ఒక మనిషి
ఎంట్రప్రెన్యూర్ కావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఉద్యోగి కావాలా? ఉద్యోగం ఇచ్చే
ఎంట్రప్రెన్యూర్ కావాలా? ఒకవేళ ఎంట్రప్రెన్యూర్ కావాలనుకునే వారు ఎందుకు దానిని
ఎంచుకుంటారు? డబ్బు, పేరు, స్వేచ్చ, గుర్తింపు, ఆశయం, అభిరుచి...వీటి కోసమే ఎంట్రప్రెన్యూర్
గా తయారయ్యాం అనేవారు కొందరు ఉన్నారు. ఇవేనా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? మనిషిని
ఎంట్రప్రెన్యూర్ చేసే అసలు చోదక శక్తులు ఏమిటి?
ఎంట్రప్రెన్యూర్ ఆలోచనలకు అద్దంపట్టే అసలు రహస్యాలు ఏమిటి? ఈ ముఖ్యాంశాలు
చర్చించడానికే ఈ నెల మన ప్రత్యేక వ్యాసం.
*** ***
*** *** ***
***
మన భారత దేశంలో వారానికి ఆరు
రోజులు పనిచేసే సంస్థలలో వారానికి 48 గంటలు పనిలోనే ఉంటాం. ఆ సమయాన్ని మనం
ప్రేమించే పనిలో గడపొచ్చు లేదా అర్థవంతమైనది కాకపోయినా (ఇష్టం లేకపోయినా) టైం కి
డబ్బులు ఇచ్చే పనిలో గడిపేయొచ్చు. కాకపోతే డబ్బు మాత్రమే వస్తే, అది ఇష్టం లేని
పని అయితే జీవితంలో కెరీర్ మాత్రమే కాకుండా ఆరోగ్యం, ఆలోచనలు, అన్ని అంశాలపై
నెగటివ్ ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి కష్టాలు లేకుండా ఉండాలంటే ప్రేమించే పనిలో
మునిగిపోయి సక్సెస్, ఫెయిల్యూర్ స్థాయిలు దాటి జీవితాన్ని ముందుకు తీసుకుపోవాలంటే
ఎంట్ర ప్రెన్యూర్ అవ్వాలి. అసలు ఎంట్ర ప్రెన్యూర్ అవ్వాలంటే ఎలాంటి ఉద్దేశ్యాలతో
ఆలోచిస్తారు, ఏ కారణాలవలన ఎంట్రప్రెన్యూర్ అవతారం
ఎత్తుతారో తెలుసుకుందాం.
1. ఉద్యోగంలో సృజనాత్మకత వినియోగపడక పోవడం
వీరికి
రోజువారి ఉద్యోగంలో అసంతృప్తి ఉంటుంది. వీరు తమ సృజనాత్మకత, టాలెంట్ ఉపయోగపడక
పోవటం. వారికి జాబు లో తాను ఫిట్ అవ్వలేదు
అనే ఫీలింగ్ రోజురోజుకి పెరిగిపోతుంది. ఉద్యోగంలో , చేసే పనిలో నిరాశ
నిస్పృహలు పెరిగిపోతాయి. ఇలాంటి స్తితిలో మీకు సొంతంగా మీ నైపుణ్యాలు బాగా
వినియోగించుకునే ఒక కొత్త వెంచర్ లో అడుగులేయాలని తరచూ ఆలోచన రావటం సహజం. దీనినే
ఆపిల్ కంపెనీ సృష్టికర్త స్టీవ్ జాబ్స్
చాలా బాగా చెప్పారు. ఆయన ఏమన్నారు అంటే
“మీరు ఎదుగుతున్నప్పుడు ప్రపంచం ఇలానే ఉంటుందని చెప్తారు...కానీ ఒక సారి
ప్రపంచం అంటే కొందరు మనుషులు మాత్రమే, ఒక్క సారి ప్రపంచాన్ని సృజనాత్మకతతో మార్చొచ్చు, ప్రభావితం చేయొచ్చు, ఒకసారి మీకు ఈ
విషయం అర్థం అయితే మళ్ళీ మీరు అదే మనిషిగా
ఉండరు”.
2. ఒక చట్రం వంటి జీవితమంటే ఇష్టం లేకపోవడం
వీరికి
రోజువారి ఉII 9 నుంచి సాII 5 వరకు ఉద్యోగంలో అసంతృప్తి ఉంటుంది.కాబట్టి ఉద్యోగం వదిలేసి ఎంట్రప్రెన్యూర్ అయితే సమయం మన చేతిలో ఉంటుంది అని అంటారు.
ఫ్లెక్సిబిలిటీ మనకి అనుకూలంగా ఉంటుంది అని అందరూ అంటారు. వాస్తవ పరిస్థితులు
ఇందుకు భిన్నంగా ఉంటాయి. తమ వెంచర్ లో బాగా సక్సెస్ అయినవారు, కావలసినంత మంది
సిబ్బంది/ టీం ఉన్నవారు తప్ప కొత్తగా ఒక ఎంట్రప్రెన్యూర్ గా ఎదగాలనుకునే వారు
నిరంతరం ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తుంది. కావలసినంత ఖాళీ టైం దొరుకుతుందని, షార్ట్ కట్ లో డబ్బులు సంపాదించాలని, షార్ట్ కట్
లో జీవించాలని సూడో మెచ్యురిటీతో, భ్రాంతిలో సొంత వ్యాపారం/ స్టార్ట్ అప్ లోకి
అడుగులు వేయాలనుకోవడం అవివేకం. అది ఫలితాలను ఇవ్వదు. విత్తనాలు నాటి సేద్యం
చేస్తేనే పంట వస్తుంది. అలాగే వ్యాపారం కూడా ఇది ఒక అవసరాలను తీర్చే సేద్యమే.
3. నిరంతరం కొత్త విధానాలు ప్రయత్నించడం
ఎంట్రప్రెన్యూర్ రొటీన్ ఆలోచనలకూ భిన్నంగా నిరంతరం
కొత్త ఉత్పత్తులు, సేవలు, విధానాలు ద్వారా సమాజానికి, వినియోగదారులకి చేరుకోవాలనే
ఆలోచనలు (ఐడియా) చేస్తుంటారు. సంప్రదాయాలకు భిన్నంగా ఆలోచిస్తారు. ఒకోసారి వారి
ఆలోచనలను ప్రపంచం పిచ్చి అనికూడా అనుకుంటుంది. కొందరు మోఖాన్నే వారిని చూసి జాలి పడతారు, కొందరు ఎందుకొచ్చిన బాదలు హాయిగా
ఉద్యోగం చేసుకోక అని ఉచిత సలహాలు ఇస్తారు. కానీ కొత్త
విధానాలను ప్రయత్నించడం ద్వారా వారి సృజనాత్మకతకు, సాహస విధానాలకు, సంప్రదాయాన్ని
ప్రశ్నించే వారి ఆలోచనలను వారే టెస్ట్ చేసుకుంటూ మంచి ఫలితాలు వచ్చే వాటిని
వినియోగంలోకే వేగంగా తీసుకు రాగలిగే వారే ఎంట్ర ప్రెన్యూర్ గా నిలవగలరు. ఆ ఓపిక మీలో
ఉంటే మీరు ఎంట్రప్రెన్యూర్ గా స్టార్ట్ అప్ / బిజినెస్ / వెంచర్ మొదలు పెట్టొచ్చు. ఎంట్ర ప్రెన్యూర్ షిప్ అంటే జీవితం లో కొన్ని సంవత్సరాలు
ఎవ్వరూ బ్రతకని విధంగా పనిచేస్తూ బ్రతకటం, కాబట్టి మిగతా జీవితమంతా అందరూ జీవించలేని
ఉన్నత స్థాయిలో జీవించడం.
4. ప్రపంచాన్ని భిన్నంగా చూడటం
అందరికీ
కడుపులో ఆకలి అవుతుంటే ఏదైనా తినడానికి దొరికితే బాగుండు అని అనుకుంటాం, ఎంట్రప్రెన్యూర్స్ అయితే ఇక్కడ టిఫిన్ సెంటర్, హోటల్/ రెస్టారెంట్
నడపొచ్చు అని ఆలోచిస్తారు. అందరూ కష్టాలు చూస్తే ఆ కష్టాలు తీరాలంటే మనం ఒక వెంచర్
ఏమి స్టార్ట్ చేయొచ్చు? ఎలా స్టార్ట్ చేయాలి? అని ప్లానింగ్ చేస్తారు ఎంట్ర
ప్రెన్యూర్స్. ఐన్ స్టీన్ మహాశయుడు అన్నట్లు “లాజిక్ మిమ్మల్ని A నుంచి B కి
తీసుకెళ్తుంది, కానీ ఇమాజినేషన్ ఎక్కడికైనా తీసుకెళుతుంది” అలాగే ఎంట్ర ప్రెన్యూర్స్
ప్రపంచాన్ని ఎలా ఉందొ అలా మాత్రమే కాకుండా తమ ఇమాజినేషన్ లోంచి చూస్తారు, అర్థవంతమైన
మార్పులు ద్వారా ఉన్నత ప్రపంచం నిర్మించే పని చేస్తారు. వారు కేవలం వారి
జీవితాన్నే మార్చుకోవడం కోసం కాదు అంత కంటే పెద్ద ఉద్దేశంతో, ప్రపంచానికి మంచి
చేయాలనే భావనలతో పనులు చేస్తారు.
మీకు కూడా ఈ లక్షణాలు ఉంటే మీలో
కూడా ఒక ఎంట్ర ప్రెన్యూర్ ఉన్నారని అర్థం. అయితే ఎంట్ర ప్రెన్యూర్ అవ్వడం, స్టార్ట్అప్ మొదలుపెట్టటం అంటే జీవితంతో ఒక ప్రయోగం చేయటం
వంటిది అందుకు మీరు రెడీ అయితే, మీరు ఏదైనా ఒక సమస్యకు ఉన్నత సమాధానం
ఇవ్వగలిగితే, మీ వస్తువులు లేదా సేవల ద్వారా ప్రపంచానికి విలువని ఇవ్వగలిగితే
ఇంకెందుకు ఆలస్యం మీ ఐడియాతో చెలరేగిపోండి. ఆన్లైన్ , ఇంటర్నెట్ వచ్చిన తర్వాత చాలా
విషయాలు ఆన్లైన్ లో నేర్చుకుంటున్నారు. మీరు అడుగులు ముందుకు వేయండి. రిస్క్
తీసుకోవాలని లేదనుకుంటే హాయిగా మీ జాబు మీరు ఎంజాయ్ చేయండి. నిజానికి ఉద్యోగం
చేసినా, ఉద్యోగం ఇచ్చే పని చేసినా, ఎంట్ర ప్రెన్యూర్ అయినా , అంతర్గత విలువలకు
అనుగుణంగా, తనకు ఉన్న టాలెంట్, ఆలోచనా విధానాలు ఉన్నతంగా వ్యక్తపరిచే పని వాతావరణం
సృష్టించుకోగలిగితే యువర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. బెస్ట్ విషెస్ ఫర్ సూపర్ సక్సెస్.
*** *** *** సైకాలజీ టుడే, ఫిబ్రవరి 2017 లో ప్రచురించబడిన ఆర్టికల్ *** *** ***
No comments:
Post a Comment