Saturday, 5 April 2014

ఎక్స్‌లెన్స్ సాధించండి

ఆశించిన ఫలితాలు సాధిస్తూ జీవితాన్ని అద్భుతంగా మలుచుకోండి. 

ఈ సృష్టిలో జన్మించిన ప్రతి వ్యక్తిలోను అద్భుతమైన శక్తి ఉంది. నిద్రాణమైన ఈ శక్తిని గుర్తించి మనిషి జీవిత కార్యంపై కేంద్రీకరిస్తే జీవితాన్ని అర్థవంతంగా, అమూల్యంగా,అద్వితీయంగా తీర్చిదిద్దుకోవచ్చు. వ్యక్తిలోని ఆ శక్తి వ్యక్తిగత ఉన్నతికి, సమాజ శ్రేష్టతకు పునాది. మీలో ఉన్న ఆ అద్భుతశక్తిని జీవిత ప్రాధాన్యాలపై కేంద్రీకరించి ఆశించిన ఫలితాలు సాధించటానికి ఈ పుస్తకం సహాయపడుతుంది. ఈ పుస్తకం రెండు భాగాలుగా వ్రాయబడింది. ప్రధాన పుస్తకంలో ఎక్స్‌లెన్స్ సాధించడానికి కావలసిన అంశాలు, ప్రాథమిక పరిజ్ఞానం, ఆలోచనారీతులు, నియమాలు, టెక్నిక్స్ అందించాము. ఈ ప్రధాన పుస్తకానికి అనుసంధానంగా ఉచితంగా "ఎక్స్‌లెన్స్ సాధించండి - శిక్షణా దీపిక" ఇవ్వబడింది. ప్రధాన పుస్తకంలో వివరించిన అంశాలను మీ జీవితానికి అన్వయించుకోవాలంటే కావలసిన మెళకువలు, సహాయం అందిస్తుంది ఈ శిక్షణాదీపిక. వ్యక్తిత్వ వికాసాన్ని జీవితానికి ఎలా అన్వయించుకోవాలో నేర్పే తొలి తెలుగు శిక్షణాదీపిక.

ఈ పుస్తకం ఉపయోగాలు:
* మీ గురించి మీరు అర్ధంచేసుకోడానికి
* మీరు కోరుకున్న నిజమైన ఫలితాలు తెలుసుకోడానికి
* మీ అ౦తర్గత నమ్మకాలు మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో గుర్తించడానికి
* మీ మానసిక స్థితులను మీరు అర్థంచేసుకోడానికి
* మీపై మీరు ప్రేమను పెంచుకోడానికీ, ఉన్నత స్వీయ భావన ఏర్పరుచుకోడానికి
* మీ లక్ష్యాలను శాస్త్రీయంగా నిర్దేశించుకోడానికి
* లక్ష్యాలదిశలో ప్రయాణాన్ని, ప్రతి క్షణాన్ని ఆనందించడానికి
* తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పాదకత సాధించడానికి
* శ్రేష్ఠత (ఎక్స్‌లెన్స్) సాధించే క్రమంలో జీవన నైపుణ్యాలు, ఉన్నత ఆలోచనలు, అర్థవంతమైన అలవాట్లు నిర్మించుకోడానికి
శ్రేష్టత (ఎక్స్‌లెన్స్) మీ జన్మహక్కు, దానిని సాధించడానికి ఈ పుస్తకం ఒక స్నేహితునిలా సహాయపడుతుంది. ఈ పుస్తకం ఆన్ లైన్ లో కొనాలంటే ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి:  http://kinige.com/book/Excellence+Saadhinchandi