Monday, 26 October 2015

6 Characteristics of Winning Entrepreneur (ఆ ఆరు ఎంట్రప్రెన్యూ ర్ లక్షణాలు మీలో ఉన్నాయా?)


Do you have the  sic characteristics of a winning entrepreneur? Here is the list.

1. Ability to focus irrespective of ambiguity and uncertain conditions
2. Personal discipline
3. Physical health
4. Doing the activities that you love
5. People skills 
6. Be different, think different, act different

కూటికోసం కోటి మార్గాలు అన్నట్లు బ్రతకడానికి బోలెడు మార్గాలు. ఉద్యోగం, తల్లిదండ్రుల ద్వారా వచ్చిన కుల వృత్తి, వ్యాపారం ఇవి ఒకప్పటి మార్గాలు. మరి ఇప్పుడు స్పీడ్ యుగంలో యువతలో, వ్యాపారాలలో ఒకటేమిటి ప్రపంచం మొత్తంలో ఆలోచన విధానాలు, పదాలు మారిపోయాయి. “నేను ఈ ఉద్యోగంలో ఇలా ఎన్నాళ్ళు?”, “ఈ వ్యాపారం నాకు ఎన్నాళ్ళు?”, “అసలు నాకు వచ్చినన్ని బిజినెస్ ఆలోచనలలో ఒక్కటి క్లిక్ అయినా చాలు లైఫ్ సెటిల్”.... ఇలా ఏ ఆలోచన వచ్చినా అది మీ ఎంట్రప్రన్యూర్ లక్షణాన్ని తెలియజేస్తుంది. మరి మీలో నిజమైన ఎంట్రప్రన్యూర్ ని ఎలా తెలుసుకోవాలి, ఆ లక్షణాలు శాస్త్రీయంగా మీతో చర్చించడానికే ఈ  ఆర్టికల్.
* * * * * * * * * * * * * * * * * *
1: సందిగ్ధంలో ఫోకస్ గా పనిచే లక్షణం: ఎంట్రప్రన్యూర్/ బిజినెస్ మాన్  కావాలని కలలు కనే వారికీ, అసలైన ఎంట్రప్రన్యూర్ కి  మధ్య ఉన్న ముఖ్యమైన తేడా ఏంటంటే ఉన్న జాబు,పని  చేసుకుంటూ గడపడం, రిస్క్ తీసుకొని ఆశించిన జీవితం / బిజినెస్ వైపు అడుగులు ముందుకు వేయడం. అంటే స్పష్టత లేకపోయినా మీ ప్రోడక్ట్ లేదా సర్వీసెస్ ద్వారా ప్రజలకి అవసరాలను తీరుస్తూ మీ మార్గంలో ముందుకు వెళ్ళగలను అనే నమ్మకం తో కూడిన అడుగు వేయగల దృక్పథం చాలా ముఖ్యం. ఏ ఇబ్బంది లేని బిజినెస్ బెటర్ అనుకునే వారు అసలు బిజినెస్ లో ఉండకపోవటం మంచిది. కాస్త చేదుగా ఉన్నా ఇది నిజం. అందుకే స్పష్టత లేకపోవడం, పూర్తి సమాచారం ఎదుగుదల, గైడెన్స్ లేకపోవటం, ఎండ్ ప్రోడక్ట్ ఏమౌతుందో , కస్టమర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే సందిగ్దం లో కూడా అడుగులు ముందుకు వేయగలిగే స్థిత ప్రజ్ఞత అవసరం. ఒక షెడ్యుల్ పెట్టుకుని నేను ఈ టైం లో నే పని చేస్తాను, ఈ పద్దతిలో ఉన్న వాళ్ళే కావాలి అని చట్రాలు పెట్టుకుని కూర్చుంటే స్టార్ట్-అప్ , బిజినెస్ లు స్థాపించడం కష్టం. సందిగ్థంలో కూడా అనుకున్నది సాధించగలను అనే నమ్మకంతో పనిచేసే లక్షణం మీలో ఉందా?

2:  వ్యక్తి గత క్రమశిక్షణ: ఎంట్రప్రన్యూర్ అంటే సొంత వ్యాపారం, సంస్థ సృష్టించడం. ఇది సెల్ఫ్ – మేనేజ్ మెంట్ తో మాత్రమే వీలౌతుంది. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా ఈ స్థితికి మీరే కారణం. ఎంట్రప్రన్యూర్ గా ఎదగాలంటే మీ జీవితానికి 100% బాధ్యత మీరు తీసుకోగలగాలి. వినియోగదారులు నువ్వు ఒక్కడివే ఎన్నో రకాల పనులు చేస్తున్నావని, సరిగా తినకుండా రాత్రి కుడా పని చేసావని చూడరు. మీరు ప్రామిస్ చేసిన సర్వీస్ / ప్రోడక్ట్ అనుకున్నట్లు అందిందా లేదా అని చేస్తారు. వ్యాపార కమ్యూనికేషన్ కుడా ఉన్నతంగా ఉండాలి. ఎదుటి వాళ్ళది తప్పు అయినంత మాత్రాన మన ఇష్టం వచ్చినట్టు రెస్పాండ్  అయ్యే రోజులు పోయాయి. కాబట్టి  మీ తప్పులకు ఇంకొంత నేర్చుకుని మరో సారి పునరావృతం కాకుండా నిత్య విద్యార్ది గా ఉండడం ఎంట్రప్రన్యూర్ లక్షణం. ఇది వ్యక్తి గత బాధ్యత , క్రమశిక్షణ నుంచి వస్తుంది, అది మేలో ఉందా?
3:  శారీరక ఆరోగ్యం:  అవును. మీరు చదువుతున్నది కర్రెక్టే. శారీరక ఆరోగ్యం ఎంట్రప్రన్యూర్ జీవితాన్ని ఇంకా ఎక్కువ ప్రభావితం చేస్తుంది. మీ ప్రొడక్టివిటీ మీ ఆరోగ్యం పై ఆధారపడి ఉంటుంది. ఉద్యోగంలో లాగా సొంత వ్యాపారంలో సిక్ లీవులు పెట్టుకోడానికి వీలవదు. తేడావస్తే సమయానికి పనులు పూర్తి చేయలేకపోతే  కస్టమర్ నొచ్చుకుని  ఇక రెండో సారి మనకు వర్క్ / సర్వీస్ రిక్వెస్ట్ ఇవ్వకపోవచ్చు. అందుకే సరైన ఆహారం, రెస్ట్, ఎక్సర్ సైజ్ తో మిమ్మల్ని మీరు శారీరకంగా, పుస్తకాలు, ట్రైనింగ్ లతో మానసికంగా ఆరోగ్యంగా ఉంచుకోగాలగాలి. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఎన్ని గంటలు ఆక్టివ్ గా పనిచేస్తున్నారు? మీ వర్క్, ఇల్లు , ఫ్యామిలీ టైం అన్ని బాలన్స్ చేయగలుగు తున్నారా?

4:  ప్రేమించే పనిని చేయటం:  ఎంట్రప్రన్యూర్ గా చేసే పని మీకు చాలా ఆనందాన్ని , సంతృప్తిని, ఉత్సాహాన్ని ఇచ్చేది అయ్యి ఉండాలి. వేరే వాళ్ళు లాగా డబ్బులు సంపాదిన్చాలనో, సోషల్ స్టేటస్ కోసమో స్టార్ట్-అప్ లు, బిజినెస్ లు పెట్టి అనవసరంగా ఇందులోకి దిగి ఉన్న డబ్బు వేస్ట్ చేసాను అనే వాళ్ళు, ఎవారినో నమ్మి నేను ఈ ఫ్రాన్చిసీ తీసుకున్నాను అనో, డిస్ట్రిబ్యూటర్ ని నమ్మి ప్రోడక్ట్ తయారి చేసాను ఇప్పుడు వాళ్ళు చేతులెత్తేశారు సరుకు ఎలా అమ్మాలి అని ...ఇలా ఎన్నో రకాలుగా నా వద్దకు క్లైంట్స్ వచ్చారు. మనం ప్రేమించే పని అయితే ఇలాంటి సమస్యలను చాలా వరకు నిరోధించోచ్చు. మీ మొదటి వంద కష్టమర్లను మీరే తెచ్చుకునే వరకు బిజినెస్ చేసే ఓపిక మీకు ఉండాలి. ఎక్కువ పని గంటలు సాధారణం అయిపోతుంది అందుకు రెడీ అయి ఉండాలి. ప్రేమించే పని అయితే కావలసిన ఇతర నైపుణ్యాలు, అర్హతలు సాధించుకోడానికి ఇంకా కష్ట పడగలరు , లేదా ఆ స్కిల్ల్స్ ఉన్న వాళ్ళను కో- ఫౌండర్ గా, పార్టనర్ గా పెట్టుకుని ముందుకి వెళ్ళగలరు. మీరు మీ ఐడియా / బిజినెస్ ని ప్రేమతోనే చేస్తున్నరా?  ఎలా ఉంటుందో చూద్దామని రాయి విసురుతున్నారా? ఎంట్రప్రన్యూర్ గా ఎదగాలంటే ప్లాన్-B (ప్రత్యామ్నాయం) పెట్టుకోవటం అనవసరం. రాళ్ళు వేయటం ఆపి పని మొదలు పెట్టటం అవసరం. మీ బిజినెస్ ఎన్ని ఒత్తిళ్లకు లోనైనా కస్టమర్ అవసరాలకు తీర్చేలా మిమ్మల్ని మీ ప్రోడక్ట్ / సర్వీస్ తీర్చి దిద్దుకుంటూ పనిచేయగలరా?  
5:  మనుషులతో కలిసి మెలిసి పనిచేయగాలిగే నైపుణ్యం :  ఎంట్రప్రన్యూర్ గా ఉండటం అంటే బిజినెస్ మాన్ సినిమా లో హీరో లా వన్ ఆర్మీ లా ఉండటం కాదు. మీ ఐడియా దశ నుంచి లాభాల్లో వ్యాపారాన్ని నిర్మెంచేవరకు అనేక రకాల వ్యక్తులతో ముందుకు వెళ్ళగలగటం, మీ ఆలోచనలకు , విజన్ కు తగిన వారిని, మీకు లేని స్కిల్ల్స్ ఉన్న వారిని కో- ఫౌండర్/ పార్టనర్ వెతకటం స్టార్ట్-అప్/ బిజినెస్  క్లైంట్ లతో మాట్లాడటం, మెంటార్ , ట్రైనర్ లను కలిసి మీ అవసరాలను చర్చించడం, మీ సర్వీస్ / ప్రోడక్ట్ గురించి ఫండ్ ఇచ్చే వారికి, మార్కెటింగ్ వారికి, కస్టమర్స్ కి చెప్పటం....ఇలా ప్రతి స్టెప్ లోను మనుషులతో కలిసిపోగలగాలి, మాట్లాడటమే కాదు, మనసులను అర్ధం చేసుకుని బిహేవ్ చేయగలగాలి, మిమ్మల్ని చూస్తే ఆ ప్రోడక్ట్ గుర్తొచ్చేలా ఒక బ్రాండ్ / గుర్తింపు ఉండేలా మీ కమ్యూనికేషన్ ఉండాలి. ఆ లక్షణాలు మీలో ఉన్నాయా? ఎందుకంటే ఎంట్రప్రన్యూర్ గా ఉండటం అంటే ఎదో ఒక రోజు ఇతర వ్యక్తుల ఆలోచనలు, విజ్ఞానం, సమర్ధత, అనుభవం మీదా ఆధారపడాల్సి రావచ్చు. అందుకు మంచి పీపుల్ స్కిల్ల్స్ ఉంటె ఉనంతంగా కంపెనీ నిర్మించుకోవచ్చు.

6:  మీరు కాస్త భిన్నంగా ఉంటారు:  అందరూ ఇబ్బందులు చుసే వద్ద మీరు అవకాశాలు చూస్తున్నారా? ఎవరు మొదలు పెట్టని వద్ద మీరే అంతా ఐ ముందుకు నడిపించాలను కుంటున్నారా? ఏదైనా సరే చేస్తా అని గట్టిగా చెప్తున్నప్పటికీ ఏమి ఔతుందో లేదో అని ఆలోచిస్తున్నారా? అది లేదు, ఇది లేదు అని కారణాలు చెప్పకుండా ఉన్నదానితో ది బెస్ట్ గా ఏమి చేయగలమని అలోచిస్తున్న్నారా? అందరు చేసిన పనే అని కాకుండా రిస్క్ లని లెక్క చేయకుండా భిన్నంగా అలోచించి , భిన్నంగా పని చేయాలనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం వెళ్ళే దారి అని కాకుండా వారి ఆలోచనలనే ఛాలెంజ్ చేయాలనుకుంటున్నారా? ....వీటిలో ఒక్క ప్రశ్నకు మీరు “ఎస్” అని చెప్పినా ఇంచుమించు మీలో ఒక ఎంట్రప్రన్యూర్/ ఫౌండర్/ బిజినెస్ మాన్ ఉన్నట్లే . మీరు భయపడరు, ఒక చోట తిన్నగా ఉండరు, ఎదో చేయాలన్న ఆలోచన మిమ్మల్ని తొలిచివేస్తుంది, ఎదో సృష్టించాలన్న కసి మిమ్మల్ని అనుక్షణం దహించి వేస్తుంది , ఆ ఫైర్ కి కావలసిన గైడెన్స్ / మెంటార్ దొరికితే మీరే ఓ స్టీవ్ జాబ్స్ , ఓ నారాయణ మూర్తి, ఓ అజీం ప్రేమ్ జీ ...____________(మీ పేరు రాసుకోండి) కావచ్చు.

ఈ ఆరు లక్షణాలు మీలో ఎంట్రప్రన్యూర్  ఇప్పటికే అప్పుడప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటాడు - ఎప్పుడు నీ ఆశయాల వైపు వేగంగా , ఖచ్చితంగా అడుగులు వేసేదని?. ఈ అంశాలు సామాన్యులని బిజినెస్ మాస్టర్స్ గా మర్చేవి, ఎందరినో గొప్ప వ్యాపార సామ్రాజ్యాలను సృష్టించేలా చేసిన అంశాలు. ఇవి మీలో ఎంత మేరకు ఉన్నాయో స్వయం విశ్లేషణ చేసుకుని బిజినెస్ దిశలో అడుగులు వేయండి.

No comments:

Post a Comment