ఎంట్రప్రెన్యూర్షిప్
కి, బిజినెస్ కి మధ్య వ్యత్యాసం ఉందా? లేక రెండూ ఒకటేనా? ఈ రెండింటికి మధ్య పోలికలు ఉన్నాయా?
ఎంట్రప్రెన్యూర్స్ ఎవరు? బిజినెస్ పీపుల్ ఎవరు? వాళ్ళ ఆలోచనా రీతులు ఏమిటి? ఈ అంశాలను తెలియజేసే ప్రయత్నమే ఈ ప్రత్యేక వ్యాసం.
*** ***
*** *** ***
***
ఆక్స్ ఫర్డ్
డిక్షనరీ ప్రకారం ఒక వ్యక్తి బిజినెస్ మొదలుపెట్టి, రిస్క్ చేయటానికి సిద్దమై,
లాభాలకోసం పని చేస్తే అతన్ని ఎంట్రప్రెన్యూర్ (Entrepreneur) అంటారు. ఇది
ఫ్రెంచ్ నుంచి వచ్చిన పదం. నిజానికి
ఈ పదాన్ని ఆంట్రప్రెన్యూర్ అని
పలకాలి, కానీ మనకు మొదటినుంచి ఎంట్రప్రెన్యూర్ పలకడం అలవాటైపోయింది.
ఎంట్రప్రెన్యూర్స్
ఎవరు? బిజినెస్ పీపుల్ ఎవరు? ఎంట్రప్రెన్యూర్షిప్ కి, బిజినెస్ కి తేడా ఏమిటి?
మీకెప్పుడైనా ఈ అనుమానం వచ్చిందా? ఈ రెండు విధానాలలోనూ నిరుద్యోగులకి ఉద్యోగాలు
ఇస్తారు, వినియోగదారుల సమస్యలు తీరుస్తారు, జాతీయ ఆర్ధిక ఎదుగుదలలో సహకరిస్తారు. రెండుపదాలనూ
ఒకే అర్థం వచ్చేలా విరివిగా వాడుతుంటారు. కన్ఫ్యూజన్ నుంచి స్పష్టత
తెచ్చుకునే ప్రయత్నం చేస్తే మనం ఏ విధానాలలో ఆలోచిస్తున్నాము, మనకు అవసరమైన పద్ధతి
ఏమిటి అనే క్లారిటీ వస్తుంది. ఎంట్రప్రెన్యూర్షిప్ కి, బిజినెస్ కి మధ్య అనేక
పోలికలు ఉన్నాయి, అలాగే రెంటి మధ్య సన్నని గీత గీస్తూ కొన్ని భేదాలు ఉన్నాయి. వాటిని చర్చిద్దాం రండి.
ఉద్దేశ్యం లో భేదాలు :
ఎక్కువ మంది బిజినెస్ పర్సన్స్ (బిజినెస్ మాన్, బిజినెస్
ఉమన్ స్థానంలో వాడుకలోకి వచ్చిన పదం) తమ లాభాల కోసం, జీవనోపాధి కోసం, “తమకి తామే
బాస్” ఉద్దేశ్యంతో, ఆర్ధిక లక్ష్యాలు సాధించటం కోసం వ్యాపారం చేస్తారు. ఎంట్ర
ప్రెన్యూర్స్ ప్రపంచంలో ఒక మంచి మార్పు జరగాలి అనే దిశలో ఆలోచిస్తారు, అందుకోసం
తామేం చేయగలం అనే విధానంలో పనులు చేస్తారు. ఆర్ధిక అంశాలు, లాభాల కంటే మనుషులకు,
ప్రపంచానికి ఉపయోగపడే పని చేయాలనే తపన ఎక్కువ కనిపిస్తుంది.
ఐడియా విషయంలో: బిజినెస్ చేసేవారు ప్రోడక్ట్, సర్వీస్ ఐడియా తమ సొంతం
కాకపోయినా కావలసిన లాభాల కోసం వ్యాపారం మొదలు పెడతారు, ఫ్రాంచైజీ తీసుకుంటారు,
వనరులు సమకూర్చుకుని ఇతర విజయవంతమైన పద్దతులనూ పాటిస్తారు. ఎంట్ర ప్రెన్యూర్స్ తమ సొంత ఐడియాతో ఒక
ప్రోడక్ట్, సర్వీస్ సృష్టిస్తారు, దానిపై తమ సమయం, శక్తి, డబ్బు వెచ్చిస్తారు. తమ
సొంతం కాని ఐడియా నుంచి బిజినెస్ మొదలు పెట్టరు. అందుకే ఎంట్ర ప్రెన్యూర్స్ అంకుర
సంస్థ (స్టార్ట్ –అప్)లతో మొదలు పెడతారు.
రిస్క్ తీసుకునే
విధానంలో: బిజినెస్ చేసేవారు అన్ని లెక్కలతో పక్కాగా
రిస్క్ తీసుకుంటే వచ్చే లాభనష్టాలు బేరీజు వ్యాపారం చేస్తారు. డబ్బు కోల్పోవటం,
అప్పులలోకి వెళ్ళటం అనే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పనులు చేస్తారు. ఎంట్ర ప్రెన్యూర్స్ లెక్కల గురించి
ఆలోచించకుండా చేయాలనే పనిలోకి దూకేస్తారు, క్రేజీగా రిస్క్ తీసుకుంటారు. తమ సొంత
ఆలోచనను పరీక్షించుకుని, ప్రపంచానికి మంచి చేయాలనే ఉద్దేశ్యంతో తమ సమయం, శక్తి,
ఖర్చు గురించి ఆలోచన లేకుండా పని చేస్తారు.
ఎంప్లాయిస్ ను, వినియోగదారులను
చూసే విధానం: బిజినెస్ పర్సన్ తమ వద్ద పనిచేసే వారిని ఒక మేనేజర్ చూస్తారు.
వారు తన వ్యాపారం ఎదగడానికి ఉపయోగాపడాలని ఆశిస్తాడు. ఎంట్ర ప్రెన్యూర్ ఒక
స్నేహితునిలా, నాయకుడిలా పనివెనుక ఉద్దేశ్యం చెప్తూ ప్రోత్సాహిస్తారు. వారిని ఆ
మంచి కార్యంలోకి ఆహ్వానించి భాగస్వామ్యుల్ని చేస్తారు. బిజినెస్ చేసేవారు తమ కస్టమర్లను
వస్తువులు, సేవలను తీసుకుని సేల్స్, డబ్బు అందించే నిధిలా చూస్తారు. ఎంట్ర ప్రెన్యూర్స్ తమ వినియోగదారులను విధులు,
బాధ్యతలు నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన వారిగా చూస్తారు.
బిజినెస్ పర్సన్ , ఎంట్ర
ప్రెన్యూర్ కి తేడాను ఈ టేబుల్ లో స్పష్టంగా గమనించండి :
బిజినెస్ పర్సన్స్
|
ఎంట్ర ప్రెన్యూర్స్
|
v సాంప్రదాయ విధానం. నిర్ణయించిన మార్గంలో నడుస్తారు.
|
ü నూతన ఆవిష్కరణలు, వేగవంతమైన విధానాలు పాటిస్తూ వారే మార్గాన్ని నిర్ణయిస్తారు.
|
v ఆల్రెడీ ఉన్న ఐడియా నుంచి బిజినెస్ మొదలుపెట్టి, దాని
అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెడతారు
|
ü సొంత కొత్త ఐడియా నుంచి బిజినెస్ మొదలు పెడతారు,
ఆవిష్కరనలపై దృష్టి పెడతారు
|
v లెక్కలు వేసుకునే లక్షణం ఎక్కువ. అనేక మంది బిజినెస్
ప్రత్యర్థులు ఉండొచ్చు
|
ü సహజమైన ఇష్టంతో పనిచేస్తారు. తమకు తామే పోటీదారులు, తమను
మెరుగుపరుచుకునే పనులు చేస్తారు
|
v కాంపిటీషన్ మీద దృష్టి పెడతారు
|
ü కోఆపరేషన్ తో
కలిసి పని చేయాలనుకుంటారు
|
v వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి సమయం తక్కువ
|
ü వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి, పనికి సమయం కేటాయిస్తారు
|
v ఆలోచనలలో అబద్రతా భావం, భయం తో ఉండొచ్చు
|
ü కుతూహలం, స్వేచ్చ తో ఉంటారు
|
v లాభాల దిశలో ఆలోచిస్తారు
|
ü చేసే పనులు, మనుషులు ఎలాంటి ఉద్దేశ్యంతో చేస్తున్నాము అనే
విలువ గురించి ఆలోచిస్తారు
|
v మార్కెట్ ప్లేయర్ గా ఉంటారు. వ్యాపారం ఉత్పాదకత పెరగడానికి మానవ వనరులను
నియమించుకుంటారు
|
ü మార్కెట్ లీడర్ గా ఉంటారు. మనుషులను ఉత్పాదకంగా చేయడానికి నియమించుకుంటారు
|
ఈ వ్యత్యాసాలను గమనిస్తే ఎంట్ర
ప్రెన్యూర్ షిప్ అనేది అంత ఈజీ ఫీట్ ఏం కాదు అనేది స్పష్టంగా అర్థమౌతుంది. ఎంట్ర
ప్రెన్యూర్ కూడా ఒక బిజినెస్ పర్సనే అయితే ఎక్కువ ఇంపాక్ట్ ఉండే ఆలోచనలు, పర్సనల్ లైఫ్ బాలన్స్, పర్పస్ -విలువల తో నడిచే వారిగా గమనించవచ్చు. ఒక
సాధారణ బిజినెస్ పర్సన్స్ లా కాకుండా ప్రపంచం గురించి, సమాజం గురించి ఉన్నత
భావాలతో కార్యక్రమాలు, ప్రాజెక్ట్ లు చేసేవారే ఎంట్ర ప్రెన్యూర్స్ గా ఎదుగుతారు, ఎంచుకున్న రంగంలో లీడర్స్ గా మారతారు,
ప్రపంచం పై తమదైన ముద్ర వేస్తారు.
*** *** *** సైకాలజీ టుడే, డిసెంబర్ 2017 లో ప్రచురించబడిన ఆర్టికల్ *** *** ***
No comments:
Post a Comment