Hi
you might have got many ideas and some may be a greatest business ideas. Some times you might have wonder that your ideas are actually manifested into profitable businesses by some other person or company. What are the fundamental steps in creating profitable business from your idea? Let us discuss about those important eight steps now. Stay tuned.
Step 1: Write your idea and learn about it:
Just do this exercise. What did you do with your previous idea when you thought "oh it is one of the idea..." . Check whether you have avoided taking action on that idea due to your own self-limiting beliefs. If you have any such beliefs that no longer serve you question the base of the beliefs and have only empowering beliefs. Try to note down your idea, share it with friends or family members, read some thing about it, vision what it looks like if your idea is manifested in reality

Step 3: Identify your customers: Who are the people having the problems or needs that you mentioned in the previous step? Where are they? Who are your prospective customers? If you develop a product that can be beneficial to every one on the earth, that does not mean every one on the earth will use only your product. You need to identify, enlist and prioritize your prospective customers and target those whom you can immediately reach and develop distribution channels or mechanisms reach those in need.
Step 4: Develop your team. Share your idea. Don't think your idea is some thing out of the world that has flashed only in your mind and you want to change the world forever. Share with others and let other minds also work on it, let them provide you their feedback or opinions. Develop a team of people or partner with some one who resonates with your idea. Have networks with those who can complement your strengths. It helps in developing customer loyalty and presenting your strengths at investors or stake holders.

Step 6: Create your capital. TO work on your idea you may need resources including money. Please do estimate manpower and money needed to take off your business idea. Check the possibilities of bringing your start up money. It could be your savings, your family members' support, friends, loans, startup supporters such as investors, funders, profit sharing partners etc., Try to share your idea to funders and show them the value you create through product / service for those who are in a problem.
Step 7: Develop Minimum Viable Product. To help people know what you are doing and how best you are serving to address their needs, let people experience your work. Develop a minimum viable product which can address most pressing areas of the need of many things that you can do. People can not forget the best product that address their important needs and makes their life more easier. If you can create that, people will remember you whenever that need emerges to them.

మీ ఐడియాతో ద్వారా మిమ్మల్ని ఐశ్వర్యవంతులను చేసే 8 సోపానాలు:
ఈ ప్రపంచంలో వ్యాపారాలు, సేవలు
అన్ని ఒక ఐడియా నుంచి వచ్చినవే. ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేయవచ్చు. అందుకు
ఐడియా రావడం మాత్రమే కాదు దానితో ఒక నిర్మాణాత్మక స్నేహం చేయాలి. నాకో సూపర్ ఐడియా
వచ్చింది, కానీ దానిని కార్యరూపం ఇవ్వడానికి ఏమి చేయాలి ఎలా చేయాలి ఎలా మొదలుపెట్టాలి
తెలియడం లేదు అనుకునే వారు అనేకం. కానీ పెద్ద పెద్ద సంస్థలు, వ్యాపారాలు నుంచి
చిన్న చిన్న స్టార్ట్ అప్ ల వరకు ఐడియాలను
భిన్నమైన సొంత పద్దతిలో ఆచరణలోకి
తెస్తున్నారు. అయితే వాటిని నిశితంగా పరిశీలిస్తే మీ ఐడియా ను లాభదాయాక బిజినెస్
లా మార్చుకునే మార్గంలో ఉన్న కొన్ని ప్రాధమికాంశాలను నేర్చుకోవచ్చు. ఎలా ఉంది
ఐడియా? నచ్చిందా...? అయితే రండి నేర్చుకుందాం.
* * * *
* * * * * * * * * * * * * *
సోపానం 1:
మీ ఐడియా తో ఏమి చేసారు? ఏమి చేస్తారు? గతంలో మీకు ఎన్ని సార్లు ఐడియాలు
వచ్చాయి? సరదాగా మీరు ఈ చిన్న ఎక్సర్
సైజ్ చేయండి. ఒక పెన్ , పేపర్ తీసుకుని ఇప్పటివరకు మీకు గతం లో వచ్చిన మంచి ఐడియా
అనుకున్న వాటిని ఎందుకు వ్యాపారంగా మార్చుకోలేదు కారణాలు రాయండి. ముందు ఈ లిస్టు
రాసిన తర్వాత మళ్ళీ ఆర్టికల్ చదవండి. ఎందుకంటే ఐడియా నుంచి యాక్షన్
దిగాలనుకుంటున్నారు కదా? అందుకే యాక్టివిటీ చేయండి.
(10 మినిట్స్ బ్రేక్.......)
మీ
లిస్టు రాసిన తర్వాత చదవండి.
ఇప్పుడు మీ లిస్టు చెక్
చేసుకోండి. ఈ క్రింది కారణాలు వంటివి రాసి ఉండొచ్చు.
- ఎక్కడ స్టార్ట్ చేయాలో
తెలియదు
- నాకు అప్పట్లో సరైన సమయం
లేదు
- కావలసిన్నత డబ్బు లేదు
- ఎవరు సపోర్ట్ చేయలేదు
- నాకు అంత వయస్సు,
మెచ్యురిటీ , నాలెడ్జ్ లేదు
- ఫెయిల్ అవుతానేమో అని
భయపడ్డాను
- నాకు బిజినెస్ ప్లాన్
రాయటం రాదు
- నాకు లోన్స్ ఇవ్వలేదు
- నా ఐడియా కి సపోర్ట్ ఇచ్చే
ఫ్యామిలీ మెంబెర్స్, పార్టనర్స్, గైడెన్స్ లేదు
- నా వయస్సు చాలా ఎక్కువ
- నాకు ఇల్లంటివి వర్క్ ఔట్
అవ్వవు
- నాకు డబ్బు సంపాదించే యోగం
లేదు
- నేను సరైన టైం కోసం వెయిట్
చేసాను, అవ్వలేదు
- నాకు అంత తెలివి తేటలు ,
స్కిల్ల్స్ (నైపుణ్యాలు) లేవు
- ఈ ఫీల్డ్ లో ఆల్రెడీ ఉన్న
వారితో నేను పోటీ పడలేను
ఇలాంటి రెస్పాన్సెస్ మీరు కేవలం
మీ ముందు కాళ్ళకు బంధాలు వేసే సొంత నమ్మకాలు (సెల్ఫ్ – లిమిటింగ్ బిలీఫ్స్).
వాటిలో మీకు బాగా తలపుకు వస్తున్న
రెండింటిని తీసుకుని ఈ ప్రశ్నలు వేసుకోండి: “ఈ నమ్మకం నాకు ఎలా ఉపయోగపడుతుంది?,
“ ఈ నమ్మకానిని కారణం ఏమిటి?” . ఆ విధంగా మీకు ఉపయోగపడనని నమ్మకాలను
ప్రశ్నించి వాటి విలువను తెలుసుకుని వాటి స్థానంలో ఉన్నత నమ్మకాలను ఏర్పరచుకోవటం ఐడియాని వ్యాపారంగా మార్చడంలో
మొదటి మెట్టు. “ ఉన్నత నమ్మకం ఉన్నత వ్యాపారానికి మార్గం”.
ఇప్పుడు మీ ఐడియా ఏమిటి? దానిని మీరు రాసుకున్నారా? అవును మీ
ఐడియా కేవలం బుర్రలో ఉంచుకుంటే దాని మీద మీరు పనిచేయొచ్చు చేయకపోవచ్చు. మీ డైరీ/
జర్నల్ లో రాయండి, ఆ అంశం పై చర్చించి వివరాలు తెలుసుకోగల వారితో దాని గురించి
చర్చించండి, గూగుల్ (కొందరికి గూగుల్ దేవత... J) ఎలాగూ ఉంది ఇంటర్నెట్ లో గూగుల్ లో దానిగురించి చదవండి.
సోపానం
2: మీ ఐడియా ఏ సమస్యను తీరుస్తుంది? : మీ ఐడియా ప్రజల
(ఫ్యూచర్ కస్టమర్స్) అవసరాలను, సమస్యలను ఉన్నతంగా తీర్చగలిగే ఐడియానా? ప్రపంచంలో
ఏ బిజినెస్ అయినా నిశితంగా పరిశీలిస్తే వాటి పనులన్నీ కొన్ని సమస్యలను తీర్చడంలో,
కొన్ని సేవలను ఇవ్వడంలోనో ఉంటాయి. ప్రజల అవసరాలను తీరుస్తూ , తక్కువ రిస్క్ తో
ఎక్కువ వేగంగా మీరు ఆ పనిని అందరికంటే బాగా చేయగలిగారంటే గొప్ప వ్యాపారానికి నాంది
పలికినట్లే అంటారు ఎంట్రప్రెన్యూర్ శిక్షణా నిపుణులు.
సోపానం 3:
ఆ సమస్య / అవసరాలు ఉన్న వారు ఎవరు? ఎలా
వారిని చేరుకోవాలి? మీకు కస్టమర్స్ ఎవరు? ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు. వారికి
అనేక అలవాట్లు, అవసరాలు ఉన్నాయి. మీరు వారి అవసరాలను ఎలా తీరుస్తున్నారు? అందరు
వాడే వస్తువు తయారు చేసాము అందరూ మా కస్టమర్సే అనుకోవద్దు. అలా అయితే అది ఒక్క
రూపాయే రేటు ఉన్నా అందరు కొంటె మీకు 120 కోట్లు బిజినెస్ వస్తుంది. అందుకే ఏ వ్యక్తులు, సంస్థలకు మీ
ప్రోడక్ట్/సర్వీస్ బాగా అవసరం వారిని మీరు ఏ విధంగా చేరుకుంటారు? అందుకు ఏమి
ప్రయత్నాలు చేస్తారు? మీకు ఒక సూపర్ ఐడియా
ఉన్నా అది ప్రజల అవసరాలను తీర్చేలా ఉండాలి, వారికి అందుకోగలిగే విషయం గా
ఉండాలి.
సోపానం 4:
మీ పార్టనర్ / టీం తయారు చేసుకోండి : మీ ఐడియా ని షేర్
చేసుకున్నప్పటి నుంచి మీకు మంచి చెడు సపోర్ట్ ఇచ్చిన వారు, మీ బిజినెస్ అవసరాలలో
మీకు ఒక విష్యం పై పట్టు ఉంటె ఇంకో విషయం పై పట్టు ఉన్న వాళ్ళు, మీకు గైడెన్స్
ఇచ్చే వాళ్ళు, సక్సెస్ ఫెయిల్యూర్ లకు అతీతంగా మీతో నడిచే ఒక టీం లేదా పార్టనర్ షిప్
అభివృద్ధి చేసుకోండి. బిజినెస్ కి ఇతరులతో కలిసే చేయగలిగే లక్షణం, మంచి నెట్
వర్కింగ్ స్కిల్ల్స్ అవసరం. దానివలన
వేర్వేరు అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించగలరు, ఆ అంశాలపై నాలెడ్జ్,
స్కిల్ల్స్ పెంచుకోవచ్చు, ఒక టీం గా వెళ్ళినప్పుడు మీ బిజినెస్ సపోర్ట్ సిస్టం
చుఇంచడం ద్వారా క్లైంట్ లను, ఫండింగ్ ఇచ్చే వారిని నమ్మకానని , మీ శక్తిని
వివరించవచ్చు.
సోపానం 5:
మీ ఐడియా డబ్బు ఎలా సంపాదిస్తుంది?: మంచి ఐడియా ఉంది, దాని
వలన ఎలాంటి సమస్యలు తీర్చాలనుకుంటున్నారో ఆలోచించారు, ఆ వ్యక్తులు లేదా సంస్థలు ఎవరు,
వారిని ఎలా చేరుకోవాలో తెలుసుకున్నారు. మరి ఐడియా డబ్బు సృష్టించ గలిగినదేనా?
ఫైనాన్షియల్ లాభాలు లేనప్పుడు మీకు నచ్చిన ఒక వ్యాపకం మీద సమయం, శక్తి, డబ్బు
పెట్టిన వారౌతారు. అందుకే ఈ రెవిన్యూ మోడల్ చాలా ముఖ్యం. అందుకే మీ ప్రోడక్ట్ లేదా సర్వీస్ ఎలా స్టార్ట్
అయ్యింది? ఎలా తయారు చేస్తారు, ఎవరిని ఎలా మీట్ అవుతారు? ఎలా మార్కెట్ చేస్తారు?
ఎలా కస్టమర్స్ ని కలుస్తారు? వారికి ఎన్ని రకాలుగా/ఒప్షన్స్ లో అందిస్తారు? ఏ రక
మైన పేమెంట్ పద్దతులు ఇస్తారు ? ఇవాన్నీ అవ్వడానికి మీకు ఖర్చు ఎంత అవుద్ది? మీకు
ఎవరెవరి సహాయం కావాలి? అందుకు ఫుల్ టైం లేదా పర్ట్ టైం ఎంత మంది వర్క్ చేస్తారు?
ఇలా అన్ని ఖర్చులు, ఎంత ఆదాయం వస్తుంది? ఆదాయం
నుంచి ఖర్చులు తీయగా మీకు మిగిలేది ఎంత? సాదారణంగా ఆ బిజినెస్ లో ఎంత
వస్తుందని గతంలో బిజినెస్ రిపోర్ట్ లు ఏమైనా చెప్తున్నాయా? తెలుసుకోండి. ఈ
లెక్కలలో ఎక్కువమంది కొత్త వ్యాపారులు నంబర్లు ఎక్కువ వేసుకుని చాలా వస్తుందని
అనుకుంటారు. ప్రాక్టికల్ గా అలా సాధ్యం కాకపోవచ్చు అప్పుడు రియాలిటీ నంబర్స్
అనుభవం ద్వారా ప్రాజెక్ట్ చేస్కుంటారు. ఫైనాన్షియల్ గా బాగుందనుకున్నాక మీరు ఇక మీ
ఐడియా ని బయటికి తీసుకెళ్ళి వర్క్ చేయచ్చు. కొందరు టెస్టింగ్ కూడా చేసి వచ్చిన
రెస్పాన్స్ ని బట్టి బిజినెస్ మోడల్ మార్చుకుంటారు. ఇది మీ వద్ద ఉన్న కాపిటల్ మనీ
మీద , ఇతర వనరుల మీద ఆధారపడి ఉంటుంది.
సోపానం 6:
కాపిటల్ సమకూర్చుకోవాలి: ప్రజల అవసరాలను తీర్చాలనే సదుద్దేశంతో మొదలెట్టినా, డబ్బు
కోసమే మొదలెట్టకపోయినా వ్యాపారాలు నిలబడాలంటే డబ్బు కొంత అయినా అవసరం. అభివృద్ధి
చేసే ప్రక్రియలో కాపిటల్ (మనీ, హ్యూమన్ కాపిటల్) చాల ముఖ్యం. కాపిటల్ రావాలంటే
కొన్ని దారులు ఏంటంటే ఇప్పటివరకు మిగిలిన డబ్బు, మీరు సేవింగ్స్ కోసం దాచుకున్న డబ్బులు, పర్సనల్ లోన్స్, వ్యాపార
నిమిత్తం ఇచ్చే లోన్ లు, కుటుంబ సభ్యులు/ స్నేహితులు/ బంధువులు , క్రెడిట్ కార్డు
లు, బంగారం లేదా స్థలం/ ఇల్లు ద్వారా మొర్త్గాగే లోన్ . అయితే వీటిని
ఉపయోగించుకునే ముందు మీరు ఉన్న స్థితి, మీ భవిష్యత్తు అవసరాలు, మీ ప్రస్తుత కుటుంబ
అవసరాలు, మీ కనీస అవసరాలు దృష్టిలో ఉంచుకోవాలి. మీ అవసరాన్ని బట్టి వెంచర్
కాపిటలిస్ట్ లు, స్టార్ట్ అప్ ఫండింగ్ ఇచ్చే సంస్థలు, ఇన్వెస్టర్స్ ని కలవడం మీ
వ్యాపారం గురించి వివరాలు చెప్పి మెప్పించి అబివృద్దికి ఫండ్ అడగటం మంచిది.
సోపానం 7:
మార్కెట్ పద్ధతి, కస్టమర్ పల్స్ తెలుసుకోండి: మీరు చేసే ప్రోడక్ట్
లేదా సేవలను ప్రజలకు రుచి చూపించేందుకు, మీరు ఎంత బాగా వారి సమస్యలను తీర్చగాలరో
అర్థం చేసుకోడానికి. తక్కువ మార్పులతో
ప్రజల అవసరాలను బాగా తీరుస్తుందని మీరు నమ్మిన ఒక ప్రోడక్ట్ / సర్వీస్ తో మొదలు
పెట్టండి. మార్కెట్ ఫీద్బచ్క్ తీసుకోండి. కస్టమర్ ఫీద్బచ్క్ తీసుకోండి, దానిని
ఔట్లెట్ ద్వారా పంపుతుంటే లేదా డోర్ డెలివరీ చేస్తే ఈ ప్రక్రియలో ఉన్న ప్రతి
వ్యక్తి నుంచి ఫీద్బచ్క్ తీసుకోండి. ఒక ఉన్నత ప్రోడక్ట్ , ఉన్నత మైన
ఎక్స్పీరియన్స్ ప్రజలు మర్చిపోలేరు. ఈ
రెండు ఇవ్వగలిగితే ఆ అవసరం వచ్చినప్పుడల్లా ఆ ప్రోడక్ట్ / సర్వీస్ గుర్తొస్తుంది. ఇప్పుడు
మీరు తీసుకున్న వేర్వేరు స్తాయిల ఫీడ్
బ్యాక్ దృష్టిలో ఉంచుకుని, అవసరాన్ని తగినట్లు మీ
ప్రోడక్ట్ లేదా డెలివరీ పద్ధతులు మార్పులు చేసుకోండి. ఆ విధంగా మీ
ప్రోడక్ట్ సర్వీసెస్ ప్రజలకు చేర్చడం ద్వారా వచ్చే డబ్బు లెక్కలు ప్రతి నెలా
రివ్యూ చేసుకోండి. లాభాలు ముఖ్యం. వ్యాపారమంటే
“లెక్క లేనితనం” పనికి రాదు. అందుకే ప్రతి పైసా ఖర్చు స్పష్టంగా
ఎప్పటికప్పుడు రాయండి.
సోపానం 8: పాజిటివ్ ఎనర్జీ తో ఉండండి: రిస్క్ తక్కువ ఉండే
వ్యాపారం , మాంచి (మంచి కాదు) వ్యాపారం చెప్పండి సర్ అని కోచింగ్ లో ,
ట్రైనింగ్ లలో అడుగుతుంటారు. అలా రిస్క్ లేని వ్యాపారం అంటూ ఉండదు. మీకు ఏదైనా అలా
ఒక వ్యాపారం రిస్క్ లేని దానిపిస్తే చేసి చుడండి కొన్నాళ్ళు (కనీసం పరిశీలన J ) మీకే తెలుస్తుంది. నిజానికి సొంత వ్యాపారం, స్టార్ట్ అప్ అంటేనే రిస్క్
తీసుకోడానికి రెడీ గా ఉన్నవాళ్ళకు సరిపోయే కెరీర్. అందుకే రిస్క్ ని ఎంజాయ్ చేయటం,
నిబద్దత, ఫోకస్, మిమ్మల్ని మీరు ఉత్సాహంగా నడిపించుకోగలగటం వంటి పాజిటివ్ ఎనర్జీ సొంత వ్యాపారానికి కనీస అర్హతలు.
ఈ ఎనిమిది సూత్రాలు పాటించండి
మీ గొప్ప ఆలోచనలు అత్యంత గొప్ప వ్యాపారాలుగా మార్చుకోడానికి మొదటి మెట్టు ఎక్కండి.
మీ విజయాలు మాతో పంచుకోండి..