ఎంట్రప్రెన్యూర్షిప్
ప్రపంచంలో అడుగుపెట్టే చాలామంది సహజంగా ఓ చక్కని ఉదయం తెల్లవారగానే నిద్రలేచి అద్భుతం
జరిగినట్లుగా తన ఐడియాతో ఒంటరిగానే ప్రపంచాన్నే మార్చేద్దాం అనుకుంటారు. అయితే ఒక
సత్యం ఏమిటంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఏ ఒక్క గొప్ప వ్యాపారాన్ని ఒంటరిగా సాధించలేదు
వారి మార్గంలో వేర్వేరు వ్యక్తుల, సంస్థల ప్రయాణం ఖచ్చితంగా ఉంటుంది. మరి వ్యాపార
ఆలోచన వచ్చిన కొత్తలో పెద్దగా ప్రోత్సహించని మన సమాజంలో ఒంటరిగా వెళ్ళాలా? బృందంతో
భాగస్వామ్యం చేయాలా? ఈ అంశాలను శాస్త్రీయంగా చర్చించడానికే ఈ ప్రత్యేక వ్యాసం.
*** ***
*** *** ***
***
1. బృందంగా వెళితే డబుల్ సక్సెస్:
సినిమా డైరెక్టర్, అథ్లెట్,
పొలిటీషియన్ ....సక్సెస్ ఐన వారి ఇంటర్వ్యూస్ లో “మీ సక్సెస్ కి కారణం ఎవరు?” అనే
ప్రశ్నకు సమాధానం గమనించండి. వారందరి సమాధానాలలో స్పష్టంగా తెలిసే ఒక్క అంశం - కలిసి
పనిచేయడం. ఎంట్రప్రెన్యూర్షిప్ లోనూ అంతే. అవును. మీ ఎంట్రప్రెన్యూర్ ప్రయాణం
మీరే చేయండి, కానీ ఒంటరిగా కాదు అని అర్థం. ఎంట్రప్రెన్యూర్షిప్ అనగానే అదేదో
ఒంటరిగా చేసే వీరోచిత పోరాటం, సాహసం అనుకుంటారు. ఒక చిన్న ఐడియా తో ప్రపంచం ముందు
భిన్నమైన దారి ఎంచుకున్న గర్వంతో తలెత్తుకు తిరగాలన్న ఆలోచనతో ఉంటారు. కానీ రియల్
లైఫ్ లో సీన్ కొంచెం వేరు. ఎంట్ర ప్రెన్యూర్ లైఫ్ లో రిస్క్ తీసుకోడానికి రెడీ
అవ్వాలి, అందరికంటే భిన్న సవాళ్లు ఎదుర్కోవాలి కానీ ఒంటరిగా కాదు. ప్రయాణం మీదే,
కానీ ఒంటరిగా చేయరని గమనించాలి.
ఒక ఎంట్రప్రెన్యూర్ కి తాను
ఆధారపడగల, నమ్మకమైన, వాస్తవాన్ని, చేదునిజాన్ని స్పష్టంగా చెప్పగల నెట్ వర్క్
ఉండటం చాలా కీలకం. అది పెద్ద బృందం కాకపోవచ్చు మీకు బాగా నమ్మకంగా, రోజు వారీ
సంప్రదించగల కొద్ది మంది అయినా పరాలేదు. మీ శక్తి సామర్ధ్యాలను అర్థం చేసుకుని, మీ
బిజినెస్ పరిస్థితులు ఆలోచనా రీతులు దృష్టిలో ఉంచుకుని వాస్తవ రూపంలో మీ నిర్ణయాలు
ఉన్నతంగా తీసుకునేలా సహాయపడతారు.
యాపిల్, ఐ ఫోన్ సృష్టి కర్త
స్టీవ్ జాబ్స్ చెప్పినట్లు సృజనాత్మకత అనేది మీ బృందంతో అనుకోకుండా జరిగే
మీటింగ్స్ లోనూ, చిన్న సంభాషణలలోనూ రావొచ్చు. అందుకే ఎంట్ర ప్రెన్యూర్స్
కమ్యునిటీస్ ఉండే కాలిఫోర్నియా లోని సిలికాన్ వాలీలో, లండన్ లోని బాక్స్ పార్క్
ప్రాంతాలే కాకుండా మన హైదరాబాద్ (టీ హబ్), విశాఖపట్నం నగరాలలో కూడా ఇతర స్టార్ట్అప్
(అంకురసంస్థ)లతో, ఎంట్రప్రెన్యూర్స్ తో ఆలోచనలు పంచుకుంటున్నారు. హైదరాబాద్ లోని
కోలాబ్ హౌస్ (http://collab.house/),
టీ-హబ్ (https://www.t-hub.co/), హెడ్ స్టార్ట్ (http://headstart.in/) వంటి
సంస్థలు, ఎంట్ర ప్రెన్యూర్స్ కోసం అనేక చర్చలు, మీటింగ్స్ నిర్వహిస్తున్నాయి. నేను
పల్లెటూరి నుండి వచ్చాను, నాది తెలుగు మీడియం, నాకు ఐడియా ఉంది కానీ అందరిముందు
చెప్పను వంటి ఆలోచనల నుంచి బయటపడి ప్రశాంతంగా మీ ఆలోచనలు ఆసక్తి గల మనుషులతో
పంచుకోవచ్చు. ఏమో ...మీ స్టార్ట్- అప్ కి మంచి పార్టనర్ ఈ మీటింగ్స్ లో కూడా
దొరకొచ్చు.
2. నమ్మకమే కీలకం:
ఎంట్రప్రెన్యూర్ తన బృందాన్ని
తయారుచేసుకునే సమయంలో నమ్మకం కీలక పాత్ర వహిస్తుంది. మీ బలాలు, బలహీనతలు, వెంచర్
పై వాటి ప్రభావం, మీ కాబోయే బృంద సభ్యులకు ఉన్న అనుభవం, నైపుణ్యాలు వంటి అంశాలపై
అవగాహనతో వెంచర్ కి ప్రయోజనాత్మకంగా మలుచుకోవచ్చు? బిజినెస్ కి ఏ నైపుణ్యాలు,
ఎలాంటి నిర్వహణా రీతులు మంచిది అనే అంశాలు అర్థం చేసుకుంటూ చేదోడువాదోడుగా ఉండే
నమ్మకమైన బృంద సభ్యులను ఏర్పరుచుకోగాలగాలి.
స్టార్ట్-అప్ దశలో మీతో బాగా కలిసిపోయే బృందం (ఉదా: క్లాసు మేట్స్, ప్రాజెక్ట్
వర్క్ కొలీగ్స్) ఉంటే వారితో కలిసి ప్రయాణం చేయటమే మంచిది కొత్త బృందాన్ని తయారు
చేయడానికి సమయం పట్టొచ్చు. అందుకే మీ ఫోన్ లో కాంటాక్ట్ లిస్టు లో ఉన్న వారిని
కొత్త అర్థవంతమైన దిశలో ప్రయాణం చేయడానికి ఒక మాట అడిగిచూడండి.
3. బృంద సభ్యులు అనేక రకాలు
మీ బిజినెస్/ ప్రాజెక్ట్ లో సాధారణంగా మీకు మూడు రకాల బృంద సభ్యులు ఉంటారు.
- ఫౌండర్స్ / బిజినెస్ పార్టనర్స్: నమ్మకమైన , దీర్ఘ కాలం ఉండగల వ్యక్తులతో కలిసే ప్రయత్నం చేయాలి. అందుకు
వాళ్ళ గత చరిత్ర మీకు ఇస్తున సలహాలు సూచనలు గమనించాలి. కొందరు నాతో ఈ
వ్యాపారం లో కలిస్తే మీకు మరో వ్యాపారం అవసరమే లేదు అంత డబ్బు సంపాదించవచ్చు
అని మీరిప్పుడు చేస్తున్న
వ్యాపారం వదిలివేయమని చెప్పే
పరిస్థితి ఉంటుంది. అయితే మీ అనుభవం, వారి మాటల లోని అసలు అర్థం, మీ బలాలు,
బలహీనతలు దృష్టిలో ఉంచుకుని ఎంత సమయాన్ని ఏ అంశాలకు కేతాయిన్చాలను కుంటున్నారో
స్పష్టంగా మాట్లాడుకోవడం మంచిది. మీరు
ఎంట్ర ప్రెన్యూర్ అయితే మీ ఆలోచనా తీరులో అనేక బిజినెస్ లలో ఉండాలని
అనుకుంటే ఆ అంశాలు స్పష్టంగా చెప్పాలి. వారికి, మీకు ఎలాంటి సంబంధాలు ఉండాలో
స్పష్టంగా నిర్ణయించుకుంటే భవిష్యత్తులో లీగల్ ప్రాసెస్, ఖర్చులు తగ్గించుకోవచ్చు.
- సలహాదారులు (advisros), పార్ట్
టైం పనిచేసే వారు, కాంట్రాక్టు కన్సల్టెంట్స్:
ఏ స్టార్ట్ అప్ అయినా ఈ కోవలో ఐదుగురు అవసరం అవుతుంటారు.
·
మార్కెట్ నిపుణుడు -
డొమైన్ నైపుణ్యం ఉన్నవారు, మీరు ఆశించిన రంగంలో మంచి అనుభవం , సక్సెస్ ఐన
వ్యక్తులు
·
సంధాన కర్త - మిమ్మల్ని
ఇండస్ట్రీ కి ఇతర స్టేక్ హోల్డర్స్ కి పరిచయంచేసే ఇష్టత చూపే వ్యక్తులు
·
ఇండస్ట్రీ సెలబ్రిటీ –
తన పేరు ఉపయోగించే అవకాశం ఇస్తూ ఆ రంగంలో అనుభవం ఉన్న వ్యక్తి , వ్యక్తిగతంగా మీ
బిజినెస్ కార్యక్రమాలలో పాలుపంచుకోకపోవచ్చు
·
టెక్నికల్ కోచ్ – మీ
వ్యక్తిగత పరిస్థితులను ఆలోచనా రీతులను మీ ఇతర జీవిత పార్శ్వాలను దృష్టిలో
ఉంచుకుని మీ జీవన విలువ ను ఉన్నతంగా నడిపేందుకు సహాయపడే పర్సనల్ కోచ్
·
వ్యక్తిగత కోచ్ – మీ
వ్యక్తిగత పరిస్థితులను ఆలోచనా రీతులను మీ ఇతర జీవిత పార్శ్వాలను దృష్టిలో
ఉంచుకుని మీ జీవన విలువ ను ఉన్నతంగా నడిపేందుకు సహాయపడే పర్సనల్ కోచ్
- ఫుల్ టైం స్టాఫ్: సాధారణంగా ఫుల్
టైం పనివాళ్ళను (ఎంప్లాయిస్) ఎప్పుడు తీసుకోవాలనేది పని అవసరం మరియు బడ్జెట్
మీద ఆధారపడి ఉంటుంది. బూట్ స్ట్రాప్పింగ్, వెంచర్ కాపిటల్, బ్యాంకు లోన్ వంటి
మార్గాల ద్వారా సరిపోను పెట్టు బడి ఉన్నప్పుడు ఫుల్ టైం ఎంప్లాయిస్ ని
నియమించుకుని బిజినెస్ స్పీడ్ పెంచుకోవచ్చు.
4. బృందం ఉంటే వేగం
ఉన్నట్లే :
ఎంట్రప్రెన్యూర్ తనకు లేని
నైపుణ్యం, అనుభవం ఉన మరో ఎంట్రప్రెన్యూర్ ని కో-ఫౌండర్ లేదా బృంద సభ్యులను
చేసుకోవటం ద్వారా వ్యాపారానికి వేగం వస్తుంది. అలా వీలు కాని పక్షంలో మీరే అన్ని
అంశాలలోను నిష్ణాతులు కావాలి అందుకు సమయం పడుతుంది. అలాగే మీరే అన్ని పనులు
చేయాలంటే మీ ఎదుగుదలకు ఒక పరిమితి మీరే విధించుకున్నట్లే. మీ ఐడియాని వివరంగా
చెప్పి నమ్మకమైన వారిని బృందంలో చేర్చుకోవడం ద్వారా పని సమయం, నైపుణ్యాలు మాత్రమే కాకుండా
మొదటిదశలో అవసరమైన కాపిటల్ కూడా కలిసివస్తుంది.
చిన్నగా ఒక స్టార్ట్ అప్ నాకు ,
నా కుటుంబానికే అనుకుంటే ఒంటరిగా చేసుకోవచ్చు. అల కాకుండా మీ వ్యాపారాన్ని
ఎక్కువమంది కస్టమర్స్ కి చేరాలనుకుంటే బృందంతో పని చేయటం అనేక రకాలుగా ఉపయోగం.
అయితే ఎందుకు ఎవరితో ఎలా కలిసి పనిచేస్తున్నామో మనకు , మనతో కలిసే సభ్యులకు
స్పష్టత ఉండాలి. అలాంటి స్పష్టతతో మీ ఎంట్రప్రెన్యూర్ ప్రయాణాన్ని మొదలెట్టండి, మీ
సక్సెస్ స్టొరీ ఈ శీర్షిక లో ప్రస్తావించాలని సైకాలజీ టుడే ఆకాక్షిస్తుంది.
No comments:
Post a Comment