మీ జీవితాన్ని ఉన్నతంగా నడిపించేందుకు
ఉపయోగపడే నిర్ణయం, అలవాటు, బాధ్యత , ప్రణాళికల గురించి చర్చించాము. అయితే మీరు తీసుకున్న
నిర్ణయాలు దిశలో ఫలితాలు సాధించడానికి, మీ కలలను నిజం చేసుకోవడానికి మీరు
నేర్చుకోవలసిన నాలుగు ప్రేమ మంత్రాలు ఏమిటో, అవి ఎలా మీ జీవితాన్ని
అద్భుతంగా తీర్చిదిద్దుతాయో వంటి ఆసక్తికర తెలుసుకుందాం.
* * * * * * * * * * * * * * * * * *
మంత్రం 1. ప్రేమతో విహారాన్ని నిర్ణయించుకోండి: చాలా మంది చేసేపని ఏమిటంటే ఆఫీస్ పనులు, బిజినెస్ పనులు, వృత్తి పరమైన అంశాలకు సమయం కేటాయించిన తరువాత కుటుంబానికి, తనకు తాను , తన విహారానికి, రిక్రియేషన్ కి టైం కేటాయిస్తారు. ఎఫెక్టివ్ రిసోర్స్ మేనేజ్ మెంట్ కన్సల్టెంట్ లు ఏమంటారంటే ముందు మీరు ఆనందంగా గడపవలసిన తేదీలు నిర్ణయించుకోండి, ఆనందంగా, కుటుంబంతో , స్నేహితులతో, తోటివారితో రిక్రియేషన్ టైం నిర్ణయించుకోండి ఆ తర్వాత మిగతా టైం ఆటోమాటిక్ గా ఎక్కువ ప్రొడక్టివిటీ సాధించే విధంగా ప్లాన్ చేస్తారు, అలాగే ఫలితాలు సాధిస్తారు. ఎందుకంటే మీరు ఎంత రిలాక్స్ గా , రెఫ్రెషింగ్ గా ఉంటే అంత క్రియేటివ్ గా ఆలోచిస్తారు అని. మెడిటేషన్ తరువాత పనులలో ఫోకస్ పెరగడానికి కూడా కారణం ఇదే.
మంత్రం 2. ప్రేమతో ప్రాసెస్ విజువలైజేషన్ : నిర్ణయించుకున్న లక్ష్యాల దిశలో పనిచేసే రియల్ సీన్ కి ప్రివ్యూ సీన్ మీ మైండ్ థియేటర్ లో విజువలైజేషన్ చేయండి. చాలామంది ఆఖరికి ఏమి సాధిస్తారో ఆ రిజల్ట్ మాత్రమే విజువలైజ్ చేస్తారు. కాని రీసెర్చ్ లో తేలిన అంశం ఏమిటంటే ఫలితాన్ని మాత్రమే కాకుండా ఆ ఫలితాన్ని సాధించేందుకు చేస్తున్న కృషిని, ఆ మార్గంలో ఎదురయ్యే సవాళ్ళను, అవి అధిరోహించడానికి తీసుకునే చర్యలను కుడా ప్రేమతో విజువలైజ్ చేస్తే అత్యధిక పాజిటివ్ ఫలితాలు సాధించవచ్చు.
మంత్రం 3. ప్రేమతో “నో” చెప్పండి : అవును. ప్రేమతో “నో” చెప్పాలి- మీలో ఉండే మీ ఆలోచనలకూ, మీ బయట ఉండే నెగటివ్ బంధాలకు. గతంలో మీకు ఆశించిన ఫలితాలు ఇవ్వని మీ ఆలోచనా విధానాలకు, మీ కంక్లుజన్స్ కు, మీ రిపీటెడ్ ఆలోచనా సరళికి, నెగటివిటీ కి, నెగటివ్ ఎనర్జీ నింపే మనుషులకు, మీ శక్తిని హరించేలా మిమ్మల్ని ఎమోషన్స్ కు గురిచేసే అంశాలకు ప్రేమగా నో చెప్పండి. ఈ నెగటివ్ ఎనర్జీ మిమ్మల్ని ఆవహించినపుడు మీలో మీరు “డార్లింగ్ నువ్వు నన్ను , నా గోల్స్ ను డిస్టర్బ్ చేయొద్దు. నీ మత్తులో పడి నేను చిత్తు కాదలచుకోలేదు” అని చెప్పండి. మీ గతం, మిమ్మల్ని మోసం చేసిన అంశాలు, మీ బలహీనతలు , మీ చాలెంజ్ లు గుర్తుకి వస్తే “నన్ను అలర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు, నేను నీ నుండి నేర్చుకుంటున్నాను. పాజిటివ్ గా జీవిస్తున్నాను” అని చెప్పుకోండి.
మంత్రం 4. ప్రేమతో “ఒక పదం- టెక్నిక్” పాటించండి :మీరు
ప్రస్తుతం నిర్ణయించుకున్న లక్ష్యాలను నిత్యం మీకు గుర్తుచేసేలా మీ వెసులుబాటుకోసం,
మీ ఫోకస్ క్షణాల్లో మీ గోల్స్ / డ్రీమ్స్ పై తీసుకురావటం కోసం, అనవసర అంశాలనుంచి
మిమ్మల్ని మీరు సులభంగా బయటపదేసే అద్భుత మంత్రం ఒకటి ఉంది . అదే “ఒక్క పదం –
టెక్నిక్” . ఇది చాలా సులభం , కాని పాటిస్తే ఇదో నిజ జీవిత అద్భుతమని మీరే
చెప్పగలరు. ఇందుకు మీరు చేయవలసింది ఏమిటంటే మీ లక్ష్యాలు గుర్తుంచుకునేలా ఇంగ్లీష్
లో కాని, తెలుగు లో కానీ ఒక అందమైన చిన్న పదాన్ని చేసుకోవటం. ఆ పదం చదవగానే మీ లక్ష్యాలు
గుర్తుచేసుకోవడం. నేను నా లక్ష్యాలు గుర్తుండడానికి BOWL (బౌల్ ) అనే పదం చేసుకున్నాను. ఎందుకంటే బుక్ రాయటం, ఆఫీస్
స్టార్ట్ చేయటం, వెబ్ సైట్ చేయించటం, బిజినెస్ ఎలా చేయాలి అనే అంశం మీద కోర్స్
చేయటం నా లక్ష్యాలు. అందుకే ఈ అంశాల ఇంగ్లీష్ రూపానికి ఈ విధంగా BOWL (Book, Office, Website, Learning entrepreneurship course) అనే ఒక్క పదం టెక్నిక్
వాడాను. నేను ఏ పని చేసినా ఇది నాలో నేను అనుకుంటూ ఉంటాను. ఆ పని ఈ అంశాలకు
అనుసంధానంగా ఉండేలా ప్రయత్నిస్తాను. ఎందుకంటే ప్రయారిటీ ముఖ్యం కదా. ఫోకస్
ఆటోమేటిక్ గా వస్తుంది. ఈ టెక్నిక్ 66 రోజులు పాటించండి. ఎవరితో అయినా మాట్లాడడానికి సెల్ ఫోన్ ఉన్నట్లుగా,
స్విచ్ వేస్తే బల్బ్ వెలిగినట్లుగా, మీరు పదం చదివితే మీ లక్ష్యాల పై మీ మనసు
లగ్నం అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు ప్రేమతో “ఒక పదం –టెక్నిక్”
తయారుచేసుకోండి, అద్భుతాలు సాధించండి.
No comments:
Post a Comment