2. Focus on results , make changes in product, strategy or marketing to get results
3. Get comfortable with discomfort while making sales
4. Develop and practice a compelling and WOW Sales story and how it helps your prospect
5. ASK for sales. Feel so easy? A study reveals 70 % of the sales people don't ask for sale.
ఒక బిజినెస్ విజయవంతంగా నడవాలంటే
ఆ బిజినెస్ ద్వారా అందించే ప్రోడక్ట్స్, సేవలు అందుకునే కస్టమర్లు ఉండాలి. వారిని
ఎలా చేరుకోవాలో తెలియాలి. కాబోయే కస్టమర్లను (ప్రాస్పెక్ట్స్) ఎలా గుర్తించి వారి
అవసరాలను తీరిస్తే మీ బ్రాండ్ నేమ్, మీ సర్వీసు నాణ్యత అర్థం చేసుకుని వారే మీకు
కొత్త కస్టమర్లను కూడా రికంమెండ్ చేస్తారు. మరి ఇదంతా జరగాలి అంటే ముందు
ప్రాస్పెక్ట్స్ ఎలా సేవలు అందించాలి?
తక్కువ సమయంలో ఎక్కువ సేల్స్ ఎలా చేయాలి? ఈ కీలక అంశాలు చర్చించడానికే ఈ
వ్యాసం. మరో నెల రోజులలో మీరు ఎందరు కొత్త కస్టమర్లను చేరుకోగలరో అందుకు ఏం
చేయగలరో తెలుసుకుందాం రండి.
*** ***
*** *** ***
***
ఈ కొత్త ఎకానమీ లో సేల్స్ చేయడమే
రాజరికం. అమ్మకమే రాజు. సేల్స్ ఈజ్ ది కింగ్. మార్కెటింగ్ సత్తా ఉంటే మీరే కింగ్ మేకర్. అందుకు ఈ క్రింది
అంశాలు అర్థం చేసుకోవాలి. మీ సక్సెస్ అనేది మీరు ఎంత మంది కొత్త ప్రాస్పెక్ట్స్
చేరుకోగలరు అందులో ఎంత మంది కొత్త వినియోగదారులను నిలబెట్టుకోగలరు అనేదానిపై
ఆధారపడి ఉంది. అందుకోసం మీరు మిమ్మల్ని, ఆ తర్వాత మీ ప్రోడక్ట్ ని, ఆ తర్వాత మీ
కంపెనీని విలువలతో అమ్ముకోగలగాలి. మీ సేల్స్ లో విజయవంతంగా వెళ్ళడానికి, కొత్త ప్రాస్పెక్ట్స్ కస్టమర్స్
ని చేరుకోడానికి , సూపర్ సేల్స్ సాధించడానికి ఈ ఐదు మార్గాలు ఉపయోగపడతాయి. అవేంటో
చర్చిద్దాం రండి.
1. మీరు ప్రజలతో బిజినెస్ లో ఉన్నారని గుర్తుంచుకోండి
చాలా మంది
సేల్స్ చేసేటప్పుడు వాళ్ళు మనుషులతో బిజినెస్ చేస్తున్నాం అనేది మర్చిపోయి
ప్రోడక్ట్, ఉపయోగాలు, రేటు, ఆఫర్, స్పెషల్ ఆఫర్ ....ఇలా ఒక ఆటోమేటెడ్ మిషన్ లాగా
చెప్పుకుంటూ వెళ్తారు. కస్టమర్ తనకు వ్యక్తిగతంగా గౌరవం ఇవ్వాలని, తాను “ముఖ్యం”
అని ఫీల్ అవ్వాలి అనుకుంటాడు. మీరు చెప్పే బ్రేకులు లేని స్టొరీ వినాలన్న కుతూహలం
వారికి ఉండదు. ఒక క్షణం చిన్న ఎక్సర్ సైజు చేయండి. కళ్ళు మూసుకొని మీకు
గుర్తుంచుకోండి. అరిగిపోయిన రికార్డు లాగా, ఏమి కావాలో తెలుసుకోకుండా, మీరు ఏ
స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోకుండా ఒక ప్రోడక్ట్, సర్వీస్ గురించి చెప్పిన
వ్యక్తుల్ని గుర్తుకు తెచ్చుకోండి. వారి మాటలు మళ్ళీ ఇప్పుడు మీ మైండ్ ధియేటర్ లో
వినండి, ఆ వ్యక్తుల్ని చూడండి. కళ్ళు తెరవండి. మళ్ళీ మన ఆర్టికల్ లోకి రండి
....ఇప్పుడు చెప్పండి. మీకు గతంలో సేల్స్ చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు గుర్తొచ్చి
ఉంటారు. సిం కార్డ్, పోస్ట్ పెయిడ్ సర్వీస్, లోన్స్, క్రెడిట్ కార్డు, డైరెక్ట్
సేల్స్ చేసే డోర్ నాకింగ్ సేల్స్ టీం...ఎవరైనా అయి ఉండొచ్చు. వారి పై మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంది. వారితో
బిజినెస్ చేసారా? ఇకముందు చేస్తారా? ఈ చిన్న ఎక్సర్ సైజు వలన సేల్స్ అనేది మనుషులను
మనుషులుగా చూస్తూ, వాళ్ళ మానసిక స్థితి కి, ఫీలింగ్స్ విలువను ఇస్తూ, వాళ్ళకు ఉన్నత బంధంతో అవసరాలను తీరుస్తూ ముందుకు సాగే
ఒక సాధన కూడిన ప్రక్రియ అని అర్థం అవుతుంది. అందుకే ప్రేమతో నవ్వాలి, నీట్ గా
డ్రెస్ చేసుకుని కనిపించాలి, ఉత్సాహంగా షేక్ హ్యాండ్ ఇవ్వాలి, రెండు చేతులతో
నిజమైన వినయంతో కూడిన నమస్కారం చేయాలి, మాట్లాడే సమయంలో వారి పేరుని వాడాలి,
వారికి చెప్పిన సమయానికి 5 నిమిషాలు ముందుగానే వెళ్ళగలగాలి. ఇవి చూడడానికి చిన్న
అంశాలుగానే ఉంటాయి కానీ పెద్ద మార్పును, బిజినెస్ ని అందించే సూత్రాలు. మనుషులతో పని, మనుషుల అవసరాలు తీర్చే పని, వారి ఫీలింగ్స్ అర్థం
చేసుకుని చేసే పని. అందుకే ఈ విషయం అర్థం చేసుకుంటే మీకు సూపర్ సేల్స్ గ్యారెంటీ.
2. ఫలితాలు మీద దృష్టి పెట్టండి
సేల్స్ అంటే
మేనేజ్మెంట్ (నిర్వహణ), ప్లానింగ్ వేయటం, ఈవెంట్ చేయటం వంటిది కాదు, “ఫలితాలు సాధించటం” . సేల్స్ చేసేవారు అనేక రిపోర్ట్
చేస్తూ, ఓల్డ్ కస్టమర్స్ సర్వీస్ చూస్తూ, మీటింగ్ లకు వెళ్తూ బిజీ గా ఉన్నాం
అంటారు, అసలు మీ ప్రోడక్ట్, సర్వీస్ తీసుకునే కొత్త కస్టమర్ ని కలిసే ప్రయత్నం
చేస్తున్నారా? సేల్స్ లో మీ సక్సెస్ అంటే ఫలితాలు సాధించడం. అంటే ఎక్కువ కస్టమర్స్
చేతిలో మీ ప్రోడక్ట్ ఉండడం. సూపర్ సేల్స్ పర్సన్ అంటే వారి కస్టమర్స్ ని
చేరుకోవడం, ప్రోడక్ట్ గురించి వివరించడం, వారు డబ్బు పెట్టి ఆ ప్రోడక్ట్ , సర్వీస్
తీసుకునేలా చేయటం వస్తుంది. మీరు పెట్టే ప్రయత్నాలకి (ఎఫర్ట్స్)కి, మీ ఫలితాలకి(రిజల్ట్స్)
పోల్చుకుని ప్రయత్నం చేసాను కదా అనుకుని మిమ్మల్ని మీరు తృప్తి (....ఎవరి కోసం?)
పరుచుకుంటే సరిపోదు. అప్పాయింట్మెంట్
తీసుకోడానికి, అమ్మడానికి ప్రయత్నించడం కాదు ....అప్పాయింట్మెంట్ తీసుకున్నావా?
లేదా? అమ్మకం చేసావా? లేదా? .....ఇలా నిశితంగా ఆలోచించుకోవాలి. అందుకు ఏం చేస్తే
పనులు అవుతాయో? ఏమి చేస్తే ఫలితం వస్తుందో ? ఏమి
చేస్తే సేల్ చేయొచ్చో ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి. చేసిన ప్రయత్నాలు
మాత్రమే చెప్తుంటే ప్రపంచం వినదు, మన ఫలితాలే మాట్లాడాలి.
3. ఇబ్బంది అనిపించినా చేయాలి
సేల్స్ లో
సూపర్ సక్సెస్ అయిన వారిని చూడండి వారు వారి ప్రోడక్ట్, సర్వీస్ ని పూర్తిగా
నమ్ముతారు, కస్టమర్ల అవసరాలను తీర్చేందుకు ఆ ప్రోడక్ట్ వారి చేతిలో ఉన్నందుకు
సంతోషంగా ఉంటారు, ఆ ప్రోడక్ట్ గురించి ఉత్సాహంగా మాట్లాడతారు, కష్టమైన ప్రశ్నలు
వేసే కస్టమర్ ని ఎదుర్కోడానికి రెడీ గా ఉంటారు. ఏ కంపెనీ
లో అయినా సేల్స్ చేసే ప్రాసెస్ లో ఇబ్బందిని కూడా ఎంజాయ్ చేస్తూ, నేర్చుకుంటూ పని
చేసే వారే సేల్స్ లో టాప్ పెర్ఫార్మన్స్ లిస్టు లో ఉంటారు. కొన్ని
కంపనీలు పోటీదారులు విసిగిపోయినా సరే టఫ్ కస్టమర్లను లిస్టు చేసుకుని వారితో ఫాలో
అప్ చేస్తూ వాళ్ళ లైఫ్ టైం లోనే చేయనన్ని సేల్స్ చేస్తారు.
4. కస్టమర్ తో వావ్ అనిపించాలి
గ్రేట్ సేల్స్
పర్సన్ అంటే కస్టమర్ తన ప్రోడక్ట్ /సర్వీస్ గురించి వావ్ అని ఆనందంగా ఫీల్ అయ్యేలా
చేయాలి. అప్పుడు కస్టమర్స్ ఎమోషనల్ గా
ఇన్వాల్వ్ అవుతారు, త్వరగా ఆ ప్రోడక్ట్ కొనటం కోసం బాధ్యత తీసుకుంటారు. ఆ విధంగా
వావ్ అనిపించే విధానాలు పాటించగలిగితే కస్టమర్ మీతో ఒక సమన్వయంలో ఉంటారు. అందుకు
మీరు మీ ప్రిపరేషన్ పర్ఫెక్ట్ గా ఉండాలి, ప్రెజెంటేషన్ ప్రాక్టీసు చేయాలి,
కొందరికి చెప్పిన తర్వాత కొన్ని కస్టమర్ ఫీలింగ్స్ అర్థం చేసుకుని ఆ ఫీలింగ్స్ మీ భాషలో
వచ్చేలా ప్రయత్నించాలి. ఒక బోరింగ్ ప్రొడక్ట్ కూడా వావ్ అనిపించి సేల్స్ చేసేవారిని
గమనించండి. చాలా నేర్చుకోగలం. ఏంటి సందేహిస్తున్నారు? కొన్ని ప్రకటనలు చూడండి ... మీ పక్కింటిలో ఉంది,
ఎదురింటిలో ఉంది మరెండుకు ఆలస్యం ఈ రోజే ఆర్డర్ చేయండి. ఇలాంటి ప్రొడక్ట్స్ ని
గమనిస్తే మీకు తెలిసిన అంశమే అయినా వావ్ అనిపించే ప్రయత్నం చేస్తారు. అందుకే మంచి
ప్రోడక్ట్, ప్రమోట్ చేసే టెక్నికల్ సత్తా తో పాటు అందుకు తగిన సేల్స్ వావ్ స్టొరీ అవసరం. నాలుగు సంవత్సరాల క్రితం ఒక సంస్థకు నేను రాసిన
బ్రోచర్ లో కేవలం ఫీచర్స్ మాత్రమే కాకుండా సేల్స్ స్టొరీ ని చొప్పించి కాన్సెప్ట్
సెల్లింగ్ చేసే విధంగా కంటెంట్ అందించాను. అది వారి బిజినెస్ కి ఉన్నతంగా
ఉపయోగపడింది. అంతే కాదు అదే బిజినెస్ లో ఉన్న ఇతర రెండు కంపెనీ ఒక సంవత్సరంలో ఆ
బ్రోచర్ ని కాపీ కొట్టాయి. కేవలం లోగో,
ప్రాజెక్ట్ పేరు మాత్రమే మార్చారు. అంటే అర్థం మన సేల్స్ స్టొరీ మన పోటీదారుడుకి
కూడా నచ్చింది. ఇంకొంత మంచి వావ్
స్టొరీని, నిజాయితీతో, ఉన్నదాన్ని ఉన్నట్లుగా , ఉత్సాహంగా చెప్పటం మన బాద్యత.
5. సేల్స్ కోసం అడగండి
ఇది చూడడానికి సింపుల్ గా ఉంటుంది
. కానీ చాలా మంది సేల్స్ పర్సన్స్ సేల్ కోసం అడగరు. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది
నిజం. ఒక సంస్థ 500 కంపెనీస్ కి వెళ్లి
సేల్స్ వాళ్ళు ఎలా పనులు చేస్తున్నారో తెలుసుకునే రీసెర్చ్ లో భాగంగా మిస్టరీ షాపింగ్ చేసింది. విచిత్రంగా 70% పైగా సేల్స్
వాళ్ళు రీసెర్చ్ టీం ని “కొనండి” అని అడిగి సేల్స్ చేసే ప్రయత్నం చేయలేదు.
ప్రోడక్ట్, సర్వీస్, రేటు ఎలా ఐనా ఉండనివ్వండి “మీరు కొనండి” అని అడగకపోతే
కేవలం అడిగినా అడగకపోయినా కోనేవారికే అమ్ముతారు. మీరు కలిసిన ప్రతి వ్యక్తిని సేల్స్ ప్రెజెంటేషన్ లో భాగంగా ఈ ప్రోడక్ట్ మీరు తీసుకోండి అని
అడగటం చేస్తున్నారా లేదా చెక్ చేసుకోండి. సక్సెస్
అవ్వాలంటే అడగాలి ....మన ప్రోడక్ట్ మంచిదని నమ్మకంతో, అది వారికి అవసరాలను
తీరుస్తుందని విశ్వాసంతో అడగాలి.
అడగనిది అమ్మ అన్నం పెడుతుందేమో, భార్య బిర్యానీ పెడుతుందేమో, స్నేహితుడు సహాయం చేస్తాడేమో...అయినా సరే
కస్టమర్ ని సేల్స్ అడగండి . ఈ సూత్రాలు పాటించి మీ బిజినెస్
లో సూపర్ సేల్స్ సక్సెస్ మాతో పంచుకోండి.
*** *** *** సైకాలజీ టుడే, జూలై 2017 లో ప్రచురించబడిన ఆర్టికల్ *** *** ***
No comments:
Post a Comment