Thursday, 8 February 2018

5 Ways to Enhance Entrepreneurial Skills ఎంట్ర ప్రెన్యూర్ నైపుణ్యాలు పెంచుకోడానికి పంచ సూత్రాలు






To be an entrepreneur it helps to introspect oneself through simple questions like
  • Who am I?
  • What can I contribute to this world?
  • What life style do I want? Am I ready to learn skills and keep efforts to achieve my desired lifestyle?
  • What kind of person I should be to manifest the results I intended? What are the personality traits and though-patterns, habits should I follow?
After getting some clarity about these basic questions that help you understand your interests, skills and future aspirations, following are the five steps you need to take to enhance your entrepreneurial skills.
  1. Act differently. Not just thinking and appearing.
  2. Start venture . Reading, learning , understanding, observing ....will not give you real time experience. So start venture.
  3. Expect failures and keep moving irrespective of challenges. Challenge is not end of the life.
  4. Get your hands dirty with accounts and numbers
  5. Learn leadership communication. To be an entrepreneur , you have to deal with many people and it's important to understand the communication that influence more and practice it as best as you can to get the results you want.
                                    ***    ***    ***    ***    ***    ***

ఈ 21 వ శతాబ్దంలో ఎవరికీ వారే బాస్ అవడమనేది అందరూ కోరుకునే కెరీర్ ఆప్షన్. ఉన్న ఉద్యోగాలలో తృప్తి లేక కావచ్చు, జీతం సరిపోక కావచ్చు, టాలెంట్ కి ఉద్యోగానికి సంబంధం లేదన్న ఫీలింగ్ కావొచ్చు, కలలను నిజం చేసుకోడానికి కావచ్చు... కారణమేదైనా ఈనాటి యువత కేవలం బ్రతకడం ఎలా అని కాకుండా అందమైన, ఒక ఉద్దేశ్యం తో కూడిన జీవితాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలా అని ఆలోచిస్తుంది. తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ, పది మందికి ఉపయోగపడుతూ తమ జీతం, జీవితం తామే నిర్ణయించుకోవాలనుకుంటున్నారు. ఎంట్ర ప్రెన్యూర్ షిప్ ద్వారా కొత్త జీవన విధానాలను ఆవిష్కరించాలని కలలు కంటున్నారు. మరి ఆలాంటి వారికి ఎంట్ర ప్రెన్యూర్ కావాలను కునే యువత లక్షణాలు ఎలా ఉండాలి? నేర్చుకోవాలనుకునే కీలక అంశాలేమిటి ? ఈ విషయాలు
తెలియజేయడానికే ఈ ప్రత్యేక శీర్షిక.


ఎంట్ర ప్రెన్యూర్స్ అవ్వాలని బిజినెస్ మాగజైన్స్ లో అందమైన ఫొటోస్ చూసి వాళ్ళు మాత్రమే గొప్ప బిజినెస్ పీపుల్ అని అలోచించి మనం వారిలా అవ్వాలని అనుకోవడం సహజం. కొందరు మేము బిజినెస్ చేయడానికే పుట్టాము అని చెప్పుకోవచ్చు. కానీ ఎంట్ర ప్రెన్యూర్స్, బిజినెస్ పర్సన్ కావడం చెప్పినంత ఈజీ కాదు, అలా అని అసాధ్యం అనేంత క్లిష్టమైనది కాదు. ఒక వ్యక్తి తన గతం, తను అలవాటు పడిన ఆలోచనా రీతులు, తనపై సమాజం యొక్క ముద్రలు, తన రెస్పాన్స్ మెకానిజం పై పట్టు పట్టి ఎంట్ర ప్రెన్యూర్ మైండ్ సెట్ గురించి మెళకువలను ఇతరులను చూసి, నిశితంగా పరిశీలించి నేర్చుకోవచ్చు. ఎంట్ర ప్రెన్యూరల్  జర్నీ అనేది ఛాలెంజ్ లతో (భయస్తుల భాషలో రిస్క్ లతో?) కూడినది, చేస్తున్న పనిలో ఆనందం , వచ్చే ఛాలెంజ్ లకు సిద్దంగా తనను తాను మార్చుకోగల వారికి ఆహ్వానం పలికే కెరీర్. మనిషి తన జీవితానికి సంబంధించిన కీలక ప్రశ్నలు వేసుకునే సమాధానం రాబట్టుకునేలా ప్రోత్సహిస్తుంది ఈ కెరీర్.
ఎంట్ర ప్రెన్యూర్ కావాలంటే జవాబు చెప్పుకోవాల్సిన కొన్ని ప్రశ్నలు :
Ø  నేను ఎవరు?
Ø  నీను ఈ ప్రపంచానికి ఎలా ఆపయోగపడగలను?
Ø  నా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నాను? అందుకు ఎలాంటి కృషి చేయడానికి, నైపుణ్యాలు నేర్చుకోడానికి నేను రెడీ గా ఉన్నాను?
Ø  కోరుకున్న ఫలితాలు చేరుకోడానికి నేను ఎలాంటి వ్యక్తిగా మారడానికి సిద్దంగా ఉన్నాను? ఆ వ్యక్తిత్వ , ఆలోచనా రీతులు ఏమిటి?
ఎంట్ర ప్రెన్యూర్ నైపుణ్యాలు నేర్చుకోడానికి మార్గాలు



1.     భిన్న మైన దారిని ఎంచుకోండి

సృజనాత్మకత ఎంట్ర ప్రెన్యూర్ షిప్ కి వేరు (రూట్) వంటిది . మార్కెట్ ప్లేస్ లో ప్రజల అవసరాలను తీర్చడంలో , జీవన శైలిని ఉన్నతంగా మార్చడంలో సృజనాత్మకంగా ఆలోచించడం ఎంట్ర ప్రెన్యూర్ లక్షణం.  సృజనాత్మకత అంటే విషయాలను భినంగా చూడటం, అవసరాలను తీర్చేందుకు కొత్త మార్గాలను ఎంచుకోవడం. మీ క్రియేటివిటీ పెంచుకోడానికి ఉద్దేశ్యపూర్వకంగా కొత్త పనులు చేయండి, కొత్త భాష నేర్చుకోండి, కొత్త వ్యక్తులతో వర్క్ అవసరాలను తీరేలా పరిచయం పెంచుకోండి, ఇతరులు చేయని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి, అలవాటు లేని బుక్స్ చదవండి, కొత్త భాషలో సినిమా చూడండి, కొత్త ఆట నేర్చుకుని ఆడండి. మీ కంఫర్ట్ జోన్ లో లేని వ్యక్తులతో ప్రశాంతంగా మాట్లాడండి. 2008 లో ఆర్ధిక ఇబ్బందులు వచ్చినపుడు ఈ క్రియేటివిటీ ఉన్నవారే గొప్ప వ్యాపారాలు చేసారు. క్రియేటివిటీ అంటే ఎదుటి వారి బలహీనతని వాడుకుని బిజినెస్ చేయటం కాదు, ఎవరూ చూడని ఒక సొల్యూషన్ చూపించి నిజాయితీగా ఆలోచనలు, పనుల ద్వారా డబ్బు సంపాదించడం.

2.     వ్యాపారం మొదలుపెట్టండి
రూల్స్ ఫాలో అవడం నడవడం నేర్చుకోరు, నడిచే ప్రయత్నం చేయడం, కిందపడటం వలన నేర్చుకుంటారు అంటారు  ఎంట్ర ప్రెన్యూర్షిప్ మేధావులు. నిజ జీవితానికి, పనిచేస్తూ ప్రపంచం నుంచి నేర్చుకున్నదానికి మించిన జ్ఞానం మరొకటి ఉండదు. మీరు బిజినెస్ పార్ట్ టైం చేసినా, ఫుల్ టైం చేసినా ఎలా ఒప్పించాలి, ఎలా అకౌంటింగ్ చేయాలి, ఎలాంటి ప్లాన్ చేయాలి, ఎలా ప్రమోట్ చేయాలి, సేల్స్ టెక్నిక్స్, మార్కెటింగ్ విధానాలు ...ఇలా అనేక స్కిల్స్ నేర్చుకుంటారు.

3.     ఛాలెంజ్ లను ఎదుర్కోండి
నేను స్మార్ట్ కాదు , కేవలం ఎక్కువకాలం సమస్యలతో ఉన్నాను అంటారు ఐన్ స్టీన్ మహాశయుడు. సమస్యలు, ఛాలెంజ్ లు ఎదురైనపుడు కాస్త మార్పులు చేసుకోవాలేమో కాని మీ నమ్మకాన్ని , పట్టుదలను రెట్టింపు చేసుకోగలగాలి. విజయం ఆ ఛాలెంజ్ లకు కేవలం ఒక్క అడుగు దూరంలో నే ఉంటుందని ఆ పరిస్థితుల్లోనే మనిషి ప్రయత్నం వదిలేయకూడదంటారు బిజినెస్ సక్సెస్ సాధించిన పెద్దలు. ప్రపంచం ఎంత అనుమానించినా, హేళన చేసినా, నీ మనసులో పవిత్ర భావంతో, చేసే ప్రాజెక్ట్ లో నమ్మకం, మీ సర్వీస్/ ప్రోడక్ట్ కి మార్కేటబిలిటీ ఉంటే ముందుకు సాగడం చాలా అవసరం. మీ రిస్క్ టేకింగ్ సత్తా = మీ బిజినెస్ సక్సెస్ . ఈ సూత్రం గుర్తుంచుకోండి.

4.     లెక్కలు బాగా నేర్చుకోండి 
సొంత కంపెనీ రన్ చేయాలంటే కనీస లెక్కలు తెలియాలి. కాష్ ఫ్లో , మంత్లీ బాలన్స్ షీట్, ప్రొజెక్షన్స్ చాలా అవసరం. లాభ నష్టాలు బేరీజు వేసుకోలేని స్థితిలో బిజినెస్ చేస్తే అసలుకే మోసం వస్తుంది. మీ బడ్జెట్, టాక్స్ వర్క్ మీరే చేసుకోవడం తో కొన్ని అంశాలు నేర్చుకోడానికి పునాది వేయండి. 

5.     లీడర్షిప్ కమ్యూనికేషన్ అలవాటు చేసుకోండి

ఎంట్ర ప్రెన్యూర్ అవ్వాలంటే నేర్చుకోవాల్సిన మౌలిక నైపుణ్యాలు:  నిబద్దతతో మీ బృందాన్ని (Team) లీడ్ చేయటం, ప్లాన్నింగ్ తో  పనిచేయటం, విజన్, ప్రాజెక్ట్ ని ఉన్నతంగా కమ్యూనికేట్ చేయటం, సేల్స్. ఇందుకోసం మీ ప్రాజెక్ట్ పనే కాదు లోకల్ NGO లేదా టోస్ట్ మాస్టర్ క్లబ్ లో, సోషల్ ప్రాజెక్ట్ లో పనిచేయోచ్చు. ఇంట్లో పెద్దవారి జన్మదిన వేడుకలు మీరే బాధ్యత తీసుకుని  చేయొచ్చు.  ఆఫీస్ పని అయినా, సోషల్ ప్రాజెక్ట్ అయినా , ఫ్యామిలీ వర్క్ అయినా ఒక పెద్ద ప్రాజెక్ట్ కి బాధ్యత తీసుకోవడం ద్వారా ప్లానింగ్, నెగోషియేషన్, సేల్స్, లీడర్షిప్, టీం వర్క్  స్కిల్ల్స్  పెంపొదించుకోవచ్చు. ఆన్లైన్ లో  సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉండటం ద్వారా కూడా కమ్యూనికేషన్ , కరెంటు ట్రెండ్ అవసరాలు అర్థం చేసుకోవచ్చు.  
          ***  ***  ***  సైకాలజీ టుడే, సెప్టెంబర్  2017 లో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  ***   

Saturday, 2 September 2017

కొనుగోలుదారుడి నిర్ణయాలను నిర్ణయించే 5 అంశాలు – కస్టమర్ సైకాలజీ

ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ కి కస్టమర్లను, వారి అవసరాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. కస్టమర్ ఆలోచనా రీతులు కూడా తెలిస్తే చాలా ఉపయోగకరం. అసలు కస్టమర్ "కొనాలా? వద్దా?" అని నిర్ణయం తీసుకునే సమయంలో కొనుగోలు దారుని సైకాలజీ ఏమిటి? అది తెలిస్తే సేల్స్ ప్రాసెస్ చాలా స్పీడ్ చేసుకోవచ్చు. ఎక్కువ సేల్స్ = ఎక్కువ బిజినెస్. అందుకు కావాల్సిన  కస్టమర్ సైకాలజీలో మౌలికాంశాలు మీముందుకు తీసుకువస్తున్నాము. రండి మన కస్టమర్స్ ఎలా కొనుగోలు చేస్తున్నారో అర్థం చేసుకుందాం, వారి భాషలో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం.   
***    ***    ***    ***    ***    ***
కొనుగోలు దారుని పరిస్థితిలో ఉండి ఆలోచించడం సేల్స్ లో అందరూ చేయాల్సిన అంశమే, కానీ అసలు సేల్స్ లో కొనుగోలు దారుల నిర్ణయాలు నిర్దేశించే సైకలాజికల్ అంశాలు ఏమిటి? అసలు ఎందుకు కొంటారు?  అని తెలుసుకుని  బిజినెస్ , సేల్స్ చేస్తే సేల్స్ వేగం పెరుగుతుంది, ఎక్కువ ప్రిపరేషన్ తో కస్టమర్ కి హెల్ప్ చేయొచ్చు. . 

1.     కస్టమర్ నిర్ణయంలో ఎమోషన్, లాజిక్ రెండూ ఉంటాయి 
మనుషుల మైండ్ రెండు పార్శ్వాలు అని గమనించి ఉంటారు. ఎడమ భాగం (లెఫ్ట్ బ్రెయిన్) లాజిక్, ఎనాలిసిస్ చేస్తుంది. కుడిభాగం (రైట్ బ్రెయిన్) సహజంగా, సబ్జెక్టివ్ గా ఉంటుంది. మనం ఒక భాగం ఎక్కువ మరో భాగం తక్కువ ఉపయోగిస్తున్నామని అనుకున్నా ఒక వస్తువు కొనే సమయంలో, ఒక సేవ ఎవరివద్ద తీసుకోవాలి అని నిర్ణయించుకునే సమయంలో రెండు భాగాలు వాడుతాము. అంటే కార్ కొనడానికి వచ్చిన కస్టమర్స్ రెడ్ కలర్, వైట్ కలర్ చూసి, కార్ బ్రాండ్ లోగో లేదా ప్రమోషన్ ఫిలిమ్ నచ్చి క్షణాలలో  ప్రేమలో పడిపోచ్చు కానీ వారి మైండ్ దీని రేటు ఎంత, ఇందులో హార్స్ పవర్ ఎంత, సేఫ్టీ మెకానిజం రికార్డు  ఎలా ఉంది, ఏరో డైనమిక్ డిజైన్ ఎలా ఉంది, నిర్వహణ అవసరాలు ఏమిటి అందుకయ్యే ఖర్చు ఎంత వంటి అంశాలు చూస్తారు. అంటే మెదడు రెండు భాగాలు (ఫీలింగ్స్,లాజిక్) ఉపయోగించి నిర్ణయం తీసుకుంటారు. మీ ప్రోడక్ట్ ప్రమోట్ చేసినపుడు కస్టమర్స్ ఫీలింగ్స్ అండ్ లాజిక్ ఎలా పనిచేస్తుందో గమనించండి, ఆ విధానంలో వారిని అర్థం చేసుకుని మీ ప్రెజెంటేషన్ మార్పులతో సేల్స్ ప్రాసెస్ పెంచుకోండి.

2.     కొనేవారికి ఈగో ఉంటుంది
Every Great Order (EGO) – ప్రతి పెద్ద సేల్స్ ఆర్డర్ వెనుక ఒక పెద్ద ఆటంకం Every Great Obstacle (EGO) ఉంటుంది.  దానిని క్లియర్ చేసుకుని ప్రోడక్ట్ కొనేలా చేయటమే ప్రొఫెషనల్ సేల్స్ కర్తవ్యం.  కొనాలా? వద్దా? అని నిర్ణయించుకునే సమయంలో కొనుగోలు దారులు వారికి ఆ కొనుగోలు వలన నాకేంటి లాభం? అని చూస్తారు? అది నాచురల్. వారి ఈగో అర్థం చేసుకుని వారు ఎప్పుడూ తీసుకునే లాభదాయకమైన నిర్ణయాల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నారు అనే విషయాలు మీ మాటల్లో నమ్మకంగా చెప్పగలగాలి. నాకేంటి అనే ప్రశ్నకు ముందుగానే మీ ప్రెజెంటేషన్ లోనే చెప్పగలిగితే సేల్స్ ప్రాసెస్ మీరు ముందుకెళ్ళినట్లే . అయితే ఆ లాభాలు బ్రోచర్ లోనే ఫీచర్ బట్టీ పట్టి చెప్పినట్లు ఉండకూడదు. వారి పర్సనల్ లెవెల్ లో శ్రేయోభిలాషి ఇచ్చిన మంచి సలహాలా ఫీల్ అవ్వాలి.
3.     లాభాలు తక్కువైనా , నష్టాలు రాకుండా ఉండేందుకు కొనుగోలు దారుడు నిర్ణయం 
ఆ ప్రోడక్ట్ , సేవ ఎంత మంచిదని , ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పినా నిర్ణయం తీసుకోవాలంటే కస్టమర్ భవిష్యత్తుని చూడాలి. అందుకు తగినట్లు మీరు సేల్స్ రియల్ స్టొరీని  ట్రెండ్ లైన్ బేస్ చేసుకుని చెప్పాలి. ఎందుకంటే వారు ఆ ప్రోడక్ట్ , సర్వీస్ వినియోగిస్తుంటే  ఎలా సౌకర్యంగా ఉన్నారో ఊహించుకోవాలి. ఇది భవిష్యత్తు సంబంధించింది. కొందరికి ఇది కాస్త ఇబ్బంది ఉండొచ్చు.  ప్రస్తుతం ఉన్న ఇబ్బందులు అధిగమించాలంటే, ఇతరులు గతం లో చేసిన మిస్టేక్స్ లాంటివి జరగకుండా ఉండాలంటే ఇది చాలా మంచి నిర్ణయం అని కమ్యూనికేట్ చేయాలి. ఇది ప్రస్తుతానికి సంబంధించిన పాయింట్. ఎక్కువమంది కస్టమర్లు  ఈజీగా అర్థం చేసుకోగలరు. వారి పరిస్థితులు అర్థం చేసుకుని మాట్లాడుతున్నందుకు త్వరగా ఒప్పుకునే అవకాశం ఉంటుంది.
       
4.     కస్టమర్స్ కు  అనుమానాలు  ఉంటాయి   
కస్టమర్స్ వరకు ఎందుకండీ మీరు వాడుతున్న టెలిఫోన్ సర్వీస్ ప్రొవైడర్ బదులు మార్కెట్ లో కొత్తగా వచ్చిన ఒక కంపెనీ మీకు కొన్ని ఫీచర్స్ చెప్పి తమ సర్వీస్ తీసుకోమని చెప్పిందనుకోండి మీకు ప్రశ్నలు వస్తాయా? లేదా? మనందరికీ అనుమానాలు ఉంటాయి, సరైన వివరాలు కావాలనే ఉంటుంది.  అమ్మేవారికి అమ్మాలనే ఎజెండా ఎలా ఉంటుందో కొనేవారికి “నాకు ఎలా అవసరమౌతుంది” అనే ఎజెండా ఉంటుంది. అందుకే సరైన ఆరోగ్యవంతమైన కస్టమర్ రిలేషన్స్ , నమ్మకం పెంచుకోవాలని  సేల్స్ రంగంలో నిష్ణాతులు చెప్తారు. అందుకే అసలు ఎదో ఒకటి అమ్మటం కాకుండా  కస్టమర్ అవసరాలను మార్కెట్ స్టడీ చేసి ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నారు.

5.     కస్టమర్స్ వావ్ అనిపించే విజువల్స్ , సేల్స్ స్టొరీ    
కస్టమర్ల లాజికల్ మైండ్ నిజాలు, నంబర్స్ , టెక్నికల్ అంశాలు బేరీజు వేస్తున్న వారిలోని మరో భాగం గతంలో సక్సెస్ అయిన గొప్ప చిత్రాలు, అప్పియరెన్స్, సేల్స్ స్టొరీకి బాగా ఆకర్షితం అవుతుంది. ఎక్కువ కస్టమర్స్ కావాలంటే, మంచి సేల్స్ ప్రమోషన్ మెటీరియల్స్,  స్టొరీ ఉండాలి. అందుకే గతంలో ఆ ప్రోడక్ట్ కొని హ్యాపీగా ఉన్న కేస్ స్టడీస్, టెస్టిమోనియల్స్ బాగా ఉపయోగపడతాయి.

మీరు విలువైన ప్రోడక్ట్ ఇస్తూ ఈ కస్టమర్ సైకాలజీ అంశాలు గుర్తుంచుకుంటే సేల్స్ ప్రాసెస్ మరింత వేగంగా చేయొచ్చు. ఇంకా వివరాలు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి ఎందుకంటే మీరు ఎక్కువ కస్టమర్స్ ని రీచ్ అయ్యేలా సహాయం చెయ్యడమే మాకు సంతోషం. కస్టమర్  సైకాలజీని అర్థం చేసుకున్న వారు ఎక్కువ సహాయం చేయగలరు. నిజమైన బిజినెస్ , నిజాయితీతో చేయగలరు. 
          ***  ***  ***  సైకాలజీ టుడే, ఆగస్ట్ 2017 లో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  ***