లక్ష్యాల దిశలో ప్రణాళికతో అడుగు వేయండి
మీలో ఫైర్ రగిలించే గొప్ప లక్ష్యాలు
నిర్ణయించుకున్నా, ఎంత ఉన్నత పద్దతులలో నిర్ణయించుకున్నా ఆ లక్ష్యాలు చేరే మార్గం
సుగమం కావాలంటే కొన్ని మానసిక మరియు నిర్వహణా ప్రక్రియలు జరగాలి. మిమ్మల్ని
నిర్దేశించుకున్న లక్ష్యాలు వైపు నడిపించే ఆ అద్భుత ప్రక్రియలు ఏమిటో, కోరుకున్న ఫలితాలను సృష్టించాలంటే ఏమి చేయాలో చర్చిద్దాం.
కోరుకోవడంలోనా. . . సాధించడం
లోనా? - మీరు ఎందులో నిష్ణాతులు?
మరో పన్నెండు
నెలలలో మీరు చేరుకోవాల్సిన లక్ష్యాలు ఏమిటి ? వీలైతే ఇటీవల మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు ఒకసారి చదివిన
తర్వాత ఈ ఆర్టికల్ చదవటం ప్రారంభించండి. గతంలో లక్ష్యాలు నిర్దేషించుకోకపోతే మీ ఒక
సంవత్సరం లక్ష్యాలు టైం లైన్ తో స్పష్టంగా వ్రాసుకోండి. ఎందుకంటే కేవలం అది
కావాలి, ఇది కావాలి అని కోరుకుంటే మీరు కోరికలు కోరుకోవటం లోనే నిష్ణాతులు (Expert) అవుతారు. కోరుకున్నది చేరుకోడంలో నిష్ణాతులు కావాలంటే
కోరికలను లక్ష్యాలుగా మార్చుకోవాలి. ఈ ప్రపంచంలో లక్ష్యాలు నిర్దేశించుకునే
కొద్దిమంది గొప్ప వారిలో మీరు భాగం కావాలి. అందుకే లక్ష్యాలు స్పష్టంగా రాసుకోమని
వివరించాము. లక్ష్య నిర్దేశం (గోల్ సెట్టింగ్) మీరు ఆశించిన ఫలితాలను
స్పష్టంగా వివరిస్తుంది. మీ మైండ్ లో ఒకటి సాధించాలంటే ఆలోచనల్లో స్పష్టత
ఉండాలి. మీకు ఏమి కావాలో తెలిస్తే ఎలా సాధిస్తారు అనేది ఈ ప్రపంచం అదే
చూసుకుంటుంది. అయితే అందుకు మీరు చేయవలసింది మీ జ్వలించే కోరిక దిశలో
ప్రాధాన్యాలు (priorities) దృష్టిలో
ఉంచుకొని పనిచేయడం. అలా చేస్తూ పోతే ఫలితాలు వస్తాయిగా మరి పనిచేయండి.
ముఖ్యమైన పనులు మొదలు పెట్టండి ... టేక్ యాక్షన్:
ఒక లక్ష్యం నిర్ణయించుకున్న తర్వాత
మీ శక్తిని, సమయాన్ని దానికి అనుసంధానమైన అంశాలలోనే ఉపయోగించుకోగలగాలి. ఇది ఒక
ఉన్నత అలవాటు. ఇది మీ జీవితంలో భాగమై పోవాలి. అందుకు మీ లక్ష్యాల దిశలో తక్షణం
అడుగు వేయాలి. ఈ ఒక్క అడుగు వేయడం అనేది లక్ష్యం నిర్దేశించుకున్నప్పుడు మీలో
జ్వలించిన నూతన ఉత్సాహాన్ని దానిని సాధించే వరకూ కొనసాగించేలా ఉపయోగపడుతుంది. మీరు
కోరుకున్న లక్ష్యాలు సాధించిన వారి గురించి తెలుసుకోండి, వారు ఎలా ప్రయత్నించారో
చర్చించండి, ఆ రంగానికి చెందిన పుస్తకం చదవండి, ఒక నిష్ణాతుడికి కాల్ చేయండి. ఒక
కోర్స్ జాయిన్ అవటం, ఆరోగ్యం కోసం జిం లో జాయిన్ అవటం, ఆర్థిక అంశాలపై అవగాహన
కార్యక్రమాలకి వెళ్ళటం, వర్క్ లో ప్రోడక్టివిటి పెంచుకోడానికి కోచింగ్ తీసుకోవటం,
ప్రేమ ఆప్యాయతలను తెలిపేందుకు మీ బంధువులు కుటుంబ సభ్యులను కలవటం ఇలా అది ఎంత
చిన్నదైనా సరే మొదటి అడుగు వేయడం ముఖ్యం.
ఇంకా మొదలు పెట్టలేదా?
“కొంతమంది లక్ష్యాలు పెట్టుకున్నాం
కాని వాటి మీద పనిచేయలేదు సర్” అని చెబుతుంటారు. ఎందుకు చేయలేదు అంటే వారు చెప్పే
సమాధానాలు ఇలా ఉంటాయి.
- మా ఇంట్లో వాళ్ళు అర్థం
చేసుకోవటంలేదు
- నాకు మా ఫ్యామిలీ మెంబర్స్
సపోర్ట్ కుడా లేదు
- నాకు కావలసినంత టైం లేదు
- ఈ పని చేయాలంటే డబ్బు బాగా
పెట్టాలి
- నేను లంచాలు ఇవ్వలేను కాబట్టి
నాకు పనులు కావు
- నాకు ఇంగ్లీష్ రాదు
- మా కుటుంబంలో , మా ఊరిలో ఎవరు
అటువంటి ప్రయత్నం చేసి విజయం సాధించిన వారు లేరు
- ఆడ పిల్లలకి అంత పెద్ద
ఉద్యోగాలు ఎంత ప్రయత్నించినా రావు
- నాకు లోన్ రాలేదు
- నా పార్టనర్ మంచోడు కాదు
- నా మంచితనం నాకు పనికి రాదు
- సరైన ప్రభుత్వాలు లేవు,
వ్యవస్థ లేదు
- డబ్బు సంపాదించటం అంత ఈజీ
కాదు
ఇలా చెప్తూ పోతే ఈ లిస్టు ఇలా పెరుగుతూనే పోతుంది. ఎందుకంటే
మనం ఈ విధంగా ఆలోచించటం ద్వారా ఏమి చేస్తున్నారు? కారణాలు వెతుక్కుంటున్నారు. సృష్టించే
వారిగా ఉంటారా ? సృష్టి మీకు ఏమి ఇవ్వలేదని బాద పడుతూ కూర్చుంటారా? కారణాలు చెప్పి
తప్పించుకుంటార? కారణ జన్ముడుగా మీ జీవితాన్ని సాఫల్యం చేసుకుంటారా? మీరు ఏ
కేటగిరి లో ఉండాలో ఆలోచించుకోండి. పైన వివరించిన లిస్టు లో నాకు అది లేదు ఇది లేదు
అని ఆలోచించటం మొదలుపెడితే మనిషి కేవలం కారణాలు (reasons) చెప్పడంలో నిష్ణతుదవుతాడు. చిన్నప్పటి కథలో ఒకరికి ఏడు పరుపులు పాన్పు
వేసి ఆతిధ్యం ఇస్తే ఎదుపరుపుల కింద వెంట్రుక కుచ్చుకుంది అన్నట్లుగా, కర్ణుడి
చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లుగా ...
మేము ప్రయత్నించక పోలేకపోడానికి కారణం ఏమిటంటే...” అంటూ కారణాల లిస్టు చెప్పటం
అలవాటుగా మారితే రంద్రాన్వేషణ చేయడంలోనే జీవితం నడుస్తుంది. అవి కేవలం మీ
వర్తమానాన్ని దొర్లించడానికి (!) ఉపయోగపడే కుంటిసాకులు. మనుషులు ఫలితాలు
సృష్టించడానికి మార్గాలను వెతుక్కోవటం కంటే , ఫలితాలు ఎందుకు సృష్టించాలేకపోయరో
చెప్పే కుంటిసాకులు వెతుక్కోవటంలో ఎక్కువ అలిసిపోతున్నారు. అలాంటి వారి లిస్టు
లో ఉండకుదదనుకుంటే, ఎక్స్ లెన్స్ సాధించేవారి లిస్టు లో ఉందా లనుకుంటే, కలలు నిజం
చేసుకునే వారి లిస్టు లో ఉండాలనుకుంటే మీ జీవితానికి 100% బాధ్యత
మీరే తీసుకోండి. మీ ప్రతి లక్ష్యం
సాధించడానికి మీరు చేయవలసిన పనులు ఒక నెలల వారిగా రాసుకొని ఒక సంవత్సర ప్రణాళిక
చేసుకోండి. ఉదాహరణకు ఈ క్రింది సంవత్సర ప్రణాళిక గమనించండి.
S.No
|
Activity
|
మే 2014
|
జూన్
2014
|
జూలై
2014
|
ఆగస్ట్
2014
|
సెప్టెంబర్
2014
|
అక్టోబర్
2014
|
నవంబర్ 2014
|
డిసెంబర్
2014
|
జనవరి 2015
|
ఫిబ్రవరి 2015
|
మార్చ్ 2015
|
ఏప్రిల్ 2015
|
A
|
శారీరక ఆరోగ్యం
|
||||||||||||
1
|
శారీరక వ్యాయామం
ద్వారా నా ఆరోగ్యాన్ని ఉన్నతంగా, నా శరీరాన్ని శక్తివంతంగా చేసుకుంటాను
|
||||||||||||
2
|
జూలై 2014 నాటికి నేను 53 కిలోల నా శరీర బరువు కలిగి ఉంటాను
|
||||||||||||
3
|
మే 2014 నాటికి నేను హెల్త్
ఇన్సూరెన్సు తీసుకుంటాను
|
||||||||||||
B
|
మానసిక ఆరోగ్యం
|
||||||||||||
1
|
యోగ, మెడిటేషన్
ప్రతి రోజు ప్రాక్టీసు చేస్తాను.
|
||||||||||||
2
|
నెలకి ఒక లైఫ్
కోచింగ్ క్లాసు కి వెళతాను
|
||||||||||||
C
|
కుటుంబ జీవితం
|
||||||||||||
1
|
నా కుటుంబంతో,
స్నేహితులతో నా సంబంధాలు ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటాను. ఉదా: ప్రతి వారం ఇద్దరు
పాత స్నేహితులతో మాట్లాడతాను
|
||||||||||||
3
|
ఆగష్టు 2014 నాటికి నేను పెళ్లి చేసుకుంటాను
|
||||||||||||
D
|
చదువు / వృత్తి/ ఉద్యోగమ/ వ్యాపారము
|
||||||||||||
1
|
ఆగష్టు 2014 నాటికి నా కొత్త వ్యాపారము మొదలు పెడతాను
|
||||||||||||
2
|
మార్చ్ 2015 నాటికి నేను PhD లో / కొత్త కోర్స్ లో
చేరతాను
|
||||||||||||
E
|
ఆర్ధిక జీవితం
|
||||||||||||
1
|
మార్చ్ 2015 నాటికి నేను రూ. 25 లక్ష లు
సంపాదిస్తాను
|
||||||||||||
F
|
Fun,
Learning, Hobbies
|
||||||||||||
1
|
డిసెంబర్ 2014 నాటికి నేను మనరాష్ట్రంలోని 4 పర్యాటక
కేంద్రాలకు వెళతాను
|
||||||||||||
2
|
మే 2014 లో మరియు జనవరి 2015 లో నేను మా కుటుంబ
సభ్యులతో కలిసి నార్త్ ఇండియా టూర్ యోగ క్యాంపుకి వెళతాను
|
||||||||||||
G
|
Contribution
|
||||||||||||
1
|
నేను నవంబర్ 2014 నాటికి 5000 రూ|| పేద అనాధ విద్యార్ధులకు అందిస్తాను, నెలకి ఒక
రోజు సంక్షేమ కార్యక్రమంలో పాల్గొంటాను
|
మీ సంవత్సర ప్రణాళిక :
మీరు నిర్దేశించుకున్న ముఖ్యమైన
అన్ని లక్ష్యాలు ఎడమ వైపు రాసుకోండి. ఈ చార్ట్ లో స్థలాభావం వలన మేము పూర్తి
లక్ష్యాన్ని వివరంగా రాయలేదు కాని మీరు మీ లక్ష్యాను చార్ట్ పై స్పష్టంగా
రాసుకోండి. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే చేయాల్సిన పనులు విడిగా రాసుకోవచ్చు.
ప్రస్తుతం ఇక్కడ ఈ పైన తెలిపిన విధంగా మీ జీవిత పార్శ్వాలన్నిన్తిలో మీ లక్ష్యాలు
స్పష్టంగా గుర్తించండి. ఆ లక్ష్యాలు చేరుకోడానికి సమయాన్ని నెలలు రంగు తో నింపండి.
ఈ సంవత్సర ప్రణాళికను దగ్గర పెట్టుకుని ప్రతి నెల మీరు ఆ నెలలో ఏమి చేస్తే మీ ఇయర్
గోల్ సాధిస్తారో దాని ప్రకారం నెలలో నిర్వహించాల్సిన కార్యక్రమాలు రాసుకోండి. అంటే
ఏ నెలలో ఏం పనులు చేయాలో రంగు ఉన్న ప్రదేశాన్ని చూసి, మీ ఇయర్ గోల్స్ చదవటం ద్వారా
అర్థవంతంగా నెలవారీ లక్ష్యాలు నిర్ణయించుకోవచ్చు.
మీ నెలవారీ ప్రణాళిక :
మే 2014 - నెల ప్రణాళిక
|
|||
తేది
|
వారం
|
చేయవలసిన కార్యక్రమాలు
|
పూర్తి చేసిన కార్యక్రమాలు
|
1
|
గురువారం
|
ఎక్సర్ సైజ్ , బుక్ రీడింగ్, ప్రొఫెసర్ సుబ్బారావు ని
కలవాలి, కోర్స్ వివరాలు తెలుసుకోవాలి,
|
|
2
|
శుక్రవారం
|
ఎక్సర్ సైజ్ , బుక్ రీడింగ్ ౩౦ నిమిషాలు, కోర్స్ లో
జాయిన్ అవ్వాలి
|
|
3
|
శనివారం
|
ఎక్సర్ సైజ్ , ఓల్డ్ ఫ్రెండ్స్ తో మాట్లాడాలి, జిం లో
జాయిన్ అవ్వాలి ,
|
|
4
|
ఆదివారం
|
ఎక్సర్ సైజ్ , వారాంతపు పునర్విమర్శ (వీక్లీ రివ్యూ),
బంధువులతో ముచ్చట్లు, నచ్చిన పుస్తకం కంప్లీట్ చేయాలి
|
|
5
|
సోమవారం
|
8 గంటలు చదువుకోవాలి, తల్లి దండ్రులకు వర్క్ లో హెల్ప్
చేయాలి
|
|
6
|
మంగళ వారం
|
ఎక్సర్ సైజ్ , బిజినెస్ మీటింగ్
|
ఈ విధంగా
ఏ నెలలో ఏం పనులు చేయాలో నిర్ణయించుకున్నాక, నెల వారి లక్ష్యాలు చేరుకోడానికి ఏమి
చేయాలో వారానికి ఏమి చేరుకోవాలో మైల్ స్టోన్స్ గుర్తిస్తూ నెలవారీ ప్రణాళిక
చేసుకోవాలి. ఇది మీ శక్తిని, మీ సమయాన్ని ఉన్నతంగా , ఫోకస్ తో ఉపయోగించుకోడానికి
ఒక చక్కటి మేజిక్ టూల్ వంటిది. మరి ఇంకెందుకు ఆలస్యం. ఈ క్షణమే మీ సంవత్సర
ప్రణాళిక, నెలవారీ ప్రణాలికలు చేయండి. మీ బంగారు భవిష్యత్తుకి మార్గం మీరే తయారు
చేసుకోండి. కోరుకున్న
జీవితం నిర్మించుకోవాలంటే, మీకు మీరు కొత్తగా అలవాట్లు చేసుకోవాలి.
**********
"జీవన వికాసం " మాస పత్రికలో నేను రాస్తున్న విశిష్ట జీవనం కాలమ్ లో మే 2014 కోసం ప్రచురింపబడిన ఆర్టికల్
No comments:
Post a Comment