ఉద్యోగం వదిలి
వ్యాపారం ప్రారంభించాలన్నా, అసలు
ఉద్యోగమమే సంపాదించకుండా
స్టార్ట్ అప్ మొదలుపెట్టాలన్నా మనిషికి గుండెల నిండా ఆత్మ విశ్వాసం, సాధించాలన్న బలమైన కోరిక ఉండాలి. మరి
మొదటి అడుగు ముందుకు వేసిన ఎంట్ర ప్రెన్యూర్ నిజంగా ఆ ఉత్సాహాన్ని, ప్రేరణను తన బిజినెస్ జర్నీ అంతా
కొనసాగించగలడా? ఈ పోటీ ప్రపంచంలో రోజువారీ సవాళ్లు, అధికమౌతున్న డిమాండ్స్ మధ్య ఎంట్ర
ప్రెన్యూర్ జర్నీ సజావుగా సాగాలంటే తనని తాను ఎలా మోటివేట్ చేసుకోవాలి? అందుకు అవలంభించాల్సిన స్వయం ప్రేరణ (సెల్ఫ్ మోటివేషన్ ) మార్గాలు
ఏమిటి? ఈ కీలక అంశాలు చర్చించడానికే ఈ నెల మన ప్రత్యేక వ్యాసం.
1. స్పష్టమైన్ విజన్ – గోల్
ఎందుకు కొందరు ఎంట్ర ప్రెన్యూర్స్
ఆటంకాలను జయిస్తారు, ఒత్తిడి తట్టుకుంటారు, తీక్షణ ఏకాగ్రతతో పని చేస్తారు? వారికి
ఆ స్థాయిలో మోటివేషన్ ఎలా ఉంటుంది? ఎక్కడి నుంచి ఆ మోటివేషన్ వస్తుంది? వాళ్ళు
ఎక్కువ గంటలు ఓపికతో ఎలా పని చేయగలరు? ఎందుకంటే వాళ్ళు ఎందుకు పనిచేస్తున్నారో, తమ
విజన్ ఎంటో, అందుకు చేరుకోవాల్సిన లక్ష్యాలు ఏమిటో స్పష్టంగా తెలుసు. వ్యక్తిత్వ
వికాస నిపుణులు చెప్పినట్లు ఈ ప్రపంచంలో అసలు సోమరిపోతులు లేరు కేవలం “ఏమి చేయాలి?”
అనే స్పష్టత, పరిగెత్తించే పెద్ద లక్ష్యాలు లేని వారు మాత్రమే ఉంటారట. అందుకే స్పష్టమైన వ్యక్తిగత “మిషన్ స్టేట్ మెంట్” ఉండాలి. అనుక్షణం నా జీవితం ఈ అంశం
మీద పనిచేయాలి, ఈ విధానాలలో, ఈ విలువలతో ముందుకు వెళ్ళాలి అనే స్పష్టత కళ్ళ ముందు
కనిపిస్తుంటే వ్యక్తి తన సంపూర్ణ శక్తిని (లైఫ్ ఎనర్జీ) ముఖ్యాంశాలపై కేంద్రీకరించగలడు. అప్పుడు న్యూస్ పేపర్ లో వార్తలు, వాళ్ళతో
వీళ్ళతో పోల్చుకునే అలవాటు, అనవసర ఆటంకాలు, ప్రలోభాలు, పనులను నిర్వీర్యం చేసే
ఉచ్చులలో పడకుండా తన ఫోకస్ కీలక అంశాల పై పెట్టగలడు.
సెల్ఫ్
టెస్ట్ :
ü మీ మిషన్/ విజన్/ జీవిత ధ్యేయం ఏమిటి?
ü మీ దీర్ఘకాలిక, ఈ సంవత్సర లక్ష్యం ఏమిటి?
ü వాటిని సాధించే క్రమంలో ఏర్పరచుకున్న ఈ ఒక సంవత్సరం లక్ష్యం
ఏమిటి?
ü మీ లక్ష్యాన్ని స్పష్టంగా రాసుకున్నార?
ü ఎంత తరచుగా మీ లక్ష్యం మీ మనసులో మెదులుతుంది? మీరు రివ్యూ
చేసుకుంటున్నారా?
2. టుడే ఈజ్ మై డే
విజయవంతంగా
ఎంట్ర ప్రెన్యూర్ జర్నీ చేసిన ఏ వ్యక్తినైనా గమనించండి. వాళ్లకు లక్ష్యమే కాదు
లక్ష్యం తాలూకు ప్రణాళిక ఉంటుంది. ఏ సమయానికి ఏమి కావాలి అనే ఒక క్లారిటీ ఉంటుంది.
అందుకు అనేక విధానాలలో ప్రయత్నిస్తారు. ఒక రోజు పనులు చేయలేక ఫెయిల్ అయితే దాని
ప్రభావం భావిష్యత్తు పై ఉంటుందని తెలుసు. ప్రతిరోజూ
కొంత ఎదుగుదల (ప్రోగ్రెస్) అయితే తమ లక్ష్యాల వైపు ముందుకు వెళ్ళగలను అనే భావంతో
సమయాన్ని ఉన్నతంగా వాడుకుంటారు. ఈ రోజు నారోజు (టుడే ఈజ్ మై డే ) అన్నట్లు
గడుపుతారు.
సెల్ఫ్
టెస్ట్ :
ü ఈ రోజు మీ లక్ష్యం గుర్తుకు తెచ్చుకున్నారా?
ü మీ లక్ష్యం చేరుకునే దిశలో ఈరోజు పనులు చేసారా? వాటిని
చేయటం ద్వారా నేర్చుకున్న కొత్త అంశాలు ఏమైనా ఉన్నాయా?
ü మీ లక్ష్యాన్ని ఇతరులు ఎవరైనా సాధిస్తే వారి ద్వారా
నేర్చుకోవాలన్న ఆలోచన మీకు ఉందా?
ü నిన్నటి కంటే ఈ రోజు బాగా చేసిన , కొత్త ఆలోచనలతో చేసిన ,
భిన్నంగా చేసిన అంశాలు ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా?
3. ఫలితాల దిశలో రోజు వారీ కార్యక్రమాలు (డైలీ రొటీన్ )
సెల్ఫ్ మోటివేషన్ ఉన్న ఎంట్రప్రెన్యూర్ రోజువారీ
కార్యక్రమాలు (డైలీ రొటీన్) శక్తివంతంగా నిర్మించుకుంటారు. ఈ ప్రపంచంలో మనం కలిసే
మనుషులు వారి ప్రభావాన్ని చూపిస్తారు. ఈ
ప్రభావం మన లక్ష్యాలు, మనం జీవితాన్ని చూసే విధానం, మనం పనులు నిర్వహించే విధానం
పై పడుతుంది. కానీ సెల్ఫ్ మోటివేషన్ ఉన్న
వారు బయటి ఒత్తిడులు ప్రభావాలకు ప్రతిచర్య రూపంలో వెంటనే ప్రతిస్పందిస్తూ
కూర్చోరు. వారి విధానాలు, వారి రూల్స్ వాళ్ళు సృష్టించుకుంటారు. చుట్టూ ఉన్న
వ్యక్తులు, ఆ రంగంలో ఉన్న ఇతరుల విధానాలు, నెగటివ్ వ్యక్తుల ప్రభావం తమ మీద
పడకుండా ఒక షీల్డ్ వేసుకున్నట్లుగా తమ పై తమకు ఉన్న అభిప్రాయాలు, తన విలువలు తన
స్టాండర్డ్స్ తో ఒక రక్షణ వలయం సృష్టించుకుంటాడు. తన ఎంట్ర ప్రెన్యూర్ జర్నీ తనకు
ముఖ్యం అందుకు తగిన వ్యక్తిలా ఉన్నతంగా మారడానికి రెడీ గా ఉంటారు గానీ తన ఉనికే
పోయేలా ప్రభావానికి గురి కారు. వారి శక్తి వంత మైన డైలీ రూల్స్ వారే నిర్ణయించుకుంటారు.
ఐదు గంటలకి నిద్ర లేవడం, రోజు 45 నిమిషాలు వాకింగ్, 30 నిమిషాలు మెడిటేషన్, నో టీవీ , నెగటివ్ మనుషులకు దూరంగా
ఉండటం ఇవన్నీ తనే నిర్ణయించుకుంటాడు. అమలు పరుస్తాడు. ఎందుకంటే ఒక గొప్ప ఎంట్ర
ప్రెన్యూర్ కావాలంటే అతని ఒక రోజు ఉన్నతంగా ఉండాలి. సెల్ఫ్ మోటివేషన్ ఉన్నవారు ఈ
వాస్తవానికి తగ్గట్లు , బాలన్స్ తో ముందుకు వెళతారు.
సెల్ఫ్
టెస్ట్ :
ü మీ రోజు వారీ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి?
ü మీరు ఏ సమయానికి నిద్ర లేస్తారు? ఏ వ్యక్తులను కలుస్తారు?
ఎవరితో ఎక్కువ గడుపుతారు?
ü మిమ్మల్ని పాజిటివ్ గా ప్రేరేపించే పుస్తకాలు, మనుషులు,
వీడియోస్ మీ వద్ద ఉన్నాయా? ఎంత తరచుగా వారినుంచి మీరు మోటివేషన్ పొందుతారు?
ü ఇతరులతో మీరు ఎలాంటి సంభాషణలు చేస్తారు?
ü మీ క్లైంట్ / కస్టమర్/ బాస్/ బృంద సభ్యులతో తో ఎలా ప్రవర్తిస్తారు?
ü మీ పనిలో మిమ్మల్ని అత్యంత ఉత్సాహంగా నడిపించే అంశం ఏమిటి?
ఏ విషయాలు మిమ్మల్ని మోటివేట్
చేస్తున్నాయి?
ü మీ సమయాన్ని తినేస్తున్న టైం కిల్లర్స్ (ఆటంకాలు) ఏమిటి ?
ü మీరు ఏ అంశాలు , నైపుణ్యాలు నేర్చుకుంటే మీ రంగంలో ఇంకా
బాగా ఎదగాగలరు? అందుకు మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తునారు?
4. శక్తివంతమైన అలవాట్లు
దాదాపు ప్రతి
ఎంట్ర ప్రెన్యూర్ మెడిటేషన్ (ధ్యానం) లేదా ధ్యాన స్థితిలో గడిపే ఒక అలవాటు
ఉంటుంది. దానిని వారు తు.చ. తప్పకుండా పాటిస్తారు. ఎందుకంటే వారి మనసుని సేద
తీరుస్తుంది, కొత్త విధానం లో జీవితాన్ని చూసేలా ప్రోత్సహిస్తుంది, సృజనాత్మక
ఆలోచనలు, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళే మార్గాలు ఆవిష్కరించుకోగలరు. వారు మనసును
ఉన్నత ఆలోచనలతో , శరీరాలను ఉన్నతమైన, శక్తినిచ్చే, పౌష్టిక ఆహారంతో నింపుతారు.
కావలసినంత ఎక్సర్ సైజ్, కంటినిండా నిద్ర, తన మనసుకి ఆహ్లాదాన్ని ఇచ్చే హాబీస్ లో
గడుపుతారు. అందువలన వారు పని మీద ఫోకస్ చేయగలరు, ఎక్కువ పని గంటలు కూడా ఆనందంగా,
ఆక్టివ్ గా ఉంటారు.
సెల్ఫ్
టెస్ట్ :
ü మీ శరీరాన్ని (బాడీ), మనసుని (మైండ్), ఆత్మ (సోల్ )ని
ఎలాంటి విషయాలతో నింపుతున్నారు?
ü మీకు ఎలాంటి ఆహారం శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తున్నట్లు ఫీల్
అవుతారు?
ü మీరు రోజుకి ఎంత సమయం వ్యాయామం చేస్తునారు? ఈరోజు చేసారా?
మీ వ్యాయామం యొక్క లక్ష్యం ఏమిటి?
ü మీరు పనులు చేయటం ద్వారా మానసికంగా సంతోషంగా, మీతో మీరు
అర్థవంతంగా సమయం గడిపినట్లు ఉండే కార్యక్రమాలు ఏమిటి? వాటిని ఎంత తరచూ చేస్తునార్?
మీ హాబీస్ మీద సమయం పెడుతునారా?
ü మీ కుటుంబ సభ్యులకు క్వాలిటీ సమయాన్ని కేటాయించి
మనస్పూర్తిగా మాట్లాడుతునారా?
ఈ నాలుగు అంశాలు ఎంట్ర
ప్రెన్యూర్స్ లక్ష్యాల దిశలో మార్గంలోని ఆటంకాలను జయించడానికి సెల్ఫ్ మోటివేషన్
లేదా స్వయం ప్రేరణతో దూసుకెళ్ళడానికి దోహదం చేస్తాయి. మీరు ఈ అంశాలలో ఏ స్థాయిలో
ఉన్నారో గ్రహించండి సెల్ఫ్ టెస్ట్ ప్రశ్నలకు జవాబులు రాబట్టండి మీ స్వీయ ప్రేరణ
సంబంధించి స్పష్టత వస్తుంది. బెస్ట్ విషెస్ ఫర్ గ్రేట్ సక్సెస్.
*** *** *** సైకాలజీ టుడే, మార్చ్ 2017 లో ప్రచురించబడిన ఆర్టికల్ *** *** ***
No comments:
Post a Comment