Does your business idea brings you success or failure?
To understand answer to this question, try to respond to following questions.
1. Does it really address the needs of the people?
2. Do people pay for such product or service if they can address their needs?
3. Does this business idea has huge market?
4. Are you willing to work on it with passion irrespective of the challenges?
5. Did you test your idea?
6. What is your marketing strategy?
సగటున ఒక మనిషికి
రోజుకు 60 వేల ఆలోచనలు వస్తాయట. ఇలా వచ్చి అలా వెళ్ళే ఆలోచనల
సునామీలో చమక్కున మెరిసే ఒక మంచి స్టార్ట్అప్ ఐడియాను వెంటనే
రాసిపెట్టుకుంటే మంచిదని చెప్తారు ఎంట్ర ప్రెన్యూర్ గురువులు. అయితే ఇలా వచ్చే
బిజినెస్ ఐడియాలను కొందరితో చర్చించి, ఆమోదం తీసుకుని అడుగు ముందుకు వేయాలా? లేదా
సొంతంగా నిర్ణయం తీసుకుని రంగంలోకి దిగాలా? అనేది చాలా మందికి అర్థం కాని విషయం. అలా మీకు వచ్చిన
వ్యాపార ఆలోచన (బిజినెస్ ఐడియా) ను టెస్టింగ్ దశకు తీసుకెళ్ళాలంటే ఏ అంశాలు
పరిగణనలోకి తీసుకోవాలో వివరించడానికే ఈ వ్యాసం.
*** ***
*** *** ***
***
సాధారణంగా బిజినెస్
లో మనకేమి ఇష్టమో దానిని దృష్టిలో
ఉంచుకుని ఒక వ్యాపారాన్ని చేయాలని చూస్తాము. కానీ మార్కెట్ అవసరం ఏమిటి, ప్రస్తుతం
ఆ ప్రోడక్ట్/సర్వీస్ యొక్క గ్యాప్ ఏంటో తెలుసుకుని దానిని పూరించే విధానాలపై ఆలోచన
(బ్రెయిన్ స్టార్మ్) చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తారు. అందుకే మీ వ్యాపార ఆలోచన
(ఐడియా) సక్సెస్ వైపు తీసుకెళుతుందా? లేదా? ఒక ఐడియాతో ముందుకు వెళితే బిజినెస్ ఫలితం
ఏ అంశాలపై ఆధారపడి ఉందో తెలుసుకుందాం.
- ఒక సమస్యను తీరుస్తుందా?: మీ ఎంట్ర ప్రెన్యూర్ షిప్ వలన ప్రజల అవసరం తీరుతుందా లేదా? ఒక ముఖ్య అవసరాన్ని (సమస్యను) తీర్చగలగాలి, ఇబ్బంది నుంచి వారి జీవితాన్ని సులువుగా నడిపించేలా ఉపయోగపడాలి. సమస్యకు పరిష్కారం ఇచ్చే వాటినే ప్రజలు విలువ ఇస్తారు, మార్కెట్ లో ఆహ్వానిస్తారు.
- ప్రజలు డబ్బు చెల్లిస్తారా? : మీ ఆలోచన ద్వారా ఆవిష్కరించే వస్తువు, సేవ ప్రజల అవసరం తీరుస్తుంది అని మీకు నమ్మకం ఉంది. ఇప్పుడు వెంటనే అర్థం చేసుకోవలసింది ఆ సేవకు/వస్తువుకు ప్రజలు డబ్బులు చేల్లిస్తారా? డబ్బు చేల్లిన్చానంత వరకు ఒక ఐడియా కేవలం ఐడియాగానే ఉండిపోతుంది, వ్యాపారం కాదు. ఒక సారి చెల్లిస్తారు అనుకుంటే ఎలాంటి కస్టమర్లు ఉన్నారు ? వారు ఎంత చెల్లిస్తారు అని ఆలోచించగలగాలి. సాధారణంగా తక్కువ ఖర్చుతో మంచి విలువ అందుతుంది అని అనిపిస్తే ఆ ఆలోచనను ప్రజలు అంగీకరిస్తారు. అందుకే మీరు ఏ రేటుకి (ప్రైస్ పాయింట్) అమ్ముతారో స్పష్టంగా, అనేక మార్కెట్ అంశాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయించాలి.
- పెద్ద టార్గెట్ మార్కెట్ ఉందా? : మీ ఆలోచన
బాగుంది, అవసరం ఉన్న వారు డబ్బు ఇస్తారు అని అనుకున్నారు. కానీ మీ ప్రోడక్ట్
, సర్వీస్ తీసుకునే మార్కెట్ ఎంత పెద్దగా ఉంది? ఎంత మంది ఆ అవసరం ఉన్న వాళ్ళు
ఉన్నారు? ఎన్ని సంవత్సరాలు మీరు ఆ టార్గెట్ గ్రూప్ (నిచ్ మార్కెట్) కు సేవలు అందించే
అవకాశం ఉంది. ఇతర ప్రత్యామాయాల కంటే మీరు ఉన్నతంగా చేయగలిగితే మీకు ఎంత శాతం
మార్కెట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. ఇలా ప్రతి అంశం చెక్ చేసుకోగలగాలి.
ఎందుకంటే తీసుకునీ వాళ్ళు ఉంటేనే గదా మనకు లాభాలు వచ్చేది.
- మీ అభిరుచి (పాషన్) ఎంత ? : మీ ఆలోచన బాగుంది, ఆ అవసరాన్ని తీర్చుకోడానికి డబ్బులు ఇచ్చే మార్కెట్ ఉంది, మంచిదే అయితే మీ నిచ్ మార్కెట్ ను చేరేందుకు కేవలం ఐడియా సరిపోదు దానిని సరైన విధానంలో మార్కెట్ లోకి తీసుకెళ్ళాలి, సవాళ్ళను అధికమించాలి. అందుకు మీ సమయం, శక్తి, నైపుణ్యాలు, ఇతర వనరులు పూర్తిగా మీ ఐడియా మీద పెట్టడానికి రెడీగా ఉండాలి. ఆ పాషన్, అభిరుచి మీలో ఉందా? మీరు ఇతరులతో కలిసి ఐడియాపై పనిచేస్తే ఎవరి బాధ్యతలు వారు స్పష్టంగా నిర్ణయించుకోవాలి. ఏది ఏమైనా ఐడియా నుంచి పైలట్ చేసి, వచ్చిన రెస్పాన్స్ గమనించి ఈ జర్నీ లో పాఠాలు నేర్చుకుంటూ ముందుకెళ్ళే పాషన్ చాలా అవసరం. బెంబేలు ఎత్తి మధ్యలో వదిలేసే వారికి బిజినెస్ పనికిరాదు, అలా అని ఫలితం మారకపొయినా ఏదో వస్తుందని రాంగ్ ఐడియాకు వేలాడపడకూడదు. ఈ పాఠం అర్థం చేసుకొని కమిట్మెంట్ తో వర్క్ చేయాలి.
- ఐడియాను టెస్ట్ చేసారా? : కేవలం ఆలోచనల్లో ఇలా చేస్తే ఇలా రెస్పాన్స్ వస్తుందని ఊహించుకోవడం, బుర్ర నిండా డౌట్స్ (సందేహాలు) పెట్టుకోవడం, కేవలం పాజిటివ్ ఆలోచనలు (పని చేయకుండానే ?) ఎవరో వచ్చి హెల్ప్ చేస్తే బాగుండు నా ఐడియాతో అద్భుతాలు చేస్తాను అనుకోవడం విజయవంతమైన ఎంట్ర ప్రెన్యూర్ లక్షణం కాదు. మీతో మొహమాటంతో నిజాన్ని చెప్పలేని స్నేహితులు, మీతో పాటు పనిచేయడానికి వచ్చిన పార్టనర్స్, మీ కుటుంబ సభ్యులు కాకుండా పూర్తిగా కొత్త వారితో మీ ఐడియాను టెస్ట్ చేయండి. ఒకవేళ మీ టార్గెట్ గ్రూప్ అనుకున్న కొత్త వారు “ ఓహ్.. అవునా అలాంటి సర్వీస్ ఉందా?, బాగుంది ... ఆ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది?” వంటి ప్రశ్నలతో ఉత్సాహంగా వివరాలు అడిగారంటే మీ ఐడియాలో విషయం ఉందన్న మాట. వారు సుముఖంగా రిప్లై ఇవ్వలేదంటే మీరు అనుకున్నంతగా మీ ఐడియా మీ టార్గెట్ గ్రూప్ కి రీచ్ అవ్వటం లేదన్న మాట. మీ ఐడియాను కొత్త వారైన టార్గెట్ గ్రూప్ తో టెస్ట్ చేసినపుడు వారి అభిప్రాయాలను తెలుసుకుని కొన్ని మార్పులు చేసుకోడానికి రెడీ గా ఉండాలి. కొత్త గోధుమపిండి బ్రాండ్ మార్కెట్ లో పరిచయం చేయాలనుకున్నారు అనుకోండి ఆల్రెడీ ఉన్న వారికంటే మంచి క్వాలిటీ ఉంది కదా అని ఒకే సారి 5 కేజీల ప్యాకెట్ మాత్రమే పరిచయం చేస్తే అది కుటుంబాలకు తెలుగు రాష్ట్రాలలో ఇష్టం ఉండకపోచ్చు, ప్రతి రాత్రి మా చపాతీ తినండి ఆరోగ్యంగా ఉండండి అనే వాణిజ్య ప్రకటనతో మీరు చిన్న ప్యాకెట్ లు పెట్టండి అనే కస్టమర్ సలహాలతో ఇంకొంచం మార్కెట్ షేర్ మీ సొంతం చేసుకోవచ్చు. అందుకే కస్టమర్ చెప్పే పాయింట్స్ అర్థం చేసుకోవాలి. అలా చాలా మంచి ఐడియాలు కూడా యధావిధిగా కాకుండా కొద్ది మార్పులతో మార్కెట్ లోకి వెళ్లి సక్సెస్ అవుతుంటాయి.
- మీ మార్కెట్ ఎలా చేస్తారు? : చాలా మంది ఎంట్ర ప్రేన్యూర్స్ మంచి ఐడియాతో ప్రజల సమస్యలు తీర్చుదామనుకుంటారు కానీ మంచి మార్కెట్ విధానం గురించి ఆలోచించరు. మంచి ప్రోడక్ట్ / సర్వీస్ అయితే చాలు ప్రజలు వాళ్ళే వచ్చి వినియోగించుకుంటారు అనుకుంటే మనం రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేస్తున్నట్లే. మంచి ఐడియా ఉంటే సరిపోదు, దానిని టార్గెట్ గ్రూప్ కు చేర్చడానికి మంచి మార్కెటింగ్ ఉండాలి. మీ మార్కెట్ విధానం ఏమిటి? మీకు మంచి ప్రోడక్ట్ ఉండి, సాలిడ్ మార్కెట్ ప్లాన్ ఉంటే విజయావకాశాలు ఎక్కువ. కానీ మంచి ప్రోడక్ట్ ఉంది కూడా మార్కెట్ విధానం లేకపోతే విజయావకాశాలు చాలా చాలా తక్కువ. ఎంత త్వరగా ఐడియా మీద వర్క్ చేయాలనుకుంటే అంత త్వరగా మార్కెట్ విధానం ఆలోచించాలి.
మీ ఐడియా ఇతరులకు చెప్పండి
కనుబొమ్మలు పైకి ఎగరేసి , కళ్ళు పెద్దవి చేసి చూస్తే అది హిట్టు , వాళ్ళు నొసలు
చిట్లిస్తే ఫట్టు అని అంటారు ఎంట్ర ప్రెన్యూర్ గురువులు. దీనికే ఐ బ్రో టెస్టింగ్
(కనుబొమల పరీక్ష అని పేరు). అంటే ఇతరుల స్పందన వెంటనే తెలిసిపోతుందని అర్థం. అయితే
మీ వ్యాపార ఆలోచన (బిజినెస్ ఐడియా) విషయంలో ఐ బ్రో టెస్టింగ్ కాకపోయినా ఈ ఆరు
ముఖ్య ప్రశ్నలు వేసుకుని మీ జవాబులు చూసుకోండి. మీ ఐడియా ఏ స్థితిలో ఉందో కొంత
అవగాహన వస్తుంది. ఒకోసారి మీ ఐడియా మార్కెట్ పరిస్థితుల కంటే వేగవంతమైనది
అయుండొచ్చు చాలా సంవత్సరాలకు ఉపయోగం ఉండొచ్చు, కానీ ఇప్పుడు బిజినెస్ చేయాలంటే
ఇప్పుడు మార్కెట్ చేయగలిగిన ఆలోచననే
స్టార్ట్ చేయాలి. అన్నింటికంటే ఆఖరిగా మీ ఐడియా సింపుల్ గా ఇతరులకు చెప్పగలగాలి,
దానిని మీ అమ్మమ్మ కు చెప్పినా అర్థంమయ్యేలా
సింపుల్ గా చెప్పే విధానాలు పాటించాలి.
ఇంకెందుకు ఆలస్యం మీ ఐడియాలు
మార్కెట్లో ప్రజల అవసరాలను తీర్చేవనుకుంటే ఈ ప్రశ్నల ద్వారా వాటిని ఉన్నతంగా
అర్థం చేసుకుని ప్రజలకు చేర్చండి. కొత్త సేవలు సృష్టించండి, మరిన్ని ఉద్యోగాలు
సృష్టించండి. మేక్ ఇన్ ఇండియా ఉద్యమంలో మీరు భాగాస్వాములవండి. బెస్ట్ విషెస్.
*** *** సైకాలజీ టుడే తెలుగు పత్రికలో ఫిబ్రవరి 2018 సంచికలో ప్రచురించబడిన ఆర్టికల్ *** ***
No comments:
Post a Comment