Tuesday, 26 June 2018

మీ బిజినెస్ ఐడియా హిట్టా? ఫట్టా? Does your business idea brings you success or failure?



Does your business idea brings you success or failure?

To understand answer to this question, try to respond to following questions.

1. Does it really address the needs of the people?
2. Do people pay for such product or service if they can address their needs?
3. Does this business idea has huge market?
4. Are you willing to work on it with passion irrespective of the challenges?
5. Did you test your idea?
6. What is your marketing strategy?

సగటున ఒక మనిషికి రోజుకు 60 వేల ఆలోచనలు వస్తాయట. ఇలా వచ్చి అలా వెళ్ళే ఆలోచనల సునామీలో చమక్కున మెరిసే ఒక మంచి స్టార్ట్అప్ ఐడియాను వెంటనే రాసిపెట్టుకుంటే మంచిదని చెప్తారు ఎంట్ర ప్రెన్యూర్ గురువులు. అయితే ఇలా వచ్చే బిజినెస్ ఐడియాలను కొందరితో చర్చించి, ఆమోదం తీసుకుని అడుగు ముందుకు వేయాలా? లేదా సొంతంగా నిర్ణయం తీసుకుని రంగంలోకి దిగాలా?  అనేది చాలా మందికి అర్థం కాని విషయం. అలా మీకు వచ్చిన వ్యాపార ఆలోచన (బిజినెస్ ఐడియా) ను టెస్టింగ్ దశకు తీసుకెళ్ళాలంటే ఏ అంశాలు పరిగణనలోకి తీసుకోవాలో వివరించడానికే  ఈ వ్యాసం. 
***    ***    ***    ***    ***    ***
సాధారణంగా బిజినెస్ లో  మనకేమి ఇష్టమో దానిని దృష్టిలో ఉంచుకుని ఒక వ్యాపారాన్ని చేయాలని చూస్తాము. కానీ మార్కెట్ అవసరం ఏమిటి, ప్రస్తుతం ఆ ప్రోడక్ట్/సర్వీస్ యొక్క గ్యాప్ ఏంటో తెలుసుకుని దానిని పూరించే విధానాలపై ఆలోచన (బ్రెయిన్ స్టార్మ్) చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తారు. అందుకే మీ వ్యాపార ఆలోచన (ఐడియా) సక్సెస్ వైపు తీసుకెళుతుందా? లేదా? ఒక ఐడియాతో ముందుకు వెళితే బిజినెస్ ఫలితం ఏ అంశాలపై ఆధారపడి ఉందో తెలుసుకుందాం. 

  1. ఒక సమస్యను తీరుస్తుందా?: మీ ఎంట్ర ప్రెన్యూర్ షిప్ వలన ప్రజల అవసరం తీరుతుందా లేదా? ఒక ముఖ్య అవసరాన్ని (సమస్యను) తీర్చగలగాలి, ఇబ్బంది నుంచి వారి జీవితాన్ని సులువుగా నడిపించేలా ఉపయోగపడాలి. సమస్యకు పరిష్కారం ఇచ్చే వాటినే ప్రజలు విలువ ఇస్తారు, మార్కెట్ లో ఆహ్వానిస్తారు.  
  2. ప్రజలు డబ్బు చెల్లిస్తారా? : మీ ఆలోచన ద్వారా ఆవిష్కరించే వస్తువు, సేవ ప్రజల అవసరం తీరుస్తుంది అని మీకు నమ్మకం ఉంది. ఇప్పుడు వెంటనే అర్థం చేసుకోవలసింది ఆ సేవకు/వస్తువుకు ప్రజలు డబ్బులు చేల్లిస్తారా? డబ్బు చేల్లిన్చానంత వరకు ఒక ఐడియా కేవలం ఐడియాగానే ఉండిపోతుంది, వ్యాపారం కాదు. ఒక సారి చెల్లిస్తారు అనుకుంటే ఎలాంటి కస్టమర్లు ఉన్నారు ? వారు ఎంత చెల్లిస్తారు అని ఆలోచించగలగాలి. సాధారణంగా  తక్కువ ఖర్చుతో మంచి విలువ అందుతుంది అని అనిపిస్తే ఆ ఆలోచనను  ప్రజలు అంగీకరిస్తారు. అందుకే మీరు ఏ రేటుకి (ప్రైస్ పాయింట్) అమ్ముతారో స్పష్టంగా, అనేక మార్కెట్ అంశాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయించాలి.
  1. పెద్ద టార్గెట్ మార్కెట్ ఉందా? : మీ ఆలోచన బాగుంది, అవసరం ఉన్న వారు డబ్బు ఇస్తారు అని అనుకున్నారు. కానీ మీ ప్రోడక్ట్ , సర్వీస్ తీసుకునే మార్కెట్ ఎంత పెద్దగా ఉంది? ఎంత మంది ఆ అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు? ఎన్ని సంవత్సరాలు మీరు ఆ టార్గెట్ గ్రూప్  (నిచ్ మార్కెట్) కు సేవలు అందించే అవకాశం ఉంది. ఇతర ప్రత్యామాయాల కంటే మీరు ఉన్నతంగా చేయగలిగితే మీకు ఎంత శాతం మార్కెట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. ఇలా ప్రతి అంశం చెక్ చేసుకోగలగాలి. ఎందుకంటే తీసుకునీ వాళ్ళు ఉంటేనే గదా మనకు లాభాలు వచ్చేది.
  2. మీ అభిరుచి (పాషన్) ఎంత ? : మీ ఆలోచన బాగుంది, ఆ అవసరాన్ని తీర్చుకోడానికి డబ్బులు ఇచ్చే మార్కెట్ ఉంది, మంచిదే అయితే మీ నిచ్ మార్కెట్ ను  చేరేందుకు కేవలం ఐడియా సరిపోదు దానిని సరైన విధానంలో మార్కెట్ లోకి తీసుకెళ్ళాలి, సవాళ్ళను అధికమించాలి. అందుకు మీ సమయం, శక్తి, నైపుణ్యాలు, ఇతర వనరులు పూర్తిగా మీ ఐడియా మీద పెట్టడానికి రెడీగా ఉండాలి. ఆ పాషన్, అభిరుచి మీలో ఉందా? మీరు ఇతరులతో కలిసి ఐడియాపై పనిచేస్తే ఎవరి బాధ్యతలు వారు స్పష్టంగా నిర్ణయించుకోవాలి. ఏది ఏమైనా ఐడియా నుంచి పైలట్ చేసి, వచ్చిన రెస్పాన్స్ గమనించి ఈ జర్నీ లో పాఠాలు నేర్చుకుంటూ ముందుకెళ్ళే పాషన్ చాలా అవసరం. బెంబేలు ఎత్తి మధ్యలో వదిలేసే వారికి బిజినెస్ పనికిరాదు, అలా అని ఫలితం మారకపొయినా ఏదో వస్తుందని రాంగ్ ఐడియాకు వేలాడపడకూడదు. ఈ పాఠం అర్థం చేసుకొని కమిట్మెంట్ తో వర్క్ చేయాలి.
  3. ఐడియాను టెస్ట్ చేసారా? : కేవలం ఆలోచనల్లో ఇలా చేస్తే ఇలా రెస్పాన్స్ వస్తుందని ఊహించుకోవడం,  బుర్ర నిండా డౌట్స్ (సందేహాలు) పెట్టుకోవడం, కేవలం పాజిటివ్ ఆలోచనలు (పని చేయకుండానే ?) ఎవరో వచ్చి హెల్ప్ చేస్తే బాగుండు నా ఐడియాతో అద్భుతాలు చేస్తాను అనుకోవడం విజయవంతమైన ఎంట్ర ప్రెన్యూర్ లక్షణం కాదు. మీతో మొహమాటంతో నిజాన్ని చెప్పలేని స్నేహితులు, మీతో పాటు పనిచేయడానికి వచ్చిన పార్టనర్స్, మీ కుటుంబ సభ్యులు కాకుండా పూర్తిగా కొత్త వారితో మీ ఐడియాను టెస్ట్ చేయండి. ఒకవేళ మీ టార్గెట్ గ్రూప్ అనుకున్న కొత్త వారు “ ఓహ్.. అవునా అలాంటి సర్వీస్ ఉందా?, బాగుంది ... ఆ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది?”  వంటి ప్రశ్నలతో  ఉత్సాహంగా  వివరాలు అడిగారంటే మీ ఐడియాలో విషయం ఉందన్న మాట. వారు సుముఖంగా రిప్లై ఇవ్వలేదంటే మీరు అనుకున్నంతగా మీ ఐడియా మీ టార్గెట్ గ్రూప్ కి రీచ్ అవ్వటం లేదన్న మాట. మీ ఐడియాను కొత్త వారైన టార్గెట్ గ్రూప్ తో టెస్ట్ చేసినపుడు వారి అభిప్రాయాలను తెలుసుకుని కొన్ని మార్పులు చేసుకోడానికి రెడీ గా ఉండాలి. కొత్త గోధుమపిండి బ్రాండ్ మార్కెట్ లో పరిచయం చేయాలనుకున్నారు అనుకోండి ఆల్రెడీ ఉన్న వారికంటే మంచి క్వాలిటీ ఉంది కదా అని ఒకే సారి 5 కేజీల ప్యాకెట్ మాత్రమే పరిచయం చేస్తే అది కుటుంబాలకు తెలుగు రాష్ట్రాలలో ఇష్టం ఉండకపోచ్చు,  ప్రతి రాత్రి మా చపాతీ తినండి ఆరోగ్యంగా ఉండండి అనే వాణిజ్య ప్రకటనతో మీరు చిన్న ప్యాకెట్ లు పెట్టండి అనే కస్టమర్ సలహాలతో ఇంకొంచం మార్కెట్ షేర్ మీ సొంతం చేసుకోవచ్చు. అందుకే కస్టమర్ చెప్పే పాయింట్స్ అర్థం చేసుకోవాలి. అలా చాలా మంచి  ఐడియాలు కూడా యధావిధిగా కాకుండా కొద్ది మార్పులతో మార్కెట్ లోకి వెళ్లి  సక్సెస్ అవుతుంటాయి.   




  1. మీ మార్కెట్ ఎలా చేస్తారు? : చాలా మంది ఎంట్ర ప్రేన్యూర్స్ మంచి ఐడియాతో ప్రజల సమస్యలు తీర్చుదామనుకుంటారు కానీ మంచి మార్కెట్ విధానం గురించి ఆలోచించరు. మంచి ప్రోడక్ట్ / సర్వీస్ అయితే చాలు ప్రజలు వాళ్ళే వచ్చి వినియోగించుకుంటారు అనుకుంటే మనం రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేస్తున్నట్లే. మంచి ఐడియా ఉంటే సరిపోదు, దానిని టార్గెట్ గ్రూప్ కు చేర్చడానికి మంచి మార్కెటింగ్ ఉండాలి. మీ మార్కెట్ విధానం ఏమిటి? మీకు మంచి ప్రోడక్ట్ ఉండి, సాలిడ్ మార్కెట్ ప్లాన్ ఉంటే విజయావకాశాలు ఎక్కువ. కానీ మంచి ప్రోడక్ట్ ఉంది కూడా మార్కెట్ విధానం లేకపోతే విజయావకాశాలు చాలా చాలా తక్కువ. ఎంత త్వరగా ఐడియా మీద వర్క్ చేయాలనుకుంటే అంత త్వరగా మార్కెట్ విధానం ఆలోచించాలి. 
మీ ఐడియా ఇతరులకు చెప్పండి కనుబొమ్మలు పైకి ఎగరేసి , కళ్ళు పెద్దవి చేసి చూస్తే అది హిట్టు , వాళ్ళు నొసలు చిట్లిస్తే ఫట్టు అని అంటారు ఎంట్ర ప్రెన్యూర్ గురువులు. దీనికే ఐ బ్రో టెస్టింగ్ (కనుబొమల పరీక్ష అని పేరు). అంటే ఇతరుల స్పందన వెంటనే తెలిసిపోతుందని అర్థం. అయితే మీ వ్యాపార ఆలోచన (బిజినెస్ ఐడియా) విషయంలో ఐ బ్రో టెస్టింగ్ కాకపోయినా ఈ ఆరు ముఖ్య ప్రశ్నలు వేసుకుని మీ జవాబులు చూసుకోండి. మీ ఐడియా ఏ స్థితిలో ఉందో కొంత అవగాహన వస్తుంది. ఒకోసారి మీ ఐడియా మార్కెట్ పరిస్థితుల కంటే వేగవంతమైనది అయుండొచ్చు చాలా సంవత్సరాలకు ఉపయోగం ఉండొచ్చు, కానీ ఇప్పుడు బిజినెస్ చేయాలంటే ఇప్పుడు  మార్కెట్ చేయగలిగిన ఆలోచననే స్టార్ట్ చేయాలి. అన్నింటికంటే ఆఖరిగా మీ ఐడియా సింపుల్ గా ఇతరులకు చెప్పగలగాలి, దానిని మీ అమ్మమ్మ కు చెప్పినా అర్థంమయ్యేలా  సింపుల్ గా చెప్పే విధానాలు పాటించాలి.
ఇంకెందుకు ఆలస్యం మీ ఐడియాలు మార్కెట్లో ప్రజల అవసరాలను తీర్చేవనుకుంటే ఈ ప్రశ్నల ద్వారా వాటిని ఉన్నతంగా అర్థం చేసుకుని ప్రజలకు చేర్చండి. కొత్త సేవలు సృష్టించండి, మరిన్ని ఉద్యోగాలు సృష్టించండి. మేక్ ఇన్ ఇండియా ఉద్యమంలో మీరు భాగాస్వాములవండి. బెస్ట్ విషెస్.
***  ***  సైకాలజీ టుడే తెలుగు పత్రికలో ఫిబ్రవరి 2018 సంచికలో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  

Monday, 25 June 2018

అంకురసంస్థ ఫ్లాప్ షో కాకూడదంటే ఆరు మెట్లు 6 Steps to Safe guard Your Start Up from Failures



6 Steps to Safe guard Your Start Up from Failures
Imagine that failure is common in any human effort. but that's not the final result until you accept it. These are the common things you can be conscious about to avoid failure in starting up.
1. Find whether the product/ service you offer is really needed
2. Make sure you are with right team who can bring value to current need and future of the venture. Hire slow , fire fast or whatever the rule but make sure you use human resources effectively
3. Have a mentor who can bring your abilities to assets of the organisation
4. Remember that great idea is useless until you act upon. So idea to execution is important. Execution itself is oxygen.
5. Manage your cash flow so that you have a systematic revenue stream, reviews of expenses and take decisions based on that.

యువత తాను చేయాలనుకున్న పనిని వేగంగా చేసే రోజులివి, టెక్నాలజీ ఇచ్చే సౌకర్యాలతో ఫింగర్ టిప్స్ మీదే బిజినెస్ ట్రిక్స్ నేర్చుకుంటున్నారు. మరి అలా అయితే ఎంట్రప్రెన్యూర్షిప్ మీద ప్రేమతో స్వతంత్రంగా స్టార్ట్ అప్ మొదలెట్టిన ప్రతి ఒక్కరు సక్సెస్ కావచ్చా? అసలు స్టార్ట్ అప్స్ ఫెయిల్ అవుతున్నాయా? అయితే కారణాలేమిటి? తాము చేపట్టిన వెంచర్ ఫెయిల్ కాకుండా ఉండాలంటే ఎలాంటి మెట్లు ఎక్కాలి? ఈ అంశాలను చర్చించేదుకే మన ఈ ఆర్టికల్. మరెందుకు ఆలస్యం, రండి  ఫెయిల్యూర్ ని ఎలా ఫెయిల్ చేయాలో నేర్చుకుందాం.   
***    ***    ***    ***    ***    ***

ఎంట్రప్రెన్యూర్, సి.ఈ.ఓ., ఫౌండర్ , స్టార్ట్ –అప్ ...ఈ పదాలు ఈ మధ్య కాలంలో బాగా వినపడుతున్నాయి. అయితే అంతే వేగంగా ప్రభుత్వాలు, ప్రైవేటు కంపెనీస్ అంకుర సంస్థలు (స్టార్ట్ –అప్స్) ని అనేక సౌకర్యాలతో ప్రోత్సహించే దశలో ఉంది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ ఎంట్ర ప్రెన్యూర్ సమ్మిట్ 2017 లో ప్రపంచదేశాల నుంచి దాదాపు 2000 మంది డెలిగేట్స్ వచ్చారు. రానున్న కాలంలో వారి సంస్థల కోసం , వాటి విజయం కోసం టెక్నాలజీ, డబ్బు, పాలసీ ల మార్పులు, మెంటర్స్ అవసరాల గురించి చర్చించారు. అయితే  ఇంత వేగంగా అనేక మంది అడుగుపెడుతున్నప్పుడు మరి మన స్టార్ట్ అప్ సక్సెస్ కావాలంటే ఏమి చేయాలి అసలు స్టార్ట్-అప్ లు ఫెయిల్ అవుతాయా? ఎంట్ర ప్రెన్యూర్ లో యువత ఫెయిల్ ఎందుకు అవుతుంది?
అపజయానికి అతీతం కాదు: ఎంట్ర ప్రెన్యూర్షిప్ అనగానే "ప్రపంచానికి మంచి చేయాలనే ఉద్దేశ్యంతో ... కనీసం మీ ప్రాంత అవసరాలు తీర్చేలా సదుద్దేశ్యంతో ఉన్నపుడు ఎప్పటికైనా సక్సెస్ అవుతాం" అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. చదువులో, ఉద్యోగంలో ఫెయిల్ అయినట్లే ఎంట్రప్రెన్యూర్స్ అంకుర సంస్థలను అపజయం ఎదుర్కునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
 ప్రతి 10 స్టార్ట్ –అప్స్ లో 9 ఫెయిల్ అవుతాయి. చేదుగా ఉన్నా ఇది నిజం.  ట్రక్సన్ సంస్థ రిపోర్ట్ ప్రకారం దాదాపు 200 అంకుర సంస్థలు 2016 లో మూతబడ్డాయి. జొమాటో, స్విగ్గీ వంటి ఆహార పదార్థాలను , మంచి డిషెస్ ను ఇంటికే తీసుకువచ్చి ఇచ్చే ఫుడ్ స్టార్ట్ – అప్స్ మొదటిగా ఈ రంగంలో అడుగు పెట్టారు కాబట్టి నిలబడ్డారు, ప్రజలు వారినే ఫాలో అవుతున్నారు కానీ ఆ తర్వాత అలాగే ఇంకొంచం తక్కువ ధరలతో వచ్చినా కానీ సక్సెస్ కాలేదు. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి సంస్థల లోకంలోంచి బయటికి వచ్చి చూస్తే ఊబర్ (Uber) వంటి దిగ్గజాలు కూడా 600 కోట్లకు పైగా నష్టాలను చూస్తున్నాయని ఇటీవల పత్రికలలో చదివాము. మనదేశంలో దాదాపు 17,000 టెక్నాలజీ ఆధారిత అంకుర సంస్థలు ఉంటే వాటిలో కేవలం 13 మాత్రమే 1 బిలియన్ విలువ కలిగిన యూనికార్న్ క్లబ్ లో ఉన్నాయి. ఈ 17 వేల అంకుర సంస్థలలో 2022 కేవలం పదిశాతమే మిగులుతాయని ఒక అంచనా. తమ ప్రోడక్ట్, సేవల ద్వారా ఈ ప్రపంచాన్నే మార్చేద్దాం అన్న ఆలోచనతో మొదలైన అంకుర సంస్థలు ఎందుకు ఇలా కనుమరుగైపోతున్నాయి? అవి తెలుసుకోవాలంటే ఈ ఐదు సోపానాలు గమనించాలి. మీ స్టార్ట్ అప్ దృష్టిలో ఉంచుకుని ఒక్కొక్క మెట్టు అధిరోహించండి. 
1.   అవసరం లేని ప్రోడక్ట్: ఒక ఎంట్ర ప్రెన్యూర్ తాను అందిస్తున్న ప్రోడక్ట్ లేదా సర్వీస్ అవసరం ఎంత స్థాయిలో ఉంది అర్థం చేసుకోవాలి. దానిపై పని మొదలు పెట్టే సమయంలోనే మార్కెట్ రీసెర్చ్ చేయాలి. లేదా వర్క్ మొదలయ్యాక నిజంగా ప్రజలు ఈ ప్రోడక్ట్ ని తీసుకుంటున్నారా లేదా మనకు నచ్చింది కాబట్టి మాత్రమే చేస్తూ వెళ్తున్నామా అని గమనించాలి. కస్టమర్ల ప్రయారిటీలో లేకపోయినా, మీ కస్టమర్స్ తిరిగి ఆ అవసరాలకు మీ వద్దకు వచ్చేది లేదని అర్థమైనా నిజంగా దాని అవసరం ఎంతనేది ఆలోచించగలగాలి. ఒక సర్వేలో 42% స్టార్ట్ అప్స్ ఫెయిల్యూర్ కి కారణం  మార్కెట్ లేని ప్రోడక్ట్ అని తెలిసింది. మీ ప్రోడక్ట్, సేవ ఎంచుకున్న ఏరియాలో బాగా అవసరం ఉండాలి అనేది గుర్తుంచుకోండి ఎందుకంటే విలువనిచ్చే పనులు చేస్తే మూల్యం చెల్లిస్తారు , వేల్యూ ఉంటేనే ప్రైస్ ఇస్తారు.
2.   విలువైన బృందం: గత నెలల్లో చర్చించినట్లు ఎంట్ర ప్రెన్యూర్ గా ఎదిగే క్రమంలో బృందం చాలా కీలకం. బృందంలో ఆ ప్రోడక్ట్ , సర్వీస్ లను అద్భుతంగా అవసరమైన వారికి సరైన సమయంలో చేర్చే నేర్పు, నిరంతరం నూతనత్వం అందించగల సృజనాత్మకత, మీరు మాత్రమే చేయగల అంశాలు -  మీ యునిక్ సెల్లింగ్ ప్రిపోజిషన్ (USP) ని కమ్యూనికేట్ చేయగలిగే టాలెంట్ ఉన్న వారు ఉండాలి. అంకుర సంస్థలో ఏ సమయంలో ఎవరిని ఎలా వాడుకోవాలో తెలియకపోతే మానవ వనరులు సరిగా ఉపయోగపడవు. ఈ దశలో జోడి సరిగా లేని బృందం ఎదుగుదల ని చాలా ప్రభావితం చేస్తుంది. ఎంట్ర ప్రెన్యూర్షిప్ లో విజయాలు సాధించే బృందం సభ్యులందరి నైపుణ్యాలను వినియోగించుకుంటుంది, మార్కెట్ అవసరాలకు తగినట్లు మార్పులు చేయడానికి సిద్దంగా ఉంటుంది, అనుభవం లేకపోయినా కొత్త విధానాలలో వినియోగదారులను చేరేందుకు ప్రయత్నిస్తుంది, కొత్త బ్రాండింగ్ తో ముందుకు వెళుతుంది, అనూహ్యంగా ఎదురయ్యే సవాళ్ళ సమయంలో తోటి వ్యక్తులతో సమతుల్యంగా మాట్లాడే సంస్కృతిని ప్రోత్సహిస్తుంది, గతంలోని అపజయాలకు కుంగి పోకుండా భవిష్యత్తు విజయం పై దృష్టి పెడుతుంది. 
3.   మెంటార్ ఆవశ్యకత: ఒక అంకుర సంస్థ కు మెంటార్ ఉండడం చాలా మంచిది లేదంటే ప్రతి చిన్న పనికి తప్పొప్పులు మీద పట్టులేకుండానే పని చేయాల్సి వస్తుంది. మెంటార్స్  తమ అనుభవంతో ఐడియా ఎలా ముందుకు తీసుకెళ్ళవచ్చో చెప్పగలరు, ప్రాక్టికల్ సవాళ్ళను ఊహించి ముందుగా మిమ్మల్ని ఎలర్ట్ చేయగలరు, మీరు గమనించని అవకాశాలు, వనరులను పక్షి దృష్టితో (బర్డ్స్ ఐ వ్యూ ) అర్థం చేసుకుని మీరు ఆ అవకాశాలను ఉపయోగించుకునేలా సపోర్ట్ చేస్తారు. టెక్నికల్, జనరల్, బిజినెస్ ప్రాసెస్, ఫండ్ రైజింగ్ లో మెంటార్ సపోర్ట్ ఉన్నవారికి విజయావకాశాలు ఎక్కువ.      
4.   ఆలోచనకు – ఆచరణకు దూరం : ఒక గొప్ప ఐడియా అంకుర సంస్థ రూపు దిద్దుకోవాలంటే పేరు, రిజిస్ట్రేషన్, లోగో డిజైన్, కాప్షన్ లైన్ అనుకుంటే దానికంటే అమాయకత్వం ఇంకోటి ఉండదు. ఆ ఐడియాని అమలుచేయాల్సిన విధానాలపై మొదట్లో మీకు ఒక క్లారిటీ ఉంటుంది. అది చూసింది, లేదా ఇతరులు చేసింది, లేదా మరో బిజినెస్ మోడల్ నుంచి వచ్చిందో అయి ఉండొచ్చు. లేదా నూతన ఆవిష్కరణ అయుండొచ్చు. కానీ దానిని మీరు అమలు చేస్తూ ఉన్నప్పుడు ఇంకా చెప్పాలంటే లక్ష్యాలు పెట్టుకుని నూరు శాతం ప్రయతించినపుడు వాటి లో వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి. సో గ్రేట్ ఐడియా కంటే గ్రేట్ యాక్షన్ ముఖ్యం. బరిలోకి దిగితేనే గెలుపు దిశలో అడుగులు పడినట్లు ఆటే ఆడకుండా గెలుపు వీలుకాదు. అందుకే అంకురా సంస్థలు వారి ఆలోచనకు – ఆచరణకు మధ్య దూరం అర్థం చేసుకుని సయోధ్య తో ముందుకు వెళ్ళాలి.  
5.   కాష్ ఫ్లో: ఒక అంకుర సంస్థ అందిస్తున్న వస్తువు,  సేవలు ద్వారా డబ్బుని సృష్టించాలి. ఆ డబ్బు అన్ని ఖర్చులనూ మొదటి నెలలోనే తీర్చనప్పటికీ కనీసం వీలైనంత త్వరగా ఆ డబ్బు ఆ పనికి అయ్యే ఇన్ పుట్ కాస్ట్ కంటే ఎక్కువ ఉండాలి. అన్ని ఖర్చులూ పోను కొంత డబ్బు మిగిలి బిజినెస్ విజయవంతంగా నడవాలంటే ఈ కాష్ ఫ్లో లో వివరాలు స్పష్టంగా తెలియాలి. సంవత్సరం చివరికి ఇన్ని సేల్స్ అయితే కహ్శ్ర్చులు పోను ఇంత మిగులుతుంది అనే ఫైనల్ బాలన్స్ మాత్రమే తెలిసినా కాష్ ఫ్లో వచ్చినట్లు కాదు నీకు ప్రతి నెలా ట్రెండ్ తెలియాలి. ఐడియా తో లవ్ లో పడి స్టార్ట్ అప్ మొదలుపెట్టి నాకు డబ్బు గురించి ఏమి తెలియదు అంటే జీవితంలో ఆర్ధిక సవాళ్ళకు రెడీ  ఉండాల్సుంటుంది. గుర్తుంచుకోండి మీరు విలువైన ప్రోడక్ట్ ఇవ్వాలి, అందుకు తగిన డబ్బు తీసుకోవాలి. అదే ఎక్కువ కాలం నడపగల అంకుర వ్యాపారం.  
ఈ ఐదు విషయాలు అర్థం చేసుకుంటే  అంకుర సంస్థ నడిపే ఎంట్ర ప్రెన్యూర్స్ ఫెయిల్ అవకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. వీటితో పాటు నిరంతర స్వయం ప్రేరణ, అకుంటిత దీక్ష, అవసరమైనంత సమయం నిర్మాణాత్మకంగా పనిచేయడం, కొత్తగా చేసిన పైలట్ ప్రాజెక్ట్ రెస్పాన్స్ దృష్టిలో పెట్టుకుని మార్పులు చేసుకోవటం, సరైన సమయంలో సరైన పనులు చేయగలగటం, మార్కెట్ అంచనా, విచ్చిన్న సాంకేతికత (డిస్రప్టివ్ టెక్నాలజీ), మార్కెట్ లీడర్ బెంచ్ మార్కింగ్ ని ఎదుర్కోగలగటం, ఎంత అవసరమో అంతే ఫండ్ రైజ్ చేసుకోవటం వంటి అంశాలు కూడా కీలకమైన అంశాలు.    

ఈ వ్యాసం "ఫెయిల్ అవుతారు" అని భయపెట్టడానికి రాయలేదు; వాస్తవాలు ఎలా ఉంటాయో చెప్పడానికి రాసాను. కాబట్టి ఈ కీలక అంశాలను దృష్టిలో ఉంచుకుని అంకుర సంస్థ స్థాపించి మరింత ఫలవంతంగా మీ ప్రయత్నాలుచేసి ప్రధాని చెప్పినట్లు స్టాండ్ అప్ -  స్టార్ట్ అప్ –  స్కేల్ అప్ అంటూ ముందుకు వెళ్ళండి. మీ ఆలోచనలే ఆవిష్కరణలు కావాలని, మీరూ ఇండియా గ్రోత్ స్టొరీ లో భాగం కావాలని  ఆకాక్షిస్తున్నాం.
***  ***  ***  సైకాలజీ టుడే, జనవరి  2018 తెలుగు పత్రికలో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  ***