Showing posts with label Personal Transformation. Show all posts
Showing posts with label Personal Transformation. Show all posts

Sunday, 12 March 2017

మీ బలహీనతలను బలాలుగా మార్చుకునేందుకు సూత్రాలు


మనందరిలో అనేక బలహీనతలు ఉంటాయి. ఒకసారి మనం వాటిని గుర్తిస్తే బయటదడడానికి ప్రయత్నిస్తాం. ఉన్నతంగా మారడానికి ప్రయత్నిస్తాము. కోపం, నిర్మొహమాటం గా మాట్లాడడం నుంచి ‘నో’ చెప్పలేకపోవడం, ఇతరులకు చెప్పిన సమయానికి చేరుకోకపోవడం వరకు అనేక బలహీనతలు మనలో ఉండొచ్చు. అయితే వాటిని ఎలా మార్చుకోవాలి అందుకు పాటించగల సూత్రాలేమిటో చర్చిద్దాం. “తర్వాత చదువుదాం అనుకుంటున్నారా?”.... పనులు వాయిదా వేయటం అనేది ఒక పెద్ద బలహీనత ....అందుకే ఈ క్షణమే చదవండి, బలహీనతలు జయించడానికి కొత్త సంవత్సరం మీ జీవితంలో “ది బెస్ట్ ఇయర్” మలుచుకోడానికి ప్రయత్నాలు మొదలు పెట్టండి. అదెలాగో తెలుసుకుందాం రండి.    
***    ***    ***    ***    ***    ***
మీ జీవితంలో ఉన్న ఏ లక్షణాలకు,  ఏ  గుణాలకు  మీరు సంతోషంగా లేరు? ఈ క్రింద ఇచ్చిన 16 సాధారణ బలహీనతల లిస్టు లో మీలో ఉన్నాయని గట్టిగా భావించే ఎవైనా మూడు లక్షణాలను ఎంపిక చేసుకోండి.
  1. అపసవ్యంగా (Disorganized) – ఒక ప్రణాళికతో, పద్దతిలో సవ్యంగా పనులు చేయకపోవడం   
  2. అననుకూలంగా (Inflexible) – పరిస్థితులకు తగినట్లుగా ఆలోచనలను, నిర్ణయాలను, అలవాట్లను, జీవితాన్ని చూసే/ పనులు చేసే విధానాలను మార్చుకోలేకపోవటం  
  3. మొండిగా ఉండటం (Stubborn) – నేను ఇలానే ఉంటాను; నాకు, ఇతరులకు ఇలా ఉండటం ఉపయోగంగా లేకపోయినా, ఇబ్బందులు ఎదురైనా ఇలాగే ఉంటాను 
  4. అస్థిరంగా ఉండటం/ స్థిరంగా లేకపోవడం (Inconsistent) – స్థిరమైన ఆలోచన, స్థిరమైన నిర్ణయాలు, పనిచేయటం అందుకు జవాబుదారీగా ఉండటం
  5. చెడ్డగా ఉండటం,  ఉండటం (Obnoxious) – ఇతరులకు, తనకు, తన కుటుంబానికి మంచిది కాదు అని తెలిసి కూడా చెడ్డ బుద్దితో కూడిన ఆలోచనలు , నేను ఏమైనా పర్లేదు పక్కవాడు మాత్రం బాగుపడకూడదు వంటి ఆలోచనలు
  6. భావోద్వేగాలు లేనట్లు ఉండటం (Emotionless)
  7. సిగ్గు పడటం, బిడియంగా ఫీల్ అవడం (Shy)
  8. భాద్యతా రాహిత్యం, ఒక వ్యక్తిగా తీసుకోవాల్సిన బాధ్యత తీసుకోకపోవడం Irresponsible
  9. విసుగుతో ఉండటం (Boring)
  10. అవాస్తవ / వాస్తవానికి దూరంగా ఉండటం (Unrealistic)
  11. ప్రతికూల ఆలోచనలు, విధానాలతో ఉండటం(Negative)
  12. భయం వలన ముందుకు వెళ్ళలేకపోవడం (Intimidating)
  13. బలహీనమైన ఆలోచనలు, పనులు, ఫలితాలతో గడపడం (Weak)
  14. దురహంకారం (Arrogant) – ఉన్న పేరునో, వృత్తినో, పదవినో లేదా ఒక స్థితినో చూసుకుని  
  15. నిర్ణయం తీసుకోలేకపోవడం, ద్రుధసంకల్పం లేకపోవడం, అనిశ్చితితో కూడిన విధానాలు (Indecisive)
  16. ఓపిక, ఓర్పు లేకపోవటం, సహనం లేకపోవడం (Impatient)

మీలో మీరు గుర్తించిన ఏవైనా మూడు అంశాలను ఎంచుకున్నారా? అమ్మో....అని గాబరా పడకండి ఈ పెద్ద లిస్టు చూసి, మీకు మూడు కంటే ఎక్కువ అంశాలు బలహీనతలుగా ఉన్నా అప్పుడే కంగారు పడాల్సిన పని ఏమి లేదు. ఈ ఎక్సర్ సైజ్ తర్వాతి స్టెప్స్ లో మీ బలహీనతలు ప్రారదోలదానికి ప్రయత్నిస్తూనే ప్రాసెస్ అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు.
ఇప్పుడు ఈ క్రింది లిస్టు చూడండి, మళ్ళీ మీరు ఎంపికచేసుకున్న  మూడు లక్షణాల దగ్గర ఉన్న విశిష్ట లక్షణాలు (traits) గమనించండి.  

  1. అపసవ్యంగా (Disorganized) –
సృజనాత్మకంగా (క్రియేటివ్)
  1. అననుకూలంగా (Inflexible) –
సవ్యంగా (Organized)
  1. మొండిగా ఉండటం (Stubborn) –
అంకిత భావం (dedicated)
  1. అస్థిరంగా ఉండటం/ స్థిరంగా లేకపోవడం (Inconsistent) –
అనుకూలంగా మరే తత్వం (Flexible)
  1. చెడ్డ తనం (Obnoxious) –
ఉత్సాహభారితమైన (Enthusiastic)
  1. ావోద్వేగాలు లేనట్లు ఉండటం (Emotionless)
నిర్మలమైన (Calm)
  1. సిగ్గు పడటం (Shy)
ప్రతిబింబించే , ప్రతిస్పందించే (Reflective)
  1. భాద్యతా రాహిత్యం(Irresponsible)
సాహసోపేతమైన (Adventurous)
  1. విసుగుతో ఉండటం (Boring)
భాద్యతాయుతమైన (Responsible)
  1. అవాస్తవ ఉండటం (Unrealistic)
అనుకూల వైఖరి (పాజిటివ్)
  1. ప్రతికూల ఆలోచనలు(Negative)
వాస్తవంగా ఆలోచించే తత్వం (Realistic)
  1. భయం వలన ఆగిపోవడం (Intimidating)
దృఢమైన, మొహమాటం లేని (assertive)
  1. బలహీనమైన ఆలోచన (Weak)
వినయతతో కూడిన (Humble)
  1. దురహంకారం (Arrogant) –
ఆత్మ విశ్వాసం (self confidence)
  1. నిర్ణయం తీసుకోలేకపోవడం (Indecisive)
ఓపికతో కూడిన (Patient)
  1. ఓపిక, ఓర్పు లేకపోవటం, (Impatient)
గట్టి అభిరుచి, మక్కువ (passionate)

పై టేబుల్ లో వివరించినట్లు మీరు బలహీనత అనుకున్న మూడు అంశాలకు కుడి వైపు ఉన్నవే మీ బలాలు. ఒకోసారి పరిస్థితిని బట్టి బలాలా బలహీనతలా అనేది సమీకరణాలు మారిపోతాయి. అందుకే ఇవన్నీ ఏ ఫ్రేమ్ వర్క్ , ఏ స్థితిలో , ఏ కాంటెక్స్ట్ లో ఉన్నామన్న దానిపై, ఎంత మోతాదులో మీరు ఆశించిన ఫలితాలు లేదా ఎంత ఆనందంగా ఉన్నారు అన్నదానిపై ఆధారిపడి ఉంటుంది.
మీ పనిలో, వ్యక్తి గత జీవితంలో, సమాజంలో వేర్వేరు పరిస్థితిలలో మీ గుణాలు, లక్షణాలు మీకు బలహీనతలుగా , మీ ఎదుగుదలకు అడ్డంకులుగా ఉంటే ....ఆ అంశాలే చూపిస్తున్న మీ బలాలు ఏమిటో గుర్తించారు. ఈ బలాలను దృష్టిలో ఉంచుకుని మీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళే ఒక నిర్మాణాత్మక అవగాహన , ఆచరణ ఈ కొత్త సంవత్సరంలో ప్లాన్ చేసుకోండి. బలహీనతలు ఉండటం తప్పు కాదు, వాటిలో నర్మగర్భంగా ఉన్న అసలు పాజిటివ్ ఎక్స్ ప్రెషన్ గుర్తించి వాటిని ప్రాదాన్యాలుగా కార్యక్రమాలు చేయలేక పోవటమే ఫెయిల్యూర్ కి కారణం.
బలహీనతలను  జీవితాన్ని నేర్పే గురువులు మార్చుకోండి: అవును . మీరు ఎక్కడ ఆగిపోతారు అంటే కెరీర్ లో అయితే మీ నైపుణ్యాలు ఆగిన దగ్గర అయిపోతారు. మరి డబ్బు, ఆరోగ్యం, పెద్ద కలలు నిజం చేసుకోవడం ...ఇలా ఏ అంశం గమనించినా మనిషి కేవలం తను సృష్టించుకున్న బలహీనత దగ్గర అది అందిస్తున్న పాజిటివ్ హింట్  అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవడం వద్ద ఆగిపోతాడు. ఆ స్థితి మీకు రాకూడదంటే ఒక పని మీకు అవసరం ఉన్నా చేయలేకపోతున్నమంటే, ఒక విధానం జీవితాన్ని ఉన్నతంగా మార్చుతుందని తెలిసినా అమలు చేయలేక పోతున్నామంటే అది బలహీనత  అని. అది మీ కంఫర్ట్ జోన్ ని సవాల్ చేస్తుందని , దానిని చేయటం ద్వారా మీరు గొప్ప పాఠాలు నేర్చుకోగాలరని నమాలి. 
ఇలా చేసి చూడండి:

  1. మీ బలహీనతలను అంగీకరించండి. మనస్పూర్తిగా. అవి ఇస్తున్న పాజిటివ్ హింట్ గమనించండి
  2. మీ బలాలను ఒక లిస్టు గా రాయండి, మీ బలాలతో మీరు చేయగల పనులు రాయండి.
  3. మీ గొప్ప నైపుణ్యాలు రాయండి , వాటి ద్వారా చేయగల కార్యక్రమాలు రాయండి
  4. మీ బలాల ద్వారా మీ బలహీనతల ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవచ్చు ఆలోచించండి
  5. నమ్మకమైన  కోచ్, ట్రైనర్, స్నేహితులు మీ బలహీనతల నుంచి బయటపడటం కోసం మీరు జవాబుదారీగా (accountable) గా ఉండమని అడగండి
  6. ప్రణాళికతో ఉండటం ద్వారా మీ లక్ష్యాలు, ప్రాధాన్యాలు పై ధ్యాస ఉంచి, ఆ ఫలితాల కోసం ఏమి చేయాలో అదే చేయగలరు, అందుకు కావాల్సినవి నేర్చుకోగలరు, అప్పుడు బలహీనత గురించి ఆలోచించే సమయం లేనంతగా బిజీ అవుతారు
  7. మీకు లేని నైపుణ్యాలు నేర్చుకునేందుకు సమయం కేటాయించండి, ఉన్న స్థితి నుంచి మరో స్థితికి వెళ్ళాలంటే విజన్, స్కిల్ రెండూ ఉండాలి వాటిపై దృష్టిపెట్టండి.
  8. అదే బలహీనత ఉన్న ఇతరులకు కూడా అందులోంచి బయటపడడానికి సహాయం చేయండి  
  9. సిగ్గు పడాల్సిన పని లేకుండా నిర్మొహమాటంగా ఫీడ్ బ్యాక్ తీసుకోండి , మీరు ఏం ఫ్రేమ్ వర్క్స్ ఉచ్చులో పడుతున్నారో తెలుసుకోండి.
  10. ఇతరులు మీలో కొన్ని విషయాల గురించి జోక్స్ వేస్తున్నారంటే వారు అలా సరదాగా మాట్లాడుతూ మీ నుంచి ఆశిస్తున్న మార్పు  కోరుతున్నారేమో గమనించండి.
  11. ప్రతిఒక్క విషయాన్ని మార్చాలని చూడకండి, ప్రయత్నం మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, ఉన్నత ఫలితం అవ్వాలి. ఒక మొండి ప్రయత్నం , తలనొప్పి కాకూడదు.
అల్లావుద్దీన్ అద్భుత దీపం లో మొదట వచ్చేది రాక్షసి అయినా మన కోరికలను నిజం చేసే రాక్షసి మంచిదే కదా అలాగే మీ బలహీనత ఒక బలంగా మారి జీవితాన్ని ఉన్నతంగా రూపొందించుకునేందుకు ఒక మెట్టుగా ఉపయోగపడాలని ఆశించండి. 
***  ***  ***  సైకాలజీ టుడే, జనవరి 2017 లో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  ***

Sunday, 7 February 2016

లేటు వయస్సులో గ్రేటు విజయం - వయస్సుతో సంబంధం లేకుండా విజేతగా నిలవడం ఎలా?


“నా జీవితం ఇంతే సరైన టైం కి పెళ్లి చేసుకుంటే….”, “25 సంవత్సరాలకే ఉద్యోగం వచ్చి ఉన్నట్లయితే ఎంత బాగుండేదో”, “ఈ  లైఫ్ , ఈ వయసులో నా చేతిలో ఏం ఉంది”, “ఈ వయసులో ఏమి చేస్తాను లెండి, శరీరమే సహకరించక పోతే ఇంకా ఇప్పుడు నేను ఎదో కొత్త ప్రయత్నాలు చేయడం దేనికి” ఇలా వయసుకి వారి జీవితానికి లింక్ పెట్టి మాట్లాడుతుంటారు కొందరు. మరి ఈ అంశాలలో వాస్తవం ఎంత? శరీరం, మనస్సు, వాటిమీద వయస్సు ప్రభావం ఎంత? మలి వయస్సులో సక్సెస్ మంత్రం జపించడం ఎలా ? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని నిరూపించిన వారెవరన్నా ఉన్నారా? ఉంటే వారు ఏం చేసారు? ఏ వయస్సు వారైనా ఆశించిన జీవితాన్ని సాధించుకోవటం ఎలాగో కాలం నేర్పిన పాఠాలు, కారణ జన్ములుగా పాటించిన విజేతల జీవితాలలో సక్సెస్ నియమాలు మీకోసం.
వయస్సు అనేది మనిషి తన ఉనికిని (existence) చెప్పడానికి వాడుకున్న అంశం. నాకు  ఇన్ని సంవత్సరాలు, మీకు ఆ పనికి ఎంత కాలం పట్టింది? వంటి కనీస వ్యవహారానికి ఉపయోగపడేది సమయం. మరి ఈ సమయం అనేది ఎక్కడ మొదలైంది ఎక్కడ అంతమౌతుంది పక్కకిపెడితే, మనం జన్మించాక వయసుని సంవత్సరాలలో కొలవడం తెలుసుకుంటాం, ఏ వయసుకి ఏం  పనులు చేస్తాము అనేది ప్రపంచం ద్వారా నేర్చుకుంటాం. అయితే మరి వయసుకి, శరీరానికి, మనసుకి లింక్ ఎక్కడ ఉంది?
శరీరానికి వయస్సు ఉందా?
ఇప్పడు మీకు ఉన్న శరీరం వయస్సు ఎంత? వయస్సు అనేది మనిషి శరీరానికి ఉందా? మనిషి మెమరీ లో మాత్రమే ఉందా? క్లినికల్ గా మాట్లాడితే మన శరీరం లోని కణజాలం మొత్తం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఒక సారి మనిషి గాలి పీల్చుకుని వదిలేసే సమయానికి కొన్ని కోట్ల కణాలు (ఇంచుమించుగా అవి 10 22)  మన శరీరం నుంచి ఈ సృష్టిలోకి వదులుతాము, అంతే సంఖ్యలో సృష్టిలోని కణాలు మన శరీరం లోకి తీసుకుంటాము. ఇది ఒక  మన సైంటిఫిక్ అంచనా. ఇంతేకాదు సైన్సు చెప్పేది ఏమిటంటే ఒక్క  సంవత్సరంలో మనిషిలో  98 % శరీరం పూర్తిగా మారిపోయి  కొత్త కణాలు నిర్మించుకుంటారని.  అలాగే 5 రోజులలో స్టమక్ లైనింగ్ 10 రోజులలో నాలుక రుచి మొగ్గలు, ఐదు నెలలకు లివర్, 3 వారాలలో ఊపిరి తిత్తులు, చర్మం, 4 వారాలకు రక్తకణాలు ఇలా ప్రతి అవయవం, వ్యవస్థ లోను  కణాలు మారిపోతుంటాయి. అంటే నాకు  ఇన్ని సంవత్సరాలు అని మీరు అన్నప్పుడు ఏ బాడీ (ఏ కణాల సమూహం) గురించి మాట్లాడుతున్నారో రిఫరెన్స్ తీసుకోవటం వీలుకాని ఒక వింతైన పరిస్థితి. వినటానికి కొత్తగా ఉన్నా ఇది సైంటిఫిక్ గా నిర్ధారించబడింది. అందుకే మనిషి ఒక మెమరీ మెషిన్ లా తనను తాను నిర్మించుకుంటాడు అంటారు.  మన శరీరం (బాడీ) అనేది నిరంతరం ఏర్పడుతూ ఉండే ఒక ప్రాసెస్, ఒక నిశ్చలమైన స్తబ్దమైన వస్తువు కాదు. అలా కనిపిస్తుంది అంతే.  అంటే మనం మన బాడీని ఎప్పటికప్పుడు కొత్తగా సృష్టించుకుంటూ ఉంటామన్న మాట. గతం నుంచి ఇప్పటివరకు మెమరీ లో విషయాలు మోస్తూ , కొత్త కణాలకు అందించే ఒక ఇంటలిజెన్స్ మనలో ఉంది.

మీ మనసులో వయసు ఏమంటోంది?:

అవును. ఇంతకీ మీ మనసులో వయసు మీతో ఎప్పుడూ ఏమి చెప్తుంది? మీ వయసు ఎంత అని చెప్తుంది? “అది  ఏంటి అలా అంటారు నేను పుట్టింది ఏం సంవత్సరమో నాకు తెలుసు, అప్పటి నుంచి ఈ 2016 ఫిబ్రవరి నాటికి ఇన్ని సంవత్సరాలు”  ఇది వాస్తవం అంటారా? అవును అది వాస్తవమే. అలా ప్రతి రోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం మీతో మీరు నాకు ఇన్ని సంవత్సరాలు, నా వయస్సు ఇది అని చెప్తున్నారు కాబట్టి. మీ మైండ్ తో మీ బాడీ కి ఒక సిగ్నల్ ఇస్తునారు, మీ వయసు గురించి, ఈ వయసులో చేయగల పనులు ఇవే అని, ఈ వయసులో చేయలేని పనులు ఇవి అనీ, ఈ వయసులో ఈ జాబు చేయోచ్చు అని, చెయ్యకూడదు అని ఇలా ఇంకా ఎన్నో. అందులో తప్పేముంది  అంటారా? అదే వాస్తవం అంటారా? డియర్ ఫ్రెండ్స్ మీరు ఏది రిపీట్ చేసి చెప్తారో అదే నిజమని నమ్ముతారు, వయస్సు , జీవితం, చేయగలిగే పనులు...మరి ఏదైనా.
          ఒక పెద్దాయన నల్గొండ జిల్లా నుంచి కొడుకుని చూడడానికి హైదరాబాద్ వచ్చాడు. కొడుకు అమీర్ పేట్ లో ఆఫీస్ కి వెళుతూ నేను వెళ్లి వస్తాను, మనం రేపు ఆర్ట్  ఎగ్జిబిషన్ కి వెళదాం అన్నాడు. సాయంత్రం ఐదు గంటలకి ఇంటికి వచ్చే సమయానికి “నేను పేపర్ చదువుతుంటే జూబిలీ హిల్స్ లో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉందని తెలిసింది, అడ్రస్ కనుక్కొని వెళ్లి వచ్చా”  అన్నాడు తండ్రి. ఆశ్చర్య పోవటం కొడుకు వంతైంది. ఎందుకంటే తనతో ద్విచక్ర వాహనం మీద ఆయన్ని కాలుష్యంలో తిప్పటం కంటే మరునాడు కార్ లో కావలసిన ప్రదేశాలకు తీసుకు వెళ్ళాలని, రద్దీ బస్ లో వెళ్ళటం తండ్రికి ఇబ్బంది అని కొడుకు ఉద్దేశ్యం. కానీ తనకు నచ్చిన సబ్జెక్టు తను తెలుసుకోవాలని అడ్రస్ తెలుసుకొని కలిసి వచ్చాడు ఆయన. చిత్రమేమిటంటే అమీర్ పేట్ దూరం అని కొడుకు అనుకున్నాడు, సిటీ తెలియకపోయినా దానిని  దాటి జూబిలీ హిల్స్ వెలి వచ్చాడు పెద్దాయన. ఈ ముచ్చట్లలో కొడుకి స్నేహితుడు వచ్చాడు. అతనికి తను రీసెంట్ గా వేసిన పెన్సిల్ ఆర్ట్ అంటూ చూపించాడు పెద్దాయన. “ఈ వయసులో మీరు బొమ్మలు వేశారంటే రిటైర్మెంట్ వయసులో మీరు ఆర్టిస్ట్ అయ్యారు సార్ అన్నాడు 43 ఏళ్ళ కొడుకి స్నేహితుడు. “నా వయసు ఎంత అనుకుంటున్నారు చెప్పండి” అన్నాడు పెద్దాయన. “64 ఏళ్ళు” బదులిచ్చాడతను. “ కాదు నాకు ముప్పై ఏళ్లే, మీరు అంతా నాకు అరవై అని అనుకుంటున్నారు , నాతో నేను మనసులో, బయటా ఉత్సాహంగా, హాయిగా ముప్పై వాళ్ళ లాగానే ఉంటాను అలాగే అనుకుంటాను, అంతే, వయస్సు శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది.” అన్నాడు పెద్దాయన. మరుసటి రోజు ఐదు గంటలు కష్టపడి వాటర్ కలర్ తో లైఫ్ మొదటిసారి ఒక బొమ్మ గీసి చూపించాడు పెద్దాయన. పక్క చిత్రంలో గమనించగలరు. ఆ పెద్దాయన నా తండ్రి, ఆయన వయసుకి తెలియని ప్రదేశాలలో తిరగటం ఇబ్బంది అని నమ్మకాన్ని మార్హ్సుకుంది నేనే. ఇప్పటికీ హైదరాబాద్ వస్తే నాన్న తను చూడాలనుకున ప్రదేశాలకు హాయిగా బస్ లోనే వెళ్లి వస్తున్నారు.ఆయన వయసు 64 (మన కాలమానం ప్రకారం), ఆయన మనస్సు ఆయనతో మాట్లాడే లెక్కల ప్రకారం నాకంటే నాన్న ఐదేళ్ళు చిన్న.           

వయసుతో సంబంధం లేకుండా సాధించండి: వయసుతో సంబంధం లేకుండా మీరు బాగా ప్రేమించే పనిని చేయండి. మీ వృత్తిలో ఇతరులకు శిక్షణ ఇవ్వడం ద్వారా మరింతమందికి సహాయం చేయండి , మీరు బాగా ప్రేమించే పని, హాబీస్, చూడాలనుకున్న ప్రదేశాలు, కలవాలనుకున్న వ్యక్తులు ప్రయత్నం చేయండి. జీవితం అనేది ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది , మనం చుసేదానిని బట్టి మారుతుంది. బయటి ప్రపంచం ఎలా ఉంటుందంటే అంతర్ ప్రపంచం ఎంత ఉన్నతంగా ఉంది అన్నదానిపై ఆధార పడి ఉంటుంది. కొంత మంది కుర్ర వాళ్ళు పుట్టుకతో వృద్ధులు అన్నారు మహాకవి శ్రీ శ్రీ . అలాగే కొందరు పెద్దవాళ్ళు ఇప్పటికే యువకులే. వారిలో ఉత్సాహం, ఆలోచనా విధానం ఇతరులను ఇన్ స్పైర్ చేయగలదు. ఉదాహరణకి చూడండి.

§ 55 ఏళ్ళ కి పాబ్లో పికాసో తన మాస్టర్ పీస్ గ చెప్పుకునే గేర్నికా బొమ్మ వేశాడు
§ 58 ఏళ్ళ వయసులో సోనీ కంపెనీ చైర్మన్ అకియో మొరిటా అప్పట్లో ఎవ్వరు ఊహించని సోనీ వాక్ మాన్ తయారీ చేసాడు
§ 60 ఏళ్ళ కు జార్జ్ బెర్నార్డ్ షా “హార్ట్ బ్రేక్ హౌస్”  అనే మాస్టర్ పీస్ రాసారు
§ 62 ఏళ్ళకు  JRR టోకీన్స్ లార్డ్ అఫ్ ది రింగ్స్ అనే ఫాంటసీ సిరీస్ లో మొదటి పుస్తకం పబ్లిష్ చేసాడు
§ 70 ఏళ్ళ సంవత్సరాలు వయసుగల భార్య రూబీ చనిపోతే ఆ బాధని 3 సంవత్సరాలు భరించి తన 96 సంత్సరాల వయసులో హరీ బెర్న్ స్టీన్ “ది ఇన్విజుబుల్ వాల్” అనే తన మొదరి పుస్తకం రాసాడు.
§ 99 సంవత్సరాల టీచి ఇరగాషి  మౌంట్ ఫుజి అధిరోహించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసారు. 

వీళ్ళంతా వయస్సు తో వచ్చిన అనుభవాన్ని తమని విజేతలుగా నిలబెట్టేలా ఉపయోగించుకునారు అద్భుతాలు చేసారు. ఎదో సినిమాలో చెప్పిన మాటలలో చెప్పాలంటే “ఎప్పుడు వచ్చామన్నది కాదు విజేతగా నిలిచామా లేదా అన్నది ప్రశ్న”. ప్రయత్నానికి ఎప్పుడూ ఓటమి లేదు. అందుకే వయసుతో సంబంధం లేదు ప్రయత్నించండి.

***  ***  ***  సైకాలజీ టుడే, ఫిబ్రవరి 2016 లో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  ***  

Sunday, 10 January 2016

2016 మీ జీవితంలో ఒక అద్భుతమైన సంవత్సరం కావాలంటే ఏమి చేయాలి?



2016 లో మీ లక్ష్యాలు సాధించడానికి 3 సూపర్ ప్రాక్టికల్ టెక్నిక్స్

జననం ఒక హిస్టరీ, మరణం మిస్టరీ. ఈ రెండింటి మధ్య మనిషి ఏమి చేస్తాడనేది ఒక ఛాయస్. జననానికి మరణానికి మధ్య ఖాళీని నింపే జీవితాన్ని ఓ అద్భుతంలా నచ్చినట్లు తీర్చిదిద్దుకునే ఛాయస్,  లైఫ్ ఎనర్జీ ని ఉన్నతంగా ఉపయోగించుకునే అవకాశం ఎప్పుడూ మీచేతిలోనే ఉంటుంది.   అందుకు మీ జీవిత ధ్యేయం మీకు తెలియాలి. జపాన్ భాషలో పర్పస్ (ధ్యేయం) ని “ఇకిగాయి” అంటారు. దీని అర్థం ఏమిటంటే “ దేనికోసం నేను నిద్ర లేస్తాను అంటే “ అని అర్థం. మీ జీవిత ధ్యేయం కోసం నిద్రలేవటం అనేది ఒక గొప్ప అనుభూతి. అప్పుడు ప్రతిరోజు ఒక అత్యంత శక్తివంతంగా, అర్థవంతంగా జీవితం ఒక అందమైన కనుభావంలా , దృశ్య కావ్యంలా, అద్భుత ప్రయాణంలా ఉంటుంది. ప్రతి క్షణం అద్భుతమే. ఈ భూమి మీద మనం ఎందుకున్నమన్నది నిజమైన అర్థాన్ని తెలుసుకుని ఆ దిశలో ప్రత్యేకతతో, భిన్నంగా అడుగులు వేయడమే జీవిత ధ్యేయంతో (లైఫ్ పర్పస్)  జీవించడం. మనం ఈ భూమి మీద ఉన్నామంటే ఎదో గొప్ప అర్థం ఉంది అని అర్థం. ఇది మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన సమయం -  నా జీవిత శక్తిని ఉపయోగించుకుని నేను మాత్రమే చేయగల అద్భుతమైన పనులు ఏమిటి? నేను ఏ ఉనత కార్యాన్ని నిర్వర్తించడానికి భూమి మీదకు వచ్చాను?. ఒక సారి జీవిత ధ్యేయం స్పష్టంగా ఉంటే మీ జీవితంలో సంవత్సరాలు, నెలలు రోజులు ఆదిశలో ఆలోచనాత్మకంగా, నిర్మాణాత్మకంగా మలుచుకోవచ్చు.
మరి 2016 లో మీరు ఏమి సాధించాలనుకుంటున్నారు? మీ నూతన సంవత్సర లక్ష్యాలు ఏమిటి? రాబోయే 12 నెలలలో మీరు ఏ ఫలితాలు సాధించాలనుకుంటున్నారు? మీ లక్ష్యాలు ఎవైన సరే మీ రాబోయే 365 రోజులలో ఆ తర్వాత కూడా మీ లక్ష్యాలను ప్రభావితం చేసే అంశాలు ఏమిటి? వాటిని అర్థం చేసుకుని ఆశించిన ఫలితాలు సాధించి విజేతలుగా నిలవాలంటే చేసుకోవలిసిన మూడు సూపర్ పవర్ ప్రాక్టికల్ టెక్నిక్స్ ఏంటో చర్చిదాం రండి. ఫ్రెండ్స్...గుర్తుంచుకోండి మీ శారీరక ఎక్సర్ సైజ్ కోసం వేరే మనిషిని అద్దెకు తీసుకోలేరు, మీ స్నానాన్ని వేరే వాళ్ళు చేయలేరు, అలాగే మీ లైఫ్ గోల్స్ కోసం ఇతరులు పనిచేయలేరు. అందుకే ఇది ఒక ఆర్టికల్ కేవలం చదవడమే కాకుండా అర్థం చేసుకోండి, పాటించండి. ఆటంకాలను అధిగామించండి. ఏవైనా అనుమానాలు ఉంటే సంప్రదించండి. మీరు గతంలో నా ఆర్టికల్స్ ద్వారా, ఇతర పుస్తకాల ద్వారా అనేకం నేర్చుకుని ఉండవచ్చు, కానీ కొన్ని టెక్నిక్స్ మరలా చెప్పడానికి కారణం వాటి ప్రాముఖ్యత మీ లక్ష్యాలపై అంతగా ఉంటుందని మీకు స్పష్టతే ఇవ్వడం నా బాధ్యత.    

1.   మీరు అంతర్గతంగా చేసే అంశాలు మార్చుకోండి:

a.   90 చెత్తని వదిలించుకునే ఛాలెంజ్:  మీ ఎదుగుదలకు ఆటంకంగా వచ్చే చెత్త నా దృష్టిలో రెండు రకాలు. ఒకటి  మీకు ఉన్నదానికి ఆనందంగా, కృతజ్ఞతా భావంతో సంతోషంగా ఉండకుండా లేనిది ఊహించుకుని “లేమితో” ఏడవటం. రెండోది మీ జీవితంలో ఫలితాలకు కారణం ఫలానా అంటూ వ్యక్తులను, పరిస్థితులను, సమాజాన్ని నిందించటం. కంప్లైంట్ రోగం. ఈ రెండు రకాల చెత్త ఎంత వేగంగా తొలగిస్తే శరీరము , మనసు అంత హ్యాపీగా ఉంటాయి. ఉన్నదానికి కృతజ్ఞత (గ్రాటిట్యూడ్) లేకపోవడమనేది అత్యంత భయానక పేదరికం.  జీవితంలో ఏది జరిగినా 100% బాధ్యత తీసుకోండి, అది మీరు ముందుకు వెళ్ళడానికి దోహదం చేస్తుంది. నెపం వేస్తే తప్పించుకోవడంలో హీరో అవుతారు, జీవితం చివరికి వచ్చేనాటికి జీరో అవుతారు.  కొందరు తప్పు చేసిన వాడికి పాతం నేర్పుతాంటూ ఆక్రోశానికి పోతారు, ఆ సమయం ఎదో మీ జీవితాన్ని నిర్మించుకోడానికి వాడుకోండి. మీరు వంకలు పెట్టటం/ నెపం వేయటం అవి ఇంకా పెరుగుతాయి, నెగటివ్ గా ఆలోచిస్తే ఆ నెగటివ్ అంశాలు ఇంకా శక్తివంతం అవుతాయి. మీరు సమస్యలే ఎక్కువ మాట్లాడితే అవి శక్తివంతం అవుతాయి. ఏంటి అర్థం కాలేదా అయితే చిన్న ఎక్సర్ సైజ్ చేయండి. ఇప్పుడు మీరు ఉన్న రూమ్ లో లేదా స్థలంలో కళ్ళు తెరిచి అన్నింటిని పరిశీలనగా చూస్తూ గుండ్రంగా తిరగండి కాని ఎరుపు రంగు చూడొద్దు.  ఇలా మూడు రౌండ్స్ వేయండి ఎరుపు రంగు చూడొద్దు. ఏంటి ....చూడలేదుగా...చూసారా? అది మీ మైండ్ ఏది ప్రత్యేకంగా అనిపిస్తే దానిని ఫోకస్ చేస్తుంది. చూడొద్దు అని ప్రత్యేకంగా చెప్తే చూస్తుంది కదూ! అందుకే మీ 2016 లక్ష్యాలు సాధించాలంటే ఈ 90 రోజుల చెత్త వదిలించుకునే చేయండి. 90 రోజులు ఇతరులు, పరిస్థితులు, ఫలితాలు వేటిని నిందించకండి, కారణాలుగా చూపకండి, నెగటివ్ గా మాట్లాడకండి, మీ ఆశీర్వాదాలు లెక్కపెట్టుకోండి , ఆటంకాలు కాదు. మీకు ఉన్న దానితో కృతజ్ఞతతో ఉండండి, ప్రేమ, ఇవ్వటం లోని శక్తిని అనుభవించండి. ఎవరిదగ్గరికైన వెళితే ఏదన్న ఇవ్వండి, ఎవరైనా సరే, చిన్న పువ్వు, చాక్లెట్, నోట్ బుక్, పెన్, ఫ్రూట్, చేతితో చేసిన గ్రీటింగ్ ఏదైనా ఇవ్వండి, డబ్బులు లేవు అనుకోకండి స్వచ్చమైన నవ్వు నేను ఎంత పెట్టినా కొనలేనని తెలుసుకున్నాను అందుకే ప్రేమతో నవ్వుని పంచండి కనీసం. 

b.    మీ ఆలోచన- ప్రవర్తన విధానాలు లక్ష్యాలపై నిబద్దతతో ఉండాలి: మనం ఎప్పుడూ అదే ప్లేస్ లో ఉంటాము, అదే మనుషులతో మాట్లడుతాము, ఒంటరిగా ఉన్నా అవే ఆలోచనలు బొంగరంలా  తిప్పి తిప్పి ఎంత ఆలోచించినా మార్పు రావట్లేదు అనుకుంటూ ఉంటాము. అలా ఒకే ఆలోచన , దానికి తగ్గ పనులు ప్రవర్తనలు ఒక ప్రోగ్రాం లాగ మనలో ఉండిపోతే. వాటిని నేను థాట్ – యాక్షన్ ట్రాప్ (ఆలోచన – ప్రవర్తన ఉచ్చులు) అంటాను. అంతేగా మరి అనుకున్నది కాకుండా ఒక విదానాలైన (మీకు అలవాటు పడిన / మీ ఇగో ని, ఫీలింగ్స్ ని భ్రమలో త్రుప్తిపరిచిన) పద్దతులలో ఆలోచనలు దానికి తగ్గ ప్రవర్తనలు ఈ కొత్త సంవత్సరం లో కూడా ఉంటే గోడమీద క్యాలెండర్ మారుతుంది కాని జీవితం మారదు. కాబట్టి మీ లక్ష్యాల దిశలో మీ అంతర్గత ఆలోచనలు, ప్రవర్తనలు ఉండేలా చూసుకోండి.

c.    మీ భావోద్వేగాలు దేనికి లింక్ పెట్టారు?: మీ శరీరము, మనసు, మీ ఆలోచనలు, మీ జీవితం, ఈ సృష్టి వీటితో మీరు ఆహ్లాదంగా, హాయిగా ఫీల్ అవుతారా? తాదాత్మ్యం, ఆనందం, ఉత్సాహం, హుషారు, సంతోషం, సంతృప్తికరం, అంతర్లీనం, గౌరవం, సుఖం ....ఇవి ఫీల్ అవ్వకపోతే వేరే ఏమి ఫీల్ అవుతారు?. చాలా మంది అది చేసాక నేను సంతోషంగా ఉంటా, ఇది సాధిస్తే నేను ప్రశాంతంగా ఉంటా, ఫలానా ఉంటేనే నాకు ఉత్సాహంగా ఉంటది అని చెప్తుంటారు. కాని మీ ఫీలింగ్స్ కి , మీ పరిస్థితికి అనవసరమైన నెగటివ్ లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. అలా లింక్ పెడితే లైఫ్ లో సంవత్సరాలు గడుస్తాయి కాని జీవితం రసమయం కాదు, ప్రేమమయం అనిపించదు. జీవితానికి సంవత్సరాలు చేర్చుకుంటూ వెళ్ళకండి, సంవత్సరాలకి జీవితాన్ని ప్రాణాన్ని మీరే ఇవ్వండి.

d.   మీ శక్తిని కేంద్రీకరించే నిబద్దత: మనం ఈ భూమి మీద కొంతకాలం ఉంటాం. ఈ సమయంలో కొన్ని ముఖ్యమైన పనులు చేస్తాం, కొన్ని అవసరంలేని పనులు చేస్తాము. ఈ ముఖ్యపనులు మనకి అర్థాన్ని , సంతోషాన్ని ఇస్తాయి, అనవసర పనులు కేవలం సమయాన్ని చంపేస్తాయి. సమయం అంటే మన జీవిత కాలం అంటే జీవితాన్నే స్లో –పాయిజన్ లా చంపేస్తాయి. అందుకే మీ జీవిత శక్తిని కేవలం ఇంపార్టెంట్ పనులకు కేటాయించేలా క్రమశిక్షణ అలవరుచుకోండి.

  1. మీరు బహిర్గతంగా చేసే అంశాలు మార్చుకోండి:

  1. ఉత్పాదకత (ప్రోడక్టివిటీ) ఇచ్చే ప్రదేశంలో ఉండండి: మీ చుట్టూ ఉండే మనుషులు, మీరు ఎప్పుడు గడిపే వాతావరణం, మీరు చదివే పుస్తకాలు, ఆడియోలు/వీడియో లు మీ పై ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి ఒక్కసారి మీ నూతన సంవత్సర కష్యాలకు ఇప్పుడు మీరు ఉన్న వాతావరణం, అందులో మనుషులకు, ఆ వ్యక్తులతో మీ చర్చలకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా ఆలోచించండి. కొన్ని పాత జీడిపాకంలా, జిగురునాధంలా అంటుకుంటాయి కాని ఎదగాలంటే ముందు వలలో పడ్డ పావురంలా ఉచ్చులలోంచి బయటపడాలి అప్పుడే ఎగిరే అవకాశం వస్తుంది.మీ ఉత్పాదకత (ప్రోడక్టివిటీ) ని పెంచే మనుషులతో గడపండి, చర్చించండి. కొంత మంది ఉన్నత స్నేహితులు ఉన్నా చాలు, రేలషన్శిప్ అంటే అందరితో టచ్ లో అన్ని రోజులు ఉండటం అనే భ్రమలో ఉండకండి. మీ జీవన ప్రాదాన్యాలకు తగ్గ వారితో విన్-విన్ రిలేషన్స్ ఉంటే చాలు. అందుకే busyness కాదు కావలసింది business అని చెప్తుంటాను నా ట్రైనింగ్ లలో. కొత్త విషయాలు నేర్చుకునేందుకు సమయం, శక్తి కేటాయించండి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఏ వ్యక్తి అయినా నేర్చుకోవడానికి ఉత్సాహం ఉన్న వాళ్ళే. బుక్స్ చదవండి, ఆడియో/వీడియో ల ద్వారా, ఆన్ లైన్ కోర్స్ ల ద్వారా నేర్చుకోండి. ఈ ఒక్క అలవాటు మీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దగలదు.    
      
      

b.      నిబద్దతను గుర్తుచేసే అకౌంటబిలిటీ పార్టనర్: మీ లక్ష్యాల దిశలో నిబద్దతను మొహమాటం లేకుండా గుర్తుచేస్తూ, మీ ఎదుగుదలకు కావలసిన సపోర్ట్ ఇస్తూ, సమయాన్ని కేటాయించగలిగే  అకౌంటబిలిటీ పార్టనర్ చాలా బాగా నడిపించగలరు. మీరు ఒక పుస్తకం రాయాలనుకున్నారు, ఇంటివద్ద ఉండి నడిపించగల బిజినెస్ మొదలెట్టాలనుకున్న్నరు, డబ్బు కోసం కొత్త టెక్నాలజీస్ నేర్చుకుని పార్ట్ టైం జాబు చేయాలనుకున్నారు. ఆ విషయం మీ ఇంట్లో వారు లేదా బయట ఫ్రెండ్స్, లేదా మీ మెంటార్ / కోచ్ కి చెప్పండి. వారు మీ లక్ష్యాల దిశలో వెళ్తున్నారా అనే అంశాన్ని మీకు వారానికి ఒకసారి లేదా నెలకు మూడుసార్లు ఫోన్ లేదా డైరెక్ట్ గా కలిసినపుడు రివ్యూ చేస్తారు, మాట్లాడతారు. మీ గోల్ లాంటి గోల్ ఉన్న మరో పార్టనర్ ఉంటె ఇంకా మంచిది. ఇద్దరు రివ్యూ చేసుకునేప్పుడు బెస్ట్ ప్రాక్టీసు లు ఇరువురు నేర్చుకోవచ్చు.

3.   ఫలితాల దిశలో విధానాలు (స్ట్రాటజీ) మార్చుకోండి :

a.   లక్ష్యాలు రాయండి : గోల్స్ కేవలం అనుకోవటం కాకుండా రాస్తే మీ తల రాతనే మార్చుకున్న వారౌతారు అంటారు. అందుకే మీ డైరీ, నోట్ బుక్, జర్నల్ లో గోల్స్ రాయండి. పాజిటివ్ పదాలలో, మీకు కావలసింది ఎప్పటికి , ఏ రూపంలో, ఏ విధంగా కావాలో స్పష్టంగా రాయండి. ఎప్పుడు కంటికి కనిపించేలా లక్ష్యాల పోస్టర్ రాసుకోవచ్చు, లేదా విజన్ బోర్డు చేసుకోవచ్చు. ప్రతి రోజు మీ గోల్స్ ఒక సరి చదవండి, విజువలైజ్ చేసుకోండి, అవి సాధిస్తే ఎలా అ ఫీల్ అవుతారో అలా ఫీల్ అవండి. మీ బుక్ లో ఆ గోల్స్ ఎందుకు సాధించాలో కుడా స్పష్టంగా రాయండి. కారణాలు ముందు వస్తాయి ఆ తర్వాతే మనిషి కారణాలకోసం పనిచేస్తాడు. ఈ లక్ష్యాలను మూడునెలలకి ఒక ముఖ్యమైన మైల్ స్టోన్ గా నిర్మించుకుంటే ఎక్కువ ఫలితాలు ఉంటాయి. అలాగే ప్రతి నెల ఏమి చేయాలో నిర్ణయించుకుని  నెలకి ఒక సారి గత నెలలో ఏమి చేద్దామనుకున్నాము, ఏమి సాధించాము, ఏమి నేర్చుకోవాలి, ఎలా ముందుకెళ్లాలి అని రివ్యూ చేసుకోవాలి.  
b.    ఒక రోజుని ముందు రాత్రి ప్లాన్ చేసుకోండి: మీ లక్ష్యాల దిశలో రేపు చేయాల్సిన పనులు లిస్టు ఈ రాత్రి పడుకునే ముందే రాసుకోండి. అందులో ముఖ్యమైన అంశాలు ముందు ప్రాధాన్యం ఇవ్వాలి, 100% ఆ పని అయ్యే వరకు దృష్టి పెట్టండి. చూడడానికి ఇదేదో “జ్వరం” అంటే “పారాసిటమాల్” అని చెప్పినట్లు సింపుల్ గా ఉంది కానీ ప్రాక్టీసు చేస్తే ఇదే జీవితాన్ని ఫోకస్ తో నడిపే మంచి అలవాటు అని ఖచ్చితంగా గుర్తిస్తారు. 60 రోజులు ప్రాక్టీసు చేయండి లైఫ్ లో భాగామైపోతుంది. 
c.       ప్రతి ఉదయం ఒక పని పూర్తి చేయండి: ప్రతి ఉదయం నిద్ర లేవగానే ఒక పని మొదలుపెట్టి పూర్తి చేయండి. అల చేయడం వలన మీ రోజులో ఉన్న ఇతర ముఖ్య అంశాలు కూడా పూర్తి అయ్యేలా ప్రోత్సాహంగా ముందుకు వెళ్ళాలనే తపన మీలో వస్తుంది. మీరోజులో  ముఖ్యమైన పని మొదలుచేయండి , పూర్తిచేయండి, వేరే ఏ పని చేయకముందు ఈ పని చేయండి. ఇలా చేయటం ఒక అలవాటుగా మార్చుకోండి.
d.      మీ 12 నెలల లక్ష్యాలను చేర్చే నైపుణ్యాలు నేర్చుకోండి: కెరీర్ నిచ్చెన ఎక్కేటప్పుడు అందరు ఒకే పాయింట్ వద్ద మొదలు పెడతారు కానీ 10 సంవత్సరాల తర్వాత కొందరు ఇతరుల కంటే 20 – 50 % ఉన్నత స్థాయిలో ఉంటారు, సంపాదిస్తారు. ఎందుకంటే విజేతలు కెరీర్ నిచ్చెన లో పైకి వెళ్ళే అవసరాలకు తగిన నైపుణ్యాలు నేర్చుకుంటారు, ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకెళతారు. ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంకులో చందాకొచ్చర్, మైక్రోసాఫ్ట్ లో సత్యా నాదెళ్ళ ఒకప్పుడు ఉద్యోగులే,  వారితో పాటు ఎందరో ఆ కంపనీలలో జాయిన్ అయ్యి ఉండొచ్చు, ఎవరు కంపెనీ అవసరాలకు, ఇండస్ట్రీ అవసరాలకు తగిన నైపుణ్యాన్ని చూపిస్తారో వారికి పెద్ద పీత వేస్తారు. దానితో పాటు హోదా, దాబ్బు అవే వస్తాయి. 2016 లో బాగా డబ్బు కావాలంటే , గొప్ప విలువను అందించండి మీ ప్రోడక్ట్ లేదా సర్వీస్ ద్వారా. ఆ స్కిల్స్స్ నేర్చుకోండి.
e.       చిన్న పనులు – పెద్ద విజయాలు: ఐదు చిన్న చిన్న పనులు రోజూ చేసుకుంటూ వెళితే సంవత్సరానికి 1825 విజయాలు మీ జీవితంలో భాగమైపోతాయి. రోజు ఒక్క పేపర్ పై చేతివ్రాత ప్రాక్టీసు చేస్తే 6 నెలలలో అద్భుతమైన మార్పులు వస్తాయి, రోజుకి 4 ఇంగ్లీష్ పదాలు నేర్చుకుంటే 12 నెలలో 1460 కొత్త పదాలు వస్తాయి. ఈ విషయాలలో 50% సక్సెస్ అయినా ఎంతో మంచి ప్రయత్నమే కదా. అందుకే చిన్న పనులు పెద్ద విజయాలకు నాంది అని గుర్తించి కృషి చేయండి. ఇందుకు నిబద్దత, పట్టుదల, క్రమశిక్షణ మేలోనే ఉన్నాయి.
మీకు, మీ కుటుంబ సభ్యులకు , స్నేహితులకు  నూతన సంవత్సర శుభాకాంక్షలు :) 

*********** సైకాలజీ టుడే, జనవరి 2016 లో ప్రచురించిన  నా ఆర్టికల్ **************