Sunday, 27 December 2015

ఈ మూడు సోపానాలు ఎక్కితే మీరే ప్రపంచస్థాయి విజేత [Three Steps to become a world class winner ]

ప్రపంచమంతా చెప్పుకునేది విజేతల గురించి. ప్రపంచం నడిచేది విజన్ నుంచి. ప్రపంచాన్ని నడిపించేది లీడర్ షిప్. మరి వారిలా మనం ఎప్పుడు విజేతలవుతాము, వారిలా ఎదిగే అవకాశం మనకెప్పుడు వస్తుంది?  విజేత కావడం ఎలా? సందేహాలతో ఆగిపోవాలా సవాళ్ళు ఎదురైనా ముందడుగు  వేయాలా? సిల్వర్ స్పూన్ తో పుట్టలేదని ఆగిపోవాలా మనలోనే ఉన్న డైమండ్ కి సాన పట్టాలా? అసలు ప్రపంచ స్థాయి విజేతలా నిలవాలంటే ఏమి చేయాలి?

మిమ్మల్ని మీరు ఉన్నతంగా మలుచుకోవాలన్న డిసిప్లిన్:
మనకి ఏమి కావాలో, ఎందుకు కావాలో, మనం ఏమి కలిగి ఉన్నామో, వాటిని ప్రపంచంతో ఎలా పంచుకోవాలో తెలుసుకోవటమే లైఫ్. ఆపనిని ఉన్నతంగా చేయడానికి కావలసినవి లైఫ్ స్కిల్ల్స్. లైఫ్ లో మీరు ఆశించింది సాధించాలంటే మీ బాడీ , మైండ్, లైఫ్ ఎనర్జీ  అందుకు అనుసంధానంగా ఉండాలి. మీ గురించి, మీ జీవితం గురించి, సృష్టి మీకు ఇచ్చిన అద్భుతాలు గురించి మీకు అవగాహన ఉంటే వాటిని సవ్యంగా ఉపయోగించుకుని మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోగలరు. అందుకు కావలసింది మిమ్మల్ని మీరు అత్యంత ఉన్నతంగా మలుచుకోవాలన్న క్రమశిక్షణ. దీనికి కొంత ఆత్మ విశ్లేషణ చేసుకోడానికి ఈ ప్రశ్నలు , ఇలాంటి ఇంకొన్ని ప్రశ్నలు మీకు మీరు వేసుకని సమాధానాలు అన్వేషించండి.
  • ఒక వ్యక్తిగా నా ధర్మం ఏమిటి? నా జీవిత ధ్యేయం ఎఅమిటి?
  • నా కుటుంబం ఏమిటి? నా పరిస్థితులు ఏమిటి? అందుకు నేను ఇంకా విలువను ఆపాదించాలంటే ఏమి చేయగలను?
  • ఇప్పుడున్న పరిస్థితులుతో, నాకు ఇప్పుడు వస్తున్న ఫలితాలతో నేను ఎలా ఉన్నాను? నేను ఇంకా మెరుగైన జీవితం కోసం నా ప్రస్తుత జీవన విధానాలు ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ఏ విషయాలు నేర్చుకోవాలి? ఏ బలహీనతలు వదులుకోవాలి?
  • నాకు ఏమి ఫలితాలు కావాలి? ఎప్పటికి కావాలి? అవి సాధించిన క్షణంలో నేను ఎలా ఉంటాను? ఎలా మాట్లాడతాను? ఎవరెవరు నాతో ఉంటారు? ఎలా ఫీల్ అవుతాను?
  • ఆశించిన ఫలితాలు సాధించాలంటే నేను ఏమి చేయాలి? ఎవరిని కలవాలి? ఏమి నేర్చుకోవాలి? ఏమి చదవాలి?
నిబద్దత తో కూడిన జవాబుదారీతనం :

కొంతమంది ఉంటారు జీవితంలో ఎవరికి సమాధానం చెప్పుకోరు, తల్లిదండ్రులకు, స్నేహితులకు, ఆఫీస్ లో బాస్ కు, బయటి సమాజానికి దేనికి తన చర్యల పట్ల సమాధానం , నిబద్దత ప్రదర్శించరు. ఎవరికైతే ఈ రెండు లేవో వారు ప్రజలముందు ఒక రకంగా వెనుక మరో రకంగా బతుకుతుంటారు. ఇవి తెలివితేటలు అనుకుంటారు, అందరు తమని పట్టించుకోవలసిన అవసరం లేదని అనుకుంటారు. కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు ఫ్రెండ్స్ వద్ద, పక్క రూమ్ లో  హాస్టల్ లో లాప్టాప్ లు, సెల్ ఫోన్ లు , టూ- వీలర్ లు దొంగతనం చేసారని , మేడలో బంగారు గొలుసులు కొట్టేసే చెయిన్ స్నాచింగ్ బ్యాచ్ లు ఎక్కువ యువత పట్టుపడుతున్నారని వినే ఉంటారు ...ఇదంతా ఎక్కువ తనమీద , తన చర్యల మీద నిబద్దత, తనకి ఉన్న పరిస్థితులలో పాజిటివ్ రోల్ మోడల్ చూసి ముందుకు వెళ్లాని అని నేర్చుకోకపోవటం వలన జరుగుతుంది. ఇంకొందరు రెండు మూడు కోర్స్ లలో జాయిన్ అయ్యి యునివర్సిటీ లలో కేవలం రూమ్ , ఫుడ్ ఫ్రీ గా రావటం కోసం విలువైన జీవితాన్ని అక్కడే గడుపుతారు , మనం ఫ్రీ గా ఫుడ్ వస్తుంది అని చూస్తాము , జీవితాన్ని ఇంత కన్నా నిబద్దత తో తీర్చిదిద్దుకుంటే మరో కంపెనీ పెట్టి పదిమందికి ఉద్యోగాలు ఇవ్వొచ్చని నమ్మలేం.
బద్దకానికి , వాయిదా వేయడానికి మించి పనిచేయటం – టేక్ యాక్షన్ నౌ : 

అవును ఎంత తెలివి, ఎంత విశ్లేషణా సామర్ధ్యం ఉన్న పని చేయాలి. విజేతలు తాము చేస్తున్న పనిమీద, ప్రాజెక్ట్ మీద, తమ కంపెనీలో ఇతర డిపార్టుమెంటు ల మీద, కనీస కుతూహలాన్ని ప్రదర్శిస్తారు. తాము ఒక లక్ష్యంతో పనిచేసి దానిని సాధించిన తర్వాత, ఇంకొంచం ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని ఇంకా ఎదగాలని ప్రయత్నిస్తారు. ఉదయం ఎనిమిది గంటల లోపు ఎక్సర్ సైజు, మెడిటేషన్, ఆ రోజు చేయాల్సిన పనుల వివరాలు, బ్రేక్ ఫాస్ట్ తప్పక చూసుకునే అలవాట్లు ప్రపంచంలో విజేతలుగా అనేక ప్రముఖుల జీవితాల్లో భాగామని ఒక సర్వే లో తేలింది. అందుకే బద్దకాని , వాయిదా వేయడాన్ని మానేసి పనిచేయగాలగాలి. అర్ధం అయితే మల్లి ఈ అంశాల గురించి ఒక్క క్షణం మీ జీవితం గురించి ఆలోచించండి.ఒక్క గంట మీరు కోరుకుంటుంది ఎలాంటి జీవితమో రాయండి.ఒక్క రోజు మీరు కోరుకున్నట్లు జీవించండి. ఒక్క నెల ఈ ప్రక్రియ కొనసాగించండి. ఒక్క సంవత్సరం మీరు ఆశించిన జీవితాన్ని సృష్టిస్తూ, నమ్మకంలోనుంచి మీ జీవన ప్రాధాన్యాలపై దృష్టి కేంద్రీకరించి పని చేయండి.
*********** సైకాలజీ టుడే, డిసెంబర్ 2015 లో ప్రచురించిన  నా ఆర్టికల్ **************  




సమస్యలు ఎదురైనా మిమ్మల్ని విజేతగా నిలిపే 3 స్టెప్ ల సక్సెస్ ఫార్ములా (3-Step Success Formula)


జీవితంలో ఇప్పటివరకు జరిగిన సంఘటనలు, ప్రయత్నాలకి వచ్చిన ఫలితాల ఆధారంగా సక్సెస్ అవ్వాలంటే ఏమి చేయాలి అని ఆలోచిస్తూ కూర్చున్నారా? అసలు ఏ అంశాల మీద, ఏ ఆలోచనలు మీద, ఏ పరిస్థితులు మీద సక్సెస్ ఆధారపడి ఉంది అని అన్వేషిస్తున్నారా? నాలో లేనిది ఏంటి గెలిచే వాళ్ళలో ఉన్నది ఏంటి అని సందిగ్దంలో ఉన్నారా? అయితే మిమ్మల్ని విజేతగా నిలిపే సక్సెస్ ఫార్ములా అందుకోండి.

స్టెప్  1:   మీతో మీరు మాట్లాడుకునే విధానం మార్చండి (సెల్ఫ్ టాక్): చాలామంది ఉన్నదానికి త్రుప్తితో ఆనందంతో లైఫ్ ఎంజాయ్ చేయకుండా, కృతజ్ఞతా భావంతో ఆస్వాదించకుండా లేనిదాన్ని తలుచుకుని,  గతాన్ని తలుచుకుని, భవిష్యత్తు ని ఊహించుకుని వాటి పరిస్థితులు ఎలా ఉంటాయో, ప్రభావం ఎలా ఉంటుందో  అని ఆలోచిస్తూ ఉంటారు. అలా లేని సమస్యని ముందే ఊహించుకుని వర్తమానాన్ని ఇంకొంత  జటిలం చేసుకునే బదులు ఆనందంగా గడపొచ్చు అన్న చిన్న జీవన విధానం తెలియకనే ఈ పరిస్థితి. ఇంకోటి ఈ ప్రపంచంలో ఆనండం ఎక్కడ ఉంది అంటే “పరిస్థితి” ని బట్టి కాదు , మనో స్థితి ని బట్టి అని చెప్పుతుంది భారతీయ జ్ఞాన సంపద.  అందుకే మీతో మీరు ఉన్నతంగా, ప్రయోజనాత్మకంగా, జడ్జిమెంట్ ఇవ్వకుండా, సానుకూలంగా మాట్లాడుకోండి. మీకు ఎవైనా అనుమానాలు ఉంటె నివృత్తి చేసుకోండి కాని “ఈ పరిస్థితిలో మీరు ఉంటె తెలుస్తుంది...” అని ఒక అంతు చిక్కని రామ బాణాన్ని సంధించకండి. అది కేవలం ఇగో ని త్రుప్తి పరుస్తుంది. ఎప్పుడైతే మీతో మీరు ఉత్తేజితంగా, మాట్లాడారో అప్పుడు మీలో పూర్తి శక్తుల్ని ఉపయోగించుకోగలరు అని ప్రయోగాలలో కూడా తెలిసిన అంశం.  మూడో వ్యక్తితో మాట్లాడినట్లు మాట్లాడటం వలన కూడా మీ ఎమోషనల్ లెవెల్ లో ఉండే కొంత భయాలు పోతాయని రీసెర్చ్ లో చెప్పబడింది. “ నేను ఈ రోజు గొప్ప మీటింగ్ చేయలేను” అనే బదులు , “రమేష్ ...ఈరోజు నువ్వు చేయగలవు, గతంలో చేసావు, ఇది కేవలం నీకు మరో అవకాశం , కొత్త ప్లేస్ అంతే” అని మాట్లాడుకుంటే చక్కటి ప్రభావం ఉంటుంది. సెల్ఫ్ టాక్ లో కాస్త పవర్, పేషన్స్, “ఇలా అయితే ఇంకా హాయిగా ఉంటుందేమో”  అనే కొత్త సెన్స్ ఉండేలా చూసుకోండి, మీ లైఫ్ మీ చేతిలోకి వచ్చేలాంటి సింపుల్ , పవర్ ఫుల్ టెక్నిక్ ఇది.

స్టెప్ 2:   మిమల్ని భౌతికంగా ఉన్నతంగా మార్చుకోండి (ఫిజియాలజీ):
కేవలం మీతో మీరు మాట్లాడే మాటలే కాదు, మీ శరీరాన్ని, ముఖ కవలికాలని, మీ బాడీ మోత్తన్న్ని ఎలా ఉపయోగిస్తారు అనేది మీతో మీరు వేర్వేరు అంశాల మీద ఎలా ఫీల్ అవుతున్నారు అనేది నిర్నైస్తుంది. మీ ఆత్మ విశ్వాసాన్ని స్పష్టం చేస్తుంది. సోషల్ సైకాలజిస్ట్ అమీ కెడ్డి  మనిషి బాడీ లాంగ్వేజ్ కి ఎమోషన్స్ కి మద్య సంబంధాన్ని గురించి చేసిన అధ్యయనాల్లో అనేక ముఖ్యమైన విషయాలు చెప్పారు. మీరు మీ బుజాలు వంచి చిన్నగా వంగిపోయి నడుస్తూ, అల కూర్చుంటూ , స్లో గా మాట్లాడితే తక్కువ కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతారు, అదే పవర్ఫుల్ మాన్ గా (హి మాన్, వీర హనుమాన్) లాగా పోసే పెడితే ఆటో మాటిక్ గా పవర్ఫుల్ గా ఫీల్ అవుతారు. ఈ బాడీ లాంగ్వేజ్ అండ్ ఎమోషన్ రేలషన్ అర్ధం చేసుకుంటే మీరు గొప్ప ఒత్తిడి అనుకున్న క్షణంలో కూడా నెమ్మదిగా నవ్వుతు బాడీ లాంగ్వేజ్, ముఖ కవళికలు, సున్నిత మైన ముఖ కవళికలు అలవాటు చేసుకుని ఉంటె స్థిత ప్రజ్ఞత మీ లైఫ్ లో భాగ మైపోతుంది. మూడ్స్ ఎలాగో ఉంది అనుకున్నప్పుడు నిల్చొని చప్పట్లు కొట్టండి, వాల్కిగ్న్ చేయండి, ఆకాశం వైపు చూస్తూ గట్టిగా గాలి పీల్చుకోండి ...మీకు ఈ భౌతిక శరీరానికి – మనసుకు ఉన్న లింక్ బాగా అర్ధం అవుతుంది. దీని మీద పట్టు సాధించారంటే మీ ఎమోషన్స్ పూర్తిగా మీ కంట్రోల్ లోకి వచ్చి నట్టే. అందుకే పవర్ ఫుల్ బాడీ లాంగ్వేజ్ లో ఉండండి , అద్భుతాలు మీ సొంతం చేసుకోండి. 

స్టెప్ 3:   మీ స్వయం నిర్వచనం  మార్చుకోండి (సెల్ఫ్ డిస్క్రిప్షణ్):
మీ గురించి మీరు ఏమి అనుకుంటున్నారు అనే  మీ స్వయం నిర్వచనం, ఇది మీ శక్తి యుక్తుల్ని మీ చర్యల్ని ప్రభావితం చేస్తుంది.  నిర్ణయిస్తుంది. మీ జీవన నాణ్యతని నిర్ణయిస్తుంది. మీరు ఏ స్థాయిలో వ్యాపారం/ ఉద్యోగం చేయాలనుకుంటున్నారు? ఏ విధానాలు , ఎంత పెద్ద కారణం కోసం చేయాలనుకుంటున్నారు? ఏ కంపెనీ కార్ కొనాలనుకుంటున్నారు? ఎటువంటి ఇల్లు/ విల్లా  సొంతం చేసుకోవాలనుకుంటున్నారు?  ఎంత సంపద /డబ్బు సంపాదించాలనుకుంటున్నారు? మీ పిల్లలని ఎంత పెద్ద స్కూల్ లో చదివించాలనుకుంటున్నారు? మీ ఫ్యామిలీ తో ఏ ప్రదేశాలకు వెళ్లాలనుకుంటున్నారు? ఏ దేశాలు, ప్రదేశాలు చూడాలనుకుంటున్నారు? ఇవన్నీ మిమ్మల్ని మీరు ఏమని వర్ణిస్తారు, మీకు మీరు ఏమని నిర్వచిన్చుకుంటారో దానిపైనే ఆధార పడి ఉంది. ఏమి చేస్తునారు అంటే “ఎదో నెల కి ఒక ప్లాట్ అమ్ముతున్నాను “ అన్న దానికి “పెట్టుబడికి ఖచ్చితంగా రాబడి ఇచ్చే నమ్మక మైన వెంచర్ లో ప్రజలకి కావలసిన ప్లాట్ లు అందిస్తున్నాను”  అన్నదానికి చాలా తేడా ఉంటుంది. మన పరిచయ వాక్యానికే ఇంత గొప్ప అర్థాన్ని ఇవ్వగాలిగినపుడు జీవితానికి ఎంత గొప్ప అర్థాన్ని ఇచ్చుకోవచ్చు. అందుకే మిమ్మల్ని మీరు విజేతలుగా నిర్వచించుకోండి.

ఈ మూడు సోపానాల సక్సెస్ ఫార్ములా  60 రోజులు పాటిస్తే విజేతలుగా మానసికంగా సంసిద్దులౌతారు. వీటిలో పవర్ చదివినప్పుడు  కంటే పాటించే సమయంలో మీకు స్పష్టంగా తెలుస్తుంది. మీ విజయాలు మాతో పంచుకోండి.

*****************   సైకాలజీ టుడే , నవంబర్ 2015 లో ప్రచురించిన  నా ఆర్టికల్ *******************

Monday, 26 October 2015

6 Characteristics of Winning Entrepreneur (ఆ ఆరు ఎంట్రప్రెన్యూ ర్ లక్షణాలు మీలో ఉన్నాయా?)


Do you have the  sic characteristics of a winning entrepreneur? Here is the list.

1. Ability to focus irrespective of ambiguity and uncertain conditions
2. Personal discipline
3. Physical health
4. Doing the activities that you love
5. People skills 
6. Be different, think different, act different

కూటికోసం కోటి మార్గాలు అన్నట్లు బ్రతకడానికి బోలెడు మార్గాలు. ఉద్యోగం, తల్లిదండ్రుల ద్వారా వచ్చిన కుల వృత్తి, వ్యాపారం ఇవి ఒకప్పటి మార్గాలు. మరి ఇప్పుడు స్పీడ్ యుగంలో యువతలో, వ్యాపారాలలో ఒకటేమిటి ప్రపంచం మొత్తంలో ఆలోచన విధానాలు, పదాలు మారిపోయాయి. “నేను ఈ ఉద్యోగంలో ఇలా ఎన్నాళ్ళు?”, “ఈ వ్యాపారం నాకు ఎన్నాళ్ళు?”, “అసలు నాకు వచ్చినన్ని బిజినెస్ ఆలోచనలలో ఒక్కటి క్లిక్ అయినా చాలు లైఫ్ సెటిల్”.... ఇలా ఏ ఆలోచన వచ్చినా అది మీ ఎంట్రప్రన్యూర్ లక్షణాన్ని తెలియజేస్తుంది. మరి మీలో నిజమైన ఎంట్రప్రన్యూర్ ని ఎలా తెలుసుకోవాలి, ఆ లక్షణాలు శాస్త్రీయంగా మీతో చర్చించడానికే ఈ  ఆర్టికల్.
* * * * * * * * * * * * * * * * * *
1: సందిగ్ధంలో ఫోకస్ గా పనిచే లక్షణం: ఎంట్రప్రన్యూర్/ బిజినెస్ మాన్  కావాలని కలలు కనే వారికీ, అసలైన ఎంట్రప్రన్యూర్ కి  మధ్య ఉన్న ముఖ్యమైన తేడా ఏంటంటే ఉన్న జాబు,పని  చేసుకుంటూ గడపడం, రిస్క్ తీసుకొని ఆశించిన జీవితం / బిజినెస్ వైపు అడుగులు ముందుకు వేయడం. అంటే స్పష్టత లేకపోయినా మీ ప్రోడక్ట్ లేదా సర్వీసెస్ ద్వారా ప్రజలకి అవసరాలను తీరుస్తూ మీ మార్గంలో ముందుకు వెళ్ళగలను అనే నమ్మకం తో కూడిన అడుగు వేయగల దృక్పథం చాలా ముఖ్యం. ఏ ఇబ్బంది లేని బిజినెస్ బెటర్ అనుకునే వారు అసలు బిజినెస్ లో ఉండకపోవటం మంచిది. కాస్త చేదుగా ఉన్నా ఇది నిజం. అందుకే స్పష్టత లేకపోవడం, పూర్తి సమాచారం ఎదుగుదల, గైడెన్స్ లేకపోవటం, ఎండ్ ప్రోడక్ట్ ఏమౌతుందో , కస్టమర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే సందిగ్దం లో కూడా అడుగులు ముందుకు వేయగలిగే స్థిత ప్రజ్ఞత అవసరం. ఒక షెడ్యుల్ పెట్టుకుని నేను ఈ టైం లో నే పని చేస్తాను, ఈ పద్దతిలో ఉన్న వాళ్ళే కావాలి అని చట్రాలు పెట్టుకుని కూర్చుంటే స్టార్ట్-అప్ , బిజినెస్ లు స్థాపించడం కష్టం. సందిగ్థంలో కూడా అనుకున్నది సాధించగలను అనే నమ్మకంతో పనిచేసే లక్షణం మీలో ఉందా?

2:  వ్యక్తి గత క్రమశిక్షణ: ఎంట్రప్రన్యూర్ అంటే సొంత వ్యాపారం, సంస్థ సృష్టించడం. ఇది సెల్ఫ్ – మేనేజ్ మెంట్ తో మాత్రమే వీలౌతుంది. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా ఈ స్థితికి మీరే కారణం. ఎంట్రప్రన్యూర్ గా ఎదగాలంటే మీ జీవితానికి 100% బాధ్యత మీరు తీసుకోగలగాలి. వినియోగదారులు నువ్వు ఒక్కడివే ఎన్నో రకాల పనులు చేస్తున్నావని, సరిగా తినకుండా రాత్రి కుడా పని చేసావని చూడరు. మీరు ప్రామిస్ చేసిన సర్వీస్ / ప్రోడక్ట్ అనుకున్నట్లు అందిందా లేదా అని చేస్తారు. వ్యాపార కమ్యూనికేషన్ కుడా ఉన్నతంగా ఉండాలి. ఎదుటి వాళ్ళది తప్పు అయినంత మాత్రాన మన ఇష్టం వచ్చినట్టు రెస్పాండ్  అయ్యే రోజులు పోయాయి. కాబట్టి  మీ తప్పులకు ఇంకొంత నేర్చుకుని మరో సారి పునరావృతం కాకుండా నిత్య విద్యార్ది గా ఉండడం ఎంట్రప్రన్యూర్ లక్షణం. ఇది వ్యక్తి గత బాధ్యత , క్రమశిక్షణ నుంచి వస్తుంది, అది మేలో ఉందా?
3:  శారీరక ఆరోగ్యం:  అవును. మీరు చదువుతున్నది కర్రెక్టే. శారీరక ఆరోగ్యం ఎంట్రప్రన్యూర్ జీవితాన్ని ఇంకా ఎక్కువ ప్రభావితం చేస్తుంది. మీ ప్రొడక్టివిటీ మీ ఆరోగ్యం పై ఆధారపడి ఉంటుంది. ఉద్యోగంలో లాగా సొంత వ్యాపారంలో సిక్ లీవులు పెట్టుకోడానికి వీలవదు. తేడావస్తే సమయానికి పనులు పూర్తి చేయలేకపోతే  కస్టమర్ నొచ్చుకుని  ఇక రెండో సారి మనకు వర్క్ / సర్వీస్ రిక్వెస్ట్ ఇవ్వకపోవచ్చు. అందుకే సరైన ఆహారం, రెస్ట్, ఎక్సర్ సైజ్ తో మిమ్మల్ని మీరు శారీరకంగా, పుస్తకాలు, ట్రైనింగ్ లతో మానసికంగా ఆరోగ్యంగా ఉంచుకోగాలగాలి. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఎన్ని గంటలు ఆక్టివ్ గా పనిచేస్తున్నారు? మీ వర్క్, ఇల్లు , ఫ్యామిలీ టైం అన్ని బాలన్స్ చేయగలుగు తున్నారా?

4:  ప్రేమించే పనిని చేయటం:  ఎంట్రప్రన్యూర్ గా చేసే పని మీకు చాలా ఆనందాన్ని , సంతృప్తిని, ఉత్సాహాన్ని ఇచ్చేది అయ్యి ఉండాలి. వేరే వాళ్ళు లాగా డబ్బులు సంపాదిన్చాలనో, సోషల్ స్టేటస్ కోసమో స్టార్ట్-అప్ లు, బిజినెస్ లు పెట్టి అనవసరంగా ఇందులోకి దిగి ఉన్న డబ్బు వేస్ట్ చేసాను అనే వాళ్ళు, ఎవారినో నమ్మి నేను ఈ ఫ్రాన్చిసీ తీసుకున్నాను అనో, డిస్ట్రిబ్యూటర్ ని నమ్మి ప్రోడక్ట్ తయారి చేసాను ఇప్పుడు వాళ్ళు చేతులెత్తేశారు సరుకు ఎలా అమ్మాలి అని ...ఇలా ఎన్నో రకాలుగా నా వద్దకు క్లైంట్స్ వచ్చారు. మనం ప్రేమించే పని అయితే ఇలాంటి సమస్యలను చాలా వరకు నిరోధించోచ్చు. మీ మొదటి వంద కష్టమర్లను మీరే తెచ్చుకునే వరకు బిజినెస్ చేసే ఓపిక మీకు ఉండాలి. ఎక్కువ పని గంటలు సాధారణం అయిపోతుంది అందుకు రెడీ అయి ఉండాలి. ప్రేమించే పని అయితే కావలసిన ఇతర నైపుణ్యాలు, అర్హతలు సాధించుకోడానికి ఇంకా కష్ట పడగలరు , లేదా ఆ స్కిల్ల్స్ ఉన్న వాళ్ళను కో- ఫౌండర్ గా, పార్టనర్ గా పెట్టుకుని ముందుకి వెళ్ళగలరు. మీరు మీ ఐడియా / బిజినెస్ ని ప్రేమతోనే చేస్తున్నరా?  ఎలా ఉంటుందో చూద్దామని రాయి విసురుతున్నారా? ఎంట్రప్రన్యూర్ గా ఎదగాలంటే ప్లాన్-B (ప్రత్యామ్నాయం) పెట్టుకోవటం అనవసరం. రాళ్ళు వేయటం ఆపి పని మొదలు పెట్టటం అవసరం. మీ బిజినెస్ ఎన్ని ఒత్తిళ్లకు లోనైనా కస్టమర్ అవసరాలకు తీర్చేలా మిమ్మల్ని మీ ప్రోడక్ట్ / సర్వీస్ తీర్చి దిద్దుకుంటూ పనిచేయగలరా?  
5:  మనుషులతో కలిసి మెలిసి పనిచేయగాలిగే నైపుణ్యం :  ఎంట్రప్రన్యూర్ గా ఉండటం అంటే బిజినెస్ మాన్ సినిమా లో హీరో లా వన్ ఆర్మీ లా ఉండటం కాదు. మీ ఐడియా దశ నుంచి లాభాల్లో వ్యాపారాన్ని నిర్మెంచేవరకు అనేక రకాల వ్యక్తులతో ముందుకు వెళ్ళగలగటం, మీ ఆలోచనలకు , విజన్ కు తగిన వారిని, మీకు లేని స్కిల్ల్స్ ఉన్న వారిని కో- ఫౌండర్/ పార్టనర్ వెతకటం స్టార్ట్-అప్/ బిజినెస్  క్లైంట్ లతో మాట్లాడటం, మెంటార్ , ట్రైనర్ లను కలిసి మీ అవసరాలను చర్చించడం, మీ సర్వీస్ / ప్రోడక్ట్ గురించి ఫండ్ ఇచ్చే వారికి, మార్కెటింగ్ వారికి, కస్టమర్స్ కి చెప్పటం....ఇలా ప్రతి స్టెప్ లోను మనుషులతో కలిసిపోగలగాలి, మాట్లాడటమే కాదు, మనసులను అర్ధం చేసుకుని బిహేవ్ చేయగలగాలి, మిమ్మల్ని చూస్తే ఆ ప్రోడక్ట్ గుర్తొచ్చేలా ఒక బ్రాండ్ / గుర్తింపు ఉండేలా మీ కమ్యూనికేషన్ ఉండాలి. ఆ లక్షణాలు మీలో ఉన్నాయా? ఎందుకంటే ఎంట్రప్రన్యూర్ గా ఉండటం అంటే ఎదో ఒక రోజు ఇతర వ్యక్తుల ఆలోచనలు, విజ్ఞానం, సమర్ధత, అనుభవం మీదా ఆధారపడాల్సి రావచ్చు. అందుకు మంచి పీపుల్ స్కిల్ల్స్ ఉంటె ఉనంతంగా కంపెనీ నిర్మించుకోవచ్చు.

6:  మీరు కాస్త భిన్నంగా ఉంటారు:  అందరూ ఇబ్బందులు చుసే వద్ద మీరు అవకాశాలు చూస్తున్నారా? ఎవరు మొదలు పెట్టని వద్ద మీరే అంతా ఐ ముందుకు నడిపించాలను కుంటున్నారా? ఏదైనా సరే చేస్తా అని గట్టిగా చెప్తున్నప్పటికీ ఏమి ఔతుందో లేదో అని ఆలోచిస్తున్నారా? అది లేదు, ఇది లేదు అని కారణాలు చెప్పకుండా ఉన్నదానితో ది బెస్ట్ గా ఏమి చేయగలమని అలోచిస్తున్న్నారా? అందరు చేసిన పనే అని కాకుండా రిస్క్ లని లెక్క చేయకుండా భిన్నంగా అలోచించి , భిన్నంగా పని చేయాలనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం వెళ్ళే దారి అని కాకుండా వారి ఆలోచనలనే ఛాలెంజ్ చేయాలనుకుంటున్నారా? ....వీటిలో ఒక్క ప్రశ్నకు మీరు “ఎస్” అని చెప్పినా ఇంచుమించు మీలో ఒక ఎంట్రప్రన్యూర్/ ఫౌండర్/ బిజినెస్ మాన్ ఉన్నట్లే . మీరు భయపడరు, ఒక చోట తిన్నగా ఉండరు, ఎదో చేయాలన్న ఆలోచన మిమ్మల్ని తొలిచివేస్తుంది, ఎదో సృష్టించాలన్న కసి మిమ్మల్ని అనుక్షణం దహించి వేస్తుంది , ఆ ఫైర్ కి కావలసిన గైడెన్స్ / మెంటార్ దొరికితే మీరే ఓ స్టీవ్ జాబ్స్ , ఓ నారాయణ మూర్తి, ఓ అజీం ప్రేమ్ జీ ...____________(మీ పేరు రాసుకోండి) కావచ్చు.

ఈ ఆరు లక్షణాలు మీలో ఎంట్రప్రన్యూర్  ఇప్పటికే అప్పుడప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటాడు - ఎప్పుడు నీ ఆశయాల వైపు వేగంగా , ఖచ్చితంగా అడుగులు వేసేదని?. ఈ అంశాలు సామాన్యులని బిజినెస్ మాస్టర్స్ గా మర్చేవి, ఎందరినో గొప్ప వ్యాపార సామ్రాజ్యాలను సృష్టించేలా చేసిన అంశాలు. ఇవి మీలో ఎంత మేరకు ఉన్నాయో స్వయం విశ్లేషణ చేసుకుని బిజినెస్ దిశలో అడుగులు వేయండి.

8 Characteristics That Fail the Entrepreneur in You (మీలోని ఎంట్రప్రెన్యూ ర్ ని ఓడించే ఆ ఎనిమిది లక్షణాలు)


This articles deals with the eight characteristics that kill the entrepreneur in you.
1. Only dreaming without taking action
2. Inability to learn skills required 
3. Fear of failure
4. Fear of managing and sustaining success
5. Too much focus on perfection
6. Inability to focus on priorities
7. Complaining instead of being accountable and perseverance
8. Lack of taking initiative

మీ ఐడియా ను లాభదాయాక బిజినెస్ లా మార్చుకునే మార్గంలో ఉన్న కొన్ని ప్రాధమికాంశాలను గత నెలలోనేర్చుకున్నాము. అయితే మీకు వచ్చిన ఒక బ్రహ్మాండమైన ఐడియాని బిజినెస్ లా మార్చే సమయంలో మీలోనే ఉండే కొన్ని లక్షణాలు మీ ముందలి కాళ్ళకు బంధాలు వేస్తుంటాయి, మీ ఆశలను ఆవిరి చేస్తుంటాయి మీతో సైకలాజికల్ గేమ్ ఆడే ఆ లక్షణాలను గుర్తించి వాటికి చెక్ పెడితే బిజినెస్ లో విజయం మీదే. అదెలాగో తెలుసుకుందాం రండి.
* * * * * * * * * * * * * * * * * *
1: కలలు కంటూ ఆనందించడం , పనులు చేయక పోవడం ? గొప్ప విజన్ ఉన్న వాళ్ళే, అంత కంటే గొప్ప ఐడియా మీ వద్ద ఉంది. కాని ఆ ఐడియాని నిజం చేసే మార్గంలో చేయాల్సిని కృషి చాల ముఖ్యం కదా ఆట ఆడకుండా ఫలితం ఆశించటం అవివేకం.  ఇలా కేవలం గొప్ప ఐడియాలను సృష్టిస్తూ వాటి గురించి మేధావిగా ముచ్చట్లు పెడితే అవి కేవలం చుట్టుపక్కల వారికి తలనొప్పి ఇస్తుంది కాని ఎవరికీ ఉపయోగం లేదు. ఆ మాటలతో మన గొప్పతనం గురించి డబ్బా కొట్టుకుంటున్నాం అనుకుంటుంది ప్రపంచం. ఎందుకంటే ప్రపంచం మన అర్థవంతమైన ఫలితాలు రూపంలో చూడాలనుకుంటుంది. అందుకే ఐడియా మనిషి కాదు, యాక్షన్ మనిషిగా గుర్తింపు పొందండి. అదేనండి... పనులు నెరవేర్చే మనిషిగా తయారవండి.
2:  బిజినెస్ కి అవసరమైన నైపుణ్యాలు నేర్చుకోలేకపోవడం: కొందరు ఐడియాతో ముందుకొచ్చినంత వేగంగా నిజమైన పనిలోకి ఇష్టపడరు, లేదా చేయరు, బద్ధకం వారిని ఎంజాయ్ చేస్తుంది (వీరు బద్దకాన్ని ఎంజాయ్ చేస్తుంటారు మరి !), ఉత్సాహం కొనసాగించారు. వారిలో శక్తి, ఆసక్తి మెల్లగా తగ్గిపోవటం గమనిస్తాము. అందుకే ఏ ఐడియా, ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నామో  దానిని ముందే ప్రివ్యూ చేసి, అది చేసే వారి వద్ద పరిశీలించడమో, నేరుగా వారితో కొంత కాలం గడిపి “ ఆ పని నేను చేస్తే....  ఈ విధమైన ఛాలెంజ్ / ప్రాజెక్ట్  నాకు వస్తే...” అనే కోణంలో అలోచించుకోగలగాలి. అందుకు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకోవాలి. మారుతున్న ట్రెండ్ ని బట్టి టెక్నాలజీ , స్కిల్ల్స్ నేర్చుకోకపోతే మొద్దుబారిన గొడ్డలితో చెట్టు కొడుతూ నేను చాలా కష్టపడుతున్నా చెట్టే అలా ఉంది అని భ్రమలో బతికే వారిలా తయారవుతాము.  
3:  ఫెయిల్ అవుతామేమో అనే వివేకము లేని భయం:  తెలియని విషయాలమీద, కొత్త విషయాలమీద, ప్రయత్నించే మొదటిసారి/ కొత్తలో సాధారణంగా ఎవరికైనా కాస్త భయం ఉంటుంది. మనిషి బ్రతకడానికి ఇది కొంత కీలకమే. అయితే విజయవంతమైన వ్యాపారులు కొన్ని భయాలను , మానసిక చట్రాల నుంచి ధైర్యంతో ముందుకు వస్తారు. వారు  భయాన్ని, బలహీనతను వదిలి రిస్క్ తీసుకోవటం నేర్చుకోవటంలో ఒక భాగంగా చూస్తారు. కొందరు భయంతో ఉంటారు, ఆలోచనలలోనే ఆగిపోతారు, పనులు మొదలు పెట్టరు.
4:  సక్సెస్ ని మేనేజ్ చేయలేనేమో వంటి అవివేకంతో భయం:  కొందరు తమని తామే తక్కువగా చూసుకుంటారు, కావాలనే సక్సెస్ స్థితిలో కూడా తక్కువ చేసుకుంటూ మళ్ళీ ఈ స్థితి ఎక్కువ కాలం మేనేజ్ చేయలేనేమో అనుకుంటూ ఒక అవివేకంతో భయంలో తమ గురించి తాము చెప్పుకోరు, ఇది కేవలం రేపటి పరిస్థితి నాకు డౌటే అనుకునే మైండ్ సెట్ స్థితి. ఒక బిజినెస్ మాన్ గా సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అనేవి చాలా సాధారణమైన అంశాలు. ఫార్చ్యూన్ 500 సంస్థలే అనేక ఒడిదుడుకులకి లోనైనపుడు స్టార్ట్ అప్, చిన్న సంస్థలు,చిన్న వ్యాపారాలు అనేవి ఎత్తు పల్లాలను చూడడం చాలా సహజం అని నేర్చుకోవాలి. ఒక్కసారి ఒక స్థితికి చేరితే వ్యాపారంలో అలాగే స్థిరమవ్వాలి అనుకోవద్దు, మార్పులను ఆశించిన విధంగా నిర్మాణాత్మకంగా స్వీకరించే విధానాలు, ఆలోచనలు నేర్చుకోవాలి. 
5:  పర్ఫెక్షన్ మీద మాత్రమే దృష్టి పెట్టటం?: మొదటినుంచి మంచి క్వాలిటీ వర్క్ చేయాలి అనే తపన ఉండటం వలన, మిస్టేక్స్ వీలైనంత వరకు చేయకూడదు అనే దృక్పథం వలన చాలా మంది పర్ఫెక్షన్ మీద ఫోకస్ చేస్తారు. బ్రోచర్ డిజైన్  నుంచి టాయిలెట్ పేపర్ కంపెనీ వరకు అన్నీ ఇలానే ఉండాలి అని అతిగా పర్ఫెక్షన్ గురించి ఆలోచిస్తే, అసలు పని అనుకున్న  టైం లో జరగకపోవచ్చు. అందుకే ఉన్నంత లో బెస్ట్ గా ఒక టైం లైన్ లో చేసి, కస్టమర్/ భాగస్వామి వంటి వారి ఫీడ్ బ్యాక్ తీసుకుని ఇంకొంచం బాగా మరో ప్రయత్నంలో చేయగాలిగితే చాలు. బిజినెస్ లో మీ సేవలు లేదా ప్రయత్నాలు రియాలిటీ కి దగ్గరగా ప్రజల అవసరాలను తీర్చగలిగేలా ఉండాలి, మనకి నచ్చింది లేదా మనకి వచ్చింది మాత్రమే కాదు.   
6: ముఖ్యమైన అంశాల మీద దృష్టి సారించాలేకపోవటం: ఒక బిజినెస్ పెట్టిన కొత్తలో లేదా మంచి అనుభవం ఉన్న బిజినెస్ అయినా అనేక కార్యక్రమాలలో రెగ్యులర్ గా చేస్తూ ఒకోసారి ఏది సంస్థకు చాలా ముఖ్యం, అర్జెంటు గా చేయవలసిన వాటిలో ఏది చాలా ముఖ్యం (ఇంపార్టెంట్ ) తెలుసుకుని చేయగలగటం అవసరం. ఈ పని చేయనపుడు ఎదిగే అవకాశం ఉంది కూడా పావురాన్ని తాడుతో చెట్టుకు కట్టేసినట్టు అయిపోతుంది బిజినెస్.  మన వద్ద ఉంది ఎంత మంచి సర్వీస్ లేదా ప్రోడక్ట్ ఐనప్పటికీ చాంతాడంత లిస్టు బిజినెస్ ప్రెజెంటేషన్ లో  పెడితే మీరు ఏది ఎవరికీ ఎప్పుడు ఇవ్వాలో అది ఇవ్వలేరు. నాతో బిజినెస్ డెవలప్మెంట్ సపోర్ట్ తీసుకున్న  ఒక సంస్థ వారి బ్రోచర్(పాంఫ్లెట్) లో 35 కి పైగా ప్రొడక్ట్స్ పెట్టటం మొదటి మీటింగ్ లోనే గమనించాను. వీటిలో ఏది ప్రజల చేత బాగా మంచి పేరు తెచ్చుకుంది అది మాత్రమే ఫోకస్ చేయమని చెప్పినప్పుడు వారికి లోపం అర్థమైంది. ఒక అవసరం ఉన్నప్పుడు కస్టమర్ కి మీరే గుర్తు రావాలంటే మీ బ్రాండ్ దేనిమీద ఫోకస్ చేయాలో, మీ బిజినెస్ దేని మీద దృష్టి పెట్టాలో తెలుసుకోగలగాలి.
7: జవాబుదారీతనం, నిబద్దత బదులు సాకులు చెప్తూ ఉండటం : ఈ ప్రపంచంలో ఒక సాధారణ మనిషికి నుంచి ఎంట్రప్రెన్యూర్ లేదా బిజినెస్ మాన్ వరకు ఉండకూడని అత్యంత భయంకరమైన అవలక్షణం అంటే జవాబుదారీతనం లేకపోవటం. కొందరు వారి తల్లి దండ్రులకి, స్నేహితులకి, వారు పనిచేసే సంస్థలకు, వారు చేసే వ్యాపారంలో భాగాస్వామ్యులకు, చివరికి వారికి వారే జవాబుదారుడిగా ఉండరు. వారి ఏ స్థితిలో ఉన్నా ప్రజలు ప్రస్తుతం వారిని ఎంత అంగీకరించినా, దీర్ఘకాలంలో వారి పేరు, ముద్ర పేకమేడల్లాగా కూలి పోతుంది. అందుకే అన్నారు ఒక మంచి బంధాన్ని నిర్మించుకోడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది, అదే బంధం 30 క్షణాల్లో కూలిపోయే అవకాశం ఉంది అని. ఫోన్ చేసి ఎన్ని గంటలకు వస్తారు అని అడిగితే మనం ఇచ్చే టైం నిజంగా వెళ్ళగలిగే టైం అయితేనే  చెప్పండి. కొందరు ప్రభుద్దులు జీవిత కాలం కూడా ఈ చిన్న విషయం నేర్చుకోరు. ఒక పని కాకపోడానికి, వాస్తవానికి సంబంధం లేని, నిజమైన కారణాలుగా మాస్క్ వేసుకున్న కుంటిసాకులు చాలా చెప్పొచ్చు. మనం ఏది పదే పదే జపిస్తామో దానిలో మాస్టర్  అవుతాము. కుంటిసాకులు ఎక్కువ చెబితే అవి చెప్పటంలో మాస్టర్ అవుతాము. ప్రజలు మిమ్మల్ని , కల్ల బొల్లి మాటల్ని నమ్మారని అనుకుంటారు. కానీ అల చెప్పే వాళ్ళని సిల్లీ గా చూస్తారు. బిజినెస్ లో ఈ లక్షణం అసలు పనికిరాదు. బిజినెస్ లో ఫైయిల్ ఐన వారిలో బాగా కనిపించే లక్షణం ఇదే.
8:  స్వతంత్రంగా మొదలు పెట్టలేకపోవటం : కొందరికి గొప్ప ఆలోచనలు ఉంటాయి కాని, వారు సొంతంగా పని మొదలు పెట్టరు. పక్కన ఎవరో ఒకరు తోడు అవసరం. వీలైనంత త్వరగా టీం జాయిన్ చేసుకుని పని మొదలెట్టాలి లేదా మొదటి అడుగు ఎప్పుడు ఒంటరిదే కదా....మొదలెట్టాలి. బిజినెస్ లో ఉన్న వాళ్ళు ఒకరెవరో వచ్చి చెప్పినదాకా వెయిట్ చేయకూడదు, సొంతంగా మొదలు పెట్టాలి, అర్థం చేసుకోవాలి, రిజల్ట్ గమనించాలి, ఇంకా బాగా ఎలా చేయాలి అని ఆలోచించుకోవాలి, మరింత ఉన్నతంగా తనను తాను లీడ్ చేసుకోవాలి. ఒకో సారి ఫలానా పని ఐనదాకా నా వర్క్ ఆపేస్తాను అని వెయిట్ చేస్తుంటాము. అది కూడా ఒక నెల లేదా రెండు నెలలు వెయిట్ చేసినా జీవితాంతం వేస్ట్ అయ్యేంత చుసుకోవద్దు. ఎందుకంటే సమయం అంటే జీవితం, సమయం వేస్ట్ అయితే జీవితం వేస్ట్ ఐనట్టే. లైఫ్ కైనా, బిజినెస్ కైనా ఇది చాలా ముఖ్య సూత్రం.

ఈ ఎనిమిది సూత్రాలు పాటించండి మీలో ఉన్న ఏ లక్షణాలు మీ బిజినెస్ కి  ఉపయోగపడవో నిశితంగా పరిశీలించుకుని మీ బిజినెస్ సక్సెస్ దారిలో ఆటంకాలను అధిగమించి, ప్రజలకు మీ సర్వీసులు అందించండం ద్వారా బిజినెస్ ఎక్స లెన్స్ సాధించండి.

Saturday, 1 August 2015

8 Stept To Create Profitable Business From Your Idea: మీ ఐడియా ద్వారా మిమ్మల్ని ఐశ్వర్యవంతులను చేసే 8 సోపానాలు:


Hi
you might have got many ideas and some may be a greatest business ideas. Some times you might have wonder that your ideas are actually manifested into profitable businesses by some other person or company. What are the fundamental steps in creating profitable business from your idea? Let us discuss about those important eight steps now. Stay tuned. 

Step 1: Write your idea and learn about it: 
Just do this exercise. What did you do with your previous idea when you thought "oh it is one of the idea..." . Check whether you have avoided taking action on that idea due to your own self-limiting beliefs. If you have any such beliefs that no longer serve you question the base of the beliefs and have only empowering beliefs. Try to note down your idea, share it with friends or family members, read some thing about it, vision what it looks like if your idea is manifested in reality

Step 2: Identify what problem does your idea is solving: Understand what needs of the people are addressed by your idea. Are you able to help people over come any problem or simplify any process. What pain points of the customers are being addressed and how? You need to provide the best possible solutions to a problem within the framework of resources and challenges and add value to market place as fast as you can to establish a profitable startup / business.

Step 3: Identify your customers: Who are the people having the problems or needs that you mentioned in the previous step? Where are they? Who are your prospective customers? If you develop a product that can be beneficial to every one on the earth, that does not mean every one on the earth will use only your product. You need to identify, enlist and prioritize your prospective customers and target those whom you can immediately reach and develop distribution channels or mechanisms reach those in need.  

Step 4: Develop your team. Share your idea. Don't think your idea is some thing out of the world that has flashed only in your mind and you want to change the world forever. Share with others and let other minds also work on it, let them provide you their feedback or opinions. Develop a team of people or partner with some one who resonates with your idea. Have networks with those who can complement your strengths. It helps in developing customer loyalty and presenting your strengths at investors or stake holders.

Step 5: Understand your revenue model:  Yes you got a great idea. You know what problems it can solve and who has such problems. Now work on reaching them. At the same time test your idea whether it is getting you money. If you are addressing needs of people through your services with no payment, it is nothing but you are investing your time, money and energy  in your habit. Business is not spending time on hobby, rather it is a adding value through product and get paid for what you do. Think what is the production cost, estimate what are the marketing, man power, distribution and other expenditures apart from capital. Estimate the products or services and projected revenues that you can generate and try to calculate cash flow,  revenues and profits. Is the idea can pay you? Do not over estimate numbers, which is pathetic illusion that start ups make. Try to change the way you do business to move towards profitable model as soon as possible.

Step 6: Create your capital. TO work on your idea you may need resources including money. Please do estimate manpower and money needed to take off your business idea. Check the possibilities of bringing your start up money. It could be your savings, your family members' support, friends, loans, startup supporters such as investors, funders, profit sharing partners etc., Try to share your idea to funders and show them the value you create through product / service for those who are in a problem. 

Step 7: Develop Minimum Viable Product. To help people know what you are doing and how best you are serving to address their needs, let people experience your work. Develop a minimum viable product which can address most pressing areas of the need of many things that you can do. People can not forget the best product that address their important needs and makes their life more easier. If you can create that, people will remember you whenever that need emerges to them.   

Step 8: Maintain Positive Energy. People ask for riskless business idea. The very idea itself is a risk if you are in business. Entrepreneurship is involved with your ability to take risks, turn challenges into opportunities, learn from past mistakes, oversee your focus and test your path as market changes. So focus on your product or services, adding value in your approach, doing your best, with lots of positive energy in your thoughts, actions and spirit while you are turning your idea into a profitable business. Do your best, today do your best than how best you did yesterday. This attitude gives you more positive energy as it yields you positive results.

మీ ఐడియాతో ద్వారా మిమ్మల్ని ఐశ్వర్యవంతులను చేసే  8 సోపానాలు:
ఈ ప్రపంచంలో వ్యాపారాలు, సేవలు అన్ని ఒక ఐడియా నుంచి వచ్చినవే. ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేయవచ్చు. అందుకు ఐడియా రావడం మాత్రమే కాదు దానితో ఒక నిర్మాణాత్మక స్నేహం చేయాలి. నాకో సూపర్ ఐడియా వచ్చింది, కానీ దానిని కార్యరూపం ఇవ్వడానికి ఏమి చేయాలి ఎలా చేయాలి ఎలా మొదలుపెట్టాలి తెలియడం లేదు అనుకునే వారు అనేకం. కానీ పెద్ద పెద్ద సంస్థలు, వ్యాపారాలు నుంచి చిన్న చిన్న స్టార్ట్ అప్ ల వరకు  ఐడియాలను భిన్నమైన  సొంత పద్దతిలో ఆచరణలోకి తెస్తున్నారు. అయితే వాటిని నిశితంగా పరిశీలిస్తే మీ ఐడియా ను లాభదాయాక బిజినెస్ లా మార్చుకునే మార్గంలో ఉన్న కొన్ని ప్రాధమికాంశాలను నేర్చుకోవచ్చు. ఎలా ఉంది ఐడియా? నచ్చిందా...? అయితే రండి నేర్చుకుందాం.
* * * * * * * * * * * * * * * * * *
సోపానం 1: మీ ఐడియా తో ఏమి చేసారు? ఏమి చేస్తారు? గతంలో మీకు ఎన్ని సార్లు ఐడియాలు వచ్చాయి? సరదాగా మీరు ఈ చిన్న ఎక్సర్ సైజ్ చేయండి. ఒక పెన్ , పేపర్ తీసుకుని ఇప్పటివరకు మీకు గతం లో వచ్చిన మంచి ఐడియా అనుకున్న వాటిని ఎందుకు వ్యాపారంగా మార్చుకోలేదు కారణాలు రాయండి. ముందు ఈ లిస్టు రాసిన తర్వాత మళ్ళీ ఆర్టికల్ చదవండి. ఎందుకంటే ఐడియా నుంచి యాక్షన్ దిగాలనుకుంటున్నారు కదా? అందుకే యాక్టివిటీ చేయండి. 
(10 మినిట్స్ బ్రేక్.......) 
మీ లిస్టు రాసిన తర్వాత చదవండి.

ఇప్పుడు మీ లిస్టు చెక్ చేసుకోండి. ఈ క్రింది కారణాలు వంటివి రాసి ఉండొచ్చు.
  1. ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు
  2. నాకు అప్పట్లో సరైన సమయం లేదు
  3. కావలసిన్నత డబ్బు లేదు
  4. ఎవరు సపోర్ట్ చేయలేదు
  5. నాకు అంత వయస్సు, మెచ్యురిటీ , నాలెడ్జ్ లేదు
  6. ఫెయిల్ అవుతానేమో అని భయపడ్డాను
  7. నాకు బిజినెస్ ప్లాన్ రాయటం రాదు
  8. నాకు లోన్స్ ఇవ్వలేదు
  9. నా ఐడియా కి సపోర్ట్ ఇచ్చే ఫ్యామిలీ మెంబెర్స్, పార్టనర్స్, గైడెన్స్ లేదు
  10. నా వయస్సు చాలా ఎక్కువ
  11. నాకు ఇల్లంటివి వర్క్ ఔట్ అవ్వవు
  12. నాకు డబ్బు సంపాదించే యోగం లేదు
  13. నేను సరైన టైం కోసం వెయిట్ చేసాను, అవ్వలేదు
  14. నాకు అంత తెలివి తేటలు , స్కిల్ల్స్ (నైపుణ్యాలు) లేవు
  15. ఈ ఫీల్డ్ లో ఆల్రెడీ ఉన్న వారితో నేను పోటీ పడలేను
ఇలాంటి రెస్పాన్సెస్ మీరు కేవలం మీ ముందు కాళ్ళకు బంధాలు వేసే సొంత నమ్మకాలు (సెల్ఫ్ – లిమిటింగ్ బిలీఫ్స్). వాటిలో  మీకు బాగా తలపుకు వస్తున్న రెండింటిని తీసుకుని ఈ ప్రశ్నలు వేసుకోండి: “ఈ నమ్మకం నాకు ఎలా ఉపయోగపడుతుంది?, “ ఈ నమ్మకానిని కారణం ఏమిటి?” . ఆ విధంగా మీకు ఉపయోగపడనని నమ్మకాలను ప్రశ్నించి వాటి విలువను తెలుసుకుని వాటి స్థానంలో ఉన్నత నమ్మకాలను  ఏర్పరచుకోవటం ఐడియాని వ్యాపారంగా మార్చడంలో మొదటి మెట్టు. “ ఉన్నత నమ్మకం ఉన్నత వ్యాపారానికి మార్గం”.
ఇప్పుడు మీ ఐడియా  ఏమిటి? దానిని మీరు రాసుకున్నారా? అవును మీ ఐడియా కేవలం బుర్రలో ఉంచుకుంటే దాని మీద మీరు పనిచేయొచ్చు చేయకపోవచ్చు. మీ డైరీ/ జర్నల్ లో రాయండి, ఆ అంశం పై చర్చించి వివరాలు తెలుసుకోగల వారితో దాని గురించి చర్చించండి, గూగుల్ (కొందరికి గూగుల్ దేవత... J) ఎలాగూ ఉంది ఇంటర్నెట్ లో గూగుల్ లో దానిగురించి చదవండి.

సోపానం 2: మీ ఐడియా ఏ సమస్యను తీరుస్తుంది? : మీ ఐడియా ప్రజల (ఫ్యూచర్ కస్టమర్స్) అవసరాలను, సమస్యలను ఉన్నతంగా తీర్చగలిగే ఐడియానా?    ప్రపంచంలో ఏ బిజినెస్ అయినా నిశితంగా పరిశీలిస్తే వాటి పనులన్నీ కొన్ని సమస్యలను తీర్చడంలో, కొన్ని సేవలను ఇవ్వడంలోనో ఉంటాయి. ప్రజల అవసరాలను తీరుస్తూ , తక్కువ రిస్క్ తో ఎక్కువ వేగంగా మీరు ఆ పనిని అందరికంటే బాగా చేయగలిగారంటే గొప్ప వ్యాపారానికి నాంది పలికినట్లే అంటారు ఎంట్రప్రెన్యూర్ శిక్షణా నిపుణులు.

సోపానం 3: ఆ సమస్య / అవసరాలు ఉన్న వారు ఎవరు? ఎలా వారిని చేరుకోవాలి? మీకు కస్టమర్స్ ఎవరు? ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు. వారికి అనేక అలవాట్లు, అవసరాలు ఉన్నాయి. మీరు వారి అవసరాలను ఎలా తీరుస్తున్నారు? అందరు వాడే వస్తువు తయారు చేసాము అందరూ మా కస్టమర్సే అనుకోవద్దు. అలా అయితే అది ఒక్క రూపాయే రేటు ఉన్నా అందరు కొంటె మీకు 120 కోట్లు బిజినెస్ వస్తుంది. అందుకే ఏ వ్యక్తులు, సంస్థలకు మీ ప్రోడక్ట్/సర్వీస్ బాగా అవసరం వారిని మీరు ఏ విధంగా చేరుకుంటారు? అందుకు ఏమి ప్రయత్నాలు చేస్తారు? మీకు ఒక సూపర్ ఐడియా  ఉన్నా అది ప్రజల అవసరాలను తీర్చేలా ఉండాలి, వారికి అందుకోగలిగే విషయం గా ఉండాలి.

సోపానం 4:  మీ పార్టనర్ / టీం తయారు చేసుకోండి : మీ ఐడియా ని షేర్ చేసుకున్నప్పటి నుంచి మీకు మంచి చెడు సపోర్ట్ ఇచ్చిన వారు, మీ బిజినెస్ అవసరాలలో మీకు ఒక విష్యం పై పట్టు ఉంటె ఇంకో విషయం పై పట్టు ఉన్న వాళ్ళు, మీకు గైడెన్స్ ఇచ్చే వాళ్ళు, సక్సెస్ ఫెయిల్యూర్ లకు అతీతంగా మీతో నడిచే ఒక టీం లేదా పార్టనర్ షిప్ అభివృద్ధి చేసుకోండి. బిజినెస్ కి ఇతరులతో కలిసే చేయగలిగే లక్షణం, మంచి నెట్ వర్కింగ్ స్కిల్ల్స్  అవసరం. దానివలన వేర్వేరు అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించగలరు, ఆ అంశాలపై నాలెడ్జ్, స్కిల్ల్స్ పెంచుకోవచ్చు, ఒక టీం గా వెళ్ళినప్పుడు మీ బిజినెస్ సపోర్ట్ సిస్టం చుఇంచడం ద్వారా క్లైంట్ లను, ఫండింగ్ ఇచ్చే వారిని నమ్మకానని , మీ శక్తిని వివరించవచ్చు.

సోపానం 5: మీ ఐడియా డబ్బు ఎలా సంపాదిస్తుంది?: మంచి ఐడియా ఉంది, దాని వలన ఎలాంటి సమస్యలు తీర్చాలనుకుంటున్నారో ఆలోచించారు, ఆ వ్యక్తులు లేదా సంస్థలు ఎవరు, వారిని ఎలా చేరుకోవాలో తెలుసుకున్నారు. మరి ఐడియా డబ్బు సృష్టించ గలిగినదేనా? ఫైనాన్షియల్ లాభాలు లేనప్పుడు మీకు నచ్చిన ఒక వ్యాపకం మీద సమయం, శక్తి, డబ్బు పెట్టిన వారౌతారు. అందుకే ఈ రెవిన్యూ మోడల్ చాలా ముఖ్యం.  అందుకే మీ ప్రోడక్ట్ లేదా సర్వీస్ ఎలా స్టార్ట్ అయ్యింది? ఎలా తయారు చేస్తారు, ఎవరిని ఎలా మీట్ అవుతారు? ఎలా మార్కెట్ చేస్తారు? ఎలా కస్టమర్స్ ని కలుస్తారు? వారికి ఎన్ని రకాలుగా/ఒప్షన్స్ లో అందిస్తారు? ఏ రక మైన పేమెంట్ పద్దతులు ఇస్తారు ? ఇవాన్నీ అవ్వడానికి మీకు ఖర్చు ఎంత అవుద్ది? మీకు ఎవరెవరి సహాయం కావాలి? అందుకు ఫుల్ టైం లేదా పర్ట్ టైం ఎంత మంది వర్క్ చేస్తారు? ఇలా అన్ని ఖర్చులు, ఎంత ఆదాయం వస్తుంది? ఆదాయం  నుంచి ఖర్చులు తీయగా మీకు మిగిలేది ఎంత? సాదారణంగా ఆ బిజినెస్ లో ఎంత వస్తుందని గతంలో బిజినెస్ రిపోర్ట్ లు ఏమైనా చెప్తున్నాయా? తెలుసుకోండి. ఈ లెక్కలలో ఎక్కువమంది కొత్త వ్యాపారులు నంబర్లు ఎక్కువ వేసుకుని చాలా వస్తుందని అనుకుంటారు. ప్రాక్టికల్ గా అలా సాధ్యం కాకపోవచ్చు అప్పుడు రియాలిటీ నంబర్స్ అనుభవం ద్వారా ప్రాజెక్ట్ చేస్కుంటారు. ఫైనాన్షియల్ గా బాగుందనుకున్నాక మీరు ఇక మీ ఐడియా ని బయటికి తీసుకెళ్ళి వర్క్ చేయచ్చు. కొందరు టెస్టింగ్ కూడా చేసి వచ్చిన రెస్పాన్స్ ని బట్టి బిజినెస్ మోడల్ మార్చుకుంటారు. ఇది మీ వద్ద ఉన్న కాపిటల్ మనీ మీద , ఇతర వనరుల మీద ఆధారపడి ఉంటుంది.   

సోపానం 6: కాపిటల్ సమకూర్చుకోవాలి: ప్రజల అవసరాలను తీర్చాలనే సదుద్దేశంతో మొదలెట్టినా, డబ్బు కోసమే మొదలెట్టకపోయినా వ్యాపారాలు నిలబడాలంటే డబ్బు కొంత అయినా అవసరం. అభివృద్ధి చేసే ప్రక్రియలో కాపిటల్ (మనీ, హ్యూమన్ కాపిటల్) చాల ముఖ్యం. కాపిటల్ రావాలంటే కొన్ని దారులు ఏంటంటే ఇప్పటివరకు మిగిలిన డబ్బు, మీరు సేవింగ్స్ కోసం  దాచుకున్న డబ్బులు, పర్సనల్ లోన్స్, వ్యాపార నిమిత్తం ఇచ్చే లోన్ లు, కుటుంబ సభ్యులు/ స్నేహితులు/ బంధువులు , క్రెడిట్ కార్డు లు, బంగారం లేదా స్థలం/ ఇల్లు ద్వారా మొర్త్గాగే లోన్ . అయితే వీటిని ఉపయోగించుకునే ముందు మీరు ఉన్న స్థితి, మీ భవిష్యత్తు అవసరాలు, మీ ప్రస్తుత కుటుంబ అవసరాలు, మీ కనీస అవసరాలు దృష్టిలో ఉంచుకోవాలి. మీ అవసరాన్ని బట్టి వెంచర్ కాపిటలిస్ట్ లు, స్టార్ట్ అప్ ఫండింగ్ ఇచ్చే సంస్థలు, ఇన్వెస్టర్స్ ని కలవడం మీ వ్యాపారం గురించి వివరాలు చెప్పి మెప్పించి అబివృద్దికి ఫండ్ అడగటం మంచిది.    

సోపానం 7: మార్కెట్ పద్ధతి, కస్టమర్ పల్స్ తెలుసుకోండి: మీరు చేసే ప్రోడక్ట్ లేదా సేవలను ప్రజలకు రుచి చూపించేందుకు, మీరు ఎంత బాగా వారి సమస్యలను తీర్చగాలరో అర్థం చేసుకోడానికి.  తక్కువ మార్పులతో ప్రజల అవసరాలను బాగా తీరుస్తుందని మీరు నమ్మిన ఒక ప్రోడక్ట్ / సర్వీస్ తో మొదలు పెట్టండి. మార్కెట్ ఫీద్బచ్క్ తీసుకోండి. కస్టమర్ ఫీద్బచ్క్ తీసుకోండి, దానిని ఔట్లెట్ ద్వారా పంపుతుంటే లేదా డోర్ డెలివరీ చేస్తే ఈ ప్రక్రియలో ఉన్న ప్రతి వ్యక్తి నుంచి ఫీద్బచ్క్ తీసుకోండి. ఒక ఉన్నత ప్రోడక్ట్ , ఉన్నత మైన ఎక్స్పీరియన్స్  ప్రజలు మర్చిపోలేరు. ఈ రెండు ఇవ్వగలిగితే ఆ అవసరం వచ్చినప్పుడల్లా ఆ ప్రోడక్ట్ / సర్వీస్ గుర్తొస్తుంది. ఇప్పుడు మీరు తీసుకున్న  వేర్వేరు స్తాయిల ఫీడ్ బ్యాక్ దృష్టిలో ఉంచుకుని, అవసరాన్ని తగినట్లు మీ  ప్రోడక్ట్ లేదా డెలివరీ పద్ధతులు మార్పులు చేసుకోండి. ఆ విధంగా మీ ప్రోడక్ట్ సర్వీసెస్ ప్రజలకు చేర్చడం ద్వారా వచ్చే డబ్బు లెక్కలు ప్రతి నెలా రివ్యూ చేసుకోండి. లాభాలు ముఖ్యం. వ్యాపారమంటే  “లెక్క లేనితనం” పనికి రాదు. అందుకే ప్రతి పైసా ఖర్చు స్పష్టంగా ఎప్పటికప్పుడు రాయండి.
సోపానం 8:  పాజిటివ్ ఎనర్జీ తో ఉండండి: రిస్క్ తక్కువ ఉండే వ్యాపారం , మాంచి (మంచి కాదు) వ్యాపారం చెప్పండి సర్ అని కోచింగ్ లో , ట్రైనింగ్ లలో అడుగుతుంటారు. అలా రిస్క్ లేని వ్యాపారం అంటూ ఉండదు. మీకు ఏదైనా అలా ఒక వ్యాపారం రిస్క్ లేని దానిపిస్తే చేసి చుడండి కొన్నాళ్ళు (కనీసం పరిశీలన J ) మీకే తెలుస్తుంది. నిజానికి సొంత వ్యాపారం, స్టార్ట్ అప్ అంటేనే రిస్క్ తీసుకోడానికి రెడీ గా ఉన్నవాళ్ళకు సరిపోయే కెరీర్. అందుకే రిస్క్ ని ఎంజాయ్ చేయటం, నిబద్దత, ఫోకస్, మిమ్మల్ని మీరు ఉత్సాహంగా నడిపించుకోగలగటం వంటి పాజిటివ్ ఎనర్జీ  సొంత వ్యాపారానికి కనీస అర్హతలు.

ఈ ఎనిమిది సూత్రాలు పాటించండి మీ గొప్ప ఆలోచనలు అత్యంత గొప్ప వ్యాపారాలుగా మార్చుకోడానికి మొదటి మెట్టు ఎక్కండి. మీ విజయాలు మాతో పంచుకోండి.. 

Saturday, 4 July 2015

10 Strategies That Make You Wealthy

10 Strategies That Make You Wealthy 
========================
1. Money is a flow . Let is pass through your presence. Let it come and go.
2. Don't go for unnecessary luxuries. Learn the difference between the waste expenses vs big dream
3. Invest your savings
4. Never lend money for the activity that does not create wealth
5. If you don't care for money, it doesn't care for you. If you don't care for money, some times your own life may not take care of you
6. Money has no rest. Your attitude towards your productivity and money makes the difference in quality of life.
7. Being poor is only a state. You can always opt to change it.
8. Learn the wealth creation strategies. Understand those who create money leave clues to follow. Few careers or businesses seem short cut, but learn whether that matches with value system and whether that damages any one in this world, nature or universe at any area
9. Let your money take responsibility 
10. Dream big, make sure that your big dream does not waste your money just because you dreamed a luxury or facility.

These principles are published in my article to Psychology Today, a Telugu magazine (July 2015 edition)


సంపన్నులు కావడానికి పది సూత్రాలు 
=======================
డబ్బు... అందరికి ఇష్టమైన పదం. నిత్యం మనిషి కనీస అవసరాలను తీర్చేది డబ్బు. కాలం మారుతున్న కొద్దీ తన ప్రాధాన్యతను గట్టిగే చాటుతుంది. కేవలం రంగు కాగితాలు, అచ్చు బొమ్మల నాణేలు అని ఎవరు చూడరు. నాలుగు రాళ్ళు వెనక వేసుకోవాలని అనుకున్నా, ఇంకా ఎక్కువే వస్తే బాగుండు అనే అనుకుంటారు. ఎంత చెట్టుకి అంత గాలి అని వచ్చిన దాంతో ఆనందపడటం ఒక వంతు. నా అవసరాలకు , ఇష్టాలకు, జీవన విధానానికి కావలసిన డబ్బు కావాలనుకోవటం మరో విధానం. మరి కావలసినంత డబ్బు సంపాదించే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? వారిలా మీరు డబ్బు పట్ల ఉన్నత విధానాలు అవలంబిస్తున్నారా? మనీ మర్మం ఏమిటో తెలుసుకుందాం రండి.
* * * * * * * * * * * * * * * * * *
1. డబ్బు ఒక ప్రవాహం: నిజంగా డబ్బు సంపాదించాలి అనుకుంటే కేవం కూడా పెట్టాలి అనుకోకూడదు. మన తాతల కాలంలో వ్యవసాయం చేయగా, కూలి చేయగా వచ్చిన డబ్బు ఇంటి  పైన ఉండే చెక్క దూలంలో గూడు చేసి పెట్టేవాళ్ళు. కొందరు డబ్బుని సిమెంట్ గోడలో పెట్టి అవసరమైనప్పుడే కూల్చి తీసుకోండి అని చెప్పిన వాళ్ళు నాకు తెలుసు. కాని ఈ ఆధునిక ఆర్ధిక ప్రపంచంలో కేవలం డబ్బు కూడాపెడితే ఆర్థికంగా రాణించటం వీలవ్వడు. అది ఎటువంటే నిజంగా కారు కొనుక్కుని దుమ్ము పడుద్దని రోడ్ మీదకు తీసుకు రాకుండా అలమర బొమ్మలా చూసుకోవటం వంటిది. డబ్బు ఒక ప్రవాహం , ఆ ప్రవాహానికి ఆటంకం వేస్తే ఎక్కువ రాకుండా అపేసుకున్న  వారౌతారు.
2. ఆడంబరాలు కాదు ఆట ముఖ్యం: డబ్బు పట్ల ఉన్నత  ఆలోచన సంపాదన విధానాలు పాటించే వాళ్ళు ఎవరో కారులో ఎంజాయ్ చేస్తున్నారు అని, పక్క వాళ్ళు ఇల్లు కట్టారు అని, పొరుగు వారు/బంధువులు వారి పిల్లల్ని  పెద్ద కార్పొరేట్ స్కూల్స్ లో  చదివిస్తున్నారని అనవసర ఆడంబరాలకు పోయి డబ్బు ఖర్చు చేయరు. ఆవిధంగా “నాకు ఇంత ఉంది” అని చూపించడానికి కాదు , నా అవసరం ఇది , అందుకు నా ప్రయత్నం ఇది అని తమ గురించి తాము స్పష్టంగా ఉంటారు. కారు కొనడాని కంటే , కారు అవసరం ఉంది కొనడానికి చాలా వ్యత్యాసం ఉంది. అవసరం , ఇంకొంచం ఉన్నతంగా ఎదగడానికి రిస్క్ లో భాగంగా కొనడం ఆలోచనాత్మక ఆట. ఆడితే ఆలోచనతో ఆడండి జీవితం తో అయినా డబ్బుతో అయినా. ఇతరులతో అనవసర పోటీకి, ప్రేస్టిజ్ కోసం చేసే పనులు మనిషుల్ని సంపన్నులను చేయక పోకా అప్పుల తిప్పలు తెచ్చే ప్రమాదం ఉంది.
3. కేవలం దాచికోదానికే దాచుకోకండి : అవును. మీరు చదివింది కరక్టే. డబ్బు పట్ల నిబద్దత , సేవింగ్స్ పరమైన ఆలోచనలు ఉన్న వాళ్ళు కేవలం డబ్బుని దాచుకోదానికే పక్కకి తీసి వాటిని ఏమి చేయకుండా ఇంట్లో పెట్టుకోరు. డబ్బుని మరింత చేయడానికి కొన్ని ముఖ్యమైన పెట్టుబడులు పెడతారు. అంటే పెట్టుబడి పెట్టడానికి దాచుకుంటారు. డబ్బును అత్యవసర  పరిస్థితులలో కుడా తీయకుండా వాటిని కేవలం ఆలోచనాత్మక పెట్టుబడులలో, అవసరాలకు తగినట్లు నిబద్దతతో రికరింగ్ డిపాజిట్ లేదా ముచువల్ ఫండ్స్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) వంటి మార్గాలలో దాచుకుంటారు. దానివలన ప్రస్తుతం ఉండే రోజువారీ ఖర్చులకు, ఇత ర అవసరాలకు , అత్యవసరాలకు తప్పనిసరిగా పని చేస్తారు లేదా ఆదాయ మార్గాలకోసం అన్వేషిస్తారు.  
    
4. డబ్బు సంపాదించని పనికోసం అప్పు వద్దు : సంపద సృష్టించే వాళ్ళు పాటించే ఆర్ధిక సూత్రం ఏమిటంటే మీకు ఒక పని లేదా వస్తువు డబ్బుని సంపాదించలేదు అనుకుంటే దానికోసం అప్పు తీసుకోరు. ఆర్థికంగా బాగా ఉన్నవాళ్ళు కేవలం ఉన్న డబ్బుని ఇంకొంచం గొప్ప ఇన్వెస్ట్ మెంట్ తో  మరింత చేయడం కోసం మాత్రమే అప్పు తీసుకుంటారు. కార్ లోన్ తీసుకుంటే ఇంకా బిజినెస్ వస్తుంది అనుకుంటేనే అప్పుచేసి కారు కొంటారు. లేదంటే ఆదాయం రాక పోగా అప్పు మిగిలిపోతే ఉన్న డబ్బు కూడా మెల్లిగా మంచుముద్దలాగా కరిగిపోతుంది.
5. డబ్బు ఈర్ష్య పడే ప్రేమికురాలు: కోట్ల మందికి డబ్బు సంపాదించాలని ఉంటుంది కానీ కొద్ది మంది వద్ద మాత్రమే కోట్లు ఉంటాయి. డబ్బు సంపాదించడానికి, దానిని నిలబెట్టుకోడానికి అది మీ జీవితంలో ఒక ప్రధాన అంశంగా ఉండాలి. డబ్బు ఒక ఈర్ష్య పడే ప్రేమికురాలు వంటిది. దానిని  మీరు  పట్టించుకోకపోతే , అది మిమ్మల్ని పట్టించుకోదు...ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మిమ్మల్ని ఇంకా  దారుణమైన  పరిస్థితులలో వదిలేసి తనను పట్టించుకునే మరోకరిదగ్గరికి వెళ్లి పోతుంది. చేదుగా ఉండొచ్చు కాని ఇది వాస్తవం.    
6. డబ్బు కి నిద్ర లేదు: డబ్బు ఉన్న వ్యక్తులు చెప్పే ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే డబ్బుకు ఉదయం , రాత్రి, టైం లైన్స్ , షెడ్యూల్స తెలియవు. డబ్బు మంచి పని నియమాలు ఉన్న వారిని, విలువలతో కూడిన బిజినెస్ చేసే వారిని వరిస్తుంది. నా క్లైంట్స్ కొందరికి ఉద్యోగంలో కొన్ని సంవత్సరాల క్రితం పని 8 గంటలే పని ఉండేది. వాళ్ళ ఆఫీసులలో చాలా మంది మహా అయితే 9 గంటలు పని  చేసే వాళ్ళు. కొందరు క్లైంట్స్ 12 నుంచి 16 గంటలు పనిచేసారు. మంచి దృక్పథంతో సంస్థ ఎదుగుదలలో భాగమయ్యారు. ఒకే కంపనీలో వేర్వేరు స్థాయిలలో ప్రోమోషన్స్  , పెరిగిన ఆదాయం చూసారు. కొందరు కొత్త రంగంలో, ఇంకొందరు సొంత కంపెనీలు  పెట్టి రాణిస్తున్నారు. ఇదంతా కేవలం వారికి డబ్బు పట్ల , పని పట్ల ఉన్న దృక్పథంతో వీలైంది.   
7. పేదరికం ఒక పరిస్థితి మాత్రమే:   అమ్మ తాళి బొట్టు బ్యాంకు లో పెట్టి ఫీజులు కట్టి చదువుకి వచ్చిన వాళ్ళు, పక్కవాళ్ళు / స్నేహితులు నిద్రపోయినప్పుడు వారి వద్ద పుస్తకాలలో పాఠాలను రాసుకుని చదువుకున్న వాళ్ళు నాకు తెలుసు. ఆ స్థితి నుంచి సొంత ఇల్లు, కంపెనీ, వందల మందికి ఉద్యోగాలు ఇవ్వటము చేయగలిగిన స్థాయికి వాళ్ళు ఎదిగారు. పేదరికం ఒక స్థితి, ఆ స్థితిని మనమే మార్చుకోవాలి. అందుకు ఉన్నత ఆలోచనలు, చదువు, దృక్పథం,  సంపదను సృష్టించే మార్గాలు / వ్యాపారం  సమాజానికి మనకు ఉపయోగపడే ప్రోజెక్ట్ లు మీకు ఆయుధాలు. ఆధునిక ప్రపంచంలో గొప్ప మానవత్వాన్ని చాటుతున్న దార్శనికుడు బిల్ గేట్స్ అన్నట్లు  పేదవాడికి పుట్టటం మీ తప్పు కాదు కానీ పేదవాడిగా చనిపోవడం మీ తప్పే అని.  

8. సంపాదన విధానాలు నేర్చుకోండి : మనలో చాలా మంది సంపన్నులుగా పుట్టాక పోయి ఉండొచ్చు. గా మంది సంపన్నులు గొప్ప సంపద ఉన్న వాళ్ళు సైతం అది ఒక్క రోజులో నేర్చుకోలేదు. ఫ్యామిలీ బిజినెస్ ఉన్న వాళ్ళు కుడా ఆ బిజినెస్ ఎలా ముందుకు తీసుకెళ్లాలని అనే అంశాల మీద శిక్షణ తీసుకుంటారు, పర్సనల్ కోచ్ (వ్యక్తిగతంగా శిక్షణ ఇచ్చే కోచ్) సహాయం తీసుకుంటారు. మీరు ఆశించిన స్థాయిలో డబ్బు , సంపద సృష్టించిన వారి మాటలు వినండి, వారితో కలిసి వివరాలు పంచుకునే ప్రయత్నం చేయండి. నిజమైన సంపద సృష్టించిన వారు వారి విజయ పాఠాలను , అనుభవాలను పంచుకుంటారు. మనం ఎన్నో ఉన్నత విధానాలు నేర్చుకోవచ్చు. ఎందుకంటే కేవలం మన అనుభవంలో నుంచి మాత్రమే నేర్చుకోడానికి ఒక్క జీవితం సరిపోదు కదా.  

9. మీ డబ్బు బాధ్యత మోసేలా చుడండి : డబ్బు సంపాదించాల్సిన బాధ్యత మనది. కొంత సంపాదించాక డబ్బు పెట్టుబడుల రూపంలో మరింత చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక ఇల్లు కొంటె అది రెంట్ కి ఇవ్వొచ్చు, మీరు ఉండొచ్చు, మీరు అద్దె లేకుండా వ్యాపారం చేసుకోవచ్చు. ఇలా అనేక ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తే డబ్బు ద్వారా డబ్బు సృష్టించే ప్రయత్నాలు నేర్చుకోవచ్చు.    
10. పెద్ద సంఖ్యా- పెద్ద జీవితం – అద్భుత విజయాలు : చాలా మంది డబ్బు ఎంత కావాలంటే ప్రత్యేకంగా ఒక లెక్క చెప్పారు. ఎదో ఒక వస్తువు, ఫీజు, పెళ్లి ఇలా కొన్ని అవసరాలు చెప్తారు. నిజానికి మీ సంపన్నులు, డబ్బు ని సృష్టించే వారు వారి వ్యక్తిగత, కుటుంబపర మరియు సంస్థాగత అవసరాలను లాంగ్ టర్మ్ లో చూసి ఎంత డబ్బు సృష్టించాలో అంచనాకు వస్తారు. వారు చిన్న గా ఆలోచించరు.  ఉన్నతంగా, పెద్ద మొత్తంలో ప్రణాలికలు వేస్తారు.  10 వేల రూపాయల ఉద్యోగం కోసం తపించే వాడికి కోటి రూపాయలు సంపాదించాలని ఉందనుకోండి, “నీకు అంత సీన్ లేదమ్మా...ఎంత చెట్టుకి అంత గాలీ...దుప్పటి ఉన్న వరకు కాళ్ళు ముడ్చుకోవాలి ....” వంటి మాటలతో నిరుత్సాహ పరిచే సమాజం మనది. కానీ నువ్వు ఏమి చేసినా సమాజం తన కళ్ళజోడు లోంచి చూస్తుంది. నువ్వు ఏమి సంపాదిస్తావు అనేది నీ ఆలోచనా స్థాయి బట్టే ఉంటుంది. థింక్ బిగ్. అద్భుతంగా ఆలోచించండి. కోటి కాదు 100 కోట్లు సంపాదిన్చాలనుకోండి. నాకు తెలిసి పెద్దగా ఆలోచిస్తే పోయేదేమీలేదు., కాస్త ఆలోచనలో , ఇంకాస్త కృషి , పట్టుదల, ఓర్పు సహనం, మీదైతే సంపాదన  మీ పాదాల చెంత చేరుతుంది. 

Sunday, 26 April 2015

7 Day Meditation Challenge for World Peace : Humanity Beyond Nepal and Other War Tragedies

Why this challenge:
Science and technology is taking it's speed in innovating new ways of making life more comfortable. At the same time we are facing many challenges as we experiment with nature, mother earth and it's laws. We human beings are paying for this in the form of natural disasters. We can not do with what has happened, we have choice to adopt environment friendly life styles in harmony with life.

Whatever happened in Nepal, whatever anti-social/human activity happening around the world, whether man made or natural disaster, this is time for calling the natural action as humans. This is high time for self-introspection for humanity. These days majority of people are more conscious about "updating their life" rather than "live in it in actual sense"; spending more time with electronic gadgets not realizing basic human blessings of life. 

This is the time we need humanity in action. Let us restore life, make it more simple through conscious living in natural manner, let us pray for sufferings of fellow human beings, let us generate the vibration of love and peace into the field of possibility (Unified Field) through our meditations and prayers, any form that you can comfortably do. Every thought, every act that we generate in harmony with nature and life ripples out the more of it.

How can I do this challenge:
Join me for a meditation to restore the normal life at Nepal and other conflict areas of the world. I will start my meditation by 06.30 am everyday starting 28th April, 2015  and you are invited to join me.
1. Sit in comfortable position on chair or sofa. Close your eyes. Focus on your breathing. Let go of all thoughts.
2. Focus on the sentence below when you are meditating : "I choose love and peace. May the world live in peace and harmony". Tell this meditation centering thought to yourself silently. You need not to move your tongue, lips or visualize. Just focus on this centering thought and repeat silently.
3. Whenever you are distracted by thoughts or noises around you or sense of your body, just focus on the meditation statement. Keep this meditation for minimum of 14 minutes. Then keep your eyes closed, release the centering thought. Then relax your body for a while and slowly come back. Open your eyes gently and slowly. 
4. Just share your experience after meditation in the comments section. 

Please practice , call me for any support you may need. Let's together build a loving and peaceful society :)