Saturday, 22 October 2016

కంఫర్ట్ జోన్ సంకెళ్ళను వదిలించుకుని ఎంట్ర ప్రెన్యూర్ గా ఎలా ఎదగాలి ? [4 Strategies to Break Your Comfort zone to be a Successful Entrepreneur]

  1. Don't get trapped by belief patterns that are not supporting your entrepreneurial journey
  2. Take steps beyond your comfort zones based on nature of your entrepreneurial activity
  3. Make small changes in habits to enable your self enjoy the process and uncertainity
  4. Turn your fears into friends
రోజువారీ జీవితాన్ని ఒక మూస పద్దతిలో ఓకే విధానాలలో గడపదమనేది సాధారణ అంశం. మనమంతా “అలవాట్లు” తో బతికే జీవులం. ఉదయం నిద్ర లేచే సమయం నుంచి, ఏం బ్రేక్ ఫాస్ట్ తింటాము, ఏ సమయానికి పనులకు బయటికి వెళతాము, ఎవరిని ఎక్కువ కలుస్తాము, కుటుంబము, డబ్బు, జీవితము, భవిష్యత్తు అనే అంశాలపై ఏమి ఆలోచిస్తాము అనేది కూడా ఒకే పద్దతిలో నడుస్తుంటుంది. కానీ ఎంట్ర ప్రెన్యూర్ అవ్వాలనుకుంటే సేఫ్ గేమ్ ఆడేలా రిలాక్స్ గా పనులు చేసుకోవాలంటే, మన శక్తిని మనం సంపూర్ణంగా వినియోగించుకోనట్లే. కంఫర్ట్ జోన్, సెంటిమెంట్ సంకెళ్ళు వదిలితేనే ఆశయం దిశగా అడుగులు వేగంగా, నిర్మాణాత్మకంగా వేయగలం. ఈ ముఖ్యాంశాలు చర్చించడానికే మీకోసం ప్రత్యేకంగా ముందుకువచ్చింది ఈ ఆర్టికల్.
***    ***    ***    ***    ***    ***
రొటీన్ గా ఒకే పని చేసే వారికంటే, ఎప్పటికప్పుడు ఫ్రెష్ భావాలు, సవాళ్లు తీసుకుని ముందుకెళ్ళే వాళ్ళు ఎక్కువ సృజనాత్మకత, భావోద్వేగ స్థిరత్వం కలిగిఉంటారని శాస్త్రజ్ఞులు తేల్చి చెప్పారు. మనిషి తన రోజువారీ రొటీన్ కంఫర్ట్ (మాయ !) ప్రపంచంలో ఉండకుండా, ఆ బంధనాలను విచ్చిన్నం చేసుకుని కొత్త పద్దతులలో ఆలోచించడం, కొత్త విధానాలలో పనులు చేయడం అనేది వేగంగా, ఉన్నతంగా ఎదగడానికి తోడ్పడుతుంది. అయితే దానికి అర్థం స్థిరంగా పనిచేయకుండా పారిపోవడం కాదు, ఎప్పటి కప్పుడు లక్ష్యాలు మార్చుకుంటూ పోవటం అంతకన్నా కాదు. అనుకున్న ఉన్నత ఫలితాలను సాధించే ఉన్నత విధానాలు మనకు గతంలో లేకపోయినా ఇతరులను, సక్సెస్ సాధించిన వారిని చూసి నేర్చుకోగలగటం. మన ఫలితాలను బేరీజు వేసుకోవటం, కొత్తదనం ఎలా సృష్టించాలా అని సృజనాత్మకంగా ఆలోచించడం, కొత్త పద్దతులు ప్రయత్నించడం, కొత్త విదానంలో జీవితాన్ని చూడటం.
1. నమ్మకాల ఉచ్చులో చిక్కుకోకండి !

కొందరి ఇంటిముందు “కుక్క ఉంది జాగ్రత్త” అని బోర్డు పెడతారు. అదేవిధంగా జీవితంలో లేదా వ్యాపారంలో ఎదుగూ బొదుగూ లేనివారికి మేడలో కనిపించని ఒక బోర్డు వేలాడుతుంది, దాని పై ఇలా రాసిఉంటుంది. “నాకు కొన్ని నమ్మకాలు ఉన్నాయి జాగ్రత్త!”. ఏమిటండీ ....నవ్వు వస్తుందా? నిజమండీ ఈ ప్రపంచంలో మనుషులందరూ కొన్ని నమ్మకాలకు అమ్ముడైపోతారు. ఆ నమ్మకాలు ఉన్నతంగా ఉంటే ఎదుగుతారు లేదంటే నమ్మకాల స్థాయిలో ఉంటారు. ఒకతనికి ఈ నమకాలు ఉన్నాయనుకోండి:
  • కోటీశ్వరులు అంటే బాగా పొగరుతో ఉంటారు
  • డబ్బున్న వారు ఏదైనా చేసేయోచ్చు అనుకుంటారు
  • డబ్బు ద్వారా తన పనులు వక్ర మార్గంలో కూడా చేయించుకుంటాడు
  • పిల్లికి బిక్షం వేయరు, ఇంట్లో ఒక్కొక్కరు ఒక సెపరేట్ కార్ వాడతారు 
ఇలాంటి నమ్మకాలు ఉన్నవ్యక్తి కోటీశ్వరుడు అవ్వాలని అనుకోగానే ఒక నెగటివ్ నమ్మకం ప్రయత్నాన్ని ఆపేస్తుంది. నమ్మకాల ట్రైనింగ్ బలంగా ఉండటం వలన పనిలో పూర్తిగా నిమగ్నమవలేడు. అలాగే చాలామందికి బిజినెస్ గురించి నమ్మకాలు ఉంటాయి; తమకు బిజినెస్ అచ్చి రాదనీ, ఫలానా టైపు భాగస్వామ్య వ్యాపారం అంటే ఎప్పటికైనా మునిగి పోయేదే అనీ, తమ కుటుంబంలో డాక్టర్స్ ఉన్నారని, లేదా టీచర్స్ ఉన్నారని, లేదా ఎవరూ లేరు కాబట్టి వ్యాపారం తమకు రాదనీ, ఫలానా బిజినెస్ అందరికీ సూట్ అవ్వదని  అనేక అపోహలు పదే పదే వల్లే వేస్తారు. దీనిని ఇంకో భాషలో చెప్పాలంటే తమకు తాము ఒక నమ్మకాల శిక్షణ (బిలీఫ్ ట్రైనింగ్) ఇచ్చుకుంటారు. అందుకే బిజినెస్ గురించి మీ నమ్మకాలను మీరు అర్థం చేసుకోండి. ఉన్నతంగా నడిపిస్తున్నయా ? మీలో మరో గొంతు (అంతరంగం) మిమ్మల్ని బలంగా ముందుకు పోనివ్వని బంధనం వేస్తుందా?
2. కంఫర్ట్ లేని జోన్ కి దారేది !
అత్తారింటికి దారేది సినిమా టైటిల్ గుర్తొస్తుందా? మొదట కంఫర్ట్ జోన్ దాటి అలోచించి పనులు చేయాలి, అలా చేసే లక్షణాలు ఉన్న వ్యక్తులు మీ టీం లో భాగంగా ఉంచుకోవాలి, అభిప్రాయ భేదాలు వ్యత్యాసాలు మన ఉన్నతికే అని ఆలోచించగలిగే ఆలోచన ఉండాలి. అలా భిన్నంగా  (అలవాటుగా చేసేవి కాకుండా కొత్తగా..) చేసే  పనులు రెగ్యులర్ గా చేయడం ద్వారా, చివరికి మీరు భిన్నంగా చేసే  అలవాటు నేర్చుకుంటారు. కంఫర్ట్ జోన్ దాటి పని చేయటంలో కంఫర్ట్ ఫీల్ అవడం అన్నమాట. ఉదయం మీకు బ్రషింగ్ కుడి చేతో చేసే అలవాటు ఉంటె బ్రష్ ఎడమ చేతితో పట్టుకుని చుడండి, భిన్నంగా ఉంటుంది, వింతగా ఉంటుంది , కంఫర్ట్ అనిపించదు. మూడు వారాలు ట్రై చేయండి. మీకొక కాన్ఫిడెన్సు వస్తుంది. ఇంకా అలాంటి భిన్న మైన పనులు చేయాలని ఆలోచిస్తారు.   
3. చిన్న అలవాట్లు – భిన్న అలవాట్లు ! 
ఒక అంశం మీద అలవాటు అంటే అనేక సార్లు విన్నా , చూసినా, అనుభవం పొందినా (రిపీట్ చేస్తే) అది సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్లి పోతుంది. అందుకే మీ కంఫర్ట్ జోన్ లోంచి ఒక్క రోజులో ఈ ఆర్టికల్ చదవగానే మీ పాత అలవాట్లు కిటికీలోంచి మూటకట్టి పారేసేయాలని చెప్పటం లేదు. చిన్నగా మొదలుపెట్టండి కొత్త మార్గంలో ఆఫీస్ కి వెళ్ళటం, కొత్త రుచి చూడటం, చిన్నప్పటి  ఫ్రెండ్స్ కి ఫోన్ చేయడం, మొక్కలకి నీళ్ళు పోసే బాధ్యత తీసుకోవడం, మీ వర్క్ స్టేషన్ ప్లేస్ లేదా డైరెక్షన్ మార్చుకోవడం. ఇలా నా తమ్ముడు అనిల్ ఇంట్లో ఆఫీస్ లో ఫర్నిచర్ దిశలు మారిస్తే మేమంతా కొత్తదనం ఫీల్ అవటం కళ్ళారా చూసాను. ఇలాంటి చిన్న  భిన్న విధానాలు చేయటం వలన భిన్నంగా ఉండటం కూడా అలవాటు అయిపోతుంది.  
4. భయాలు తో స్నేహమే సాహసం   
సర్కస్ లో జైంట్ వీల్ ఎక్కమంటే కొందరు వామ్మో అని భయపడతారు. మరొకరు వావ్ అక్కడ నుంచి కిందున్న వాళ్ళందరిని చూడొచ్చు గాలిలో తీలియాడుతూ పక్షిలా కిందికి వస్తున్న ఫీలింగ్ ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు. ఇద్దరు చూసింది ఒకటే వాస్తవం (జైంట్ వీల్) కాని వారు అంతర్లీనం చేసుకున్న విధానం వేరు. అలాగే భయాలు, కుటుంబ అలవాట్లు, సెంటిమెంట్లు దాటి బిజినెస్ ఒక సవాలుగా స్వీకరించాలి, మిమ్మల్ని ఉన్నతంగా నడిపే సాహసాలుగా అర్థం చేసుకోవాలి. అలాగే మీరు కంఫర్ట్ జోన్ ఎందుకు దాటుతున్నారో, ఇబ్బందిగా ఉన్నా ఖచ్చితంగా చేయాల్సిందే అని ఎందుకు ఫీల్ అవుతున్నారో స్పష్టత ఉండాలి. సరైన కారణాలు మిమ్మల్ని మీ ప్రయత్నాన్ని నిరంతరం సపోర్ట్ చేస్తాయి.  
ఎక్సర్ సైజ్ : కంఫర్ట్ జోన్  దాటి ఎంట్ర ప్రెన్యూర్ గా ఎదగడానికి ఇలా చేయండి:
  1. మీకు ఉన్న ఒక మామూలు స్థాయి భయాన్ని ఎదుర్కొండి . మీటింగ్ లో మాట్లాడటం కావొచ్చు, ప్రమోషన్ అడగడం కావొచ్చు, మీకు తెలియని కొత్త వ్యక్తులను పరిచయం చేసుకోవటం కావొచ్చు.
  2. రూజ్ వెల్ట్ మహాశయుడు అన్నట్లు ప్రతిరోజు మీకు భయంగా అనిపించే  ఒక పని చేయండి. ఇది మీ మైండ్ ప్రోగ్రామింగ్ ని గొప్పగా ప్రభావితం చేసి మిమ్మల్ని శక్తివంతులను చేయగలదు
  3. చాలా మంది జాబు మానేసి వాళ్ళకు నచ్చిన వ్యాపారం లోకి రావాలని సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉంటారు. అనేక పరిస్థితులు తమను గట్టిగా గెంతి వేసే వరకు వెయిట్ చేసి అప్పుడు మానేస్తారు. అలా కాకుండా ఒక గోల్ తో ప్రణాలికా బద్దంగా అలోచించి నిర్ణయం తీసుకోవాలి. డబ్బు, సమయం, నిర్ణయం ప్రభావం తమ మీద , కుటుంబం మీద ఎలా ఉంటుంది అలోచించి వేగంగా పావులు కదపాలి.
  4. మీ నమ్మకాల లిస్టు రాసుకోండి. ఒక ఎంట్ర ప్రెన్యూర్ గా మీరు ఏమి ఆలోచిస్తున్నారు, ఎదిగిన వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ జీవితం మీద, కుటుంబం మీద, భవిష్యత్తు మీద స్థిరంగా ఉన్న అభిప్రాయాలు ఏమిటి, అవి ఉన్నతంగా ఎదగడానికి ఉపయోగపడుతున్నాయా? బిలీఫ్  ట్రైనింగ్ బాగా లేదేమో అని డౌట్ వస్తే ఉన్నత మైన పాజిటివ్ అఫిర్మేషన్స్ / డిక్లరేశన్స్ రాసుకోండి. రోజు ఉదయం నిద్ర లేవగానే ఆ అఫిర్మేషన్స్ చదవండి.
  5. మీ ఆఫీస్ వాతా వరణం, రోజు మీరు కలిసే వ్యక్తులు, మీరు కనిపించే లుక్స్, మీ డ్రెసింగ్ విధానం కాస్త భిన్నంగా మార్చుకోండి. ఒక సూపర్ స్టార్ పోజ్ లో ఫోటో దిగి మిమ్మల్ని మీరు చూసుకోండి. చూడటానికి సినిమా డైలాగ్ లా ఉందా? కాని మిమ్మల్ని మీరు ఉన్నతంగా ఫీల్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్సు పెరుగుతుంది.
  6. టిమ్ ఫెర్రిస్ అనే రచయిత అన్నట్లు ఒక వ్యక్తి విజయం ఎన్ని భిన్న మైన, కంఫర్ట్ లేని  సంభాషణలు మనస్పూర్తిగా ప్రేమగా చేయగలడు అనే దానిపై ఆధార పది ఉంటుందంట. అంటే నాకు నచ్చినట్లే ఉండాలి అని కాకుండా భిన్న విధానాలు , పద్దతులు ద్వారా ముందుకు వెళ్ళే లక్షణం మిమ్మల్ని మీరు ఫ్లెక్సిబుల్ గా మార్చుకునే లక్షణం అలవాటు చేసుకోండి.
***  ***  ***  సైకాలజీ టుడే, అక్టోబర్  2016 లో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  ***

Sunday, 25 September 2016

మీలోని ఎంట్ర ప్రెన్యూర్ ని అడ్డుకునే సెల్ఫ్ డౌట్ కి చెక్ పెట్టే 8 అంశాలు


చాలామందికి బిజినెస్ చేయాలని, స్టార్టప్ స్థాపించాలని కోరిక ఉంటుంది కానీ నేను చేయగలనా అని సందేహం. ఇలా  ఔతుందేమో అలా ఔతుందేమో అని మీమాంస. కాబోయే పరిణామాలన్నీ ఫెయిల్యూర్స్ అవుతాయేమో అని భయం. ఇలాంటి సందేహం, మీమాంస, భయం ఉన్నవారు బిజినెస్ లో అడుగుపెట్టరు. కొందరు వీరికి భిన్నంగా “ఎలాగైనా సరే సొంత వ్యాపారం పెట్టాలి, పేరు, కీర్తి, డబ్బు సంపాదించాలి, పది మందికి ఉద్యోగం ఇవ్వాలి, కొన్ని తరాలకు మార్గదర్శకం కావాలి...” అని బిజినెస్ ప్రయాణంలో కొన్ని అడుగులు వేస్తారు. అప్పుడు మొదలౌతుంది అసలు కథ. ఊహించని మలుపులు, ఎంతకీ తెమలని  ఖర్చులు, భిన్న ఆలోచనలున్న పార్టనర్స్, మారుతున్న మార్కెట్ సమీకరణలు, ముప్పుతిప్పలు పెట్టే కస్టమర్స్, సమాచార విప్లవం, షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు, హ్యాండ్ ఇచ్చే వాళ్ళు,....ఇంకా ఎన్నో ఒడిదుడుకులు, రోజురోజుకీ పెరుగుతున్న సవాళ్ళు....మరి ఈ సమయంలో ఎంట్రప్రెన్యూర్స్ తమ మీద, తమ పని మీద, భవిష్యత్తు మీద ఆలోచనలు ఎలా ఉంటాయి? ఆశయం నడిపిస్తుందా? సంశయం నడిసంద్రంలో ముంచేస్తుందా?  అప్పుడు ఒక వ్యాపారస్తుడి (ఎంట్ర ప్రెన్యూర్) కి తన మీద తనకే అనుమానం కలిగితే ఏమి చేయాలి? సెల్ఫ్ డౌట్ నుంచి సెల్ఫ్ స్టార్ట్ ఎలా చేయాలి?  ఈ కీలక అంశాలు  తెలిపే  ఈ వ్యాసం మీకోసం ప్రత్యేకం.
***    ***    ***    ***    ***    ***
చాలా మంది విజేతలకు, ఆత్మ విశ్వాసం ప్రదర్శించే వారికి, గొప్ప బిజినెస్ మగ్నెట్స్ కు తమ శక్తి సామర్ధ్యాల మీద అనుమానం (సెల్ఫ్ డౌట్) ఉండదు అని అనుకుంటారు. అది నిజం కాదు. జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్ళతో సెల్ఫ్ డౌట్ (స్వీయ అనుమానం) అనేది సాధారణంగా వచ్చే ఆలోచన.  ఇది మానవ సహజం. కాకపోతే అది మీ అభివృద్ధికి ఆటంకపరిచే స్థితిలో ఉండకూడదు.
1: మీరు ఒంటరిగా లేరని తెలుసుకోండి:

మీ ఒక్కరికే కాదు ప్రపంచంలో ఎవరికైనా తమ మీద తమకి కొన్ని సందర్భాలలో అనుమానం వస్తుంది. ఎంత గొప్ప విజేతలకైనా కొన్ని సందర్భాలలో సెల్ఫ్ డౌట్ సహజం. మీరు మాత్రమే ఆత్మ విశ్వాసంలేక ఇబ్బంది పడుతున్నారు అనుకోకండి. ఒక పనిని మొదలుపెట్టకముందు, నేర్చుకునే దశలో, కొత్తగా చేసేటప్పుడు కాన్ఫిడెన్సు లేకపోవటం సహజం. నా ఒక్కడికే ఇలా అవుతుందేమో అనే ఆలోచన మనిషిని చాలా ఇబ్బందికి గురిచేస్తుంది. అలా అనుకోవలసిన అవసరం లేదు. కాబట్టి ఎంట్ర ప్రెన్యూర్ తమకు మాత్రమే సెల్ఫ్ వస్తుందనే భ్రమలోంచి బయటికిరావాలి. 
2: ఇతరులు ఏమి అనుకుంటారో అని ఆలోచించండి:
మీ సమయాన్ని . శక్తిని ఇతరులు మీ గురించి ఏమి అనుకుంటున్నారో అని ఆలోచిస్తూ ,  వారి ఎక్స్ పెక్టేషన్స్ తగ్గట్టు మిమ్మల్ని మీరు మార్చుకోడానికి ప్రయత్నించడం మిమ్మల్ని అసంతృప్తులుగా మిగులుస్తుంది. ఈ ప్రపంచంలో మనకంటే బాగా చేసే వారు, ఎక్కువ చేయగల వారు,  శక్తివంతులు ఉంటారు. అందుకే ఇతరుల నుంచి ప్రేరణ పొందడం వరకూ ఒకే కానీ వారిని ఒక స్థాయిని , పోసిషన్ ను ఒక కొలమానం (బెంచ్ మార్క్) లా ఊహించుకుని లైఫ్ లో నిజమైన జీవత్వాన్ని కోల్పోకండి.
3:  ప్రధాన లక్ష్యాలు నిర్ణయించుకోండి:    
మీ వ్యాపారంలో దీర్ఘకాలిక, ఫైర్ ఛార్జింగ్ ఇచ్చే గొప్ప గోల్స్ తో పాటు ఈ సంవత్సరం , మరో ఆరు నెలలలో చేరుకోగలిగిన షార్ట్ టర్మ్ గోల్స్ ఉండాలని నిర్ణయించుకోండి. మీ గోల్స్ ప్రతీ వారం/ ప్రతి నెల రివ్యూ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి ఎందుకంటే పెద్ద గోల్స్ సాధించడం లేట్ అయితే మన మీద మనకి డౌట్ రావటం సహజం. అదే చిన్న గోల్స్ ను ప్రతీ నేలా సాధిస్తూ వెళితే మనం చిన్న చిన్న విజయాల ద్వారా కాన్ఫిడెన్సు ఫీల్ అవుతాం, ఈ పని రెగ్యులర్ గా ఇంకొంచం ప్రోత్సాహం ఇస్తుంది.  
4:  గతంలోని విజయాలు గుర్తుకుతెచ్చుకోండి : అనుకోని పరిణామాలు , రిజల్ట్స్ తో మీకు మీ శక్తి యుక్తుల మీద డౌట్ వచినప్పుడు గతంలోని విజయాలను, రీసెంట్ గా వచ్చిన విజయాలను, గుర్తింపులను, ఇతరులు మీ మీద నమ్మకాన్ని ఇస్తూ మాట్లాడిన సందర్భాలు గుర్తుతెచ్చుకోండి. మీ విజయాలకు మీరు గుర్తింపు, ప్రేమ ఫీల్ అయినపుడు ఇప్పుడు చేతిలో ఉన్న ప్రాజెక్ట్ మీద ప్రేమ వస్తుంది.
5:  జాగ్రత్తగా ఎంచుకోండి:  ప్రపంచాన్ని, జీవితాన్ని, మనుషులను ఉన్నతంగా చూడటం, పాజిటివ్ గా, సంవృద్దితో నిండినట్లు రిసీవ్ చేసుకోవటం అలవాటు చేసుకోండి. ఇది ఒక జాగ్రత్తతో , కాన్షియస్ గా చేయవలసిన ప్రక్రియ. ప్రతీక్షణం అది లేదు , ఇది లేదు అని ఆలోచించే బదులు ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప సంపద, ఉన్నత మనుషులు, గొప్ప అంశాలు  ఉన్నాయి, మనం ప్రయత్నాలు  ద్వారా మన ప్రత్యేక ఎంపికల ద్వారా మనకు ఏమి కావాలో ఎన్నుకోవాలి అని అర్ధం నమ్మండి. 
6:  ప్రపంచాన్ని గుర్తుంచుకోండి:  అనుకూని వ్యతిరేక అనుభవాలు రావడం చాలా సహజం. మనం ఎవ్వరం వీటికి అతీతులం కాదు. చేసిన ప్రతీ పనిలో 100 % జరగాలని రూల్ లేదు. మీరు గొప్పగా, సరైన దిశలో  ప్రయత్నించి ఉండొచ్చు. అలా అని చెప్పి మీకు పాజిటివ్ రిజల్ట్ మాత్రమే రావాలని రూల్ లేదు. మీ ప్రయత్నానికి అనేక కారణాలు ప్రభావం లోబడి ఏమి రావాలో అదే వస్తుంది. అయితే గుర్తుంచుకోండి ఈ విశ్వంలో మధ్యలో మీరు ఒక్కరే లేరు, కోట్ల మంది ఉన్నారు, వారికి కూడా మీలా అనేక లక్ష్యాలు, విజయాలు, భావాలు ఉన్నాయి. అందుకే మీరు వెళ్ళే దారిలో ఇతరులు కలిసినపుడు వారి జర్నీ కి కూడా సహాయం చేస్తూ ముందుకు వెళ్ళే మంచిమనసుతో ముందుకెళ్ళండి. ప్రపంచాన్ని మనం గుర్తుంచుకుంటే , ప్రపంచం మనల్ని గుర్తుంచుకుంటుంది. మిమ్మల్ని ప్రేమించే, మీకు ఉన్నత ఫీడ్ బ్యాక్ ఇచ్చే వ్యక్తుల మధ్యలో ఉండండి.
7:  మీ ప్రయత్నాల విత్తనాలను నాటండి:  

చాలా మంది తమకి తాము ఒక సెల్ఫ్ ఇమేజ్ ఏర్పరుచుకుంటారు. అందులో తప్పేమీ లేదు. కాకపోతే ఏర్పరుచుకున్న ఇమేజ్ స్థాయిలో జీవితం, రోజులు నడవటంలేదంటే ఒక ఒత్తిడి , సెల్ఫ్ డౌట్ మొదలౌతుంది. ఒక సామెత గుర్తుంచుకోండి “మనం పాతి పెట్ట బడ్దాం అనుకోకండి, మనం విత్త బడ్దాం”. ప్రతి విత్తుకు ఒక మొక్కగా ఎదిగి, మానుగా ఫలాలను అందించేందుకు సమయం పడుతుంది. ఆ సమయం లో ఉన్నాం అనుకుని , ప్రయత్నాలు అనే విత్తనాలు నాటండి, ఓర్పుతో కొంచెం కొంచెం మెరుగుపరుచుకుంటూ వాటిని పోషించండి. అందుకే మీతో మీరు ఎందుకు నేను చేయలేకపోతున్నాను అనుకుంటూ నిందించుకోకండి. అది టైం వేస్ట్ పని. మిమ్మల్ని మీరు క్షమించుకుంటూ (Forgive), ప్రేమించుకుంటూ  ప్రయత్నాలనే విత్తనాలు నాటుతూ ముందుకు వెళ్ళండి.   
8:  భయాలను ఎదుర్కోండి :   గుర్తుంచుకోండి ఫ్రెండ్స్... మీ ఫలితాల మీద ఉన్న భయం, మీ ఆశయం మీద ఉన్న ప్రేమకంటే గొప్పది కాకూడదు. భయం, సెల్ఫ్ డౌట్ మిమ్మల్ని నిరోధించేలా , డిక్టేట్  చేసే అవకాశం ఇవ్వకండి. మిమ్మల్ని భయపెట్టే అంశాలే ముందు చేయండి. ఓడిపోతామేమో అని భయపడే వారు ఎప్పటికీ గెలవలేరు. మిమ్మల్ని మీరు కంఫర్ట్ జోన్ బయటికి వెళ్లి పుష్ చేస్తూ ముందుకు నడిపిస్తే, మీ అసలు కెపాసిటీ మీకు తెలుస్తుంది. మీరు ఎంత చేయగలరో నేర్చుకుంటారు.
***  ***  ***  సైకాలజీ టుడే, సెప్టెంబర్ 2016 లో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  ***


Friday, 23 September 2016

మిమ్మల్ని గుర్తుండిపోయేలా చేసే పర్సనల్ బ్రాండింగ్ కు పంచ సూత్రాలు [ Five Principles to Personal Branding ]

మీరు మీ ఇంట్లో, ఆఫీస్ లో, వ్యాపారంలో, ఊరిలో, బంధుమిత్రులలో ఎలా గుర్తింపబడుతున్నారు? ఇతరుల దృష్టిలో మీరు ఎలాంటి వారిగా గుర్తొస్తున్నారు. మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలని మీరు కోరుకుంటున్నారు? వీటిని  తెలుసుకోవాలంటే పర్సనల్ బ్రాండింగ్ అర్థం చేసుకోవాలి. వేగంగా మారుతున్న E-యుగంలో మీరేంటి అంటే మీ ఆన్ లైన్ ఉనికి గురించి కూడా అనేది E-తరం అర్థం చేసుకోవాలి. అందుకే మీ ఫేస్ ఏంటో ఫేస్ బుక్ చెప్తుందా, మీ ఫేస్ ఒక  బుక్ లా, మీరే ఒక గొప్ప గ్రంధంలా గుర్తించబడాలా? ఈ కీలక అంశాలు  తెలిపే “పర్సనల్ బ్రాండింగ్ కు  పంచ సూత్రాలు” మీకోసం ప్రత్యేకం.
***    ***    ***    ***    ***    ***
ప్రపంచానికి మీరు ఎలా కనిపిస్తున్నారు అనేది మీ పర్సనల్ బ్రాండింగ్. మీరు ఎవరు, మీ ప్రత్యేకత ఏమిటి, మీరు ఏమి సేవలు అందిస్తుంటారు తెలిసిన తర్వాత ప్రజలు మీరు ఎంచుకున్న రంగంలో మిమ్మల్ని ఆ సర్వీస్ అవసరం ఉన్నప్పుడు గుర్తుకు తెచ్చుకోగలరు. అయితే ప్రశ్న ఏమిటంటే మిమ్మల్ని మీ రంగంలో ఏ వ్యక్తిగా గుర్తుంచుకోవాలనుకుంటున్నారు?  ఏ సర్వీస్ కోసం మిమ్మల్ని ఎటువంటి ప్రత్యేక కారణం చేత సంప్రదించగలరనుకుంటున్నారు? ఏ విధంగా ప్రజలు మిమ్మల్ని ఎక్కువగా గుర్తుంచుకోవాలనుకుంటున్నారు? ప్రజలకు ఉన్నతంగా ఉపయోగపడే వ్యక్తిగా మీరు గుర్తుండిపోవాలంటే ఈ క్రింది పర్సనల్ బ్రాండింగ్  పంచ సూత్రాలు పాటించండి 
1: మీ అసలైన వ్యక్తిత్వం ప్రదర్శించండి:

 ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి మీరు కాని మరో వ్యక్తిలా గొప్ప వారిలా, సరదా మనిషిలా, అప్పటికప్పుడు మరోలా ఉండాలని ప్రయత్నిస్తే అది తాత్కాలిక విజయమే. ప్రజలు ఊసరవెల్లి మనస్తత్వాలను, డాంబికాలను గుర్తిస్తారు. గొప్ప గొప్ప సంస్థలు, ప్రభుత్వాలు, ప్రముఖులు లేని విలువలు తమ నిజమైన భావాలని చెప్పుకుని ఆచరణ లో నిరూపించుకోలేక కుప్పకూలిన దాఖలాలు చాలా ఉన్నాయి. అందుకే మీరు మీలా ఉండండి. అంటే ఒక నమ్మకైన మీదైనా స్వభావాన్ని తెలిపే విధానాలు ఎంచుకోండి. బయటి రూపం, స్వరూపం మార్చే అనేక ప్రక్రియలు నేర్చుకుని లోపల అంతా ఖాళీగా ఉంటే కోటు, బూటు చూసి ప్రజలు రెస్పెక్ట్ ఇస్తారేమో  కానీ నోరు విప్పాక వారికి మనదగ్గర సత్తా లేకపోతే తెలిసి పోతుంది. మనుషులు ఇతర మనుషులతో బంధాలు ఏర్పరచుకుంటారు. మీరు మరో వ్యక్తిలా (మాస్క్ వేసుకుని) ఉంటే వారి బంధాన్ని మీరు దృడంగా  ఉంచుకోలేరు. ఇది ప్రకృతి నియమం.  
2: అవకాశాలు ఉన్నచోట మాట్లాడండి:
మీ పర్సనల్ బ్రాండింగ్ ఉన్నతంగా ముందుకు వెళ్ళాలి, ప్రజలు గుర్తించాలంటే వీలైనచోట మాట్లాడండి. అవును దీని ద్వారా అనేక వ్యక్తులతో కలిసిపోతారు. అందరిలాగే మీరు మాట్లాడితే గుంపులో గోవిందయ్య అన్నట్లు అయిపోతుంది. మీ ప్రత్యేకత చాటేలా ఉండాలి. ఆ టాపిక్ మీద పట్టు, మీ కాన్ఫిడెన్సు, మీరు ప్రజలతో కనెక్ట్ అయ్యే విధానం, మీరు అనేక ఇతర వనరులు గురించి చెప్పే విధానం ద్వారా  రాగానే మీరు వారికి ఎప్పటికీ గుర్తుండి పోవాలి. మీరు మొదటి రోజే గొప్ప వక్త అవ్వక పోవచ్చు, కొందరు మిమ్మల్ని విమర్శించవచ్చు, కొందరు ప్రోత్సహించవచ్చు. ఎటువంటి ఫీడ్ బ్యాక్ అయినా రిసీవ్ చేసుకోడానికి రెడీ గా ఉండండి. వాటినుంచి నేర్చుకోండి. మీ పర్సనల్ బ్రాండింగ్ పెంచుకోవాలంటే చిన్న చిన్న మీటింగ్స్ , కస్టమర్ అవేర్నెస్ కార్యక్రమాలు , మీ ఆఫీస్ లో మీటింగ్స్, బాస్ కి అభిప్రయాలు చెప్పడం, ఆ రంగం లోని ఇతరులు ప్రాబ్లం లో ఉంటే వాలంటీర్ గా సహాయం చేయడం బాగా ఉపయోగపడతాయి.       
3:  ఆర్టికల్స్ రాయండి:    

మీ రంగంలో కస్టమర్ లను ఆకర్షించడానికి ముందు వారు చదివే ఆర్టికల్స్ రాయండి. మంచి కంటెంట్ అందించండి. అందరిలా మీరు రాయకండి. మరో పది మంది రచయితలు రాసినా, పేజి డిజైన్ సరిగా చేయకపోయినా మీ ఆర్టికల్ మీదకు దృష్టి వెళ్ళేలా, చదివే వారి నిజ జీవితంలో ఉపయోగపడేలా, ఒక సారి మీ ఆర్టికల్ చదివితే మళ్ళీ ఇంకో ఎడిషన్ కోసం వెయిట్ చేసేలా రాయండి. ఒక మంచి ఆర్టికల్ రాయాలంటే ఒక మంచి థింకర్ అవ్వాలి అని అంటారు పెద్దలు. అది నిజం ఇది సమయంతో కూడుకున్న పని. మీరు చదువుతున్న మన సైకాలజీ టుడే పత్రిక కోసం గత ఆరు సంవత్సరాలుగా నేను ఆర్టికల్స్ రాస్తున్నాను. ఒకోసారి ఆర్టికల్ రాయడానికి ఒక రోజు సమయం కూడా పడుతుంది. కానీ గతం కంటే బాగా రాయాలన్న తపనతో, అవసరమైన కంటెంట్ అందించాలన్న ప్రేమతో ఆర్టికల్స్ రాస్తుంటాను. మనం ప్రతీసారి బెటర్ గా క్లైంట్ కి సర్వీస్ అందించగలిగితే ఉన్నతంగా గుర్తుంది పోతాము. మీరు ఎంచుకున్న రంగంలో రాయడానికి ఆన్ లైన్ వెబ్ సైట్స్, బ్లాగ్స్, మీ ఫేస్ బుక్, ఇతరుల సైట్ కోసం గెస్ట్ పోస్ట్ లు, న్యూస్ పేపర్స్, మ్యాగ జైన్లు ఇలా ఏవైనా ఎంచుకోవచ్చు.

4:  ఆన్ లైన్ లో మిమ్మల్ని మీరు ప్రెజెంట్ చేసుకోండి:
ఎవరైనా ఎక్కడా దొరకకపోతే ఆన్-లైన్ లో ఉన్నాడేమో వెతకండి అని ఆలోచించే రోజులు వచ్చేసాయి. ఒక సెకనుకి 2.3 మిలియన్స్ గూగుల్ సెర్చ్ లు జరుగుతున్నాయట. మీ రంగంలో కస్టమర్ లు సర్వీస్ కోసం వెతికితే మీరు కనిపించాలి. ఆన్ లైన్ లో ప్రముఖ సోషల్ మీడియా సైట్ లలో (ఉదా: ఫేస్ బుక్, ట్విట్టర్, పింటరెస్ట్, ఇన్ స్టాగ్రామ్) మీ ప్రొఫైల్, ప్రెజెన్స్ ఉండేలా చూసుకోండి. అయితే ఆన్- లైన్ లో మీ బ్రాండ్ విలువ మీరే  ఎప్పటికప్పుడు గమనించు కోవాలి, మానిటర్ చేసుకోవాలి. సొంతంగా వెబ్ సైట్ ఉంటే మంచిది, ఖర్చు, కాస్త టెక్నికల్ అంశాల పైన పట్టు ఉండాలి. వెబ్సైటు ఖర్చు పెట్టె బదులు వర్డ్ ప్రెస్ , బ్లాగ్ స్పాట్. కాం వంటివి వాడుకుని మీరే సైట్ నిర్మించుకోవచ్చు. ఇది కాస్త సమయం, కొత్త అంశాలు నేర్చుకునే లక్షణం, టెక్నికల్ అంశాలు పాటించడం ద్వారానే సాధ్యం. ఒకవేళ ఈ జాగ్రత్తలు తీసుకోలేకపోతే, నేర్చుకోలేకపోతే మీ అభివృద్ధిని, మీ పర్సనల్  బ్రాండింగ్ ని మీరే అడ్డుకున్న వారౌతారు.  

5:  మీ రంగంలో కొత్త అంశాలు నేర్చుకోండి:  రాకెట్ స్పీడ్ తో కొత్త అంశాలు వచ్చి చేరుతున్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మీ రంగంలో కొత్త అంశాలను నేర్చుకోండి. చాలా సంవత్సరాలుగా మీరు కొంత స్థాయి మించి వెళ్ళలేకపోతున్నారు అంటే మీ నైపుణ్యాలు పరిధి అని అర్థం. నైపుణ్యాలు నేర్చుకోండి, కొత్త అంశాలతో మిమ్మల్ని ఇండస్ట్రీ లో అప్డేటెడ్ పర్సన్ గా గుర్తింపు తెచ్చుకోండి. ఈ అంశాలతో మీ పర్సనల్, కంపెనీ  బ్రాండింగ్ ఉన్నతంగా మలుచుకోండి, మీ సక్సెస్ స్టొరీ మాతో పంచుకోండి.
Five principles for Personal Branding:
1. Show your real you
2. Speak wherever possible
3. Write articles
4. Create online presence
5. Update and learn constantly

***  ***  ***  సైకాలజీ టుడే, ఆగష్టు 2016 లో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  ***

Tuesday, 20 September 2016

ఆలోచనలను ఆచరణ వైపు నడిపే 3 మౌలికాంశాలు [3 Essentials to Move You From Thoughts To Actions]

నిద్ర లేచినపుడు ఈరోజు ఏమి చేయాలి అనే ఆలోచన నుంచి, పడుకునేముందు రేపటి పనులు ఏంటి అని ఆలోచించే వరకు, గతం కంటే బాగా భవిష్యత్తు నిర్మించుకోవాలని మనిషి అన్వేషిస్తూనే ఉంటాడు. కొత్త భాష నేర్చుకోవాలి, ఆరోగ్యమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి, బరువు తగ్గాలి, మన పిల్లలకు ఉన్నతమైన పేరెంట్స్ గా ఉండాలి, ఉద్యోగం సంపాదించాలి, ఇంక్రిమెంట్ కి అర్హత సంపాదించాలి, వ్యాపారం పెట్టాలి, ఇల్లు కట్టాలి.....ఇలా మనందరికీ అనేక లక్ష్యాలు ఉంటాయి. ఏదైనా సాధించాలంటే ఆలోచన బాగుండాలి, నిజానికి ఏది సాధించాలో నిర్ణయించుకున్నాక తర్వాత మనిషి తన శక్తినంతా ఆచరణపై మళ్ళించాలి. ఇది నిరంతర ప్రయత్నం అవ్వాలి. అందుకు మీ మాటలు కాదు మీ పనులు మాట్లాడాలి. ఎలాగో  తెలుసుకుందాం రండి.
***    ***    ***    ***    ***    ***
1. Not only knowing, you must develop skills including managing thought patterns and ability to take action required
2. See the real value and impact than the risk involved in the process
3. Habits should be in alignment with expected results
సోపానం 1: విషయం తెలుసుకోవటమే కాదు నైపుణ్యం రావాలి   

మనం ఉన్న స్థితికి, కోరుకుంటున్న స్థితికి (మన గోల్ కి) మధ్య ఖాళీ మనకి నాలెడ్జ్ లేకపోవడం వలన వచ్చింది అనుకోవడం చాలా సహజం. అందుకే 30 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా?, బరువు తగ్గడం ఎలా?, డబ్బు సంపాదించడానికి 100 మార్గాలు, మార్కెటింగ్ ఎలా చేయాలి? ...వంటి “ఎలా చేయాలి” అనే పుస్తకాలు, కోర్స్ లు కొంటాము. ఎందుకంటే ఆశించిన కొత్త ఫలితాలు సాధించాలంటే ఉన్నత  విధానాలు (స్ట్రా టెజీస్) నేర్చుకోవాలని, ఆ నాలెడ్జ్ ఉండాలనుకుంటాము. నిజానికి కేవలం కొత్త విషయాలు నేర్చుకున్నంత మాత్రాన అవి మీ లక్ష్యాల దిశలో మార్పులు చేయలేనంత కాలం ఎందుకు పనికి రాదు. అది టైం వేస్ట్ పనే. కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త విషయాలు పాటించడం రెండూ ఒకేలా అనిపిస్తాయి. నిజానికి చాలా తేడా ఉంది. మనం గమనించాలి. మీ గోల్ చాలా బలంగా తయారవడం, ఫిట్ నెస్ పెంచుకోవడం అనుకోండి. బెంచ్ ప్రెస్ టెక్నిక్స్ లో మంచి ట్రైనర్ ని కలవొచ్చు కానీ వెయిట్ లిఫ్టింగ్ ద్వారానే మీరు ఫిట్ నెస్ పెంచుకోగలరు.  మీ గోల్ ఒక పుస్తకం రాయడం అనుకోండి. బాగా పేరున్న రచయితతో మాట్లాడొచ్చు, కానీ రెగ్యులర్ గా మీరు మంచి కంటెంట్ రాయటం, పబ్లిష్ చేయడం ద్వారానే మంచి రచయితగా మారగలరు. కేవలం నేర్చుకుంటే విషయాలు తెలుస్తాయి, ప్రాక్టీసు చేస్తే నైపుణ్యం మీ జీవితం లో భాగం అయిపోతుంది.

ఒకోసారి నేర్చుకోవడం అనేది సంకలో పెట్టుకుని నడవడానికి వాడే కర్రలాగా సపోర్ట్ ఇస్తుంది, కానీ నిజమైన పనిని చేయనివ్వకుండా ఆపేస్తుంది. మా నాన్న గారికి ఇంగ్లీష్ లో ఉన్న అంశాలు చదువుకుని అర్థం చేసుకోవాలని, ఇంగ్లీష్ మాట్లాడాలని చాలా కోరిక. నాన్న నిజానికి నాకంటే ఎక్కువ అనేక అంశాలు, బుక్స్ కొన్నారు, చదివారు, ఎక్కువ స్కిల్ల్స్ నేర్చుకున్నారు. అదేవిధంగా ఇంగ్లీష్ నేర్చుకోడానికి నాన్న నాకంటే ఎక్కువ పుస్తకాలు చదివారు. అవన్నీ 55 సంవత్సరాలు దాటిన తర్వాత కొని చదివినవే, ఆ వయస్సులో తన వృత్తి కాకుండా తన లక్ష్యం కోసం నాన్న చాలా నేర్చుకున్నారు. కానీ ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడడం తన గోల్, “ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి” వంటిబుక్స్ చాలా చదవటం ద్వారా నాన్న నేర్చుకోగలిగింది ఇంగ్లీష్ బుక్స్ చదవటం. ఆ తేడా గమనించాలి. అందుకే విషయాలు నేర్చుకోవడమే కాదు, మనం కోరుకుంటున్న స్థితికి మనల్ని తీసుకెళ్ళే అసలైన అంశాలు ప్రాక్టీసు చేయడం చాలా అవసరం. గొప్ప వ్యాపారాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతో బిజినెస్ మీద ఆన్ లైన్ కోర్స్ వీడియో లు చూస్తే మీకు బిజినెస్ చేయడం ఎలా అనే అంశం తెలుస్తుంది. కానీ బిజినెస్ మాన్ కావాలంటే సొంత వ్యాపారం మొదలుపెట్టాలి.    

సోపానం 2: రిస్క్ ని మించిన విలువని చూడగలగాలి   

వ్యాపారం అయినా, జీవితం అయినా కోరుకున్న ఫలితాలు సాధించాలంటే లక్ష్యం దిశలో అడుగులు వేసే ప్రయత్నాలు మొదలైనప్పుడు తెలియనితనం (uncertainty) వలన కంగారు పడతారు, ఆందోళన ఉండొచ్చు. ఈ రిస్క్ (భయాలు) స్థాయిని మించిన విలువ మీరు కోరుకున్న ఫలితాల ద్వారా ద్వారా ప్రపంచానికి అందిస్తున్నారన్న స్పష్టత ఉన్నప్పుడు భయాలు అడ్డంకులు కావు. నేర్చుకుంటూ ఎదుగుతున్నా అన్న ఫీలింగ్ నుంచి పనిచేస్తారు. దానికి ముఖ్యంగా కావలసింది నేర్చుకుంటూ మున్డుకేలుతూ ఉంటే మీ సర్వీస్ లు, ప్రోడక్ట్ , మీ పనులు ఇతరుల లేదా మీ అవసరాలను తీర్చడం; ఒక వేల వ్యాపారం / ట్రైనింగ్ అయితే దాని ఆధారంగా కెరీర్ లో ఒక గొప్ప మలుపు రావడం, ఆర్ధిక విషయాలలో కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడం. అందుకే ఆలోచన నుంచి ఆచరణ మీద శక్తిని కేంద్రీకరించడం అనేది ఫ్రీలాన్సు సర్వీస్ ఇచ్చేవారికి /వ్యాపారస్తులకి చాలా ముఖ్యం.

సోపానం 3: ఫలితాల దిశలో అలవాట్లు మార్పు    


నా వ్యాపారం గురించి నాకు బాగా తెలుసు అంటూ చాల మంది ఇంత కంటే ఎక్కువ విస్తరించాలంటే భయపడతారు, కొందరు విస్తరించినా పనులను ఇతరులకు డెలిగేట్ చేస్తే అవి సరిగా నడవవని తన కంట్రోల్ లో ఉండాలని అనుకుంటారు. ఇది ప్రకృతి నియమాలకు విరుద్దం. అందుకే మీ వ్యక్తిగత ఆలోచనా రీతులు, పనులు చేసే విధానాలు, వ్యక్తిగత అభిప్రాయాలతో సంస్థలు, వ్యాపారాలు లేదా ఉనత స్థాయి జీవితాలు (కుటుంబాలు కూడా) నిర్మించలేము. ఇలాగే చేస్తా , నాకు తెలుసు, నేను చాలా మందిని చూసా.....ఇలాంటి పదాలు పదే పదే వాడుతున్నారా? అవి మీరు ఆశించిన ఫలితాల దిశలో ఉన్నాయా? ఆ అభిప్రాయాలు తిరునాళ్ళలో పచ్చ కాళ్ళ జోడు వంటివేమో గమనించుకోవాలి. ఈ ప్రపంచంలో మనిషి ఎంత గొప్పగా అంతర్గతంగా ఎదుగుతాడో, అందుకు తగినట్లు బహిర్గతంగా ఎదగగలడు. మనం ఒక వ్యక్తిగా ఎంత ఉన్నతంగా సాధించాగాలమో కుటుంబాలలోను, వ్యాపారాల లోను అంతే ఎదగగలం.  ఒక లక్ష్యం నిర్ణయం అయ్యాక ఆలోచించడం కంటే ఆచరణే ముఖ్యం. ఆచరించడానికి ఈ మూడు అంశాలు కీలకం. వీటిని పాటించి మీ సక్సెస్ స్టొరీ మాతో పంచుకోండి.
***  ***  ***  సైకాలజీ టుడే, జూన్ 2016 లో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  ***

Sunday, 11 September 2016

మిమ్మల్ని ఎంట్ర ప్రెన్యూర్ గా విజేతను చేసే 5 ఆలోచనలు

మిమ్మల్ని  ఎంట్ర ప్రెన్యూర్ గా విజేతను చేసే 5 ఆలోచనలు
హెన్రీ ఫోర్డ్ నుంచి బిల్ గేట్స్ వరకు...రామోజీరావు నుంచి నారాయణ మూర్తి వరకు...ఎందరో ప్రముఖులు పాటించిన, పాటిస్తున్న ఈ ఆలోచనా విధానాలు మీకు గొప్ప ఫలితాలు ఇచ్చి మీ బిజినెస్ ఎక్స్ లెన్స్ కి దోహద పడతాయి. మీరు స్టార్ట్ అప్ మానియా లో ఉన్నా... ఆల్రెడీ స్టార్ట్ చేసి స్టాండ్ అప్ పోజిషన్ లో ఉన్నా బిజినెస్ మాగ్నెట్ అవ్వాలంటే ఏమి చేయాలి? విజయవంత మైన ఎంట్రప్రెన్యూర్ గా ఎదగాలంటే ఎలా ఆలోచించాలి? ఏమి నేర్చుకోవాలి? ఈ కీలక విషయాలు చర్చించడానికే ఈ ఆర్టికల్. ఇంకెందుకు ఆలస్యం ఆ ఆలోచనలు తెలుసుకొని ఎంట్రప్రెన్యూర్ గా విజయం వైపు అడుగులు వేయండి.
***    ***    ***    ***    ***    ***
సోపానం 1: బిజినెస్ ఒకే ఒక్క ఛాన్స్ అనుకోవద్దు
కొత్త బిజినెస్ మొదలు పెట్టాలన్నా , ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలన్నా “ సరైన ఐడియా” తెలుసుకోవడం ఎలా అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. మీకొచ్చే ఒక్కొక్క ఐడియా కూడా మిలియన్ డాలర్ లు అందించేవే అయ్యుండొచ్చు. కానీ ఒక ఐడియా మీ  జీవితాన్ని పూర్తిగా తన చేతిలోకి తీసుకుంటుంది. డబ్బుకంటే, ఇతర వనరుల కంటే ముందుగా సమయాన్ని అంటే మీ జీవితాన్నే పెట్టుబడిగా పెడతారన్న మాట. కొన్ని లక్షల బిజినెస్ ఐడియా లు ఉంటాయి, మీకు కూడా వ్యాపారాత్మక దృష్టిలో ప్రపంచాన్ని చూడటం మొదలు పెట్టాక అనేక ఆలోచనలు వస్తాయి. కంగారు పడొద్దు, తొందరవద్దు, మీరు వెంటనే దూకకపోతే ఎదో ఆఖరి పడవ వెళ్లి పోతుందేమో అనుకోకండి, అలాగే ఒకసారి గతంలో దూకుడుగా వ్యాపార ప్రయత్నం చేసి ఆశించిన ఫలితం సాధించలేకపోయారని ఇక వ్యాపార ఆలోచనే పాపం అని ఒక అభిప్రాయానికి రాకండి.
బిజినెస్ లో రాణించాలంటే తెలుసుకోవాల్సిన ప్రాధమిక అంశం ఏంటంటే బిజినెస్ ఐడియా లేదా వ్యాపార ప్రయత్నం అనేది జీవితంలో  ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం అనుకోవద్దు. ఒక అవకాశం మిస్ అయితే ఒక బిజినెస్ పాఠం నేర్చుకుంటూ ప్రజల అవసరాలకు తగిన ప్రోడక్ట్ , సేవలు  ద్వారా వ్యాపారాన్ని కొనసాగించే లక్షణం ఉండాలి. ఒక సారి ఫెయిల్ అయితే మళ్ళీ ప్రయత్నం చేయండి. ప్రపంచంలో సక్సెస్ అయిన ప్రతి ఒక్క ఎంట్ర ప్రెన్యూర్ మొదట్లో ఫెయిల్యూర్ రుచి చూసిన వారే. మీకు తెలుసా బిల్ గేట్స్  తన సహచరుడు పాల్ అలెన్ తో కలిసి  మైక్రో సాఫ్ట్  కంటే ముందు “ట్రాఫ్- ఓ- డేటా”  అనే కంపెనీ నిర్మించే ప్రయత్నం చేసారు, ఫోర్డ్ కంపెనీ నిర్మించిన హెన్రీ ఫోర్డ్ తొలి నాళ్లలో చేసిన ప్రయత్నాలు అన్నీ ఫెయిల్ అయ్యాయి ఐదు సార్లు జీరో స్థితికి వచ్చాడు. అయినా ఎదిగారు. ఇలాంటి సక్సెస్ స్టొరీ లు ఎన్నో ఉన్నాయి అందుకే బిజినెస్ అనేది కేవలం లైఫ్ లో ఒకే ఒక్క ఛాన్స్ అనుకోకండి.
సోపానం 2:  అభిరుచి కంటే ఎక్కువ కుతూహలంతో నేర్చుకోండి
వ్యాపారాన్ని నిర్మించాలన్న ఉద్దేశం కేవలం అభిరుచి (passion) ఉంటే సరిపోదు. అభిరుచి మాత్రమే ఉంటే అది కాస్త ఒత్తిడి ని సృష్టిస్తుంది, దాని స్థానంలో నేర్చుకోవాలన్న కుతూహలం కావాలి. కుతూహలం స్వేచ్చగా విషయాలను నేర్చుకునేందుకు ఉపయోగ పడుతుంది. ఆ విధంగా ఆలోచించడం మొదలుపెట్టాక మీరు ప్రజలను కేవలం కలవడం ఇష్టం కాబట్టి కలవరు, “ఇంకా నేను ఎక్కువ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను, నేర్చుకోవాలనుకున్తున్నాను, ఇంకా మెరుగ్గా సోలుషన్స్ సృష్టించడానికి సంసిద్దంగా ఉన్నాను”  అన్న  ఉద్దేశంతో మాట్లాడతారు. ఆ దృక్కోణంలో పనిచేయడం మొదలు పెడతారు. ఎంట్ర ప్రెన్యూర్ కి కుతూహలం ఆక్సిజన్ వంటిది.    
సోపానం 3:  సృజనాత్మకత మీలో భాగం అవ్వాలి 
మీగురించి మీరు సృజన జీవులు అనుకున్నా అనుకోకపోయినా సృజనాత్మకత (క్రియేటివిటీ) మీ జన్మ హక్కు. ఒక ఎంట్ర ప్రెన్యూర్ గా ఉండడం అనేది అంతర్గతంగా ఒక సృజనాత్మక విధానం, క్రియేటివ్ ప్రాసెస్. మీకు ఎంత క్రియేటివ్ గా ఉండాలని నిబద్దత ఉంటుందో అంత మంచి, సృజనాత్మక ఆలోచనల ద్వారా మీ వ్యాపారాన్ని నిర్మించగలరు. మీకంటూ ఒక గుర్తింపు , కస్టమర్స్ నుంచి అంగీకారం (acceptance) లభిస్తాయి. ప్రతిరోజు మీ పని మొదలు పెట్టేముందు ఖచ్చితంగా ఈ క్రియేటివ్ ప్రాసెస్ ని మీలో అంతర్లీనం చేసే ఎక్సర్ సైజే చేయండి. అందుకు మీతో మీరు పనులు మొదలు పెట్టేముందు ఆటో సజెషన్ ఇచ్చుకోండి:నేను నా సృజనాత్మకతను గౌరవిస్తూ, దానిని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటా నని మాట ఇష్తున్నానుఒక కొత్త ఐడియా వచ్చినపుడు మీకు భయం వేయడం కూడా చాలా సాధారణంగా జరిగే అంశం అందుకే సృజనాత్మకత , భయం పక్క పక్కనే ఉంటాయి. మీరు ఎంత వేగంగా ఫెయిల్యూర్, భయాలను కాన్షియస్ గా  అలవాటు పడతారో, అంత వేగంగా విజయం పొందగలరు. అందుకే ఈ రెండు మీ గమ్యంలో అడ్డంకులు కాదు, అవి మీ ఎంట్రప్రెన్యూర్ జర్నీ లో  భాగస్వాములని గుర్తించండి. వాటిని మీ ఎదుగుదలకు ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోండి.
సోపానం 4:  తెరచిన పుస్తకంలాంటి మనసు గెలిపిస్తుంది    
చెప్పిన విషయాలు వినడానికి, తెలియని విషయాలు నేర్చుకోడానికి, భిన్న దృక్పథాన్ని అర్థం చేసుకోడానికి ఎవరు సంసిద్దంగా ఉంటారో వారే ఉన్నతంగా వ్యాపారాలు నిర్మించగలరు. జీవితమైనా, వ్యాపారం అయినా తెరచిన పుస్తకంలా, ఓపెన్ నెస్ తో ఉన్న వారికి కొత్త ఐడియా లు ఎక్కువ వస్తాయి, వచ్చిన ఐడియా ని వ్యాపారానికి వినియోగించుకోగలరు. ఓపెన్ గా ఉండడటం అంటే సామాజిక మాధ్యమాలలో మీ లైఫ్ స్టైల్ గురించి షేర్ చేసుకోవటం కాదు, వ్యాపారాత్మక అంశాలలో వేర్వేరి స్టేక్ హోల్డర్స్ నుంచి, కస్టమర్స్ నుంచి , అనుభవం నుంచి విషయాలు నేర్చుకునే లక్షణం. ధ్యానం (మెడిటేషన్) వలన సృజనాత్మకత (క్రియేటివిటీ) బాగా పెరుగుతుందని శాస్త్రీయంగా నిరూపించబడింది, నా అనుభవంలో కూడా గొప్ప మార్పులను చూసాను. మెడిటేషన్ మనస్సుని ప్రశాంత పరిచి ఒక నిర్మలమైన ఉన్నత స్థితిని ఖాళీని (స్పేస్ అఫ్ పాజిబిలిటీస్) సృష్టిస్తుంది. అప్పుడు మనిషి కొత్త విషయాలను ఎక్కువ రిసీవ్ చేసుకోగలదు. కంటెంట్ ఉంచాలంటే కంటైనర్ ఖాళీగా ఉండటం చాలా ముఖ్యం కదా. ప్రాచీన విద్య అందించే విషయాలలో పాత్ర శుద్ధి అనే అంశం లాంటిదన్న మాట. అందుకే నేర్చుకోడానికి, రిస్క్ తీసుకోడానికి, వినడానికి రెడీగా ఉండండి.
సోపానం 5:  మీ శరీరం, మైండ్, అంతర్గత సంభాషణ వినండి   
మీ మనస్సు , శరీరం – ఈ రెండూ జీవితంలో మీరు చేసే అనేక పనులకు, ఆలోచనలకూ, భావోద్వేగాలకు ఒక బాలన్స్ తో ప్రతిస్పందిస్తాయి. అందుకే మీ వ్యాపారం, ఒక ప్రాజెక్ట్, ఒక బిజినెస్ ఐడియా, ఒక వ్యాపార విధానం గురించి ఆలోచన చేసేటప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. వేర్వేరు సందర్భాలలో మీ ఆలోచనలు, శరీర ప్రతిస్పందనలు కాన్షియస్ గా గమనించగలరు. కాస్త మైండ్ ఫుల్ మూమెంట్ నేర్చుకుంటే ఇది అసాధ్యం ఏం కాదు. నిబద్దత ఉంటే నేర్చుకోవచ్చు. అప్పుడు మీ మనస్సు, శరీరం, మీ గట్ ఫీలింగ్, అంతరాత్మ ఏమి చెప్తుంది వినండి. కొందరికి ప్రాజెక్ట్ గురించి అలోచించగానే ఒంటి మీద రోమాలు నిక్క బొడుచుకుంటాయి (goose bumps) , కొందరికి ఒక ఎనర్జీ తో శరీరం నిండి పోతుంది. ఇంకొందరికి భయం వేస్తుంది, కొందరు ఛాలెంజింగ్ ఫీల్ అవుతారు. మిమ్మల్ని ఒక వ్యక్తిగా కంటే గొప్పగా ముందుకు నడిపే ఐడియా ని ఎన్నుకోండి. అంటే మీ బిజినెస్ ఐడియా మీద పనిచేస్తున్నా అనే ఆలోచనే మిమ్మల్ని మరింత ఉత్సాహంతో నడిపించేలా, కొన్ని ఎందరి జీవితాల్లోనో అవసరాలను తీర్చే సోలుషన్స్ ఇవ్వబోతున్నమన్న ఆలోచన మీకు గొప్ప శక్తిని ఇవ్వాలి. అలాంటి శక్తిని  నింపే బిగ్ ఐడియాలు, గొప్ప ఆలోచనలు , మీ మనసు బలంగా చెప్పే అంశాలు గుర్తించండి.
అర్థమైంది కదూ మళ్ళీ ప్రయత్నించడం, కుతూహలంతో పనిచేయడం, సృజనాత్మకత జోడించడం, భిన్న విషయాలు స్వీకరించగల ఓపిక, మీ అంతర్గత శక్తిని మిమ్మల్ని నడిపించే శక్తిని వెలికితీసే విధంగా ఉండే గొప్ప ఐడియాలతో , అద్భుత వ్యాపారాలు నిర్మించండి. ప్రజల అవసరాలను తీర్చే దిశలో ఈ ఐదు మౌలిక ఆలోచనా విధానాలు ద్వారా విజయవంతమైన ఎంట్రప్రెన్యూర్ గా ఎదగండి.  
***  ***  ***  సైకాలజీ టుడే, మే 2016 లో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  ***

Saturday, 9 April 2016

బిగ్ బిజినెస్ సృష్టించడానికి 5 మెట్లు [ Five Steps To Create A Big Business ]

“మా కళ్ళ  ముందే చిన్న పనులతో ప్రయాణం మొదలుపెట్టాడు, కళ్ళు మిరుమిరుమిట్లు గొలిపే విజయం సాధించాడు”
“ఏదో బ్రతకడానికి బజ్జీల బండి పెట్టుకున్నాడు, ఇప్పడు బిజినెస్ లో  బాగా దూసుకెళ్ళిపోతున్నాడు”
“ఆవిడ పాపం తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లోనే మిషన్ కుట్టి కుటుంబాన్ని పోషించేది, ఇప్పుడు వాళ్ళ కుటుంబం మొత్తం రకరకాల వ్యాపారాలలోకి వెళ్ళిపోయారు” ....ఇలాంటి నిజమైన సక్సెస్ స్టోరీస్  మీరు వినే ఉంటారు.
మీ చుట్టూ ఉన్న కొందరి రియల్ స్టోరీస్ గమనించినపుడు మీరు ఇలాగే ఫీల్ అయి ఉంటారు. మరి వారికి అద్భుత విజయం ఎలా సాధ్యమైంది? అందరిలా మొదలుపెట్టి, అందరికంటే ముందుగా, ఇతరులు ఊహించనంతగా సక్సెస్ సాధించిన వారు ఏమి చేసారు? వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? చిన్న వ్యాపారం నుంచి బిగ్ బిజినెస్ సృష్టించాలంటే ఎక్కవలసిన ఆ ఐదు మెట్లు ఏమిటి? ఇటు వ్యాపానికి, అటు ఉద్యోగానికి... ముఖ్యంగా ఉన్నత జీవితానికి ఉపయోగపడే ఆ ముఖ్యాంశాలేమిటో చూద్దాం.
***    ***    ***    ***    ***    ***
చిన్న వ్యాపారం మొదలుపెట్టటం, దాని ద్వారా వినియోగదారులకు ఉన్నత సేవలు, వస్తువులు అందించడం, వారి సమస్యలకు విలువైన సోల్యూషన్స్ ఇవ్వటం, అందుకు వారినుంచి డబ్బుని తీసుకోవటం అనేది ధైర్యవంతమైన పని. ఎంట్ర ప్రెన్యూర్ చేసేది అదే. మనలో చాలా మంది తమకు నచ్చిందని, ఆ ఏరియా లో ఎవ్వరు పెట్టలేదని, ఇతరులు  ఆ వ్యాపారంలో బాగా సంపాదించారని, తక్కువ పెట్టుబడితో వీలైందని, రిస్క్ లేని వ్యాపారం అని ఇలా రకరకాల కారణాలతో వ్యాపారం మొదలు పెడతారు. కానీ రోజువారి పనులు, పరిస్థితులు, నిజంగా ఆ ప్రోడక్ట్ అవసరం  స్థాయి (ఎవరికి , ఎప్పుడు, ఎక్కడ), ఆ ఫీల్డ్ లో ఇప్పటికే ఉన్న వారు సృష్టించిన కల్చర్, మారుతున్న ఆర్ధిక పరిస్థితులు, టెక్నాలజీ రెవల్యూషన్ వంటి ప్రభావాల వలన ఉన్న అభిరుచి, ప్యాషన్ కాస్త తగ్గే అవకాశం ఉంది. మీ లక్ష్యాల జర్నీ నుంచి ట్రాక్ పక్కకు లాగినట్లు, మీ ప్రయత్నాల దారిలో అడ్డంకులు వేసినట్లు రియాలిటీ కాస్త ఊహకు తేడాగా కనిపించొచ్చు. అనుభవ రాహిత్యం, ఇంకాస్త ప్రయత్న లోపం వలన లాభాలు తగ్గొచ్చు. ఒకోసారి అప్పటికే లాభాల కోసం ముందుకు వెళుతున్న పరిస్థితుల్లో , మళ్ళీ తిరోగమనం దిశగా వెళ్ళొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ ఐదు ముఖ్యమైన మెట్లు ప్రతి చిన్న వ్యాపారస్తుడు అర్థం చేసుకోవాలి , అధిరోహించాలి.


సోపానం 1: నేర్చుకోవడం ఎప్పటికీ ఆగదు       
ట్రైనింగ్ ప్రోగ్రాం లలో తరచు అడిగే ఒక ప్రశ్న .
మీలో ఎవరికి మార్పు కావాలి? అందరు చేతులు ఎత్తుతారు.
మీలో ఎవరు మారడానికి సిద్దంగా ఉన్నారు? .......కాసేపు సైలెన్స్.
ఆ సైలెన్స్ కి ముఖ్య కారణాలు రెండు.
  1. 90% పైగా ప్రజలు “మారడానికేముంది నేను అన్నీ కరెక్ట్ గానే చేస్తున్నా కదా?”  అనుకోవడం. ఇది వాస్తవమా? కాదా? తెలుసుకోలేకపోవటం.
  2. నా రిజల్ట్ ఇలా ఉండడానికి కారణం ఏమిటి అంటే.....”  అంటూ కారణాలు వెతుక్కోవటం.  
ఇంకొంచం నిశితంగా గమనిస్తే ....
పాయింట్-1 ప్రకారం మారడానికి ఏమి లేదు అనుకుంటే , మరి మీకు రిజల్ట్ బాగా వచ్చి ఉండాలి. వస్తుందా? ఒకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదేమో, కాని మనల్ని మనం మోసగించుకోకూడదు మిత్రులారా? వ్యాపారం ఐనా జీవితం అయినా అకౌంటబిలిటీ ముఖ్యం, సెల్ఫ్- అకౌంటబిలిటీ చాలా ముఖ్యం.
ఇక పాయింట్-2 ప్రకారం మీకు రిజల్ట్ రాకపోడానికి కారణాలు వెతుక్కుంటూపోతే  ఉదయం నిద్రలేకపోవడానికి కారణం రాత్రి మా వీధిలో కుక్కలు మొరగటమే కారణం అన్న వద్ద మొదలై వర్షాకాలం వర్షం చిరాకు, ఎండాకాలం వేడి, బస్సులలో రద్దీ...ఇలా పెద్ద లిస్టు  చెప్పుకోవచ్చు. కేవలం ఫైల్యుర్స్ కి  కారణాలు కనుక్కుంటే వ్యాపారాలు నిర్మించలేము. తెలివైన ఎస్కేపిస్ట్ స్థితిని దాటి ఫలితాలకు బాధ్యత వహించే వ్యక్తిగా మారాలి. అందుకే మా ట్రైనింగ్ కార్యక్రమాలలో చెప్తుంటాము మీ busyness నిజమైన బిజినెస్ గా మార్చుకోండి అని.
చాలా వ్యాపారాలలో (కొన్ని కార్పొరేట్ కంపెనీలు  కూడా) మా ఉద్యోగస్తులకి రెండుగంటలు, ఒక పూట / ఒక్క రోజు మోటివేషన్ కావాలి అంటారు. మోటివేషన్ అంటే ట్రైనింగ్ కి మరో పేరు అనో, మోటివేషన్ అంటే ట్రైనింగ్ అనో అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాస్త అవగాహన ఉన్న కొందరు ఒక వారం ట్రైనింగ్ ఇప్పిస్తారు. గొప్ప పాఠం ఏమిటంటే మీ  సిబ్బంది అందరికీ , మీకూ నిరంతరం శిక్షణ (ట్రైనింగ్ ) అవసరం. ఇది ఒక నిరంతర ప్రక్రియ. దీనికి రెండు పెద్ద సవాళ్ళు  ఏమిటంటే సమయం (టైం), శిక్షణ ఖర్చు (మనీ). సమయాన్ని అడ్డంకి అనుకుంటే మీ ఎంప్లాయిస్ రోజువారీ పనులలో  ఉపయోగపడే స్కిల్ల్స్ నేర్చుకుని , ఇతరులకు నేర్పడం అనేది వారి బాధ్యతలలో భాగం చేయండి. 

సోపానం 2: విషయజ్ఞానం ఇవ్వండి, నిరదారితంగా చెప్పొద్దు         
ఈరోజుల్లో అతిగా మార్కెటింగ్ చేస్తే అది గోల గోల గా చేసినట్లు ఔతుంది. మార్కెటింగ్ అంటే మీ ప్రాముఖ్యతల గురించి, మీ సంస్థ కి వచ్చిన అవార్డ్ లు, గుర్తింపుల గురించి చెప్పటం కాదు మార్కెటింగ్ అంటే అవసరం ఉన్న వ్యక్తులతో బంధాన్ని ఏర్పరుచుకోవడం, వారి అవసరాలను మీరు ఎలా తీరుస్తారో , ఎంత ఉన్నతంగా ఆ పని చేయగలరో చెప్పడం. అందుకు విషయ జ్ఞానం ఇవ్వాలి . మోటివేషన్ కొన్నాళ్ళే ఉంటుంది, అయితే ఎక్కువ కాలం బిజినెస్ ఉండాలి, ఉన్నతంగా ఎదగాలి అంటే కొన్ని విధానాలు టీం కి నేర్పగలగాలి అందుకు ప్రతినెల శిక్షణ అవసరం అని చెప్పడానికి కారణం ఇదే. ఉన్నత మార్కెటింగ్ అనేది విషయజ్ఞానం ఇస్తుంది, ఒప్పిస్తుంది, నమ్మకంగా సర్వీస్ , ప్రోడక్ట్  వినియోగించేలా చేస్తుంది. ఇతర సంస్థలు కూడా మీరు ఇచ్చే సర్వీస్ ఇస్తూ ఉంటాయి. కేవలం మా వద్ద కూడా ఫలానా సర్వీస్ లు ఉన్నాయని ఊక దంపుడు ప్రకటనలు గుప్పించి  తక్కువ నాణ్యత అందించే వారు కొన్నాళ్ళు మార్కెట్ లో ఉన్నా తర్వాత కనుమరుగై పోతారు. అలాంటి  పోటీదారులు ఉన్నచోట ఉన్నతమైన ఆశయంతో, కనీస నాణ్యతతో, సృజనాత్మక విధానాలతో, ఉన్నత వినియోగదారుల సేవతో మీరు రాణించవచ్చు. ఇందుకు నిబద్దత అవసరం. 

సోపానం 3:  సేల్స్ అనేది చెడు మాట కాదు          
నిజానికి ఒక చిన్న వ్యాపారం లేదా సంస్థ లో ఉన్న ప్రతి వ్యక్తి సేల్స్ లో ఉన్నట్లు, లేదంటే ఖచ్చితంగా సేల్స్ కి వ్యతిరేక డిపార్టుమెంటు లో ఉన్నట్లే. అవును చేదు మందులా ఉన్నా , ఇది వ్యాపార ఆరోగ్యాన్ని కాపాడే వాస్తవం. ఒక వ్యక్తి తన బాధ్యతల్లో సేల్స్ కి ఎలా దోహదపడుతుందో తెలుసుకోవాలి. ఒక టీచర్ తన క్లాసు లో ఉన్న పిల్లలతో ఎలా ఉంటున్నారు అనేది ఆ పిల్లలు ఇంటికి వెళ్లి స్కూల్ గురించి ఎలాంటి ముచ్చ్చట్లు షేర్ చేస్తారు అనేది ఆధారపడి ఉంటుంది. మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తే, ఆ ప్రభావం ఉన్నతంగా ఉంటుంది. అది పేరెంట్స్ లో తర్వాతి విద్యా సంవత్సరంలో  అక్కడే చదివించాలా వద్దా అనే నిర్ణయానికి దోహదం చేస్తుంది. ఈరోజుల్లో ఏదో ఒకటి చేసి  ప్రోడక్ట్ , సర్వీస్ ని అంటగట్టే వాళ్ళు సేల్స్ లో ఉండలేరు. ఇప్పుడు కస్టమర్ కి ఎక్కువ విషయ పరిజ్ఞానం ఉంది, అవసరమైతే సామాజిక మాధ్యమాలలో, ఆన్ లైన్ లో మీ గురించి, మీ సర్వీస్ గురించి, మీకు మీ కాంపిటీటర్ కు వ్యత్యాసం గురించి తెలుసుకుని వస్తారు. ఇప్పుడు సేల్స్, మార్కెటింగ్ వ్యక్తికి కావలసింది పెద్దమొత్తం లో - ఎదో ఒకటి చెప్పి- అమ్మే వాళ్ళు కాదు. స్పష్టంగా అవసరమైన ప్రశ్నలు వేస్తూ, కస్టమర్ అవసరాలు మనసుతో తెలుసుకుని, వారి అవసరాలకు ప్రోడక్ట్ ఇచ్చే సొల్యూషన్ ని మ్యాచ్ చేసి ఒప్పించగల వాళ్ళు, కస్టమర్ ఆనందంగా నిర్ణయాలు తీసుకునేలా చేయగలవారు, సంస్థ పై నమ్మకాన్ని కస్టమర్ మనసులో ముద్రించ గలవారు. ప్రోడక్ట్ గురించి ఊదర గొట్టే నాలెడ్జ్ మాత్రమే కాకుండా కస్టమర్ నిజమైన అవసరాలు ఏమిటి, వాటిని ఎలా చేరుకోగలరు అనే సంభాషణ ఉన్నతంగా చేయగలవారు.



సోపానం 4:  మీ బ్రాండ్ తో జీవించండి           
కాకినాడ కాజా, హైదరాబాద్ బిర్యాని, గుంటూరు మిర్చి చాలా గుర్తింపు ఉన్న మాట మనందరికీ తెలిసిందే. కాని ఒక్క సారి ఈ ప్రదేశాలకు వెళ్ళాక కొత్త వారికి కూడా ఇంకోటి తెలుస్తుంది.
కాకినాడ కోటయ్య స్వీట్స్, హైదరాబాడ్ పారడైస్ బిర్యాని, గుంటూరు కోమల విలాస్.....బ్రాండ్ గుర్తింపు అంటే ఇది.  మీ ప్రాంతంలో మీరు ఎంచుకున్న ప్రోడక్ట్ , సర్వీస్ కు ఒక బ్రాండ్ నేమ్ గా గుర్తింపు రావాలి. అందుకు ప్రయత్నించాలి. చిన్న వ్యాపారం ఉన్న వాళ్ళకి కొందరికి ఈ పదాలు తెలియవు. కొందరు జనాల్లో గుర్తుండిపోయేలా క్రియేటివ్ గా కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. ఎవరు బ్రాండింగ్ చేస్తారో వాళ్ళతో ప్రజలు బాండింగ్ (బంధాలు) కొనసాగిస్తారు. ఎవరికి బంధాలు ఎక్కువ ఉంటాయో వారికి బిజినెస్ బాగుంటుంది. మీ బ్రాండింగ్ అనేది మీకు అద్దం (మిర్రర్) వంటిది. ఇది మీ నిజ ప్రతిరూపం వంటిది అలాగే కస్టమర్స్ తమని తాము అందులో  చూసుకోడానికి మీతో కలిసిపోడానికి అవకాశాన్ని ఇస్తుంది. తమకి ఎదురైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక్కొక్క కస్టమర్ మీ బ్రాండ్ గురించి ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది. అందుకే మీ వెబ్ సైట్, మీ బిజినెస్ కార్డు, మీ ఆఫీస్ లో ఎంప్లాయిస్ మాట్లాడే విధానం, మీ ప్రోడక్ట్,  సర్వీస్  తర్వాత మీరు ఇచ్చే సేవలు అన్నీ జాగ్రత తీసుకోండి. అందమైన, ఉన్నత మైన అనుభవంలా ఇచ్చే ప్రయత్నాలు చేయండి.

సోపానం 5:  సరైన సమయం కోసం వెయిట్ చేయకండి              

మిస్టేక్స్ జరిగితే ప్రోత్సహించండి. విచిత్రంగా ఉందా ? అవును అప్పుడే కదా ఎదో కొత్తదనంగా  ప్రయత్నం చేస్తున్నారు అని తెలిసేది. అందుకే మీ టీం క్రియేటివ్ గా పనిచేసేలా ప్రోత్సహించండి. ఆ ప్రయత్నాలకు అభినందించండి. అంతే కాదు ఘోరమైన వైఫల్యాలు తర్వాతే విషయాలు నేర్చుకుని మరోలా ప్రయత్నిస్తారు. కాపోతే  మిస్టేక్స్ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోకుండా ఇది ఒక పాఠం అంటూ నెలలు, సంవత్సరాలు గడపకుండా జాగ్రత్త పడాలి. అసలు ఏ ప్రయత్నం చేయకుండా , ఫెయిల్ అవుతానేమో అని స్తబ్దంగా కూర్చుంటే వ్యాపారం కూడా స్తబ్దంగా ఉండిపోతుంది. మీరు గమనించారా చిన్న హోటల్స్ లో ఒకోసారి ఇడ్లి రెండు, వడ ఒక్కటి ఇమ్మంటే ప్రతి ఐటెం ఖచ్చితంగా 4 తీసుకోవాలిసిందే అంటారు. కస్టమర్ అవసరాలు ఏంటో ఆలోచించరు, కస్టమర్ కి ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ఇస్తున్నారో అసలు గుర్తించరు. ఇంకా బాగా ఎదగాలంటే ఏమి చేయాలో ఆలోచించరు. అందుకే అంతే ఉంటారు. ఉన్నతంగా ఎదగాలంటే ప్రయత్నాలనుంచి వచ్చిన ఫలితాలు తట్టుకోగాలగాలి, ఇంకా ప్రయత్నించాలి. సరైన సమయం కోసం వెయిట్ చేయకూడదు. తక్కువ సమయంలో ఎక్కువ ప్రయత్నాలు చెయ్యాలి. ఆశించిన ఫలితాలు రావాలంటే ఎలాంటి ప్రయత్నం చేయాలో అర్థం చేసుకోగలగాలి. అందుకు ఫ్లెక్సి బిలిటీ ఉండాలి. నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉండాలి, చేస్తూ నేర్చుకోవాలి, నేర్చుకుంటూ ఎదగాలి.  

Five Steps To Reach Startup To Big Business:
1. Learning never ends in entrepreneurship
2. Be sincere to educate the customer / end-user
3. Sales is not bad word. Every one in small business is a sales person, other wise in anti-sales department
4. Create a brand identity with whatever resources you have
5. Don't wait for right time to come. Create every moment as the best moment in getting things done.

***  ***  ***  సైకాలజీ టుడే, ఏప్రిల్ 2016 లో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  ***