిచర్య రూపంలో వెంటనే ప్రతిస్పందిస్తూ కూర్చోరు. వారి విధానాలు, వారి రూల్స్ వాళ్ళు సృష్టించుకుంటారు. చుట్టూ ఉన్న వ్యక్తులు, ఆ రంగంలో ఉన్న ఇతరుల విధానాలు, నెగటివ్ వ్యక్తుల ప్రభావం తమ మీద పడకుండా ఒక షీల్డ్ వేసుకున్నట్లుగా తమ పై తమకు ఉన్న అభిప్రాయాలు, తన విలువలు తన స్టాండర్డ్స్ తో ఒక రక్షణ వలయం సృష్టించుకుంటాడు. తన ఎంట్ర ప్రెన్యూర్ జర్నీ తనకు ముఖ్యం అందుకు తగిన వ్యక్తిలా ఉన్నతంగా మారడానికి రెడీ గా ఉంటారు గానీ తన ఉనికే పోయేలా ప్రభావానికి గురి కారు. వారి శక్తి వంత మైన డైలీ రూల్స్ వారే నిర్ణయించుకుంటారు. ఐదు గంటలకి నిద్ర లేవడం, రోజు 45 నిమిషాలు వాకింగ్, 30 నిమిషాలు  మెడిటేషన్, నో టీవీ , నెగటివ్ మనుషులకు దూరంగా ఉండటం ఇవన్నీ తనే నిర్ణయించుకుంటాడు. అమలు పరుస్తాడు. ఎందుకంటే ఒక గొప్ప ఎంట్ర ప్రెన్యూర్ కావాలంటే అతని ఒక రోజు ఉన్నతంగా ఉండాలి. సెల్ఫ్ మోటివేషన్ ఉన్నవారు ఈ వాస్తవానికి తగ్గట్లు , బాలన్స్ తో ముందుకు వెళతారు.
సెల్ఫ్ టెస్ట్ :
ü  మీ రోజు వారీ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? 
ü  మీరు ఏ సమయానికి నిద్ర లేస్తారు? ఏ వ్యక్తులను కలుస్తారు? ఎవరితో ఎక్కువ గడుపుతారు?
ü  మిమ్మల్ని పాజిటివ్ గా ప్రేరేపించే పుస్తకాలు, మనుషులు, వీడియోస్ మీ వద్ద ఉన్నాయా? ఎంత తరచుగా వారినుంచి మీరు మోటివేషన్ పొందుతారు?
ü  ఇతరులతో మీరు ఎలాంటి సంభాషణలు చేస్తారు?
ü  మీ క్లైంట్ / కస్టమర్/ బాస్/ బృంద సభ్యులతో  తో ఎలా ప్రవర్తిస్తారు?
ü  మీ పనిలో మిమ్మల్ని అత్యంత ఉత్సాహంగా నడిపించే అంశం ఏమిటి? ఏ విషయాలు మిమ్మల్ని మోటివేట్  చేస్తున్నాయి?
ü  మీ సమయాన్ని తినేస్తున్న టైం కిల్లర్స్ (ఆటంకాలు) ఏమిటి ?
ü  మీరు ఏ అంశాలు , నైపుణ్యాలు నేర్చుకుంటే మీ రంగంలో ఇంకా బాగా ఎదగాగలరు? అందుకు మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తునారు?

4.     శక్తివంతమైన అలవాట్లు
దాదాపు ప్రతి ఎంట్ర ప్రెన్యూర్ మెడిటేషన్ (ధ్యానం) లేదా ధ్యాన స్థితిలో గడిపే ఒక అలవాటు ఉంటుంది. దానిని వారు తు.చ. తప్పకుండా పాటిస్తారు. ఎందుకంటే వారి మనసుని సేద తీరుస్తుంది, కొత్త విధానం లో జీవితాన్ని చూసేలా ప్రోత్సహిస్తుంది, సృజనాత్మక ఆలోచనలు, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళే మార్గాలు ఆవిష్కరించుకోగలరు. వారు మనసును ఉన్నత ఆలోచనలతో , శరీరాలను ఉన్నతమైన, శక్తినిచ్చే, పౌష్టిక ఆహారంతో నింపుతారు. కావలసినంత ఎక్సర్ సైజ్, కంటినిండా నిద్ర, తన మనసుకి ఆహ్లాదాన్ని ఇచ్చే హాబీస్ లో గడుపుతారు. అందువలన వారు పని మీద ఫోకస్ చేయగలరు, ఎక్కువ పని గంటలు కూడా ఆనందంగా, ఆక్టివ్ గా ఉంటారు.  
సెల్ఫ్ టెస్ట్ :
ü  మీ శరీరాన్ని (బాడీ), మనసుని (మైండ్), ఆత్మ (సోల్ )ని ఎలాంటి విషయాలతో నింపుతున్నారు?
ü  మీకు ఎలాంటి ఆహారం శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తున్నట్లు ఫీల్ అవుతారు?
ü  మీరు రోజుకి ఎంత సమయం వ్యాయామం చేస్తునారు? ఈరోజు చేసారా? మీ వ్యాయామం యొక్క లక్ష్యం ఏమిటి?
ü  మీరు పనులు చేయటం ద్వారా మానసికంగా సంతోషంగా, మీతో మీరు అర్థవంతంగా సమయం గడిపినట్లు ఉండే కార్యక్రమాలు ఏమిటి? వాటిని ఎంత తరచూ చేస్తునార్? మీ హాబీస్ మీద సమయం పెడుతునారా?
ü  మీ కుటుంబ సభ్యులకు క్వాలిటీ సమయాన్ని కేటాయించి మనస్పూర్తిగా మాట్లాడుతునారా?
ఈ నాలుగు అంశాలు ఎంట్ర ప్రెన్యూర్స్ లక్ష్యాల దిశలో మార్గంలోని ఆటంకాలను జయించడానికి సెల్ఫ్ మోటివేషన్ లేదా స్వయం ప్రేరణతో దూసుకెళ్ళడానికి దోహదం చేస్తాయి. మీరు ఈ అంశాలలో ఏ స్థాయిలో ఉన్నారో గ్రహించండి సెల్ఫ్ టెస్ట్ ప్రశ్నలకు జవాబులు రాబట్టండి మీ స్వీయ ప్రేరణ సంబంధించి స్పష్టత వస్తుంది. బెస్ట్ విషెస్ ఫర్ గ్రేట్  సక్సెస్. 
***  ***  ***  సైకాలజీ టుడే, మార్చ్  2017 లో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  ***