Saturday, 22 October 2016

కంఫర్ట్ జోన్ సంకెళ్ళను వదిలించుకుని ఎంట్ర ప్రెన్యూర్ గా ఎలా ఎదగాలి ? [4 Strategies to Break Your Comfort zone to be a Successful Entrepreneur]

  1. Don't get trapped by belief patterns that are not supporting your entrepreneurial journey
  2. Take steps beyond your comfort zones based on nature of your entrepreneurial activity
  3. Make small changes in habits to enable your self enjoy the process and uncertainity
  4. Turn your fears into friends
రోజువారీ జీవితాన్ని ఒక మూస పద్దతిలో ఓకే విధానాలలో గడపదమనేది సాధారణ అంశం. మనమంతా “అలవాట్లు” తో బతికే జీవులం. ఉదయం నిద్ర లేచే సమయం నుంచి, ఏం బ్రేక్ ఫాస్ట్ తింటాము, ఏ సమయానికి పనులకు బయటికి వెళతాము, ఎవరిని ఎక్కువ కలుస్తాము, కుటుంబము, డబ్బు, జీవితము, భవిష్యత్తు అనే అంశాలపై ఏమి ఆలోచిస్తాము అనేది కూడా ఒకే పద్దతిలో నడుస్తుంటుంది. కానీ ఎంట్ర ప్రెన్యూర్ అవ్వాలనుకుంటే సేఫ్ గేమ్ ఆడేలా రిలాక్స్ గా పనులు చేసుకోవాలంటే, మన శక్తిని మనం సంపూర్ణంగా వినియోగించుకోనట్లే. కంఫర్ట్ జోన్, సెంటిమెంట్ సంకెళ్ళు వదిలితేనే ఆశయం దిశగా అడుగులు వేగంగా, నిర్మాణాత్మకంగా వేయగలం. ఈ ముఖ్యాంశాలు చర్చించడానికే మీకోసం ప్రత్యేకంగా ముందుకువచ్చింది ఈ ఆర్టికల్.
***    ***    ***    ***    ***    ***
రొటీన్ గా ఒకే పని చేసే వారికంటే, ఎప్పటికప్పుడు ఫ్రెష్ భావాలు, సవాళ్లు తీసుకుని ముందుకెళ్ళే వాళ్ళు ఎక్కువ సృజనాత్మకత, భావోద్వేగ స్థిరత్వం కలిగిఉంటారని శాస్త్రజ్ఞులు తేల్చి చెప్పారు. మనిషి తన రోజువారీ రొటీన్ కంఫర్ట్ (మాయ !) ప్రపంచంలో ఉండకుండా, ఆ బంధనాలను విచ్చిన్నం చేసుకుని కొత్త పద్దతులలో ఆలోచించడం, కొత్త విధానాలలో పనులు చేయడం అనేది వేగంగా, ఉన్నతంగా ఎదగడానికి తోడ్పడుతుంది. అయితే దానికి అర్థం స్థిరంగా పనిచేయకుండా పారిపోవడం కాదు, ఎప్పటి కప్పుడు లక్ష్యాలు మార్చుకుంటూ పోవటం అంతకన్నా కాదు. అనుకున్న ఉన్నత ఫలితాలను సాధించే ఉన్నత విధానాలు మనకు గతంలో లేకపోయినా ఇతరులను, సక్సెస్ సాధించిన వారిని చూసి నేర్చుకోగలగటం. మన ఫలితాలను బేరీజు వేసుకోవటం, కొత్తదనం ఎలా సృష్టించాలా అని సృజనాత్మకంగా ఆలోచించడం, కొత్త పద్దతులు ప్రయత్నించడం, కొత్త విదానంలో జీవితాన్ని చూడటం.
1. నమ్మకాల ఉచ్చులో చిక్కుకోకండి !

కొందరి ఇంటిముందు “కుక్క ఉంది జాగ్రత్త” అని బోర్డు పెడతారు. అదేవిధంగా జీవితంలో లేదా వ్యాపారంలో ఎదుగూ బొదుగూ లేనివారికి మేడలో కనిపించని ఒక బోర్డు వేలాడుతుంది, దాని పై ఇలా రాసిఉంటుంది. “నాకు కొన్ని నమ్మకాలు ఉన్నాయి జాగ్రత్త!”. ఏమిటండీ ....నవ్వు వస్తుందా? నిజమండీ ఈ ప్రపంచంలో మనుషులందరూ కొన్ని నమ్మకాలకు అమ్ముడైపోతారు. ఆ నమ్మకాలు ఉన్నతంగా ఉంటే ఎదుగుతారు లేదంటే నమ్మకాల స్థాయిలో ఉంటారు. ఒకతనికి ఈ నమకాలు ఉన్నాయనుకోండి:
  • కోటీశ్వరులు అంటే బాగా పొగరుతో ఉంటారు
  • డబ్బున్న వారు ఏదైనా చేసేయోచ్చు అనుకుంటారు
  • డబ్బు ద్వారా తన పనులు వక్ర మార్గంలో కూడా చేయించుకుంటాడు
  • పిల్లికి బిక్షం వేయరు, ఇంట్లో ఒక్కొక్కరు ఒక సెపరేట్ కార్ వాడతారు 
ఇలాంటి నమ్మకాలు ఉన్నవ్యక్తి కోటీశ్వరుడు అవ్వాలని అనుకోగానే ఒక నెగటివ్ నమ్మకం ప్రయత్నాన్ని ఆపేస్తుంది. నమ్మకాల ట్రైనింగ్ బలంగా ఉండటం వలన పనిలో పూర్తిగా నిమగ్నమవలేడు. అలాగే చాలామందికి బిజినెస్ గురించి నమ్మకాలు ఉంటాయి; తమకు బిజినెస్ అచ్చి రాదనీ, ఫలానా టైపు భాగస్వామ్య వ్యాపారం అంటే ఎప్పటికైనా మునిగి పోయేదే అనీ, తమ కుటుంబంలో డాక్టర్స్ ఉన్నారని, లేదా టీచర్స్ ఉన్నారని, లేదా ఎవరూ లేరు కాబట్టి వ్యాపారం తమకు రాదనీ, ఫలానా బిజినెస్ అందరికీ సూట్ అవ్వదని  అనేక అపోహలు పదే పదే వల్లే వేస్తారు. దీనిని ఇంకో భాషలో చెప్పాలంటే తమకు తాము ఒక నమ్మకాల శిక్షణ (బిలీఫ్ ట్రైనింగ్) ఇచ్చుకుంటారు. అందుకే బిజినెస్ గురించి మీ నమ్మకాలను మీరు అర్థం చేసుకోండి. ఉన్నతంగా నడిపిస్తున్నయా ? మీలో మరో గొంతు (అంతరంగం) మిమ్మల్ని బలంగా ముందుకు పోనివ్వని బంధనం వేస్తుందా?
2. కంఫర్ట్ లేని జోన్ కి దారేది !
అత్తారింటికి దారేది సినిమా టైటిల్ గుర్తొస్తుందా? మొదట కంఫర్ట్ జోన్ దాటి అలోచించి పనులు చేయాలి, అలా చేసే లక్షణాలు ఉన్న వ్యక్తులు మీ టీం లో భాగంగా ఉంచుకోవాలి, అభిప్రాయ భేదాలు వ్యత్యాసాలు మన ఉన్నతికే అని ఆలోచించగలిగే ఆలోచన ఉండాలి. అలా భిన్నంగా  (అలవాటుగా చేసేవి కాకుండా కొత్తగా..) చేసే  పనులు రెగ్యులర్ గా చేయడం ద్వారా, చివరికి మీరు భిన్నంగా చేసే  అలవాటు నేర్చుకుంటారు. కంఫర్ట్ జోన్ దాటి పని చేయటంలో కంఫర్ట్ ఫీల్ అవడం అన్నమాట. ఉదయం మీకు బ్రషింగ్ కుడి చేతో చేసే అలవాటు ఉంటె బ్రష్ ఎడమ చేతితో పట్టుకుని చుడండి, భిన్నంగా ఉంటుంది, వింతగా ఉంటుంది , కంఫర్ట్ అనిపించదు. మూడు వారాలు ట్రై చేయండి. మీకొక కాన్ఫిడెన్సు వస్తుంది. ఇంకా అలాంటి భిన్న మైన పనులు చేయాలని ఆలోచిస్తారు.   
3. చిన్న అలవాట్లు – భిన్న అలవాట్లు ! 
ఒక అంశం మీద అలవాటు అంటే అనేక సార్లు విన్నా , చూసినా, అనుభవం పొందినా (రిపీట్ చేస్తే) అది సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్లి పోతుంది. అందుకే మీ కంఫర్ట్ జోన్ లోంచి ఒక్క రోజులో ఈ ఆర్టికల్ చదవగానే మీ పాత అలవాట్లు కిటికీలోంచి మూటకట్టి పారేసేయాలని చెప్పటం లేదు. చిన్నగా మొదలుపెట్టండి కొత్త మార్గంలో ఆఫీస్ కి వెళ్ళటం, కొత్త రుచి చూడటం, చిన్నప్పటి  ఫ్రెండ్స్ కి ఫోన్ చేయడం, మొక్కలకి నీళ్ళు పోసే బాధ్యత తీసుకోవడం, మీ వర్క్ స్టేషన్ ప్లేస్ లేదా డైరెక్షన్ మార్చుకోవడం. ఇలా నా తమ్ముడు అనిల్ ఇంట్లో ఆఫీస్ లో ఫర్నిచర్ దిశలు మారిస్తే మేమంతా కొత్తదనం ఫీల్ అవటం కళ్ళారా చూసాను. ఇలాంటి చిన్న  భిన్న విధానాలు చేయటం వలన భిన్నంగా ఉండటం కూడా అలవాటు అయిపోతుంది.  
4. భయాలు తో స్నేహమే సాహసం   
సర్కస్ లో జైంట్ వీల్ ఎక్కమంటే కొందరు వామ్మో అని భయపడతారు. మరొకరు వావ్ అక్కడ నుంచి కిందున్న వాళ్ళందరిని చూడొచ్చు గాలిలో తీలియాడుతూ పక్షిలా కిందికి వస్తున్న ఫీలింగ్ ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు. ఇద్దరు చూసింది ఒకటే వాస్తవం (జైంట్ వీల్) కాని వారు అంతర్లీనం చేసుకున్న విధానం వేరు. అలాగే భయాలు, కుటుంబ అలవాట్లు, సెంటిమెంట్లు దాటి బిజినెస్ ఒక సవాలుగా స్వీకరించాలి, మిమ్మల్ని ఉన్నతంగా నడిపే సాహసాలుగా అర్థం చేసుకోవాలి. అలాగే మీరు కంఫర్ట్ జోన్ ఎందుకు దాటుతున్నారో, ఇబ్బందిగా ఉన్నా ఖచ్చితంగా చేయాల్సిందే అని ఎందుకు ఫీల్ అవుతున్నారో స్పష్టత ఉండాలి. సరైన కారణాలు మిమ్మల్ని మీ ప్రయత్నాన్ని నిరంతరం సపోర్ట్ చేస్తాయి.  
ఎక్సర్ సైజ్ : కంఫర్ట్ జోన్  దాటి ఎంట్ర ప్రెన్యూర్ గా ఎదగడానికి ఇలా చేయండి:
  1. మీకు ఉన్న ఒక మామూలు స్థాయి భయాన్ని ఎదుర్కొండి . మీటింగ్ లో మాట్లాడటం కావొచ్చు, ప్రమోషన్ అడగడం కావొచ్చు, మీకు తెలియని కొత్త వ్యక్తులను పరిచయం చేసుకోవటం కావొచ్చు.
  2. రూజ్ వెల్ట్ మహాశయుడు అన్నట్లు ప్రతిరోజు మీకు భయంగా అనిపించే  ఒక పని చేయండి. ఇది మీ మైండ్ ప్రోగ్రామింగ్ ని గొప్పగా ప్రభావితం చేసి మిమ్మల్ని శక్తివంతులను చేయగలదు
  3. చాలా మంది జాబు మానేసి వాళ్ళకు నచ్చిన వ్యాపారం లోకి రావాలని సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉంటారు. అనేక పరిస్థితులు తమను గట్టిగా గెంతి వేసే వరకు వెయిట్ చేసి అప్పుడు మానేస్తారు. అలా కాకుండా ఒక గోల్ తో ప్రణాలికా బద్దంగా అలోచించి నిర్ణయం తీసుకోవాలి. డబ్బు, సమయం, నిర్ణయం ప్రభావం తమ మీద , కుటుంబం మీద ఎలా ఉంటుంది అలోచించి వేగంగా పావులు కదపాలి.
  4. మీ నమ్మకాల లిస్టు రాసుకోండి. ఒక ఎంట్ర ప్రెన్యూర్ గా మీరు ఏమి ఆలోచిస్తున్నారు, ఎదిగిన వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ జీవితం మీద, కుటుంబం మీద, భవిష్యత్తు మీద స్థిరంగా ఉన్న అభిప్రాయాలు ఏమిటి, అవి ఉన్నతంగా ఎదగడానికి ఉపయోగపడుతున్నాయా? బిలీఫ్  ట్రైనింగ్ బాగా లేదేమో అని డౌట్ వస్తే ఉన్నత మైన పాజిటివ్ అఫిర్మేషన్స్ / డిక్లరేశన్స్ రాసుకోండి. రోజు ఉదయం నిద్ర లేవగానే ఆ అఫిర్మేషన్స్ చదవండి.
  5. మీ ఆఫీస్ వాతా వరణం, రోజు మీరు కలిసే వ్యక్తులు, మీరు కనిపించే లుక్స్, మీ డ్రెసింగ్ విధానం కాస్త భిన్నంగా మార్చుకోండి. ఒక సూపర్ స్టార్ పోజ్ లో ఫోటో దిగి మిమ్మల్ని మీరు చూసుకోండి. చూడటానికి సినిమా డైలాగ్ లా ఉందా? కాని మిమ్మల్ని మీరు ఉన్నతంగా ఫీల్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్సు పెరుగుతుంది.
  6. టిమ్ ఫెర్రిస్ అనే రచయిత అన్నట్లు ఒక వ్యక్తి విజయం ఎన్ని భిన్న మైన, కంఫర్ట్ లేని  సంభాషణలు మనస్పూర్తిగా ప్రేమగా చేయగలడు అనే దానిపై ఆధార పది ఉంటుందంట. అంటే నాకు నచ్చినట్లే ఉండాలి అని కాకుండా భిన్న విధానాలు , పద్దతులు ద్వారా ముందుకు వెళ్ళే లక్షణం మిమ్మల్ని మీరు ఫ్లెక్సిబుల్ గా మార్చుకునే లక్షణం అలవాటు చేసుకోండి.
***  ***  ***  సైకాలజీ టుడే, అక్టోబర్  2016 లో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  ***

1 comment: