మనందరిలో అనేక
బలహీనతలు ఉంటాయి. ఒకసారి మనం వాటిని గుర్తిస్తే బయటదడడానికి ప్రయత్నిస్తాం.
ఉన్నతంగా మారడానికి ప్రయత్నిస్తాము. కోపం, నిర్మొహమాటం గా మాట్లాడడం నుంచి ‘నో’
చెప్పలేకపోవడం, ఇతరులకు చెప్పిన సమయానికి చేరుకోకపోవడం వరకు అనేక బలహీనతలు మనలో
ఉండొచ్చు. అయితే వాటిని ఎలా మార్చుకోవాలి అందుకు పాటించగల సూత్రాలేమిటో
చర్చిద్దాం. “తర్వాత చదువుదాం అనుకుంటున్నారా?”.... పనులు వాయిదా వేయటం
అనేది ఒక పెద్ద బలహీనత ....అందుకే ఈ క్షణమే చదవండి, బలహీనతలు జయించడానికి కొత్త
సంవత్సరం మీ జీవితంలో “ది బెస్ట్ ఇయర్” మలుచుకోడానికి ప్రయత్నాలు మొదలు పెట్టండి.
అదెలాగో తెలుసుకుందాం రండి.
*** ***
*** *** ***
***
మీ జీవితంలో ఉన్న ఏ
లక్షణాలకు, ఏ గుణాలకు
మీరు సంతోషంగా లేరు? ఈ క్రింద ఇచ్చిన 16 సాధారణ బలహీనతల లిస్టు లో మీలో
ఉన్నాయని గట్టిగా భావించే ఎవైనా మూడు లక్షణాలను ఎంపిక చేసుకోండి.
- అపసవ్యంగా (Disorganized) – ఒక ప్రణాళికతో,
పద్దతిలో సవ్యంగా పనులు చేయకపోవడం
- అననుకూలంగా (Inflexible) – పరిస్థితులకు
తగినట్లుగా ఆలోచనలను, నిర్ణయాలను, అలవాట్లను, జీవితాన్ని చూసే/ పనులు చేసే
విధానాలను మార్చుకోలేకపోవటం
- మొండిగా
ఉండటం (Stubborn) – నేను ఇలానే ఉంటాను; నాకు, ఇతరులకు ఇలా ఉండటం ఉపయోగంగా లేకపోయినా,
ఇబ్బందులు ఎదురైనా ఇలాగే ఉంటాను
- అస్థిరంగా ఉండటం/ స్థిరంగా లేకపోవడం (Inconsistent) – స్థిరమైన ఆలోచన, స్థిరమైన నిర్ణయాలు, పనిచేయటం
అందుకు జవాబుదారీగా ఉండటం
- చెడ్డగా ఉండటం, ఉండటం (Obnoxious) – ఇతరులకు, తనకు, తన కుటుంబానికి మంచిది కాదు అని
తెలిసి కూడా చెడ్డ బుద్దితో కూడిన ఆలోచనలు , నేను ఏమైనా పర్లేదు పక్కవాడు
మాత్రం బాగుపడకూడదు వంటి ఆలోచనలు
- భావోద్వేగాలు లేనట్లు ఉండటం (Emotionless)
- సిగ్గు పడటం, బిడియంగా ఫీల్ అవడం (Shy)
- భాద్యతా రాహిత్యం, ఒక వ్యక్తిగా తీసుకోవాల్సిన బాధ్యత తీసుకోకపోవడం Irresponsible
- విసుగుతో ఉండటం (Boring)
- అవాస్తవ / వాస్తవానికి దూరంగా ఉండటం (Unrealistic)
- ప్రతికూల ఆలోచనలు, విధానాలతో ఉండటం(Negative)
- భయం వలన ముందుకు వెళ్ళలేకపోవడం (Intimidating)
- బలహీనమైన ఆలోచనలు, పనులు, ఫలితాలతో గడపడం (Weak)
- దురహంకారం (Arrogant) – ఉన్న పేరునో,
వృత్తినో, పదవినో లేదా ఒక స్థితినో చూసుకుని
- నిర్ణయం తీసుకోలేకపోవడం, ద్రుధసంకల్పం లేకపోవడం, అనిశ్చితితో కూడిన విధానాలు
(Indecisive)
- ఓపిక, ఓర్పు లేకపోవటం, సహనం లేకపోవడం (Impatient)
మీలో మీరు గుర్తించిన ఏవైనా మూడు
అంశాలను ఎంచుకున్నారా? అమ్మో....అని గాబరా పడకండి ఈ పెద్ద లిస్టు చూసి, మీకు మూడు
కంటే ఎక్కువ అంశాలు బలహీనతలుగా ఉన్నా అప్పుడే కంగారు పడాల్సిన పని ఏమి లేదు. ఈ ఎక్సర్
సైజ్ తర్వాతి స్టెప్స్ లో మీ బలహీనతలు ప్రారదోలదానికి ప్రయత్నిస్తూనే ప్రాసెస్
అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు.
ఇప్పుడు ఈ క్రింది లిస్టు చూడండి,
మళ్ళీ మీరు ఎంపికచేసుకున్న మూడు లక్షణాల
దగ్గర ఉన్న విశిష్ట లక్షణాలు (traits) గమనించండి.
|
సృజనాత్మకంగా (క్రియేటివ్)
|
|
సవ్యంగా (Organized)
|
|
అంకిత భావం (dedicated)
|
|
అనుకూలంగా మరే తత్వం (Flexible)
|
|
ఉత్సాహభారితమైన (Enthusiastic)
|
|
నిర్మలమైన (Calm)
|
|
ప్రతిబింబించే , ప్రతిస్పందించే (Reflective)
|
|
సాహసోపేతమైన (Adventurous)
|
|
భాద్యతాయుతమైన (Responsible)
|
|
అనుకూల వైఖరి (పాజిటివ్)
|
|
వాస్తవంగా ఆలోచించే తత్వం (Realistic)
|
|
దృఢమైన, మొహమాటం లేని (assertive)
|
|
వినయతతో కూడిన (Humble)
|
|
ఆత్మ విశ్వాసం (self confidence)
|
|
ఓపికతో కూడిన (Patient)
|
|
గట్టి అభిరుచి, మక్కువ (passionate)
|
పై టేబుల్ లో వివరించినట్లు మీరు
బలహీనత అనుకున్న మూడు అంశాలకు కుడి వైపు ఉన్నవే మీ బలాలు. ఒకోసారి పరిస్థితిని
బట్టి బలాలా బలహీనతలా అనేది సమీకరణాలు మారిపోతాయి. అందుకే ఇవన్నీ ఏ ఫ్రేమ్ వర్క్ ,
ఏ స్థితిలో , ఏ కాంటెక్స్ట్ లో ఉన్నామన్న దానిపై, ఎంత మోతాదులో మీరు ఆశించిన
ఫలితాలు లేదా ఎంత ఆనందంగా ఉన్నారు అన్నదానిపై ఆధారిపడి ఉంటుంది.
మీ పనిలో, వ్యక్తి గత జీవితంలో,
సమాజంలో వేర్వేరు పరిస్థితిలలో మీ గుణాలు, లక్షణాలు మీకు బలహీనతలుగా , మీ
ఎదుగుదలకు అడ్డంకులుగా ఉంటే ....ఆ అంశాలే చూపిస్తున్న మీ బలాలు ఏమిటో గుర్తించారు.
ఈ బలాలను దృష్టిలో ఉంచుకుని మీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళే ఒక నిర్మాణాత్మక
అవగాహన , ఆచరణ ఈ కొత్త సంవత్సరంలో ప్లాన్ చేసుకోండి. బలహీనతలు ఉండటం తప్పు కాదు,
వాటిలో నర్మగర్భంగా ఉన్న అసలు పాజిటివ్ ఎక్స్ ప్రెషన్ గుర్తించి వాటిని
ప్రాదాన్యాలుగా కార్యక్రమాలు చేయలేక పోవటమే ఫెయిల్యూర్ కి కారణం.
బలహీనతలను జీవితాన్ని నేర్పే గురువులు మార్చుకోండి: అవును . మీరు ఎక్కడ
ఆగిపోతారు అంటే కెరీర్ లో అయితే మీ నైపుణ్యాలు ఆగిన దగ్గర అయిపోతారు. మరి డబ్బు,
ఆరోగ్యం, పెద్ద కలలు నిజం చేసుకోవడం ...ఇలా ఏ అంశం గమనించినా మనిషి కేవలం తను
సృష్టించుకున్న బలహీనత దగ్గర అది అందిస్తున్న పాజిటివ్ హింట్ అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవడం వద్ద ఆగిపోతాడు.
ఆ స్థితి మీకు రాకూడదంటే ఒక పని మీకు అవసరం ఉన్నా చేయలేకపోతున్నమంటే, ఒక విధానం
జీవితాన్ని ఉన్నతంగా మార్చుతుందని తెలిసినా అమలు చేయలేక పోతున్నామంటే అది
బలహీనత అని. అది మీ కంఫర్ట్ జోన్ ని సవాల్
చేస్తుందని , దానిని చేయటం ద్వారా మీరు గొప్ప పాఠాలు నేర్చుకోగాలరని నమాలి.
ఇలా
చేసి చూడండి:
- మీ బలహీనతలను అంగీకరించండి. మనస్పూర్తిగా. అవి ఇస్తున్న పాజిటివ్ హింట్
గమనించండి
- మీ బలాలను ఒక లిస్టు గా రాయండి, మీ బలాలతో మీరు చేయగల పనులు రాయండి.
- మీ గొప్ప నైపుణ్యాలు రాయండి , వాటి ద్వారా చేయగల కార్యక్రమాలు రాయండి
- మీ బలాల ద్వారా మీ బలహీనతల ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవచ్చు ఆలోచించండి
- నమ్మకమైన కోచ్, ట్రైనర్,
స్నేహితులు మీ బలహీనతల నుంచి బయటపడటం కోసం మీరు జవాబుదారీగా (accountable) గా
ఉండమని అడగండి
- ప్రణాళికతో ఉండటం ద్వారా మీ లక్ష్యాలు, ప్రాధాన్యాలు పై ధ్యాస ఉంచి, ఆ
ఫలితాల కోసం ఏమి చేయాలో అదే చేయగలరు, అందుకు కావాల్సినవి నేర్చుకోగలరు,
అప్పుడు బలహీనత గురించి ఆలోచించే సమయం లేనంతగా బిజీ అవుతారు
- మీకు లేని నైపుణ్యాలు నేర్చుకునేందుకు సమయం కేటాయించండి, ఉన్న స్థితి
నుంచి మరో స్థితికి వెళ్ళాలంటే విజన్, స్కిల్ రెండూ ఉండాలి వాటిపై దృష్టిపెట్టండి.
- అదే బలహీనత ఉన్న ఇతరులకు కూడా అందులోంచి బయటపడడానికి సహాయం చేయండి
- సిగ్గు పడాల్సిన పని లేకుండా నిర్మొహమాటంగా ఫీడ్ బ్యాక్ తీసుకోండి , మీరు
ఏం ఫ్రేమ్ వర్క్స్ ఉచ్చులో పడుతున్నారో తెలుసుకోండి.
- ఇతరులు మీలో కొన్ని విషయాల గురించి జోక్స్ వేస్తున్నారంటే వారు అలా
సరదాగా మాట్లాడుతూ మీ నుంచి ఆశిస్తున్న మార్పు కోరుతున్నారేమో గమనించండి.
- ప్రతిఒక్క విషయాన్ని మార్చాలని చూడకండి, ప్రయత్నం మంచి ఎక్స్పీరియన్స్
ఇవ్వాలి, ఉన్నత ఫలితం అవ్వాలి. ఒక మొండి ప్రయత్నం , తలనొప్పి కాకూడదు.
అల్లావుద్దీన్ అద్భుత దీపం లో
మొదట వచ్చేది రాక్షసి అయినా మన కోరికలను నిజం చేసే రాక్షసి మంచిదే కదా అలాగే మీ
బలహీనత ఒక బలంగా మారి జీవితాన్ని ఉన్నతంగా రూపొందించుకునేందుకు ఒక మెట్టుగా
ఉపయోగపడాలని ఆశించండి.
*** *** *** సైకాలజీ టుడే, జనవరి 2017 లో ప్రచురించబడిన ఆర్టికల్ *** *** ***
No comments:
Post a Comment