ఎంట్రప్రెన్యూర్
గా జీవితం
మొదలుపెడితే అనేక అవకాశాలు, సవాళ్లు ఉంటాయి. బిజినెస్ చేసేవారికి, ఉద్యోగులకి
ఆలోచనా విధానాలలో కాస్త భేదం స్పష్టంగా కనిపిస్తుంది. ఎంట్ర
ప్రెన్యూర్ మౌలిక ఆలోచనలు, ఆచరణా విధానాలు జీవితంలోనే ఇతర పాత్రలు ఉన్నతంగా
పోషించడానికి కూడా ఉపయోగపడతాయి. ఎంట్ర ప్రెన్యూర్ వ్యక్తిగత
జీవితంలో కూడా ఉపయోగపడే నాలుగు కీలక అంశాలు చర్చించడానికే ఈ ఆర్టికల్.
*** ***
*** *** ***
***
1. సమయ పాలన – ప్రాధాన్యత క్రమం
ఎంట్ర ప్రెన్యూర్స్ మారిన
మరుక్షణమే మనం ఎక్కువ సమయం ఆ ప్రాజెక్ట్ / వెంచర్ అవసరాలకు తగినట్లు సమయం
కేటాయించాల్సి వస్తుంది. మరో పార్టనర్ తో లేదా కాపిటల్ ఎక్కువ ఉండి కొందరిని మీ
సంస్థలో సభ్యులుగా తీసుకుంటే తప్ప స్టార్ట్ అప్ లా మొదలైన వారికి అనేక అంశాలు ఒకే
సారి చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఎక్కువ సమయం ఫోకస్ గా వర్క్ చేయటం, ఎక్కువ
అంశాలను ఒక దానితో ఒకటి ముడి పది ఉన్న అంశాలను , వాటి ప్రాధాన్యతా క్రమంలో
పనిచేయటం, అనుకున్న టైం లైన్ ప్రకారం పని చేయటం అలవాటు అవుతుంది. వనరులు తక్కువ
ఉన్నప్పటికీ క్లైంట్ అడిగిన సమయానికి ప్రోడక్ట్ , సర్వీస్ అందించాలి కాబట్టి
వనరులను , సమయాన్ని ఉన్నతంగా వెచ్చించే లక్షణం వస్తుంది. వారు తమ వ్యక్తి గత
జీవితంలో కూడా తక్కువ సమయంలో చేయాల్సిన అనేక పనులను, విభిన్న పనులను ఉన్నతంగా
ముందుకు తీసుకెళతారు.
ఒక సంస్థ ,
బిజినెస్ పెట్టినప్పుడు కాపిటల్ ఎంత, ఒకే సారి పెట్టే ఖర్చులు ఎంత, నెల వారీ
ఖర్చులు ఎంత అని ఆలోచించినపుడు ప్రాజెక్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లాగానే వ్యక్తిగత
ఆర్ధిక ఆలోచనలు మొదలౌతాయి. డబ్బుని ఎలా ఖర్చు చేయాలి?, ఏ అంశాలకు ఎంత ఖర్చు
చేయాలి?, లిక్విడిటీ ఎంత ఉంచాలి?, భవిష్యత్తులో రాబోయే ఖర్చులు ఎంత?, నా వ్యాపారం
కొంత తక్కువ లాభాలను ఇచ్చినా ఇల్లు, పిల్లల అవసరాలకు ఎలాంటి ప్రణాళిక అవసరం అని
ఆలోచించటం మొదలెడతారు. అయితే వాటిని రాసుకుని , నెలవారీ ఖర్చులను మానిటర్
చేసుకుంటే అటు బిజినెస్ లో ఇటు వ్యక్తిగత జీవితంలో ఆర్థిక అంశాలు ఆరోగ్యంగా
మలచుకోగలం.
3. గెలుపు- గెలుపు సంధాన ఆలోచనలు
ఉద్యోగిగా
ఉన్నపుడు షాపింగ్ కి వెళ్లి ఏదైనా వస్తువు కొంటే ఆశించిన రేటులో రాకపోతే వెంటనే
బయటికి రావచ్చు లేదా కొన్నప్పుడు సైకలాజికల్
గా అడ్జస్ట్ కావచ్చు. కానీ ఎంట్ర ప్రెన్యూర్ గా మారినపుడు వారు అందించే వస్తువులు
, సేవలు నాకు ఎలా ఉపయోగ పడుతున్నాయి?, అందుకు వారు ఎంత రిస్క్ తీసుకుంటున్నారు?,
ఎంత మంది శ్రమిస్తే ఎండ్ ప్రోడక్ట్ మన చేతికి వచ్చింది?..... ఇలా ఆలోచించే లక్షణం
వస్తుంది. ఉన్నతంగా వస్తు, సేవలు అవసరాలను అర్థం చేసుకుంటారు. కస్టమర్లతో, వ్యాపార
భాగస్వాములతో మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులతో, ఇతరులతో “నేనే గెలవాలి” అనే స్వల్ప
ఆలోచన కాకుండా “ఇద్దరం గెలుద్దాం” అనే
సంధాన ఆలోచనలు ఆలోచిస్తారు. ఇదే మేనేజ్ మెంట్ లో
విన్ – విన్ నెగోషియేషన్ అంటారు.
4. అవసరమైన వ్యక్తిగా మారటం
“నేను ఇలానే
ఉంటాను మారను- నా ఆరోగ్యం మారాలి, నేను ఉలానే ఉంటాను మారను- నా కుటుంబ సభ్యుల
ప్రవర్తన / ఆఫీస్ లో పనిచేసే వారి ప్రవర్తన మారాలి”. ఇలా అనుకుంటే చివరకు మనమే
మారాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎంట్రప్రెన్యూర్ వ్యక్తి గత జీవితం క్రమశిక్షణలు ఆ
వ్యాపారంపై చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందుకే బిజినెస్ అవసరాలకు తగినట్లు మనిషి
తనను తాను మార్చుకుంటాడు. అదే ఫ్లెక్సిబిలిటీ. ఈ ప్రక్రియలో తన అస్తిత్వాన్ని
కోల్పోకుండా మార్పు జరిగితే అది వ్యాపార అవసరానికి తగిన ఆరోగ్యకరమైన మార్పు. ఒక
మార్పు కంటే ముందు, వ్యక్తిగా మారతాం. అలాగే వ్యక్తి గత జీవితంలో కూడా ఉన్నత భర్త
/ భార్య గా, తల్లి / తండ్రిగా , పిల్లలకి ఆదర్శ వ్యక్తిగా మారాలంటే ఎలా అనే ఆలోచన
ఎంట్రప్రెన్యూర్ కి వస్తుంది. ఆ ఫలితం పొందాలంటే దానికి తగిన వ్యక్తిగా మారగలిగే
శక్తి, ఫ్లెక్సిబిలిటీ ఎంట్ర ప్రెన్యూర్ కి ఉంటుంది.
ఈ నాలుగు అంశాలు ఎంట్ర
ప్రెన్యూర్స్ వ్యక్తిగత జీవితంలో కూడా కీలక ఫలితాలను సాధించగలవు. మనిషి ఒక నైపుణ్యం (స్కిల్) నేర్చుకుంటే మెదడు ఆ స్కిల్ అవసరం వచ్చిన ప్రతీసారి ప్రదర్శింప చేస్తుంది. అది
వ్యాపారం కావచ్చు, వ్యక్తిగత జీవితం కావచ్చు. ఇది అమ్మాయిలు వంట అమ్మ వారి ఇంటిలో
నేర్చుకున్నా, అత్త వారి ఇంట్లో కూడా చేయగలగటం లాంటిది. ఇంకెందుకు ఆలస్యం ఎంట్ర
ప్రెన్యూర్ అవ్వాలనే స్పష్టత మీలో ఉంటే
అడుగులు ముందుకు వేయండి, ఆల్రెడీ మీరు బిజినెస్ లో ఉంటే ఆ ఆలోచనా రీతులు వ్యక్తిగత
జీవితంలో ఎంత వరకు ఉపయోగిస్తునారో ఆలోచించుకోండి. బెస్ట్ విషెస్ ఫర్ గ్రేట్ బిజినెస్ అండ్ పర్సనల్ సక్సెస్.
*** *** *** సైకాలజీ టుడే, ఏప్రిల్ 2017 లో ప్రచురించబడిన ఆర్టికల్ *** *** ***
*** *** *** సైకాలజీ టుడే, ఏప్రిల్ 2017 లో ప్రచురించబడిన ఆర్టికల్ *** *** ***
No comments:
Post a Comment