మిమ్మల్ని ఎంట్ర ప్రెన్యూర్ గా విజేతను చేసే 5 ఆలోచనలు
హెన్రీ ఫోర్డ్
నుంచి బిల్ గేట్స్ వరకు...రామోజీరావు నుంచి నారాయణ మూర్తి వరకు...ఎందరో ప్రముఖులు
పాటించిన, పాటిస్తున్న ఈ ఆలోచనా విధానాలు మీకు గొప్ప ఫలితాలు ఇచ్చి మీ బిజినెస్
ఎక్స్ లెన్స్ కి దోహద పడతాయి. మీరు స్టార్ట్ అప్ మానియా లో ఉన్నా... ఆల్రెడీ
స్టార్ట్ చేసి స్టాండ్ అప్ పోజిషన్ లో ఉన్నా బిజినెస్ మాగ్నెట్ అవ్వాలంటే ఏమి
చేయాలి? విజయవంత మైన ఎంట్రప్రెన్యూర్ గా ఎదగాలంటే ఎలా ఆలోచించాలి? ఏమి
నేర్చుకోవాలి? ఈ కీలక విషయాలు చర్చించడానికే ఈ ఆర్టికల్. ఇంకెందుకు ఆలస్యం ఆ ఆలోచనలు తెలుసుకొని ఎంట్రప్రెన్యూర్ గా విజయం
వైపు అడుగులు వేయండి.
*** ***
*** *** ***
***
సోపానం
1: బిజినెస్ ఒకే ఒక్క ఛాన్స్ అనుకోవద్దు
కొత్త బిజినెస్ మొదలు పెట్టాలన్నా
, ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలన్నా “ సరైన ఐడియా” తెలుసుకోవడం ఎలా అనేది మిలియన్
డాలర్ ప్రశ్న. మీకొచ్చే ఒక్కొక్క ఐడియా కూడా మిలియన్ డాలర్ లు అందించేవే
అయ్యుండొచ్చు. కానీ ఒక ఐడియా మీ
జీవితాన్ని పూర్తిగా తన చేతిలోకి తీసుకుంటుంది. డబ్బుకంటే, ఇతర వనరుల కంటే
ముందుగా సమయాన్ని అంటే మీ జీవితాన్నే పెట్టుబడిగా పెడతారన్న మాట. కొన్ని లక్షల
బిజినెస్ ఐడియా లు ఉంటాయి, మీకు కూడా వ్యాపారాత్మక దృష్టిలో ప్రపంచాన్ని చూడటం
మొదలు పెట్టాక అనేక ఆలోచనలు వస్తాయి. కంగారు పడొద్దు, తొందరవద్దు, మీరు వెంటనే
దూకకపోతే ఎదో ఆఖరి పడవ వెళ్లి పోతుందేమో అనుకోకండి, అలాగే ఒకసారి గతంలో దూకుడుగా
వ్యాపార ప్రయత్నం చేసి ఆశించిన ఫలితం సాధించలేకపోయారని ఇక వ్యాపార ఆలోచనే పాపం అని
ఒక అభిప్రాయానికి రాకండి.
బిజినెస్ లో రాణించాలంటే
తెలుసుకోవాల్సిన ప్రాధమిక అంశం ఏంటంటే బిజినెస్ ఐడియా లేదా వ్యాపార ప్రయత్నం అనేది
జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం
అనుకోవద్దు. ఒక అవకాశం మిస్ అయితే ఒక బిజినెస్ పాఠం నేర్చుకుంటూ ప్రజల అవసరాలకు
తగిన ప్రోడక్ట్ , సేవలు ద్వారా
వ్యాపారాన్ని కొనసాగించే లక్షణం ఉండాలి. ఒక సారి ఫెయిల్ అయితే మళ్ళీ ప్రయత్నం
చేయండి. ప్రపంచంలో సక్సెస్ అయిన ప్రతి ఒక్క ఎంట్ర ప్రెన్యూర్ మొదట్లో ఫెయిల్యూర్
రుచి చూసిన వారే. మీకు తెలుసా బిల్ గేట్స్ తన సహచరుడు పాల్ అలెన్ తో కలిసి మైక్రో సాఫ్ట్
కంటే ముందు “ట్రాఫ్- ఓ- డేటా” అనే కంపెనీ నిర్మించే ప్రయత్నం చేసారు, ఫోర్డ్
కంపెనీ నిర్మించిన హెన్రీ ఫోర్డ్ తొలి నాళ్లలో చేసిన ప్రయత్నాలు అన్నీ ఫెయిల్
అయ్యాయి ఐదు సార్లు జీరో స్థితికి వచ్చాడు. అయినా ఎదిగారు. ఇలాంటి సక్సెస్ స్టొరీ
లు ఎన్నో ఉన్నాయి అందుకే బిజినెస్ అనేది కేవలం లైఫ్ లో ఒకే ఒక్క ఛాన్స్ అనుకోకండి.
సోపానం
2: అభిరుచి కంటే ఎక్కువ కుతూహలంతో
నేర్చుకోండి
వ్యాపారాన్ని నిర్మించాలన్న
ఉద్దేశం కేవలం అభిరుచి (passion) ఉంటే సరిపోదు.
అభిరుచి మాత్రమే ఉంటే అది కాస్త ఒత్తిడి ని సృష్టిస్తుంది, దాని స్థానంలో
నేర్చుకోవాలన్న కుతూహలం కావాలి. కుతూహలం స్వేచ్చగా విషయాలను నేర్చుకునేందుకు ఉపయోగ
పడుతుంది. ఆ విధంగా ఆలోచించడం మొదలుపెట్టాక మీరు ప్రజలను కేవలం కలవడం ఇష్టం
కాబట్టి కలవరు, “ఇంకా నేను ఎక్కువ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను,
నేర్చుకోవాలనుకున్తున్నాను, ఇంకా మెరుగ్గా సోలుషన్స్ సృష్టించడానికి సంసిద్దంగా
ఉన్నాను” అన్న ఉద్దేశంతో మాట్లాడతారు. ఆ దృక్కోణంలో పనిచేయడం
మొదలు పెడతారు. ఎంట్ర ప్రెన్యూర్ కి కుతూహలం ఆక్సిజన్ వంటిది.
మీగురించి మీరు సృజన జీవులు
అనుకున్నా అనుకోకపోయినా సృజనాత్మకత (క్రియేటివిటీ) మీ జన్మ హక్కు. ఒక ఎంట్ర
ప్రెన్యూర్ గా ఉండడం అనేది అంతర్గతంగా ఒక సృజనాత్మక విధానం, క్రియేటివ్ ప్రాసెస్.
మీకు ఎంత క్రియేటివ్ గా ఉండాలని నిబద్దత ఉంటుందో అంత మంచి, సృజనాత్మక ఆలోచనల
ద్వారా మీ వ్యాపారాన్ని నిర్మించగలరు. మీకంటూ ఒక గుర్తింపు , కస్టమర్స్ నుంచి
అంగీకారం (acceptance) లభిస్తాయి. ప్రతిరోజు మీ
పని మొదలు పెట్టేముందు ఖచ్చితంగా ఈ క్రియేటివ్ ప్రాసెస్ ని మీలో అంతర్లీనం చేసే
ఎక్సర్ సైజే చేయండి. అందుకు మీతో మీరు పనులు మొదలు పెట్టేముందు ఆటో సజెషన్
ఇచ్చుకోండి:“ నేను నా సృజనాత్మకతను గౌరవిస్తూ, దానిని పూర్తి స్థాయిలో
వినియోగించుకుంటా నని మాట ఇష్తున్నాను” ఒక కొత్త ఐడియా వచ్చినపుడు మీకు భయం
వేయడం కూడా చాలా సాధారణంగా జరిగే అంశం అందుకే సృజనాత్మకత , భయం పక్క పక్కనే
ఉంటాయి. మీరు ఎంత వేగంగా ఫెయిల్యూర్, భయాలను కాన్షియస్ గా అలవాటు పడతారో, అంత వేగంగా విజయం పొందగలరు.
అందుకే ఈ రెండు మీ గమ్యంలో అడ్డంకులు కాదు, అవి మీ ఎంట్రప్రెన్యూర్ జర్నీ లో భాగస్వాములని గుర్తించండి. వాటిని మీ
ఎదుగుదలకు ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోండి.
సోపానం
4: తెరచిన పుస్తకంలాంటి మనసు
గెలిపిస్తుంది
చెప్పిన విషయాలు వినడానికి,
తెలియని విషయాలు నేర్చుకోడానికి, భిన్న దృక్పథాన్ని అర్థం చేసుకోడానికి ఎవరు సంసిద్దంగా
ఉంటారో వారే ఉన్నతంగా వ్యాపారాలు నిర్మించగలరు. జీవితమైనా, వ్యాపారం అయినా తెరచిన
పుస్తకంలా, ఓపెన్ నెస్ తో ఉన్న వారికి కొత్త ఐడియా లు ఎక్కువ వస్తాయి, వచ్చిన
ఐడియా ని వ్యాపారానికి వినియోగించుకోగలరు. ఓపెన్ గా ఉండడటం అంటే సామాజిక
మాధ్యమాలలో మీ లైఫ్ స్టైల్ గురించి షేర్ చేసుకోవటం కాదు, వ్యాపారాత్మక అంశాలలో
వేర్వేరి స్టేక్ హోల్డర్స్ నుంచి, కస్టమర్స్ నుంచి , అనుభవం నుంచి విషయాలు
నేర్చుకునే లక్షణం. ధ్యానం (మెడిటేషన్) వలన సృజనాత్మకత (క్రియేటివిటీ) బాగా
పెరుగుతుందని శాస్త్రీయంగా నిరూపించబడింది, నా అనుభవంలో కూడా గొప్ప మార్పులను
చూసాను. మెడిటేషన్ మనస్సుని ప్రశాంత పరిచి ఒక నిర్మలమైన ఉన్నత స్థితిని ఖాళీని
(స్పేస్ అఫ్ పాజిబిలిటీస్) సృష్టిస్తుంది. అప్పుడు మనిషి కొత్త విషయాలను ఎక్కువ
రిసీవ్ చేసుకోగలదు. కంటెంట్ ఉంచాలంటే కంటైనర్ ఖాళీగా ఉండటం చాలా ముఖ్యం కదా.
ప్రాచీన విద్య అందించే విషయాలలో పాత్ర శుద్ధి అనే అంశం లాంటిదన్న మాట. అందుకే
నేర్చుకోడానికి, రిస్క్ తీసుకోడానికి, వినడానికి రెడీగా ఉండండి.
సోపానం
5: మీ శరీరం, మైండ్, అంతర్గత సంభాషణ
వినండి
మీ మనస్సు , శరీరం – ఈ రెండూ
జీవితంలో మీరు చేసే అనేక పనులకు, ఆలోచనలకూ, భావోద్వేగాలకు ఒక బాలన్స్ తో ప్రతిస్పందిస్తాయి.
అందుకే మీ వ్యాపారం, ఒక ప్రాజెక్ట్, ఒక బిజినెస్ ఐడియా, ఒక వ్యాపార విధానం గురించి
ఆలోచన చేసేటప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. వేర్వేరు సందర్భాలలో మీ
ఆలోచనలు, శరీర ప్రతిస్పందనలు కాన్షియస్ గా గమనించగలరు. కాస్త మైండ్ ఫుల్ మూమెంట్
నేర్చుకుంటే ఇది అసాధ్యం ఏం కాదు. నిబద్దత ఉంటే నేర్చుకోవచ్చు. అప్పుడు మీ మనస్సు,
శరీరం, మీ గట్ ఫీలింగ్, అంతరాత్మ ఏమి చెప్తుంది వినండి. కొందరికి ప్రాజెక్ట్
గురించి అలోచించగానే ఒంటి మీద రోమాలు నిక్క బొడుచుకుంటాయి (goose bumps) , కొందరికి ఒక ఎనర్జీ తో శరీరం నిండి పోతుంది. ఇంకొందరికి
భయం వేస్తుంది, కొందరు ఛాలెంజింగ్ ఫీల్ అవుతారు. మిమ్మల్ని ఒక వ్యక్తిగా కంటే
గొప్పగా ముందుకు నడిపే ఐడియా ని ఎన్నుకోండి. అంటే మీ బిజినెస్ ఐడియా మీద పనిచేస్తున్నా
అనే ఆలోచనే మిమ్మల్ని మరింత ఉత్సాహంతో నడిపించేలా, కొన్ని ఎందరి జీవితాల్లోనో అవసరాలను
తీర్చే సోలుషన్స్ ఇవ్వబోతున్నమన్న ఆలోచన మీకు గొప్ప శక్తిని ఇవ్వాలి. అలాంటి
శక్తిని నింపే బిగ్ ఐడియాలు, గొప్ప
ఆలోచనలు , మీ మనసు బలంగా చెప్పే అంశాలు గుర్తించండి.
అర్థమైంది కదూ మళ్ళీ
ప్రయత్నించడం, కుతూహలంతో పనిచేయడం, సృజనాత్మకత జోడించడం, భిన్న విషయాలు స్వీకరించగల
ఓపిక, మీ అంతర్గత శక్తిని మిమ్మల్ని నడిపించే శక్తిని వెలికితీసే విధంగా ఉండే
గొప్ప ఐడియాలతో , అద్భుత వ్యాపారాలు నిర్మించండి. ప్రజల అవసరాలను తీర్చే దిశలో ఈ
ఐదు మౌలిక ఆలోచనా విధానాలు ద్వారా విజయవంతమైన ఎంట్రప్రెన్యూర్ గా ఎదగండి.
*** *** *** సైకాలజీ టుడే, మే 2016 లో ప్రచురించబడిన ఆర్టికల్ *** *** ***
No words to express sir great message
ReplyDeleteThank you dear Pavan :)
Delete