Thursday 28 June 2018

ఈ 6 రకాల ఎంట్ర ప్రెన్యూర్ షిప్ లలో మీది ఏది? 6 Types of Entrepreneurial Ventures - What's your preference?



6 Types of Entrepreneurial Ventures - What's your preference?
1. Investor Backup Ventures
2. Life style Businesses
3. Traditional Businesses
4. Buying an existing company
5. Social Ventures / Impact Ventures
6. Corporate Intrapreneurship 

తీవ్రమైన అనిశ్చితి పరిస్థితులు ఉన్నా ప్రజలకు ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ అందించే  వ్యక్తులే ఎంట్ర ప్రెన్యూర్స్. అలాంటి  వారు ప్రారంభించినవే అంకుర సంస్థలు (స్టార్ట్ – అప్స్). అయితే ఎంట్రప్రెన్యూర్షిప్ అంటే సింగల్ నిర్వచనం ఇవ్వటం కష్టమే, అది ఎంట్ర ప్రెన్యూర్ వ్యక్తిగతంగా ఇచ్చుకునే నిర్వచనంపై ఆధారపడి ఉంటుంది. అయితే సాధారణంగా అసలు ఎన్ని రకాల ఎంటర్ ప్రైజ్ లు ఉంటాయి అందులో మీకు ఏ విధానం సరిపడుతుంది అనే అంశాలు తెలపడానికే ఈ ఆర్టికల్.
***    ***    ***    ***    ***    ***
మీకు మంచి ఐడియా వచ్చింది, స్టార్ట్-అప్ మొదలు పెట్టారు, ఇన్వెస్టర్ కూడా దొరికారు, టీమ్ ని రిక్రూట్ చేసుకున్నారు ప్రోడక్ట్ లాంచ్ చేసారు. వినడానికి చాలా సింపుల్ గా ఉంది కదా. కానీ వెంచర్  స్టార్ట్ చేయకముందే అసలు ఎంటర్ ప్రైజ్ లు ఎన్ని రకాలు ఉన్నాయి, మొదలెట్టే వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అందులో మీకు బాగా సరిపోయే కేటగిరి ఏమిటి అని తెలుసుకుంటే మంచిది. ఎంటర్ ప్రైజెస్ ను  ఎన్నో కేటగిరీలుగా చెప్పినా ఈ క్రింది ఆరు రకాలు సింపుల్ గా మీకు అనేక రకాల వెంచర్స్ ను అర్థం చేసుకోడానికి ఉపయోగపడుతాయి.   
1.   ఇన్వెస్టర్స్  బ్యాకప్ తో వెంచర్   

ఈ కంపెనీ పెట్టే ముందే వారి ఐడియా మీద గట్టినమ్మకంతో మొదలు పెడతారు , ఇది ప్రపంచంలో ఒక బెస్ట్ అవకాశం గా ఉంటుంది అని. ఇవి ఫౌండర్స్ , ఇన్వెస్టర్స్ కి బాగా సంపదను సృష్టించే  హై గ్రోత్ ఎంటర్ ప్రైజెస్. సాధారణంగా మొదలుపెట్టినప్పుడు చిన్నగా ఉండి వేగంగా, ఎక్కువ విస్తరణ చేయగలిగేలా (స్కేల్ అప్), అధునాతన టెక్నాలజీ తో ముందుకు తీసుకెళతారు. వేగంగా ఎదిగే అవకాశం ఉన్న ఇటువంటి స్టార్ట్-అప్స్ న్యూ యార్క్, షాంఘై, సిలికాన్ వ్యాలీ, బెంగళూర్ నుంచి మన తెలుగురాష్ట్రాల్లో టీ-హబ్ వంటి చోట కూడా మొదలయ్యాయి. ఇది సుభ శూచకం. వీటికి ఏంజెల్ ఇన్వెస్టర్స్, వెంచర్ కాపిటలిస్ట్స్ సపోర్ట్ ఉంటుంది, రాపిడ్ గ్రోత్ ను  ఆశిస్తారు. ఇన్వెస్టర్స్ డబ్బు పెడతారు కాబట్టి వారికి తిరిగి చెల్లించడానికి ఒక ఎగ్జిట్ స్ట్రాటజీ కూడా ముందే పెట్టుకుంటారు.
ఈ వెంచర్స్ లో వ్యక్తిగత జీవితం సెకండరీ అవుతుంది. “ఖచ్చితంగా ఎదగాలి” అనే లక్షణం డామినేట్ చేయడంతో పర్సనల్ టైం ఉండకపోవచ్చు, పని ఒత్తిడి, ఫ్యామిలీతో సమయం కేటాయించలేకపోవడం వంటి పరిస్థితులు ఉంటాయి. వెంచర్ మొత్తం గ్రోత్ చూసుకోవడం, సిస్టం ఆటోమేట్, నిరంతరం ఎదగడానికి ఒక మోడల్ చేయడం ఛాలెంజ్ అవుతుంది. ఊబర్, ఫేస్ బుక్, ట్విట్టర్, అమెజాన్, ఈబే సంస్థలు ఈ కేటగిరి కిందికే వస్తాయి.
2.      లైఫ్ స్టైల్ బిజినెస్

మీకు కావలసిన జీవన విధానం (లైఫ్ స్టైల్) మీ బిజినెస్ ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది.  దానిని బేస్ చేసుకునే మీరు ఎలాంటి వెంచర్ చేయాలో నిర్ణయించుకుంటారు.ఈ తరహా వెంచర్ మొదలుపెట్టేముందు ఫౌండర్స్ కి వారు ఎంత సంపాదన ఆశిస్తున్నారు, కొన్నాళ్ళ తర్వాత ఏమి చేయాలి అనేది ముందుగానే ఒక ఆలోచన ఉంటుంది. వెంచర్ కాపిటలిస్ట్ ల వంటి వారినుంచి దాదాపు ఫండింగ్ ఆశించరు , సొంత డబ్బు , ఫ్రెండ్స్ , లోన్స్ మీద ఆధారపడే వెంచర్ మొదలు పెడతారు. ఈవెంట్ మేనేజ్ మెంట్, కస్టమర్ అవసరాలకు తగిన సైకిల్స్ తయారు చేయడం, మెడికల్ అవసరాలకు తగిన షూస్ చేయడం, యాన్టిక్ ఆర్ట్ పీస్ అమ్మటం మొదలైనవి ఈ కేటగిరి లోకే వస్తాయి. పెట్టుబడి, రోజు వారీ ఖర్చులు, అనుకున్న లైఫ్ స్టైల్ కావలసిన డబ్బు, భవిష్యత్తు అవసరాలకు డబ్బు వచ్చే వరకు కంపెనీ ఎదుగుదల కోసం  ప్రయత్నిస్తారు. బాగా వేగంగా  విస్తరణా మార్గాల ప్రయత్నం జరగదు. ఫార్మల్ గా  ఎగ్జిట్ ప్రణాళికలు ఏమి ఉండవు. బిజినెస్ లో కోరుకున్న ఫలితాలు, డబ్బు,  లైఫ్ స్టైల్ అలాగే కొనసాగించడానికి వెంచర్ కొనసాగిస్తారు.  తాము కోరుకున్న లైఫ్ స్టైల్ ప్రాధాన్యంగా ఎంచుకున్న మార్గం కాబట్టి వ్యక్తిగత, కుటుంబ జీవితానికి సమయం కేటాయిస్తారు.

3.      సాంప్రదాయ విధానంలో ఉండే నిలకడ వ్యాపారం


ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కువ ఎంట్ర ప్రెన్యూర్శిప్ లో ఎక్కవ భాగం ఈ కేతగిరిలోదే. ఒక షాప్ , వ్యాపారం ద్వారా ప్రతినెల నిలకడగా కొంత డబ్బు వచ్చేలా ఒక వెంచర్ మొదలు పెడతారు. నడిపినంతకాలం రోజువారీ అదే బిజినెస్ , అదే కాష్ ఫ్లో , నిరంతరం వారే కస్టమర్స్ ఉండే వెంచర్. ఆర్గానిక్ ఎదుగుదల ఉంటుంది. ఒక షొప్ పెట్టి దానిలో లాభాలు వచ్చేలా ఎదిగేందుకు ఫౌండర్స్ ప్రయత్నిస్తారు. కిరాణా షాప్స్, స్ట్రీట్ ఫుడ్ అందించే వెంచర్స్, ట్రావెల్ ఏజెంట్, సెలూన్ ఇలా రోజు వారీ అవసరాలను తీర్చే చిన్న వ్యాపారాలు ఈ కేటగిరి లోకే వస్తాయి.   ఇందులో కుడా సొంత డబ్బు లేదా ఫ్రెండ్స్, బ్యాంకు వద్ద లోన్ తీసుకుంటారు కానీ ఫార్మల్ ఇన్వెస్టర్స్ ఉండరు. నెలకి కుటుంబ అవసరాలకు, లైఫ్ స్టైల్ కు కొంత డబ్బు నిలకడగా రావడానికే ప్రాధాన్యత ఉంటుంది. ఈ కేటగిరిలో సంపద సృష్టి, బిజినెస్ స్కేల్ అప్ చేయడానికి కొన్ని పరిధులుంటాయి.  కుటుంబానికి కావలసినంత సమయం ఉంటుంది కానీ షాప్, బిజినెస్ ఏ రకం అనే దానిని బట్టి కాస్త ఒత్తిడి, సమయం లేకపోవటం కూడా ఆశించవచ్చు. ఎక్కువ సమయం పనిచేయాల్సిన అవసరం ఉండొచ్చు , కొద్ది మంది లేదా ఇతర ఎంప్లాయిస్ ఉండకపోవచ్చు.
4.      ఒక కంపెనీ ని కొనడం 

ఎంట్రప్రెన్యూర్ షిప్ బై  యాక్విజిషన్ అని కూడా అంటారు. ఈ కేటగిరిలో ఫౌండర్స్ ఆల్రెడీ ఉన్న ఒక కంపెనీ కొంటారు. లాస్ లో ఉన్న, షట్ డౌన్ అయిన కంపెనీని కొని కొత్త టెక్నాలజీ, ప్రాసెస్, సిస్టం, డిఫరెంట్ మార్కెటింగ్ ద్వారా కొత్తగా మొదలు పెడతారు. సొంత డబ్బు , ఫ్రెండ్స్ , బ్యాంకు లోన్స్, ప్రైవేటు ఈక్విటీ ఫండింగ్ ద్వారా మొదలు పెట్టే అవకాశం ఉంది. ఎదుగుదల (గ్రోత్) అనేది ఫౌండర్స్ ఆశయాలు, ఇన్వెస్టర్స్ అవసరాలపై ఆధారంగా ప్లాన్ చేస్తారు. ఉన్న కాష్ ఫ్లో రన్ చేయడానికి, లాభాల బాటలో నడిపించడానికి ప్రాధాన్యత ఇస్తారు. వీలైతే తర్వాతి కాలంలో ఎక్కువ డబ్బుకి అమ్ముతారు. డబ్బు కోసమా? మళ్ళీ లాభానికి అమ్మటం కోసమా? అనేదానిపై ఎగ్జిట్ ప్లాన్ ఆధారపడి ఉంటుంది. దానిమీద ఫౌండర్స్ లైఫ్ స్టైల్ ఆధారపడి ఉంటుంది. మొదలు పెట్టిన కొత్తలో ఒత్తిడి ఉంటుంది. అనేక బిజినెస్ అవసరాలు బట్టి వాటిపై ఫౌండర్స్ ఎంత త్వరగా విషయాలు నేర్చుకుని భవిష్యత్తు అంచనా వేస్తారనే దానిపై లైఫ్ స్టైల్ పై ప్రభావం ఉంటుంది.

5.      సోషల్ వెంచర్స్ 

ప్రపంచం ఒక మంచి ప్రదేశంగా ఉండాలని, సమాజం ఆరోగ్యంగా ఉండాలని ఆశించే వెంచర్స్ ఈ కేటగిరిలోకి వస్తాయి. సొంత డబ్బు, బ్యాంకు లోన్స్ మాత్రమే కాకుండా వెంచర్ లక్ష్యాలతో అనుసంధానంగా నడిచే అంతర్జాతీయ సంస్థలు, ట్రస్ట్ లు, వెంచర్ కాపిటలిస్టులు ఫండ్ అందిస్తారు. మార్కెట్ షేర్ , ఫౌండర్స్ కోసం డబ్బు కంటే సమాజంపై సానుకూల ముద్ర వేయడానికి ప్రాధాన్యత ఉన్న వెంచర్స్. నిరంతరం సామాజిక కార్యక్రమాలు కొనసాగించడానికి అవసరం కాబట్టి  కొన్ని లాభాలు కూడా ఆశిస్తాయి. వెంచర్ ఎదుగుదల అనేది వారు “ఎంత మంది జీవితాలకు ఉపయోగపడుతున్నాం” అనే కీలక అంశం పై ఉంటుంది, వీలైనంత వరకు స్కేల్ అప్ చేస్తారు. ఒక సామాజిక అవసరంతీరడమే లక్ష్యంగా పని చేస్తారు , ఫార్మల్ ఎగ్జిట్ ప్లాన్ ఏమి ఉండదు. ప్రాజెక్ట్ అవసరాలను బట్టి, దానికి ఫండ్ ఇచ్చే సంస్థల ఆశయాలను బట్టి వ్యక్తిగత జీవితం, కుటుంబ సమయం, ఒత్తిడి ఉంటాయి. నాంది ఫౌండేషన్ , రూమ్ to రీడ్, saathii.org, Plan International, Dabbawala, Jayashree Industries (ప్యాడ్ మాన్ చిత్రాన్ని నిర్మించిన అరుణాచలం మురుగదాస్ సంస్థ) వంటివి కొన్ని ఉదాహరణలు.  
  
6.      కార్పోరేట్ ఇంట్రాప్రెన్యూర్షిప్ 

విపరీతంగా  కస్టమర్ల అవసరాలు, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, పెరుగుతున్న కాంపిటీషన్ వలన విచ్చిన్న ఆవిష్కరణ (డిస్రప్టివ్ ఇన్నోవేషన్) కోరుకుంటున్న ఈ తరుణంలో. కంపెనీలు కూడా కార్పొరేట్ ఎంట్ర ప్రెన్యూర్శిప్ తప్పనిసరి. బాగా ఎదిగిన ఒక కార్పొరేట్ కంపనీలో కొత్త ఐడియాతో, కొత్త బిజినెస్ తో ముందుకు రావడమే కార్పోరేట్ ఇంట్రాప్రెన్యూర్షిప్. దాని ద్వారా కొత్త లాభాలు, కంపెనీ పేరు, కస్టమర్స్ ను మరో ప్రోడక్ట్ ను  కూడా కొనేలా చేయటం లక్ష్యం. దాదాపు పై స్థాయి అధికారులైన వారితో ఒక పేరెంట్ సంస్థ సీక్రెట్ ప్రాజెక్ట్ లా మొదలుపెట్టే అవకాశం ఉంది. ఎక్కువ ఆ మాతృ సంస్థ ఫండింగ్ చేస్తుంది, లేదా ఫండింగ్ ఇప్పించే ప్రయత్నం చేస్తుంది. కొత్త మార్కెట్ సొంతం చేసుకోడానికి వేగంగా ఎదుగుదల ప్లాన్ ఉంటుంది, పేరెంట్ కంపెనీకి ఎదుగుదల ఇవ్వడానికి, అసెట్స్ ఇవ్వడానికి తోడ్పడుతుంది. ఇందులో పనిచేసే వ్యక్తులు జాబు హోల్డర్స్ అయినా, కన్సల్టెంట్ అయినా ఆశ్చర్యం ఏమి లేదు.   
ప్రతి కేటగిరీలోనూ ప్లస్, మైనస్ రిస్క్ రెండూ ఉంటాయి. ఈ ఆరు విధానాలను స్పష్టంగా అర్థం చేసుకుంటే కూడా మీరు ఎంత సమయం, డబ్బు, ఏ స్థాయి ప్రభావం చూపాలనుకుంటున్నారు, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలనుకుంటున్నారు అనేదానిపై వెంచర్ కేటగిరి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి ముందుగా తెలియాల్సిన అంశాలు , ఎందుకంటే తీరా సగం దూరం వెళ్ళాక నేను అనుకున్నది ఒకటి కానీ జరుగుతుంది ఒకటి అనుకునే సమయం ఉండడు కదా. ఈ అవగాహనతో మీ వెంచర్ కేటగిరి నిర్ణయించుకోండి,   బెస్ట్ విషెస్ ఫర్ యువర్ ఎంట్రప్రెన్యూర్శిప్ జర్నీ.
***  ***  సైకాలజీ టుడే తెలుగు పత్రికలో ఏప్రిల్ 2018 సంచికలో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***

Wednesday 27 June 2018

ఎంట్ర ప్రెన్యూర్ గా విజయం సాధించాలంటే ఈ 4 దశలు దాటాలి- 4 Stages to Cross to Become Successful Entrepreneur


4 Stages to Cross to Become Successful Entrepreneur  
1. Start with right idea that address the needs, that can be sustained around 10 years atleast from now
2. Develop a business plan even though day to day activities seem uncertain, get a over all vision for your work
3. Attract seed fund so that you can get started and move forward
4. While addressing the needs, get a paying customer. Increase customer base while managing cashflow effectively. If you invest all money only for advertisement / marketing and waiting for customers to come and can not pay bill, thats a bad sign.

ప్రతి ఎంట్ర ప్రెన్యూర్ ఒక ప్రాసెస్ (విధానం) ప్రకారం ముందుకు వెళ్ళాలి. ఎవరు ఎలా ఆలోచించినా, ఏ పనినైనా సక్సెస్ ఫుల్ గా నడిపించేందుకు కొన్ని కీలక దశలు ఉన్నట్లు స్టార్ట్ అప్ జర్నీ లో కూడా ఎంట్ర ప్రెన్యూర్ కొన్ని ముఖ్యమైన దశలు ఉంటాయా? అవి ఏమిటి? ఈ వ్యాసంలో ఎంట్ర ప్రెన్యూర్ ప్రాసెస్ ముఖ్యదశలు, వాటి ప్రాముఖ్యత చర్చిద్దాం.
***    ***    ***    ***    ***    ***


ఒక మంచి ఐడియా లేకుండా మీరు స్టార్ట్-అప్ మొదలు పెట్టలేరు, అసలు మొదలే పెట్టకపోతే ఎంట్ర ప్రెన్యూర్ (Entrepreneur) కారు.  ఎంట్ర ప్రెన్యూర్ గురువుల భాషలో చెప్పాలంటే మీరు కేవలం “వాంట్రా ప్రెన్యూర్” (wantrapreneur) గా మాత్రమే మిగిలిపోతారు. ఇదేదో పదాల మేజిక్ కాదు.  కేవలం ఎంట్ర ప్రెన్యూర్  అవ్వాలని కోరుకునే వ్యక్తులు మాత్రమే అని అర్థం. అలా కోరుకుంటూనే ఉంటారు, ఎప్పుడు పని మొదలు పెట్టారు.  మరి కోరుకోవడం నుంచి అనుకున్న వెంచర్ మొదలెట్టి ఫలితాలు సాధించడానికి మీరు ఎన్ని దశలు దాటాలి అవి ఎలా ఉంటాయో చూడండి.
1.   సరైన ఐడియా తో మొదలెట్టాలి 

ఒక రైట్ ఐడియా, ప్రజల జీవితాన్ని ఉన్నతంగా మార్చే ఆలోచన రావడం మొదటి దశ. మీ ఐడియా సక్సెస్ అవుతుందో లేదో గత వ్యాసంలో తెలుసుకున్నారు. అన్ని ఐడియాలు మీ వెంచర్ స్టార్ట్ చేయడానికి సరిపోకపోవచ్చు. అందుకే  మార్కెట్ రీసెర్చ్ చేయాలి, దానివలన ప్రజల అవసరాలు తీరతాయని వాళ్ళు అనుకుంటున్నారా అనేది గమనించాలి, అందుకు డబ్బు చెల్లించడానికి  సిద్దంగా ఉన్నారా తెలుసుకోగాలగాలి.
ఒక ఐడియా దశలోనే కస్టమర్స్ ని చేరుకొని కాన్సెప్ట్ మీద సేల్స్ చేయడానికి ప్రయత్నించొచ్చు, ఇందేంటంటే మీ చేతిలో ప్రోడక్ట్ లేకపోయినా కస్టమర్స్ పల్స్ ఇష్టాలు తెలుసుకుని మీ ప్లానింగ్, ప్రోడక్ట్ లో  చిన్న మార్పులు చేసుకోవడం. ఉదాహరణకి ఒకతనికి వ్యాపారం చేయాలని ఉంది. ఆరు నెలల రెంట్ అడ్వాన్సు గా ఇచ్చి, యాభైవేలు డిపాజిట్ గా చెల్లించి, లక్ష పెట్టి ఇతర మెటీరియల్, సరుకు తెచ్చి ఏదైనా బ్రాండ్ పాలు, పాల ఉత్పత్తులు బిజినెస్ చేయాలనుకున్నాడు. దానికంటే ముందు అతను అక్కడ ప్రజలు ప్రస్తుతం ఏ పాలు వాడుతున్నారు, వాళ్లకి ఎక్కడినుంచి వస్తున్నాయి, ఎంత ప్రయాణ ఖర్చులు అవుతాయి, కొత్తగా స్టార్ట్ చేస్తే ఏ విషయం వారిని ఆకర్షిస్తుంది, నెలకు ఎన్ని వేల లీటర్లు అమ్మగలను అని ఆలోచించుకోవాలి. క్వాలిటీ పాలు అందించాలనుకోవడం మంచి ఐడియా కానీ ప్రస్తుత స్థితిలో మార్కెట్ పరిస్థితి తెలుసుకోవడం ముఖ్యం. డబ్బు పెట్టి ఆ తర్వాత కస్టమర్ కోసం షొప్ లో వెయిట్ చేసే బదులు, కస్టమర్ లు ఉన్నారా? కొంటారా? అని తెలుసుకోవటం చాలా మంచిది.

2.      బిజినెస్ ప్లాన్ అభివృద్ధి చేయాలి

సాధారణంగా ఆరు  రకాల సంస్థలు ఉంటాయి.
a.      అధిక ఎదుగుదల ఉండే వెంచర్ కాపిటల్ సప్పోర్ట్ తో నడిచే సంస్థలు. సిలికాన్ వ్యాలీలో ఐడియా నుంచి అంకురించి గొప్పగా ఎదిగిన సంస్థలు, ఊబెర్, పేటీయం  ఈ కేటగిరీ లోకే వస్తాయి. ఇప్పుడిప్పుడే మన తెలుగు రాష్ట్రాలోను ఇలాంటివి వస్తున్నాయి, త్వరలో మరిన్ని రాబోతున్నాయి.
b.      జీవన విధానాలు (లైఫ్ స్టైల్) ఆధారిత సంస్థలు.
c.       చిన్న, మధ్య తరగతి వ్యాపారాలు
d.      ఇతర సంస్థలను కొనడం, టేక్ ఒవర్ చేయడం ద్వారా సృష్టించిన సంస్థలు
e.       సామాజిక అవసరాలను తీరుస్తూ నడపబడే సంస్థలు. ఇంపాక్ట్ వెంచర్స్ అనికూడా అంటారు. వీటికీ NGO లకు కాస్త తేడా ఉంటుంది.
f.        పెద్ద కార్పొరేట్ సంస్థలు

మీ వెంచర్ ఎలాంటిది అయినా ఎంట్ర ప్రెన్యూర్ షిప్ దశలలో బిజినెస్ ప్లాన్ ఉండటం చాలా కీలకం. ప్లాన్ అంటే బాగా రాసిన డాక్యుమెంట్ మాత్రమే ఉండాలి అని కాదు. అంకుర సంస్థగా ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పనులు కనీసం ఒక లిస్టు లా డెవలప్ చేసుకోవాలి, మీ వెంచర్ డెవలప్ చేయడానికి కావలసిన వనరులు, మార్కెటింగ్ పద్దతులు, ఇతర అడ్మిన్ కార్యకలాపాలు గురించి స్పష్టత ఉండాలి. బిజినెస్ ప్లాన్ అనగానే వెంటనే కాస్త అనుభవం ఉన్నవాళ్ళు నాలుగు రోజుల్లో ఆ papers అన్నీ డస్ట్ బిన్ లోకే వెళతాయి దానికి రాయడం దేనికి అనుకుంటారు, మనం ఎలా ప్లాన్ చేసినా మార్కెట్ లో పరిస్థితులు అప్పటి కప్పుడు మారతాయని వాదించే వారు ఉన్నారు. వాస్తవమే మరియు ఆ వాస్తవాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోడానికి, వేర్వేరు విధాలుగా ప్రయత్నాలు చేయడానికి ప్లాన్ ఉండటం మీ వెంచర్ ఎదుగుదల దశ (గ్రోత్ స్టేజి) చేరుకోడానికి బాగా ఉపయోగం. మీ వ్యాపారానికి లోన్ తీసుకోవాలన్నా, ఒక భాగస్వామిని చేర్చుకోవాలన్నా, కొన్ని రోజుల తర్వాత ఇన్నోవేటివ్ థాట్స్ తో ముందుకు వెళ్ళాలన్నా ఈ డాక్యుమెంట్ ఉపయోగపడుతుంది.    

3.      సీడ్ ఫండ్ ని ఆకర్షించాలి

మీ వద్ద చక్కని ఐడియా ఉంది, దాని గురించి మార్కెట్ రీసెర్చ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రజలకు కొన్ని అవసరాలు ఉన్నాయి మీ ఐడియాతో తీర్చగలరు, ప్రజలు అందుకు డబ్బు ఇస్తారని ఆశిస్తున్నారు లేదా ఇంకొక అడుగు ముందుకేసి ప్రీ-ఆర్డర్ గురించి కూడా వాకబు చేసారు, అలా ఆర్డర్ చేసుకోడానికి కూడా ఇష్ట పడిన కస్టమర్స్ ఉన్నారు. మరి మీ ఐడియా ఒక వెంచర్ లా ముందుకు వెళ్ళాలంటే కావలసిన పనులు చేయడానికి మీకు మానవ వనరులు కావాలి, టెక్నికల్ సపోర్ట్ కావాలి, ప్రోడక్ట్ ప్రోటో టైపు చేయాలి, లేదా వెబ్ సైట్ నిర్మించాలి....ఇవి ఏవి కావాలన్నా ముందు డబ్బు కావాలి. ఇలా స్టార్ట్-అప్ తొలి దశలో కావలసిన కనీస డబ్బుని అందించేవే సీడ్ ఫండింగ్ సపోర్ట్ సంస్థలు. ఆ డబ్బు మీది, మీ కుటుంబ సభ్యులది, మీ ఫ్రెండ్స్ , కో- ఫౌండర్స్ నుంచి రావొచ్చు లేదా మీ ఐడియా పై నమ్మకంతో ఇతరులు , ఫండింగ్ సంస్థలు (ఏంజెల్ ఇన్వెస్టర్స్, గ్రాంట్, బ్యాంకులోన్ వంటివి) పెట్టుబడి పెట్టొచ్చు.  సాధారనంగా కుటుంబ ఉసభ్యుల , ఫ్రెండ్స్ ద్వారా ఎక్కువ వెంచర్స్ తమ స్టార్ట్ అప్ సీడ్ ఫండ్ తీసుకుంటాయి ఎందుకంటే వారు మీ మీద , మీ పని మీద , ఐడియా మీద నమ్మకంతో ఇస్తారు. అలా అని వాళ్ళు ఇవ్వక పోతే మీ ఆలోచన విరమించుకోవాల్సిన అవసరం లేదు. seedfund.in, హైదరాబాద్ ఏంజెల్స్ వంటి సంస్థలను కూడా సంప్రదించవచ్చు.  
4.      డబ్బు చెల్లించే కస్టమర్ ని పొందాలి
మీ వెంచర్ లో ప్రోడక్ట్ తయారీ / సర్వీస్ మొదలైంది దాని గురించి దానివలన లాభాల గురించి ఎవరికీ బాగా అవసరలో నిచ్ మార్కెట్ తెలుసుకుని వారిని కలుస్తున్నారు. ఇప్పుడు వారిని ఒప్పించి మీ కస్టమర్ గా చేసుకుని మీ ప్రోడక్ట్ , సేవలు అమ్మాలి. అంతే కాదు వాటికి బిల్ ఇచ్చి డబ్బు లేదా చెక్ తీసుకోవాలి. అంటే మీ చేతికి మీ సర్వీస్ / లేదా ప్రోడక్ట్ ద్వారా డబ్బు రావాలి. అతి తక్కువ ఖర్చుతో మీకు డబ్బు చెల్లించే  కస్టమర్ దొరికితే , వాళ్ళు నిత్యం మీ వద్దకే వస్తే మీ బిజినెస్ సక్సెస్. మరోలా జరిగితే మీకు డబ్బు రాకపోతే మీ వెంచర్ కు ఒక ఫుల్ స్టాప్ పడే రోజు వచ్చినట్టే. తక్కువ ఖర్చుతోనే ఎంతమంది వీలైతే అందరు కస్టమర్స్ ని ఆకర్షించి వారికి మీ ప్రోడక్ట్ అమ్మటం మీ లక్ష్యం అవ్వాలి, ఆ తర్వాత వారికి మంచి కస్టమర్ సర్వీస్ ఇచ్చి మళ్ళీ మళ్ళీ వచ్చేలా చేయాలి. హ్యాపీ కస్టమర్స్ మరొకరికి మీ గురించి చెప్పేలా చేయాలి, వీడియో టెస్టిమోనియల్స్ తీసుకుని మీ కస్టమర్స్ చూసేలా చూడాలి. ఆ విధంగా మీకు రెవిన్యూ వచ్చేలా చూడాలి. ఒకసారి కస్టమర్ బేస్ తయారయ్యాక మరిన్ని ప్రొడక్ట్స్ , విభిన రకాల ప్రొడక్ట్స్, ఆ మార్కెట్ లో కొత్త ఆవిష్కరనలపై దృష్టి పెట్టి మీ సంస్థ గ్రోత్ స్టేజి కి వెళ్ళొచ్చు.

మనసుపెట్టి ఎంతో శ్రద్ధగా ఒక్కొక్క విషయం ముందుకు తీసుకెళుతూ చేసినా ఒకోసారి వెంచర్  సక్సెస్ అవ్వొచ్చు , ఒకోసారి ఫెయిల్ అవ్వొచ్చు. స్టార్ట్ అప్ స్టోరీస్ లో సక్సెస్ ల కంటే ఫైలురెస్ ఎకువ ఉండొచ్చు కానీ చాలా వరకు మనం గ్రహించాగాలిగినవే అంటారు స్టార్ట్ అప్ గురువులు. కాబట్టి ఈ నాలుగు దశలను కంప్లీట్ చేసేలా మీ ప్రయత్నాలు చేయండి. సక్సెస్ అయినా ఫెయిల్ అయినా తట్టుకునే మైండ్ సెట్ చేసుకుని లెర్నింగ్ అండ్ డూయింగ్ అనుకుంటూ ముందుకు వెళితే ప్రపంచానికి కావలసిన గొప్ప ఆవిష్కరణ మీనుంచే రావొచ్చు , మీరే మరో స్టీవ్ జాబ్స్ కావొచ్చు. బెస్ట్ విషెస్.
***  ***  సైకాలజీ టుడే తెలుగు పత్రికలో మార్చ్ 2018 సంచికలో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***