Sunday, 27 December 2015

ఈ మూడు సోపానాలు ఎక్కితే మీరే ప్రపంచస్థాయి విజేత [Three Steps to become a world class winner ]

ప్రపంచమంతా చెప్పుకునేది విజేతల గురించి. ప్రపంచం నడిచేది విజన్ నుంచి. ప్రపంచాన్ని నడిపించేది లీడర్ షిప్. మరి వారిలా మనం ఎప్పుడు విజేతలవుతాము, వారిలా ఎదిగే అవకాశం మనకెప్పుడు వస్తుంది?  విజేత కావడం ఎలా? సందేహాలతో ఆగిపోవాలా సవాళ్ళు ఎదురైనా ముందడుగు  వేయాలా? సిల్వర్ స్పూన్ తో పుట్టలేదని ఆగిపోవాలా మనలోనే ఉన్న డైమండ్ కి సాన పట్టాలా? అసలు ప్రపంచ స్థాయి విజేతలా నిలవాలంటే ఏమి చేయాలి?

మిమ్మల్ని మీరు ఉన్నతంగా మలుచుకోవాలన్న డిసిప్లిన్:
మనకి ఏమి కావాలో, ఎందుకు కావాలో, మనం ఏమి కలిగి ఉన్నామో, వాటిని ప్రపంచంతో ఎలా పంచుకోవాలో తెలుసుకోవటమే లైఫ్. ఆపనిని ఉన్నతంగా చేయడానికి కావలసినవి లైఫ్ స్కిల్ల్స్. లైఫ్ లో మీరు ఆశించింది సాధించాలంటే మీ బాడీ , మైండ్, లైఫ్ ఎనర్జీ  అందుకు అనుసంధానంగా ఉండాలి. మీ గురించి, మీ జీవితం గురించి, సృష్టి మీకు ఇచ్చిన అద్భుతాలు గురించి మీకు అవగాహన ఉంటే వాటిని సవ్యంగా ఉపయోగించుకుని మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోగలరు. అందుకు కావలసింది మిమ్మల్ని మీరు అత్యంత ఉన్నతంగా మలుచుకోవాలన్న క్రమశిక్షణ. దీనికి కొంత ఆత్మ విశ్లేషణ చేసుకోడానికి ఈ ప్రశ్నలు , ఇలాంటి ఇంకొన్ని ప్రశ్నలు మీకు మీరు వేసుకని సమాధానాలు అన్వేషించండి.
  • ఒక వ్యక్తిగా నా ధర్మం ఏమిటి? నా జీవిత ధ్యేయం ఎఅమిటి?
  • నా కుటుంబం ఏమిటి? నా పరిస్థితులు ఏమిటి? అందుకు నేను ఇంకా విలువను ఆపాదించాలంటే ఏమి చేయగలను?
  • ఇప్పుడున్న పరిస్థితులుతో, నాకు ఇప్పుడు వస్తున్న ఫలితాలతో నేను ఎలా ఉన్నాను? నేను ఇంకా మెరుగైన జీవితం కోసం నా ప్రస్తుత జీవన విధానాలు ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ఏ విషయాలు నేర్చుకోవాలి? ఏ బలహీనతలు వదులుకోవాలి?
  • నాకు ఏమి ఫలితాలు కావాలి? ఎప్పటికి కావాలి? అవి సాధించిన క్షణంలో నేను ఎలా ఉంటాను? ఎలా మాట్లాడతాను? ఎవరెవరు నాతో ఉంటారు? ఎలా ఫీల్ అవుతాను?
  • ఆశించిన ఫలితాలు సాధించాలంటే నేను ఏమి చేయాలి? ఎవరిని కలవాలి? ఏమి నేర్చుకోవాలి? ఏమి చదవాలి?
నిబద్దత తో కూడిన జవాబుదారీతనం :

కొంతమంది ఉంటారు జీవితంలో ఎవరికి సమాధానం చెప్పుకోరు, తల్లిదండ్రులకు, స్నేహితులకు, ఆఫీస్ లో బాస్ కు, బయటి సమాజానికి దేనికి తన చర్యల పట్ల సమాధానం , నిబద్దత ప్రదర్శించరు. ఎవరికైతే ఈ రెండు లేవో వారు ప్రజలముందు ఒక రకంగా వెనుక మరో రకంగా బతుకుతుంటారు. ఇవి తెలివితేటలు అనుకుంటారు, అందరు తమని పట్టించుకోవలసిన అవసరం లేదని అనుకుంటారు. కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు ఫ్రెండ్స్ వద్ద, పక్క రూమ్ లో  హాస్టల్ లో లాప్టాప్ లు, సెల్ ఫోన్ లు , టూ- వీలర్ లు దొంగతనం చేసారని , మేడలో బంగారు గొలుసులు కొట్టేసే చెయిన్ స్నాచింగ్ బ్యాచ్ లు ఎక్కువ యువత పట్టుపడుతున్నారని వినే ఉంటారు ...ఇదంతా ఎక్కువ తనమీద , తన చర్యల మీద నిబద్దత, తనకి ఉన్న పరిస్థితులలో పాజిటివ్ రోల్ మోడల్ చూసి ముందుకు వెళ్లాని అని నేర్చుకోకపోవటం వలన జరుగుతుంది. ఇంకొందరు రెండు మూడు కోర్స్ లలో జాయిన్ అయ్యి యునివర్సిటీ లలో కేవలం రూమ్ , ఫుడ్ ఫ్రీ గా రావటం కోసం విలువైన జీవితాన్ని అక్కడే గడుపుతారు , మనం ఫ్రీ గా ఫుడ్ వస్తుంది అని చూస్తాము , జీవితాన్ని ఇంత కన్నా నిబద్దత తో తీర్చిదిద్దుకుంటే మరో కంపెనీ పెట్టి పదిమందికి ఉద్యోగాలు ఇవ్వొచ్చని నమ్మలేం.
బద్దకానికి , వాయిదా వేయడానికి మించి పనిచేయటం – టేక్ యాక్షన్ నౌ : 

అవును ఎంత తెలివి, ఎంత విశ్లేషణా సామర్ధ్యం ఉన్న పని చేయాలి. విజేతలు తాము చేస్తున్న పనిమీద, ప్రాజెక్ట్ మీద, తమ కంపెనీలో ఇతర డిపార్టుమెంటు ల మీద, కనీస కుతూహలాన్ని ప్రదర్శిస్తారు. తాము ఒక లక్ష్యంతో పనిచేసి దానిని సాధించిన తర్వాత, ఇంకొంచం ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని ఇంకా ఎదగాలని ప్రయత్నిస్తారు. ఉదయం ఎనిమిది గంటల లోపు ఎక్సర్ సైజు, మెడిటేషన్, ఆ రోజు చేయాల్సిన పనుల వివరాలు, బ్రేక్ ఫాస్ట్ తప్పక చూసుకునే అలవాట్లు ప్రపంచంలో విజేతలుగా అనేక ప్రముఖుల జీవితాల్లో భాగామని ఒక సర్వే లో తేలింది. అందుకే బద్దకాని , వాయిదా వేయడాన్ని మానేసి పనిచేయగాలగాలి. అర్ధం అయితే మల్లి ఈ అంశాల గురించి ఒక్క క్షణం మీ జీవితం గురించి ఆలోచించండి.ఒక్క గంట మీరు కోరుకుంటుంది ఎలాంటి జీవితమో రాయండి.ఒక్క రోజు మీరు కోరుకున్నట్లు జీవించండి. ఒక్క నెల ఈ ప్రక్రియ కొనసాగించండి. ఒక్క సంవత్సరం మీరు ఆశించిన జీవితాన్ని సృష్టిస్తూ, నమ్మకంలోనుంచి మీ జీవన ప్రాధాన్యాలపై దృష్టి కేంద్రీకరించి పని చేయండి.
*********** సైకాలజీ టుడే, డిసెంబర్ 2015 లో ప్రచురించిన  నా ఆర్టికల్ **************  




సమస్యలు ఎదురైనా మిమ్మల్ని విజేతగా నిలిపే 3 స్టెప్ ల సక్సెస్ ఫార్ములా (3-Step Success Formula)


జీవితంలో ఇప్పటివరకు జరిగిన సంఘటనలు, ప్రయత్నాలకి వచ్చిన ఫలితాల ఆధారంగా సక్సెస్ అవ్వాలంటే ఏమి చేయాలి అని ఆలోచిస్తూ కూర్చున్నారా? అసలు ఏ అంశాల మీద, ఏ ఆలోచనలు మీద, ఏ పరిస్థితులు మీద సక్సెస్ ఆధారపడి ఉంది అని అన్వేషిస్తున్నారా? నాలో లేనిది ఏంటి గెలిచే వాళ్ళలో ఉన్నది ఏంటి అని సందిగ్దంలో ఉన్నారా? అయితే మిమ్మల్ని విజేతగా నిలిపే సక్సెస్ ఫార్ములా అందుకోండి.

స్టెప్  1:   మీతో మీరు మాట్లాడుకునే విధానం మార్చండి (సెల్ఫ్ టాక్): చాలామంది ఉన్నదానికి త్రుప్తితో ఆనందంతో లైఫ్ ఎంజాయ్ చేయకుండా, కృతజ్ఞతా భావంతో ఆస్వాదించకుండా లేనిదాన్ని తలుచుకుని,  గతాన్ని తలుచుకుని, భవిష్యత్తు ని ఊహించుకుని వాటి పరిస్థితులు ఎలా ఉంటాయో, ప్రభావం ఎలా ఉంటుందో  అని ఆలోచిస్తూ ఉంటారు. అలా లేని సమస్యని ముందే ఊహించుకుని వర్తమానాన్ని ఇంకొంత  జటిలం చేసుకునే బదులు ఆనందంగా గడపొచ్చు అన్న చిన్న జీవన విధానం తెలియకనే ఈ పరిస్థితి. ఇంకోటి ఈ ప్రపంచంలో ఆనండం ఎక్కడ ఉంది అంటే “పరిస్థితి” ని బట్టి కాదు , మనో స్థితి ని బట్టి అని చెప్పుతుంది భారతీయ జ్ఞాన సంపద.  అందుకే మీతో మీరు ఉన్నతంగా, ప్రయోజనాత్మకంగా, జడ్జిమెంట్ ఇవ్వకుండా, సానుకూలంగా మాట్లాడుకోండి. మీకు ఎవైనా అనుమానాలు ఉంటె నివృత్తి చేసుకోండి కాని “ఈ పరిస్థితిలో మీరు ఉంటె తెలుస్తుంది...” అని ఒక అంతు చిక్కని రామ బాణాన్ని సంధించకండి. అది కేవలం ఇగో ని త్రుప్తి పరుస్తుంది. ఎప్పుడైతే మీతో మీరు ఉత్తేజితంగా, మాట్లాడారో అప్పుడు మీలో పూర్తి శక్తుల్ని ఉపయోగించుకోగలరు అని ప్రయోగాలలో కూడా తెలిసిన అంశం.  మూడో వ్యక్తితో మాట్లాడినట్లు మాట్లాడటం వలన కూడా మీ ఎమోషనల్ లెవెల్ లో ఉండే కొంత భయాలు పోతాయని రీసెర్చ్ లో చెప్పబడింది. “ నేను ఈ రోజు గొప్ప మీటింగ్ చేయలేను” అనే బదులు , “రమేష్ ...ఈరోజు నువ్వు చేయగలవు, గతంలో చేసావు, ఇది కేవలం నీకు మరో అవకాశం , కొత్త ప్లేస్ అంతే” అని మాట్లాడుకుంటే చక్కటి ప్రభావం ఉంటుంది. సెల్ఫ్ టాక్ లో కాస్త పవర్, పేషన్స్, “ఇలా అయితే ఇంకా హాయిగా ఉంటుందేమో”  అనే కొత్త సెన్స్ ఉండేలా చూసుకోండి, మీ లైఫ్ మీ చేతిలోకి వచ్చేలాంటి సింపుల్ , పవర్ ఫుల్ టెక్నిక్ ఇది.

స్టెప్ 2:   మిమల్ని భౌతికంగా ఉన్నతంగా మార్చుకోండి (ఫిజియాలజీ):
కేవలం మీతో మీరు మాట్లాడే మాటలే కాదు, మీ శరీరాన్ని, ముఖ కవలికాలని, మీ బాడీ మోత్తన్న్ని ఎలా ఉపయోగిస్తారు అనేది మీతో మీరు వేర్వేరు అంశాల మీద ఎలా ఫీల్ అవుతున్నారు అనేది నిర్నైస్తుంది. మీ ఆత్మ విశ్వాసాన్ని స్పష్టం చేస్తుంది. సోషల్ సైకాలజిస్ట్ అమీ కెడ్డి  మనిషి బాడీ లాంగ్వేజ్ కి ఎమోషన్స్ కి మద్య సంబంధాన్ని గురించి చేసిన అధ్యయనాల్లో అనేక ముఖ్యమైన విషయాలు చెప్పారు. మీరు మీ బుజాలు వంచి చిన్నగా వంగిపోయి నడుస్తూ, అల కూర్చుంటూ , స్లో గా మాట్లాడితే తక్కువ కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతారు, అదే పవర్ఫుల్ మాన్ గా (హి మాన్, వీర హనుమాన్) లాగా పోసే పెడితే ఆటో మాటిక్ గా పవర్ఫుల్ గా ఫీల్ అవుతారు. ఈ బాడీ లాంగ్వేజ్ అండ్ ఎమోషన్ రేలషన్ అర్ధం చేసుకుంటే మీరు గొప్ప ఒత్తిడి అనుకున్న క్షణంలో కూడా నెమ్మదిగా నవ్వుతు బాడీ లాంగ్వేజ్, ముఖ కవళికలు, సున్నిత మైన ముఖ కవళికలు అలవాటు చేసుకుని ఉంటె స్థిత ప్రజ్ఞత మీ లైఫ్ లో భాగ మైపోతుంది. మూడ్స్ ఎలాగో ఉంది అనుకున్నప్పుడు నిల్చొని చప్పట్లు కొట్టండి, వాల్కిగ్న్ చేయండి, ఆకాశం వైపు చూస్తూ గట్టిగా గాలి పీల్చుకోండి ...మీకు ఈ భౌతిక శరీరానికి – మనసుకు ఉన్న లింక్ బాగా అర్ధం అవుతుంది. దీని మీద పట్టు సాధించారంటే మీ ఎమోషన్స్ పూర్తిగా మీ కంట్రోల్ లోకి వచ్చి నట్టే. అందుకే పవర్ ఫుల్ బాడీ లాంగ్వేజ్ లో ఉండండి , అద్భుతాలు మీ సొంతం చేసుకోండి. 

స్టెప్ 3:   మీ స్వయం నిర్వచనం  మార్చుకోండి (సెల్ఫ్ డిస్క్రిప్షణ్):
మీ గురించి మీరు ఏమి అనుకుంటున్నారు అనే  మీ స్వయం నిర్వచనం, ఇది మీ శక్తి యుక్తుల్ని మీ చర్యల్ని ప్రభావితం చేస్తుంది.  నిర్ణయిస్తుంది. మీ జీవన నాణ్యతని నిర్ణయిస్తుంది. మీరు ఏ స్థాయిలో వ్యాపారం/ ఉద్యోగం చేయాలనుకుంటున్నారు? ఏ విధానాలు , ఎంత పెద్ద కారణం కోసం చేయాలనుకుంటున్నారు? ఏ కంపెనీ కార్ కొనాలనుకుంటున్నారు? ఎటువంటి ఇల్లు/ విల్లా  సొంతం చేసుకోవాలనుకుంటున్నారు?  ఎంత సంపద /డబ్బు సంపాదించాలనుకుంటున్నారు? మీ పిల్లలని ఎంత పెద్ద స్కూల్ లో చదివించాలనుకుంటున్నారు? మీ ఫ్యామిలీ తో ఏ ప్రదేశాలకు వెళ్లాలనుకుంటున్నారు? ఏ దేశాలు, ప్రదేశాలు చూడాలనుకుంటున్నారు? ఇవన్నీ మిమ్మల్ని మీరు ఏమని వర్ణిస్తారు, మీకు మీరు ఏమని నిర్వచిన్చుకుంటారో దానిపైనే ఆధార పడి ఉంది. ఏమి చేస్తునారు అంటే “ఎదో నెల కి ఒక ప్లాట్ అమ్ముతున్నాను “ అన్న దానికి “పెట్టుబడికి ఖచ్చితంగా రాబడి ఇచ్చే నమ్మక మైన వెంచర్ లో ప్రజలకి కావలసిన ప్లాట్ లు అందిస్తున్నాను”  అన్నదానికి చాలా తేడా ఉంటుంది. మన పరిచయ వాక్యానికే ఇంత గొప్ప అర్థాన్ని ఇవ్వగాలిగినపుడు జీవితానికి ఎంత గొప్ప అర్థాన్ని ఇచ్చుకోవచ్చు. అందుకే మిమ్మల్ని మీరు విజేతలుగా నిర్వచించుకోండి.

ఈ మూడు సోపానాల సక్సెస్ ఫార్ములా  60 రోజులు పాటిస్తే విజేతలుగా మానసికంగా సంసిద్దులౌతారు. వీటిలో పవర్ చదివినప్పుడు  కంటే పాటించే సమయంలో మీకు స్పష్టంగా తెలుస్తుంది. మీ విజయాలు మాతో పంచుకోండి.

*****************   సైకాలజీ టుడే , నవంబర్ 2015 లో ప్రచురించిన  నా ఆర్టికల్ *******************