డబ్బు
సంపాదించడానికి, తన కాళ్ళ మీద తాను
నిలవడానికి, స్వేచ్చగా పనిచేసుకోడానికి, ఆశించిన కలలు నిజం చేసుకోడానికి,
చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి సొంత వెంచర్ ప్రారంభించడానికి ఇలా ఏ కారణం చేత ఎంట్రప్రెన్యూర్
గా మారినా ఒక విజయవంత మైన ఎంట్రప్రెన్యూర్ వ్యక్తిగత జీవితం కూడా ఉన్నతంగా
ఉండాలంటే స్టార్ట్ అప్ , బిజినెస్ సక్సెస్ చేసే వ్యక్తి ఫ్యామిలీ లో సక్సెస్
అవ్వాలంటే ఎలా ఉండాలి? ఏమి చేయాలి? ఈ ముఖ్యాంశాలు చర్చించడానికే ఈ ఆర్టికల్.
*** ***
*** *** ***
***
ఎంట్రప్రెన్యూర్ గా
సక్సెస్ అవ్వడానికి మాత్రమే కాదు వ్యక్తిగత జీవితంలోనూ
ఒక మంచి భర్తగా, స్నేహితులుగా, కొడుకుగా, సమాజంలో ఉన్నత వ్యక్తిగా మనిషి తనను తాను
నిర్మించుకోవాలంటే మనకు ఈ లక్షణాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎంట్రప్రెన్యూర్
గా విజయానికి, కుటుంబ విజయానికి అవే లక్షణాలు ఎలా ఉపయోగపతాయో గమనించండి.
1.
అంతర్ముఖంగా నడిపించుకోండి:
విజయవంతమైన
వ్యాపారులు అధికంగా అంతర్ముఖంగా, సెల్ఫ్ డ్రైవ్ తో, తనని తాను ముందుకు
నడిపించుకునే ఒక లక్షణం కలిగి ఉంటారు. తెలియని విషయాలు అడిగి , చదివి నేర్చుకునే
లక్షణం, చేయలేని అంశాలను ప్రయత్నించి నేర్చుకునే తత్వం, కొత్త నైపుణ్యాలు
నేర్చుకోడానికి సమయం కేటాయించే లక్షణం ఉంటుంది. ఇవి మీరు ఎంచుకున్న వ్యాపారానికే
కాదు మీరు ఉద్యోగులైనా కానీ జీవితానికి ఎప్పుడూ ఒకే విధమైన మూస పద్దతిలో కాకుండా
కొత్తదనంతో ముందుకు తీసుకెళ్ళాలి అనే తపనను రేకెత్తిస్తుంది. ఎదో సాధించాలన్న తపన నిరంతరం
మెదులుతూ మీలోనే ఒక అగ్నిలా రగులుతుంటే కొన్ని ప్రయత్నాలు మొదలెడతారు. ఆ సమయంలో
పర్సనల్/ లైఫ్ కోచింగ్, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, శిక్షణా కార్యక్రమాలు, విజయం
సాధించిన వారితో సంభాషణలు ఉన్నత దిశా నిర్దేశం చేసుకునే సహాయం ఇస్తాయి. మన బండిలో పెట్రోల్
రెడీగా ఉంటే, గమ్యం ఏటో తెలిస్తే బండిని అటు దిశగా పంపించటం ఈజీ, మిమ్మల్ని మీరు
నడిపించుకునే లక్షణం అలాంటిదే. మీలో ఉండే ఎదో చేయాలి, ఎదో సాధించాలి
అనే “అంతర్గత దిశానిర్దేశం” వలన, తపన వలన మీకు ఒక ఉన్నత మార్పు కావాలన్న ఆలోచన వస్తుంది.
ఆ బర్నింగ్ మీలో ఉంటే, త్వరగా ఆ ఎనర్జీ కి ఒక లక్ష్యం ఇవ్వండి, ఆ దిశలో అడుగులు
వేయండి. కుటుంబాలలో పెద్దలకి ఈ లక్షణం ఉంటే కుటుంబ సభ్యులు అందరూ ఎదో సాధించాలి
అనే తపన పెంచుకుంటారు.
2. భావోద్వేగాల
నియంత్రణ ఎలానో పాటించి చూపండి
బిజినెస్, ఇల్లు, సమాజం....ఎక్కడైనా
మనిషికి భావోద్వేగాలపై ఉన్నత భావంతో కూడిన నియంత్రణ అవసరం. ‘కర్మరా బాబు
కస్టమర్ తో ఏమి వాదించలేము’ అనుకోవటం వేరు. ‘కస్టమర్ గా తన అనుమానాలు తను
అడుగుతున్నారు, నేను స్పష్టంగా అర్థం చేసుకుని నివృత్తి చేయాలి’ అనుకోవటం
వేరు. సూపర్ సక్సెస్ అయిన వ్యాపార నిర్మాతలను చూడండి వాళ్ళు చాలా కూల్ గా, ప్రసన్న
వదనంతో ఉంటారు. మనం ఒకోసారి చిన్న చిన్న వ్యాపారాలు, ఉద్యోగాలు చేసే వారిని కూడా కంగారుగా, నిర్లిప్తంగా, ఆపుకోలేనంత చిరాకు
పరాకులతో చిన్న విషయాలకే వర్రీ అవ్వటం వారి చిరాకు ఇతరుల మీద చూపించటం చూస్తుంటాము.
గొప్ప వ్యాపారం నిర్మించాలన్నా గొప్ప కుటుంబం నిర్మించాలాన్నా ఓపిక అవసరం, కళ్ళ
ముందు జరుగుతున్నది, మనకి వినిపించే ఇతరుల మాటలు మాత్రమే కాకుండా వాటి స్థాయిని
దాటి పరిస్థితులను అర్థం చేసుకోవటం, నెగటివ్ గా అపార్థం చేసుకోకుండా ముందుకు
వెళ్ళటం అవసరం. విజేతలైన ఎంట్రప్రెన్యూర్స్ కి అనుభవం, మెచ్యురిటీ వలన
ఓపిక ఉంటుంది, ఎక్కడ ఎమోషన్స్ ఎంత స్థాయిలో వాడాలో బాగా తెలిసి ఉంటారు , సరైన
సమయంలో స్థిమితంగా నిర్ణయాలు తీసుకోగలరు. గెలుపుకోసం
వ్యాపారం అయినా , ఇల్లు అయినా ఒకోసారి ఏమి చేయకుండా పనులను విజయవంతంగా
ముందుకు నడిపించాలో తెలుసుకోవాలి. కోపం, ఆవేశం, అనుమానం స్థానం లో అర్థం
చేసుకోవటం, ఇవ్వటం, ప్రేమపూర్వక వాతావరణం సృష్టించడం ద్వారా ఎక్కువ
సాధించవచ్చు.
3. స్థిత
ప్రజ్ఞత , ఫ్లెక్సిబిలిటీ ఆయుధాలైతే మీరే విజేతలు
ఆయుధాలంటే బాహుబలి సినిమాలో కట్టప్ప చేతిలో కత్తులు కాదు
కానీ మనల్ని ఒక వ్యాపారిగానే కాకుండా వ్యక్తిగా బలవంతులను చేసే కీలక అంశాలు.
పరిస్థితులకు తగినట్లు , ఫ్లెక్సిబుల్ గా ఉండటం. ‘నేను ఇలానే ఉంటాను’, ‘నేను
అనుకున్నట్లే నాకు వ్యాపారం రావాలి’, ‘ఇలా ఉంటేనే కస్టమర్స్ తో డీల్ చేస్తాను’
వంటి ఆలోచనా విధానాలతో మీరు ఒక ఫ్రేమ్ (మూస) తయారు చేసుకుని ఇతరులను ఆ చట్రంలో , ఆ
పరిధిలో ఆలోచించు, పనిచెయ్యి అని స్థితిని వదిలేసి పనిచేయగాలగాలి. స్వేచ్చగా
ఆలోచించాలి, ఓపెన్ మైండ్ తో ముందుకెళ్లాలి, ఇతరులను వినాలి, వారు చెప్పే అంశాలు,
చెప్పని అంశాలు / ఫీలింగ్స్ అర్థం చేసుకోగలగాలి. మీరు ఆశించిన ఫలితం రాకపోతే,
అది ఉన్నత మైన దైతే ఎలా చేస్తే వస్తుంది అని ఆలోచిస్తూ నిన్నటికంటే ఉన్నతంగా
ప్రయత్నించడం అవసరం, అదే ఫ్లెక్సిబిలిటీ. ఈ లక్షణాలు వ్యాపారంలో కస్టమర్స్ తో,
ఇతర పోటీదారులతో ఎంత అవసరమో మీ కుటుంబ సభ్యులతో కూడా అంతే అవసరం. అప్పుడే తరచూ మన
వెర్షన్ మాత్రమే వినిపిస్తూ మార్పు ఆశించడం కాకుండా కుటుంబ సభ్యుల అవసరాలను కూడా
అర్థం చేసుకోగలం, చెప్పకపోయినా. ఈ మూడు స్టెప్స్ అర్థం
చేసుకుంటే బిజినెస్ లో అయినా, ఫ్యామిలీ లో అయినా మీరెలా ఉండాలో తెలుస్తుంది, ఇంకా
అనుమానాలు ఉంటే ఈ బ్లాగ్ లో ఇతర ఆర్టికల్స్ కూడా చదవండి. మీ ఎంట్ర ప్రెన్యూర్ జర్నీ లో ఫ్యామిలీ లైఫ్
మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేయండి J
*** *** *** సైకాలజీ టుడే, డిసెంబర్ 2016 లో ప్రచురించబడిన ఆర్టికల్ *** *** ***
No comments:
Post a Comment