6 Steps to Safe guard Your Start Up from Failures
Imagine that failure is common in any human effort. but that's not the final result until you accept it. These are the common things you can be conscious about to avoid failure in starting up.
1. Find whether the product/ service you offer is really needed
2. Make sure you are with right team who can bring value to current need and future of the venture. Hire slow , fire fast or whatever the rule but make sure you use human resources effectively
3. Have a mentor who can bring your abilities to assets of the organisation
4. Remember that great idea is useless until you act upon. So idea to execution is important. Execution itself is oxygen.
5. Manage your cash flow so that you have a systematic revenue stream, reviews of expenses and take decisions based on that.
యువత తాను
చేయాలనుకున్న పనిని వేగంగా చేసే రోజులివి, టెక్నాలజీ ఇచ్చే సౌకర్యాలతో ఫింగర్
టిప్స్ మీదే బిజినెస్ ట్రిక్స్ నేర్చుకుంటున్నారు. మరి అలా అయితే ఎంట్రప్రెన్యూర్షిప్
మీద ప్రేమతో స్వతంత్రంగా స్టార్ట్ అప్ మొదలెట్టిన ప్రతి ఒక్కరు సక్సెస్ కావచ్చా?
అసలు స్టార్ట్ అప్స్ ఫెయిల్ అవుతున్నాయా? అయితే కారణాలేమిటి? తాము చేపట్టిన వెంచర్
ఫెయిల్ కాకుండా ఉండాలంటే ఎలాంటి మెట్లు ఎక్కాలి? ఈ అంశాలను చర్చించేదుకే మన ఈ ఆర్టికల్. మరెందుకు ఆలస్యం, రండి ఫెయిల్యూర్ ని ఎలా ఫెయిల్ చేయాలో నేర్చుకుందాం.
*** ***
*** *** ***
***
ఎంట్రప్రెన్యూర్,
సి.ఈ.ఓ., ఫౌండర్ , స్టార్ట్ –అప్ ...ఈ పదాలు ఈ మధ్య కాలంలో బాగా వినపడుతున్నాయి.
అయితే అంతే వేగంగా ప్రభుత్వాలు, ప్రైవేటు కంపెనీస్ అంకుర సంస్థలు (స్టార్ట్ –అప్స్)
ని అనేక సౌకర్యాలతో ప్రోత్సహించే దశలో ఉంది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్
ఎంట్ర ప్రెన్యూర్ సమ్మిట్ 2017 లో ప్రపంచదేశాల నుంచి దాదాపు 2000 మంది డెలిగేట్స్
వచ్చారు. రానున్న కాలంలో వారి సంస్థల కోసం , వాటి విజయం కోసం టెక్నాలజీ, డబ్బు,
పాలసీ ల మార్పులు, మెంటర్స్ అవసరాల గురించి చర్చించారు. అయితే ఇంత వేగంగా అనేక మంది అడుగుపెడుతున్నప్పుడు మరి
మన స్టార్ట్ అప్ సక్సెస్ కావాలంటే ఏమి చేయాలి అసలు స్టార్ట్-అప్ లు ఫెయిల్
అవుతాయా? ఎంట్ర ప్రెన్యూర్ లో యువత ఫెయిల్ ఎందుకు అవుతుంది?
అపజయానికి
అతీతం కాదు: ఎంట్ర ప్రెన్యూర్షిప్ అనగానే "ప్రపంచానికి మంచి
చేయాలనే ఉద్దేశ్యంతో ... కనీసం మీ ప్రాంత అవసరాలు తీర్చేలా సదుద్దేశ్యంతో
ఉన్నపుడు ఎప్పటికైనా సక్సెస్ అవుతాం" అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. చదువులో, ఉద్యోగంలో ఫెయిల్ అయినట్లే ఎంట్రప్రెన్యూర్స్ అంకుర సంస్థలను అపజయం
ఎదుర్కునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ప్రతి 10 స్టార్ట్ –అప్స్ లో 9 ఫెయిల్
అవుతాయి. చేదుగా ఉన్నా ఇది నిజం. ట్రక్సన్
సంస్థ రిపోర్ట్ ప్రకారం దాదాపు 200 అంకుర సంస్థలు 2016 లో మూతబడ్డాయి. జొమాటో,
స్విగ్గీ వంటి ఆహార పదార్థాలను , మంచి డిషెస్ ను ఇంటికే తీసుకువచ్చి ఇచ్చే ఫుడ్
స్టార్ట్ – అప్స్ మొదటిగా ఈ రంగంలో అడుగు పెట్టారు కాబట్టి నిలబడ్డారు, ప్రజలు
వారినే ఫాలో అవుతున్నారు కానీ ఆ తర్వాత అలాగే ఇంకొంచం తక్కువ ధరలతో వచ్చినా కానీ
సక్సెస్ కాలేదు. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి సంస్థల లోకంలోంచి బయటికి వచ్చి
చూస్తే ఊబర్ (Uber) వంటి
దిగ్గజాలు కూడా 600 కోట్లకు పైగా నష్టాలను చూస్తున్నాయని ఇటీవల పత్రికలలో చదివాము.
మనదేశంలో దాదాపు 17,000 టెక్నాలజీ ఆధారిత అంకుర సంస్థలు ఉంటే వాటిలో కేవలం 13 మాత్రమే 1 బిలియన్ విలువ కలిగిన యూనికార్న్ క్లబ్ లో ఉన్నాయి. ఈ 17 వేల
అంకుర సంస్థలలో 2022 కేవలం పదిశాతమే మిగులుతాయని ఒక అంచనా. తమ ప్రోడక్ట్, సేవల
ద్వారా ఈ ప్రపంచాన్నే మార్చేద్దాం అన్న ఆలోచనతో మొదలైన అంకుర సంస్థలు ఎందుకు ఇలా
కనుమరుగైపోతున్నాయి? అవి తెలుసుకోవాలంటే ఈ ఐదు సోపానాలు గమనించాలి. మీ స్టార్ట్
అప్ దృష్టిలో ఉంచుకుని ఒక్కొక్క మెట్టు అధిరోహించండి.
1.
అవసరం లేని
ప్రోడక్ట్: ఒక ఎంట్ర ప్రెన్యూర్ తాను అందిస్తున్న ప్రోడక్ట్ లేదా సర్వీస్ అవసరం ఎంత
స్థాయిలో ఉంది అర్థం చేసుకోవాలి. దానిపై పని మొదలు పెట్టే సమయంలోనే మార్కెట్
రీసెర్చ్ చేయాలి. లేదా వర్క్ మొదలయ్యాక నిజంగా ప్రజలు ఈ ప్రోడక్ట్ ని
తీసుకుంటున్నారా లేదా మనకు నచ్చింది కాబట్టి మాత్రమే చేస్తూ వెళ్తున్నామా అని
గమనించాలి. కస్టమర్ల ప్రయారిటీలో లేకపోయినా, మీ కస్టమర్స్ తిరిగి ఆ అవసరాలకు మీ
వద్దకు వచ్చేది లేదని అర్థమైనా నిజంగా దాని అవసరం ఎంతనేది ఆలోచించగలగాలి. ఒక
సర్వేలో 42% స్టార్ట్ అప్స్ ఫెయిల్యూర్ కి కారణం
మార్కెట్ లేని ప్రోడక్ట్ అని తెలిసింది. మీ ప్రోడక్ట్, సేవ ఎంచుకున్న
ఏరియాలో బాగా అవసరం ఉండాలి అనేది గుర్తుంచుకోండి ఎందుకంటే విలువనిచ్చే పనులు
చేస్తే మూల్యం చెల్లిస్తారు , వేల్యూ ఉంటేనే ప్రైస్ ఇస్తారు.
2.
విలువైన
బృందం: గత నెలల్లో చర్చించినట్లు ఎంట్ర ప్రెన్యూర్ గా ఎదిగే క్రమంలో బృందం చాలా
కీలకం. బృందంలో ఆ ప్రోడక్ట్ , సర్వీస్ లను అద్భుతంగా అవసరమైన వారికి సరైన సమయంలో
చేర్చే నేర్పు, నిరంతరం నూతనత్వం అందించగల సృజనాత్మకత, మీరు మాత్రమే చేయగల అంశాలు
- మీ యునిక్ సెల్లింగ్ ప్రిపోజిషన్ (USP)
ని కమ్యూనికేట్ చేయగలిగే టాలెంట్ ఉన్న వారు ఉండాలి. అంకుర సంస్థలో ఏ సమయంలో ఎవరిని
ఎలా వాడుకోవాలో తెలియకపోతే మానవ వనరులు సరిగా ఉపయోగపడవు. ఈ దశలో జోడి సరిగా లేని
బృందం ఎదుగుదల ని చాలా ప్రభావితం చేస్తుంది. ఎంట్ర ప్రెన్యూర్షిప్ లో విజయాలు
సాధించే బృందం సభ్యులందరి నైపుణ్యాలను వినియోగించుకుంటుంది, మార్కెట్ అవసరాలకు
తగినట్లు మార్పులు చేయడానికి సిద్దంగా ఉంటుంది, అనుభవం లేకపోయినా కొత్త విధానాలలో
వినియోగదారులను చేరేందుకు ప్రయత్నిస్తుంది, కొత్త బ్రాండింగ్ తో ముందుకు
వెళుతుంది, అనూహ్యంగా ఎదురయ్యే సవాళ్ళ సమయంలో తోటి వ్యక్తులతో సమతుల్యంగా మాట్లాడే
సంస్కృతిని ప్రోత్సహిస్తుంది, గతంలోని అపజయాలకు కుంగి పోకుండా భవిష్యత్తు విజయం పై
దృష్టి పెడుతుంది.
3.
మెంటార్
ఆవశ్యకత: ఒక అంకుర సంస్థ కు మెంటార్ ఉండడం చాలా
మంచిది లేదంటే ప్రతి చిన్న పనికి తప్పొప్పులు మీద పట్టులేకుండానే పని చేయాల్సి
వస్తుంది. మెంటార్స్ తమ అనుభవంతో ఐడియా
ఎలా ముందుకు తీసుకెళ్ళవచ్చో చెప్పగలరు, ప్రాక్టికల్ సవాళ్ళను ఊహించి ముందుగా మిమ్మల్ని
ఎలర్ట్ చేయగలరు, మీరు గమనించని అవకాశాలు, వనరులను పక్షి దృష్టితో (బర్డ్స్ ఐ వ్యూ
) అర్థం చేసుకుని మీరు ఆ అవకాశాలను ఉపయోగించుకునేలా సపోర్ట్ చేస్తారు. టెక్నికల్,
జనరల్, బిజినెస్ ప్రాసెస్, ఫండ్ రైజింగ్ లో మెంటార్ సపోర్ట్ ఉన్నవారికి
విజయావకాశాలు ఎక్కువ.
4.
ఆలోచనకు –
ఆచరణకు దూరం : ఒక గొప్ప ఐడియా అంకుర సంస్థ రూపు
దిద్దుకోవాలంటే పేరు, రిజిస్ట్రేషన్, లోగో డిజైన్, కాప్షన్ లైన్ అనుకుంటే దానికంటే
అమాయకత్వం ఇంకోటి ఉండదు. ఆ ఐడియాని అమలుచేయాల్సిన విధానాలపై మొదట్లో మీకు ఒక
క్లారిటీ ఉంటుంది. అది చూసింది, లేదా ఇతరులు చేసింది, లేదా మరో బిజినెస్ మోడల్
నుంచి వచ్చిందో అయి ఉండొచ్చు. లేదా నూతన ఆవిష్కరణ అయుండొచ్చు. కానీ దానిని మీరు
అమలు చేస్తూ ఉన్నప్పుడు ఇంకా చెప్పాలంటే లక్ష్యాలు పెట్టుకుని నూరు శాతం
ప్రయతించినపుడు వాటి లో వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి. సో గ్రేట్ ఐడియా కంటే
గ్రేట్ యాక్షన్ ముఖ్యం. బరిలోకి దిగితేనే గెలుపు దిశలో అడుగులు పడినట్లు ఆటే
ఆడకుండా గెలుపు వీలుకాదు. అందుకే అంకురా సంస్థలు వారి ఆలోచనకు – ఆచరణకు మధ్య దూరం
అర్థం చేసుకుని సయోధ్య తో ముందుకు వెళ్ళాలి.
5.
కాష్ ఫ్లో:
ఒక అంకుర సంస్థ అందిస్తున్న వస్తువు, సేవలు ద్వారా డబ్బుని సృష్టించాలి. ఆ డబ్బు
అన్ని ఖర్చులనూ మొదటి నెలలోనే తీర్చనప్పటికీ కనీసం వీలైనంత త్వరగా ఆ డబ్బు ఆ పనికి
అయ్యే ఇన్ పుట్ కాస్ట్ కంటే ఎక్కువ ఉండాలి. అన్ని ఖర్చులూ పోను కొంత డబ్బు మిగిలి
బిజినెస్ విజయవంతంగా నడవాలంటే ఈ కాష్ ఫ్లో లో వివరాలు స్పష్టంగా తెలియాలి.
సంవత్సరం చివరికి ఇన్ని సేల్స్ అయితే కహ్శ్ర్చులు పోను ఇంత మిగులుతుంది అనే ఫైనల్
బాలన్స్ మాత్రమే తెలిసినా కాష్ ఫ్లో వచ్చినట్లు కాదు నీకు ప్రతి నెలా ట్రెండ్
తెలియాలి. ఐడియా తో లవ్ లో పడి స్టార్ట్ అప్ మొదలుపెట్టి నాకు డబ్బు గురించి ఏమి
తెలియదు అంటే జీవితంలో ఆర్ధిక సవాళ్ళకు రెడీ
ఉండాల్సుంటుంది. గుర్తుంచుకోండి మీరు విలువైన ప్రోడక్ట్ ఇవ్వాలి, అందుకు
తగిన డబ్బు తీసుకోవాలి. అదే ఎక్కువ కాలం నడపగల అంకుర వ్యాపారం.
ఈ ఐదు విషయాలు అర్థం చేసుకుంటే అంకుర సంస్థ నడిపే ఎంట్ర ప్రెన్యూర్స్ ఫెయిల్
అవకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. వీటితో పాటు నిరంతర స్వయం ప్రేరణ, అకుంటిత దీక్ష,
అవసరమైనంత సమయం నిర్మాణాత్మకంగా పనిచేయడం, కొత్తగా చేసిన పైలట్ ప్రాజెక్ట్
రెస్పాన్స్ దృష్టిలో పెట్టుకుని మార్పులు చేసుకోవటం, సరైన సమయంలో సరైన పనులు
చేయగలగటం, మార్కెట్ అంచనా, విచ్చిన్న సాంకేతికత (డిస్రప్టివ్ టెక్నాలజీ), మార్కెట్
లీడర్ బెంచ్ మార్కింగ్ ని ఎదుర్కోగలగటం, ఎంత అవసరమో అంతే ఫండ్ రైజ్ చేసుకోవటం వంటి
అంశాలు కూడా కీలకమైన అంశాలు.
ఈ వ్యాసం "ఫెయిల్
అవుతారు" అని భయపెట్టడానికి రాయలేదు; వాస్తవాలు ఎలా ఉంటాయో చెప్పడానికి రాసాను. కాబట్టి ఈ కీలక అంశాలను దృష్టిలో ఉంచుకుని అంకుర సంస్థ స్థాపించి మరింత ఫలవంతంగా మీ ప్రయత్నాలుచేసి ప్రధాని
చెప్పినట్లు స్టాండ్ అప్ - స్టార్ట్ అప్ – స్కేల్ అప్ అంటూ ముందుకు వెళ్ళండి. మీ ఆలోచనలే
ఆవిష్కరణలు కావాలని, మీరూ ఇండియా గ్రోత్ స్టొరీ లో భాగం కావాలని ఆకాక్షిస్తున్నాం.
*** *** *** సైకాలజీ టుడే, జనవరి 2018 తెలుగు పత్రికలో ప్రచురించబడిన ఆర్టికల్ *** *** ***
No comments:
Post a Comment