కోటి ఆశలతో ప్రపంచం మొత్తం ఒక కొత్త సంవత్సరం లోకి
అడుగుపెడుతున్నది. అనేక సంస్థలు కొత్త లక్ష్యాలను నిర్దేషించుకుంటున్నాయి. లీడర్లు,
విజేతలు అవ్వాలనుకునేవారు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. మరి మీరు ఈ నూతన
సంవత్సరం 2015 లో సాధించాల్సిన ముఖ్య లక్ష్యాలు ఏమిటి? గత సంవత్సరం 2014 జనవరిలో లేదా సంవత్సరం
మద్యలో ఏమైనా లక్ష్యాలు నిర్ణయించుకున్నారా? అయితే వాటి విషయంలో మీరు ఎటువంటి
ప్రగతిని సాధించారు?
ఎంత గొప్ప లక్ష్యాలు
నిర్ణయించుకున్నా, ఎంత ఉన్నత పద్దతులలో నిర్ణయించుకున్నా ఆ లక్ష్యాలు చేరే మార్గం
సుగమం కావాలంటే కొన్ని మానసిక మరియు నిర్వహణా ప్రక్రియలు జరగాలి. కొత్త సంవత్సరంలో
మిమ్మల్ని ముందుకు నడిపించే ఆ అద్భుత ప్రక్రియలో ముఖ్యమైన నాలుగు కీలక అంశాలేమిటో ఏమిటో చర్చిద్దాం.
1. ఒక నిర్ణయం: మీ లైఫ్ పర్పస్ దిశలో
మరో 12 నెలలలో మీకు ఏమి కావాలి?
మరో పన్నెండు నెలలలో మీ జీవిత
దఎయాలకు మీరు చేరుకోవాల్సిన లక్ష్యాలు ఏమిటి ? వీలైతే గత సంవత్సరంలో జనవరి లో మీరు లక్ష్యాలు
రాసుకున్న మీ డైరీ/నోట్ బుక్ ఒకసారి చెక్
చేసుకుని ఈ ఆర్టికల్ చదవటం ప్రారంభించండి. గతంలో లక్ష్యాలు నిర్దేషించుకోకపోతే మీ
ఒక సంవత్సరం లక్ష్యాలు టైం లైన్ తో స్పష్టంగా వ్రాసుకోండి. ఎందుకంటే కేవలం అది
కావాలి, ఇది కావాలి అని ఆశిస్తే కేవలం ఆశించాతంలోనే ఎక్స్ పర్ట్ అవుతారు. ఆశించింది సాధించాలంటే మీ
ఆశలను లక్ష్యాలుగా మార్చుకోవాలి. ఈ ప్రపంచంలో లక్ష్యాలు రాతపూర్వకంగా నిర్దేశించుకునే
కొద్దిమంది గొప్ప వారిలో మీరు భాగం కావాలి. అందుకే లక్ష్యాలు స్పష్టంగా రాసుకోమని
వివరించాము. లక్ష్య నిర్దేశం (గోల్ సెట్టింగ్) మీరు ఆశించిన ఫలితాలను స్పష్టంగా
వివరిస్తుంది. మీ మైండ్ లో ఒకటి సాధించాలంటే ఆలోచనల్లో స్పష్టత ఉండాలి. కాబట్టి మీ
శరీరం, మనసు, మీ కెరీర్, మీ కుటుంబం, మీ ఆర్ధిక వ్యవహారాలూ, మీ సోషల్ లైఫ్, మీ
ఆథ్యాత్మిక జీవితానికి, మీ లెర్నింగ్ గోల్స్, మీ రిక్రియేషన్ గోల్స్ అన్నింటిని
దృష్టిలో ఉంచుకొని లక్ష్యాలు నిర్ణయించుకోండి. మీకు ఏమి కావాలో, ఎందుకు కావాలో తెలిస్తే
ఎలా సాధిస్తారు అనేది ఈ ప్రపంచం అదే
చూసుకుంటుంది. అయితే అందుకు మీరు చేయవలసింది మీ జ్వలించే కోరిక దిశలో
ప్రాధాన్యాలు (priorities) దృష్టిలో ఉంచుకొని పనిచేయడం.
2. ఒక అలవాటు: మీ లక్ష్యాల దిశలో మరో 12 నెలలు మీ అలవాట్లు నిర్మించుకోండి:
ఒక లక్ష్యం నిర్ణయించుకున్న తర్వాత
మీ శక్తిని, సమయాన్ని దానికి అనుసంధానమైన అంశాలలోనే ఉపయోగించుకోగలగాలి. ఇది ఒక
ఉన్నత అలవాటు. ఇది మీ జీవితంలో భాగమై పోవాలి. అందుకు మీ లక్ష్యాల దిశలో తక్షణం
అడుగు వేయాలి. మీరు కోరుకున్న లక్ష్యాలు సాధించిన వారి గురించి తెలుసుకోండి, వారు
ఎలా ప్రయత్నించారో చర్చించండి, ఆ రంగానికి చెందిన పుస్తకం చదవండి, ఒక నిష్ణాతుడికి
కాల్ చేయండి. ఒక కోర్స్ జాయిన్ అవటం, ఆరోగ్యం కోసం జిం లో జాయిన్ అవటం, ఆర్థిక
అంశాలపై అవగాహన కార్యక్రమాలకి వెళ్ళటం, వర్క్ లో ప్రొడక్టివిటి పెంచుకోడానికి
కోచింగ్ తీసుకోవటం, ప్రేమ ఆప్యాయతలను తెలిపేందుకు మీ బంధువులు కుటుంబ సభ్యులను
కలవటం ఇలా అది ఎంత చిన్నపని అయినా సరే ఆ
దిశలో మొదటి అడుగు వేయడం ముఖ్యం. ఈ చిన్నపని లక్ష్యం నిర్దేశించుకున్నప్పుడు మీలో
జ్వలించిన ఉత్సాహాన్ని సాధించే వరకూ కొనసాగించేలా ఉపయోగపడుతుంది. ఎంత పెద్ద కొండ
అయినా చెట్టు అయినా సరే గొడ్డలితో రోజుకు కొంత సమయం నరికేస్తూ పోతే ఒక రోజుకి కూలిపోతుంది. అలాగే మీరు మీ శక్తిని,
ఫోకస్ ని, సమయాన్ని మీ లక్ష్యం వైపు నడిపించేలా మీ అలవాట్లు నిర్మించుకోండి. మీ
ప్రగతిని నిరోధించే అనవసర అలవాట్లు వదిలేసి ఉన్నత అలవాట్లు ఈ 12 నెలలో మీ జీవితంలో భాగం
చేసుకోండి.
౩. ఒక బాధ్యత: 12 నెలలు మీ ఫలితాలకు మీరు
బాధ్యత వహించండి:
“కొంతమంది గత సంవత్సరం లక్ష్యాలు పెట్టుకున్నాం కానీ జనవరి , ఫిబ్రవరి
తర్వాత వాటి మీద పనిచేయలేదు” అని చెబుతుంటారు. ఎందుకు చేయలేదు అంటే వారు చెప్పే
సమాధానాలు ఇలా ఉంటాయి.
- మా ఇంట్లో వాళ్ళు అర్థం
చేసుకోవటంలేదు
- నాకు మా ఫ్యామిలీ మెంబర్స్
సపోర్ట్ కుడా లేదు
- నాకు కావలసినంత టైం లేదు
- ఈ పని చేయాలంటే డబ్బు బాగా
పెట్టాలి
- నేను లంచాలు ఇవ్వలేను కాబట్టి
నాకు పనులు కావు
- నాకు ఇంగ్లీష్ రాదు
- మా కుటుంబంలో , మా ఊరిలో ఎవరు
అటువంటి ప్రయత్నం చేసి విజయం సాధించిన వారు లేరు
- ఆడ పిల్లలకి అంత పెద్ద
ఉద్యోగాలు ఎంత ప్రయత్నించినా రావు
- నాకు లోన్ రాలేదు
- నా పార్టనర్ మంచోడు కాదు
- నా మంచితనం నాకు పనికి రాదు
- సరైన ప్రభుత్వాలు లేవు,
వ్యవస్థ లేదు
- డబ్బు సంపాదించటం అంత ఈజీ
కాదు
ఇలా చెప్తూ పోతే ఈ లిస్టు ఇలా పెరుగుతూనే పోతుంది. నా పనులు ఎందుకు కాలేదంటే
అంటూ కారణాలు చెప్తూ పోతే ఆ కారణాలు చెప్పటంలో ఎక్స్ పర్ట్ అవుతాము. కాని పనులు
కావు. ఎన్ని అడ్డంకులున్నా ఇంకా ఉన్నతంగా ఎదగాలంటే ఏమి చేయాలనీ
ప్రశ్నించుకోవాలి. మనుషులు ఫలితాలు
సృష్టించడానికి మార్గాలను వెతుక్కోవటం కంటే , ఫలితాలు ఎందుకు సృష్టించాలేకపోయరో
చెప్పే కుంటిసాకులు వెతుక్కోవటంలో ఎక్కువ అలిసిపోతున్నారు. దాని వలన మనల్ని
మనం (కాస్త మన ఇగో కూడా) మభ్య పెట్టుకోవటమే అవుతుంది. కాని ప్రపంచం మన అపజయాలకి
కారణాలను చూడదు, జీవితంలో కారణాల లిస్టుకి అంతం ఉండదు. నిజానికి విజేతలందరూ
ఇటువంటి అడ్డంకులను, ఆటంకాలను దాటి వచ్చిన వారే. కాబట్టి భిన్నంగా ఆలోచించాలి. మీ జీవితానికి,
మీ అలవాట్లుకు 100% బాధ్యత తీసుకోవాలి. మీ అలవాట్లకు, మీ ఫలితాలకు బాధ్యత మీరే తీసుకోండి, ఆ
విధానంలో మిమ్మల్ని మీరు మెరుగు పరుచుకోగలరు.
4. ఒక ప్రణాళిక : ప్రతినెల
ప్రణాళికతో ప్రగతిని పరిశీలించుకోండి :
మీ ప్రతి లక్ష్యం సాధించడానికి
మీరు చేయవలసిన పనులు ఒక నెలల వారిగా రాసుకొని ఒక సంవత్సర ప్రణాళిక ఈ క్రంద
ఇవ్వబడిన చార్ట్ లో మాదిరిగా చేసుకోండి. మీరు నిర్దేశించుకున్న ముఖ్యమైన అన్ని
లక్ష్యాలు ఎడమ వైపు రాసుకోండి. ఈ క్రింద వివరించిన చార్ట్ లో స్థలాభావం వలన మేము
కేవలం ఉదాహరణలు అందించాము. మీరు మీ నోట్ బుక్ / డైరీ లో అన్ని అంశాల లక్ష్యాలు స్పష్టంగా
రాసుకోండి. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే చేయాల్సిన పనులు విడిగా రాసుకోవచ్చు. ఆ
లక్ష్యాలు చేరుకోడానికి సమయాన్ని నెలలు రంగు తో నింపండి. ఈ సంవత్సర ప్రణాళికను
దగ్గర పెట్టుకుని ప్రతి నెల మీరు ఆ నెలలో ఏమి చేస్తే మీ ఇయర్ గోల్ సాధిస్తారో దాని
ప్రకారం నెలలో నిర్వహించాల్సిన కార్యక్రమాలు రాసుకోండి. అంటే ఏ నెలలో ఏం పనులు
చేయాలో రంగు ఉన్న ప్రదేశాన్ని చూసి, మీ ఇయర్ గోల్స్ చదవటం ద్వారా అర్థవంతంగా
నెలవారీ లక్ష్యాలు నిర్ణయించుకోవచ్చు.
సంవత్సర ప్రణాళిక చార్ట్:
S.No
|
లక్ష్యాలు
|
జనవరి 2015
|
ఫిబ్రవరి 2015
|
మార్చ్ 2015
|
ఏప్రిల్ 2015
|
మే 2015
|
జూన్2015
|
జూలై 2015
|
ఆగష్టు 2015
|
సెప్టెంబర్ 2015
|
అక్టోబర్ 2015
|
నవంబర్ 2015
|
డిసెంబర్ 2015
|
A
|
శారీరక ఆరోగ్యం
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
1
|
శారీరక వ్యాయామం
ద్వారా నా ఆరోగ్యాన్ని ఉన్నతంగా, నా శరీరాన్ని శక్తివంతంగా చేసుకుంటాను
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
2
|
జూలై 2015 నాటికి నేను 60 కిలోల శరీర బరువు కలిగి ఉంటాను
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
3
|
జనవరి 2015 నాటికి నేను హెల్త్ ఇన్సూరెన్సు తీసుకుంటాను
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
B
|
మానసిక ఆరోగ్యం
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
1
|
యోగ, మెడిటేషన్
ప్రతి రోజు ప్రాక్టీసు చేస్తాను.
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
2
|
జనవరి, ఫిబ్రవరి,
మార్చ్ లో లైఫ్ కోచింగ్ క్లాసు కి
వెళతాను
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
C
|
కుటుంబ జీవితం
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
1
|
నా కుటుంబంతో,
స్నేహితులతో నా సంబంధాలు ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటాను. ఉదా: ప్రతి వారం ఇద్దరు
పాత స్నేహితులతో మాట్లాడతాను
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
3
|
ఆగష్టు 2015 నాటికి నేను పెళ్లి చేసుకుంటాను
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
D
|
చదువు / వృత్తి/ ఉద్యోగమ/ వ్యాపారము
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
1
|
జూన్ 2015 నాటికి నా కొత్త వ్యాపారము మొదలు పెడతాను
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
2
|
సెప్టెంబర్ 2015 నాటికి నేను PhD లో / కొత్త కోర్స్
లో చేరతాను
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
E
|
ఆర్ధిక జీవితం
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
1
|
డిసెంబర్ 2015 నాటికి నేను రూ. 25 లక్ష లు
సంపాదిస్తాను
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
F
|
ఫన్ , లెర్నింగ్ , రిక్రియేషన్
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
1
|
ఆగష్టు 2015 నాటికి నేను ఇండియాలో 4 పర్యాటక
కేంద్రాలకు వెళతాను
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
2
|
ఈ సంవతరం జనవరి ,
సెప్టెంబర్ లలో కార్టూన్స్ గీయడం, స్విమ్మింగ్ నేర్చుకుంటాను
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
G
|
సమాజ సేవ, వాలంటరీ సర్వీస్
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
1
|
నేను జూలై 2015 నాటికి 5000 రూ|| పేద అనాధ విద్యార్ధులకు అందిస్తాను, నెలకి ఒక
రోజు సంక్షేమ కార్యక్రమంలో పాల్గొంటాను
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
ఈ విదంగా ఏ నెలలో ఏం పనులు చేయాలో
నిర్ణయించుకున్నాక, నెల వారి లక్ష్యాలు చేరుకోడానికి ఏమి చేయాలో వారానికి ఏమి
చేరుకోవాలో మైల్ స్టోన్స్ గుర్తిస్తూ నెలవారీ ప్రణాళిక చేసుకోవాలి. ఇది మీ
శక్తిని, మీ సమయాన్ని ఉన్నతంగా , ఫోకస్ తో ఉపయోగించుకోడానికి ఒక చక్కటి మేజిక్
టూల్ వంటిది. ప్రతినెలా మొదటి రెండు రోజులలో మీ ఇయర్లీ ప్లాన్ నుంచి మంత్లీ ప్లాన్
సిద్దం చేసుకోండి. ఈ క్రింద ఉదాహరణలో ఆరు రోజులకు మంత్లీ ప్లాన్ ఇవ్వబడింది. మీరు జనవరి నెల కు ప్రణాళిక 31 రోజులకు చేసుకోండి. ఆ పనులు
చేస్తున్నపుడు పరిస్థుతులకు తగినట్లు మార్పులు చేసుకున్న పర్లేదు కాని మార్పులు మీ
ఫోకస్ ని, మీ ప్రాధాన్యాలను మార్చకుండా జాగ్రత్త పడండి. ప్రతి నెల గత నెలలో ఏమి
చేసాము, ఎలా చేసాము, ఏమి చేయలేక పోయాము, ఇంకా బాగా చేయాలంటే ఎలా, అడ్డంకులు ఎలా అధిగమించవచ్చు
అని పునర్విమర్శ చేసుకోండి.
జనవరి – మంత్లీ ప్లాన్:
జనవరి 2015 - నెల ప్రణాళిక
|
తేది
|
వారం
|
చేయవలసిన కార్యక్రమాలు
|
పూర్తి చేసిన కార్యక్రమాలు
|
1
|
గురువారం
|
ఎక్సర్ సైజ్ , బుక్ రీడింగ్, ప్రొఫెసర్ సుబ్బారావు ని
కలవాలి, కోర్స్ వివరాలు తెలుసుకోవాలి,
|
|
2
|
శుక్రవారం
|
ఎక్సర్ సైజ్ , బుక్ రీడింగ్ ౩౦ నిమిషాలు, కోర్స్ లో
జాయిన్ అవ్వాలి
|
|
3
|
శనివారం
|
ఎక్సర్ సైజ్ , ఓల్డ్ ఫ్రెండ్స్ తో మాట్లాడాలి, జిం లో
జాయిన్ అవ్వాలి ,
|
|
4
|
ఆదివారం
|
ఎక్సర్ సైజ్ , వారాంతపు పునర్విమర్శ (వీక్లీ రివ్యూ),
బంధువులతో ముచ్చట్లు, నచ్చిన పుస్తకం కంప్లీట్ చేయాలి
|
|
5
|
సోమవారం
|
8 గంటలు చదువుకోవాలి, , తల్లి దండ్రులకు వర్క్ లో హెల్ప్
చేయాలి
|
|
6
|
మంగళ వారం
|
ఎక్సర్ సైజ్ , బిజినెస్ మీటింగ్
|
|
ఈ కొత్త సంవత్సరం అద్భుతం
అవ్వాలంటే మీ జీవితాన్ని నడిపించే మీ లైఫ్ పర్పస్ దిశలో లక్ష్యాలు, లక్ష్యాల దిశలో
బాధ్యత, ఆ బాధ్యతను నిర్వర్తించేందుకు ఉపయోగపడే ఉన్నత అలవాట్లు, మిమ్మల్ని ఫోకస్
తో నడిపించే ప్రణాళిక ఉండాలి. ఇవన్నీ ఆయుధాల వంటివి ఈ ఆయుధాలు పనిచేయాలంటే మీరు
వాటిని వాడాలి. రెగ్యులర్ గా వాడాలి. జనవరి లో ఉత్సాహంతో మొదలుపెట్టి మార్చిలో అటకెక్కించే
అంశాలు రాసుకున్నట్లైతే వాటిని మళ్ళీ చెక్ చేసుకోండి. పాత అలవాట్లను అటక
ఎక్కించండి. ఒక జీవితం ఒక అద్భుతం అవ్వాలంటే గతానికి బాధ్యత వహిస్తూ, రేపటిపై
నమ్మకంతో, ప్రతిక్షణం అర్ధవంతంగా, ఆనందంగా ముందుకు వెళ్ళే లక్షణం ఉండాలి.