Monday, 25 June 2018

అంకురసంస్థ ఫ్లాప్ షో కాకూడదంటే ఆరు మెట్లు 6 Steps to Safe guard Your Start Up from Failures



6 Steps to Safe guard Your Start Up from Failures
Imagine that failure is common in any human effort. but that's not the final result until you accept it. These are the common things you can be conscious about to avoid failure in starting up.
1. Find whether the product/ service you offer is really needed
2. Make sure you are with right team who can bring value to current need and future of the venture. Hire slow , fire fast or whatever the rule but make sure you use human resources effectively
3. Have a mentor who can bring your abilities to assets of the organisation
4. Remember that great idea is useless until you act upon. So idea to execution is important. Execution itself is oxygen.
5. Manage your cash flow so that you have a systematic revenue stream, reviews of expenses and take decisions based on that.

యువత తాను చేయాలనుకున్న పనిని వేగంగా చేసే రోజులివి, టెక్నాలజీ ఇచ్చే సౌకర్యాలతో ఫింగర్ టిప్స్ మీదే బిజినెస్ ట్రిక్స్ నేర్చుకుంటున్నారు. మరి అలా అయితే ఎంట్రప్రెన్యూర్షిప్ మీద ప్రేమతో స్వతంత్రంగా స్టార్ట్ అప్ మొదలెట్టిన ప్రతి ఒక్కరు సక్సెస్ కావచ్చా? అసలు స్టార్ట్ అప్స్ ఫెయిల్ అవుతున్నాయా? అయితే కారణాలేమిటి? తాము చేపట్టిన వెంచర్ ఫెయిల్ కాకుండా ఉండాలంటే ఎలాంటి మెట్లు ఎక్కాలి? ఈ అంశాలను చర్చించేదుకే మన ఈ ఆర్టికల్. మరెందుకు ఆలస్యం, రండి  ఫెయిల్యూర్ ని ఎలా ఫెయిల్ చేయాలో నేర్చుకుందాం.   
***    ***    ***    ***    ***    ***

ఎంట్రప్రెన్యూర్, సి.ఈ.ఓ., ఫౌండర్ , స్టార్ట్ –అప్ ...ఈ పదాలు ఈ మధ్య కాలంలో బాగా వినపడుతున్నాయి. అయితే అంతే వేగంగా ప్రభుత్వాలు, ప్రైవేటు కంపెనీస్ అంకుర సంస్థలు (స్టార్ట్ –అప్స్) ని అనేక సౌకర్యాలతో ప్రోత్సహించే దశలో ఉంది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ ఎంట్ర ప్రెన్యూర్ సమ్మిట్ 2017 లో ప్రపంచదేశాల నుంచి దాదాపు 2000 మంది డెలిగేట్స్ వచ్చారు. రానున్న కాలంలో వారి సంస్థల కోసం , వాటి విజయం కోసం టెక్నాలజీ, డబ్బు, పాలసీ ల మార్పులు, మెంటర్స్ అవసరాల గురించి చర్చించారు. అయితే  ఇంత వేగంగా అనేక మంది అడుగుపెడుతున్నప్పుడు మరి మన స్టార్ట్ అప్ సక్సెస్ కావాలంటే ఏమి చేయాలి అసలు స్టార్ట్-అప్ లు ఫెయిల్ అవుతాయా? ఎంట్ర ప్రెన్యూర్ లో యువత ఫెయిల్ ఎందుకు అవుతుంది?
అపజయానికి అతీతం కాదు: ఎంట్ర ప్రెన్యూర్షిప్ అనగానే "ప్రపంచానికి మంచి చేయాలనే ఉద్దేశ్యంతో ... కనీసం మీ ప్రాంత అవసరాలు తీర్చేలా సదుద్దేశ్యంతో ఉన్నపుడు ఎప్పటికైనా సక్సెస్ అవుతాం" అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. చదువులో, ఉద్యోగంలో ఫెయిల్ అయినట్లే ఎంట్రప్రెన్యూర్స్ అంకుర సంస్థలను అపజయం ఎదుర్కునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
 ప్రతి 10 స్టార్ట్ –అప్స్ లో 9 ఫెయిల్ అవుతాయి. చేదుగా ఉన్నా ఇది నిజం.  ట్రక్సన్ సంస్థ రిపోర్ట్ ప్రకారం దాదాపు 200 అంకుర సంస్థలు 2016 లో మూతబడ్డాయి. జొమాటో, స్విగ్గీ వంటి ఆహార పదార్థాలను , మంచి డిషెస్ ను ఇంటికే తీసుకువచ్చి ఇచ్చే ఫుడ్ స్టార్ట్ – అప్స్ మొదటిగా ఈ రంగంలో అడుగు పెట్టారు కాబట్టి నిలబడ్డారు, ప్రజలు వారినే ఫాలో అవుతున్నారు కానీ ఆ తర్వాత అలాగే ఇంకొంచం తక్కువ ధరలతో వచ్చినా కానీ సక్సెస్ కాలేదు. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి సంస్థల లోకంలోంచి బయటికి వచ్చి చూస్తే ఊబర్ (Uber) వంటి దిగ్గజాలు కూడా 600 కోట్లకు పైగా నష్టాలను చూస్తున్నాయని ఇటీవల పత్రికలలో చదివాము. మనదేశంలో దాదాపు 17,000 టెక్నాలజీ ఆధారిత అంకుర సంస్థలు ఉంటే వాటిలో కేవలం 13 మాత్రమే 1 బిలియన్ విలువ కలిగిన యూనికార్న్ క్లబ్ లో ఉన్నాయి. ఈ 17 వేల అంకుర సంస్థలలో 2022 కేవలం పదిశాతమే మిగులుతాయని ఒక అంచనా. తమ ప్రోడక్ట్, సేవల ద్వారా ఈ ప్రపంచాన్నే మార్చేద్దాం అన్న ఆలోచనతో మొదలైన అంకుర సంస్థలు ఎందుకు ఇలా కనుమరుగైపోతున్నాయి? అవి తెలుసుకోవాలంటే ఈ ఐదు సోపానాలు గమనించాలి. మీ స్టార్ట్ అప్ దృష్టిలో ఉంచుకుని ఒక్కొక్క మెట్టు అధిరోహించండి. 
1.   అవసరం లేని ప్రోడక్ట్: ఒక ఎంట్ర ప్రెన్యూర్ తాను అందిస్తున్న ప్రోడక్ట్ లేదా సర్వీస్ అవసరం ఎంత స్థాయిలో ఉంది అర్థం చేసుకోవాలి. దానిపై పని మొదలు పెట్టే సమయంలోనే మార్కెట్ రీసెర్చ్ చేయాలి. లేదా వర్క్ మొదలయ్యాక నిజంగా ప్రజలు ఈ ప్రోడక్ట్ ని తీసుకుంటున్నారా లేదా మనకు నచ్చింది కాబట్టి మాత్రమే చేస్తూ వెళ్తున్నామా అని గమనించాలి. కస్టమర్ల ప్రయారిటీలో లేకపోయినా, మీ కస్టమర్స్ తిరిగి ఆ అవసరాలకు మీ వద్దకు వచ్చేది లేదని అర్థమైనా నిజంగా దాని అవసరం ఎంతనేది ఆలోచించగలగాలి. ఒక సర్వేలో 42% స్టార్ట్ అప్స్ ఫెయిల్యూర్ కి కారణం  మార్కెట్ లేని ప్రోడక్ట్ అని తెలిసింది. మీ ప్రోడక్ట్, సేవ ఎంచుకున్న ఏరియాలో బాగా అవసరం ఉండాలి అనేది గుర్తుంచుకోండి ఎందుకంటే విలువనిచ్చే పనులు చేస్తే మూల్యం చెల్లిస్తారు , వేల్యూ ఉంటేనే ప్రైస్ ఇస్తారు.
2.   విలువైన బృందం: గత నెలల్లో చర్చించినట్లు ఎంట్ర ప్రెన్యూర్ గా ఎదిగే క్రమంలో బృందం చాలా కీలకం. బృందంలో ఆ ప్రోడక్ట్ , సర్వీస్ లను అద్భుతంగా అవసరమైన వారికి సరైన సమయంలో చేర్చే నేర్పు, నిరంతరం నూతనత్వం అందించగల సృజనాత్మకత, మీరు మాత్రమే చేయగల అంశాలు -  మీ యునిక్ సెల్లింగ్ ప్రిపోజిషన్ (USP) ని కమ్యూనికేట్ చేయగలిగే టాలెంట్ ఉన్న వారు ఉండాలి. అంకుర సంస్థలో ఏ సమయంలో ఎవరిని ఎలా వాడుకోవాలో తెలియకపోతే మానవ వనరులు సరిగా ఉపయోగపడవు. ఈ దశలో జోడి సరిగా లేని బృందం ఎదుగుదల ని చాలా ప్రభావితం చేస్తుంది. ఎంట్ర ప్రెన్యూర్షిప్ లో విజయాలు సాధించే బృందం సభ్యులందరి నైపుణ్యాలను వినియోగించుకుంటుంది, మార్కెట్ అవసరాలకు తగినట్లు మార్పులు చేయడానికి సిద్దంగా ఉంటుంది, అనుభవం లేకపోయినా కొత్త విధానాలలో వినియోగదారులను చేరేందుకు ప్రయత్నిస్తుంది, కొత్త బ్రాండింగ్ తో ముందుకు వెళుతుంది, అనూహ్యంగా ఎదురయ్యే సవాళ్ళ సమయంలో తోటి వ్యక్తులతో సమతుల్యంగా మాట్లాడే సంస్కృతిని ప్రోత్సహిస్తుంది, గతంలోని అపజయాలకు కుంగి పోకుండా భవిష్యత్తు విజయం పై దృష్టి పెడుతుంది. 
3.   మెంటార్ ఆవశ్యకత: ఒక అంకుర సంస్థ కు మెంటార్ ఉండడం చాలా మంచిది లేదంటే ప్రతి చిన్న పనికి తప్పొప్పులు మీద పట్టులేకుండానే పని చేయాల్సి వస్తుంది. మెంటార్స్  తమ అనుభవంతో ఐడియా ఎలా ముందుకు తీసుకెళ్ళవచ్చో చెప్పగలరు, ప్రాక్టికల్ సవాళ్ళను ఊహించి ముందుగా మిమ్మల్ని ఎలర్ట్ చేయగలరు, మీరు గమనించని అవకాశాలు, వనరులను పక్షి దృష్టితో (బర్డ్స్ ఐ వ్యూ ) అర్థం చేసుకుని మీరు ఆ అవకాశాలను ఉపయోగించుకునేలా సపోర్ట్ చేస్తారు. టెక్నికల్, జనరల్, బిజినెస్ ప్రాసెస్, ఫండ్ రైజింగ్ లో మెంటార్ సపోర్ట్ ఉన్నవారికి విజయావకాశాలు ఎక్కువ.      
4.   ఆలోచనకు – ఆచరణకు దూరం : ఒక గొప్ప ఐడియా అంకుర సంస్థ రూపు దిద్దుకోవాలంటే పేరు, రిజిస్ట్రేషన్, లోగో డిజైన్, కాప్షన్ లైన్ అనుకుంటే దానికంటే అమాయకత్వం ఇంకోటి ఉండదు. ఆ ఐడియాని అమలుచేయాల్సిన విధానాలపై మొదట్లో మీకు ఒక క్లారిటీ ఉంటుంది. అది చూసింది, లేదా ఇతరులు చేసింది, లేదా మరో బిజినెస్ మోడల్ నుంచి వచ్చిందో అయి ఉండొచ్చు. లేదా నూతన ఆవిష్కరణ అయుండొచ్చు. కానీ దానిని మీరు అమలు చేస్తూ ఉన్నప్పుడు ఇంకా చెప్పాలంటే లక్ష్యాలు పెట్టుకుని నూరు శాతం ప్రయతించినపుడు వాటి లో వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి. సో గ్రేట్ ఐడియా కంటే గ్రేట్ యాక్షన్ ముఖ్యం. బరిలోకి దిగితేనే గెలుపు దిశలో అడుగులు పడినట్లు ఆటే ఆడకుండా గెలుపు వీలుకాదు. అందుకే అంకురా సంస్థలు వారి ఆలోచనకు – ఆచరణకు మధ్య దూరం అర్థం చేసుకుని సయోధ్య తో ముందుకు వెళ్ళాలి.  
5.   కాష్ ఫ్లో: ఒక అంకుర సంస్థ అందిస్తున్న వస్తువు,  సేవలు ద్వారా డబ్బుని సృష్టించాలి. ఆ డబ్బు అన్ని ఖర్చులనూ మొదటి నెలలోనే తీర్చనప్పటికీ కనీసం వీలైనంత త్వరగా ఆ డబ్బు ఆ పనికి అయ్యే ఇన్ పుట్ కాస్ట్ కంటే ఎక్కువ ఉండాలి. అన్ని ఖర్చులూ పోను కొంత డబ్బు మిగిలి బిజినెస్ విజయవంతంగా నడవాలంటే ఈ కాష్ ఫ్లో లో వివరాలు స్పష్టంగా తెలియాలి. సంవత్సరం చివరికి ఇన్ని సేల్స్ అయితే కహ్శ్ర్చులు పోను ఇంత మిగులుతుంది అనే ఫైనల్ బాలన్స్ మాత్రమే తెలిసినా కాష్ ఫ్లో వచ్చినట్లు కాదు నీకు ప్రతి నెలా ట్రెండ్ తెలియాలి. ఐడియా తో లవ్ లో పడి స్టార్ట్ అప్ మొదలుపెట్టి నాకు డబ్బు గురించి ఏమి తెలియదు అంటే జీవితంలో ఆర్ధిక సవాళ్ళకు రెడీ  ఉండాల్సుంటుంది. గుర్తుంచుకోండి మీరు విలువైన ప్రోడక్ట్ ఇవ్వాలి, అందుకు తగిన డబ్బు తీసుకోవాలి. అదే ఎక్కువ కాలం నడపగల అంకుర వ్యాపారం.  
ఈ ఐదు విషయాలు అర్థం చేసుకుంటే  అంకుర సంస్థ నడిపే ఎంట్ర ప్రెన్యూర్స్ ఫెయిల్ అవకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. వీటితో పాటు నిరంతర స్వయం ప్రేరణ, అకుంటిత దీక్ష, అవసరమైనంత సమయం నిర్మాణాత్మకంగా పనిచేయడం, కొత్తగా చేసిన పైలట్ ప్రాజెక్ట్ రెస్పాన్స్ దృష్టిలో పెట్టుకుని మార్పులు చేసుకోవటం, సరైన సమయంలో సరైన పనులు చేయగలగటం, మార్కెట్ అంచనా, విచ్చిన్న సాంకేతికత (డిస్రప్టివ్ టెక్నాలజీ), మార్కెట్ లీడర్ బెంచ్ మార్కింగ్ ని ఎదుర్కోగలగటం, ఎంత అవసరమో అంతే ఫండ్ రైజ్ చేసుకోవటం వంటి అంశాలు కూడా కీలకమైన అంశాలు.    

ఈ వ్యాసం "ఫెయిల్ అవుతారు" అని భయపెట్టడానికి రాయలేదు; వాస్తవాలు ఎలా ఉంటాయో చెప్పడానికి రాసాను. కాబట్టి ఈ కీలక అంశాలను దృష్టిలో ఉంచుకుని అంకుర సంస్థ స్థాపించి మరింత ఫలవంతంగా మీ ప్రయత్నాలుచేసి ప్రధాని చెప్పినట్లు స్టాండ్ అప్ -  స్టార్ట్ అప్ –  స్కేల్ అప్ అంటూ ముందుకు వెళ్ళండి. మీ ఆలోచనలే ఆవిష్కరణలు కావాలని, మీరూ ఇండియా గ్రోత్ స్టొరీ లో భాగం కావాలని  ఆకాక్షిస్తున్నాం.
***  ***  ***  సైకాలజీ టుడే, జనవరి  2018 తెలుగు పత్రికలో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  *** 

Wednesday, 23 May 2018

ఎంట్ర ప్రెన్యూర్ షిప్, బిజినెస్....మీ ప్రయాణం ఎటువైపు? Entrepreneurship or Business - What's your choice?

ఎంట్రప్రెన్యూర్షిప్ కి, బిజినెస్ కి మధ్య వ్యత్యాసం ఉందా? లేక రెండూ ఒకటేనా? ఈ రెండింటికి మధ్య పోలికలు ఉన్నాయా? ఎంట్రప్రెన్యూర్స్ ఎవరు? బిజినెస్ పీపుల్ ఎవరు? వాళ్ళ ఆలోచనా రీతులు ఏమిటి? ఈ అంశాలను తెలియజేసే ప్రయత్నమే ఈ ప్రత్యేక వ్యాసం.
***    ***    ***    ***    ***    ***
ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ ప్రకారం ఒక వ్యక్తి బిజినెస్ మొదలుపెట్టి, రిస్క్ చేయటానికి సిద్దమై, లాభాలకోసం పని చేస్తే అతన్ని ఎంట్రప్రెన్యూర్ (Entrepreneur) అంటారు. ఇది  ఫ్రెంచ్ నుంచి వచ్చిన పదం.  నిజానికి ఈ పదాన్ని ఆంట్రప్రెన్యూర్  అని పలకాలి, కానీ మనకు మొదటినుంచి ఎంట్రప్రెన్యూర్ పలకడం అలవాటైపోయింది.   
ఎంట్రప్రెన్యూర్స్ ఎవరు? బిజినెస్ పీపుల్ ఎవరు? ఎంట్రప్రెన్యూర్షిప్ కి, బిజినెస్ కి తేడా ఏమిటి? మీకెప్పుడైనా ఈ అనుమానం వచ్చిందా? ఈ రెండు విధానాలలోనూ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తారు, వినియోగదారుల సమస్యలు తీరుస్తారు, జాతీయ ఆర్ధిక ఎదుగుదలలో సహకరిస్తారు. రెండుపదాలనూ ఒకే అర్థం వచ్చేలా విరివిగా వాడుతుంటారు.  కన్ఫ్యూజన్ నుంచి స్పష్టత తెచ్చుకునే ప్రయత్నం చేస్తే మనం ఏ విధానాలలో ఆలోచిస్తున్నాము, మనకు అవసరమైన పద్ధతి ఏమిటి అనే క్లారిటీ వస్తుంది. ఎంట్రప్రెన్యూర్షిప్ కి, బిజినెస్ కి మధ్య అనేక పోలికలు ఉన్నాయి, అలాగే రెంటి మధ్య సన్నని గీత గీస్తూ కొన్ని భేదాలు  ఉన్నాయి.  వాటిని చర్చిద్దాం రండి.    
ఉద్దేశ్యం లో భేదాలు : ఎక్కువ మంది  బిజినెస్ పర్సన్స్ (బిజినెస్ మాన్, బిజినెస్ ఉమన్ స్థానంలో వాడుకలోకి వచ్చిన పదం) తమ లాభాల కోసం, జీవనోపాధి కోసం, “తమకి తామే బాస్” ఉద్దేశ్యంతో, ఆర్ధిక లక్ష్యాలు సాధించటం కోసం వ్యాపారం చేస్తారు. ఎంట్ర ప్రెన్యూర్స్ ప్రపంచంలో ఒక మంచి మార్పు జరగాలి అనే దిశలో ఆలోచిస్తారు, అందుకోసం తామేం చేయగలం అనే విధానంలో పనులు చేస్తారు. ఆర్ధిక అంశాలు, లాభాల కంటే మనుషులకు, ప్రపంచానికి ఉపయోగపడే పని చేయాలనే తపన ఎక్కువ కనిపిస్తుంది.  
ఐడియా విషయంలో: బిజినెస్ చేసేవారు ప్రోడక్ట్, సర్వీస్ ఐడియా తమ సొంతం కాకపోయినా కావలసిన లాభాల కోసం వ్యాపారం మొదలు పెడతారు, ఫ్రాంచైజీ తీసుకుంటారు, వనరులు సమకూర్చుకుని ఇతర విజయవంతమైన పద్దతులనూ పాటిస్తారు.  ఎంట్ర ప్రెన్యూర్స్ తమ సొంత ఐడియాతో ఒక ప్రోడక్ట్, సర్వీస్ సృష్టిస్తారు, దానిపై తమ సమయం, శక్తి, డబ్బు వెచ్చిస్తారు. తమ సొంతం కాని ఐడియా నుంచి బిజినెస్ మొదలు పెట్టరు. అందుకే ఎంట్ర ప్రెన్యూర్స్ అంకుర సంస్థ (స్టార్ట్ –అప్)లతో మొదలు పెడతారు.         

రిస్క్ తీసుకునే విధానంలో: బిజినెస్ చేసేవారు అన్ని లెక్కలతో పక్కాగా రిస్క్ తీసుకుంటే వచ్చే లాభనష్టాలు బేరీజు వ్యాపారం చేస్తారు. డబ్బు కోల్పోవటం, అప్పులలోకి వెళ్ళటం అనే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పనులు చేస్తారు.    ఎంట్ర ప్రెన్యూర్స్ లెక్కల గురించి ఆలోచించకుండా చేయాలనే పనిలోకి దూకేస్తారు, క్రేజీగా రిస్క్ తీసుకుంటారు. తమ సొంత ఆలోచనను పరీక్షించుకుని, ప్రపంచానికి మంచి చేయాలనే ఉద్దేశ్యంతో తమ సమయం, శక్తి, ఖర్చు గురించి ఆలోచన లేకుండా పని చేస్తారు.

ఎంప్లాయిస్ ను, వినియోగదారులను చూసే విధానం:    బిజినెస్ పర్సన్  తమ వద్ద పనిచేసే వారిని ఒక మేనేజర్ చూస్తారు. వారు తన వ్యాపారం ఎదగడానికి ఉపయోగాపడాలని ఆశిస్తాడు. ఎంట్ర ప్రెన్యూర్ ఒక స్నేహితునిలా, నాయకుడిలా పనివెనుక ఉద్దేశ్యం చెప్తూ ప్రోత్సాహిస్తారు. వారిని ఆ మంచి కార్యంలోకి ఆహ్వానించి భాగస్వామ్యుల్ని చేస్తారు. బిజినెస్ చేసేవారు తమ కస్టమర్లను వస్తువులు, సేవలను తీసుకుని సేల్స్, డబ్బు అందించే నిధిలా చూస్తారు.   ఎంట్ర ప్రెన్యూర్స్ తమ వినియోగదారులను విధులు, బాధ్యతలు నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన వారిగా చూస్తారు.
బిజినెస్ పర్సన్ , ఎంట్ర ప్రెన్యూర్ కి తేడాను ఈ టేబుల్ లో స్పష్టంగా గమనించండి :
బిజినెస్ పర్సన్స్
ఎంట్ర ప్రెన్యూర్స్
v సాంప్రదాయ విధానం. నిర్ణయించిన మార్గంలో నడుస్తారు.
ü నూతన ఆవిష్కరణలు, వేగవంతమైన విధానాలు  పాటిస్తూ వారే మార్గాన్ని నిర్ణయిస్తారు.
v ఆల్రెడీ ఉన్న ఐడియా నుంచి బిజినెస్ మొదలుపెట్టి, దాని అడ్మినిస్ట్రేషన్ మీద  దృష్టి పెడతారు
ü సొంత కొత్త ఐడియా నుంచి బిజినెస్ మొదలు పెడతారు, ఆవిష్కరనలపై దృష్టి పెడతారు 
v లెక్కలు వేసుకునే లక్షణం ఎక్కువ. అనేక మంది బిజినెస్ ప్రత్యర్థులు ఉండొచ్చు
ü సహజమైన ఇష్టంతో పనిచేస్తారు. తమకు తామే పోటీదారులు, తమను మెరుగుపరుచుకునే పనులు చేస్తారు   
v కాంపిటీషన్ మీద దృష్టి పెడతారు
ü కోఆపరేషన్  తో కలిసి పని చేయాలనుకుంటారు
v వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి సమయం తక్కువ 
ü వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి, పనికి  సమయం కేటాయిస్తారు  
v ఆలోచనలలో అబద్రతా భావం, భయం తో ఉండొచ్చు
ü కుతూహలం, స్వేచ్చ తో ఉంటారు
v లాభాల దిశలో ఆలోచిస్తారు
ü చేసే పనులు, మనుషులు ఎలాంటి ఉద్దేశ్యంతో చేస్తున్నాము అనే విలువ గురించి ఆలోచిస్తారు
v మార్కెట్ ప్లేయర్ గా ఉంటారు.  వ్యాపారం ఉత్పాదకత పెరగడానికి మానవ వనరులను నియమించుకుంటారు 
ü మార్కెట్ లీడర్ గా ఉంటారు.  మనుషులను ఉత్పాదకంగా చేయడానికి నియమించుకుంటారు

ఈ వ్యత్యాసాలను గమనిస్తే ఎంట్ర ప్రెన్యూర్ షిప్ అనేది అంత ఈజీ ఫీట్ ఏం కాదు అనేది స్పష్టంగా అర్థమౌతుంది. ఎంట్ర ప్రెన్యూర్ కూడా ఒక బిజినెస్ పర్సనే అయితే ఎక్కువ ఇంపాక్ట్ ఉండే ఆలోచనలు, పర్సనల్ లైఫ్ బాలన్స్, పర్పస్ -విలువల తో నడిచే వారిగా గమనించవచ్చు. ఒక సాధారణ బిజినెస్ పర్సన్స్ లా కాకుండా ప్రపంచం గురించి, సమాజం గురించి ఉన్నత భావాలతో కార్యక్రమాలు, ప్రాజెక్ట్ లు చేసేవారే ఎంట్ర ప్రెన్యూర్స్ గా ఎదుగుతారు, ఎంచుకున్న రంగంలో లీడర్స్ గా మారతారు, ప్రపంచం పై తమదైన ముద్ర వేస్తారు. 

 ***  ***  ***  సైకాలజీ టుడే, డిసెంబర్  2017 లో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  ***