10 Strategies That Make You Wealthy
1. Money is a flow . Let is pass through your presence. Let it come and go.
2. Don't go for unnecessary luxuries. Learn the difference between the waste expenses vs big dream
3. Invest your savings
4. Never lend money for the activity that does not create wealth
5. If you don't care for money, it doesn't care for you. If you don't care for money, some times your own life may not take care of you
6. Money has no rest. Your attitude towards your productivity and money makes the difference in quality of life.
7. Being poor is only a state. You can always opt to change it.
8. Learn the wealth creation strategies. Understand those who create money leave clues to follow. Few careers or businesses seem short cut, but learn whether that matches with value system and whether that damages any one in this world, nature or universe at any area
9. Let your money take responsibility
10. Dream big, make sure that your big dream does not waste your money just because you dreamed a luxury or facility.
These principles are published in my article to Psychology Today, a Telugu magazine (July 2015 edition)
సంపన్నులు కావడానికి పది సూత్రాలు
=======================
డబ్బు... అందరికి ఇష్టమైన పదం.
నిత్యం మనిషి కనీస అవసరాలను తీర్చేది డబ్బు. కాలం మారుతున్న కొద్దీ తన
ప్రాధాన్యతను గట్టిగే చాటుతుంది. కేవలం రంగు కాగితాలు, అచ్చు బొమ్మల నాణేలు అని
ఎవరు చూడరు. నాలుగు రాళ్ళు వెనక వేసుకోవాలని అనుకున్నా, ఇంకా ఎక్కువే వస్తే
బాగుండు అనే అనుకుంటారు. ఎంత చెట్టుకి అంత గాలి అని వచ్చిన దాంతో ఆనందపడటం ఒక
వంతు. నా అవసరాలకు , ఇష్టాలకు, జీవన విధానానికి కావలసిన డబ్బు కావాలనుకోవటం మరో
విధానం. మరి కావలసినంత డబ్బు సంపాదించే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? వారిలా
మీరు డబ్బు పట్ల ఉన్నత విధానాలు అవలంబిస్తున్నారా? మనీ మర్మం ఏమిటో తెలుసుకుందాం
రండి.
* * * *
* * * * * * * * * * * * * *
1. డబ్బు
ఒక ప్రవాహం: నిజంగా డబ్బు
సంపాదించాలి అనుకుంటే కేవం కూడా పెట్టాలి అనుకోకూడదు. మన తాతల కాలంలో వ్యవసాయం
చేయగా, కూలి చేయగా వచ్చిన డబ్బు ఇంటి పైన
ఉండే చెక్క దూలంలో గూడు చేసి పెట్టేవాళ్ళు. కొందరు డబ్బుని సిమెంట్ గోడలో పెట్టి
అవసరమైనప్పుడే కూల్చి తీసుకోండి అని చెప్పిన వాళ్ళు నాకు తెలుసు. కాని ఈ ఆధునిక
ఆర్ధిక ప్రపంచంలో కేవలం డబ్బు కూడాపెడితే ఆర్థికంగా రాణించటం వీలవ్వడు. అది
ఎటువంటే నిజంగా కారు కొనుక్కుని దుమ్ము పడుద్దని రోడ్ మీదకు తీసుకు రాకుండా అలమర
బొమ్మలా చూసుకోవటం వంటిది. డబ్బు ఒక ప్రవాహం , ఆ ప్రవాహానికి ఆటంకం వేస్తే ఎక్కువ
రాకుండా అపేసుకున్న వారౌతారు.
2. ఆడంబరాలు
కాదు ఆట ముఖ్యం: డబ్బు పట్ల ఉన్నత
ఆలోచన సంపాదన విధానాలు పాటించే వాళ్ళు ఎవరో
కారులో ఎంజాయ్ చేస్తున్నారు అని, పక్క వాళ్ళు ఇల్లు కట్టారు అని, పొరుగు వారు/బంధువులు
వారి పిల్లల్ని పెద్ద కార్పొరేట్ స్కూల్స్
లో చదివిస్తున్నారని అనవసర ఆడంబరాలకు పోయి
డబ్బు ఖర్చు చేయరు. ఆవిధంగా “నాకు ఇంత ఉంది” అని చూపించడానికి కాదు , నా అవసరం ఇది
, అందుకు నా ప్రయత్నం ఇది అని తమ గురించి తాము స్పష్టంగా ఉంటారు. కారు కొనడాని
కంటే , కారు అవసరం ఉంది కొనడానికి చాలా వ్యత్యాసం ఉంది. అవసరం , ఇంకొంచం ఉన్నతంగా
ఎదగడానికి రిస్క్ లో భాగంగా కొనడం ఆలోచనాత్మక ఆట. ఆడితే ఆలోచనతో ఆడండి జీవితం తో అయినా
డబ్బుతో అయినా. ఇతరులతో అనవసర పోటీకి, ప్రేస్టిజ్ కోసం చేసే పనులు మనిషుల్ని
సంపన్నులను చేయక పోకా అప్పుల తిప్పలు తెచ్చే ప్రమాదం ఉంది.
3. కేవలం
దాచికోదానికే దాచుకోకండి : అవును. మీరు చదివింది కరక్టే. డబ్బు పట్ల నిబద్దత ,
సేవింగ్స్ పరమైన ఆలోచనలు ఉన్న వాళ్ళు కేవలం డబ్బుని దాచుకోదానికే పక్కకి తీసి
వాటిని ఏమి చేయకుండా ఇంట్లో పెట్టుకోరు. డబ్బుని మరింత చేయడానికి కొన్ని ముఖ్యమైన
పెట్టుబడులు పెడతారు. అంటే పెట్టుబడి పెట్టడానికి దాచుకుంటారు. డబ్బును
అత్యవసర పరిస్థితులలో కుడా తీయకుండా
వాటిని కేవలం ఆలోచనాత్మక పెట్టుబడులలో, అవసరాలకు తగినట్లు నిబద్దతతో రికరింగ్
డిపాజిట్ లేదా ముచువల్ ఫండ్స్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) వంటి మార్గాలలో
దాచుకుంటారు. దానివలన ప్రస్తుతం ఉండే రోజువారీ ఖర్చులకు, ఇత ర అవసరాలకు ,
అత్యవసరాలకు తప్పనిసరిగా పని చేస్తారు లేదా ఆదాయ మార్గాలకోసం అన్వేషిస్తారు.
4. డబ్బు
సంపాదించని పనికోసం అప్పు వద్దు : సంపద సృష్టించే వాళ్ళు పాటించే ఆర్ధిక సూత్రం
ఏమిటంటే మీకు ఒక పని లేదా వస్తువు డబ్బుని సంపాదించలేదు అనుకుంటే దానికోసం అప్పు
తీసుకోరు. ఆర్థికంగా బాగా ఉన్నవాళ్ళు కేవలం ఉన్న డబ్బుని ఇంకొంచం గొప్ప ఇన్వెస్ట్
మెంట్ తో మరింత చేయడం కోసం మాత్రమే అప్పు
తీసుకుంటారు. కార్ లోన్ తీసుకుంటే ఇంకా బిజినెస్ వస్తుంది అనుకుంటేనే అప్పుచేసి
కారు కొంటారు. లేదంటే ఆదాయం రాక పోగా అప్పు మిగిలిపోతే ఉన్న డబ్బు కూడా మెల్లిగా
మంచుముద్దలాగా కరిగిపోతుంది.
5. డబ్బు
ఈర్ష్య పడే ప్రేమికురాలు: కోట్ల మందికి డబ్బు సంపాదించాలని ఉంటుంది కానీ
కొద్ది మంది వద్ద మాత్రమే కోట్లు ఉంటాయి. డబ్బు సంపాదించడానికి, దానిని
నిలబెట్టుకోడానికి అది మీ జీవితంలో ఒక ప్రధాన అంశంగా ఉండాలి. డబ్బు ఒక ఈర్ష్య పడే
ప్రేమికురాలు వంటిది. దానిని మీరు పట్టించుకోకపోతే , అది మిమ్మల్ని
పట్టించుకోదు...ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మిమ్మల్ని ఇంకా దారుణమైన
పరిస్థితులలో వదిలేసి తనను పట్టించుకునే మరోకరిదగ్గరికి వెళ్లి పోతుంది. చేదుగా
ఉండొచ్చు కాని ఇది వాస్తవం.
6. డబ్బు
కి నిద్ర లేదు: డబ్బు ఉన్న వ్యక్తులు చెప్పే ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే డబ్బుకు ఉదయం , రాత్రి,
టైం లైన్స్ , షెడ్యూల్స తెలియవు. డబ్బు మంచి పని నియమాలు ఉన్న వారిని, విలువలతో
కూడిన బిజినెస్ చేసే వారిని వరిస్తుంది. నా క్లైంట్స్ కొందరికి ఉద్యోగంలో కొన్ని
సంవత్సరాల క్రితం పని 8 గంటలే పని ఉండేది. వాళ్ళ ఆఫీసులలో చాలా మంది మహా అయితే 9
గంటలు పని చేసే వాళ్ళు. కొందరు క్లైంట్స్
12 నుంచి 16 గంటలు పనిచేసారు. మంచి దృక్పథంతో సంస్థ ఎదుగుదలలో
భాగమయ్యారు. ఒకే కంపనీలో వేర్వేరు స్థాయిలలో ప్రోమోషన్స్ , పెరిగిన ఆదాయం చూసారు. కొందరు కొత్త రంగంలో,
ఇంకొందరు సొంత కంపెనీలు పెట్టి
రాణిస్తున్నారు. ఇదంతా కేవలం వారికి డబ్బు పట్ల , పని పట్ల ఉన్న దృక్పథంతో
వీలైంది.
7. పేదరికం
ఒక పరిస్థితి మాత్రమే: అమ్మ తాళి బొట్టు బ్యాంకు లో పెట్టి ఫీజులు కట్టి
చదువుకి వచ్చిన వాళ్ళు, పక్కవాళ్ళు / స్నేహితులు నిద్రపోయినప్పుడు వారి వద్ద
పుస్తకాలలో పాఠాలను రాసుకుని చదువుకున్న వాళ్ళు నాకు తెలుసు. ఆ స్థితి నుంచి సొంత
ఇల్లు, కంపెనీ, వందల మందికి ఉద్యోగాలు ఇవ్వటము చేయగలిగిన స్థాయికి వాళ్ళు ఎదిగారు.
పేదరికం ఒక స్థితి, ఆ స్థితిని మనమే మార్చుకోవాలి. అందుకు ఉన్నత ఆలోచనలు, చదువు,
దృక్పథం, సంపదను సృష్టించే మార్గాలు /
వ్యాపారం సమాజానికి మనకు ఉపయోగపడే
ప్రోజెక్ట్ లు మీకు ఆయుధాలు. ఆధునిక ప్రపంచంలో గొప్ప మానవత్వాన్ని చాటుతున్న
దార్శనికుడు బిల్ గేట్స్ అన్నట్లు
పేదవాడికి పుట్టటం మీ తప్పు కాదు కానీ పేదవాడిగా చనిపోవడం మీ తప్పే అని.
8. సంపాదన
విధానాలు నేర్చుకోండి : మనలో చాలా మంది సంపన్నులుగా పుట్టాక పోయి ఉండొచ్చు.
గా మంది సంపన్నులు గొప్ప సంపద ఉన్న వాళ్ళు సైతం
అది ఒక్క రోజులో నేర్చుకోలేదు. ఫ్యామిలీ బిజినెస్ ఉన్న వాళ్ళు కుడా ఆ బిజినెస్ ఎలా
ముందుకు తీసుకెళ్లాలని అనే అంశాల మీద శిక్షణ తీసుకుంటారు, పర్సనల్ కోచ్
(వ్యక్తిగతంగా శిక్షణ ఇచ్చే కోచ్) సహాయం తీసుకుంటారు. మీరు ఆశించిన స్థాయిలో డబ్బు
, సంపద సృష్టించిన వారి మాటలు వినండి, వారితో కలిసి వివరాలు పంచుకునే ప్రయత్నం
చేయండి. నిజమైన సంపద సృష్టించిన వారు వారి విజయ పాఠాలను , అనుభవాలను పంచుకుంటారు.
మనం ఎన్నో ఉన్నత విధానాలు నేర్చుకోవచ్చు. ఎందుకంటే కేవలం మన అనుభవంలో నుంచి
మాత్రమే నేర్చుకోడానికి ఒక్క జీవితం సరిపోదు కదా.
9. మీ
డబ్బు బాధ్యత మోసేలా చుడండి : డబ్బు సంపాదించాల్సిన బాధ్యత
మనది. కొంత సంపాదించాక డబ్బు పెట్టుబడుల రూపంలో మరింత చేసుకునే ప్రయత్నం చేయండి.
ఒక ఇల్లు కొంటె అది రెంట్ కి ఇవ్వొచ్చు, మీరు ఉండొచ్చు, మీరు అద్దె లేకుండా
వ్యాపారం చేసుకోవచ్చు. ఇలా అనేక ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తే డబ్బు ద్వారా డబ్బు
సృష్టించే ప్రయత్నాలు నేర్చుకోవచ్చు.
10. పెద్ద
సంఖ్యా- పెద్ద జీవితం – అద్భుత విజయాలు : చాలా మంది డబ్బు ఎంత కావాలంటే
ప్రత్యేకంగా ఒక లెక్క చెప్పారు. ఎదో ఒక వస్తువు, ఫీజు, పెళ్లి ఇలా కొన్ని అవసరాలు
చెప్తారు. నిజానికి మీ సంపన్నులు, డబ్బు ని సృష్టించే వారు వారి వ్యక్తిగత,
కుటుంబపర మరియు సంస్థాగత అవసరాలను లాంగ్ టర్మ్ లో చూసి ఎంత డబ్బు సృష్టించాలో
అంచనాకు వస్తారు. వారు చిన్న గా ఆలోచించరు.
ఉన్నతంగా, పెద్ద మొత్తంలో ప్రణాలికలు వేస్తారు. 10 వేల రూపాయల
ఉద్యోగం కోసం తపించే వాడికి కోటి రూపాయలు సంపాదించాలని ఉందనుకోండి, “నీకు అంత సీన్
లేదమ్మా...ఎంత చెట్టుకి అంత గాలీ...దుప్పటి ఉన్న వరకు కాళ్ళు ముడ్చుకోవాలి ....”
వంటి మాటలతో నిరుత్సాహ పరిచే సమాజం మనది. కానీ నువ్వు ఏమి చేసినా సమాజం తన
కళ్ళజోడు లోంచి చూస్తుంది. నువ్వు ఏమి సంపాదిస్తావు అనేది నీ ఆలోచనా స్థాయి బట్టే
ఉంటుంది. థింక్ బిగ్. అద్భుతంగా ఆలోచించండి. కోటి కాదు 100 కోట్లు
సంపాదిన్చాలనుకోండి. నాకు తెలిసి పెద్దగా ఆలోచిస్తే పోయేదేమీలేదు., కాస్త ఆలోచనలో
, ఇంకాస్త కృషి , పట్టుదల, ఓర్పు సహనం, మీదైతే సంపాదన మీ పాదాల చెంత చేరుతుంది.
No comments:
Post a Comment